
వీరభద్రస్వామి ఆలయ పూజారిపై విలేకరి దాడి
తనపై దాడి చేశారంటూ పూజారులపై పోలీసులకు ఫిర్యాదు
చుండూరు(వేమూరు): వీరభద్రస్వామి ఆలయం పూజారిపై పత్రిక విలేకరి దాడి చేశాడు. పూజారి మామిళ్లపల్లి యశ్వంత్ తెలిపిన వివరాలు.. చుండూరు మండలం మోదుకూరు గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో గోవులకు షేడ్ ఏర్పాటు చేశారు. గోవులకు షేడ్ చాలకపోవడంతో గోవులు ఇబ్బందులు పడుతుండడంతో పూజారులు అదనంగా షేడ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి పూజారికి ఫోన్ చేసి ఎండోమెంట్ అనుమతి పొంది గోవుల షేడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎండోమెంట్ అధికారుల అనుమతి లేక పోతే షేడ్ నిర్మాణం నిలిపివేయాలన్నారు. శుక్రవారం ఆంధ్రజ్యోతి విలేకరి వీరభద్ర స్వామి ఆలయం వద్దకు వచ్చి ఎండోమెంట్ అధికారి అనుమతి ప్రకారం షేడ్ ఏర్పాటు చేస్తున్నార లేదా అని అడిగాడు. షేడ్ నిర్మాణం కోసం ఎండోమెంట్ అధికారి అనుమతి లేదన్నారు. దీంతో విలేకరి షేడ్ నిర్మాణం ఫొటోలు తీశారు. దేవాలయంలో కూడా ఫొటోలు తీశారు. ఈ విషయాన్ని పూజారులు ఎండోమెంట్ పరిపాలన అధికారి రఘురామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆగ్రహించిన విలేకరి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న పూజారులు మామిళ్లపల్లి యశ్వంత్, నిరంజన్‌లపై దాడి చేశాడు. పూజారులు తనపై దాడి చేశారంటూ విలేకరి చుండూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మాపై దాడి చేసి, మాపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం అన్యాయమని పూజారులు పేర్కొన్నారు. పూజారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం పూజారులకు రక్షణ కల్పించాలన్నారు.

వీరభద్రస్వామి ఆలయ పూజారిపై విలేకరి దాడి