కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక | Singer Lipsika Reacts On Keeravani Padutha Theeyaga Issue | Sakshi
Sakshi News home page

Singer Lipsika: సింగర్ ప్రవస్తికి మరో సింగర్ లిప్సిక కౌంటర్

Published Tue, Apr 22 2025 4:53 PM | Last Updated on Tue, Apr 22 2025 6:04 PM

Singer Lipsika Reacts On Keeravani Padutha Theeyaga Issue

'పాడుతా తీయగా' పాటల ప్రోగ్రామ్ పై వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ షో నుంచి తాజాగా ఎలిమినేట్ ‍అయిన ప్రవస్తి ఆరాధ్య అనే గాయని.. జడ్జిలైన కీరవాణి, సునీత, చంద్రబోస్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనని కావాలని ఇబ్బంది పెట్టారని, టార్గెట్ చేసి మరీ ఎలిమినేట్ చేశారని చెప్పుకొచ్చింది. తనపై బాడీ షేమింగ్ కూడా జరిగిందని చెప్పి షాకిచ్చింది. ఇప్పుడు ఈమె ఆరోపణలపై మరో సింగర్ లిప్సిక కౌంటర్ ఇచ్చింది. ఇన్ స్టాలో పెద్ద వీడియో రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్)

లిప్సిక ఏం చెప్పిందంటే?
'ప్రవస్తి.. పాడుతా తీయగా షోలో తనకు ఏం జరిగిందనే విషయాన్ని చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఎంతమందికి మెచ్యూరిటీ ఉంది. ఆ వీడియోని అర్థం చేసుకోవడానికి. ఏ స్టోరీకైనా రెండు సైడ్స్ ఉంటాయి. అటువైపు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎలా జడ్జ్ చేయగలుగుతాం. తను(ప్రవస్తి) తన భాధని వ్యక్తం చేస్తే.. యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు.. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్?'

'‍అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఎవరికైనా సరే అనుభవం ఉండాలి. వచ్చిన కొత్తలోనే ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఎవరున్నారో నాకు తెలీదు. కానీ ఇప్పుడు జడ్జిలుగా ఉన్నవాళ్లు ఒకప్పుడు ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోగలగాలి. అందరూ కష్టపడి పైకి వచ్చినవాళ్లే. ప్రవస్తి ఎవరి పేర్లు అయితే చెప్పిందో వాళ్లు కూడా కష్టపడి పైకొచ్చినవాళ్లే. అలాంటిది వాళ్ల పేర్లు చెప్పడం సరికాదు'

(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

'కీరవాణి మెప్పు పొందేందుకు నేను 5-6 సంవత్సరాలు కష్టపడ్డా. ఆ తర్వాతే నాకు ఆయన దగ్గర అవకాశం దక్కింది. కీరవాణి దగ్గర చాకిరీ చేయడం సింగర్స్ అందరికీ ఇష్టమే. చాకిరీ అంటే నోట్స్ రాయడం, ప్రాక్టీస్ చేయడం లాంటివి ఉంటాయి' అని లిప్సిక తన వీడియోలు చెప్పుకొచ్చింది.

ఈమెతో పాటు మరో లేడీ సింగర్ హారిక నారాయణ్ కూడా ఈ వివాదంపై ఓ వీడియో రిలీజ్ చేసింది. తన అనుమతి లేకుండా ఈ కాంట్రవర్సీలో ఓ న్యూస్ ఛానెల్ లో వీడియో ఒకటి ఉపయోగించారని, అది సరికాదని చెప్పుకొచ్చింది. మరోవైపు ఇదే వివాదంపై సింగర్ సునీత కూడా ఓ వీడియో రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement