Pravasthi Aradhya
-
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
గాయని ప్రవస్తి (Pravasthi) రీసెంట్గా ఒక వీడియోతో సింగర్ సునీతకు పలు ప్రశ్నలు సందించారు. వాటికి సమాధానం చెప్పాలని ఆమె కోరారు. మూడురోజులుగా ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం చుట్టూ పలు విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రోగ్రాంలో ఉన్న జడ్జెస్ వారికి నచ్చినోళ్లను మాత్రమే ఎంకరేజ్ చేస్తారని ప్రవస్తి కామెంట్ చేశారు. వారికి నచ్చన కంటెస్టెంట్స్ పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పుకొచ్చారు. తనను బాడీషేమింగ్ కూడా చేశారని ఆమె అన్నారు. అయితే, ఇందులో ఎలాంటి నిజం లేదని సింగర్ సునీత ఒక వీడియోను విడుదల చేశారు. ఆపై వెంటనే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. అయితే, ప్రవస్తి గురించి కాదు. మనిషి జీవితానికి అవసరమైన మోటివేషన్ ఇచ్చే లిరిక్స్‌తో ఆ పాట ఉంది. గోపీచంద్ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలోని సాంగ్‌ను ఆమె పంచుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఆ పాటకు కీరవాణి సంగీతం అందించడమే కాకుండా ఆలపించారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్ అందులో ఉన్నాయి. సింగర్ ప్రవస్తి గురించే సునీత ఈ పాటను పోస్ట్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి.‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) ప్రోగ్రాం వల్ల తెలుగు చిత్రపరిశ్రమకు చాలామంది సింగర్స్ పరిచయం అయ్యారు. ఒకరకంగా ఈ వేదికపై పాటలు పాడిన చాలామంది నేడు రాణిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఈ వేదిక మీద తమ గాత్రాన్ని వినిపించాలని పోటీ పడిన సింగర్స్ ఎందరో ఉన్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం ‘పాడుతా తీయగా’ జడ్జెస్‌గా ఉన్న సునీత, కీరవాణి, చంద్రబోస్లపై గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో సంచలనంగా మారింది. జడ్జిమెంట్ విషయంలో వివక్ష చూపుతున్నారని ప్రవస్తి తెలిపింది. కొందరి కంటెస్టెంట్స్ పట్ల జడ్జెస్ చాలా బాగుంటారని, వారు తప్పుగా పాడినా ఫైనల్ వరకు తీసుకొచ్చారని కొన్ని ఆధారాలతో ప్రవస్తి బయటపెట్టింది. అయితే, సింగర్ సునీత, నిర్మాత ప్రవీణ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇలా పలుమార్లు వివరణలు ఇవ్వడం ఎందుకని సునీత అనుకున్నట్లు ఉన్నారు. అందుకే ఒక సినిమా పాటతో ఆమె ఫుల్స్టాప్ పెట్టినట్లు ఉన్నారు. జీవితం అంటే ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా తెలుసుకోవాలని సునీత చెప్పినట్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
ఐదేళ్ల వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టింది ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aradhya). సరిగమప లిటిల్ ఛాంప్స్ రియాలిటీ షోలో విజేతగానూ నిలిచింది. చిన్నతనంలోనే పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొంది. తెలుగు, తమిళ భాషల్లో పలు రియాలిటీ షోలలో పాల్గొంది. ఇటీవల మరోసారి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఈ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. తనపై జడ్జిలు సునీత, కీరవాణి, చంద్రబోస్ వివక్ష చూపించారని ఆరోపించింది. సింగింగ్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌తననొక చీడపురుగులా చూస్తూ ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. షో నిర్మాతలు కూడా కొన్నిసార్లు సరైన డ్రెస్సులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవారంది. షోలో జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన తనకు ఇక భవిష్యత్తు ఉండదని అర్థమై గాయనిగా కెరీర్‌కు ఫుల్స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాటలంటే ప్రాణమున్న నువ్వు సంగీతాన్ని విడిచిపెట్టొద్దని.. సింగర్‌గా కొనసాగాలని గాయని మాళవిక (Singer Malavika) అభ్యర్థించింది. కష్టమంతా బూడిదపాలుఅందుకు ప్రవస్తి స్పందిస్తూ.. నాపై విషం కక్కుతూ ఉంటే ఇంకా ఈ ఫీల్డ్‌లో ఎలా కొనసాగగలను? మీరందరూ నేను పాడాలని కోరుకుంటున్నారు. కానీ నా కష్టం, ప్రతిభ అంతా బూడిదలో కలిసిపోతుంటే ఎలా తట్టుకోగలను? వివక్ష చూపిస్తుంటే ఎలా భరించగలను? అని ప్రశ్నించింది. మరోవైపు ప్రవస్తిపై సింగర్ హారిణి ఇవటూరి (Harini Ivaturi) ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ డ్రామాలు చాలు.. ప్రశంసల కోసం పాకులాడినప్పుడు విమర్శలు స్వీకరించే ధైర్యం కూడా ఉండాలి. చదవండి: 'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీఇంకా ఎంతవరకు లాగుతావ్?పాడుతా తీయగా షోలో చాలా ఎపిసోడ్లు చూశాను. కొన్ని చోట్ల నిన్ను నువ్వు ఇంకా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నీ పొరపాట్లను సరిదిద్దుకోవడం మానేసి అనుభవజ్ఞులైన జడ్జిలను ప్రశ్నిస్తున్నావా? నీకేదైనా అన్యాయం జరిగిందంటే అది షోలోనే తేల్చుకోవాలి. షో అయిపోయాక ఇలా పబ్లిక్‌లో మాట్లాడటం సరికాదు. జడ్జిల క్యారెక్టర్లను తప్పుపట్టడం అన్యాయం. నువ్వు నిరాశలో ఉన్నావని... దాన్ని ఇలా లాగుతూనే ఉంటావా? నీకు నిజంగా దమ్ముంటే వారితోనే నేరుగా మాట్లాడతావ్.టాలెంట్‌తోనే ఆన్సర్..ఇంత రచ్చ చేసి ఏం సాధించాలనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. నీకంత బాధ ఉంటే నీ టాలెంట్‌తోనే సమాధానం చెప్పాలి. నా సొంత అనుభవమే చెప్తా.. ఒకసారి చివరి నిమిషంలో నేను పాడాల్సిన పాట మార్చేశారు. అయినా సరే దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని పాడా.. బెస్ట్ పర్ఫామెన్స్ గెలుచుకున్నా! ఛాలెంజ్‌లు లేకుంటే మన ఎదుగుదల ఆగిపోతుంది. రియాలిటీ షోలలో ఒత్తిడి భరించలేకపోతున్నావంటే అవి నీకు సెట్టవవు. నీకేదైనా డ్రెస్ నచ్చలేదంటే అప్పుడే ముక్కుసూటిగా చెప్పేయాలి. అప్పుడే పోరాడాల్సిందిఅంతేకానీ ఇప్పుడెందుకు చెప్పడం? నీ ఎలిమినేషన్ అప్పుడు మీ తల్లి.. జడ్జిలతో ఎంత గట్టిగా మాట్లాడిందో.. నీకు జరుగుతున్న బాడీ షేమింగ్ గురించి మేనేజ్మెంట్ దగ్గర అంతే గట్టిగా చెప్పాల్సింది. ఇప్పుడు ప్రదర్శిస్తున్న ధైర్యం అప్పుడేమైంది. పబ్లిక్‌గా వాళ్లను విమర్శించడం దేనికి? అని ఆగ్రహించింది. ఈ పోస్ట్‌పై ప్రవస్తి స్పందిస్తూ.. అక్కా, దయచేసి నా బాధను డ్రామా అని పిలవొద్దు. నేను పిరికిదాన్ని అని కూడా అన్నారు. నిజంగా పిరికిదాన్నయితే పవర్ఫుల్ వ్యక్తుల గురించి మాట్లాడను. నేరుగా మాట్లాడొచ్చుగా అని ఇంకో పాయింట్ అన్నారు.నాకు ఛాన్స్ ఇస్తేగా!వాళ్లు నాకు అవకాశం ఇస్తే కదా నేరుగా మాట్లాడేది. స్టేజీ మీద ఉన్నప్పుడు నేను అడిగే ప్రశ్నలకు వాళ్లు ఏ సమాధానం చెప్పలేదు. నిజంగా పిరికిదాన్నయితే మీరందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతారని తెలిసి కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు కదా! అని కౌంటర్ ఇచ్చింది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనకు జరిగిన ఓ మంచిని సైతం పొందుపరిచింది. ఇండస్ట్రీలో చెడు ఉన్నట్లే మంచి కూడా ఉందని పేర్కొంది. సంగీత దర్శకుడు తమన్ 'బ్రో' మూవీలో ఇతర సింగర్స్‌తో కలిసి వెనకాల కోరస్ పాడే అవకాశం ఇచ్చారని పేర్కొంది. View this post on Instagram A post shared by Harini Ivaturi (@hariniivaturi)చదవండి: ఆడవారికి ముద్దులు.. ఆయనది వంకరబుద్ధి.. నేనైతే -
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
'పాడుతా తీయగా'(Padutha Theeyaga) ప్రోగ్రాంకి క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ ప్రవస్తి ఆరాధ్య(Pravasthi Aradhya) అనే సింగర్ చేసిన ఆరోపణల కారణంగా మాయని మచ్చ ఏర్పడింది. జడ్జిలైన కీరవాణి, చంద్రబోస్, సునీత తనని అన్యాయంగా టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని ఈమె ఆరోపిస్తుంది. ఒకరిపై ఒకరు వీడియోలు చేసుకుంటూ వివరణలు ఇచ్చుకుంటారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి)ప్రవస్తి బ్యాక్ గ్రౌండ్పూర్తి పేరు ప్రవస్తి ఆరాధ్య. తెలుగమ్మాయే. ముద్దుగా రైనో అని కూడా పిలుస్తుంటారు. 2006 డిసెంబరు 9న పుట్టింది. అంటే ప్రస్తుతం ఈమె వయసు 19 ఏళ్లు. 2011లో ఐదేళ్లకే పాడటం మొదలుపెట్టింది. సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే పోటీలో పాల్గొని విజేతగానూ నిలిచింది.తెలుగుతో పాటు తమిళ సింగింగ్ రియాలిటీ షోల్లో పాల్గొని ప్రవస్తి గుర్తింపు తెచ్చుకుంది. 2014లో సూపర్ సింగర్ జూనియర్ 4 తమిళ షోలో పాల్గొని ఫైనల్స్ వరకు వచ్చింది. ఇక గతేడాది తెలుగులో సూపర్ సింగర్ పాటల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది.(ఇదీ చదవండి: కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక)ఇప్పుడే కాదు చిన్నతంలోనూ 'పాడుతా తీయగా' ప్రోగ్రాంలో పాల్గొంది. అప్పటి జడ్జిలైన ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రమణ్యం(SP Balu) నుంచి ప్రశంసలు అందుకుంది. వీళ్లిద్దరి ప్రోత్సాహం వల్లే సంగీత రంగంలో రాణించాలనుకుంది. కానీ తాజాగా పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ షో నుంచి ప్రారంభంలోనే ఎలిమినేట్ అయిపోయింది.తను బాగానే ఫెర్ఫార్మ్ చేసినప్పటికీ జడ్జిలు కీరవాణి, సునీత(Singer Sunitha), చంద్రబోస్ తనపై వివక్ష చూపించారని, టార్గెట్ చేశారని సంచలన వీడియో రిలీజ్ చేసింది. తన ఇకపై గాయనిగా కొనసాగాలనుకోవట్లేదని కూడా కుండబద్ధలు కొట్టేసింది. మరి నిజంగా ఈ మాటపై నిలబడుతుందా? అసలు ఈ గొడవకు పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక) -
ప్రవస్తి కాంట్రవర్సీపై స్పందించిన లిప్సిక ..!
-
ఎలిమినేట్ అయినందుకే ఆరోపణలు చేస్తున్నారా..?
-
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) గురించి గాయని ప్రవస్తి (Pravasthi) చేసిన ఆరోపణలపై ఇప్పటికే సింగర్ సునీత, నిర్మాత ప్రవీణ (Praveena Kadiyala) క్లారిటీ ఇచ్చారు. అయితే, తాజాగా వాటికి సమాధానంగా ప్రవస్తి మరో వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసింది. ఈ క్రమంలో సింగర్ సునీతకు పలు ప్రశ్నలు సిందిస్తూ.. వాటికి సమాధానం చెప్పాలని కోరింది.'సునీత గారు మీరు ఒక రీల్ పోస్ట్ చేస్తూ నా గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పండి. మీరు రీల్లో చాలా చక్కగా మాట్లాడారు. రియల్‌లో కూడా ఇలాగే మాట్లాడింటే ఇదంతా జరిగేది కాదు. పాటల ఎంపిక విషయంలో ఛానల్‌కు రైట్స్ ఉన్న వాటిని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఎప్పుడూ ఆ లైన్ దాటలేదు. ఛానల్‌కు ఉన్న రైట్స్ ప్రకారం నేనొక పాటను ఎంపిక చేసుకుని రిహార్సల్ పూర్తి చేసుకున్న తర్వాత నో చెప్పారు. కానీ, అదే ఎపిసోడ్లో అదే పాటను మరో అమ్మాయి పాడింది. దానిని మీరు ఎంకరేజ్ చేశారు. ఎందుకు..? మరోసారి 'కన్యాకుమారి' అనే పాట పాడక ముందే మీరు జడ్జిమెంట్ ఇచ్చేసి వెళ్లిపోయారు. ఇదెంత వరకు కరెక్ట్ చెప్పిండి..? స్టేజీపై పాట మధ్యలో లిరిక్స్ మరిచిపోయిన వారు ఎందుకు టాప్‌లో ఉన్నారు..? చేతి మీద రాసుకొచ్చిన వారిని మీరు ఎంకరేజ్ చేయలేదా..? లిరిక్స్ మరిచిపోయిన వారిని ఫైనల్ వరకు ఎలా తీసుకొచ్చారు..? మ్యాంగో వీడియోలో పాడే అవకాశం నాకు మీరు (సునీత) ఇవ్వలేదు మేడం.. మా గురువు గారు నిహాల్ కొండూరి ఆ ఛాన్స్ ఇచ్చారు. నేను పాడింది కూడా ఆయన కంపోజ్లోనే. సాంగ్ పూర్తి అయిన తర్వాత నన్ను, మా అమ్మను చాలా సేఫ్‌గా ఇంటికి చేర్పించానని చెప్పారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఆరోజు మా అమ్మ నాతో లేదు. నన్ను మీ అసిస్టెంట్ ప్రోగ్రామ్ కోసం తీసుకెళ్లేందుకు మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలోనే మళ్లీ ఇంటి వద్దకు చేర్చే బాధ్యత మీదే అని మీ అసిస్టెంట్‌తో మా అమ్మ చెప్పింది.కీరవాణి గారు కూడా స్టేజీపైనే కొన్ని మాటలు అన్నారు. అవి నన్ను బాధించాయి. పెళ్లి వేడుకలలో పాటలు పాడేవారు సింగర్స్ ఎంతమాత్రం కాదని ఆయన అన్నారు. అది చాలా హర్ట్ చేసే విషయం అని చెప్పాను. అందులో తప్పేముంది..? నాకిప్పుడు 19 ఏళ్లు. సంగీతమే నా ప్రాణం అని బతుకుతున్నాను. అందుకోసం నా చదువును కూడా వదులుకున్నాను. ఐదేళ్ల వయసు నుంచే నేను పాటల పోటీలలో ఉన్నాను. ఇన్నేళ్ల కెరీర్లో ఓటమి, విజయం నాకు కొత్త కాదు. నేను ఎలాంటి డిప్రెషన్లో లేను. నా వెనుక ఎవరూ లేరు. సొంతంగా పాటలు రెడీ చెసి విడుదల చేసేంత డబ్బులు మాకు లేవు. ఓటమి వచ్చినా తట్టకుని నిలబడే శక్తి నాకు ఉంది. కానీ, అన్యాయం జరిగింది కాబట్టే ప్రశ్నిస్తున్నాను. మీరంటే నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. మీరోక లెజండరీ సింగర్.. ఎప్పటికీ నా అభిమాన సింగర్ మీరే..' అంటూ సునీతకు పలు ప్రశ్నలు ప్రవస్తి సందించింది. అయితే, సంగీతమే తన ప్రపంచం అని నమ్ముకుని 14 ఏళ్ల పాటు పాటల ప్రపంచంలోనే బతికిన ప్రవస్తికి ఛాన్సులు వస్తాయా..? అనే ప్రశ్నలు నెజన్లలో వస్తున్నాయి. ఈ వివాదంలో ఎక్కువగా ప్రవస్తికే నెటిజన్లు మద్ధతుగా నిలుస్తున్నారు. -
ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత సంచలన వీడియో
-
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) గురించి గాయని ప్రవస్తి (Pravasthi) చేసిన ఆరోపణలపై జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ప్రవీణ (Praveena Kadiyala) క్లారిటీ ఇచ్చారు. రెండురోజుల క్రితం ప్రవస్తి ఒక వీడియో ద్వారా కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్‌ల గురించి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆపై తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆమె ఆరోపించారు. ప్రోగ్రాం నిర్వాహకులు కూడా తమకు చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్‌ఫోజింగ్ చేయాలి అన్నట్లుగా చెప్పేవారని ప్రవస్తి చెప్పుకొచ్చింది. అయితే, ఆ ప్రోగ్రాం నిర్మాత ప్రవీణ తాజాగా క్లారిటీ ఇచ్చారు.వారు ఎంచుకున్న పాటకు తగ్గట్టే కంటెస్టెంట్లకు తాను దుస్తులు డిజైన్ చేయిస్తానని జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ప్రవీణ క్లారిటీ ఇచ్చారు. తమ షోలో ఎక్కడా కూడా బాడీ షేమింగ్‌పై వ్యాఖ్యలు చేయమని చెప్పారు. ప్రవస్తి చెబుతున్నట్లుగా ఫేవరెట్ కంటెస్టెంట్లకు సులభమైన పాటలు ఇచ్చి.. ఆమెకు మాత్రమే కష్టమైన పాటలు ఇస్తామని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పారు. పాటల ఎంపిక కోసం ప్రతి షెడ్యూల్లో ఓ క్రియేటివిటీ టీమ్ నాలుగు రకాల పాటలను ఎంపిక చేస్తుంటుందని నిర్మాత ప్రవీణ అన్నారు. తమ ప్రోగ్రామ్ టెలీకాస్ట్ అయ్యే ఛానల్‌కు ఏ పాటల రైట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని మాత్రం చెబుతామని తెలిపారు. అలా ప్రతి కంటెస్టెంట్ ఆరు పాటలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వాటిపై రిహార్సల్స్ పూర్తి చేసుకుని, వారు రెడీ అని చెప్పాకే తాము షూటింగ్ ప్రారంభిస్తామని ఆమె అన్నారు.అలా అనడం తప్పే: సునీత‘మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు’ అని కాస్ట్యూమర్ అన్నారంటూ ప్రవస్తి చేసిన ఆరపణలకు సింగర్ సునీత ఇలా సమాధానం ఇచ్చారు. 'కంటెస్టెంట్స్ ఎంపిక చేసుకున్న పాటకు తగిన విధంగానే కాస్ట్యూమ్స్‌ని నేను డిజైన్ చేయిస్తుంటా. ఇక్కడ పాటది మాత్రమే ఛాయిస్ ఉంటుంది. ప్రవస్తితో ఆ కాస్ట్యూమర్ అలా ప్రవర్తించి ఉంటే అది ముమ్మాటికే తప్పే. కానీ, జరిగిన విషయం అదే సమయంలో నాతో గానీ, డైరెక్టర్‌తో గానీ చెప్పాల్సింది. డ్రెస్సు విషయంలో అలా వేసుకో, ఇలా వేసుకో అని నేనెప్పుడూ చెప్పలేదు.' అని అన్నారు.Gnapika entertainment producer praveena kadiyala about singer #Pravasthi issue.#ETV #paduthatheeyaga pic.twitter.com/OlhBtBiaNe— Vamsi Kaka (@vamsikaka) April 22, 2025 -
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
సింగర్ ప్రవస్తి చేసిన సంచలన ఆరోపణలపై ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత స్పందించారు. పాడుతా తీయగా సింగింగ్ షో సమయంలో తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించింది. సునీతతో పాటు కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌పై కూడా విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలోనే సింగర్ సునీత ఈ అంశంపై మాట్లాడారు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వ్యక్తిత్వం అనేది ఇలాంటి రూమర్స్‌పై నిర్మించబడలేదు..అంతేకాదు వాటి వల్ల మన ఖ్యాతి కూడా దెబ్బతినదు.. ఊహాగానాల కంటే నిజం గెలుస్తుందని మేము నమ్మకంగా ఉన్నామని పోస్ట్ చేసింది.సునీత మాట్లాడుతూ..'నమస్కారం. నిన్నంతా ఒకటే చర్చ.. అదే సింగర్ ప్రవస్తి.. రకరకాల ఛానెల్స్‌లో రకరకాలుగా వార్తలు ప్రచురించారు. ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. తాను మొత్తానికి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఛానెల్స్ వాడిన భాష.. తాను ఎక్స్పోజ్ చేయాలని చేసింది కాబట్టే ఆ పదం వాడాల్సి వస్తోంది. డైరెక్ట్‌గా సునీత అని నా పేరు చెప్పినందువల్లే ఈ వీడియో చేస్తున్నా. సింగర్ ప్రవస్తి.. నిన్ను అందరిలాగే నేను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా. నీకు 19 ఏళ్లు కదా.. ఇప్పుడు నిన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా? చిన్నప్పుడు చాలా బాగా పాడావ్ అనేకంటే.. చాలా ముద్దుగా పాడావ్? అనేవాళ్లం నీకు గుర్తుందో లేదో? చిన్నప్పుడు పాడినట్టే 19 ఏళ్ల వయసులో కూడా పాడి ఉంటే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి, మా ప్రణీత, మా గాయత్రి అని మీ పేర్లు ఎక్కువగా చెప్పుకుని మురిసిపోయే పిచ్చివాళ్లం మేము' అని అన్నారు.మీలో ఎవరైనా బాగా పాడితే ఉప్పొంగిపోయి, కన్నీళ్ల పర్యంతమైపోయి ఏడ్చేసినా సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు ఇవన్నీ చూడలేదేమో.. మిస్సయ్యావ్ అనుకుంటా. అలాంటి ప్రవస్తి ఈరోజు పెద్దదైపోయి.. రోడ్డుమీద నిలబడి తన బాధను వెళ్లగక్కుకుని..మా గురించి చర్చించే స్థాయికి ఎదిగిందంటే కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావ్.. ప్రవస్తి నీకు ఒక విషయం చెప్పాలమ్మా.. పాడుతా తీయగా కాంపీటీషన్ మాత్రమే కాదు.. విభిన్నమైన ఛానెల్స్‌లో కూడా పాల్గొన్నావ్ కదా? నీకు పద్ధతి గురించి తెలియదా అమ్మా? సింగర్ సెలెక్షన్స్, సింగర్స్ పంపించే పాటల విషయంలో కొన్నింటికీ మాత్రమే రైట్స్ ఉంటాయి. ఈ విషయం నీకు తెలుసో.. తెలియదో నాకు తెలియదు కానీ.. చెప్తే అన్ని విషయాలు చెప్పు. ప్రాసెస్ గురించి కూడా మాట్లాడు.. ఆ సాంగ్ సెలెక్షన్స్‌లో ఛానెల్కున్న నిబంధనల గురించి మాట్లాడమ్మా? నేను కూడా సంతోషిస్తాను. ఏ ఛానెల్కైనా మ్యూజిక్ వాడుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అన్ని పాటలకు ఉండదు. సింగర్స్ ఇచ్చే సాంగ్స్ లిస్ట్‌లో ఎన్నిసార్లు ఆ పాట రిపీట్ అయింది అనేది కూడా యాజమాన్యం చూస్తుంది. ఇదంతా నీకు మళ్లీ వివరిస్తారు. నేను ఏ పాట ఇచ్చినా వాళ్లు వద్దంటున్నారు అనే మాటనే ఎక్కువసార్లు వినిపించావ్. దానికి రీజన్ ఇది అని మీకు తెలియదు కదా? అందుకే నేను చెబుతున్నా. నిన్ను కొరకొరగా చూశానని చెప్పావ్. నిన్ను అలా చూడాల్సిన అవసరమేంటో నాకర్థం లేదు. నేను, కీరవాణీ, చంద్రబోస్ గారు నిన్నే టార్గెట్ చేశారన్నావ్? కనీసం ఆ ఆలోచన కూడా నాకు రావడం లేదు.సునీత మాట్లాడుతూ..' నువ్వు మర్చిపోయిన కొన్ని విషయాలు నేను ఇప్పుడు గుర్తు చేస్తాను. క్లాసికల్ రౌండ్లో నీ దగ్గరికి వచ్చి మరి అందరి మధ్యలో నీకు మాత్రమే చెప్పాను. నువ్వు పాడేటప్పుడు మృదంగం అటు ఇటు అయినా కూడా అప్సెట్ కావాల్సిన అవసరం లేదమ్మా..నువ్వు ఎలా పాడావో మా అందరికీ తెలుసు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో కానీ..మిగిలిన వాళ్లు గుర్తు పెట్టుకున్నారు. మిగిలిన వాళ్ల పేరు నువ్వు బయటికీ తీస్తున్నావ్ కానీ.. వీళ్లంతా మ్యాంగో మ్యూజిక్‌లో పాడలేదమ్మా నువ్వు తప్ప. నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి.. నిహాల్ గారు మీకు గురువు.. అష్టలక్ష్మీ స్తోత్రం పాడేటప్పుడు నేను ఒక్కదాన్నే ఆ వీడియో షూట్ చేయొచ్చు తల్లీ.. నువ్వు బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావ్ కదా? నువ్వు, మీ మదర్ ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా పంపించాం కదా? అవన్నీ ఎలా మర్చిపోయావ్ తల్లీ? అని ప్రవస్తిని ప్రశ్నించింది.ప్రవస్తి నేను మీ అమ్మగారిని నువ్వు అని సంభోధించినందుకు నీకు బాధేసింది? ఎలిమినేషన్ తర్వాత మీ అమ్మ స్టేజిపైకి వచ్చి.. నీ చేతులో ఉండాల్సిన ట్రోఫీ కాదని చాలా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేశారు. నువ్వే మోసం చేశావ్? అని నన్ను మాట్లాడినప్పుడు మీకు కరెక్ట్ అనిపించిందా? అక్కడ అన్ని రికార్డ్ అయ్యాయి. అవన్నీ బయటపెట్టొచ్చు. కానీ మీ అమ్మగారు, నువ్వు ఆవేశంలో ఉన్నారు. అప్పుడు కీరవాణి, చంద్రబోస్ గారు బయటికి వెళ్లిపోయారు. కానీ సునీత గారు నీ ఎలిమినేషన్ చూసేందుకే ఉన్నారని చాలా తప్పు మాట్లాడవమ్మా.. ఎవరైనా ఎలిమినేట్ అయితేనో.. ఎవరన్నా ఓడిపోతేనో సంతోషించే నీచమైన క్యారెక్టర్ నాది కాదు. నువ్వు ఎలిమినేట్ అయితే నేను పార్టీ ఇచ్చానని మాట్లాడుతున్నావ్.. అది నాకర్థం కావడం లేదు. నా జీవితంలో నేను చాలా కష్టాలు పడ్డాను. నువ్వు ఒకదాన్ని ఇంకొదానికి ఆపాదించి మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఓ పోటీలోనైనా ఒక్కరే గెలుస్తారు. మా గురువులకు మాకు అదే నేర్పించారు. కానీ ఈ జనరేషన్లో మారాల్సి ఉంది. పిల్లలకు తల్లిదండ్రులే మంచి, చెడు నేర్పాలి. ఆ తర్వాతే గురువు. ప్రవస్తి నువ్వు ఆవేశంలో ఉన్నావమ్మా.. కాస్తా ఆలోచించి నిర్ణయం తీసుకుని మాట్లాడు. నేను ఎప్పటికీ నీ మంచినే కోరుకుంటా అంటూ ' సునీత మాట్లాడారు.' View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
'పాడుతా తీయగా' పాటల ప్రోగ్రామ్ పై వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ షో నుంచి తాజాగా ఎలిమినేట్ అయిన ప్రవస్తి ఆరాధ్య అనే గాయని.. జడ్జిలైన కీరవాణి, సునీత, చంద్రబోస్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనని కావాలని ఇబ్బంది పెట్టారని, టార్గెట్ చేసి మరీ ఎలిమినేట్ చేశారని చెప్పుకొచ్చింది. తనపై బాడీ షేమింగ్ కూడా జరిగిందని చెప్పి షాకిచ్చింది. ఇప్పుడు ఈమె ఆరోపణలపై మరో సింగర్ లిప్సిక కౌంటర్ ఇచ్చింది. ఇన్ స్టాలో పెద్ద వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్)లిప్సిక ఏం చెప్పిందంటే?'ప్రవస్తి.. పాడుతా తీయగా షోలో తనకు ఏం జరిగిందనే విషయాన్ని చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఎంతమందికి మెచ్యూరిటీ ఉంది. ఆ వీడియోని అర్థం చేసుకోవడానికి. ఏ స్టోరీకైనా రెండు సైడ్స్ ఉంటాయి. అటువైపు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎలా జడ్జ్ చేయగలుగుతాం. తను(ప్రవస్తి) తన భాధని వ్యక్తం చేస్తే.. యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు.. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్?''అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఎవరికైనా సరే అనుభవం ఉండాలి. వచ్చిన కొత్తలోనే ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఎవరున్నారో నాకు తెలీదు. కానీ ఇప్పుడు జడ్జిలుగా ఉన్నవాళ్లు ఒకప్పుడు ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోగలగాలి. అందరూ కష్టపడి పైకి వచ్చినవాళ్లే. ప్రవస్తి ఎవరి పేర్లు అయితే చెప్పిందో వాళ్లు కూడా కష్టపడి పైకొచ్చినవాళ్లే. అలాంటిది వాళ్ల పేర్లు చెప్పడం సరికాదు'(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'కీరవాణి మెప్పు పొందేందుకు నేను 5-6 సంవత్సరాలు కష్టపడ్డా. ఆ తర్వాతే నాకు ఆయన దగ్గర అవకాశం దక్కింది. కీరవాణి దగ్గర చాకిరీ చేయడం సింగర్స్ అందరికీ ఇష్టమే. చాకిరీ అంటే నోట్స్ రాయడం, ప్రాక్టీస్ చేయడం లాంటివి ఉంటాయి' అని లిప్సిక తన వీడియోలు చెప్పుకొచ్చింది.ఈమెతో పాటు మరో లేడీ సింగర్ హారిక నారాయణ్ కూడా ఈ వివాదంపై ఓ వీడియో రిలీజ్ చేసింది. తన అనుమతి లేకుండా ఈ కాంట్రవర్సీలో ఓ న్యూస్ ఛానెల్ లో వీడియో ఒకటి ఉపయోగించారని, అది సరికాదని చెప్పుకొచ్చింది. మరోవైపు ఇదే వివాదంపై సింగర్ సునీత కూడా ఓ వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక) View this post on Instagram A post shared by Lipsika Uday (@lipsikabhashyam) -
వెడ్డింగ్ ఈవెంట్స్ చేసేవాళ్లు అసలు గాయకులే కాదు : కీరవాణి
-
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) సింగింగ్ షో ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతుంది. బాలు గారి మరణానంతరం ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, సింగర్ సునీత జడ్జీలుగా ఉన్నారు. సింగింగ్ రియాల్టీ షోలలో ముందంజలో ఉన్న ‘పాడుతా తీయగా’పై గాయని ప్రవస్తి ఆరాధ్య(Pravasthi Aradhya ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షో న్యాయంగా జరగడం లేదని, టాలెంట్ ఉన్నవాళ్లను కాకుండా నచ్చిన వాళ్లను విజేతలుగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. తాజాగా య్యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేస్తూ..కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జి సీట్లలో కూర్చొని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించారు.‘మ్యూజిక్ ఫిల్డ్ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో పెద్ద పెద్ద వాళ్ల పేర్లును ప్రస్తావించాను కాబట్టి నాకు ఎలాగో అవకాశాలు రావు. కానీ మీఅందరికి నిజం తెలియాలని ధైర్యంతో ఈ వీడియో చేశాను. పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నన్ను జడ్జీలు(కీరవాణి, చంద్రబోస్, సునీత) మెంటల్‌గా హింసించి, అన్యాయంగా ఎలిమేట్ చేశారు.ముందుగా సునీత(Sunitha) గురించి చెబుతా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను స్టేజ్ మీదకు రాగానే ఆమె ముఖం అదోలా పెట్టేవారు. నా ఫ్యాన్స్ కూడా నన్ను అడిగారు. ఆమెతో మీకేమైనా గొడవ జరిగిందా అని మెసేజ్ చేశారు. కానీ నేను అది నమ్మలేదు. కానీ అంతరామమయం పాడే ముందు నేను గమనించాను. ఆమెకు నేనంటే నచ్చదు. అందుకే తప్పు లేకున్నా నెగెటివ్ కామెంట్స్ చేసేవారు. ఓ సారి మైక్ ఆన్‌లో లేదని అనుకొని ‘ఈ అమ్మాయికి హైపిచ్ రాదు కానీ మ్యానేజ్ చేస్తుంది చూడు’ అని కీరవాణికి చెప్పారు. నాకు ఏడుపు వచ్చింది. కానీ తట్టుకొని అంతరామమయం పాడాను. చాలా మంది మెచ్చుకున్నారు. కానీ ఆమె మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేశారు. కానీ మిగతావారు పాడినప్పుడు మాత్రం తప్పులు జరిగితే సైగలు చేసేవారు.ఇక చంద్రబోస్(chandrabose) గారు.. లిరిక్స్ తప్పులు ఉంటే ఆయన చెప్పాలి. మొదటి రెండు ఎపిసోడ్స్ నన్ను మెచ్చుకున్నారు. లిరిక్స్‌లో తప్పులు దొరకపోవడంతో నన్ను మరోలా వేధించారు.కీరవాణి.. ఆయన నుంచి నెగెటివ్ కామెంట్స్ రాలేదు. కానీ సెట్లో ఎలా మాట్లాడతారో చెబుతాను. మెలోడీ పాడిన వారికి ఎక్కువ మార్కులు ఇస్తానని చెబుతారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు పాడితే మంచి మార్కులు వేస్తారు. డబ్బుల కోసం నేను వెడ్డింగ్ షోస్ చేయాల్సి వచ్చిందని గతంలో చెప్పాను. ఈ పాయింట్‌పై కీరవాణి మాట్లాడుతూ.. ‘వెడ్డింగ్ షోస్ చేసేవాళ్లు నా దృష్టిలో సింగర్సే కాదు. వాళ్లంటే నాకు అసహ్యం’ అని అన్నారు. అది చాలా హర్టింగ్గా అనిపించింది. అలాగే పాడుతా తీయగాలో ఐదో ఫ్రైజ్ సాధించినవాళ్లను నా దగ్గరకు వచ్చి చాకిరీ చేసేవాళ్ల గ్రూప్‌లో చేర్చుకుంటానని చెప్పారు. చాకిరీ అనే పదం వాడినందుకు నాకు బాధగా అనిపించింది. జడ్జీలు వివక్ష చూపడం, నన్ను చీడ పురుగులా చూడడం, నా బాడీ మీద జోకులు చేయడం..నన్ను మెంటల్‌గా ఎఫెక్ట్ అయ్యేలా చేశాయి.పొడ్రక్షన్ వాళ్లు కూడా మమ్మల్ని అవమానించారు. చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్‌ఫోజింగ్ చేయాలి అన్నట్లుగా చెప్పారు. చాలా సార్లు తిట్టారు. బాడీ షేమింగ్ చేశారు. ‘ఇలాంటి బాడీకి ఇంకేం ఇవ్వగలను’ అని కాస్ట్యూమ్ డిజైనర్ అన్నారు. వీళ్ల మాటల వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. బాలు సార్ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవి కాదు. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చిందో పాడుతా తీయగా ఇలా మారిపోయింది. డ్యాన్సులు చేయమని, కుల్లు జోకులు చేయమని చెప్పారు.ఇక నా ఎలిమినేషన్ రోజు ఏం జరిగిందో చెబుతాను. ఆ రోజు టాప్ 1 వచ్చిన అమ్మాయి చంద్రబోస్ గారి పాట పాడింది. లిరిక్స్ మరిచిపోయినా చంద్రబోస్ గారు కామెంట్స్‌లో అది చెప్పలేదు. ఇంకో అబ్బాయి కీరవాణి పాట పాడితే స్కోర్ ఎక్కువ వేశారు. ఎలిమేషన్ రౌండ్లో జరిగింది ఇది. ఎలిమినేషన్ జరిగినప్పుడు కీరవాణి, చంద్రబోస్ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు. సునీత మాత్రం అక్కడే నవ్వుతూ కూర్చున్నారు. ఎలిమేట్ అయ్యాక.. నేను ఎమోషనల్ అయ్యాను. మా అమ్మ సునీత దగ్గరకు వచ్చి ‘ఎందుకు ఇంత అన్యాయం చేశారు’ అని అడిగితే..‘నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో’అని సీరియస్‌గా అన్నారు. నేను చాలా షోస్ చేశాను కానీ ఏ జడ్జి కూడా ఇలా మాట్లాడలేదు.నేను ఈ కెరీయర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాకే ఈ వీడియో చేశాను. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటపెట్టాను. నాకు ఎలాగో అవకాశం రాదు. మీ అందరికి చెప్పేది ఒక్కటే ఇలాంటి ఫేక్ షోస్ చూడడం మానేయండి. నాలాగే చాలా మంది సఫర్ అయ్యారు. జడ్జిలు ఆ సీటులో కూర్చొని అన్యాయం చేసి సరస్వతి దేవిని అవమానించకండి. చిత్రమ్మ, మనోగారు, శైలజగారు ఉంటే చాలా బాగుంటుంది. మాలాంటి జీవితాలతో ఆడుకోకండి. నాకు ఏమైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా జరిగినా కీరవాణి, చంద్రబోస్, సునీతతో పాటు జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్లదే బాధ్యత’ అని సింగర్ ప్రవస్తి పేర్కొంది.