
'పాడుతా తీయగా' పాటల ప్రోగ్రామ్ ప్రస్తుతం వివాదాలకు కారణమైంది. రీసెంట్ గా ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. జడ్జిలైన కీరవాణి, చంద్రబోస్, సునీతలపై సంచలన ఆరోపణలు చేసింది. వాళ్లు తనని అవమానించేలా మాట్లాడరని చెప్పుకొచ్చింది. ఇదే షోలో తనపై బాడీ షేమింగ్ కూడా జరిగిందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ప్రవస్తి ఓ వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది.
ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తీసుకుంది. టాలీవుడ్ టాప్ సింగర్ హారిక నారాయణ్ కూడా ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రవస్తికి అన్యాయం జరిగిందని ఓ టీవీ షోలో డిబేట్ పెట్టారు. ఇందులో తన వీడియోని అనుమతి లేకుండా ఉపయోగించడం కరెక్ట్ కాదని హారిక చెప్పుకొచ్చింది. అలానే కీరవాణిపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: సొంతూరికి రామ్ చరణ్ డైరెక్టర్.. గ్రామస్తులతో కలిసి భోజనం)
ఇంతకీ హారిక ఏం చెప్పిందంటే?
'వీక్షణ అని నా ప్రైవేట్ సాంగ్ ని కీరవాణి చేతుల మీదుగా రిలీజ్ చేశాం. దీన్ని రీల్ లా పోస్ట్ చేశారు. అయితే ఓ టీవీ ఛానెల్ లో నా వీడియోని రాంగ్ కాంటెక్ట్స్ లో చూపించడంతో పాటు నోటికొచ్చింది మాట్లాడారు. నాకు అది నచ్చలేదు. ఓ లెజెండరీ పర్సన్.. ఓ చిన్న మ్యూజిక్ వీడియోని సపోర్ట్ చేయడమే గొప్ప విషయం. ఇది ఆయన కొత్తవారిని ఎలా ఎంకరేజ్ చేస్తారనే దానికి ఓ ఉదాహరణ'
'ఆ వీడియోలో కీరవాణి గారి ముందు నిలబడటం నా ఛాయిస్. ఆయన దగ్గర పనిచేసే ఏ సింగర్, మ్యూజిషియన్ అయినా అడగొచ్చు ఆయన ఎలాంటి వారో, విలువలు ఎలాంటివో, సాటి మనిషికి ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందో చెబుతారు. మ్యజిక్ మాత్రమే కాదు జీవితానికి సంబంధించి ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇది పూర్తిగా నా ఫీలింగ్. అలాంటి వ్యక్తి గురించి నిజం తెలుసుకోకుండా అబద్ధాలు చెప్పడం నచ్చలేదు. అగౌరవంగా అనిపించింది. ఈ నెగటివిటీని ఇకపై ఆపేస్తారని భావిస్తున్నా' అని హారిక చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: తల్లిదండ్రులయిన నటుడు విష్ణు విశాల్, జ్వాలా గుత్తా)