mm keeravani
-
ఇద్దరు లెజండరీ పర్సన్స్ క్రియేట్ చేసిన సాంగ్.. చూశారా
'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి నటించిన చిత్రం 'షష్టి పూర్తి'.. తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఎన్నో పాటలకు మ్యూజిక్ అందించడమే కాకుండా రచయితగా కూడా కీరవాణి గుర్తింపు తెచ్చకున్నారు. అయితే, ఈ సినిమాతో తొలిసారి ఇళయరాజా సంగీతంలో ఆయన ఈ సాంగ్‌ను రచించడం విశేషం. ‘షష్టిపూర్తి’ సినిమాలో రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా.. రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించారు. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ‘లేడీస్ టైలర్’ తర్వాత ఈ చిత్రంలో వారిద్దరూ మరోసారి నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తికలిగించేలా ఉంది. తాజాగా విడుదలైన సాంగ్ రూపేష్, ఆకాంక్షా సింగ్ మధ్యే ఉంటుంది. మంచి లవ్ ట్రాక్‌తో పాటు చక్కటి మెలోడీనిచ్చేలా పాట ఉంది. -
హైదరాబాద్ లో వేడుకగా జరిగిన కీరవాణి కన్సర్ట్
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి నిర్వహించిన కన్సర్ట్.. హైదరాబాద్ లో శనివారం రాత్రి వేడుకగా జరిగింది. హైటెక్స్ గ్రౌండ్ లో దాదాపు 10 వేల మంది ఆహుతుల ఈ ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ!)ఇటీవలే ఒడిశాలో షూటింగ్ ముగించుకుని వచ్చేసిన రాజమౌళి.. 'నా టూర్ ఎమ్ఎమ్ కే' పేరుతో నిర్వహించిన ఈ కన్సర్ట్ లో పాల్గొన్నారు. ఇకపోతే ఈ సంగీత కార్యక్రమంలోనే కీరవాణి.. తన స్వరపరిచిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్ర గీతాలని ఆలపించారు. ఈయనతో పాటు 83 మంది సింగర్స్-టెక్నీషియన్స్ కన్సర్ట్ జరిగే ప్రాంతాన్ని సంగీతమయం చేశారు. ఈ కన్సర్ట్ ని నా జీవితంలో మర్చిపోనని కీరవాణి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్) -
SSMB 29పై కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: ఎస్ఎస్ రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ క్షణం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మార్చి 22వ తేదీ జరిగే అద్భుతమైన ప్రదర్శన కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.మార్చి 22వ తేదీన హైదరాబాద్ వేదికగా సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి(MM Keeravani) మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారని రాజమౌళి వెల్లడించారు. ఆ సంగీత ప్రదర్శన చూసేందుకు తాను కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు. నా సినిమాలోని పాటలతో పాటు ఆయన చేసిన సాంగ్స్ కూడా ఈ ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. కేవలం పాటలు మాత్రమే కాకుండా.. ఓఎస్టీలు(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) కూడా ప్రదర్శించాలని ఎంఎం కీరవాణి డిమాండ్ చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వీడియోను రిలీజ్ చేశారు.కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ లోకేషన్స్ కూడా ఫిక్స్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Seeing all the singers share their playlists is making me excited for MMK’s live concert. But what makes me have an edge-of-the-seat experience is imagining him performing the OSTs of our favorite films… Remember peddanna, we are here for the #FullFeastMMK!Not just songs, we… pic.twitter.com/9dS8AeAbse— rajamouli ss (@ssrajamouli) February 28, 2025 -
మనవరాలి పెళ్లిపై మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మనవరాలి పెళ్లితో నటుడు మురళీ మోహన్ (Murali Mohan).. సంగీత దర్శకుడు కీరవాణికి చుట్టమయ్యాడు. మురళీ మోహన్ మనవరాలు రాగ.. కీరవాణి కుమారుడు, హీరో శ్రీ సింహ (Sri Simha) ఈ మధ్యే పెళ్లిపీటలెక్కారు. ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాలు ఆటపాటలతో, డ్యాన్సులతో ఉత్సాహంగా గడిపారు. తాజాగా ఈ వెడ్డింగ్ గురించి మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.అలా మొదలైంది'రాజమౌళి కోడలు పూజ, నా మనవరాలు రాగ క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్లేవారు. ఆ సమయంలో రాజమౌళి (SS Rajamouli), కీరవాణి కుటుంబాలు ఎంత బాగా కలిసున్నాయో కళ్లారా చూసింది. ఫ్రెండ్స్‌లాగా ఒకరిపై మరొకరు జోకులు వేసుకుంటూ చాలా క్లోజ్‌గా, ఆప్యాయతగా ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే ఫామ్ హౌస్‌కు వెళ్లి గేమ్స్ ఆడేవారు.తనే ప్రపోజ్ చేసిందిఇదంతా రాగకు బాగా నచ్చింది. తనకు చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబమంటే చాలా ఇష్టం. అందుకని ఆ రెండు కుటుంబాలు అలా కలిసిమెలిసి ఉండటం చూసి ముచ్చటపడిపోయింది. తనే ఒకరోజు శ్రీసింహకు ప్రపోజ్ చేసింది. ఈ విషయం మొదట మాకు చెప్పలేదు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నీకు నచ్చినవాళ్లెవరూ లేరా? అని అడిగాను. అప్పుడు తన మనసులో మాట బయటపెట్టింది. (చదవండి: అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్)ఎంత సంతోషమేసిందో!కీరవాణి కుమారుడు శ్రీసింహను ఇష్టపడ్డాను.. మీరందరూ అనుమతిస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. తన సెలక్షన్ బాగుండటంతో అందరం ఓకే అన్నాం. పెళ్లిలో కూడా వాళ్లు ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యారో.. పెళ్లికూతుర్ని వధువు తరపువారు పల్లకి మోస్తూ మండపానికి తీసుకెళ్లాలి. కానీ అప్పుడు కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవ సహా మరికొందరు పల్లకి మోసి తనను తీసుకెళ్లారు. ఎంతో సంతోషమేసింది' అని చెప్పుకొచ్చాడు.రాగ ఎవరంటే?మురళీ మోహన్‌కు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు రామ్మోహన్- రూపల కుమార్తెనే రాగ. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా మూవీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.చదవండి: ఆ సంఘటనతో మతం మారాను: రెజీనా కసాండ్రా -
భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా పెళ్లి చేసుకున్నాడు. దుబాయిలో డిసెంబర్ 14న డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో సింహా కొత్త జీవితం ప్రారంభించాడు. పెళ్లి ఫొటోలు అనధికారికంగా కొన్ని బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు శ్రీ సింహా స్వయంగా తన భార్య గురించి స్పెషల్ పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్)'ఇప్పటికి ఆరేళ్లయింది. ఎప్పటికీ ఇలానే' అని రాసిపెట్టడంతో పాటు 'రాసిపెట్టుంది' అని య్యాష్ ట్యాగ్ ఒకటి పెట్టాడు. దీనిబట్టి చూస్తుంటే గత ఆరేళ్లుగా రాగ మాగంటితో ప్రేమలో ఉన్న శ్రీ సింహా.. కొన్నాళ్ల క్రితం పెద్దల్ని ఒప్పించాడు. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా.. ఈ నెల 14న దుబాయిలోని ఓ ఐలాండ్‌లో పెళ్లి జరిగింది. ఇందులో రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.మురళీ మోహన్‌కు కొడుకు రామ్ మోహన్ కుమార్తె రాగ. విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటోంది. శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరిగిపోయింది.(ఇదీ చదవండి: సినిమా వాళ్లు స్పెషలా?: సీఎం రేవంత్) View this post on Instagram A post shared by Sri Simha Marakathamani (@simhakoduri) -
స్టెప్పులతో ఇరగదీసిన రాజమౌళి, వీడియో వైరల్
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో శ్రీసింహ కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా సంగీత్ వేడుక నిర్వహించారు. అన్న కుమారుడి పెళ్లిలో దర్శకధీరుడు రాజమౌళి డ్యాన్స్‌తో ఇరగదీశాడు.మాస్ డ్యాన్స్మాస్ మహారాజ- పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని లంచ్‌కొస్తావా.. మంచ్‌కొస్తావా.. పాటకు స్టెప్పులేశాడు. స్టేజీపై భార్యతో కలిసి రాజమౌళి మాస్ స్టెప్పులు వేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.సినిమాశ్రీసింహ విషయానికి వస్తే.. ఇతడు 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. #SSRajamouli Garu 🕺👌 pic.twitter.com/WaU66KvHDe— TalkEnti (@thetalkenti) December 14, 2024చదవండి: రూ.1 కోటి ప్రశ్నకు కరెక్ట్ గెస్.. కానీ రూ.50 లక్షలే గెలిచింది! -
మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి...ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఆ విషయంలో నన్ను క్షమించండి.. అల్లు అర్జున్ రిక్వెస్ట్)మురళీ మోహన్‌కు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్ మోహన్.. ఈయన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్ మోహన్- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటోంది.శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరగనుంది. దీంతో ఇదేమైనా ప్రేమ పెళ్లి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్) 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తిరోగమనం పై తీవ్ర నిరసన ‘తిరిగి చూడు’పాట
‘తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని... కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషి’... ఈ పాట ఇప్పుడు చాలామంది అభిమానులను సంపాదించుకుంది. రాజకీయవేత్త అద్దంకి దయాకర్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘ఇండియా ఫైల్స్’ కోసం కీరవాణి పాడి, సంగీతం అందించిన ఈ పాటను రాసింది మౌనశ్రీ మల్లిక్. స్వీయ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. గద్దర్ కథ అందించిన ‘ఇండియా ఫైల్స్’లోని పాటలు యూట్యూబ్‌లో విడుదలై లక్షల వ్యూస్ సాధిస్తున్నాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మౌనశ్రీ మల్లిక్ వెల్లడించిన అభిప్రాయాలు....→ ‘ఇండియా ఫైల్స్’ కోసం ‘తిరిగి చూడు’, ‘జై ఇండియా’ పాటలు రాశాను. రెండూ పెద్ద హిట్ కావడం సంతోషంగా ఉంది. ‘ఇండియా ఫైల్స్’ కథలో అద్దంకి దయాకర్ గారిది సామాజిక కార్యకర్త పాత్ర. సమాజంలో పేరుకుపోతున్న మూఢత్వాన్ని, తిరోగమనాన్ని చూసి మార్పు రావాలంటే ఏం చేయాలో తెలియ చేయమని తన గురువు (సుమన్)ను అడుగుతాడు. దేశమంతా తిరిగి చూస్తే నీకే జవాబు దొరుకుతుంది అని గురువు సూచిస్తాడు. అద్దంకి దయాకర్ దేశాన్ని తిరిగి చూసే సందర్భంలో వస్తుందీ పాట.→ ‘పుణ్యపుడమిలో పరిఢవిల్లిన మేధలేదిపుడెందుకో... ధన్యధరణిలో నెత్తుటేరులు పారుతున్నది ఎందుకో’ అని ఈ పాటలో రాశాను. ఒకప్పుడు మేధావులతో నిండిన ఈ దేశంలో జ్ఞానవికాసానికి బదులు ఛాందసం మొలకెత్తడం బాధాకరం. అందుకే ‘గాయపడిన భరతజాతికి వైద్యమేదో చదువుకో’ అని కూడా రాశాను. నాలుగు చరణాల ఈ పాటను విని దర్శకుడు బొమ్మకు మురళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ కనకదుర్గ చాలా సంతోషపడ్డారు. కీరవాణిగారైతే ఎంత మెచ్చుకున్నారో తెలియదు. దీనిని నేనే పాడతానని చెన్నైలో తన సంగీత దర్శకత్వంలో రికార్డు చేశారు. పాట రిలీజై ఇంత స్పందన రావడం సంతృప్తిగా ఉంది.→ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం ‘ఇండియా ఫైల్స్’ కథాంశం. రాజ్యాంగం సరిగా అమలైతే పేదవాడు పేదవాడిగా ఉండిపోడని ఈ సినిమాలో చెబుతాం. ‘ప్రశ్నించే వారికి స్వేచ్ఛ ఉండాలి’ అని ఇదే సినిమాలోని ‘జై ఇండియా’ గీతంలో రాశాను.→ మాది వరంగల్ జిల్లా వర్థన్న పేట. జర్నలిస్ట్‌గా పని చేశాను. చిన్నప్పుడు పేదరికంలో రేడియో ఒక్కటే వినోదంగా ఉండేది. అందులో వినిపించే పాటలే నన్ను కవిని, గీతకర్తను చేశాయి. సామాజిక చైతన్యం కలిగిన కవిగా సాహిత్యవేత్తగా రాణిస్తూనే టీవీ, సినిమాల్లో పని చేస్తున్నాను. కె. రాఘవేంద్రరావు గారు పాటలకు ప్రాధాన్యం ఉన్న ‘కోకిలమ్మ’, ‘కృష్ణతులసి’ సీరియల్స్‌లో నా చేత వరదలాగా పాటలు రాయించడంతో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు టీవీ సీరియల్స్‌కు టైటిల్ సాంగ్ అనగానే నా పేరే గుర్తుకు వస్తోంది. → చిన్న సినిమాలకు చాలా పాటలు రాశాను. ‘గుడ్ మార్నింగ్’ సినిమాకు నేను రాసిన పాటకు 2012లో గీతా మాధురికి నంది అవార్డు వచ్చింది. ‘ఇండియా ఫైల్స్ పాటలతో వచ్చిన గుర్తింపుతో ఇకపై సినిమా రంగంలో మరింత ఉత్సాహంగా పాటలు రాయాలని అనుకుంటున్నాను. -
ఈసారి తెలుగమ్మాయిని పరిచయం చేస్తున్నాను: వైవీఎస్ చౌదరి
‘‘నేను పరిచయం చేసిన ఎంతోమంది హీరోయిన్లు స్టార్స్‌గా వెలిగారు. అయితే ఇందులో చాలా మంది ముంబై నుంచి వచ్చిన వారే. ఈసారి మన తెలుగమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేయాలని వీణా రావుని ఎంచుకున్నా. ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెందరో ఉంటారు. అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తున్నాం’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. దివంగత హరికృష్ణ కుమారుడు, దివంగత జానకి రామ్ (ఎన్టీఆర్ సోదరుడు) తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఇటీవల ఓ సినిమాని ప్రకటించారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మించనున్నారు. కాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వీణా రావు పేరుని పరిచయం చేశారు వైవీఎస్ చౌదరి. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహేశ్‌బాబుగారి బర్త్ డే (ఆగస్టు 9) సందర్భంగా మా సినిమా కార్యక్రమం జరుపుకోవడం హ్యాపీ. ఈ మూవీకి కీరవాణిగారు సంగీతం అందించనుండటం నా అదృష్టం. సాయి మాధవ్ బుర్రా మాటలు, చంద్రబోస్‌గారి పాటలు మహాద్భుతంగా ఉండనున్నాయి’’ అన్నారు. ‘‘వైవీఎస్ చౌదరి, కీరవాణి, చంద్రబోస్ వంటి మహామహులతో పనిచేసే అవకాశం ఇచ్చిన గీతగారికి ధన్యవాదాలు’’ అని డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా చెప్పారు. -
KSR Comment: శృతిమించిన కీరవాణి.. రామోజీ నిజస్వరూపం బయటపెట్టిన పవన్
-
మీకు భీష్ముడు కావచ్చు.. కానీ.. కిరవాణికి కౌంటర్
-
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యువ సింగర్స్
తెలంగాణ రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ఈ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు.తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఈ గీతాన్ని పాడే ఛాన్స్ యువ సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్‌లకు దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ గీతానికి సంగీతం అందించారు. అందెశ్రీ రచించిన ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి ఉంటే.. 13.30 నిమిషాల నిడివితో మరోకటి ఇలా రెండు వర్షన్లుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలోని మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గీతంగా రూపొందించారు. రెండింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర గీతంగానే పరిగణించనున్నారు.కొన్న గంటల్లో రాష్ట్ర ప్రజలు ఈ గీతాన్ని వినబోతున్నారు. అయితే, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కీరవాణి బృందం కలిసింది. అందులో సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్‌లు ఉన్నారు. ఇంతటి సంతోష సమయంలో సింగర్ హారిక ఇలా చెప్పుకొచ్చింది. 'తెలంగాణ నూతన రాష్ట్ర గీతాన్ని ఆలపించడం చరిత్రలో నిలిచిపోయే అంశం. ఈ గీతాన్ని రాబోయే తరాలకు గౌరవప్రదంగా నిలిచిపోయేలా చేయడం విశేషం. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నన్ను చేర్చుకున్నందుకు కీరవాణి సార్‌కి, అందె శ్రీ గారికి నా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని సాధ్యం చేసినందుకు మా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్‌కి నా ధన్యవాదాలు. ఈ గీతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు, అంటే జూన్ 2, 2024న ఆవిష్కరించబడుతుంది. అని ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. View this post on Instagram A post shared by Harika Narayan (@harika_narayan) -
కీరవాణి వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి రియాక్షన్
ఢిల్లీ, సాక్షి: స్వల్ప మార్పులతో ‘జయ జయహే తెలంగాణ..’ గేయాన్ని రూపకల్పన చేసే ప్రయత్నాల్లో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇందుకు సంగీత స్వరకల్పన కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ఎంచుకోవడంపై వివాదం రాజుకుంది. ఈ వివాదంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పందించారు. హస్తిన పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీరవాణిని ఎంపిక చేసిన వివాదంపై స్పందించారు. ‘‘కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు. జయజయహే తెలంగాణ పాట రాసిన అందెశ్రీకే రూపకల్పన బాధ్యతలు ఇచ్చాం. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని ఆయనకే అప్పగించాం. కీరవాణిని అందెశ్రీయే ఎంపిక చేశారు. సంగీత దర్శకుడి ఎంపికలో నా పాత్రేమీ లేదు. ఎవరితో సంగీతం చేయించుకోవలనేది అందే శ్రీ నిర్ణయనికే వదిలేశా’’ అని వివరణ ఇచ్చారు. 👉::అత్యంత పారదర్శకంగా నా పాలన సాగుతోంది. ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలేదు,కోతలు లేవు.. కొన్ని చోట్ల వర్షాల కారణంగా సదుపాయాలలో అవాంతరాలు మాత్రం నెలకొన్నాయి. పక్క రాష్ట్రంలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్స్ఫర్ చేశారు. తెలంగాణలో ఎలాంటి ట్రాన్స్ఫర్ లేకుండా ఎన్నికల జరిగాయి. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణం లో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించాం. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేశామని ఆరోపణలు ప్రతిపక్షాలు సైతం చేయలేదు.👉::కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటా. దాని ఆధారంగానే ముందుకు వెళతాం. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటాం. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నుముక్క విరిగిందని నేను ముందే చెప్పాను. గత ప్రభుత్వం ఎత్తిన నీళ్లను సముద్రంలోకి విడిచారు. సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్ బిల్లు కట్టాం.👉::ఫోన్ ట్యాపింగ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారు. ప్రభుత్వం ఇంకా రివ్యూ చెయ్యలేదు. ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నందున ఫోన్ టాపింగ్ పై సమీక్ష జరపలేదు. ప్రస్తుతం ఈ అంశాన్ని అధికారులే చూసుకుంటున్నారు. బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్ లో ఉందో ఎక్కడ ఉందో విచారణ అధికారులు తేల్చాల్సి ఉంది. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయించడం లేదు. అలాంటి పనులు కూడా చేయను నేను. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే హరీష్ రావు కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మాత్రం సీబీఐకి ఇవ్వాలని ఎందుకు అడగడం లేదు. కేసీఆర్ అసెంబ్లీ కి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉంది. 👉::తెలంగాణ అంటేనే రాచరికనికి వ్యతిరేకం. త్యాగాలు, పొరటాలు గుర్తొస్తాయి. అవే గుర్తుకు వచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నాం. రాజముద్ర రూపకల్పన బాధ్యత ఫైన్ ఆర్ట్ కాలేజ్ ప్రిన్సిపల్ కు ఇచ్చాం, ఆయన తెలంగాణ నిజామాబాద్ బిడ్డ. అధికారిక చిహ్నం లో కాకతీయ తోరణం ఉండదు. సమ్మక్క, సారక్క - నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా చిహ్నం ఉండనుంది. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం ఉంటుంది. కీరవాణి వివాదంఅందెశ్రీ రాసిన పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అయితే సాహిత్యంలో స్వల్ప మార్పుల అనంతరం.. ఈ పాటని స్వర పరిచే అవకాశం కీరవాణికి అప్పగించారు. ఆ తర్వాత రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. అసలు రచ్చ మొదలైంది. Telangana CM Revanth Reddy held a discussion with Poet Ande Sri & Composer MM Keeravani on 'Jaya Jayahe Telangana' anthem song. To be released on June 2. The muted audio was released by Telangana government sources. #Telangana #Revanth #MMKeeravani pic.twitter.com/1HDJABekZR— Sudhakar Udumula (@sudhakarudumula) May 26, 2024 ఆంధ్రాకు చెందిన కీరవాణి వద్దంటూ.. తెలంగాణ సినీ సంగీత సంఘం ఏకంగా సీఎం రేవంత్‌కు ఓ లేఖ రాసింది. ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లాంటి వాళ్లు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకు వెళ్లాలనే ఉన్నట్లు తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతం పై ఆంధ్రా' సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంది భై ? గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది?? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం? అదీ తెలంగాణ వచ్చి పదేళ్లయినంక??ముఖ్యమంత్రి @revanth_anumula గారు,కీరవాణి… pic.twitter.com/yMd2sRVrRl— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 27, 2024 -
Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
టైటిల్: లవ్ మీనటీనటులు: ఆశీష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులునిర్మాతలు : హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, హర్షిత రెడ్డిదర్శకుడు: అరుణ్ భీమవరపుసంగీతం: ఎంఎం కీరవాణిసినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్విడుదల తేది: మే 25, 2024దెయ్యం తో లవ్...అని చెప్పగానే అందరికీ ‘లవ్ మీ’ సినిమా పై ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆ ఆసక్తిని మరింత పెంచాయి. ఇలా భారీ అంచనాలతో నేడు(మే 25) ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘లవ్ మీ’ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అర్జున్ (ఆశిష్ రెడ్డి), ప్రతాప్(రవికృష్ణ) ఇద్దరు యూట్యూబర్స్. మూఢనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహాలను పోగొట్టేలా వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటారు. ప్రతాప్ ప్రియురాలు ప్రియ(వైష్ణవి చైతన్య) అప్పుడప్పుడు వీరికి సహాయం చేస్తుంటుంది. ఓ సారి ప్రతాప్ తమ ఊర్లో జరిగిన మిస్టరీని ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం ఆ ఊర్లో నుంచి దివ్యవతి(సంయుక్త మీనన్)అనే చిన్నారి మిస్ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఆమె ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ నుంచి కొన్ని శబ్దాలు వినిపించడంతో దివ్యవతి దెయ్యం అయిందని ఎవరూ అటువైపు వెళ్లరు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లి ప్రతి ఒక్కరు చనిపోతుంటారు. ప్రియ ఈ సమాచారం అంతా సేకరించి ప్రతాప్‌కి చెబుతుండగా.. అర్జున్ వింటాడు. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం ఉన్న అర్జున్.. ఆ దివ్యవతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ మిస్టరీని ఛేందించేందుకు ఒక్కడే ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దివ్యవతి ఎవరు? ఆ అపార్ట్మెంట్లో నిజంగానే దెయ్యం ఉందా? ఉంటే అర్జున్‌ని ఎందుకు చంపలేదు? వేరు వేరు ఊర్లల్లో మిస్సింగ్ అయిన వెన్నెల, నూర్, పల్లవిలకు దివ్యవతికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఈ మిస్టరీ అర్జున్ ఎలా ఛేదించాడు? అనేది మిగతా కథ.ఎలా ఉందంటే.. బేస్మెంట్ సరిగా లేకుంటే.. ఆ ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దిన సరే ప్రయోజనం ఉండదు. అలాగే ఓ సినిమాకి కథ-కథనం కూడా బేస్మెంట్ లాంటిదే. కథలోని మెయిన్ పాయింట్ బలంగా ఉంటే..సాదారణంగా తెరకెక్కించినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేకానీ కథలోని అసలు పాయింటే బలహీనంగా.. అర్థవంతంగా లేకుంటే ఎంత రిచ్‌గా తీర్చిదిద్దినా..ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. లవ్ మీ విషయంలో దర్శకుడు అదే పొరపాటే చేశాడు. ఇంతవరకు ఎవరూ ఎంచుకొని ఓ యూనిక్ పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు మంచి సన్నివేశాలను అల్లుకున్నాడు. కానీ అసలు పాయింట్ దగ్గరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్థం కాదు. హారర్ సన్నివేశాలతో సినిమాను ప్రారంభించి లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీగా కథనాన్ని సాగించాడు.ప్రధాన పాత్రని తీర్చిదిద్దిన విధానం.. ప్లాష్ బ్యాక్ స్టోరీ అస్సలు రుచించదు. ఆ పాత్ర ఎందుకు అలా ప్రవర్తించిందో చెప్పిన కారణం మరింత సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ఒకరితో ప్రేమలో ఉంటూనే మరొకరితో ప్రేమలో పడడం.. దానికి బలమైన కారణం కూడా లేకపోవడంతో ఆ లవ్‌స్టోరీకి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఇక దెయ్యంతో హీరో ప్రేమలో పడడం కూడా ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. భయంతోనే దెయ్యంతో ప్రేమలో పడ్డానని హీరో చెప్పడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. సినిమాలో హీరో చెప్పులు వేసుకోడు..దానికేదో బలమైన కారణం ఉంటుందని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా ఊహిస్తాడు. కానీ దర్శకుడు ఓకే ఒక షాట్లో దానికి కారణం ఏంటో చూపించాడు. అయితే ఆ రీజన్ చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అలాంటి సీన్లు సినిమాలో చాలానే ఉంటాయి. హీరో అపార్ట్మెంట్లోకి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు ఇటు ఎంటర్టైన్మెంట్ అదించలేదు.. అలా అని అటు పూర్తిగా భయపెట్టలేవు. గతంలో చూసిన సాధారణ లవ్‌స్టోరీ మాదిరి కథనం సాగుతుంది. హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్‌గా ఉండడమే కాకుండా..గందరగోళానికి గురి చేస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ముందుగానే ఊహించొచ్చు. ఎవరెలా చేశారంటే.. అశీష్ రెడ్డికి ఇది రెండో సినిమా. అయినా కూడా నటన పరంగా ఇంకాస్త శిక్షణ అవసరమేమో అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒకే రకమైన ఎక్స్ప్రెషన్తో కనిపిస్తాడు. సీన్‌కి తగ్గట్లుగా తన ఎక్స్ప్రెషన్స్ మార్చుకోలేకపోయాడు. అలాగే ఇందులో ఆయన పాత్రని ఎలివేట్ చేసే సన్నివేశాలు కూడా లేవు. ఇక బేబి తర్వాత వైష్ణవి చైతన్య నటించిన చిత్రమిది. ఆమె పాత్ర పరిధిమేర బాగానే నటించింది. అయితే ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానమే మళ్లీ ‘బేబీ’సినిమాను గుర్తు చేస్తుంది. ప్రతాప్‌గా రవికృష్ణ బాగానే నటించాడు. ఫుల్ లెన్త్ రోల్ తనది. సంయుక్త మీనన్ ఒకే ఒక్క షాట్లో కనిపిస్తుంది. సిమ్రాన్ చౌదరితో పాటు మిగిలిన నటీనటుటు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా బాగుంది. ఎంఎం కీరవాణీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజా గేయ రచయిత అందెశ్రీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం(మే21) భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’పాటను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విషయమై సీఎం వీరితో చర్చించారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో త్వరలో జయజయహే పాట సరికొత్త బాణీతో అలరించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ప్రజాకవి, ప్రకృతి కవిగా డాక్టర్ అందెశ్రీకి పేరుంది. ‘జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ను అందెశ్రీ రచించారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో చాలా పాపులర్ అయింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విద్యాసంస్థల్లో, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో ప్రార్థనా గీతంగా ఈ పాటను పాడుకుంటారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక జయజయహే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
అధునాతన టెక్నాలజీతో ప్రారంభమైన సారథి స్టూడియోస్..
హైదరాబాద్‌లో తెలుగు సినిమాకు ఐకాన్.. ఇంకా చెప్పాలంటే మొట్ట మొదటి స్టూడియోగా శ్రీ సారథీ స్టూడియోస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి నుంచి.. నేటి సినిమాల వరకు ఎన్నెన్నో చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవే. మారుతున్న కాలానికి తగ్గట్లుగా అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో ఈ స్టూడియోస్‌ను తీర్చిదిద్దారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనే అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్ ప్రారంభించారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రారంభించగా.. సౌండ్ డిజైన్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీ సారథీ స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ మాట్లాడుతూ..'ఈ స్టూడియోని మల్టీఫ్లెక్స్ థియేటర్స్‌గా మార్చాలన్న ఆలోచన చేసి ఆ తర్వాత విరమించుకున్నాం. సినీ స్టూడియోస్‌గానే కొనసాగించాలని నిర్ణయించుకున్న అనంతరం షూటింగులకు కావలసిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీపడేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకుని వచ్చాం. మేము ఆరంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్స్ చాలా అధునాతనమైనవి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా "కల్కి" అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం" అని అన్నారు.శ్రీ సారథీ స్టూడియోస్ డైరెక్టర్ కేవీ రావు మాట్లాడుతూ.. 'మా స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తే పోస్ట్ ప్రొడక్షన్స్‌తో సహా సినిమా మొదటి కాపీని సిద్ధం చేసుకునేంతవరకు కావలసిన సామాగ్రి అంతా ఉందని అన్నారు. సినిమా అనగానే సౌండింగ్ కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే అధునాతన టెక్నాలజీని మేము ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. -
MM Keeravani: డ్యాన్స్ చేశాం
‘‘లవ్ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్‌గారు. ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్‌గారితో ఫైట్ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్ ఈవెంట్స్‌ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్ పీసీ శ్రీరామ్ తదితరులు ΄ాల్గొన్నారు. -
కీరవాణి అబ్బాయితో నా కూతురు పెళ్లి నిజమే: మాగంటి రూప
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆస్కార్ గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహతో.. నటుడు మురళీ మోహన్ మనుమరాలి పెళ్లి జరగనున్నట్లు రూమర్స్ వచ్చాయి. కొద్దిరోజుల తర్వాత అవన్నీ నిజమేనని మురళీ మోహన్ కూడా ప్రకటించారు. తాజాగా ఆ పెళ్లి వేడుక విషయంపై మురళీ మోహన్ కోడలు మాగంటి రూప కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహతో తన కూతురు 'రాగ' పెళ్లి ఫిక్స్ అయినట్లు ఆమె పేర్కొన్నారు. మురళీ మోహన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఆయనతో పాటుగా కోడలు రూప కూడా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగుతుందని ఆమె ప్రకటించారు. మురళీ మోహన్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్ మోహన్ మాత్రం ఆయనకు సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్ మోహన్- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో ఆమె బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటుంన్నారట. ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ సినిమాలతో టాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి కుదరడంతో బహుశా ఇది ప్రేమ పెళ్లి కావచ్చని భావిస్తున్నారు. -
భాగ్యనగరంలో ‘విశ్వంభర’ పూర్తి
చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘బింబిసార’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్టాలిన్’ (2006) వంటి హిట్ మూవీలో జోడీగా నటించిన చిరంజీవి–త్రిష ‘విశ్వంభర’ మూవీ కోసం రెండోసారి కలిశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన ‘విశ్వంభర’ షెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. చిరంజీవి, త్రిషతో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్లో కొంత టాకీ పార్ట్, ఓ పాట, యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించినట్లు యూనిట్ పేర్కొంది. ‘‘ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ మూవీ ఉంటుంది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి నివాసంలో చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా యూనిట్‌తో దిగిన ఫొటోలను త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు! విశ్వంభర’ అని పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: కార్తీక్ శబరీష్, లైన్‌ప్రోడ్యూసర్: రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి. -
అప్పట్నుంచి కీరవాణి ఫ్యాన్‌ని!
‘‘మా తరానికి చెందిన అద్భుతమైన సంగీతదర్శకుల్లో ఒకరైన కీరవాణితో సినిమా చేసే అవకాశం రావడం నాకు గర్వకారణం. నా కల నిజమైంది’’ అని బాలీవుడ్ ప్రముఖ నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇరవై రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించారు అనుపమ్ ఖేర్. తాజాగా ‘తన్వీ ది గ్రేట్’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతదర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ట్రాక్ కంపోజ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేత కీరవాణి మా సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం ఓ ఆశీర్వాదం. ఏడాదిగా ఈ సినిమాకి కలిసి పని చేస్తున్నాం. కీరవాణి స్వరపరచిన ‘తుమ్ మిలే దిల్ ఖిలే..’ (నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ నటించిన ‘క్రిమినల్’ సినిమాలోని ΄ాట) విన్నప్పట్నుంచి ఆయనకు అభిమాని అయిపోయాను. ఇప్పుడు నా సినిమా ఒప్పుకున్నందుకు ఆయనకు «థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు అనుపమ్ ఖేర్. -
కీరవాణితో కలిసి థియేటర్లో సినిమా చూసిన జక్కన్న
కొన్ని సినిమాలు ఏకపక్షంగా పాజిటివ్ టాక్‌తో బీభత్సమైన వసూళ్లు రాబడతాయి. కానీ కొన్ని మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ భారీగానే కలెక్షన్స్ సాధిస్తాయి. గుంటూరు కారం సినిమా ఈ కోవలోకే వస్తుంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లో సినిమా చూసిన జక్కన్న మొదటివారంలో ఈ సినిమా రూ.212 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి పండగను మహేశ్ బాగానే వాడేసుకున్నాడు. తాజాగా ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వీక్షించాడు. ఏఎమ్‌బీ థియేటర్లో కీరవాణితో కలిసి సినిమా చూశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లేచి నిలబడ్డాడు.. వెళ్లిపోయాడా? అందులో జక్కన్న లేచి నిలబడగా కీరవాణి సీటులోనే కూర్చున్నాడు. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 'కీరవాణి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏదో తేడాగా ఉంది? కొంపదీసి నిద్రపోయాడా? థమన్ సంగీతానికి నిద్రొచ్చేసినట్లుంది..', 'జక్కన్న రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోయాడా?', 'సినిమా పూర్తిగా చూడకుండానే లేచి వెళ్లపోయినట్లున్నాడు' అని సెటైర్లు వేస్తున్నారు. Video #GunturKaaram #SSRajamouli 👍 pic.twitter.com/nkaUnwaKWv — Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) January 20, 2024 చదవండి: గుండెపై పచ్చబొట్టు.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన నటి! అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' టీమ్ భారీ విరాళం -
చిరంజీవి, నాగార్జున కి మ్యూజిక్ సెన్స్ చాలా ఉంటుంది
-
'ఆడేమన్నా కుర్రాడు అనుకుంటున్నాడా.. కొంచెం తగ్గమను'
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం ‘నా సామి రంగ. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: నా సామిరంగ.. నిన్ను ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా!) 'ఏం సేత్తున్నాడేంటి మీవోడు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత మామిడితోటలో మావాడు 20 మందిని ఊతకొట్టుడు కొట్టేశాడంటూ అల్లరి నరేశ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. టీజర్లో నాగార్జున ఫుల్ మాస్ ఫైట్‌ను చూపించారు. 'ఆడేమన్నా కుర్రాడు అనుకుంటున్నాడా? కొంచెం తగ్గమను' అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత నాగార్జున, ఆషిక రంగనాథ్ మధ్య సీన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. -
కీరవాణి ఇంటి కోడలిగా మురళీ మోహన్ మనవరాలు..
పెళ్లిళ్ల సీజన్ కావడంతో సెలబ్రిటీలు కూడా ఇంతకుమించిన మంచి తరుణం మళ్లీ దొరకదంటూ లైఫ్‌లో ఓ అడుగు ముందుకేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. అన్ని వుడ్స్‌లోనూ తారలు పెళ్లి సందడితో బిజీగా ఉన్నారు. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆస్కార్ గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహ.. నటుడు మురళీ మోహన్ మనుమరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. వచ్చే ఏడాదే పెళ్లి తాజాగా ఈ వార్తలపై మురళీ మోహన్ స్పందిస్తూ అది నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'నాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైంది. తనకు ఓ అమ్మాయి సంతానం. త్వరలో ఆమె పెళ్లి జరగబోతోంది. ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో తన వివాహం జరగనుంది. అలాగే నా కొడుక్కి ఓ కూతురు సంతానం. ఈమె పెళ్లి కూడా దాదాపు ఖాయమైపోయింది. అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంటికి కోడలిగా వెళ్లనుంది. పెద్ద మనవరాలి పెళ్లి ఫిబ్రవరిలో అయితే చిన్న మనవరాలి పెళ్లి వచ్చే ఏడాది చివర్లో జరగనుంది' అని పేర్కొన్నాడు. మురళీ మోహన్ మనవరాలు ఏం చేస్తుంది? కాగా మాగంటి మురళీ మోహన్ కొడుకు పేరు రామ్ మోహన్. ఈయన ఏకైక కుమార్తె పేరు 'రాగ'. కొద్దిరోజుల క్రితమే ఆమె బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. 'రాగ' కూడా అందులోనే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మొదటి నుంచి కూడా మురళీ మోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచాయాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు 'రాగ'ను ఇచ్చి వివాహం చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ సినిమాలతో టాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చదవండి: 18 ఏళ్లకే పెళ్లి, ఐదేళ్లకే విడాకులు.. ముగ్గురు పిల్లలతో.. తెలుగు హీరోయిన్ కన్నీటి కష్టాలు.. -
వశిష్ఠతో చిరంజీవి జర్నీ ప్రారంభం ఎప్పుడంటే..?
మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట కాంబినేషన్లో వస్తున్న మెగా 156 సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ భారీ బడ్జెట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి అయిందట. బింబిసార చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన వశిష్ఠ చాలా గ్యాప్ తీసుకుని పక్కా ప్లాన్‌తో చిరంజీవి కోసం కథ రెడీ చేశాడు. UV క్రియేషన్స్ ద్వార విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 25 నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రానుంది. షూటింగ్ ప్రారంభమే భారీ యాక్షన్ సీన్స్‌తో మొదలు కానుందట.. ఈ కథలో ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఊహకందని యాక్షన్ సీన్స్ ఉన్నాయట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట ఈ సినిమా గురించి ఇలా తెలిపారు. 'చిరంజీవిగారు పూర్తి స్థాయి ఫాంటసీ కథలో నటించి చాలా రోజులైంది. అందుకే ఆయన కోసం పంచభూతాలు, త్రిశూల శక్తి అనే అంశాలకు ఆధ్యాత్మికత కలబోసి అద్భుతమైన కథను సిద్ధం చేశా.' అని హింట్ ఇచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారులను మెచ్చే అంశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. చిరంజీవి సరసన హీరోయిన్గా నటించే ఛాన్స్ ఆమెకు అంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చినా ప్రముఖంగా అనుష్క పేరు వినిపిస్తోంది. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. ఈ విజువల్ వండర్‌ను కెమెరామెన్ ఛోటా కె. నాయుడు చిత్రీకరించనున్నారు. -
చిరంజీవి- వశిష్ట సినిమాకు టైటిల్ అదిరిపోయింది
మెగాస్టార్ చిరంజీవి - బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. ఫాంటసీ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం 'మెగా 156' అనే టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు సోషల్‌మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటుల ఎంపిక పనిలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా ఫ్యాన్స్ ఈ మూవీ టైటిల్ అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'విశ్వంభర' అనే సరికొత్త టైటిల్‌ను మూవీ టీమ్ దాదాపు ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీ మొత్తం మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని సమాచారం. దేవ, మానవ, పాతాళలోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విలన్‌గా దగ్గుబాటి రానాను ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్గా అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను కూడా ఎమ్ ఎమ్ కీరవాణి రికార్డింగ్ చేసినట్లు తాజాగా ఆయన చెప్పారు. 2025 సంక్రాంతి బరిలో సినిమాను దింపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ముల్లోకాల వీరుడికి జగదేక వీరుడి దెబ్బ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ సినిమాలు అంటే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అని చెప్పవచ్చు. చిరంజీవి- వశిష్ట మూవీ కూడా సోషియో ఫాంటసీనే అనే ప్రకటన వచ్చిన నేపథ్యంలో వైజయంతీ మూవీస్ సంస్థ పరోక్షంగా ఓ ట్వీట్ చేసింది. తమ కథ, సినిమా, టైటిల్ ఇలా దేన్నైనా సరే వారి అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటన ఇచ్చింది. దీంతో 'ముల్లోకాల వీరుడు' అని పెట్టాలనుకున్న టైటిల్‌ను విరమించుకుని 'విశ్వంభర' అనే సరికొత్త టైటిల్‌ను 'మెగా 156'కు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. -
Mega 156 Pooja Ceremony Photos: చిరంజీవి-వశిష్ఠ 'మెగా 156' సినిమా పూజా కార్యక్రమం ఫోటోలు
-
మెగా 156 ప్రారంభం.. వీడియోతో ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
మెగా 157 ప్రాజెక్ట్ కాస్త నంబర్ మారి మెగా 156 అయిన విషయం తెలిసిందే. 'బింబిసార'తో అటు చిత్ర పరిశ్రమ, ఇటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వశిష్ఠ. తన రెండో సినిమాలోనే మెగాస్టార్ లాంటి లెజెండ్ హీరోను డైరెక్టె చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇటీవల నిర్వహించిన ‘సైమా’ (SIIMA) వేడుకల్లో ఉత్తమ పరిచయ దర్శకుడిగా 'బింబిసార' సినిమాతో వశిష్ఠ అవార్డు అందుకున్నారు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్) దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రధాన టీమ్‌ను ఒక వీడియో ద్వారా యూవీ క్రియేషన్స్ మేకర్స్ ప్రకటించారు. అందులో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణితో వీడియో ప్రారంభం అవుతుంది. ఆపై మెగాస్టార్ తన సతీమణి సురేఖతో కలిసి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా చోటా కె. నాయుడు ఉన్నారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందిస్తుండగా.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గేయ రచయితగా ఉన్నారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని కీరవాణి తెలిపారు. కాస్ట్యూమ్స్ సుష్మిత కొణిదెల,ఏడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు వంటి వారు మెగా 156 ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. త్వరలో ఈ చిత్రానికి టైటిల్ కూడా ప్రకటించనున్నారు. -
వశిష్ట సినిమా విషయంలో షాకింగ్ న్యూస్ చెప్పిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ భారీ డిజాస్టర్ తర్వాత రెండు చిత్రాలను ప్రకటించారు. ఇందులో మెగా 156 చిత్రాన్ని తన కుమార్తె సుష్మిత నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేశారు. మరోకటి మెగా 157 చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌లో బింబిసార డైరెక్టర్ వశిష్టతో స్కెచ్ వేశారు. కానీ ఇక్కడ చిరు చిన్న మార్పు చేశారు. మెగా 157వ చిత్రంపైనే ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. డైరెక్టర్ వశిష్ట కథ పట్ల ఆయనకు భారీ నమ్మకం ఏర్పడ్డాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెగా 156 చిత్రాన్ని వదిలేసి మెగా 157 ప్రాజెక్ట్‌పైనే ఆయన ఫోకస్ పెట్టారు. కాబట్టి ఇప్పుడు వశిష్ట డైరెక్ట్ చేస్తున్న సినిమానే ముందుగా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అందులో భాగంగానే తాజాగా ఆ ప్రాజెక్ట్‌ను మెగా 156 అని ఒక పోస్టర్‌ను వశిష్ఠ షేర్ చేశారు. మెగాస్టార్-వశిష్ఠ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సంగీత దర్శకుడిగా ఎమ్ఎమ్ కీరవాణి భాగమయ్యారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందిస్తుండగా చోటా కె. నాయుడు కెమెరామెన్‌గా ఉన్నారు. ఇక మెగా 156 గురించి మాట్లాడుకుంటే.. ఈ సినిమాకు సోగ్గాడే చిన్నినాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని, త్వరలో ఆ డైరెక్టర్ని చిరునే అధికారికంగా ప్రకటిస్తాడని అనుకున్నారు. అయితే దసరా రోజున అభిమానులకు షాకిచ్చే న్యూస్ చెప్పాడు చిరు. తన లైన్లో మెగా 156 లేదు అంటూ తెలిపాడు. మెగా 157 గా తెరకెక్కుతున్న వశిష్ట సినిమానే మెగా 156 గా మార్చినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా 156 పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. #Mega156 begins 🔥 దసరా శుభాకాంక్షలు 🏹 Mega Star @KChiruTweets @mmkeeravaani @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/sMsVhXnbAj — Vassishta (@DirVassishta) October 23, 2023 -
మాగంటి మురళీ మోహన్ కుటుంబంతో కీరవాణి వియ్యం
టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆస్కార్ అవార్డ్‌తో తెలుగు పరిశ్రమను ప్రపంచానికి తెలిపిన ఎమ్.ఎమ్ కీరవాణి కుమారుడు హీరో శ్రీసింహ పెళ్లి పీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది. నిర్మాత, సినీ నటుడు,వ్యాపారవేత్త అయిన మురళీ మోహన్ మనుమరాలితో శ్రీసింహ ఏడు అడుగులు వేయనున్నాడని సమాచారం. శ్రీసింహ ఇప్పటికే భాగ్ సాలే, మత్తు వదలరా, ఉస్తాద్ వంటి చిత్రాల్లో నటించి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా తన బాబాయ్ రాజమోళితో పాటు పలు సినిమాలకు కూడా పనిచేశాడు. మురళీ మోహన్‌కు ఒక అమ్మాయితో పాటు రామ్ మోహన్ అనే అబ్బాయి ఉన్నారు. ఆయన కుమార్తెనే శ్రీసింహకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు. రామ్ మోహన్- రూప మాగంటిలకు జన్మించిన ఏకైక కుమార్తె పేరు 'రాగ' కొద్దిరోజుల క్రితమే ఆమె ఐఎస్బీలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. 'రాగ' కూడా అందులోనే పలు కీలక బాధ్యతల్లో వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి కూడా మురళీ మోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచాయాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు 'రాగ'ను ఇచ్చి వివాహం చేయాలనే ఆలోచనకు ఇరుకుటుంబాలు వచ్చాయని తెలుస్తోంది. కానీ ఈ వివాహం గురించి రెండు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ విషయం ప్రచారంలో మాత్రమే ఉంది. -
ప్రముఖ ఓటీటీలోకి వచ్చేస్తున్న బెస్ట్ హర్రర్ తెలుగు సినిమా
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో పి.వాసు తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘చంద్రముఖి 2’. రజనీకాంత్ హిట్ సినిమా ‘చంద్రముఖి’కి ఇది సీక్వెల్‌గా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రాఘవ లారెన్స్ భారీగానే ప్రమోషన్స్ నిర్వహించారు. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన చంద్రముఖి 2 మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: తెలుగులో ఆ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ వస్తే చేస్తా: ఆర్కే రోజా) దీంతో సినిమా చూద్దాం అనుకున్న వారందరూ కూడా ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అని సరిపెట్టుకున్నారు. ఈ సినిమా వల్ల సుమారు రూ. 20 కోట్ల మేరకు నిర్మాతలు నష్టపోయారని టాక్. తెలుగు వెర్షన్ అయితే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. థియేటర్లో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కానీ చంద్రముఖి 2 సినిమా విడుదలైన కొద్దిరోజులకే ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. తమిళ వెర్షన్‌కు సంబంధించి హెచ్డీ ప్రింట్‌ను పైరసీ సైట్‌తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అయింది. థియేటర్లో చంద్రముఖి 2 చిత్రాన్ని చూడలేకపోయిన వారు అక్టోబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. కానీ ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. చంద్రముఖి 2 సినిమాలో మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సుభీక్ష ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించారు. -
సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!
ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుక దుబాయ్‌లో ప్రారంభం అయింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించే ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా). గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ హీరో రానా, మంచు లక్ష్మీ ప్రధాన వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 15న మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక పూర్తి అయింది. నేడు సెప్టెంబర్ 16న తమిళ్,మలయాళం ఇండస్ట్రీకి చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. సైమాలో దుమ్ములేపిన RRR, సీతా రామం ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్‌నే కాదు, రికార్డులను కూడా కొల్లగొట్టింది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్టేజిల మీద ఆస్కార్‌తో సహా ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా సైమాలో కూడా రికార్డులను బ్రేక్ చేసింది. ఏకంగా సైమా అవార్డుల రేసులో 11 నామినేషన్స్‌లలో చోటు దక్కించుకొని 5 కీలకమైన అవార్డులను దక్కించుకుంది. సీతా రామం చిత్రానికి గాను మూడు అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా సీతా రామం నిలిచింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం: సీతా రామం * ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (RRR) * ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (RRR) * ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడివి శేష్ (మేజర్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతా రామం) * ఉత్తమ సహాయ నటుడు: రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్) * ఉత్తమ సహాయ నటి: సంగీత(మసూద) * ఉత్తమ నూతన నటి : మృణాల్ ఠాకూర్ (సీతా రామం) * ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి(RRR) * ఉత్తమ గేయ రచయిత 'నాటు నాటు' పాట కోసం: చంద్రబోస్ (RRR) * ఉత్తమ గాయకుడు : మిర్యాల రామ్ (DJ టిల్లు) టైటిల్ సాంగ్ కోసం * ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: సింగర్ మంగ్లీ (ధమాకా) 'జింతక్' పాట కోసం * ఉత్తమ విలన్ : సుహాస్ (హిట్ - 2) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (RRR) * ఉత్తమ నూతన దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార) * సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2) * ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2) * ఉత్తమ నూతన నిర్మాతలు : శరత్, అనురాగ్ (మేజర్) * ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్ * ప్రామిసింగ్ న్యూకమ్: వినోద ప్రపంచంలో భవిష్యత్‌లో మంచి స్టార్‌గా గుర్తింపు పొందిన గణేష్ బెల్లంకొండ -
పాటలు.. నా సామి రంగ
కొత్త సినిమా కోసం మ్యూజిక్ ఆన్ చేశారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున హీరోగా నటించనున్న చిత్రం ‘నా సామిరంగ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, విజయ్ బిన్ని ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు. యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ‘నా సామిరంగ’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నా జీవితంలో ఇదే మొదటిసారి: కంగనా
గతంలో రజనీకాంత్ కథానాయకుడు నటించిన 'చంద్రముఖి' చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'చంద్రముఖి–2'. ఆ చిత్ర దర్శకుడు పి.వాసు దీనికి దర్శకత్వం వహించారు. లారెన్స్ కథానాయకుడిగా నటించిన ఇందులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటించడం విశేషం. నటుడు వడివేలు ముఖ్యపాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఆర్డి రాజశేఖర్ అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ భారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని వినాయక చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక విశ్వవిద్యాలయంలో చంద్రముఖి–2 చిత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ తనను మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమకు తీసుకువచ్చిన లైకా ప్రొడక్షన్న్స్కు, పి.వాసుకు కతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలు ఉంటాయని చెప్పారు. నిర్మాత సుభాస్కరన్ తమిళ సినిమాకు దక్కిన భాండాగారం అని దర్శకుడు పి.వాసు పేర్కొన్నారు. కంగనారనౌత్ మాట్లాడుతూ తన జీవితంలో ఇప్పటివరకు ఎవరి వద్ద ఎలాంటి అవకాశాన్ని కోరలేదు అన్నారు అలాంటిది దర్శకుడు పి. వాసు వద్ద చంద్రముఖిగా నటించడానికి తాను నప్పుతానా అని అడిగాను అన్నారు. అందుకు ఆయన కొంచెంసేపు ఆలోచించి ఓకే అని చెప్పారన్నారు. లారెన్స్ మాట్లాడుతూ తాను సహాయ నృత్య కళాకారుడుగా నటిస్తున్నప్పుడే పి వాసు దర్శకత్వం వహించిన చిత్రాలకు పనిచేశానన్నారు. (ఇదీ చదవండి: ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్' ఫేమ్ జాఫర్ సాదిఖ్.. ఆమె ఎవరంటే) ఆ తర్వాత నృత్య దర్శకుడుగా, నటుడుగా, దర్శకుడుగా చిత్రాలు చేసిన తాను కథానాయకుడిగా నటించిన చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారన్నారు. ఇలా 40 ఏళ్లకుపైగా పి వాసు సక్సెస్ఫుల్ దర్శకుడుగా కొనసాగుతున్నారని అన్నారు. తాను ఈ చిత్రంలో వేట్టైయాన్ పాత్రలో నటించానని, దీనికి లభించే ప్రశంసలన్నీ ఆయనకే చెందుతాయని లారెన్స్ పేర్కొన్నారు. -
'జెంటిల్ మేన్ 2' ప్రారంభం
ముప్పైఏళ్ల క్రితం అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్ మేన్’ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత నిర్మించిన ‘ప్రేమ దేశం’, ‘రక్షకుడు’ వంటివి కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. చాలా గ్యాప్ తర్వాత కుంజుమోన్ ‘జెంటిల్ మేన్ 2’కి శ్రీకారం చుట్టారు. చేతన్ శ్రీను హీరోగా గోకుల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో తమిళనాడు సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖా మంత్రి ఎల్. మురుగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతదర్శకుడు. ఈ వేదికపై కీరవాణిని సన్మానించారు కుంజుమోన్. ‘‘ప్రతి ఒక్కరూ జెంటిల్‌మేన్ అవ్వాలి అనేది ఈ చిత్రం ప్రధానాంశం’’ అన్నారు కుంజుమోన్. -
చంద్రముఖి 2 ప్రాణభయం.. 2 నెలలు నిద్రలేని రాత్రులు: కీరవాణి
హారర్ సినిమాల్లో చంద్రముఖిది ప్రత్యేక స్థానం. కామెడీ, ఎమోషన్స్, హారర్.. ఇలా అన్నింటి మేళవింపుగా వచ్చిన చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో భయమంటే తెలియనివారికి కూడా భయాన్ని పరిచయం చేసింది. అంతటి సెన్సేషన్ మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! ఇటీవలే చంద్రముఖి 2 సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీమీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే లారెన్స్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశాడు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కీరవాణి చంద్రముఖి సినిమాపై సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 'చంద్రముఖి 2 సినిమా చూశాను. సినిమాలోని పాత్రలకు మరణభయంతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. నా పరిస్థితి కూడా అంతే! అద్భుతమైన సన్నివేశాలకు సంగీతంతో ప్రాణం పోసేందుకు రెండు నెలలపాటు నిద్రలేని రాత్రులు గడిపాను. గురు కిరణ్, నా స్నేహితుడు విద్యాసాగర్.. నాకు విజయం అందాలని కోరుకోండి' అని ట్వీట్ చేశారు. కీరవాణి ఇచ్చిన హైప్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. Watched @LycaProductions Chandramukhi 2. The characters in the movie spend sleepless nights from fear of DEATH . for me 2 months of sleepless days and nights for adding LIFE to the mind blowing scenes with my efforts. GuruKiran & my friend Vidyasagar pls wish me the best 🙏🙏 — mmkeeravaani (@mmkeeravaani) July 23, 2023 చదవండి: బేబీ రనౌత్ రాక కోసం వెయిటింగ్.. సీమంతం ఫోటోలు షేర్ చేసిన కంగనా అమ్మ బాలేదని వీడియో... ఇంతలోనే కొత్త కారు కొన్న ముక్కు అవినాశ్ -
ఆస్కార్‌లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ
ప్రతి ఏడాది ఆస్కార్ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్ కీలకంగా నిలుస్తుంది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్ ఆఫ్ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్ వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు 15 మందికి ఆహ్వానం అందడం విశేషం. తెలుగు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో ఆరుగురు, తమిళం నుంచి మణిరత్నం, బాలీవుడ్‌నుంచి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వంటివారు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ ‘క్లాస్ ఆఫ్ 2023’ జాబితాను తయారు చేసినట్లు అకాడమీ పేర్కొంది. ఈ 398 మందిలో 51 దేశాలకు చెందినవారు ఉండగా, వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్‌కు చెందనివారు ఉన్నట్లుగా ఆస్కార్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్ మెంబర్‌షిప్‌లు కలిగి ఉన్నవారి సంఖ్య 10, 817కు చేరినట్లు హాలీవుడ్ అంటోంది. ఆర్ఆర్ఆర్ నుంచి ... ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అలాగే ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌లు కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులు కానున్నారు. దర్శకులు మణిరత్నం, షౌనక్ సేన్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ దర్శకుడు), నిర్మాతలు కరణ్ జోహర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపబడిన గుజరాతీ ఫిల్మ్ ‘ది ఛెల్లో షో’ నిర్మాత), చైతన్య తమ్హానే (మరాఠీ), ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీకి చెందిన గిరీష్ బాలకృష్ణన్, క్రాంతి శర్మ, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌లు హరేష్ హింగో రాణి, పీసీ సనత్, ఫిల్మ్ ఎగ్జిక్యూ టివ్‌లు శివానీ రావత్, శివానీ పాండ్యా మల్హోత్రా వంటివారు ఉన్నారు. గర్వంగా ఉంది – రాజమౌళి ‘‘ఆస్కార్ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి ఆరుగురికి ఇన్విటేషన్స్ రావడం గర్వంగా ఉంది. వీరితో పాటు భారతదేశం తరఫున ఆస్కార్ ఆహ్వానం అందుకున్నవారికి కూడా నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. కొత్త రూల్ ఓ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. యూఎస్‌లోని ఆరు ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో) ఆ సినిమా కనీసం ఏడు రోజులు ప్రదర్శితం కావాలి. వీటిలో ఒక షో సాయంత్రం ప్రైమ్ టైమ్‌లో ఉండాలి, థియేటర్స్‌లో కనీస సీటింగ్ సామర్థ్యం ఉండాలి. తాజాగా బెస్ట్ పిక్చర్, ఫారిన్ బెస్ట్ ఫిల్మ్ విభాగాలకు సంబంధించి కొత్త రూల్ పెట్టనున్నారట. ఇకపై ఆస్కార్‌కు ఓ సినిమాను పంపాలంటే యూఎస్‌లోని పాతికకు పైగా మూవీ మార్కెట్స్ ఉన్నచోట సినిమాలు ప్రదర్శించబడాలట. అది కూడా రెండువారాలకు పైగా. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ కొత్త రూల్‌ను 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం (2025) నుంచి అమలులోకి తేవాలని అవార్డ్ కమిటీ ప్లాన్ చేస్తోందన్నది హాలీవుడ్ టాక్. ఆ నలుగురికీ గౌరవం ‘‘ఈ నలుగురూ చలన చిత్రపరి శ్రమలో మంచి మార్పుకు నాంది అయ్యారు. తర్వాతి తరం ఫిల్మ్ మేకర్స్‌కి, ఫ్యాన్స్‌కి స్ఫూర్తిగా నిలిచారు. వీరిని సత్కరించడం ‘బోర్డ్ ఆఫ్ గవర్నర్స్’కి థ్రిల్‌గా ఉంది’’ అని ఆస్కార్ అకాడమీ అవార్డ్ అధ్యక్షుడు జానెట్ యాంగ్ అన్నారు. సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘గవర్నర్ అవార్డ్స్’లో భాగంగా హానరరీ ఆస్కార్ అవార్డ్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ గౌరవ ఆస్కార్‌ను అందుకోనున్న నలుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. నటి ఏంజెలా బాసెట్, రచ యిత–దర్శకుడు–నటుడు–గేయ రచయిత మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్లతో పాటు సన్డాన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన మిచెల్ సాటర్‌లకు అవార్డును అందజేయనున్నారు. నవంబర్ 18న లాస్ ఏంజెల్స్‌లోని ఫెయిర్మాంట్ సెంచరీ ప్లాజాలో జరిగే వేడుకలో ఈ నలుగురూ గౌరవ పురస్కారాలు అందుకుంటారు. -
RRR: ఆస్కార్ సభ్యుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయంటే
ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ఈ ఏడాదిలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 23 విభాగాల్లోని విజేతలను ప్రకటించి వారికి అవార్డులను కూడా అందజేశారు. 95వ ఆస్కార్ వేడుకలలో భాగంగా టాలీవుడ్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నామినేట్ అయిన.. ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచింది. ఈ సాంగ్‌ను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ స్టేజ్ పై అవార్డులు అందుకున్నారు. ఈ పాటకు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ అదిరిపోయే డ్యాన్స్‌తో మెప్పించారు. దర్శక ధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా స్థాయిని ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ గెలిచే వరకూ తీసుకొని వెళ్లాడు. ఒక్క ‘నాటు’ దెబ్బతో ఆస్కార్ గెలవడమే కాదు ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యే అంత గొప్ప స్థానం టాలీవుడ్‌కు దక్కింది. (ఇదీ చదవండి: 'తీవ్రమైన ఇన్ఫెక్షన్'తో ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్) తాజాగా ఆస్కార్ ప్యానెల్ నుంచి టాలీవుడ్‌కు మరో శుభవార్త అందింది. రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, కరణ్ జోహార్లతో పాటు ఎంఎం కీరవాణి, చంద్రబోస్, సాబు సిరిల్, మణిరత్నం, సెంథిల్ కుమార్, చైతన్య తమహనే, షౌనెక్ సేన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్లకు ఆస్కార్ ప్యానెల్లో చోటు దక్కింది. రాబోయే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాల్లో వీరందరికీ ఓటు హక్కు ఉంటుంది. అకాడమీ సభ్యులు మాత్రమే ఆస్కార్ విజేతలకు ఓటు వేయగలరు. వచ్చే ఏడాది ఆస్కార్ వేడుకలు మార్చి 10న జరగనున్నాయి. కాబట్టి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కీరవాణి కూడా ఓటు వేయనున్నారు. దీనిలో భాగంగా 2023లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో చేరడానికి 398 మంది వ్యక్తుల జాబితాలో దాదాపు డజను మంది భారతీయ కళాకారులు ఉన్నారు, ఇందులో "RRR" చిత్రం యొక్క దిగ్గజ నటుల కాంబో, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, MM కీరవాణి,చంద్రబోస్ ఉన్నారు. అస్కార్ బరిలో నిలిచే చిత్రాలకు తెలుగు పరిశ్రమ నుంచి ఈ నలుగురికి మాత్రమే ఓటు హక్కు కలిగి ఉంటుంది. వీరి సభ్యత్వం లైఫ్ టైమ్ ఉంటుంది. కానీ దర్శకధీరుడు రాజమౌళి ఈ జాబితాలో చోటు దక్కలేదు. (ఇదీ చదవండి: SPY Review: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!) ఈ జాబితాలోని సభ్యుల గురించి అకాడమీ CEO బిల్ క్రామెర్, అకాడమీ ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ ఇలా అన్నారు. 'ఈ కళాకారులు, నిపుణులను మా (ఆస్కార్) సభ్యత్వంలోకి స్వాగతిస్తున్నందుకు అకాడమీ గర్విస్తోంది. వారు సినిమా విభాగాల్లో అసాధారణమైన ప్రతిభతో ప్రపంచాన్ని మెప్పించారు. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర అభిమానులపై కీలకమైన ప్రభావాన్ని చూపారు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం అకాడమీలో 10,000 మందికి పైగా సభ్యులుగా ఉన్నారు. అకాడమీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఏడాది 40 శాతం మంది మహిళలకు చోటు కల్పించారు. ప్రతి ఏడాది విడుదలయై అస్కార్ ప్యానెల్ జాబితాలో ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ నుంచే ఉండేవారు. కానీ 2023లో మాత్రం ఇతర దేశాలకు చెందిన కళాకారులు ఎక్కువగా ఉండటం విశేషం. We’re proud to announce our newly invited members to the Academy! Meet the Class of 2023: https://t.co/xElbKejirD pic.twitter.com/9IqEmbU6GD — The Academy (@TheAcademy) June 28, 2023 -
27 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళ సినిమాకు కీరవాణి సంగీతం
‘నాటు.. నాటు...’ అంటూ దేశీ ట్యూన్‌తో దేశీయులతోనే కాదు... విదేశీయులతో కూడా స్టెప్పులేయించారు ఎంఎం కీరవాణి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’లోని ఈ పాట ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కీరవాణిని అందరూ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. నిజానికి ఆయన ఎప్పుడో పాన్ ఇండియా సంగీతదర్శకుడు. (చదవండి: త్వరలో భోళా మానియా) తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల చిత్రాలకు సంగీతం అందించారు. కాగా 27ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన మలయాళ సినిమా ‘మెజీషియన్’ అంగీకరించారు. గతంలో మలయాళంలో ‘దేవరాగం’ (1996)కి సంగీతదర్శకుడిగా వ్యవహరించారు. ఇక ‘మెజీషియన్’కి కీరవాణి మూడు పాటలకు స్వరాలందిస్తారని తెలిసింది. బేబీ జాన్ వల్యత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
నాటు నాటు నా టాప్ సాంగ్స్ లిస్టులోనే లేదు: కీరవాణి షాకింగ్ కామెంట్స్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలూగించిందో అందరికీ తెలిసిందే! ప్రపంచమే మెచ్చిన ఈ పాట బెస్ట్ ఒరిజినల్ విభాగంలో ఆస్కార్ అందుకుని చరిత్ర సృష్టించింది. ఈ పాటను అందిచిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తాజాగా నాటునాటు పాటపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌గోపాల్ వర్మ తన యూట్యూబ్ ఛానల్లో కీరవాణిని ఇంటర్వ్యూ చేశారు. 'ఆస్కార్ వెనుక నాటు నిజం' పేరుతో తాజాగా ఈ ఎపిసోడ్ రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవీ తనదైన స్టైల్లో ప్రశ్నలు అడిగారు. 'నాటు నాటు పాటకు మీరు కాకుండా ఇతరులు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసుంటే ఆస్కార్ పొందే అర్హత ఆ పాటకు ఉందని ఫీలయ్యేవారా?' అని ఆర్జీవీ ప్రశ్నించారు. దీనికి కీరవాణి మాట్లాడుతూ.. ఆ పాటకు ఆస్కార్ రావడానికి చాలా కారణాలున్నాయి. కేవలం ఒక పాటగా తీసుకుంటే మాత్రం ఆస్కార్ వచ్చినందుకు నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే జయహో పాటకు ఆస్కార్ వచ్చినప్పుడు కూడా ఫీలవలేదు కాబట్టి! అని ఆన్సరిచ్చారు. 'నాటు నాటు పాట మీ కెరీర్లో టాప్ 100 సాంగ్స్‌లో ఉందని అనుకుంటున్నారా?' అని వర్మ ప్రశ్నించగా లేదని బదులిచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. 'ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు అవతలి వాళ్లకు నచ్చాలని మనం పని చేస్తున్నప్పుడు ముందు అది మనకు నచ్చాలి. నాకే నచ్చకపోతే ప్రపంచానికి ఎలా నచ్చుతుందని అనుకుంటాను? కొన్ని సార్లు ముందు నాకు నచ్చాలని చూస్తాను, మరికొన్ని సార్లు అవతలివాళ్లకు నచ్చాలని భావిస్తాను. ఇది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది' అని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'ఆస్కార్ కమిటీలో ఓటు వేసే వాళ్లు దాదాపు పదివేల మంది దాకా ఉన్నారు. వీరంతా కూడా ఆస్కార్ ఎంట్రీకి వచ్చినవాటిలో కొన్నింటిని చూడకుండా వదిలేయవచ్చు. కాబట్టి మా సినిమా చూసి ఓటేయండి అని మనమే ప్రచారం చేసుకోవాలి. అలా వాళ్లు ఆర్ఆర్ఆర్ సినిమా చూసే క్రమంలో పాత్రలు, కథ నచ్చి అందులో లీనమైపోయి నాటు నాటు పాట వచ్చేసరికి చప్పట్లు కొడుతూ దాన్ని ఎంజాయ్ చేసుంటారు. ఓవరాల్ సినిమా ఇంపాక్ట్ ఆ పాట మీద ఉండటంతో నాటునాటుకు ఓటు వేశారని నేను నమ్ముతున్నాను' అని తెలిపారు. Here’s my #RGVNijam full interview with OSCAR @mmkeeravani https://t.co/rSYMS1C5lS — Ram Gopal Varma (@RGVzoomin) April 28, 2023 చదవండి: అందరిముందు ఎన్టీఆర నా కాళ్లు పట్టుకున్నారు: రోజా రమణి పెళ్లై ముగ్గురు పిల్లలున్న హీరోను ప్రేమించిన హీరోయిన్.. పెళ్లి చేసుకున్నాక చిత్రహింసలు -
ఆస్కార్ తీసుకునే రోజు ఏం జరిగిందో చెప్తూ ఎమోషనల్ అయిన కీరవాణి
-
ఆస్కార్ విజేతలకు అరుదైన బహుమతి ఇచ్చిన సినీ పరిశ్రమ
-
వరంగల్ స్టూడెంట్ ఇవాళ ఆస్కార్‌ను తీసుకొచ్చాడు: అల్లు అరవింద్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డ్ దక్కింది. దీంతో టాలీవుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందాన్ని ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికపై ఆర్ఆర్ఆర్ టీంకు అభినందన సభ నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ. 'కలలో కూడా కనలేని ఆస్కార్ ఈ రోజు రాజమౌళి టీం వల్ల సాధ్యమైంది. క్షణక్షణం నుంచి మొదలైన కీరవాణి ప్రస్థానం ఈ రోజు ఆస్కార్ అందుకునే స్థాయికి వచ్చింది. వరంగల్‌లో చదువుకుంటున్న ఒక స్టూడెంట్ ఈ రోజు ఎక్కడో ఉన్న ఆస్కార్‌ను తీసుకొచ్చాడు. అతనే చంద్రబోస్. ఈ రోజు తెలుగు సినిమా అంటే అందరూ తిరిగి చూసే స్థాయికి తీసుకొచ్చారు. రాజమౌళి చిత్రబృందం తెలుగు సినిమాస్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. చంద్రబోస్ మాట్లాడుతూ..' సినీ ఇండస్ట్రీ అంత మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు కీరవాణి మాటలతో నా జీవిత గమనం మార్చింది. ఆస్కార్ ఎనౌన్స్ చేసేటప్పుడు నేను భయంతో కీరవాణి చెయ్యి పట్టుకున్నా. ఆస్కార్ పట్టుకున్న వెంటనే భారతీయ కీర్తి పతాకాన్ని పట్టుకున్నాననే భావన కలిగింది. ఆస్కార్ అందుకోవడం నా జన్మలో చేసుకున్న అదృష్టం. కీరవాణితో నాది 28 ఏళ్ల అనుబంధం. బాహుబలిలో నాకు అవకాశం రాకున్నా.. ఆర్ఆర్ఆర్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుని సహనంతో ఉండి ఈ పాట రాయడానికి దాదాపు 17 నెలలు పట్టింది.' అని అన్నారు. సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి మాట్లాడుతూ:.. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం వెనుక మూల విగ్రహాలు రాజమౌళి, ప్రేమ్ రక్షిత్. నేను చంద్రబోస్ ఉత్సవ విగ్రహాలు మాత్రమే. తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు ఒక్కచోట చేరి ఇలా పండుగ చేసుకోవడం సంతోషంగా ఉంది. నా మొట్ట మొదటి పాట చేసింది చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న థియేటర్ అది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయిన నాకు కృష్ణంరాజు సూర్యనారాయణ రాజు ఇచ్చారు. ఆస్కార్ వల్ల నేను ఎక్సయిటింగ్ అవ్వలేదు. నిజంగా ప్రతిష్టాత్మకమైన అవార్డ్. ఈ పాటకు అందరూ ఎంతో కష్టపడి చేశారు. ఈ సినిమా కోసం ఆస్కార్ మెంబర్స్‌కి షోస్ వేసి చూపించాం. వాళ్లకు నచ్చింది. అందరూ సమిష్టిగా చేసిన కృషికి లభించిన విజయానికి మీరందరు వేడుక చేయడం సంతోషంగా ఉంది.' అని అన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ..' ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. బాహుబలి సినిమాతో టాలీవుడ్ విశ్వ వ్యాప్తంగా విస్తరించింది. ఆ సినిమాకు కూడా ఆస్కార్ అవార్డ్స్ రావాల్సింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా సీఎం కేసీఆర్, ప్రభుత్వం సహకారం అందించింది. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు తెలుగులోనూ వస్తున్నాయి. లక్షలాది మందికి అన్నం పెడుతున్న పరిశ్రమ తెలుగు సినిమా. పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం.' అని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ' ఈరోజు ఆస్కార్ అవార్డు రావడం సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. తెలంగాణ వస్తే సినీ పరిశ్రమ వస్తే ఏమౌతుందోనని అనుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా మా పోరాటం పాలకుల మీద కానీ ప్రజల మీదకు కాదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ భాషను యాసను సినిమాల్లో అవమానించేవారు అని మేము బాధ పడేటోళ్లం. కానీ ఈరోజు గర్వపడుతున్నాం. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలినేదే మా ధ్యేయం. తెలంగాణలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ షూటింగ్స్ జరుపుకోవడానికి మేము సహకరిస్తాం. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి.' అని అన్నారు. -
పద్మశ్రీ అవార్డు అందుకున్న కీరవాణి.. సుధామూర్తికి పద్మభూషణ్ ప్రధానం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురికి పద్మ అవార్డులు ప్రధానం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థపాకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్ను ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థపాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. సామాజిక సేవ చేసినందుకు ఆమెను ఈ అవార్డు వరించింది. అలాగే చినజీయర్ స్వామి కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరైంది. అలాగే సూపర్ 30 ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వ్యవస్థపాపకుడు ఆనంద్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుని ఈ ఏడాది 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చిలోనే జరిగింది. ఆ రోజు అవార్డు అందుకోలేకపోయిన పలువురికి రాష్ట్రపతి బుధవారం వీటిని ప్రధానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోనే ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ.. -
రామ్‌చరణ్ బర్త్‌డే స్పెషల్.. ఆస్కార్ విజేతలకు చిరు సన్మానం
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌కు ఈ బర్త్‌డే మరింత ప్రత్యేకం. ఆస్కార్ విజయంతో పాటు త్వరలోనే చరణ్ తండ్రిగా ప్రమోట్ కానున్నాడు. దీంతో ఈ పుట్టినరోజు ఉపాసన మరింత స్పెషల్‌గా నిర్వహించింది. ఈ పార్టీకి రాజమౌళి కుటుంబం, నాగార్జున, వెంకటేశ్, కాజల్ అగర్వాల్, అడివి శేష్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక కొడుకు పుట్టినరోజును పురస్కరించుకొని చిరంజీవి ఆస్కార్(నాటు నాటు)విజేతలను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి,నిర్మాత డీవీవీ దానయ్య,సంగీత దర్శకుడు కీరవాణి, నాటునాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరలతో పాటు ఆర్ఆర్ఆర్ టీంలోని రమ, శ్రీవల్లి, ఎస్ఎస్ కార్తికేయలకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువా కప్పి సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజున అయినవాళ్లు, ఆత్మీయుల సమక్షంలో ఆస్కార్ విజేతలను సన్మానించడం నిజంగా ఓ వేడుకలా జరిగిందంటూ చిరంజీవి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
ఆయన మాటలతో ఇక నేను చనిపోయినట్లే: ఆర్జీవీ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీరవాణి ఆర్జీవీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ వస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. అయితే నాకు మాత్రం తొలి ఆస్కార్ రామ్ గోపాల్ వర్మనే అన్నారు. అయితే కీరవాణి ప్రశంసలపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఆయన ఇంటర్వ్యూ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. కీరవాణి అలా మాట్లాడుతుంటే తనకు చనిపోయినా ఫీలింగ్ కలుగుతోందని ఆర్జీవీ అన్నారు. కేవలం చనిపోయిన వారినే అలా పొగుడుతారంటూ ట్వీట్ చేశారు. కీరవాణి ఏమన్నారంటే.. కీరవాణి మాట్లాడుతూ..' నాకు లభించిన తొలి ఆస్కార్ రామ్‌గోపాల్ వర్మ. ఇప్పుడు తీసుకున్నది రెండో ఆస్కార్. కెరీర్ స్టార్టింగ్‌లో నా సంగీత ప్రతిభను గుర్తించేందుకు నా మ్యూజిక్ క్యాసెట్స్‌ను కొందరికి షేర్ చేశా. వాటిని కొందరు డస్ట్‌బిన్‌లో వేశారు. ఇండస్ట్రీకి ఓ స్ట్రేంజర్ వచ్చి నా పాటలు వినండని క్యాసెట్స్ ఇస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు. కానీ ‘క్షణక్షణం’ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మ నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్లో ‘శివ’ ఆస్కార్ రోల్ ప్లే చేస్తే.. నా కెరీర్లో రామ్‌గోపాల్‌వర్మ ఆస్కార్ రోల్ ప్లే చేశారు. రామ్‌గోపాల్‌వర్మతో వర్క్ చేస్తున్నాడు కాబట్టి కీరవాణిని మన సినిమాకి తీసుకుందాం.' అంటూ నాకు అవకాశాలిచ్చారని అన్నారు. Hey @mmkeeravaani I am feeling dead because only dead people are praised like this 😢😩😫 pic.twitter.com/u8c9X8kKQk — Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2023 -
నాటు నాటు పాటకు అవార్డ్ వస్తుందని ఊహించలేదు: కీరవాణి
‘‘నాటు నాటు’ పాటకు అవార్డులు వస్తాయని నేను ఊహించలేదు. ఆస్కార్ అవార్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఈ ‘నాటు నాటు’ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడగా ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. కాగా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం గురించి తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి స్పందించారు. ఓ తమిళ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి చెప్పిన విశేషాల్లో కొన్ని ఈ విధంగా... ► ‘నాటు నాటు’ ఓ కమర్షియల్ సాంగ్... అంతే. ఒక వినూత్నమైన పాటలో మన ప్రతిభను క్లాసికల్ మ్యూజిక్ పరంగా, ఆర్కెస్ట్రాలో కొత్త డిజైనింగ్ కంపోజిషన్, అద్భుతమైన పొయిట్రీ వంటి వాటితో కనబరిచి ఉంటే.. అప్పుడు ఆ పాటకు అవార్డులను ఊహిస్తాం. కానీ ‘నాటు నాటు’ పాట పక్కా ఫాస్ట్ బీట్ కమర్షియల్ నెంబర్. ఆస్కార్‌ని మరచిపోండి.. అసలు ‘నాటు నాటు’ పాటకు నేను ఏ అవార్డునూ ఊహించలేదు. ఈ పాటను రాజమౌళి తీసిన విధానం, ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన విధానానికి మేజర్ క్రెడిట్ దక్కుతుంది. అఫ్కోర్స్ చంద్రబోస్‌కి కూడా. ‘నాటు నాటు వీరనాటు.. నాటు నాటు ఊరనాటు’ అనే ఆ రెండు వాక్యాలు ఒక మంత్రంలాంటివి. వాటిని క్రియేట్ చేసిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డుకి అర్హుడు. ఈ పాటను తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కూడా చేశాం. అక్కడి రచయితలు కూడా వారి స్థాయికి తగ్గట్లుగా బాగానే కష్టపడ్డారు. కానీ తెలుగు వెర్షన్‌కి మంచి సౌండింగ్, రైమింగ్ కుదిరాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ► ఇక నాకు లభించిన తొలి ఆస్కార్ రామ్‌గోపాల్ వర్మగారు. ఇప్పుడు తీసుకున్నది రెండో ఆస్కార్. కెరీర్ స్టార్టింగ్‌లో నా సంగీత ప్రతిభను గుర్తించమన్నట్లుగా నా మ్యూజిక్ క్యాసెట్స్‌ను కొందరికి షేర్ చేశాను. వాటిని కొందరు డస్ట్‌బిన్‌లో వేశారు. ఇండస్ట్రీకి ఓ స్ట్రేంజర్ వచ్చి నా పాటలు వినండని క్యాసెట్స్ ఇస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు. కానీ ‘క్షణక్షణం’ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మగారు చాన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్లో ‘శివ’ ఆస్కార్ రోల్ ప్లే చేస్తే.. నా కెరీర్లో రామ్‌గోపాల్‌వర్మగారు ఆస్కార్ రోల్ ప్లే చేశారు. ‘రామ్‌గోపాల్‌వర్మతో వర్క్ చేస్తున్నాడు కాబట్టి కీరవాణిని మన సినిమాకి తీసుకుందాం’ అంటూ నాకు అవకాశాలు ఇచ్చారు. ► గునీత్ మోంగాగారి (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌లో ఆస్కార్ పొందిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత)కి ఆస్కార్ వేదికపై మాట్లాడటానికి తగిన సమయం దక్కలేదు. దీంతో ఆమె తన యాక్సెప్టెన్సీ స్పీచ్ తర్వాత సరిగా శ్వాస తీసుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. -
కీరవాణి టాప్ ఆఫ్ ది వరల్డ్‌తో హైదరాబాద్‌లో జోష్
-
'నాటు నాటు'లో సంగీతం ఎక్కడుంది?: కీరవాణి తండ్రి ఘాటు కామెంట్స్
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంపై యావత్ భారత్ సంతోషం వ్యక్తం చేసింది. ఇక రాజమౌళి, కీరవాణిల ఫ్యామిలీ ఆనందం మాటల్లో చెప్పలేం. కొడుకు ఉన్నతిని చూసి ఉప్పొంగిపోయాడు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా. అదే సమయంలో ఆయన నాటు నాటు పాటపై చేసి ఘాటు కామెంట్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 'నాకు సినిమా అంటే ప్యాషన్. మేము నలుగురు అన్నదమ్ములం. మేమంతా తుంగభద్ర ఏరియాకు వలస వెళ్లాం. అక్కడ 16 సంవత్సరాలు ఉన్నాం. ఆ ప్రాంతంలో 300 ఎకరాలు కొన్నాను. కానీ సినిమా కోసం భూమినంతా అమ్మేశా. చివరికి ఈరోజు పూట గడవడం ఎలా? అన్న పరిస్థితికి వచ్చాం. ఆ సమయంలో విజయేంద్రప్రసాద్, నేను కలిసి మంచి మంచి కథలు రాశాం. జానకిరాముడు, కొండవీటి సింహం.. ఇలా ఎన్నో హిట్ సినిమాలకు మేము పని చేశాం! కానీ అప్పటిదాకా కీరవాణి చక్రవర్తి దగ్గర పని చేస్తే వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది. కీరవాణి నా పంచప్రాణాలు. మూడో ఏట నుంచే అతడికి సంగీతం నేర్పాను. తన టాలెంట్ చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. కానీ ఆర్ఆర్ఆర్లో నాటు నాటు పాట నాకు నచ్చలేదు. అసలు అది ఒక పాటేనా? అందులో సంగీతం ఎక్కడుంది. విధి విచిత్ర వైచిత్రమిది. కానీ ఇన్నాళ్లూ అతడు చేసిన కృషికి ఈ రూపంలో ఫలితం వచ్చింది. చంద్రబోస్ రాసిన 5 వేల పాటల్లో ఇదొక పాటా? కీరవాణి ఇచ్చిన సంగీతంలో ఇదొక మ్యూజికేనా? ఏమాటకామాటే.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంది. దానికి తారక్, చరణ్ డ్యాన్స్ మహా అద్భుతం. వీళ్ల కృషి వల్ల ఆస్కార్ దక్కడం గర్వించదగ్గ విషయం' అన్నారు శివశక్తి దత్తా. -
ఆస్కార్‌తో తిరిగొచ్చిన RRR టీమ్, జై హింద్ అంటూ..
ఆర్ఆర్ఆర్ అనుకున్నది సాధించింది. తెలుగువారికి అందనంత ఎత్తులో ఉన్న ఆస్కార్‌ను అందిపుచ్చుకుంది. మహామహుల సమక్షంలో నాటు నాటు పాటకు కీరవాణి, చంద్రబోస్ అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సంతోషంలో చిత్రయూనిట్‌కు అమెరికాలో ఆస్కార్ పార్టీ ఇచ్చాడు రాజమౌళి. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌కు వచ్చేయగా తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ విజయదరహాసంతో నగరానికి చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు ఆస్కార్ అవార్డుతో రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి, కార్తికేయ, కాలభైరవ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అయితే మీడియాతో మాట్లాడకుండా జైహింద్.. అంటూ అక్కడి నుంచి రాజమౌళి వెళ్లిపోయాడు. చదవండి: తొలిసారి నెగెటివ్ రోల్లో ఒకరు, ఎమోషనల్ క్యారెక్టర్లో మరొకరు -
ఇదెంతో స్పెషల్ గిఫ్ట్.. మా అన్నయ్య ఏడ్చేశాడు: రాజమౌళి
ఆస్కార్ విజయంతో ఆర్ఆర్ఆర్ పేరు ప్రపంచస్థాయిలో మార్మోగిపోతోంది. నాటు నాటు పాటకు సంగీతం అందించిన ఎమ్ఎమ్ కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌ను వేనోళ్ల కొనియాడుతున్నారు. తాజాగా వీరికి ఆస్కార్‌కు మించిన బహుమతి లభించింది. ఆస్కార్ కన్నా గొప్ప బహుమతి ఏముంటుంది అంటారా? కీరవాణి ఎంతగానో ఆరాధించే వ్యక్తి నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నాడు. అమెరికన్ సింగర్ రిచర్డ్ కార్పెంటర్ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను, ప్రత్యేకంగా కీరవాణి, చంద్రబోస్‌లను అభినందిస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో రిచర్డ్‌తో పాటు అతడి కుటుంబం అంతా కలిసి శుభాకాంక్షలను పాట రూపంలో వెల్లడించారు. ఈ వీడియోపై రాజమౌళి స్పందిస్తూ.. 'సర్, ఆస్కార్ క్యాంపెయిన్‌లో మా అన్నయ్య ఎంతో కామ్‌గా ఉన్నాడు. ఆస్కార్‌కు ముందు, తర్వాత.. ఎప్పుడూ తన ఎమోషన్స్ బయటపెట్టలేదు. కానీ ఎప్పుడైతే ఈ వీడియో చూశాడో ఆ క్షణం తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. తనకు తెలియకుండానే చెంపలపై కన్నీళ్లు జాలువారాయి. మీ గిఫ్ట్ మా కుటుంబం అంతా గుర్తుంచుకుంటుంది. థాంక్యూ సో మచ్ అని' కామెంట్ చేశాడు. కీరవాణి ట్విటర్లో ఈ వీడియో షేర్ చేస్తూ.. 'నేను ఊహించని గిఫ్ట్ ఇది. సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ ప్రపంచంలో నాకు దక్కిన అత్యంత విలువైన గిఫ్ట్' అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. View this post on Instagram A post shared by Richard Carpenter (@richardcarpenterofficial) https://t.co/va5tOLD1DH This is something I didn’t expect at all ..tears rolling out of joy ❤️❤️❤️ Most wonderful gift from the Universe 🙏 — mmkeeravaani (@mmkeeravaani) March 15, 2023 -
ఆర్ఆర్ఆర్కు 'ఆస్కార్' పార్టీ ఇచ్చిన రాజమౌళి
95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం) ముగిసిన విషయం తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆస్కార్ వేడుకను ఎక్కువమంది వీక్షించారు. 2021లో తక్కువగా దాదాపు 10 మిలియన్ (కోటి మంది) వ్యూయర్షిప్, 2022లో 16.6 మిలియన్ల వ్యూయర్షిప్ నమోదు కాగా ఈ ఏడాది వేడుకను 18.7 (కోటీ 87 లక్షలు) మిలియన్ల మంది వీక్షించారు. గత ఏడాదితో పోల్చితే 12 శాతం ఎక్కువ వ్యూయర్షిప్ నమోదైంది. అయితే ఆస్కార్ వ్యూయర్షిప్ విషయంలో ఇదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే 1998లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని 57 (5 కోట్ల 70 లక్షలు) మిలియన్ల మంది వీక్షించారు. ఈసారి సోషల్ మీడియాలో కూడా ఆస్కార్ వేడుక టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వేడుకకు 27.4 (27 కోట్ల 4 లక్షలు) మిలియన్ల ఇంట్రాక్షన్స్ సోషల్ మీడియాలో నమోదయ్యాయని హాలీవుడ్ గణాంకాలు చెబుతున్నాయి. ఇటు టెలివిజన్ వ్యూయర్షిప్ రేటింగ్స్ కూడా స్వల్పంగా పెరిగింది. కాగా ఆస్కార్ ఆవార్డు వేడుక అనంతరం కమిటీ గ్రాండ్‌గా ‘ఆఫ్టర్’ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఉపాసన, దీపికా తదితరులు పాల్గొన్నారు. రాజమౌళి ఇంట్లో పార్టీ ‘‘మేం కచ్చితంగా ఆస్కార్ గెలుస్తామని ముందు నుంచి యూనిట్ అంతా నమ్మకంగా ఉన్నాం. ఆస్కార్ అందుకోవడమా? లేదా ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ను ప్రదర్శించడమా.. ఈ రెండింటిలో ఏ క్షణాలు అపూరమైనవి అని నన్ను అడిగితే... ఎంచుకోవడం నాకు చాలా కష్టం. ‘నాటు నాటు’ పాటను వేదికపై ప్రదర్శిస్తున్నంతసేపు వీక్షకులు క్లాప్ కొడుతూ, సాంగ్ పూర్తయ్యాక స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం అనేది నన్ను ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంపై నిలబెట్టినట్లయింది. అలాగే ఆస్కార్ అవార్డు ఆయన్ను (కీరవాణిని ఉద్దేశిస్తూ..) కూడా ఆ శిఖరాగ్రాన నిలబెట్టింది’’ అని పేర్కొన్న రాజమౌళి ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆ ఆనందంలో లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో ‘ఆర్ఆర్ ఆర్’ టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీని రాజమౌళి భార్య రమ, ఆయన తనయుడు కార్తికేయ హోస్ట్ చేశారు. ఈ పార్టీలో కీరవాణి పియానో ప్లే చేయగా, అక్కడ ఉన్నవారు పాట పాడారు. ఈ సెలబ్రేషన్స్‌ను రామ్ చరణ్ వీడియో తీశారు. ఈ ఫోటోలను ఉపాసన షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల్లో తారక్ కనిపించకపోవడంతో అసలు తను పార్టీకి హాజరయ్యాడా? లేదా? అని ఆలోచిస్తున్నారు అభిమానులు. భారతీయుల మనసు గెలిచిన లేడీ గగా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చిందని ప్రకటించగానే.. రాజమౌళి ఆనందంతో చప్పట్లు కొట్టి, తన భార్య రమను హత్తుకున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ సినిమాకి సంబంధించినవారిగా ఆ విధంగా ఆనందపడటం సహజం. అయితే అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, యాక్ట్రస్ లేడీ గగా చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో పోటీలో ఉన్న ‘నాటు..’తో పాటు ‘టాప్‌గన్: మ్యావరిక్’ చిత్రం కోసం పాడిన ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటకు లేడీ గగా నామినేషన్ దక్కించుకున్నారు. తన పాటకు కాకుండా ‘నాటు..’కు వచ్చినప్పటికీ చప్పట్లతో అభినందించడం ఆమె సంస్కారానికి నిదర్శనం అని నెటిజన్లు అభినందిస్తున్నారు. సోషల్ మీడియా అండ్ న్యూస్ మీడియా ట్రెండ్స్‌ను విశ్లేషించే అమెరికాకి చెందిన నెట్‌బేస్ క్విడ్ కొన్ని గణాంకాలను వెల్లడించింది. ఆ లెక్కల ప్రకారం (వేడుక జరిగిన సమయంలో..) టాప్ మెన్షన్డ్ యాక్టర్స్ జాబితా తొలి స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాలు వరుసగా రామ్‌చరణ్, కి హుయ్ క్వాన్ (ఉత్తమ సహాయనటుడు), బ్రెండెన్ ఫ్రాసెర్ (ఉత్తమ నటుడు), పెడ్రోపాస్కల్ నిలిచారు. ఇక నటీమణుల విషయానికొస్తే.. మిషెల్ యో (ఉత్తమ నటి) అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో వరుసగా మిచెల్ యో, లేడీ గగా, ఏంజెలా బాసెట్, ఎలిజిబెత్ ఒల్సెన్, జామిలీ కర్టీస్ (ఉత్తమ సహాయ నటి) నిలిచారు. సినిమాల పరంగా తొలి రెండు స్థానాల్లో భారతీయ చిత్రాలు ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్ –ఫీచర్ ఫిల్మ్), ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్) నిలిచాయి. ఆ తర్వాతి మూడు స్థానాల్లో వరుసగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘అర్జెంటీనా 1985’ చిత్రాలు నిలిచాయి. -
నాటునాటుకు ఆస్కార్.. అతడు లేకపోతే అవార్డు వచ్చేదే కాదు!
నాటు నాటు.. కేవలం రెండక్షరాల పదం.. ఏముంది ఆ పాటలో అంటారా? అక్కడికే వస్తున్నాం.. అమ్మచేతి పెరుగు ముద్దలో ఉన్నంత కమ్మదనం.. తండ్రి గంభీరం వెనక దాగి ఉన్న ప్రేమ.. పరీక్షలో ఫెయిలై అభాసుపాలైతే ఎలాగైనా క్లాస్ ఫస్ట్ రావాలన్న కసి.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న లక్ష్యం.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. డీజే పాటలు, అర్థం కాని సంగీతం, తెలుగు, ఇంగ్లీష్ కలగలిపిన లిరిక్స్.. ఇవే ట్రెండ్‌గా మారిన తరుణంలో మట్టిలో మాణిక్యాంలా వచ్చింది నాటు నాటు. అన్నింటినీ పక్కకు నెట్టి అందరి చెవుల్లో అమృతం పోస్తూ, మర్చిపోతున్న పల్లెదనాన్ని ముందుకు తెస్తూ అందరినీ కదిలించిందీ సాంగ్. కేవలం విని సంతోషించేలా కాదు అందరిచేత స్టెప్పులేయించింది. అదీ ఈ పాట గొప్పతనం.. ఈ పాట ఆస్కార్ వరకు వెళ్లడం అంత చిన్న విషయం కాదు. మరి దీని వెనక ఉన్నదెవరో తెలుసా? కార్తికేయ. ఈ విషయాన్నే కీరవాణి స్వయంగా ఆస్కార్ అందుకునే సమయంలో చెప్పాడు. అంత పెద్ద వేదికపై కార్తికేయకు థ్యాంక్స్ చెప్పడంతో అందరి దృష్టి అతడిపై పడింది. ఎవరీ కార్తికేయ? కార్తికేయ మరెవరో కాదు రమాకు మొదటి భర్త వల్ల కలిగిన సంతానమే కార్తికేయ. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కథ రచన మొదలు.. ఆస్కార్ గెలుపుదాకా అన్నింట్లో కార్తికేయ కృషి ఉంది. మార్కెటింగ్, ఇతర దేశాల్లో సినిమా ప్రదర్శన, డబ్బు లెక్కలు, ఆస్కార్ పొందడానికి తగిన కార్యాచరణ మొత్తం ఆర్గనైజ్ చేసింది కార్తికేయ. ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా 'కార్తికేయ వెంటపడతాడు, కార్యశూరుడు' అంటూ మెచ్చుకున్నాడు. విమర్శలు, వివాదాల జోలికి పోకుండా తెర వెనుక సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతాడు. తెరపై మాత్రం రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తదితరులు కనిపిస్తారు. ఆస్కార్ గెలుపుతో చంద్రబోస్, కీరవాణికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కానీ ఈ అవార్డు రావడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కాలభైరవే! తను లేకపోతే ఆ అవార్డే లేదు. కనీసం దాని ముంగిటకు కూడా రాకపోయేవారేమో! అందుకే కార్తికేయ కష్టాన్ని గుర్తించిన కీరవాణి అకాడమీ వేదిక మీద తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వరుసకు కొడుకైనా కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోయాడు. పాట రూపొందించడం ఒక ఎత్తయితే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. మన పాటకు ప్రపంచమే ఊగిపోవాలె అన్న రీతిలో ప్రమోషన్స్ చేశాడు. ఈ విషయంలో కార్తికేయను మెచ్చుకోవాల్సిందే! తనే కనక పట్టుబట్టి ఉండకపోతే ఆస్కార్ కల నిజం కాకపోయేదేమో! గతంలో మనకు ఆస్కార్ రాలేదా? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాటు నాటు పాటే! భారత్ గెలిచిన తొలి ఆస్కార్ ఇదే అన్నంత రీతిలో ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో మనకు ఆస్కార్ రాలేదా? అంటే వచ్చాయి. భాను అథైయా(బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్), సత్యజిత్ రే, రసూల్ పూకుట్టి(బెస్ట్ సౌండ్ మిక్సింగ్), గుల్జర్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్), ఏఆర్ రెహమాన్(బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్) వివిధ కేటగిరీల్లో అకాడమీ అవార్డులు అందుకున్నారు. మదర్ ఇండియా, లగాన్, సలాం బొంబాయి వంటి సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. కానీ ఏ సినిమా ఇప్పటివరకు ఆస్కార్‌ను గెలుచుకోలేదు. ఈసారి ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీచిత్రం కేటగిరీలో ఆస్కార్‌కు పంపుతారనుకుంటే మొండిచేయి ఎదురైంది. భారత్ నుంచి గుజరాతీ సినిమా ఛెల్లో షోను పంపారు కానీ ఆదిలోనే దాన్ని తిరస్కరించడంతో సినీప్రియులు నిరాశచెందారు. ఆర్ఆర్ఆర్ను పంపి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. -
‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి
తెలుగు సినిమా చరిత్ర సృష్టించిన రోజిది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది. రాజమౌళి, ఆయన భార్య రమ సంతోషంతో భావేద్వేగానికి గురయ్యారు. కార్తికేయ దంపతులతో కలిసి గంతులేశారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, లైవ్‌లో చూస్తున్న భారతీయులు సైతం ఆనందంతో పులకరించిపోయారు. తెలుగు సినిమా పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగువాళ్లతో పాటు భారత సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. -
Oscars 2023 : ప్రపంచస్థాయికి తెలుగు సినిమా.. RRRటీమ్‌కు అరుదైన గౌరవం
-
Oscars 2023: కోరిక తీరింది.. పాటతో మనసులో మాట చెప్పిన ఎంఎం కీరవాణి!
లాస్ ఏంజెల్స్: ప్రపంచ వేదికపై ఓ తెలుగు సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను కైవసం చేసుకుని మన సత్తా చాటింది. భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డ్‌ను సొంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రానికి గుర్తింపును తెచ్చిపెట్టింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఆస్కార్ అవార్డ్‌ను ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. అనంతరం ఆయన పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. అందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు. చివరిలో రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ తెలుగులో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా కంటున్న కలలను నిజం చేస్తూ రెండు ఆస్కార్లను మన చిత్రాలు దక్కించుకున్నాయి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకోగా.. మరో భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను దక్కించుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #NaatuNaatu wins the #Oscar for best Original Song 😭#SSRajamouli & team has done it🫡🇮🇳 Indian Cinema on the Rise 🔥 !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe — Abhi (@abhi_is_online) March 13, 2023 -
ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటుకు చరణ్, తారక్ డాన్స్? ఎన్టీఆర్ క్లారిటీ
అకాడమీ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉంది ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కాటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వస్తుందా? లేదా? అనేది ఒక్క రోజులో తేలనుంది. మార్చి 12న అమెరికాలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. దీంతో అందరి చూపు ఆర్ఆర్ఆర్పైనే ఉంది. అంతేకాదు ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో నాటు నాటు సాంగ్ పర్ఫామెన్స్ కూడా ఉండనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కీరవాణిలు స్టేజ్ఈ పాట పాడుతుండగా.. తారక్, చరణ్‌లు కాలు కదపనున్నారని సమాచారం. తాజాగా దీనిపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో నేపథ్యంలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు వరుసగా పలు హాలీవుడ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లాస్ ఏంజిల్స్‌కు చెందిన KTLA ఛానల్‌తో తారక్ ముచ్చటించాడు. చదవండి: శ్రీవారి సేవలో దిల్ రాజు ఫ్యామిలీ.. వారసుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు వేదికపై నాటు నాటు పాట పర్ఫామెన్స్పై ప్రశ్న ఎదురైంది. దీనికి తాను ఆస్కార్ అవార్డుల రెడ్ కార్పెట్‌పై పూర్తి ఇండియన్‌గా నడిచి వస్తానని చెప్పుకొచ్చిన తారక్, వేదికపై నాటు నాటు సాంగ్‌కు పర్ఫామెన్స్ చేయడం లేదని తేల్చి చెప్పాడు. కానీ, కీరవాణితో పాటు ఈ పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లు స్టేజ్‌పై నాటు నాటు పాటను పాడనున్నారని స్పష్టం చేశాడు. కాగా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గొల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ వంటి అవార్డులను గెలుచుకుంది. -
‘‘మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. బంగారు భూగోళమా..’’
ఈ ఏడాది జనవరిలో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో గల ‘ది బెవర్లీ హిల్టన్’ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు లభించింది. ఈ పాటకు గాను సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు అవార్డు దక్కింది. అవార్డుల ప్రదానోత్సవం రోజున కీరవాణి ఆ అవార్డును వేదికపైనే అందుకున్నారు. కాగా, ప్రస్తుతం లాస్ఏంజెల్స్లో ఉన్న రచయిత చంద్రబోస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును స్వీకరించారు. ‘గోల్డెన్ గ్లోబ్ విన్నర్ చంద్రబోస్ మా కార్యాలయానికి వచ్చి ఆయనకు చెందిన అవార్డును (నాటు నాటు పాటకు..) స్వీకరించారు. ఆయనకు మరోసారి శుభాకాంక్షలు’’ అని గోల్డెన్ గ్లోబ్ ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంపై చంద్రబోస్ స్పందిస్తూ ‘‘మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. బంగారు భూగోళమా.. (లవ్యూ)’’ అని ట్వీట్ చేశారు. ‘నాటు నాటు’ పాట 95వ ఆస్కార్ అవార్డ్స్లోని ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కా ర్ వేడుక మార్చి 12 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13)న లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది. మనస్ఫూర్తిగా అందరికీ ధన్వవాదాలు-బంగారు భూగోళమా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ https://t.co/xzV6WIhexI — chandrabose (@boselyricist) February 15, 2023 -
ఆస్కార్ సంబరాలు ఆరంభం.. ‘లంచ్ మీట్’లో కీరవాణి, చంద్రబోస్
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి దాదాపు నెల రోజులు ఉంది. ఈలోపు ఎప్పటిలానే ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నవారికి ‘లంచ్ మీట్’ ఏర్పాటు చేసింది అవార్డ్ కమిటీ. ఈ విందుకి సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ హాజరయ్యారు. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు కమిటీ నుంచి విందు కార్యక్రమానికి ఆహ్వానం అందగా ఈ ఇద్దరూ వెళ్లారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ని నిర్మించారు. ఇక ‘లంచ్ మీట్’ విషయానికొస్తే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ది బెవర్లీ హిల్టన్ బాల్ రూమ్‌లో విందు కార్యక్రమం జరిగింది. ఈ విందులో దాదాపు 200మంది పాల్గొన్నారని సమాచారం. అక్కడ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ను కలిశారు కీరవాణి, చంద్రబోస్. ఆ ఫోటోలను చంద్రబోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హుందాగా ఉందాం: జానెట్ యాంగ్ గత ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకకు ఓ హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్ రాక్ ఆ వేదికపై నటుడు విల్ స్మిత్ భార్య జాన్ పిన్కెట్ హెయిర్ స్టయిల్ గురించి కామెడీగా మాట్లాడారు. అది నచ్చక విల్‌స్మిత్ అతన్ని చెంపదెబ్బ కొట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రపంచం మొత్తం చూస్తున్న వేడుకలో విల్ స్మిత్ ఇలా చేయడం సరికాదని అవార్డు కమిటీ భావించింది. ఇదే విషయం గురించి తాజాగా ‘లంచ్ మీట్’లో అకాడమీ చైర్మన్ జానెట్ యాంగ్ మాట్లాడుతూ – ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. గత ఏడాది ఆస్కార్ వేడుకలో జరిగిన ఘటన (క్రిస్‌ని విల్ చెంప చెళ్లుమనిపించడం) సరైనది కాదు. అందరం బాధ్యతా యుతంగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలను ఆస్కార్ కమిటీ ఉపేక్షించదు’’ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ని ఆస్వాదించా! ఈ నెల 17న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ‘యాంట్–మ్యాన్ మరియు ది వాస్ప్: క్వాంటుమేనియా’లో సూపర్ విలన్ కాంగ్ ది కాంకరర్ పాత్ర చేసిన జోనాథన్ మేజర్స్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాట్లాడుతూ– ‘‘నేను భారతీయ చిత్రానికి అభిమానిని. ‘ఆర్ఆర్ఆర్’ని చాలాసార్లు చూశాను. మూడు గంటల ఈ సినిమాని ఆస్వాదించాను. ఇద్దరు నటులను (ఎన్టీఆర్, రామ్‌చరణ్) తెరపై చూడటం నాకు చాలా నచ్చింది. మరిన్ని ఇండియన్ సినిమాలు చూడాలనుకుంటున్నాను’’ అన్నారు. -
కీరవాణికి పద్మశ్రీ వరించడంపై రాజమౌళి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ వరించింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన స్వరాలు సమకూర్చారు. తన వినసొంపైన బాణీలతో దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. కెరీర్లో ఎన్నో వందల పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో మాత్రం కీరవాణి పేరు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం కూడా రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కీరవాణికి పద్మశ్రీ రావడంపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించారు. ''నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది.. చాలా ఆలస్యమయ్యింది. కానీ కానీ మీరు ఎప్పుడూ చెబుతారు కదా.. మన కష్టానికి తగిన ప్రతిఫలం ఊహించని విధంగా అందుతుందని. ఒకవేళ నేనే కనుక ఈ విశ్వంతో మాట్లడగలిగితే.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకోటి ఇవ్వమని చెబుతాను''అంటూ జక్కన్న భావేద్వేగ పోస్ట్ చేశారు. దీనికి కీరవాణి వయొలిన్ వాయిస్తుండగా.. తాను కింద కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ.. నా పెద్దన్న.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, గర్వంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
తెలుగు నేలపై విరిసిన పద్మాలు
సంగీతం.. దేవుడిచ్చిన వరం తన సంగీతంతో శ్రోతలను ఉర్రూతలూగిస్తూ ఇటీవల ‘80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు’, ‘28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డు’అందుకున్న ఎంఎం కీరవాణి తాజాగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. కీరవాణి నాలుగో ఏటనే తండ్రి వేలు పట్టుకుని సంగీతం వైపు తొలి అడుగులేశారు. ఆరేళ్లప్పుడు రాయచూరులోని దత్తప్ప అనే విద్వాంసుడి వద్ద సంగీతం అభ్యసించారు. వయోలిన్‌పై పట్టు సాధించారు. ఇంజనీర్ కావాలని శ్రమించినా సీటు రాలేదు. ఆ తర్వాత కీరవాణి‘జాలీ ఫ్రెండ్స్’అనే ఆర్కెస్ట్రా ట్రూపులో చేరి, పాటలు పాడారు. చెన్నైకి వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. తర్వాత వేటూరి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. వేటూరి సిఫార్సుతో కీరవాణికి ‘మనసు–మమత’సినిమాకి సంగీత దర్శకునిగా తొలి అవకాశం వచ్చింది. ఆయన ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. ఆర్చిడ్ మొక్కలపై పరిశోధనలకు నాగేశ్వరరావుకు పద్మశ్రీ ఏలూరుకు చెందిన డాక్టర్ అబ్బారెడ్డి నాగేశ్వరరావు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన ఆర్చిడ్ రకానికి చెందిన అరుదైన మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు. సెంటర్ ఫర్ ఆర్చిడ్ జినీ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్ట్రన్ హిమాలయన్ రీజియన్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలకు గానూ లిమ్కాబుక్ ఆఫ్ రికార్ట్స్‌లో ఇప్పటికే తన పేరును నమోదు చేసుకున్నారు. 35 రకాల నూతన ఆర్చిడ్ జాతి మొక్కలను కనుగొన్నారు. సేవామూర్తి చంద్రశేఖర్ కాకినాడ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు కాకినాడకు చెందిన సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్‌కు లభించింది. ఆయన 1943 నవంబర్ 20న సింగరాయకొండలో అప్పల నరసయ్య, రామయ్యమ్మ దంపతులకు జన్మించారు. కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే స్థిరపడ్డారు. 1985లో విమాన ప్రమాదంలో చంద్రశేఖర్ భార్య మంజరి, కుమారుడు కిరణ్, కుమార్తె శారద మృతి చెందారు. దీంతో ఇండియాకు వచ్చేసిన ఆయన 1989లో సంకురాత్రి ఫౌండేషన్‌ను స్థాపించారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి వద్ద కంటి ఆస్పత్రి, విద్యాలయం స్థాపించి సేవలు అందిస్తున్నారు. ఏటికొప్పాక కళాకారుడికి పద్మశ్రీ సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామానికి చెందిన సీవీ రాజు(చింతలపాటి వెంకటపతి రాజు)కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన రూపొందించిన ఏటికొప్పాక బొమ్మలు బాగా ప్రాచుర్యం పొందాయి. మొదట సీవీ రాజుది వ్యవసాయ వృత్తే అయినా... 1988లో బొమ్మల తయారీని చేపట్టారు. పిల్లల ఆట వస్తువులు, కుంకుమ భరణిలు డిజైన్ చేసి ఎగుమతి చేశారు. 2020లో మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి మోదీ.. రాజుతో సంభాషించారు. మళ్లీ గత ఆదివారం కూడా రాజు తయారుచేసిన బొమ్మలను ప్రధాని ప్రశంసించారు. బొమ్మల తయారీలో నైపుణ్యానికి రాష్ట్రపతి అవార్డు రాజుకు లభించింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ చోటు దక్కించుకున్నారు. హరికథా సామ్రాజ్య సార్వభౌమ.. తెనాలి: తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు.. కోట సచ్చిదానందశాస్త్రి భాగవతార్. రామాయణ, భారత, భాగవతాలను శ్రావ్యంగా, జనరంజకంగా గానం చేస్తూ విశేష ప్రాచుర్యం కల్పించారు. తన సేవలకు గుర్తుగా తాజాగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సచ్చిదానంద శాస్త్రి స్వస్థలం.. ప్రకాశం జిల్లా అద్దంకి. 14 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో పౌరోహిత్యం చేస్తూనే.. స్వయంగా హరికథాగానం సాధన చేశారు. చతురోక్తులు, సరస సంభాషణలతో వీక్షకుల మనసు తనపైన లగ్నమయ్యేవరకు కాలక్షేపం చేసి, కథాంశంతో హరికథను ఆరంభించేవారు. ఆకాశవాణిలో టాప్ ఏ గ్రేడ్ ఆర్టిస్టయ్యారు. విజయగుప్తాకు పద్మశ్రీ సాక్షి ప్రతినిధి, బాపట్ల: వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్న విజయగుప్తా అందించిన సేవలకు పద్మశ్రీ దక్కింది. విజయగుప్తా మంచినీటి చేపల పెంపకం కోసం తక్కువ ఖర్చుతో కూడిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. నీలి విప్లవం ద్వారా చేపల ఉత్పత్తిని పెంచిన ఘనతను సొంతం చేసుకున్నారు. విజయగుప్తా చేసిన విశిష్ట పరిశోధనలకు ఇప్పటికే దేశ,విదేశాల్లో పురస్కారాలను అందుకున్నారు. బాపట్లలో జన్మించిన ఆయన గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సీ, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివారు. పశ్చిమ బెంగాల్ మత్స్యశాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. 22 దేశాల్లో పరిశోధనలు నిర్వహించారు. ఇద్దరు శాస్త్రవేత్తలకు పద్మశ్రీ శాస్త్ర విజ్ఞాన రంగంలో కేఎన్ గణేశ్, పీసీ సూద్‌కు పురస్కారాలు సాక్షి, అమరావతి: శాస్త్ర విజ్ఞాన రంగంలో చేసిన విశిష్ట కృషికి ప్రముఖ శాస్త్రవేత్త కేఎన్ గణేశ్‌కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. ప్రముఖ బయో ఆర్గానిక్స్ శాస్త్రవేత్త అయిన కేఎన్ గణేశ్ తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్) వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి పీహెచ్డీ చేశాక భారత్‌కు తిరిగి వచ్చి 1980లో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీలో చేరారు. భారత్‌లో మొదటి డీఎన్ఏ సింథసిస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డీఎన్ఏ గుర్తింపులో రసాయన సూత్రాలు, డీఎన్ఏ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై విశేష పరిశోధనలు నిర్వహించారు. అణు భౌతిక శాస్త్రంలో పీసీ సూద్‌కు.. అణు భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికిగాను పీసీ సూద్‌కు పద్మశ్రీ లభించింది. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌లో భౌతిక శాస్త్రవేత్తగా ఆయన పనిచేస్తున్నారు. న్యూక్లియర్ ఫిజిక్స్, థియోరాటికల్ ఫిజిక్స్, ఎలిమెంటరీ పార్టికల్ ఫిజిక్స్‌ల్లో పరిశోధనలు చేశారు. న్యూక్లియర్ స్ట్రక్చర్ అంశంలో 300కుపైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. వాటిలో 158 పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. మృదు మధురమైన కంఠస్వరం.. వాణీజయరామ్ సొంతం ‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’.. ఎంత కమ్మని గొంతు. ఉషోదయం వేళ మనసుని ఉల్లాసంగా తట్టిలేపే మృదు మధురమైన కంఠస్వరం వాణీ జయరామ్ సొంతం. ‘స్వాతి కిరణం’లోని ఈ పాటను తమిళ పొన్ను (అమ్మాయి) వాణీ జయరామ్ స్పష్టంగా తెలుగులో పాడిన తీరు అద్భుతం. ‘శంకరాభరణం’సినిమాలో ‘పలుకే బంగారమాయెనా..’అని పాడితే ‘మీ పాటే మధురమాయెనే..’అని శ్రోతలు కితాబునిచ్చారు. ‘అందెల రవమిది పదములదా..’అంటూ ‘స్వర్ణకమలం’కి పాడితే శ్రోతల మనసులు నాట్యం చేశాయి. ఐదు దశాబ్దాలకు పైబడిన కెరీర్లో వాణీ జయరామ్ పదివేల పాటలు పాడారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ.. ఇలా దాదాపు 20 భాషల్లో పాడారు. ఎనిమిదవ ఏటనే ఆమె ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటక సంగీతం, హిందుస్తానీ అభ్యసించిన ఆమె చదువుని నిర్లక్ష్యం చేయలేదు. డిగ్రీ పూర్తయ్యాక చెన్నైలో ఆమెకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌కి బదిలీ అయ్యారు. 1969లో జయరామ్‌ని పెళ్లి చేసుకున్నాక కొన్నేళ్ల పాటు ముంబైలో ఉన్నారు. ఏ భాషలో పాడితే అదే ఆమె మాతృభాష అన్నట్లుగా పాడిన వాణీ జయరామ్‌కి ఎన్నో అవార్డులూ రివార్డులూ దక్కాయి. తాజాగా ఆమెను ‘పద్మ భూషణ్’వరించింది. -
ఆస్కార్ బరిలో నాటు నాటు.. ఇంతకీ ఈ అవార్డు ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఆస్కార్ అవార్డు.. ప్రస్తుతం ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవార్డు ఇది. సినీ రంగంలోని ప్రతిభవంతులకు ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక ఆవార్డు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఏడాదికి గానూ 95వ ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ 2023లో ఇచ్చే ఆస్కార్ అవార్డుల బరిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కడం విశేషం. అలాంటి అకాడమి అవార్డుకు ఒక్క అడుగు దూరంలో మన తెలుగు సినిమా ఉండటం నిజంగా గర్వకారణం. దీంతో అంతర్జాతీయ స్టేజ్‌పై మన తెలుగు సినిమా పేరు, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణిల పేర్లు మారుమోగుతున్నాయి. మరి అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ అవార్డు ప్రత్యేకత గురించి మీకు తెలుసా? ఇంతకీ ఆస్కార్ అంటే ఏంటి? ఈ అవార్డు ఎలా తయారు చేస్తారు? ఎవరెవరికి.. ఏయే రంగాల వారికి ప్రదానం చేస్తారో ఇక్కడ చూద్దాం! అకాడమీ అవార్డు కాస్తా ఆస్కార్గా ఎలా మారిందంటే? మొదట ఈ అవార్డును అకాడమి అవార్డు అని పిలిచేవారు. దీని పూర్తి పేరు ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’. ఆ తర్వాత దీనికి ఆస్కార్ అనే పేరు పెట్టారు. ఆ పేరు ఎలా వచ్చిందనేది కచ్చితమైన సమాచారం లేదు. కానీ దీని వెనుక ఓ ఊహాగానం ఉందట. అదేంటంటే ఈ అకాడమీ అవార్డులను ఇచ్చే సంస్థకు మార్గరెట్ హెరిక్ అనే మహిళ సేవలందించారట. విజేతలకు అందించే ఈ అవార్డు ప్రతిమను చూసి ఆమె.. ‘దీని ఆకృతి మా అంకుల్ ఆస్కార్‌లా ఉంది’ అని చెప్పిందట. దీంతో అలా 'ఆస్కార్ అవార్డు' పేరు వచ్చింది. 1939లో ఇదే పేరును అధికారికంగా కూడా స్వీకరించారు. ఈ అవార్డు ప్రతిమను ఎలా తయరు చేస్తారంటే! ఆస్కార్ అవార్డును చూడటానికి బంగారంలా మెరిసిపోతుంది. దీంతో అంతా ఈ అవార్డును బంగారంతో చేస్తారని భావిస్తారు. నిజానికి ఆస్కార్ ప్రతిమలో ఉండేదంతా బంగారం కాదు. దీనిని కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు. ఇక ఈ ప్రతిమను పదమూడున్నర అంగుళాల ఎత్తు అంటే 35 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉంటుంది. బరువు మాత్రం దాదాపు నాలుగు కేజీలు (ఎనిమిదిన్నర పౌండ్ల బరువుతో) తయారు చేశారు. దీనికి ఐదు స్పోక్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను(నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలు) ఇవి సూచిస్తాయి. అయితే ఈ అవార్డు సృష్టికర్త ఎంజీఎం స్టూడియో ఆర్డ్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్. ఆయన ఆస్కార్ ప్రతిమను తయారు చేసే సమయంలో డిజైన్ కోసం నటుడు ఎమిలో ఫెర్నాండెజ్‌ను నగ్నంగా నిలబెట్టి ఈ అవార్డు సృష్టించారు. అలా ఆ నటుడు రూపంలో కెడ్రిక్ గిబ్బన్స్ ఆస్కార్ ప్రతిమను డిజైన్ చేశారు. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా ఉంటుంది. ఇక అవార్డు తయారికి చాలా సమయం పడుతుందట. 50 ఆస్కార్ ప్రతిమలు తయారుచేయాలంటే సాధారణంగా మూడు నెలలు పడుతుంది. మొట్ట మొదటి ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం 1929లో మే 16న హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్లో జరిగింది. చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్‌కు చోటు ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది. రీసెంట్గా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి. షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి. మొత్తానికి నామినేషన్స్‌లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి. చదవండి: బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్‌లో ‘మెంటల్ బాలకృష్ణ’ హ్యాష్ ట్యాగ్! ఇటివల కొత్త ఇంట్లోకి ప్రవేశం.. తాజాగా లగ్జరీ కారు కొన్న నటి శ్రీవాణి -
ఆర్ఆర్ఆర్కు అవార్డుల పంట.. ఉత్తమ సాంగ్, ఉత్తమ చిత్రంగా..
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు కైవసం చేసుకుంది. ఉత్తమ పాట, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో రెండు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు అందుకుంది. మరోసారి నాటు నాటు పాటకే బెస్ట్ సాంగ్ అవార్డు రావడం విశేషం. 28వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు ఫంక్షన్లో రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణి ఈ అవార్డులను అందుకున్నారు. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ వీడియోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపోతే గోల్డెన్ గ్లోబ్‌తో సహా నాలుగు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నందుకు ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు కీరవాణి. తన సంగీతం కోట్లాది మంది మనసులు గెలుచుకోవడానికి ఈ నలుగురు కూడా కారణమంటూ.. బాలచందర్, భరతన్, అర్జున్ సర్జా, భట్ సాబ్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు. Congratulations to the cast and crew of @RRRMovie - winners of the #criticschoice Award for Best Foreign Language Film.#CriticsChoiceAwards pic.twitter.com/axWpzUHHDx — Critics Choice Awards (@CriticsChoice) January 16, 2023 Naatu Naatu Again!! 🕺🕺❤️🔥 Extremely delighted to share that we won the #CriticsChoiceAwards for the BEST SONG💥💥 #RRRMovie Here’s @mmkeeravaani’s acceptance speech!! pic.twitter.com/d4qcxXkMf7 — RRR Movie (@RRRMovie) January 16, 2023 #RRR wins #CriticsChoiceAwards Best Foreign Film. 🙌🏼 pic.twitter.com/oh9pu8cwpB — Nancy Wang Yuen (@nancywyuen) January 16, 2023 Returning home after receiving 4 international awards for RRR including Golden Globe - with gratitude to Ramojirao garu & all the mentors who’d enriched my music by making me cross the boarders of Telugu states. Balachander sir, Bharathan Sir, Arjun Sarja and Bhatt Saab 🙏 — mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023 -
తగ్గేదేలే.. ఆర్ఆర్ఆర్ మూవీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ప్రపంచస్థాయిలో రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. తాజాగా అమెరికాలోని 'లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డు దక్కింది. (ఇది చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంఎం కీరవాణిని ఎంపిక చేసింది. ఈ అవార్డ్ అందుకున్న ఫోటోలు ఆర్ఆర్ఆర్ బృందం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కీరవాణికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదే ఊపులో ఆస్కార్ అవార్డ్ కూడా తీసుకురావాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. .@mmkeeravaani’s acceptance speech for #RRRMovie’s score at @LAFCA. ❤️🔥🔥🌊 pic.twitter.com/XIDhze3ZkW — RRR Movie (@RRRMovie) January 15, 2023 -
హాలీవుడ్ దిగ్గజంతో రాజమౌళి.. మైండ్ బ్లోయింగ్
సాక్షి, సినిమా: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బ్లాక్‌బస్టర్ పీరియడ్ డ్రామా ఆర్ఆర్ఆర్ మేనియా ప్రపంచమంతా సాగుతోంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది ఇందులోని నాటు నాటు సాంగ్. తద్వారా అరుదైన ఘనత సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్.. ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీతో పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలోనూ ఏదైనా అద్భుతం సృష్టిస్తుందా? అని ఎదురు చూస్తున్నారంతా. ఈ లోపు రాజమౌళి తన ఫ్యాన్ బాయ్ ముచ్చటను తీర్చుకున్నాడు. హాలీవుడ్ దిగ్గజ ఫిల్మ్‌మేకర్ స్టీవెన్ స్పీల్బర్గ్(76)ను కలిశాడు. ఐ జస్ట్ మెట్ గాడ్ అంటూ తన భావాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆయన. మొదటి చిత్రంలో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ ఫొటోల్లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సైతం ఉన్నారు. జురాసిక్ పార్క్ లాంటి చిత్రాలతో స్టీవెన్ స్పీల్బర్గ్ మన దేశంలోనూ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. I just met GOD!!! ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/NYsNgbS8Fw — rajamouli ss (@ssrajamouli) January 14, 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకల సందర్భంలోనే వీళ్ల కలయిక జరిగినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ వెటరన్ ఫిల్మ్‌మేకర్ ది ఫాబెల్స్మ్యాన్ చిత్రానికి గానూ బెస్ట్ డైరెక్టర్(మోషన్ పిక్చర్)కేటగిరీలో అవార్డు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం రెండే గంటల్లో జక్కన్న పోస్ట్‌కి మిలియన్‌కి పైగా వ్యూస్ రావడం విశేషం. -
అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది: జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాటు నాటు సాంగ్ ఈ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డ్‌తో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఆస్కార్ బరిలోనూ నిలిచింది. తాజాగా ఈ అవార్డ్ దక్కటం పట్ల రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఐరన్ మ్యాన్ అంటే ఇష్టం – ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతబ.. ‘రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పుడే ఈ సినిమా ఎక్కువమందికి రీచ్ అవుతుందని తెలుసు. ఆయనతో సినిమాలు చేయడం వల్ల, ఆయన ట్రాక్ రికార్డుని దృష్టిని పెట్టుకోవడం వల్ల తప్పకుండా మేం గెలుస్తామనే నమ్మకం ఏర్పడింది’’ అన్నారు ఎన్టీఆర్. మార్వెల్ సినిమాల గురించి మీడియా ప్రతినిధి అడిగితే... ‘‘మార్వెల్ సినిమా చేయాలని ఉంది. నా ఫ్యాన్స్ దీని గురించి క్రేజీగా మాట్లాడుకుంటున్నారు. నాకు ఐరన్ మ్యాన్ అంటే ఇష్టం. ఆ క్యారెక్టర్ మాకు దగ్గరగా అనిపిస్తుంది’’ అని అన్నారు. అది మాత్రమే కాదు.. ‘‘ఇవాళ మీ బర్త్‌డే కదూ.. హ్యాపీ బర్త్‌డే... మీకో చిన్న గిఫ్ట్. మీకు నచ్చుతుందనుకుంటున్నా’’ అంటూ ఓ గిఫ్ట్‌ని విలేకరికి అందజేశారు ఎన్టీఆర్. అది అందమైన టార్చర్ – రామ్‌చరణ్ హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘మా టీమ్ కష్టమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. అదొక అందమైన టార్చర్. సౌత్ ఇండియా నుంచి సినిమాలకు ఎంతో పాపులర్ అయిన ఈ ప్రాంతానికి రావడం, ప్రశంసలు పొందడం మాకు ఎనర్జీని ఇచ్చే విషయం. నాకిష్టమైన ప్లేస్ ఇది. హాలిడే ట్రిప్స్‌కి వస్తుంటాను. ఈ 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కి రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు రామ్‌చరణ్. కాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ‘మార్వెల్’ మూవీస్‌ని తలపించిందని, మీరు మార్వెల్ యాక్టర్లా కనిపించారని, మార్వెల్ స్టార్‌గా, సూపర్ హీరోగా చేయాలనుకుంటున్నారా? అని రామ్‌చరణ్‌ని ఓ విలేకరి అడగ్గా, ‘‘తప్పకుండా చేస్తాను. నా ఫేవరెట్ మార్వెల్ మూవీ ‘కెప్టెన్ అమెరికా’’ అన్నారు. అవార్డు వేడుకకు ముందు రెడ్ కార్పెట్‌పై రామ్ చరణ్ మాట్లాడారు. ఇక్కడి టాప్ టెక్నీషియన్లతో పని చేయాలని ఉందని.. అలాగే ఇండియాలో సూపర్ హీరోలు ఉన్నారు. వారి నటనని ఇక్కడి దర్శకులు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ మీ సినిమాకి అవార్డు వస్తే ఏం చేస్తారని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా– ‘‘మా డైరెక్టర్ రాజమౌళిగారిని ఆ అవార్డుని నాకు ఇవ్వమని అడుగుతాను. కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకుని ఆ తర్వాత వెనక్కి ఇచ్చేస్తాను’. అని అన్నారు. మాటలు రావడం లేదు: రాజమౌళి దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. 'మాటలు రావడం లేదు. సంగీతానికి హద్దులు లేవు. నాకు ‘నాటు నాటు..’ లాంటి పాట ఇచ్చిన పెద్దన్నా (కీరవాణి) మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ అవార్డు చాలా ప్రత్యేకమైనది. ‘నాటు నాటు...’ స్టెప్ వేస్తూ, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు.' అని అన్నారు. -
అద్నాన్ సమీ అతి వ్యాఖ్యలు
నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై నిన్నంతా పలువురు సినీ, సంగీత, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు RRR టీంను ప్రశంసలతో ముంచెత్తారు. పాట సమకూర్చిన సినిమా టీంను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రశంసించారు. అంతర్జాతీయ యవనికపై తెలుగు వారి ఖ్యాతి అత్యున్నత స్థాయిలో ఎగుర వేసినందుకు ఆంధ్రప్రదేశ్ తరపున RRR టీంకు అభినందనలు తెలుపుతున్నానని, ఈ పురస్కారం సాధించడం పట్ల గర్వంగా భావిస్తున్నామన్నారు. The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY — YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023 దీనిపై గాయకుడు అద్నాన్ సమీ అతిగా స్పందించారు. ఈ కీర్తిని తెలుగు వారికి మాత్రమే అంటూ చెప్పుకోవడం వద్దని, దేశాన్నివిభజించవద్దంటూ విచిత్ర రాగం అందుకున్నారు. Telugu flag? You mean INDIAN flag right? We are Indians first & so kindly stop separating yourself from the rest of the country…Especially internationally, we are one country! This ‘separatist’ attitude is highly unhealthy as we saw in 1947!!! Thank you…Jai HIND!🇮🇳 https://t.co/rE7Ilmcdzb — Adnan Sami (@AdnanSamiLive) January 11, 2023 అసలు సినిమాకు గానీ, అవార్డుకు గానీ, లేదా ఏపీ సీఎం చేసిన ట్వీట్‌కు గానీ ఏమాత్రం సంబంధం లేకుండా.. 1947ను గుర్తు చేసి అద్నాన్ సమీ స్పందించడం తెలుగు వారిపై ఆరోపణలు గుప్పించడం ఏ మాత్రం సరికాదంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. Dear @AdnanSamiLive its beyond ur comprehensive levels to understand what #Telugu Flag means. It signifies our PRIDE. V don't have to hear lectures on patriotism from likes of U. Better keep that borrowed NATIONALISM to urself. @ysjagan @ssrajamouli @AlwaysRamCharan @tarak9999 — Hyderabad Intellectuals Forum 🇮🇳 (@HydForum) January 11, 2023 RRR టీంను ప్రశంసిస్తూ తెలుగులో (ఇంగ్లీషు అక్షరాలతో తెలుగును) షారూఖ్ ట్వీట్ చేశారు. Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!! (Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! ) Love you. — Shah Rukh Khan (@iamsrk) January 10, 2023 బాలీవుడ్లో బాద్షా లాంటి షారూఖ్ లాంటి వాళ్లు తెలుగును గౌరవిస్తే.. నీకేమయిందంటూ నెటిజన్లు సమీకి గుర్తు చేసి చురకలంటించారు. And SRK tweeted in telugu 👇🏻 Don’t politicise everything Mr Adnan, you are not a politician https://t.co/vncXhNLtN1 — Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) January 11, 2023 అద్నాన్ సమీ ఓవరాక్షన్ పట్ల ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క దేశం పాకిస్తాన్ నుంచి భారత్‌కు వలస వచ్చి ఇప్పుడు భారతీయులకే పాఠాలు చెబుతావా అంటూ ప్రశ్నించారు. Clear Lack of knowledge in Adnan Sami’s comments. Cannot blame him because he wasn’t an Indian Citizen before 2016. All Telugu people are naturally patriotic and need no certificate. Reference to Telugu Flag is because ‘Naatu-Naatu’ won the Golden Globe award not ‘Nacho-Nacho’! — Vijayasai Reddy V (@VSReddy_MP) January 12, 2023 అద్నాన్‌సమీ వ్యాఖ్యల వెనక అక్కడి సినిమా మాఫియా అక్కసు కనిపిస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా బాలీవుడ్‌కు బ్యాడ్ టైం నడుస్తోంది. చెప్పుకోదగ్గ ఒక్క హిట్ లేకపోగా.. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలన్నీ ఎదురుతంతున్నాయి. అదే సమయంలో దక్షిణాది సినిమాలయిన RRR, KGF లాంటివి బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. -
థ్యాంక్యూ శ్రీవల్లి.. వేదికపై భావోద్వేగానికి గురైన ఎంఎం కీరవాణి
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్‌కు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఈ అవార్డ్ రావడానికి అద్భుతమైన చిత్రబృందమే కారణమని తెలిపారు. ఈ అవార్డును తన భార్య శ్రీవల్లితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కీరవాణి. ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ– 'ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఉద్వేగాన్ని ఇక్కడే కూర్చుని ఉన్న నా వైఫ్ (శ్రీవల్లి)తో షేర్ చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది. మామూలుగా అవార్డులు అందుకున్నప్పుడు ‘నిజానికి ఇది నాది కాదు.. మరొకరికి దక్కుతుంది’ అని అంటుంటారు. అందుకని ఇలాంటి అవార్డు అందుకున్నప్పుడు నేను అలా మాట్లాడకూడదని ప్లాన్ చేసుకున్నాను. కానీ సారీ... నేను ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. ఎందుకంటే ఇవి నా హృదయంలోంచి వచ్చే మాటలు. వరుస క్రమంలో చెప్పాలంటే ముందుగా ఈ అవార్డు నా సోదరుడు, ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి విజన్‌కి దక్కుతుంది. నా పనిని నమ్మి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు తనకు ధన్యవాదాలు. తర్వాత ప్రేమ్ రక్షిత్ గురించి చెప్పాలి. అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. తను లేకపోతే ఈ పాట లేదు. తర్వాత ఈ పాటకు అన్నీ సమకూర్చిన కాలభైరవ, అద్భుతంగా రాసిన రచయిత చంద్రబోస్, కాలభైరవతో కలిసి ఎనర్జిటిక్‌గా పాడిన రాహుల్ సిప్లిగంజ్, ఫుల్ స్టామినాతో డ్యాన్స్ చేసిన ఎన్.టి. రామారావు, రామ్‌చరణ్‌లకు ధన్యవాదాలు. చివరిగా.. ఈ పాటకు ప్రోగ్రామ్ చేసిన సాహు సిద్ధార్థ్, జీవన్బాబులకు కూడా ధన్యవాదాలు. ఇంకొన్ని వర్డ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే.. థ్యాంక్యూ శ్రీవల్లి... థ్యాంక్యూ వల్లీ’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు కీరవాణి. MM Keeravaani’s #GoldenGlobes2023 acceptance Speech!! ❤️🔥❤️🔥 #RRRMovie #NaatuNaatu pic.twitter.com/9q7DY7Pn5G — RRR Movie (@RRRMovie) January 11, 2023 -
Golden Globe Awards 2023: తెలుగు నాటు యమా హిట్టు
నాటుదనంలో మాయామర్మం ఉండదు. నాటుదనంలో కల్లాకపటం ఉండదు. నాటుదనంలో హొయలు వగలు ఉండవు. నాటుదనంలో తళుకూ జిలుగూ ఉండవు. నాటుదనం గ్రామీణం. నాటుదనం భోళాతనం. నాటుదనం సాంస్కృతిక వరం. నాటుదనం మేకప్పు లేని సౌందర్యం. అందుకే ప్రపంచం మెచ్చింది. తెలుగు నాటుదనానికి చరిత్రాత్మక గుర్తింపునిచ్చింది. 78 ఏళ్లుగా ఇస్తున్న హాలీవుడ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో భారతదేశం నుంచి అందునా తెలుగు నుంచి మొట్ట మొదటిసారి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా ఆర్.ఆర్.ఆర్‌లోని ‘నాటు నాటు’ పాట అవార్డు గెలుచుకుంది. సంగీత దర్శకుడు కీరవాణి తెలుగు కీర్తిని పెంచారు. రాసినవారు, పాడినవారు, ఆడినవారు, ఆడించినవారు, ఆదరించిన తెలుగు కుటుంబాలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. పరమ నాటు సమయం. పాట కూడా ఒక్కోసారి బాకులా గుచ్చుకుంటుంది. గజమో రెండు గజాలో దూరం కాకుండా సముద్రాలు దాటి తియ్యటి గాటు పెడుతుంది. పల్లవి చెంప నిమురుతుంది. చరణం గుండె తడుముతుంది. పదం పదం కలిసి జ్వరం తెప్పించి వెర్రెక్కిస్తుంది. భాష తెలియని భావం అక్కర్లేని నాదం ముందుకు దుముకుతుంది. హోరున తాకే జలపాతం కింద నిలబడినవాడి జాతి ఏదైతే ఏంటి... రీతి ఏదైతే ఏంటి... నిలువునా తడిపేస్తుంది. పాట కూడా అంతే. ప్రణతి, ఎన్టీఆర్, రాజమౌళి, రమ, శ్రీవల్లి, కీరవాణి, ఉపాసన, రామ్‌చరణ్, కార్తికేయ, శోభు యార్లగడ్డ పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు... అది గుంటూరు మిర్చి పొలం కావచ్చు. బహుశా నెల్లూరు పోలేరమ్మ జాతర కావచ్చు. కాకుంటే లష్కర్ బోనాలు కావచ్చు. అయితే మేడారం మహా సంగమం కావచ్చు. తెలుగుదనం అది. తెలుగు ఘనం. తెలుగు జనం. తెలుగు జయం. గ్రామీణ తేటదనం. అమాయక నాటుదనం. అది ఊరి పెద్దమనిషి తలపాగ. పేదరైతు భుజాన కండువ. నిండు గాజుల ఇల్లాలి నుదుటి బొట్టు. రోకలి దంచే యువతి చెంపన చెమట చుక్క. అది నిర్మల్ కొయ్యబొమ్మ. కొండపల్లి పూలకొమ్మ. ఉత్త నాటు సౌందర్యం. బహుమేటి సౌందర్యం. నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు ఈ నాటు ఇప్పడు ప్రపంచాన్ని గెలిచింది. సినిమా ద్వారా అయితేనేమి తెలుగు మాట ఖండాతరాలలో మోగింది. తెలుగు బాణి దేశదేశాల వాళ్లతో చిందులు వేయించింది. తెలుగు దరువు భూగోళాన్ని డండనకర ఆడించింది. తెలుగువారికి ఏం తక్కువ? మనకంటే ఎవరు ఎక్కువ? చులకన చేయని ఘనత ఆర్.ఆర్.ఆర్‌లో ‘నాటు నాటు’ పాట వచ్చే సందర్భం ఆంగ్లేయులు తమను తాము గొప్ప చేసుకుంటూ తెలుగు వారికి ఏం వచ్చు అని ప్రశ్నించే సందర్భం. వాళ్ల స్టయిలు డాన్సులు, నైసు స్టెప్పులే గొప్ప అనుకుంటూ కథా నాయకులైన రామ్‌ను, భీమ్‌ను నిలదీసే సందర్భం. దానికి జవాబుగా తెలుగువారు రంగంలోకి దిగితే పరిస్థితి ఎంత నాటుగా ఉంటుందో హీరోలు చెప్పాలి. అందుకు పాట కావాలి. గీత రచయిత చంద్రబోస్‌కు సిట్యుయేషన్ చెప్పి ‘నువ్వు ఏదైనా రాయి మన ఘనత చాటుకునేలా ఉండాలి. ఎదుటివారిని అవమానించేలా తిట్టేలా ఉండకూడదు’ అన్నాడు దర్శకుడు రాజమౌళి. ఇంగ్లిష్ వాణ్ణి తిట్టకుండా చెంప పగులగొట్టాలన్న మాట. చల్లగరిగ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) లాంటి చిన్న పల్లెలో పుట్టిన చంద్రబోస్‌కి తెలుగు వేగం, తెలంగాణ యోగం తెలియనిది ఏముంది? పాట పుట్టింది. కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు నా పాట చూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు చంద్రబోస్ మొత్తం పాట రాశాక కీరవాణి దానికి ట్యూన్ చేశాడు. పాట రాశాక ఫైనల్ వెర్షన్‌గా పాట బయటపడటానికి మధ్య దాదాపు 19 నెలలు ఉన్నాయి కరోనా వల్ల. ‘లోపలున పానమంతా దముకు దుముకులాడేలా’ చంద్రబోస్ రాయడం, ‘వొంటిలోన రగతమంతా రంకెలేసి ఎగిరేలా’ కీరవాణి ట్యూన్ చేయడం... దాంతో అది కోటి ఈలల పాటైంది. జపాన్ వాడి ఈల.. రష్యావాడి ఈల... చైనా వాడిదీ... వమెరికా వాడిదీనూ. పాదాల తుఫాను రికార్డింగ్ థియేటర్లో వాయుగుండం బలపడింది. ఇక అది తెర మీద తుఫానులా తాకాలి. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయాలి. పులి ఒకరు, బెబ్బులి ఒకరుగా ఇద్దరు హీరోలు... ఎన్టీఆర్, రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నారు. వీరి కాళ్లకు గజ్జెలు కట్టే వీరుడు కావాలి. ప్రేమ రక్షిత్. ఈ పాండిచ్చేరి కుర్రాడు హైదరాబాద్‌నే తన రెండో ఇల్లు చేసుకున్నాడు. కొరియోగ్రఫీని ఒంట్లో నింపుకున్నాడు. ‘ఈ పాటను నువ్వు ఎలాగైనా కంపోజ్ చెయ్. కాని ఇద్దరు హీరోలు ఈక్వల్‌గా కనిపించాలి’ అనేది దర్శకుడి షరతు. ‘ఎవరి ఎనర్జీ లెవల్ కూడా తగ్గినట్టుగా స్క్రీన్ మీద ఉండరాదు’ అన్నాడు దర్శకుడు. ప్రేమ్ రక్షిత్ పాటను అందుకున్నాడు. నెల రోజులు తపస్సు చేశాడు. హుక్ స్టెప్ (వైరల్ అయిన స్టెప్) కోసం యాభై రకాల మూవ్మెంట్స్ సిద్ధం చేస్తే దర్శకుడికి ఇప్పుడు ఉన్నది నచ్చింది. పాట కోసం మొత్తం 94 రకాల మూవ్‌మెంట్స్‌ని కంపోజ్ చేశాడు ప్రేమ్ రక్షిత్. పాటను ఉక్రెయిన్‌లో ప్రెసిడెంట్ ప్యాలెస్ దగ్గర 20 రోజులు షూట్ చేశారు. ఇద్దరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే అయినా పర్ఫెక్ట్ సింక్ కోసం దాదాపు 46 రీటేకులు అయ్యాయి. నాటు నాటు నాచో నాచో తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో నాటు నాటు వీర నాటు హిట్ కొట్టింది. ఇందులోని హుక్ స్టెప్‌ను ఆబాల గోపాలం ఇమిటేట్ చేసింది. యూ ట్యూబ్ షాట్స్, ఇన్‌స్టా రీల్స్ వందల వేలుగా తయారయ్యాయి. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కూడా ఈ స్టెప్‌ను రిపీట్ చేశారు. ప్రపంచమంతా తెలుగు మోత మోగింది. ఒకప్పుడు రాజ్ కపూర్ చేసిన ‘ఆవారా హూ’ పాట ఇంత పెద్ద హిట్ అయ్యింది. తమిళంలో రహెమాన్ చేసిన ‘తిల్లానా తిల్లానా’ ఇలాగే హిట్ అయ్యింది. ఇప్పుడు తెలుగు వంతు. మన జానపదం, మన నాటుదనం ఇప్పుడు కేకమీదున్నాయి. ఇది తెలుగు ఘనం. ఇది తెలుగు జయం. ఇద్దరు స్టార్స్‌కి కొరియోగ్రాఫ్ చేయడం అనేది పెద్ద సవాల్. ఎందుకంటే ఒక్కో స్టార్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది. ‘నాటు నాటు..’కి రెండు స్టయిల్స్ తీసుకుని, ఒకే స్టయిల్‌గా మార్చడం జరిగింది. నేను సవాల్‌గా తీసుకుని ఈ పాట చేశాను. కొరియోగ్రాఫ్ చేయడానికి నాకు రెండు నెలలు పట్టింది. చిత్రీకరణకు 20 రోజులు. 43 రీటేక్స్ తీసుకోవడం జరిగింది. మొదట్లో కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే ఇద్దరు స్టార్స్‌ని సమానంగా చూపించాలి. అందుకే చివరి వరకూ పాటకు మెరుగులు దిద్దుతూనే ఉండేవాళ్లం. – ప్రేమ్ రక్షిత్, కొరియోగ్రాఫర్ కీరవాణి సార్‌తో నా ప్రయాణం ఒక దశాబ్దం నాటిది. సార్ నన్ను న మ్మి ‘నాటు నాటు..’ ని నాలుగు భాషల్లో పాడేలా చేశారు. ఇది నాకు అద్భుతమైన అవకాశం. ‘ఆర్ఆర్ఆర్’కి పాడటం అనేది నాకో పెద్ద చాలెంజ్. నిరూపించుకోవాలని చాలా కష్టపడి పాట పాడాను. ఈ పాటను పెద్ద హిట్ చేసినందుకు యావత్ భారతదేశానికి ధన్యవాదాలు. – రాహుల్ సిప్లిగంజ్, గాయకుడు ‘‘నా జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలివి. ఎందుకంటే ‘నాటు నాటు’ పాట విశ్వ వేదిక మీద విజయం సాధించింది. రచయితగా చాలా చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’’ అన్నారు చంద్రబోస్.‘‘28 ఏళ్ల ప్రస్థానం, 850 చిత్రాలు, 3,600లకు పైగా పాటలు.. మొట్ట మొదటి పాట ‘తాజ్‌మహల్’లోని ‘మంచు కొండల్లోన చంద్రమా..’ నుండి ఇప్పటి ‘వాల్తేరు వీరయ్య’లోని పాట వరకూ.. ప్రతి పాటకూ తపస్సే, మథనమే జ్వలనమే. 3500 సార్లకు పైగా తపస్సు చేస్తే ఒక్కసారైనా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు కదా. ఈసారి ‘నాటు నాటు..’ పాటకు భగవంతుడు ప్రత్యక్షం అయి, వరం ఇచ్చాడని భావిస్తున్నాను. – చంద్రబోస్, రచయిత ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసింది ‘‘ఈ విజయం చాలా ప్రత్యేకం. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్‌లకు అభి నందనలు. ఎస్.ఎస్. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతగానో గర్వించేలా చేసింది’’ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి మరిన్ని విజయాలు సాధించాలి ‘నాటు నాటు’ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి నందుకు ‘ఆర్ఆర్ ఆర్’ యూనిట్‌ని గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ అభినందించారు. ఈ పాటకు అవార్డు రావడం ద్వారా తెలుగు సినిమా ప్రపంచ సంగీత వేదికపై గర్వించదగ్గ స్థాయిలో నిలిచిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించా లని గవర్నర్ ఆకాంక్షించినట్లుగా రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. – విశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్ ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి తెలుగుజెండాను రెపరెపలాడించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్‌ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఈ విజయాన్ని చూసి గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), రామ్ చరణ్‌తోపాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. – వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి తెలుగు పాటకు దక్కిన గౌరవం ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం భారతీయ సంగీతానికి, ప్రత్యేకంగా తెలుగు పాటకు దక్కిన అద్భుత గౌరవమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి, నటులు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో పాటు యావత్ చిత్ర యూనిట్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మన సంగీతం, మన కొరియోగ్రఫీ, మన దర్శకత్వం, మన చిత్రాలు మరింత గుర్తింపును అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. – కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి -
తెలుగు జెండా రెపరెపలాడుతోంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: నాటు నాటు సాంగ్‌తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది. యావత్ రాష్ట్రం తరపున.. కీరవాణి, రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ మొత్తం ఆర్ఆర్ఆర్ టీంకు అభినందలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాము అంటూ ట్వీట్ చేశారాయన. The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY — YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023 బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ అవార్డును దక్కించుకోవడంతో.. ఇండియన్ సినిమా సంబురాలు చేసుకుంటోంది. -
ఈ గల్లీబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్‌పై వినిపించింది: రాహుల్ ఎమోషనల్
ఆర్ఆర్ఆర్ మూవీకి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. దీనికి ఎమ్ఎమ్ కీరవాని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీకి కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటి ముందుకు మీడియా, అభిమానుల భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా, ఫ్యాన్స్ మధ్య రాహుల్ కేక్ కట్ చేసి ఈ గ్రేట్ మూమెంట్‌ను సెలబ్రెట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావాడం చాలా హ్యపీగా ఉంది. ఆ రేంజ్లో పాటకు గుర్తింపు వస్తుందని అనుకోలేదు. నన్ను నేను ఎప్పుడు గల్లీబాయ్‌గా పోల్చుకుంటా. కానీ ఇప్పుడు ఈ గల్లీబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్‌పై వినిపించింది. స్టేజ్‌పై కీరవాణి గారు నా పేరు చెప్పడం గర్వంగా అనిపిస్తుంది. మళ్లీ ఇలాంటి మూమెంట్ వస్తుందో రాదో తెలియదు. నా వాయిస్‌ను అంగీకరించిన ఆర్ఆర్ఆర్ టీం, కీరవాణి సార్, రాజమౌళి సార్, రమ మేడమ్ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: గోల్డెన్ గ్లోబ్ అవార్డు: ఆర్ఆర్ఆర్ టీంకి చిరు, ఏఆర్ రెహమాన్ శుభాకాంక్షలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్... అవార్డ్ వచ్చేసింది! -
ఇది చారిత్రాత్మక విజయం: ఆర్ఆర్ఆర్ టీంకి మెగాస్టార్ విషెస్
అంతర్జాయతీయ స్థాయిలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్. అయితే తర్వాత స్థానంలో ఉండే మరో ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు. ఈ రెండు అవార్డులను చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రధానం చేస్తుంటారు. కేవలం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీలలోని బెస్ట్ సెలబ్రెటీలను ఎంపిక చేసి ఈ అవార్డులను అందచేస్తారు. And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie pic.twitter.com/CGnzbRfEPk — RRR Movie (@RRRMovie) January 11, 2023 తాజాగా ఈ గోల్డెన్ గోబ్ అవార్డు మన ఇండియన్ సినిమా గెలుచుకోవం విశేషం. కాగా ఈ అవార్డును గెలిచిన తొలి ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కింద గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఈ అవార్డును ఎమ్ఎమ్ కీరవాణి అందుకున్నారు. అంతర్జాతీయ స్టేజ్‌పై ఈ అవార్డు ప్రకటించగా ఆర్ఆర్ఆర్ టీం అంత పట్టనంత ఆనందంలో తేలిపోయింది. ఇక ఈ అవార్డును అందుకున్న కీరవాణికి, ఆర్ఆర్ఆర్ టీంకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ఎంత అద్భుతం. ఇదో చారిత్రాత్మక విజయం. What a Phenomenal, Historic Achievement !!!! 👏👏👏👏 Golden Globes Best Original Song - Motion Picture Award to @mmkeeravaani garu !! Take a Bow!🙏 Heartiest Congratulations Team @RRRMovie & @ssrajamouli !! India is proud of you! 🎉🎉 #NaatuNaatu 🕺🕺 pic.twitter.com/gl7QjMkJtZ — Chiranjeevi Konidela (@KChiruTweets) January 11, 2023 బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటకు గానూ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఎమ్ఎమ్ కీరవాణిగారికి శతకోటి వందనాలు. అత్యున్నత చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ టీం, రాజమౌళికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాటు నాటు పాటను చూసి ఇండియా గర్వపడుతుంది’ అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. అలాగే ఆస్కార్ ఆవార్డు గ్రహిత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా ఆర్ఆర్ఆర్ టీంకు శభాకాంక్షలు తెలిపారు. ఇదో అద్భతం.. నమ్మశక్యం కానిది.. ఇండియా తరుపున.. ఇండియన్ అభిమానుల తరుపున కీరవాణి గారికి శుభకాంక్షలు. అలాగే రాజమౌళి గారికి, ఆర్ఆర్ఆర్ టీంకు కూడా కంగ్రాట్స్’ ట్వీట్ చేశారు. Incredible ..Paradigm shift🔥👍😊👌🏻 Congrats Keeravani Garu 💜from all Indians and your fans! Congrats @ssrajamouli Garu and the whole RRR team! https://t.co/4IoNe1FSLP — A.R.Rahman (@arrahman) January 11, 2023 -
ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం(డిసెంబర్ 14న)ఆయన తల్లి మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు కిమ్స్ ఆస్పత్రిలో చెర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. మరికాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి నివాసానికి తరలించనున్నారు. ఆమె మృతితో కీరవాణి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. తల్లి మృతితో తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు కీరవాణి. టాలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. చదవండి: ‘బాహుబలి’తో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే.. ఆకట్టుకుంటున్న ప్రొమో గ్లింప్స్ మహేశ్-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్డేట్! సూపర్ స్టార్‌కు తండ్రిగా ఆ స్టార్ నటుడు? -
నన్ను నమ్మిన మొదటి వ్యక్తి నువ్వే డార్లింగ్: ప్రభాస్‌పై జక్కన్న కామెంట్స్
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనగానే టక్కున చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు చలనచిత్ర స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయనే. స్టూడెంట్ నం.1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు టాలీవుడ్లో సంచలనాలు సృష్టించారు. అలా భారత సినీ పరిశ్రమలో డైరెక్టర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి. ఇటీవల ఆయన రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల రివార్డులతో పాటు రికార్డులను సొంతం చేసుకుంటుంది. చదవండి: అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటిస్తా: రణ్‌బీర్ కపూర్ ఇప్పటికే ఆస్కార్ బరిలో నిలిచిన ఈ మూవీ రీసెంట్గా గోల్డెన్ గ్లోబ్స్- 2023 అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ నాన్ ఇంగ్లీష్ చిత్రం, ఉత్తమ పాటల కేటగిరీలో నామినేట్ అవ్వడం విశేషం. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ మూవీకి గానూ డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కిరవాణిలు ఓ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకోగా, లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుకు రన్నర్‌గా నిలిచారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎమ్ఎమ్ కిరవాణి లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు. దీంతో వీరిద్దరికి సినీ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: పాన్ ఇండియా కల్చర్ ఇండస్ట్రీని నాశనం చేస్తోంది: స్టార్ డైరెక్టర్ అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వీరికి సోషల్ మీడియా వేధికగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు డార్లింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. ‘గ్రేటెస్ట్ రాజమౌళి గారు సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. బెస్ట్ డైరెక్టర్‌గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్‌తో పాటు లాస్ ఏంజెల్స్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ డెరెక్టర్ రన్నరప్ పురస్కారాలు అందుకున్నందుకు నా శుభాకాంక్షలు. అలాగే లాస్ ఏంజెల్స్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ గెల్చుకున్న కీరవాణి గారికి కంగ్రాట్స్’ అంటూ ప్రభాస్ పోస్ట్ చేశాడు. ఇక ప్రభాస్ పోస్ట్‌పై రాజమౌళి స్పందించారు. ‘‘థాంక్స్ డార్లింగ్. నేను ఇంత పేరు(ప్రపంచ స్థాయి గుర్తింపు) తెచ్చుకుంటానని నాకంటే ముందు నమ్మిన వ్యక్తి నువ్వే’’ అంటూ సమాధానం ఇచ్చారు. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
హరిహర వీరమల్లు క్రేజీ అప్డేట్.. నవరాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ..!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. నవరాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారడంతో పవర్ స్టార్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో పవన్ మొదటిసారి ఓ వారియర్‌గా కనిపించనున్నారు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోటోతో షూటింగ్‌కు సంబంధించిన వర్క్‌షాప్ ప్రారంభమైనట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. (చదవండి: Pawan Kalyan: 'ఫ్యాన్స్‌కు పండగే..'హరిహర వీరమల్లు' నుంచి పవర్ గ్లాన్స్ వచ్చేసింది) With HHVM himself 😊 నవరాత్రులలో నవ- ఉత్తేజం ! pic.twitter.com/4VNoPdpJ2G — mmkeeravaani (@mmkeeravaani) September 30, 2022 -
‘బింబిసార’ కోసం కల్యాణ్‌రామ్ ఇంత కష్టపడ్డారా... మేకింగ్ వీడియో
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌ని కళకళలాడించిన చిత్రం ‘బింబిసార’. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండు నెలలుగా హిట్ లేక విలవిలలాడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి అందించింది. ఈ చిత్రం విడుదలై పది రోజలు దాటినా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ది క్రానికల్స్’పేరిట మేకింగ్ వీడియోని విడుదల చేసింది. (చదవండి: గొప్ప మనసు చాటుకున్న ప్రశాంత్ నీల్.. గర్వంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్) ఈ చిత్రంలోని ఫైటింగ్ సీన్స్ ఎలా షూట్ చేశారు?సెట్ నిర్మాణానికి మేకర్స్ పడిన కష్టమేంటి? తదితర విశేషాల్ని ఈ వీడియోలో చూడొచ్చు. కల్యాణ్ రామ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించినట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ వశిష్టకు ఇది తొలి సినిమా అయినప్పటికీ.. అద్భుతంగా తెరకెక్కించాడు. కీరవాణి నేపథ్య సంగీతం, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమా స్థాయిని పెంచాయి. . ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. -
కీరవాణి సంగీత సారథ్యంలో గద్దర్ పాట
రాజకీయ నేత ‘అద్దంకి దయాకర్’ ప్రధాన పాత్రలో బహుముఖ ప్రతిభాశాలి డా.మురళి బొమ్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘బొమ్మకు క్రియేషన్స్’పతాకంపై ప్రొడక్షన్ నంబర్ - 6గా డా.మురళి బొమ్మకు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా పేరు ప్రకటించని చిత్రం నుంచి ‘బానిసలారా లెండిరా’అనే పాటను విడుదల చేశారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ గీతానికి ‘ప్రజాయుద్ధనౌక’ గద్దర్ సాహిత్యాన్ని సమకూర్చి గాత్రాన్ని అందించారు. ఈ చిత్రంలో గద్దర్ ఓ ముఖ్య పాత్ర సైతం పోషించడం విశేషం. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఆడియో వేడుకలో విప్లవ గళం గద్దర్, చిత్ర కథానాయకుడు అద్దంకి దయాకర్, దర్శకనిర్మాత-స్టూడియో అధినేత డా.మురళి బొమ్మకు, రాజకీయ ప్రముఖులు జె.బి.రాజు, మల్లు రవి, మన్వతా రాయ్, బెల్లయ్య నాయక్, చరణ్ కౌశిక్ యాదవ్, శివకుమార్, దుర్గం భాస్కర్, విజయ్ కుమార్, భాస్కర్ రెడ్డి, రమేష్ రాథోడ్, కేతురి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో దయాకర్,గద్దర్‌లతో పాటు సుమన్, ఇంద్రజ, సితార, శుభలేక సుధాకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్
సరైన హిట్టు కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నాడు కల్యాణ్ రామ్. దీంతో ఆయన ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా బింబిసార టీం యాంకర్ సుమతో. కల్యాణ్ రామ్, సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, హీరోయిన్ సంయుక్త మీనన్ ఇతర టీం కలిసి సుమతో లంచ్ చేస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. చదవండి: ప్రస్తుత టాలీవుడ్ కష్టాలకు కారణం డైరెక్టర్ రాజమౌళి: వర్మ కాగా ఈ మూవీ టైం ట్రావెలర్ నేపథ్యంలో రూపొందడంతో సుమ ఈ ప్రశ్నతోనే ఇంటర్య్వూను మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కీరవాణిని మీరు టైం ట్రావెల్ అవ్వాలనుకుంటే ఏం చేంజ్ చేయాలనుకుంటారని అడగ్గా.. కీరవాణి తాను 2018 ఆగస్ట్ 28కి వెళ్తానన్నారు. ‘అప్పుడు నేను హరికృష్ణ గారికి కాల్ చేసి మనం కంపోజింగ్ పెట్టుకుందాం, ఓ రెండు రోజులు నాతో ఉండిపోండి అని చెప్పేవాడి. అలా చెప్పడం వల్ల ఆయన ఆగస్ట్ 29న జర్నీ చేయరు కదా. ఎందుకంటే హరికృష్ణ గారికి నా కంపోజింగ్ అంటే చాలా ఇష్టం. నేను అలా కాల్ చేసుంటే కచ్చితంగా ఆయన నాతోనే ఉండేవారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సుమ కల్యాణ్ రామ్‌ని మీ తండ్రి చనిపోయిన రోజు ఎక్కడ ఉన్నారని అడగ్గా.. తాను ఇంట్లోనే ఉన్నానన్నాడు. చదవండి: సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్‌తో చై చర్చలు.. అందుకేనా? ‘ఉదయం 5:30 ఆ సమయంలో నేను ఇంట్లో బాల్కానిలో కూర్చోని టీ తాగుతున్నా. అప్పుడే నాకు శివాజీ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అప్పుడు ఆయన నాన్నతో(హరికృష్ణ) కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఏమైందా అని శివాజీ గారు శివాజీ గారు అని అన్నాను. కానీ అప్పటికే కాల్ కట్ అయ్యింది’ అని చెప్పాడు. ఆ తర్వాత తన మావయ్యకు చెందిన ఫ్యాక్టరీలో పనిచేసే ఓ ఉద్యోగి అదే సమయంలో విజయవాడకు వెళ్తూ నాకు కాల్ చేసి.. కొన్ని ఫొటోలు పంపించారని గుర్తు చేసుకుని కల్యాణ్ రామ్ ఏమోషనల్ అయ్యాడు. కాగా 2018 ఆగస్ట్ 29న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఆయన సోదరి, కల్యాణ్ రామ్ మేనత్త ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
నీతో ఉంటే చాలు.. హత్తుకునేలా 'బింబిసార' గీతం
Neetho Unte Chalu Song Out From Bimbisara: 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే క్యాప్షన్ ద్వారా ఈ మూవీ ఒక టైమ్ ట్రావెల్ చిత్రమని చెప్పకనే చెబుతున్నారు. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. ఇటీవల గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'నీతో ఉంటే చాలు' అంటూ సాగే ఈ గీతం మనసుకు హత్తుకునేలా ఉంది. స్వీయ సంగీత దర్శకత్వంలో ఎంఎం కీరవాణి రాసిన ఈ పాటను మోహన్ భోగరాజు, శాండిల్య ఆలపించారు. కాగా ఈ మూవీలో సంయుక్త మీనన్, కేథరీన్ థ్రేసా హీరోయిన్లుగా నటించారు. చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్ నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన This melody #NeethoUnteChalu from #Bimbisara hits you different once you own it ❤️🔥 Tune into the Lyrical Video now 🔗 https://t.co/FxEIIAdgsp#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @saregamasouth pic.twitter.com/3X0fPdgZAX — NTR Arts (@NTRArtsOfficial) August 1, 2022 చదవండి: బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. సల్లూ భాయ్‌కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? -
‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఐదు విభిన్న కథలు, జోనర్లతో 'పంచతంత్ర కథలు'.. ఆసక్తిగా ట్రైలర్
Panchatantra Kathalu Trailer Released: ఐదు వేరు వేరు కథలతో ఆంథాలజీ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం `పంచతంత్ర కథలు`. మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన `మోతెవరి` సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంఎం. కీరవాణి మాట్లాడుతూ - ``గంగనమోని శేఖర్ దర్శకత్వంలో మధు క్రియేషన్స్ పతాకంపై 'పంచతంత్ర కథలు' అనే ఈ ఆంథాలజీ ఐదు వేరు వేరు కథలు.. వేరు వేరు జోనర్లలో రావడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్స్ అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. అన్నింటిని మించి మా ఫ్యామిలీ మెంబర్ నోయెల్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను`` అని తెలిపారు. కాగా ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ ఎ సర్టిఫికేట్ పొందింది. సెన్సారు సభ్యులు ఈ సినిమా చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. అతి త్వరలో ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించనున్నారు. -
వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన
Raghava Lawrence Chandramukhi 2 Lyca Productions Official Announcement: సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయన తార కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రం 'చంద్రముఖి'. 2005లో వచ్చిన ఈ మూవీకి పి. వాసు దర్శకత్వం వహించారు. కామెడీ, హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తే ఎంతో బాగుంటుందని సగటు ప్రేక్షకుడు కోరుకున్నాడు. అందుకు తగినట్లుగానే ఈ ఆల్‌టైమ్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరో, హీరోయిన్లు ఎవరు అనే అంశంపై స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. 'చంద్రముఖి' సినిమా విడుదలై సుమారు 17 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్' అధికారికంగా తెలిపింది. అయితే ఈ సినిమాలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 'కాంచన' మూవీ సిరీస్‌లతో హారర్, కామెడీ అందించడంలో దిట్టగా లారెన్స్ నిరూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ 'చంద్రముఖి 2'లో మేయిన్ రోల్లో లారెన్స్ నటించనున్నాడు. మొదటి సినిమాను డైరెక్ట్ చేసిన పి. వాసు ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. చంద్రముఖిలో తనదైన కామెడీని పండించిన వడివేలు ఈ సీక్వెల్లో అలరించనున్నాడు. అలాగే ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించునున్నారు. ఆర్డీ రాజశేఖర్ కెమెరామేన్‌గా బాధ్యలు చెపట్టగా, తోట తరణి ఆర్ట్ వర్క్‌ను చూసుకోనున్నారు. Elated to announce 🤩 our next Big project #Chandramukhi2 🗝️✨ Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎 Directed by #PVasu 🎬 Music by @mmkeeravaani 🎶 Cinematography by @RDRajasekar 🎥 Art by #ThottaTharani 🎨 PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/NU76VxLrjH — Lyca Productions (@LycaProductions) June 14, 2022 అయితే 'చంద్రముఖి' సినిమాను శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించగా 'చంద్రముఖి 2'ను నిర్మించే బాధ్యతను మాత్రం 'లైకా ప్రొడక్షన్స్' తీసుకుంది. అయితే ఈ మార్పుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా, ఇది బహుభాషా చిత్రంగా ఉంటుందా ? లేదా తమిళంలో మాత్రమే విడుదల చేస్తారా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే. ఇదిలా ఉంటే చంద్రముఖి తర్వాత వెంకటేశ్, పి. వాసు కాంబినేషన్లో 'నాగవల్లి' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రముఖి సినిమాకు ఇదే సీక్వెల్‌గా ప్రచారం జరిగింది. కాకపోతే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ఇప్పుడు పక్కా స్క్రిప్ట్‌తో చంద్రముఖి 2ను రూపొందించనున్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. Positive Vibes ✨ & Happy Faces 😇 all around #Chandramukhi2 🗝️✨ Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎 Directed by #PVasu 🎬 Music by @mmkeeravaani 🎶 Cinematography by @RDRajasekar 🎥 Art by #ThottaTharani 🎨 PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/pf57zgJ7xC — Lyca Productions (@LycaProductions) June 14, 2022 -
'ఉస్తాద్'గా రాబోతున్న కీరవాణి తనయుడు శ్రీసింహ
‘మత్తు వదలరా, తెల్లవారితే గురువారం’ చిత్రాల ఫేమ్ హీరో శ్రీ సింహా కోడూరి తాజా చిత్రం ‘ఉస్తాద్’ షురూ అయింది. ఫణిదీప్ దర్శకుడు. రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టారు. ‘‘న్యూ ఏజ్ డ్రామాగా రూపొందనున్న చిత్రం ‘ఉస్తాద్’. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: పవన్ కుమార్ పప్పుల, సంగీతం: అకీవా. బి. చదవండి 👇 సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే.. కిరాక్ ఆర్పీ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్ -
పక్కింట్లో టీవీ చూసే బుడ్డి సుమ సినిమాల్లోకి రావడం అదృష్టం
‘‘సుమ పంచాయితీ పెడుతుందని కాదు.. పిలిచిందని ప్రేమతో వచ్చాను (నవ్వుతూ). సుమ ప్రతిభను దర్శకులు, టెక్నిషియన్స్ పది శాతం వినియోగించుకున్నా చాలు ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది. సుమకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు హీరో నాగార్జున. ప్రముఖ యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున, నాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటుడు రాజీవ్ కనకాల (సుమ భర్త) బిగ్ టికెట్ అందుకున్నారు. నాని మాట్లాడుతూ.. ‘‘సుమగారికి నేను పెద్ద అభిమానిని. ఇండస్ట్రీలో పెద్దలు, ప్రభుత్వాలు, అసోసియేషన్స్ సినిమాకు ఏం చేశాయో నాకు తెలియదు కానీ సుమగారు మాత్రం తెలుగు సినిమాకు చాలా చేశారు. ప్రతి సినిమాకు సుమగారు పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు. ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్ చూశాను. సుమగారు బాగా చేశారు’’ అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూసి సుమగారికి ఆడియన్స్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందమైన ఆడవాళ్లను చూశాను. తెలివితేటలున్న ఆడవాళ్లను చూశాను. మంచి మనసున్న ఆడవారిని చూశాను. ఈ మూడూ సుమలో ఉన్నాయి’’ అన్నారు. సుమ మాట్లాడుతూ – ‘‘టీవీ చూసేందుకు పక్కింటికి వెళ్లిన ఓ బుడ్డి సుమ.. టీవీకి వచ్చి, సినిమాకు కూడా రావడం అనేది నిజంగా అదృష్టం. ఆడియన్స్ ప్రోత్సాహంతోనే నాకు ఎనర్జీ వస్తుంది. అందరి హీరోల ఫ్యాన్స్ మా సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. విజయం సాధించిన ప్రతి మగాడి వెనక ఓ మహిళ ఉందంటారు. కానీ విజయం సాధించిన ప్రతి మహిళ వెనక ఓ కుటుంబం ఉంటుంది. మీరందరూ (ప్రేక్షకులను ఉద్దేశించి) నా ఫ్యామిలీ’’ అన్నారు. ‘‘సుమగారు మంచి ప్రతిభావంతురాలు. ఓ రెండు షాట్స్‌లో తప్పులు కనిపెట్టి, వాటిని మ్యూజిక్‌తో ఎలివేట్ చేద్దామన్న కీరవాణిగారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు విజయ్ కుమార్. ‘‘నేను సిక్కోలు బిడ్డను. సుమగారు లేకపోతే ‘జయమ్మ పంచాయితీ’ లేదు. కీరవాణిగారు మా సినిమాకు సంగీతం అందిస్తా అన్నప్పుడే మా సినిమా విజయం సాధించినట్లు భావించాను. సక్సెస్ మీట్లో మరింత మాట్లాడతాను’’ అన్నారు నిర్మాత బలగ ప్రకాశ్. ఓ సినిమా సాంగ్ షూట్లో ఉన్నందువల్ల దర్శకులు రాఘవేంద్రరావు, వెకేషన్లో ఉన్నందువల్ల రాజమౌళి ఈ వేడుకకు రాలేకపోతున్నట్లుగా వీడియో సందేశాలు పంపారు. చిత్రయూనిట్‌కి దర్శకులిద్దరూ శుభాకాంక్షలు తెలిపారు. రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, గాయకుడు రేవంత్, డీవోపీ అనుష్కుమార్, ఆర్ట్ డైరెక్టర్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఒకే రోజు ముచ్చటగా 3 సినిమాలు.. దేనికి ఆడియెన్స్ ఓటు ! -
హృదయాలను హత్తుకునేలా సుమ ‘గొలుసు కట్టు గోసలు’ పాట
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. (చదవండి: సొంతూరికి బస్సు వచ్చేలా చేసిన బిగ్‌బాస్ గంగవ్వ..) ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గొలుసు కట్టు గోసలు’ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘కలిసి బతికే కాలమేమాయే నేడే..పగటి వేళ పీడ కలలాయే, అలసి పోని ఆశలేమాయే అయ్యో... గొలుసు కట్టు గోసలైపోయే’ అంటూ చాలా ఎమోషనల్‌గా సాగే పాట ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంది. సినిమాలో సుమ దయనీయ పరిస్థితిని ఈ పాట వివరిస్తుంది. ఈ పాటకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించమే కాకుండా.. హరిహరన్‌తో కలిసి ఆలపించారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్ఆర్ఆర్ నుంచి కొమ్మా ఉయ్యాల ఫుల్ సాంగ్ వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో బ్రిటీష్ దొరసాని ఓ చిన్నారిని ఎత్తుకుపోవడంతో కథ మొదలవుతుంది. అందమైన గొంతుతో అందరినీ హత్తుకునేలా పాట పాడుతూ బ్రిటీష్ దొరసాని చేతికి డిజైన్ వేస్తుంటుంది మల్లి. ఆమె టాలెంట్‌కు మంత్రముగ్ధురాలైన ఆమె తిరిగి కోటకు వెళ్లేటప్పుడు మల్లిని అన్యాయంగా లాక్కుని పోవడంతో సినిమా ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో మల్లి పాడే కొమ్మా ఉయ్యాల.. కోన జంపాల.. పాట సూపర్ హిట్టయ్యింది. తాజాగా ఆర్ఆర్ఆర్ యూనిట్ 'కొమ్మా ఉయ్యాల' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. ఇందులో మల్లిని ఎత్తుకుపోయే దగ్గర నుంచి ఆమె బందీ అయిన క్షణాలు, ఎన్టీఆర్ ఆమెను భుజానెక్కించుకుని తిరిగిన సందర్భాలను చూపించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను చిన్నారి ప్రకృతి రెడ్డి అద్భుతంగా ఆలపించింది. చదవండి: ఆర్ఆర్ఆర్లో ఆ సీన్స్ హైలైట్, కొన్ని సన్నివేశాల్లో ఏడ్చేశాను తెలుగు హీరోలకు పర భాష డైరెక్టర్ల వణక్కమ్.. నమస్కార.. -
కీరవాణి కంపోజ్ చేసిన ఆ పాట అంటే ఇరిటేషన్: ఎన్టీఆర్
Jr NTR Shocking Comments: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మరోసారి ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. తాజాగా ప్రమోషన్లో భాగంగా తారక్, చరణ్, సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణిలు సరదాగా ముచ్చటించారు. చదవండి: అలా చేస్తే ‘గాడ్ ఫాదర్’ నుంచి తప్పుకుంటా: చిరుకు సల్మాన్ కండిషన్! ఈ ఇంటర్వ్యూ హీరోలిద్దరిని ఆసక్తికర ప్రశ్నలు అడిగి వారిని ఇబ్బందిలో పెట్టాడు. ఇలా సాంతం ఇంటర్య్వూలో ఆసక్తిగా సాగింది. ఈ సందర్భంగా కిరణవాణి ఎన్నో ఎళ్లుగా పాటలు కంపోజ్ చేస్తూ పాడుతూ వచ్చాను. ఇక తన పాటల్లో అంత్యంత చెత్త కంపోజింగ్ ఏంటని చరణ్, తారక్‌లకు అడిగి ఇరకాటంలో పెట్టాడు కిరవాణి. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ మీ కంపోజ్ చేసిన చెత్త పాటల్లో భీమవరం బుల్లోడా తనకు అస్సలు నచ్చదు అంటూ సూటింగా చెప్పేశాడు. కానీ ఆ పాట చాలా బాగుంటుంది, పాట మధ్యలో వచ్చే బీట్ తనకు బాగా నచ్చుతుంది అని చెప్పాడు. చదవండి: ఎన్నో రకాలుగా మోసపోయాను: మోహన్ బాబు భావోద్వేగం ఆ తర్వాత ఎన్టీఆర్ ‘భీమావరం బుల్లోడా పాలు కావాలా..’ అని పాడుతూ ఆ మధ్యలో వచ్చే మ్యూజిక్ తనకు అసలు నచ్చదని, చాలా ఇరిటేషన్‌గా అనిపిస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ పాట ఘరానా బుల్లోడి మూవీలోనిది. నాగార్జున, రమ్యకృష్ణ ఆమని, కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా 1995 విడుదలైంది. ఈ మూవీ సమయంలో ఈ పాట సూపర్ సక్సెస్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ పాటకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి హిట్ పాట మరి ఎన్టీఆర్ ఎందుకు నచ్చలేదా అని అందరూ అభిప్రాయ పడుతున్నారు. -
ఎన్టీఆర్ మరియు రామచరణ్ తో ఎం ఎం కిరవాణి
-
ఇంకా తగ్గని 'నాటు నాటు' సాంగ్ మేనియా.. ఖాతాలో మరో రికార్డు
Natu Natu Song From RRR Movie Got 200 Million Views ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీ స్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం అనేక వాయిదాలు పడటంతో సినీ ప్రేక్షక లోకం ఎంతో నిరాశకు గురైంది. ఆ నిరాశ నుంచి సాంత్వన కలిగించేందుకు సినిమా టీజర్స్, మేకింగ్ వీడియోస్, పోస్టర్లతో అలరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట 'నాటు నాటు' సాంగ్. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్స్ రికార్డు సృష్టించాయి. అంతేకాకుండా ఈ పాటను అనుకరిస్తూ వివిధ భాషల్లో అనేకమంది తమదైన స్టైల్లో కవర్ సాంగ్స్, రీల్స్, వీడియోస్ చేసి ఆకట్టుకున్నారు. ఇక యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వీక్షణలు దక్కించుకుని ట్రెండ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో రికార్డు సొంతం చేసుకుంది. 'నాటు నాటు' సాంగ్ అన్ని భాషల్లోనూ కలుపుకొని ఏకంగా 200 మిలియన్ క్లబ్‌లోకి చేరుకుంది. ఈ వ్యూస్‌తో తన మేనియా ఇంక తగ్గలేదని దుమ్ములేపుతోంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం తోడవడంతో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడే ఇంత రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఈ సాంగ్ వెండితెరపై ఏ స్థాయిలో హైలెట్ అవుతుందో చూడాలి. -
జెంటిల్మెన్-2 చిత్రానికి సంగీత దర్శకుడు ఖరారు
MM Keeravani To Compose Music For Gentleman-2: గతంలో జెంటిల్మెన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. కె.టి.కుంజుమోన్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా శంకర్ దర్శకుడిగా పరిచయం కావడం గమనార్హం. ఆ తరువాత పలు భారీ చిత్రాలను నిర్మించిన కె.టి.కుంజుమోన్ కొంత గ్యాప్ తరువాత తాజాగా జెంటిల్మెన్ –2 చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరన్నది గెస్ చేసిన వారికి బంగారు నాణేన్ని బహుమతిగా అందించనున్నట్లు నిర్మాత ప్రకటించారు. దీంతో పలువురు తమకు తోచిన సంగీత దర్శకుల పేర్లను తెలియచేశారు. వారిలో జెంటిల్ మెన్ –2కు సంగీత దర్శకుడు ఎవరన్నది కరెక్టుగా తెలిపిన మొదటి ముగ్గురికి బంగారు నాణేలను బహుమతిగా త్వరలో అందించనున్నట్లు నిర్మాత చెప్పారు. కాగా ఆదివారం ఆయన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించనున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. ఈయన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలకు సంగీతాన్ని అందించారన్నది గమనార్హం. ఇకపోతే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తానని కుంజుమోన్ వెల్లడించారు. -
RRR: ‘జనని’ లో కనిపించని ఎమోషన్స్ ఉంటాయి : రాజమౌళి
రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలతో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నవంబర్ 26న ‘జనని’పాటను విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్స్‌తో పాటు రెండు పాటలకు బారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘నాటు నాటు’సాంగ్‌లో ఎన్టీఆర్, చెర్రీ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ శుక్రవారం విడుదలయ్యే ‘జనని’సాంగ్ చాలా ప్రత్యేకమైనది చెబుతున్నాడు రాజమౌళి. సినిమాకు ఎలాగైతే ముందు రోజు మీడియాకు ప్రివ్యూ షోలు వేస్తారో.. అలాగే ‘జనని' పాటకు కూడా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాడు జక్కన్న. గురువారం ఉదయం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మీడియా కోసం ప్రత్యేకంగా ఈ సాంగ్‌ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘జనని’ సాంగ్ ఆర్ఆర్ఆర్ మూవీకి ఓ సోల్. ఈ సాంగ్ కోసం పెద్దన్న కీరవాణి రెండు నెలలు శ్రమించాడు. ఆయనే లిరిక్స్ అందించాడు. ఈ సాంగ్‌లో కనిపించని ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలా సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ ఎమోషనల్ లోనే దాగి ఉంటుంది. జనని పాటను మీ ముందుకు తెస్తున్నందుకు గర్వంగా ఉంది’అన్నారు. ‘ఆర్ఆర్ఆర్ సోల్ ఆంథెమ్' పేరుతో ఈ పాట శుక్రవారం సాయంతం మనందరి ముందుకు రానుంది. -
యాంకర్ సుమకు హీరో నాని సాయం.. సాంగ్ అదిరిందిగా!
బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ మూవీలో సుమ ప్రధాన పాత్రలో నటిస్తుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తొలి సాంగ్‌ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ‘తిప్పగలనా.. చూపులు నీ నుంచే’ అంటూ సాగే ఈ పాటకు రామాంజనేయులు లిరిక్స్ అందించగా, . పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించాడు. -
ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది: డైరెక్టర్ క్రిష్
‘‘కొండపొలం’ ఫైనల్ కాపీ చూసినప్పుడు ‘ఇదీ సినిమా అంటే’ అనిపించింది. ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది. ప్రేక్షకులు కూడా ఇదే మాట అంటారు’’ అని డైరెక్టర్ క్రిష్ అన్నారు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో క్రిష్ మాట్లాడుతూ..‘‘కీరవాణిగారు మా సినిమాకి ఓ గైడ్‌లా పని చేశారు. ‘కొండపొలం’ హిట్ అనేది నాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి చాలా అవసరం. ఇప్పుడున్న థియేటర్లకి, మా మనుగడకు అవసరం. చాలా గొప్ప సినిమా, చాలా జాగ్రత్తగా తీశానని బలంగా నమ్మాను.. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు’’ అన్నారు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ...‘‘నా మొదటి చాప్టర్ ‘ఉప్పెన’ అయితే రెండో చాప్టర్ ‘కొండపొలం’. ఈ చిత్రంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. క్రిష్, రాజీవ్, జ్ఞానశేఖర్గార్లకు మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఈ సినిమా షూటింగ్లో సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాళ్లు చాలా కష్టపడ్డారు.. వారందరి కష్టమే ఈ ‘కొండపొలం’. జీవితంలో ఎన్నిసార్లు కింద పడ్డా లేవాలనే ఒక స్ఫూర్తిని మా సినిమా కలిగిస్తుంది. రవీంద్ర అనే ఓ మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు క్రిష్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వరుణ్ తేజ్ రెండో సినిమా ‘కంచె’, వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం ‘కొండపొలం’ మేమే నిర్మించాం. ‘కొండపొలం’తో వైష్ణవ్ స్టార్ అవుతాడు. రకుల్ ఎంతో అంకితభావంతో ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసినందుకు థ్యాంక్స్. క్రిష్‌కి గ్రేట్ ఫిల్మ్ ఇది’’ అన్నారు. రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘కొన్ని జీవితాలను చూసి నేను రాసిన పాత్రలకు క్రిష్‌గారు తెరపై జీవం పోసి, సినిమాగా తీశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామ్యాన్ జ్ఞానశేఖర్, దర్శకులు హరీష్ శంకర్, బుచ్చిబాబు, లక్ష్మీకాంత్ చెన్నా, పాటల రచయిత చంద్రబోస్, నటి హేమ, ‘మ్యాంగో మీడియా’ రామ్, నటులు సాయిచంద్, రవి, మహేశ్ విట్టా తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
RRR Movie :ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. వేరే లెవల్ అంతే..
RRR Friendship Song: జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్). భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే గిఫ్ట్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ నుంచి తొలి పాటను 'ఫ్రెండ్షిప్ డే' సందర్భంగా ఆగస్ట్1న ఉయయం 11గంటలకు విడుదల చేశారు. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ‘దోస్తీ’ అంటూ సాగే ఈ థీమ్ సాంగ్ చివర్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కనిపించారు. 'ఊహించని చిత్ర విచిత్రం..స్నేహానికి చాచిన హస్తం..ప్రాణానికి ప్రాణం ఇస్తుందో, తీస్తుందో'...అంటూ సాగిన ఈ సాంగ్ చివర్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం హైలైట్‌గా నిలిచింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం సంగీతం అందించారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు. హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ వివిధ భాషల్లో ఈ పాటను ఆలపించారు. ఇక ఈ సాంగ్ పాడిన ఐదుగురు సింగర్స్ ఈ వీడియో సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. ఈ పాట కోసం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్ వేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. #Dosti | #Natpu | #Priyam Telugu- https://t.co/vuwMb8q383 Tamil- https://t.co/VKF46yfc2c Hindi- https://t.co/2omQXIAHJN Kannada- https://t.co/BTsQ18OqWZ Malayalam- https://t.co/LBbwrdH4hl #RRRMovie @mmkeeravaani @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @TSeries @LahariMusic — RRR Movie (@RRRMovie) August 1, 2021 -
మణిశర్మ స్వరాలకు కీరవాణి గాత్రం తోడైతే..
ధ్రువన్, నియా త్రిపాఠి, సుహాసిని, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బలమెవ్వడు'. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, టైటిల్ సాంగ్‌ని కీరవాణి ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సంగీత ప్రపంచంలో మణిశర్మ, కీరవాణిలది ప్రత్యేక స్థానం. అలాంటిది ఓ సాంగ్ కోసం ఇద్దరూ కలిశారు. మణిశర్మ స్వరాలకి కీరవాణి గాత్రం అందించారు. ఈ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇక సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్‌కు మంచి ఆధరణ లభిస్తుంది. -
RRR Movie :అదిరిపోయే అప్డేట్, ఫస్ట్ సాంగ్ డేట్ ఫిక్స్, సింగర్స్ వీరే
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ చిత్ర ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇక ఈ సినిమా నుండి ఏమైన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయాని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా తొలి పాటను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్ట్ 1న ఉయదం 11గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విటర్ వేదికగా తెలియజేస్తూ.. కీరవాణి బృందానికి చెందిన ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. కాగా, ప్రమోషన్లో భాగంగా‘ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్’ పేరిట చిత్రబృందం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారనే విషయం తెలిసిందే. ‘దోస్త్’ అంటూ సాగే ఈ థీమ్ సాంగ్‌లో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొనగా, రీసెంట్‌గానే హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ఈ పాటను చిత్రీకరించారని సమాచారం. ఆగస్ట్ 1న ఈ పాటను విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన ఫోటోలో ఈ ప్రత్యేక పాటను ఎవరు ఆలపిస్తున్నారో కూడా తెలియజేశారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ ఆ పాటను ఆలపించినట్లు ఫోటో ద్వారా తెలియజేశారు. స్నేహం విలువని తెలియజేసే గీతమిదని చిత్రబృందం . ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. The First Song from #RRRMovie on August 1st, 11 AM.🤝#Dosti #Natpu #Priyam 🔥🌊 An @mmkeeravaani Musical.🎵 🎤@itsvedhem @anirudhofficial @ItsAmitTrivedi @IAMVIJAYYESUDAS #YazinNizar@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LahariMusic @TSeries pic.twitter.com/dyBaFxQPxt — RRR Movie (@RRRMovie) July 27, 2021 -
ఆర్ఆర్ఆర్ అప్డేట్ : స్టూడియోలో మ్యాజిక్ జరిగిందట
విజువల్స్ పరంగా మాత్రమే కాదు... మ్యూజిక్ పరంగా కూడా స్పెషల్ కేర్ తీసుకుంటుంటారు దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) విషయంలోనూ ఇదే ఫాలో అవుతున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ విశాల్ మిశ్రాతో పాట పాడించారట రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ సంగీత దర్శకుడు కీరవాణి, రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు విశాల్ మిశ్రా. ‘‘ఆర్ఆర్ఆర్’ కోసం స్టూడియోలో మేం మ్యాజిక్ చేశాం. కమింగ్ సూన్’’ అని పేర్కొన్నారు విశాల్. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. We made magic today at the studio 🎶 R.R.R coming soon ❤️ @ssrajamouli @RRRMovie #mmkeeravani #vishalmishra #bestcompany pic.twitter.com/ENU5Mwvoo0 — Vishal Mishra (@VishalMMishra) April 10, 2021 -
నా కష్టసుఖాల్లో ఉన్నది ఆ ఇద్దరే: ఎన్టీఆర్
‘‘నాకు 20 ఏళ్ల నుంచి దేవుడిచ్చిన శక్తి మీరైతే (ఫ్యాన్స్).. నాకు దేవుడిచ్చిన కుటుంబం, నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం మా కీరవాణి, జక్కన్న (రాజమౌళి) కుటుంబం’’ అని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. చిత్రా శుక్లా, మిషా నారంగ్ కథానాయికలుగా నటించారు. మణికాంత్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయిలు అభయ్, భార్గవ్ వారికి ఇష్టం వచ్చిన రంగంలో ఏదైనా సాధించిన రోజు వాళ్ల గురించి నేను మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగానూ, బ్లాంక్‌గానూ ఉంటానో.. నా తమ్ముళ్లు భైరవ, సింహా సాధించిన విజయం, స్థానం గురించి మాట్లాడటానికి మాటలు, పదాలు సమకూర్చుకోలేకపోతున్నా. వాళ్లిద్దర్నీ చూసి ఈరోజు నేనెలా ఫీలవుతున్నానో భవిష్యత్తులో అభయ్, భార్గవ్‌లను చూసి ఇంతే ఆనందపడతానేమో. నా మంచీ చెడుల్లో, కష్ట సుఖాల్లో, నా ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఉన్న ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్నలదే. ‘తెల్లవారితే గురువారం’ తో మా భైరవ, మా సింహా ఇంకో మెట్టు పైకి ఎదిగాలని, మణికాంత్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ –‘‘వేగంగా పరిగెడుతున్న ఈ పోటీ ప్రపంచంలో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది పెద్ద టాస్క్. మనం మంచి పేరెంట్స్ ఎలా అవుతాం అనే డౌట్ నాకు, ప్రణతి (ఎన్టీఆర్ భార్య)కి రోజూ వస్తుంటుంది. ఎలా చేద్దాం అనిపించిన ప్రతిసారీ నాకు గుర్తొచ్చేది ఇద్దరే.. మా శ్రీవల్లి, రమగార్లు. ప్రతి కొడుకు విజయం వెనకాల ఓ తల్లి ఉంటుంది. నా పిల్లలకు మంచి ఉదాహరణలు కాలభైరవ, సింహా, కార్తికేయ. వీళ్ల సక్సెస్‌కి కారణం శ్రీవల్లి, రమగార్లు’’ అన్నారు. డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ –‘‘బయటివారు ఎలా చేశారో ఈజీగా చెప్పేస్తుంటాం.. కానీ ఇంట్లో పిల్లల గురించి చెప్పాలంటే టెన్షన్‌గా ఉంటుంది. మా పిల్లలు బాగానే చేశారనిపిస్తుంటుంది. కానీ ఎలా చేశారన్నది సినిమా చూశాక మీరు చెప్పాలి. కాలభైరవ విషయంలో నాకు టెన్షన్ లేదు. క్లాస్, మాస్ సాంగ్స్ ఇరగ్గొట్టేస్తున్నాడు. చిన్నోడు కాబట్టి శ్రీసింహాకి కొంచెం భయం.. మీరు తొందరగా ఆ భయాన్ని పోగొడతారని ఆశిస్తున్నా. ఈ సినిమాని నిర్మాతలు గ్రాండ్‌గా నిర్మించారు.. మొదటి సినిమా అయినా మణికాంత్ బాగా తీశాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ –‘‘తండ్రులు రెండు రకాలుంటారు.. వారిలో గూగుల్ మ్యాప్ ఫాదర్స్ ఒకరు.. అలా వెళ్లు, ఇలా వెళ్లు అంటూ పిల్లలకు గైడెన్స్ ఇస్తుంటారు. కానీ నేను నా పిల్లల కెరీర్ తొలి నాళ్లలో ఏం చేయాలో చెప్పానంతే.. ఇప్పుడు వారి పనిలో కల్పించుకోవడం లేదు’’ అన్నారు. ‘‘మీరందరూ వచ్చి మా సినిమా ‘అదుర్స్’ అంటే చాలు’’ అన్నారు మణికాంత్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయా: ఎన్టీఆర్ -
చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్.. మగధీర కాదిక్కడ
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, ‘మత్తు వదలరా’ ఫేమ్ శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం టీజర్‌ను మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు బెస్ట్ విషెస్ అందజేశారు. మరి కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన హీరో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడం.. 'పెళ్లి తర్వాత జరగాల్సినవి పెళ్లికి ముందే జరిగిపోతే నీకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టముంటది' అని హీరో ఫ్రెండ్ వాదించడం లాంటి అంశాలతో టీజర్ మొదలవుతుంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి హీరో తన లవ్ స్టోరీ గురించి వినిపిస్తూ..నువ్వు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్.. మగధీర కాదిక్కడ మర్యాదరామన్న' అంటూ చెప్పే డైలాగులు నవ్వు తెప్పిస్తాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన టీజర్..సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. చిత్ర షుక్ల, మిషా నారంగ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి కొర్రపాటి సమర్పణలో లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించగా, సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సినిమా టైటిల్‌తోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన దర్శకుడు ‘తెల్లవారితే గురువారం’ ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చదవండి : (అల్లు అర్జున్‌కు నో చెప్పడమా?: ప్రియా వారియర్) (అదీ ప్రభాస్ రేంజ్: వంద కోట్ల రెమ్యునరేషన్!) Here is super fun teaser of #ThellavaritheGuruvaram 💯https://t.co/WLo3DjgagU Looking forward for the release. Good luck to the entire team! 👍🏽@Simhakoduri23 @gellimanikanth @kaalabhairava7 @SaiKorrapati_ @Benny_Muppaneni @VaaraahiCC @Loukyaoffl @Chitrashukla73 @NarangMisha pic.twitter.com/jcxWmw8FA1 — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) February 26, 2021 -
‘తెల్లవారితే గురువారం’.. ఏం జరిగింది?
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, ‘మత్తు వదలరా’ ఫేమ్ శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మరి గురువారం ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందే. మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చిత్రా శుక్లా, మిషా నారంగ్ కథానాయికలుగా నటించారు. సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కెమెరా: సురేష్ రగుతు. చదవండి: విజయ్ దేవరకొండ సినిమా డేట్ ఫిక్స్ శంకర్ దర్శకత్వంలో చరణ్? -
తెలంగాణ పోలీస్‌పై కీరవాణి అదిరిపోయే పాట
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరచి, ఆలపించిన ‘పోలీస్, పోలీస్ ...తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్’ అనే పాటను డీజీపీ మహేందర్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. డీజీపీ కార్యాలయంలో శనివారం ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి కీరవాణి విచ్చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ ఫ్లాడ్ డే కార్యక్రమాల సందర్బంగా ఈ పాటను విడుదల చేయడం సందర్బోచితంగా ఉందన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులను వివరిస్తూనే పోలీసులు అందించే సేవలను స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారని మహేందర్ రెడ్డి ప్రశంసించారు. ‘మనం కష్టపడుతూ సేలందిస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి ఈ అద్భుతమైన పాటే నిదర్శనమని’ డీజీపీ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ, మాతృ దేవోభవ, పితృ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని, ఈ దిశగా పోలీసులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తన తొమ్మిదేళ్ల వయస్సులో తొలి కార్యక్రమం రాయచూరులో పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజున ఇచ్చానని తెలిపారు. ‘ఇస్తున్నా ప్రాణం మీ కోసం’ పోలీసు త్యాగాలను తెలియచేసే పాటను 1998 సంవత్సరంలోనే అప్పటి డీజీపీలు దొర, రాములు కోరిక మేరకు స్వరపరచి పాడానని గుర్తు చేసుకున్నారు. ఈ పాటను హిందీలో కూడా రూపొందిస్తానని కీరవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు ఉమేష్ ష్రాఫ్, జితేందర్, సందీప్ శాండిల్య, శివధర్ రెడ్డి, నాగిరెడ్డి, బాల నాగాదేవి, వెంకటేశ్వర్లు, ఈ పాట ఎడిటర్ హైమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 'ప్రాణం పంచే మనస్సున్న పోలీస్', the video-song is here to watch, Than Q @mmkeeravaani garu & Anantha Sriram for this thoughtful tribute to the #PoliceMartyrs, in observance of #PoliceFlagDayTelangana. https://t.co/F6dKU4TNUZ — DGP TELANGANA POLICE (@TelanganaDGP) October 31, 2020 -
ఫిర్యాదులు... శుభాకాంక్షలు
శనివారం రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ... ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది. రాజమౌళి మీద వాళ్లకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్నాయో ఈ వీడియోలో సరదాగా పంచుకున్నారు. కీరవాణి మాట్లాడుతూ– ‘‘జనవరిలో పల్లవి చేస్తాం. జూన్‌లో చరణం. డిసెంబర్లో లిరిక్స్ రాస్తాం. వచ్చే ఏడాది మార్చిలో రికార్డింగ్ అంటాడు. అప్పటికి అసలు ఏ సినిమాకు పని చేస్తున్నామో? ఆ పాట ఎందుకు వస్తుందో? అనేది కూడా మర్చిపోతాం. అసలు ఆసక్తే పోతుంది’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘మనం రిలాక్స్ అయిపోదాం అనుకున్నప్పుడే కష్టమైన షాట్స్ అన్నీ షూట్ చేస్తుంటాడు రాజమౌళి. అది అనుకుని చేస్తాడో లేక అప్పుడే అలాంటి ఐడియాలు వస్తాయో తెలియదు. పన్నెండున్నరకి మొదలుపెడితే రెండున్నరకు అవుతుంది. అప్పటికి ఆకలిపోతుంది. ఆ మధ్య నైట్ షూట్ చేశాం. రాత్రి 2 గంటలకు ప్యాకప్ చెప్పాలి. మా రాక్షసుడికి ఒకటిన్నరకి కొత్త ఆలోచన వస్తుంది. ఒక్క షాట్ కోసం 4 వరకూ ప్రయత్నిస్తాడు. పర్ఫెక్షన్ కోసం మా అందర్నీ చావకొడుతుంటాడు’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘రేపు యాక్షన్ సీన్ ఉందని జిమ్ బాగా చేసి చాలా ఉత్సాహంతో సెట్‌కి వెళ్తాను. 40 అడుగుల నుంచి ఇలా దూకాలి, చేయాలి అని అద్భుతంగా వివరిస్తారు. సూపర్ అనుకుంటాను. కాస్త రిస్కీగా ఉంది.. ఎవరు సార్ ఇది చేసేది? అని అడుగుతా అమాయకంగా. నువ్వే అంటారాయన. వెంటనే లాప్‌ట్యాప్ తెప్పించి మూడు రోజుల ముందే ఆ యాక్షన్ సీన్ ఆయన చేసింది చూపిస్తారు. ఆయన చేశాక మనం చేయకపోతే ఏం బావుంటుంది? ఎలాగోలా చేస్తాం’’ అన్నారు. మా అందరి సామర్థ్యాన్ని మరింత పెంచుకునేలా మమ్మల్ని అందర్నీ పని చేసేలా చేసే రాజమౌళిగారికి జన్మదిన శుభాకాంక్షలు అని చిత్రబృందం తెలిపింది. ఈ వీడియోలో దర్శకత్వ శాఖ, కెమెరామేన్ సెంథిల్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, నిర్మాత దానయ్య కూడా మాట్లాడారు. -
ఆర్ఆర్ఆర్ టీం : రాజమౌళిపై ఇన్ని ఆరోపణలా!
సాక్షి, హైదరాబాద్: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళికి ఆర్ఆర్ఆర్ టీం వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు మూవీ టీం ఒక వీడియో విడుదల చేసింది. ప్రతి సీన్‌ని పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేయాలని అనుకుంటారు. ఎమోషన్స్ రూపంలో సినిమా థ్రిల్స్ ఇవ్వడానికి ఇష్టపడే దర్శకుడు అంటూ ప్రశంసిస్తూ ఆయనకు ఒక చిరు కానుకను అందించింది. హ్యాపీ బర్తడే సార్.. లాంగ్ లివ్ సార్ అంటూ రొటీన్ డైలాగులకు భిన్నంగా ఆయన పనితీరును, ఆయనలోని నిబద్ధతను ఎలివేట్ చేస్తూ, పర్ఫెక్షనిజానికి ఫిదా అవుతూ వర్చువల్ విషెస్ చెప్పడం ఆసక్తికరంగా నిలిచింది. (ఆర్ఆర్ఆర్ అప్డేట్ వచ్చేసింది) ముఖ్యంగా మెగాహీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. దర్శక రాక్షసుడు చంపేస్తున్నారంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్క షాట్ కు మూడుగంటలు.. అదీ జక్కన్న చెక్కుడు.. ఆయన పర్ఫెక్షన్తో మమ్మల్ని చావగొట్టేస్తున్నారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అంతేనా సంగీత దర్శకుడు కీరవాణి, సెంథిల్ కుమార్‌తో పాటు చిత్ర బృందం చేసిన చిలిపి ఆరోపణలను ఒకసారి మీరు కూడా చూసేయండి మరి. మరోవైపు బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన దర్శక ధీరుడు రాజమౌళికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నటీనటులుతో పాటు, ఇతర సెలబ్రిటీలు, అభిమానుల అభినందనల వెల్లువ కురుస్తోంది. A small gift from team #RRRMovie to the man who only loves to give us all cinematic thrills in the form of elevations and emotions, but is against anyone giving him birthday wishes! Happy Birthday, captain! 🤗 @ssrajamouli https://t.co/flBj6Z5z85#HBDSSRajamouli — 𝗥𝗥𝗥 𝗠𝗼𝘃𝗶𝗲 (@RRRMovie) October 10, 2020 -
పడ్డారండి పనిలో మరి...
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి. ‘బ్యాక్ టు వర్క్’ అంటూ ఆయన చేస్తున్న సినిమాల గురించి ఓ ట్వీట్ చేశారు. ‘‘ప్రస్తుతం నేను రెండు సినిమాలకు సంగీతం సమకూర్చే పనిలో ఉన్నాను. ఒకటి దర్శకుడు క్రిష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా. మరొకటి దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతున్నది. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి’’ అన్నారు. అన్నట్లు.. కీరవాణి అందించిన హిట్ సాంగ్స్‌లో ‘పడ్డానండి ప్రేమలో మరి..’ ఒకటి. ఇప్పుడు ఆయన ‘బ్యాక్ టు వర్క్’ అంటున్నారు కాబట్టి ‘పడ్డారండి పనిలో మరి..’ అనొచ్చు. -
మరోసారి ప్లాస్మా దానం చేసిన సంగీత దర్శకుడు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఆయన తనయుడు, గాయకుడు కాలభైరవ మరోసారి ప్లాస్మా దానం చేశారు. కొన్నిరోజుల క్రితం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి సహా కొందరు కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అయితే వీరందరూ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే కరోనా సోకిన రోజే తాము ప్లాస్మా దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం.. కీరవాణి, కాలభైరవ కరోనా వారియర్స్‌గా మారి ప్లాస్మాను దానం చేశారు. (నేను అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి) తాజాగా ఇప్పుడు రెండోసారి కీరవాణి, కాలభైరవ ప్లాస్మాను దానం చేశారు. ఈ విషయాన్ని కీరవాణి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మా రక్తంలో యాంటీ బాడీస్ ఇప్పటికీ చురుకుగా ఉన్నట్లు తెలిసి.. నేను, నా కొడుకు కిమ్స్ ఆస్పత్రిలో రెండవసారి ప్లాస్మాను దానం చేశాము. ఒకటి కంటే ఎక్కువసార్లు ప్లాస్మా దానం చేయడానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’. అని చెబుతూ ప్లాస్మాను దానం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం కీరవాణి రెండు సినిమాలకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. (ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి) -
ప్లాస్మా దానానికి భయపడక్కర్లేదు
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మంగళవారం ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కుమారుడు, యువ సంగీత దర్శకుడు కాల భైరవతో కలిసి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలోని ప్లాస్మా డొనేషన్ వింగ్‌లో ప్లాస్మా దానం చేసినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచి కాపాడే ప్లాస్మాపై ఉన్న అపోహలు పోగొడుతూ ప్లాస్మా యోధుల కోసం ఒక పాటను కీరవాణి రచించిన సంగతి తెలిసిందే. ‘‘ప్లాస్మా దానం చేయడం రక్తం దానం చేసినట్లే ఉంది. దానం చేసేందుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలి’’ అని పిలుపునిచ్చారు కీరవాణి. కీరవాణి తమ్ముడు, అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా ఇటీవల కరోనాను జయించి ప్లాస్మా దానం చేసిన విషయం తెలిసిందే. -
నేను అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి
సాక్షి, హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేసి ప్రాణాలను కాపాడాలని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విటర్ ద్వారా కోరారు. మన శరీరంలో ఏర్పడిన కరోనా ప్రతి బంధకాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఈలోపే ప్లాస్మా దానం చేస్తే వేరే వారి ప్రాణాన్ని కాపాడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తన శరీరంలో యాంటీ బాడీస్ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15కన్నా ఎక్కువ ఉండాలని తెలిపారు. పెద్దన్న కీరవాణి, భైరవ మంగళవారం ఉదయం ప్లాస్మా దానం చేశారని జక్కన్న పేర్కొన్నారు. రాజమౌళి ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి The antibodies that develop stay in our system for a limited period of time only.. I request Everyone who are cured from #Covid19 to come forward and donate. And become a life saver..🙏🏼🙏🏼 — rajamouli ss (@ssrajamouli) September 1, 2020 -
ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం. కీరవాణి మంగళవారం ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన కుమారుడు భైరవతో కలిసి కిమ్స్ ఆసుపత్రిలోని ప్లాస్మా డొనేషన్ వింగ్‌లో ప్లాస్మా దానం చేసినట్లు తెలిపారు. ప్లాస్మా దానం చేయడం రక్తం దానం చేసినట్లే ఉందని, అందులో భయపడవలసిన అవసరం లేదని కీరవాణి పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న ప్రముఖులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావడాన్ని నెటిజనులు అభినందిస్తున్నారు. చదవండి: ప్లాస్మాదాతలకు రాజమౌళి ప్రోత్సాహకాలు Just done with voluntary donation of plasma at KIMS along with my son Bhairava. Feeling good. It felt very normal like in a routine blood donation session. No need to fear at all for participating. pic.twitter.com/2WVGNUtCIR — mmkeeravaani (@mmkeeravaani) September 1, 2020 -
ప్లాస్మాదానం ప్రచారంలో రాజమౌళి
-
ప్లాస్మాదాతలకు రాజమౌళి ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో ప్లాస్మాపై అనేక అపోహలుండేవని, వీటిని పోగొట్టేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వీటికి చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ, రాజమౌళి, కీరవాణి సహకరించారని పేర్కొన్నారు. కీరవాణి ప్లాస్మా యోధులకోసం ఒక పాట కూడా రూపొందించారని తెలిపారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ప్లాస్మా దానం చేసిన పలువురికి సీపీ సజ్జనార్, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి ప్రోత్సాహకాలు అందించారు. (ప్లాస్మా దానానికి మహా స్పందన) ఈ సందర్భంగా కరోనాను జయించిన రాజమౌళి ప్లాస్మా ఇవ్వటానికి ముందుకు రావటం శుభ పరిణామమని సజ్జనార్ కొనియాడారు. కరోనా సోకితే ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్లాస్మా దానానికి అందరూ ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్లాస్మా వివరాలు అన్ని పొందుపరుస్తూ Donateplasma.scsc.in అనే వెబ్‌సైట్‌ను రూపొందించామన్నారు. తమతో కలిసి అనేక స్వచ్చంద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని, చాలా మంది యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వలంటీర్లుగా పనిచేస్తున్నారని చెప్పారు. (వి విల్ స్టే ఎట్ హోమ్.. వి స్టే సేఫ్) సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్‌రూమ్ నంబర్లు: 90002 57058, 94906 17444, రిజిష్టర్ పోర్టల్ లింక్: Donateplasma.scsc.in -
వినూత్నంగా వర్మ 12'0' క్లాక్ ట్రైలర్
హైదరాబాద్ : సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే రామ్‌గోపాల్ వర్మ కరోనా టైంలోనే వరుసగా సినిమాలు నిర్మిస్తూ దూసుకెళుతున్నారు. ఒకప్పుడు హారర్ సినిమాలకు కేరాఫ్‌గా ఉన్న వర్మ రాత్రి, దెయ్యం, భూత్ వంటి సినిమాలను తెరకెక్కించి మెప్పించారు. కొంతకాలంగా ఈ జానర్‌కు దూరంగా ఉంటున్న వర్మ తాజాగా 12'0' క్లాక్ అనే హారర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి 1 నిమిషం 47 సెకన్ల నిడివి గల ట్రైలర్‌ను కాసేపటి క్రితమే వర్మ తన యూట్యూబ్ చానెల్లో విడుదల చేశారు. సైన్స్‌కు, ఆత్మలకు ఏదైనా సంబంధం ఉందా అనే అంశాన్ని ముడిపెడుతూ ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతోనే ఆసక్తిగా చూపించారు. (ఆర్జీవీ అదిరిపోయే సమాధానం) వరుసగా షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న వర్మ నుంచి చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ హారర్ సినిమా వస్తుండడం విశేషం. 12'0' క్లాక్ నిడివి గంటా 45 నిమిషాలుగా ఉంది. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి చాలా కాలం తరువాత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అంతకుముందు వర్మ దర్శకత్వంలో వెంకీ హీరోగా తెరకెక్కిన క్షణక్షణం సినిమాకు కీరవాణి సంగీతం అందించడం విశేషం. మళ్లీ 29 ఏళ్ల తరువాత కీరవాణి వర్మ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమాలో దండుపాళ్యం ఫేమ్ మకర్‌దేశ్ పాండే, మిథున్ చక్రవర్తి, ఆశిష్ విద్యార్థి, దిలీప్ తాహిల్, మానవ్ కౌల్, అలీ అజగర్, కొత్త నటుడు కృష్ట గౌతమ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అమోల్ రాథోడ్ అందించారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసే అంశాన్ని వర్మ పరిశీలిస్తున్నారు. -
‘క్రిమినల్’కు పాతికేళ్లు ఈ సందర్భంగా..
అక్కినేని నాగార్జున హీరోగా మహేశ్ భట్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘క్రిమినల్’. మనీషా కోయిరాల, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించారు. పాతికేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సంగీతం దిగ్గజం ఎమ్ఎమ్ కీరవాణి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ‘తెలుసా మనసా’ సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పాతికేళ్లు పూర్తిచేసుకుంది. అయితే ఈ సినిమా, ఈ సినిమాలోని తెలుసా మనసా పాట మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. సినిమా విడుదలై పాతికేళ్లు అవుతున్న సందర్భంగా అనూప్ శంకర్ ఈ పాటను తెలుగు, హిందీ భాషల్లో పాడి నిస్వార్ధంగా సమాజానికి సేవ చేస్తున్న వారికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. దీనిపై హీరో నాగార్జున కూడా స్పందించారు. ఈ పాటను నిస్వార్ధ సేవ చేస్తున్న వారికి అంకితం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కీరవాణి స్వరపరచిన ఈ అందమైన పాట 25 ఏళ్లు పూర్తి చేసుకుంది అంటూ నాగ్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇక తెలుసా మనసా పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, పాటను బాలు, చిత్ర అద్భుతంగా ఆలపించారు. Thank you anoop Shankar!! It’s been 25 years since this beautiful song was composed by @mmkeeravaani 🙏 so happy to know You are Dedicating this song to the Selfless hearts who serve society!!👉 https://t.co/0AtrQpfAzf#worldnursesday #tribute insta Id @singeranoopsankar — Nagarjuna Akkineni (@iamnagarjuna) May 12, 2020 చదవండి: రేపే హీరో నిఖిల్-పల్లవి వివాహం? పవన్ కల్యాణ్.. ‘ఇప్పుడే మొదలైంది’? -
ఈ ఛాలెంజ్ కూడా కరోనాలానే ఉంది
‘‘చూస్తుంటే ‘బీ ది రియల్ మేన్ ఛాలెంజ్’ కూడా కరోనా లాగే ఒకరి తర్వాత ఒకరికి వ్యాప్తి చెందుతోంది’’ అంటున్నారు సంగీత దర్శకులు కీరవాణి. ఇంటి పనులను మగవాళ్లు కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్ వంగ ‘బీ ది రియల్ మేన్’ ఛాలెంజ్ ను స్టార్ట్ చేశారు. రాజమౌళి ఛాలెంజ్ విసరడంతో ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు కీరవాణి. బట్టలు ఆరేస్తూ, మొక్కలకు నీళ్లు పోస్తూ, డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తూ ఉన్న వీడియోను పోస్ట్ చేసి, ‘‘కరోనా లాగా ఈ ఛాలెంజ్ సందీప్ వంగ నుంచి రాజమౌళికి, అతని దగ్గర నుంచి నా దాకా వచ్చింది. నా వంతు పని నేను చేస్తున్నాను. ఈ ఛాలెంజ్ కు దర్శకుడు క్రిష్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని నామినేట్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు కీరవాణి. అలాగే మరో ఇద్దరు దర్శకులు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఛాలెంజ్ విసరడంతో కొరటాల శివ పాత్రలు శుభ్రం చేస్తూ, ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఇంటి పనుల్లో సహాయం చేస్తున్న వీడియోను ట్వీటర్ లో షేర్ చేసి, ‘‘మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా రాను రాను సరదా అయింది. ఇప్పుడు అలవాటయింది’’ అని పేర్కొన్నారు. ఈ ఛాలెంజ్ కి విజయ్ దేవరకొండను నామినేట్ చేశారాయన. రాజమౌళి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన సుకుమార్.. ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇల్లు తుడుస్తూ, గిన్నెలు శుభ్రం చేస్తున్న వీడియోను షేర్ చేసి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత ‘దిల్’రాజులను నామినేట్ చేశారు సుకుమార్. -
ఛాలెంజ్ పూర్తిచేసిన కీరవాణి
-
ఛాలెంజ్ పూర్తిచేసిన సుకుమార్, కీరవాణి
లాక్డౌన్ వేళ ప్రస్తుతం టాలీవుడ్లో 'బి ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ను పలువురు సెలబ్రటీలు స్వీకరించి తమ భార్యలకు వంటపనిలో, ఇంటిపనిలో సహాయం చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి విసిరిన ఈ ఛాలెంజ్‌ను డైరెక్టర్ సుకుమార్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పూర్తి చేశారు. ఇల్లు తుడిచి, గిన్నెలు కడిగి ఇంటి పనిలో తన భార్యకు సహాయం చేశారు లెక్కల మాస్టార్ , దర్శకుడు సుకుమార్. చివర్లో ఆయన భార్య బావుందంటూ ఖితాబిచ్చారు. ఆ వీడియోను సుకుమార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇక తన ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, శివ కొరటాల, నిర్మాత దిల్ రాజు పేర్లను నామినేట్ చేశారు సుకుమార్ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి.. ఇంటిని శుభ్రం చేసి, మొక్కలకు నీళ్లు పట్టి, బట్టలు ఉతకడం లాంటి పనులు చేసి వీడియోను పోస్ట్ చేశారు. దీనికి అప్పుడప్పుడూ అనే సాంగ్‌ను జత చేశారు. కరోనా లానే ఈ ఛాలెంజ్ కూడా అంటువ్యాధి లాంటిదని వ్యాఖ్యానించిన కీరవాణి.. దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు తమన్‌లను నామినేట్ చేశారు. ఇక ఈ ఛాలెంజ్‌ను త్వరలోనే పూర్తిచేస్తానని తమన్ తెలిపారు. -
మరో అవగాహన పాటతో కీరవాణి
-
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు జక్కన్న ఛాలెంజ్
-
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు జక్కన్న ఛాలెంజ్
లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలంతా ఇంటి పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేగాక క్వారంటైన్లో ఖాళీగా ఉండకుండా కుటుంబ సభ్యులకు సాయంగా ఉండాలంటూ మిగతా సెలబ్రిటీలకు సైతం సవాలు విసురుతున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్ రామ్‌చరణ్‌లకు సవాలు విసిరారు. అంతేగాక బాహుబలి నిర్మాతలకు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కిరవాణిలకు కూడా ఛాలెంజ్ ఇచ్చారు. ‘నా వంతు అయ్యింది సందీప్.. ఇప్పడు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల వంతు వచ్చింది. ఇక చూడండి ముందుంది అసలైన సరదా.. అలాగే శోభు సుక్కు, ఆర్య సుక్కు, పెద్దన్న ఎమ్ఎమ్ కీరవాణి కూడా ఈ ఛాలెంజ్ ఇస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. (సందీప్ ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళి) కాగా దర్శకుడు సందీప్ వంగ.. రాజమౌళి తన భార్యకు పనుల్లో సాయం చేయాలని కోరుతూ.. సవాలు విసిరిన సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి తన భార్యకు సాయంగా ఇంటి పనులు చేస్తున్న వీడియోను ట్విటర్లో సోమవారం షేర్ చేశారు. కాగా ప్రస్తుతం రాజమౌళి స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కిస్తున్నారు. ఇటివల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఉగాది కానుకగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల అభిమానుల కోసం విడుదలు చేశారు. ప్రత్యేక టీజర్‌ను రామ్‌చరణ్ పుట్టిన రోజు మార్చి 27న విడుదల చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్‌చరణ్ అల్లు సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. -
‘ఇస్త్రీ పెట్టెపై దోశలు వేసి చూపించిన నాగ్’
‘క్రికెట్లో భారతే గెలుస్తుంది.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేము.. కానీ ‘నేనున్నాను’ సినిమా మాత్రం సూపర్‌డూపర్ హిట్ సాధిస్తుంది’అంటూ మార్చి 11, 2004న జరిగిన ‘నేనున్నాను’ ఆడియో ఫంక్షన్లో అప్పటి యువసామ్రాట్ ఇప్పటి టాలీవుడ్ కింగ్ నాగార్జున పలికిన మాటలివి. నాగార్జున సరసన శ్రియా, ఆర్తీ అగర్వాల్ నటించిన ఈ చిత్రాన్ని విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. నాగార్జున కెరీర్లో మరుపురాని మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అన్నివర్గాలను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయిన ఈ చిత్రం అనేక సెంటర్లలో వందరోజులు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. కామాక్షి మూవీస్‌పై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలై నేటికి 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు మీకోసం.. సినిమా రిలీజ్ కంటే ముందే ఆడియోతో సెన్సేషన్ సృష్టించింది ఈ చిత్రం. ఎంఎం కీరవాణి అందించిన పాటలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ‘ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో’ పాట సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. వినోదం, పాటలు, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్ని కలబోసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బ్రహ్మానందం, అలీ, శివారెడ్డిల కామెడీ.. నాగార్జున టైమింగ్.. శ్రియ, ఆర్తిల అభినయం.. నాగార్జున, శ్రియల కామెడీ అండ్ ఎమోషన్ సీన్స్ వావ్ అనిపించేలా ఉంటాయి. ముఖ్యంగా శ్రియ కోసం ఇస్త్రీ పెట్టెపై దోశలు వేసే సీన్ అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు కదా అందరూ కలిసి మరోసారి ‘నేనున్నాను’ చూసి కుటుంబసమేతంగా ఎంజాయ్ చేయండి. -
కరోనాపై కీరవాణి కదిలించే పాట..
అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్(కోవిడ్-19). ఈ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మంది సెలబ్రెటీలు అండగా నిలుస్తున్నారు. పలువురు ఆర్థిక సహాయం చేస్తుండగా మరికొందరు ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేలా పలు వినూత్న ప్రయత్నాలకు తెరదీస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌పై చౌరస్తా బ్యాండ్, సంగీత దర్శకుడు కోటి అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి ‘వి విల్ స్టే ఎట్ హోమ్.. వి స్టే సేఫ్’ అనే పాటను స్వయంగా రాసి, ట్యూన్ చేసి ఆలపించారు. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక అని బెదరకండి.. విందులు వినోదాలు కాస్త మానుకోండి.. బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి’, ‘ఇళ్లు ఒళ్లు మనసు శుభ్ర పరుచుకుంటే ఇలలోనే ఆస్వర్గాన్నే చూడొచ్చండి..ఇష్ట దేవతల్ని కాస్త తలచుకుంటే, ఏ కష్టమైనా అవలీలగా దాటొచ్చండి’ అనే లిరిక్స్ ప్రజల్లో చైతన్యంతో పాటు మనోధైర్యాన్ని తీసుకొస్తున్నాయి. కాగా, ఈ పాట కోసం ఆయన గతంలో ‘స్టూడెంట్ నెం. 1’ సినిమాకి కంపోజ్ చేసిన ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ పాట ట్యూన్‌నే మళ్లీ తీసుకున్నారు. ఇక గతంలో కూడా కరచాలనం కంటే చేతులెత్తి నమస్కారం చేయడం ఎంత మంచిదో వివరిస్తూ ఓ పద్యాన్ని ఆలపించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా కట్టడికి బిల్‌గేట్స్ సూచనలు! ‘యుద్ధం లేదు.. కానీ 5 వేల మంది చనిపోతే ఎలా?’ -
పవన్ మరో మూవీ ప్రారంభం
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొత్త చిత్రం బుధవారం ప్రారంభమైంది. క్రిష్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తొలి షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. పవన్ కెరీర్లో ఇది 27వ చిత్రం. ఈ మూవీ మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వం వహించిన చివరి రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ ఫామ్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా షూటింగ్ పరిసరాల్లోకి మీడియాను అనుమతించలేదు. (పవన్ కల్యాణ్ హీరోయిన్ ఫిక్స్!) ఇప్పటికే పవన్ వేణు శ్రీరామ్ దర్వకత్వంలో ‘పింక్’ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే పింక్ రీమేక్ షూటింగ్ తరువాత పవన్ ఈ సినిమా చిత్రీకరణలో రెగ్యులర్‌గా పాల్గొంటాడని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టును ఈ రోజే పట్టాలెక్కించారు. దీంతో పవర్‌స్టార్ అభిమానులకు డబుల్ ధమాకా లభించడంతో పండగ చేసుకుంటున్నారు. (డబుల్ ధమాకా) -
రాజమౌళితో బాధలు పంచుకున్న ‘మత్తు వదలరా’ టీం
-
‘మాకు డైరెక్టర్‌ను కొట్టాలనిపించేది!’
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఎందుకంటే తమ కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు ఒకే సినిమాతో అరంగేట్రం చేసి దిగ్విజయాన్ని అందుకున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమైన చిత్రం ‘మత్తు వదలరా’. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం రోటీన్ చిత్రాల మత్తు వదిలిస్తోంది. విడుదలైన రోజు నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు రాజమౌళి కుటంబం ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇక మూవీ సక్సెస్ మీట్లో భాగంగా శ్రీసింహా, సత్య, అగస్త్యలను రాజమౌళి సరదాగా ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రోమోలో భాగంగా సినిమా విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో పేర్కొంటూ అదేవిధంగా చిత్ర షూటింగ్లో ఆ ముగ్గురు ఎదుర్కొన్న కష్టాలు, బాధలను రాజమౌళితో పంచుకున్నారు. పూర్తి వీడియోను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక రితేష్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. నరేశ్ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ, తదితరులు నటించారు. చదవండి: ‘మత్తు వదలరా’ మూవీ రివ్యూ జనవరి 3న వస్తున్న ‘యమదొంగ’! -
వంశీ కథలు ఎంతో ఇష్టం
‘పుస్తకాలు చాలా తక్కువగానే చదువుతాను. కానీ నచ్చిన పుస్తకాలు మాత్రం తప్పనిసరిగా చదివి తీరుతా’ అన్నారు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను గురువారం ఆయన సందర్శించారు. పలు స్టాళ్లలో ఆయన తనకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. వంశీ సాహిత్యం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆ పుస్తకాల కోసం ప్రదర్శనకు వచ్చినట్లు పేర్కొన్నారు. వంశీ రాసిన ‘నల్లమిల్లోరి పాలెం’ కథల పుస్తకంతో పాటు, ‘కచ్చితంగా నాకుతెలుసు’.. ‘తెలుగాంధ్ర మిశ్రమ నిఘంటువు’ తదితర పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు. అన్వేషిక స్టాల్‌లోని పలు సినీ రచయితల పుస్తకాలను కీరవాణి ఆసక్తిగాతిలకించారు. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు నాలుగో రోజు గురువారం పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్రిస్మస్ సెలవులతో సందర్శకుల రద్దీ కనిపించింది. సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో బుక్ఫెయిర్లో సందడిగా మారింది. సాహిత్యం, చరిత్ర, ఆర్థిక అంశాలకు సంబంధించిన అనేక అంశాలపైన పాఠకులు తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. మరోవైపు బాలమేళా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల మేజిక్ వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సుమారు 90 మంది రచయితలతో ఏర్పాటు చేసిన రైటర్స్ స్టాల్, హైదరాబాద్ బుక్ ట్రస్టు, నవతెలంగాణ, స్కోలాస్టిక్, అన్వేషిక, ఎమెస్కో, పెంగ్విన్ తదితర స్టాళ్ల వద్ద పాఠకులు నచ్చిన పుస్తకాల కోసం అన్వేషించారు. ఇటీవల విడుదలైన జార్జిరెడ్డి సినిమా పెద్ద ఎత్తున ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఆయన జీవితంపై ప్రముఖ రచయిత్రి కాత్యాయని రాసిన ‘జీనా హైతో మర్నా సీఖో’ పుస్తకానికి డిమాండ్ బాగా కనిపించింది. ప్రతి రోజు భారీ సంఖ్యలో పాఠకులు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేస్తున్నారు. బొగోమ లోవ్ రాసిన ప్లాటో–అరిస్టాటిల్, కేవీ గోపాలచారి రచన ‘జింక సైన్స్ అను మన గురించి మనం’ వంటి పుస్తకాలతో పాటు జ్యోతిబాపూలే రచనలు, ఓ కుక్క ఆత్మకథ నవల, చేగువేరా, గౌరీ లంకేష్ కొలిమి రవ్వలు, బాలగోపాల్ రాసిన అణచివేత– అణచివేత చట్టాలు పుస్తకాలపై పాఠకులు అమిత ఆసక్తి చూపుతున్నారు. వర్ధమాన రచయిత్రి కడలి సత్యనారాయణ రాసిన ‘లెటర్స్ టు లవ్’, పలువురు యువ రచయితల తొలిప్రేమ కథలు, ఇన్ ది మూడ్ ఫర్ లవ్, రష్యన్ క్లాసిక్స్ వంటి సరికొత్త రచనలకు సైతం డిమాండ్ బాగా ఉంది. పిల్లల కోసంప్రత్యేకంగా పుస్తకాలు ముద్రించి విక్రయించే స్కొలాస్టిక్స్ (స్టాల్ నంబర్ 23)లో ఫిక్షన్ సాహిత్యం కోసం చిన్నారులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. టార్గెట్స్, బ్యాడ్‌బాయ్స్, జెర్నిమోస్టిల్‌టన్, డాగ్‌మ్యాన్, 2020 ఇయర్ బుక్, రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్, అబ్దుల్ కలాం రచనలను విద్యార్థులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. -
‘మత్తు వదలరా’ మూవీ రివ్యూ
చిత్రం: మత్తు వదలరా జానర్: సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ నటీనటులు: శ్రీసింహా, వెన్నెల కిశోర్, సత్య, అగస్త్య, బ్రహ్మాజీ సంగీతం: కాలభైరవ దర్శకత్వం: రితేష్ రానా బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత డైరెక్టర్, సంగీత దర్శకుడు, సింగర్, రచయిత, నిర్మాత, లైన్ ప్రొడ్యూసర్, కాస్టూమ్ డిజైనర్ ఇలా ఆ కుటుంబంలో ఓ సినిమాకు ప్రధానమైన టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. కానీ ఒక్క హీరో తప్ప. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీరబోతుంది. హీరో లేడనే లోటును భర్తీ చేయడానికి ఆకాశమంత ఆ కుటుంబం నుంచి కూడా ఓ వారసుడు వచ్చేశాడు. దిగ్గజ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా బుధవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో చిత్రంపై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఇక దాదాపు అందరు కొత్తవాళ్లతో ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంది? అందరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన నయా హీరో, మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రేక్షకులు ఆదరించారా? అనేది రివ్యూలో చూద్దాం. కథ: బాబు మోహన్ (శ్రీసింహా), ఏసుదాస్ (సత్య), అభి (అగస్త్య)లు రూమ్మేట్స్. బాబు, ఏసుదాస్‌లు డెలీవరీ బాయ్స్‌గా పనిచేస్తూ చాలిచాలని జీతంతో కాలం వెల్లదీస్తుంటారు. అయితే జీతం, జీవితంపై అసహనం చెందిన బాబుకు ఏసుదాస్ ఓ ఉచిత సలహా ఇస్తాడు. ఆ సలహా పాటించిన బాబు అనుకోని చిక్కుల్లో పడతాడు. ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసు నుంచి బయటపడటానికి, హత్యచేసింది ఎవరో తెలుసుకోవడానికి బాబు చేసిన ప్రయత్నమే సినిమా కథ. అయితే ఈ కథలో రాజు (వెన్నెల కిశోర్), కానిస్టేబుల్ బెనర్జీ (బ్రహ్మాజీ), మైరా, తేజస్వి (అజయ్)లు ఎందుకు ఎంటర్ అవుతారు? అసలు ఆ హత్య ఎవరు చేశారు? ఏసుదాస్ ఇచ్చిన ఆ ఉచిత సలహా ఏంటి? మూవీ టైటిల్‌తో కథకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన వారసుడు శ్రీసింహా తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. భయం, కోపం, ప్రస్టేషన్స్, ఆనందం ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో హీరో పలికించాల్సిన అన్ని భావాలను అవలీలగా పలకించాడు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌కు నటనపరంగా మరో హీరో దొరికినట్లే. ఇక సత్య కామెడీ టైమింగ్ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఏ సమయంలో కూడా సత్య కామెడీ చికాకు తెప్పించదు. సినిమాకు సత్య కామెడీ మరింత బూస్టప్‌గా నిలిచింది. వెన్నెల కిశోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఎవరూ ఊహించని వినూత్న పాత్ర పోషించిన వెన్నెల కిశోర్ తన అనుభవంతో అవలీలగా నటించాడు. అగస్త్య, తదితర నటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కలుగదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! ప్రస్తుతం ఈ పద్య భావాన్ని మ్యూజిక్డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకే చిత్రంతో తన ఇద్దరు కుమారులు టాలీవుడ్ అరంగేట్రం చేసి ఆకట్టుకున్నారు. మెప్పించారు. ప్రశంసలు అందుకుంటున్నారు. దీంతో కీరవాణి కుటుంబం డబుల్ హ్యాపీ అని చెప్పవచ్చు. నటుడిగా శ్రీసింహా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవలు తమ తొలి సినిమాతో రాజమౌళి కుటుంబానికి ఎలాంటి మచ్చ తీసుకరాలేదు. వీరిద్దరితో ఆ కుటంబం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కథనం. ఈ రెండు విషయాల్లో చిత్ర యూనిట్ ముఖ్యంగా దర్శకుడు ఎక్కడా తడబడలేదు. తెర మీద ఆట ప్రారంభమైన 15 నిమిషాల్లోనే సినిమా నేరుగా అసలు కథలోకి ప్రవేశిస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ ఈ మూడు అంశాలను ప్రధానంగా తీసుకుని కథ ఎక్కడా డీవియేట్ కాకుండా డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నాడు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఉత్సాహం, ఆసక్తి సగటు ప్రేక్షకుడికి కలిగించడంతో పాటు ఆరోగ్యకరమైన కామెడీ అందించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. కమర్షియల్ హంగుల జోలికి పోకుండా కథానుగుణంగా సినిమాను ముందుకు నడింపించాడుదర్శకుడు రితేష్ రానా. క్లైమాక్స్ వరకు కూడా సస్పెన్స్‌ను రివీల్ కాదు. అంతేకాకుండా ఎవరి ఊహకందని కామెడీ క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. సంగీతదర్శకుడిగా మరో అవతారం ఎత్తిన సింగర్ కాల భైరవ తన తొలి సినిమాలోనే తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. ఈ మూవీకి మరో మేజర్ ప్లస్ పాయింట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. సినిమాలో వచ్చే ప్రతీ సిచ్యూవేషన్‌కు తగ్గట్టు వినూత్న రీతిలో కొత్త బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు ఈ యువ సంగీత దర్శకుడు. ముఖ్యంగా కామెడీగా వచ్చే కొన్ని సౌండ్స్ కేక అని చెప్పాలి. ఇక దర్శకుడు ఆలోచనలను తెరమీద దృశ్యరూపంలో ఎలాంటి గందరగోళం లేకుండా చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు సినిమాటోగ్రఫర్. విజువలైషన్స్ కూడా చాలా కొత్తగా వండర్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణవిలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా సూపర్బ్‌గా నచ్చుతుంది. వినూత్న కథలను, కొత్త కాన్సెప్ట్‌లను ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. ఫైనల్‌గా కొత్త వాళ్లు.. కొత్త ప్రయత్నం.. కొత్తగా, గ‘మ్మత్తు’గా ఉంది. ప్లస్ పాయింట్స్: శ్రీసింహా నటన సత్య కామెడీ కాల భైరవ మ్యూజిక్ కథనం సినిమాలో కొత్తదనం మైనస్ పాయింట్స్: కమర్షియల్, మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
నాన్నకు తెలియకుండా సినిమా చేశా
‘‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. ఆ సమయంలోనే నేను నటుడిగా రాణించగలనని, నాతో సినిమా చేయొచ్చనే నమ్మకం నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లకు కలిగింది. ‘మత్తు వదలరా’ సినిమా అంగీకరించాక మూడు నెలలు నటనలో శిక్షణ తీసుకున్నా’’ అన్నారు శ్రీసింహా. సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.. ఈ సందర్భంగా శ్రీసింహా చెప్పిన విశేషాలు. ► నాన్నపై (కీరవాణి) ఆధారపడకుండా ఏదైనా సాధిస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. అందుకే నాన్నకు తెలియకుండానే సుకుమార్‌గారి దగ్గర ‘రంగస్థలం’కి సహాయ దర్శకుడిగా, ‘మత్తు వదలరా’తో హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టాను. బాలనటుడిగా సినిమాలు చేశాను. అప్పుడే నటన పట్ల నాకున్న ఆసక్తి ఇంట్లో వారికి అర్థమైంది. డిగ్రీ తర్వాత ‘రంగస్థలం’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. అప్పుడే ‘మత్తు వదలరా’ సినిమాలో నటించే అవకాశం రావడంతో హీరోగా మారాను. ► ‘యమదొంగ’లో చిన్ననాటి ఎన్టీఆర్ పాత్రలో కనిపించాను. చిన్నతనం నుంచి నేను ఎన్టీఆర్ (జూనియర్) అభిమానిని. ఆయన నా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం మా నమ్మకానికి ప్రోత్సాహాన్నిచ్చింది. ‘రంగస్థలం’ నుంచి రామ్‌చరణ్‌గారితో పరిచయం ఉంది. రానాగారు మా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం హ్యాపీ. ► నటన పరంగా నాన్న, రాజమౌళిగారు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. వారు పని చేసే విధానం నుంచే మేం ఎక్కువగా నేర్చుకున్నాం. హీరోగా చేస్తున్నానని తెలియగానే రాజమౌళిగారు భయపడ్డారు. అయితే నటన వద్దని చెప్పలేదు. కష్టపడి సినిమా చేయమని ప్రోత్సహించారు. ► తొలి సినిమాగా ప్రేమకథ లేదా మాస్ సినిమా ఎంచుకుంటేనో లేదా సినిమాలో ప్రేమ, పాటలు, ఫైట్స్ ఉంటేనో మంచి ఆరంభం అవుతుందనుకోవడం సరికాదు. కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను హీరోగా, అన్నయ్య సంగీత దర్శకుడిగా ఒకే సినిమాతో పరిచయం అవుతామని ఊహించలేదు. ► ఈ సినిమాలో నిద్రమత్తులో ఉండే డెలివరీ బాయ్ పాత్ర నాది. చాలీచాలని జీతంతో పని చేసే అతడు ఓ సమస్యలో చిక్కుకుని, ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మూడు రోజుల్లో జరిగే కథ ఇది. ► కీరవాణి, రాజమౌళిగార్ల కుటుంబం నుంచి వస్తున్నాను కాబట్టి కొత్తగా కనిపించాలని ఆలోచిస్తే నటనలో సహజత్వం లోపిస్తుంది. అందుకే నిజజీవితంలో ఎలా ఉంటానో అలాగే నటించాను. అలా చేస్తేనే పాత్రకు న్యాయం జరుగుతుందని నా ఫీలింగ్. ► ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచన లేదు. హీరోగానే కాదు.. కథ నచ్చితే ప్రాధాన్యం ఉన్న పాత్రలూ చేస్తాను. రాజమౌళిగారి సినిమాలో ఒక్క ఫ్రేములోనైనా కనిపించాలన్నది నా కల. మా అన్నయ్యను సంగీత దర్శకుడిగా, నన్ను హీరోగా పెట్టి రాజమౌళిగారి అబ్బాయి కార్తికేయ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. -
‘మత్తు వదలరా’ ప్రీ రిలీజ్ వేడుక
-
డిఫరెంట్ లుక్స్‌లో కీరవాణి తనయుడు..
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా కోడూరి హీరోగా పరిచమవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. ఇదే చిత్రంతో కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్– క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో రానా బుధవారం విడుదల చేశాడు. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సాగిన ఈ చిత్రం ట్రైలర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో శ్రీసింహా రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. కామెడీతో పాటు.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కిందని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. రితేష్ రానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, సత్య, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను జూనియర్ ఎన్టీఆర్, టీజర్‌ను రామ్‌చరణ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
మత్తు వదలరా!
ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్– క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని హీరో ఎన్టీఆర్ ట్విట్టర్లో విడుదల చేసి, ‘‘కాలం వేగంగా పరిగెడుతోంది. నా తమ్ముళ్లు చాలా పెద్దవాళ్లు అయిపోయారు. శ్రీసింహాకు, కాలభైరవకు, చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. చిరంజీవి (చెర్రీ) మాట్లాడుతూ– ‘‘హాస్యంతో నిండిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మత్తు వదలరా’?. చివరి వరకూ ఆసక్తికరమైన కథనంతో సాగే మంచి కథను తెరకెక్కించాడు రితేష్. కథ అద్భుతంగా ఉండటం, యువ ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సినిమాని నిర్మించాం. సినిమాటోగ్రాఫర్‌గా సురేష్ సారంగం, స్టంట్ కో–ఆర్డినేటర్‌గా శంకర్, నటులుగా నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర వంటి కొత్తవారినెందరినో మా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే చిత్రం టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. సత్య, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: పి.టి. గిరిధర్ రావు. -
కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్ ట్వీట్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ‘మత్తు వదలరా’సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా కోడూరి హీరోగా పరిచయమవుతుండగా.. ఆయన పెద్ద కొడుకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. క్లాప్ ఎంటర్టైన్మెంట్తో కలిసి ఈ సినిమాను తెరకెక్కించింది. ‘సమయం అమాంతం గడిచిపోతోంది. నా తమ్ముళ్లు పెరిగిపెద్దవారయ్యారు. సింహా కోడూరి హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న 'మత్తు వదలరా' చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మొదటి సినిమాతోనే వీరు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీమ్‌కు గుడ్‌లక్" అంటూ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో పలు పేపర్ కటింగ్స్ మీద శ్రీ సింహా కోడూరి పడుకొని ఉన్నాడు. అతని టీష్టర్ మీద చిత్ర యూనిట్ వివరాలు ఉన్నాయి. ‘మత్తు వదలరా’ చిత్రం ప్రీ లుక్ కొన్నిరోజుల కిందట విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్, చిరంజీవి సినిమాల స్టిల్స్‌తోపాటు.. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్ ఉంది. నూతన దర్శకుడు రితేష్ రానా డైరెక్టర్లో వినూత్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. -
భళా బాహుబలి
‘బాహుబలి’ చిత్రం భారతీయ సినిమాలో పెను మార్పులు తీసుకొచ్చింది. మార్కెట్‌ని విస్తృత పరిచింది.. హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ప్రపంచ వ్యాప్త సినీ ప్రేక్షకులందరితో ‘భళా బాహుబలి’ అనిపించుకుంది. ఇప్పుడు లండన్‌లోనూ ‘భళా బాహుబలి’ అంటూ వినిపిస్తోంది. లండన్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: 1’ చిత్రాన్ని హిందీలో ప్రదర్శించారు. 148 ఏళ్ల ఆల్బర్ట్ హాల్ చరిత్రలో ఇంగ్లీష్ భాషలో కాకుండా ఇతర భాషలో ఓ సినిమా ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శన అనంతరం ప్రేక్షకులందరూ నిల్చొని చప్పట్లు కొట్టారని సమాచారం. ఈ ప్రదర్శనలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొన్నారు. పంచెకట్టు వేషధారణతో రాజమౌళి స్క్రీనింగ్‌కి హాజరయ్యారు. -
‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు
వెంకటేష్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా క్షణ క్షణం. 1990లో రిలీజ్ అయిన ఈసినిమాలో జాము రాతిరి జాబిలమ్మ పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా, ఆ పాట విడుదలై 29 ఏళ్లు పూర్తి చేసుకొని 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులకు జామురాతిరి జాబిలమ్మ పాటను సరికొత్తగా అందించారు కీరవాణి టీం. కీరవాణి టీంలో ఉన్న యువతరం గాయనీ గాయకులు ఈ పాటను సరికొత్తగా ఆలపించి రిలీజ్ చేశారు. అంతేకాదు కాలిఫోర్నియాలోని సాన్జోస్లో చిత్రీకరించిన విజువల్స్‌తో వేల్ రికార్డ్స్ ద్వారా పాటను రీమిక్స్ చేసి విడుదల చేశారు. అప్పట్లో బాలు, చిత్రలు ఈ పాటను ఆలపించగా రీమిక్స్ వర్షన్లో హేమ చంద్ర, కాలభైరవ, మనీష, దీపు, దామిని, మౌనిమ, శృతి, నోయల్ సీన్, పృథ్వీ చంద్రలు ఆలపించారు. -
‘బర్త్ డే అంటే నాకు చాలా చిరాకు’
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త అవతారమెత్రిన సంగతి తెలిసిందే. మొట్టమొదటి సారిగా ‘కోబ్రా’ అనే తన సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ వేడుక లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘‘బర్త్ డే అంటే నాకు చాలా చిరాకు. ఒక సంవత్సరం చావుకు దగ్గరవుతున్నామనిపిస్తుంటుంది నాకు. మనం పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధిస్తే.. అది సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కువ అర్థం ఉంటుందనేది నా అభిప్రాయం. ఇంత చెబుతున్న నేను.. ఈ సంవత్సరం ఎందుకు చేసుకుంటున్నానంటే ఈ రోజు నేను నటుడిగా పుట్టాను. కోబ్రా మూవీ స్క్రిప్ట్ రాస్తుంటే.. కొత్త రకమైన ఇంటెలిజిన్స్ ఆఫీసర్ పాత్రలో నేనే నటిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నాను.. ఈ రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ఈ మూవీతో ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్ నిర్మాణంలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ సినిమాకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే. నా కెరీర్ లో ‘క్షణక్షణం’ మ్యూజిక్ పరంగా ఓ మైలురాయి. 29 ఏళ్లకు మళ్లీ నేను, కీరవాణి గారు ఓ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నాం. చాలా హ్యపీ గా ఉంది’ అన్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి మాట్లాడుతూ.. ‘రామ్ గోపాల్ వర్మ గారు మంచి మ్యూజిక్ లవర్. ఆయన ఫస్ట్ టైమ్ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోవటం మనం ఊహించనిది. ఇలాంటి మార్పులు ఈ కోబ్రా లో మనం ఇంకా చూడొచ్చు. నాలో కొత్త కోణాన్ని ఈ చిత్రం ద్వారా రాము గారు బయటకు తీస్తారనుకుంటున్నాను. నటుడిగా కూడా ఆయనకు ఇది చాలెంజింగ్ సినిమా. ఎందుకంటే మనం నిజ జీవితంలో నటిస్తూ ఉంటాం. కానీ ఆయన నటించరు.. ఇప్పుడు నటించాల్సి ఉంటుంది. 29 ఏళ్ల క్షణక్షణం తర్వాత మళ్లీ రాముగారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశమిచ్చినందుకు ఆయనకు చాలా థాంక్స్’ అన్నారు. ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్ నిర్మాత డి.పి.ఆర్ మాట్లాడుతూ.. ‘‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ మీద ఈ కోబ్రా చిత్రాన్ని నిర్మించేందుకు అవకాశం ఇచ్చినందుకు వర్మగారికి ధన్యవాదాలు. సంవత్సరంలో 8 నుంచి 10 సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు మా బ్యానర్ మీద వర్మ గారితో తీస్తాం. ఆ ఐడియా ఇచ్చింది ఆయనే. దానికి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అన్నారు. -
‘ఆర్ఆర్ఆర్’ మరో ఇంట్రస్టింగ్ అప్డేట్
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్(వర్కింగ్ టైటిల్). మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే ప్రకటించిన ఆర్ఆర్ఆర్ టీం అంతకు మించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కనీసం హీరోయిన్ల పేర్లను కూడా ప్రకటించలేదు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణీ సోషల్ మీడియా ద్వారా బయట పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్లోని ఓ పాటకు సుద్ధాల అశోక్ తేజ సాహిత్య అందిస్తున్నట్టుగా వెల్లడించారు కీరవాణి. పోరాట స్ఫూర్తిని రగిల్చే పాటలు రాయటంలో అశోఖ్ తేజకు మంచి పేరుంది. గతంలో చిరంజీవి ఠాగూర్ సినిమా కోసం రాసిన నేను సైతం పాటకు జాతీయ అవార్డును కూడా అందుకున్నారు అశోక్ తేజ. Suddala Ashokteja garu started writing lyrics for RRR . He is amazingly fast and at the same time brilliant 🙏 — mmkeeravaani (@mmkeeravaani) 13 March 2019 -
గోల్డ్ ఫిష్ కీరవాణి పాట
ఆది సాయికుమార్ ఎన్.ఎస్.జి కమాండోగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. శషా చెత్రి, నిత్యా నరేష్ కథానాయికలు. రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా ఘాజీ బాబా పాత్రలో నటిస్తున్నారు. సాయికిరణ్ అడివి దర్శకుడు. ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి ఓ దేశభక్తి పాట పాడారు. ‘‘కీలక సన్నివేశంలో వచ్చే కీరవాణిగారు పాడిన పాట సినిమాని ఇంకో స్థాయికి తీసుకువెళ్లింది. రామజోగయ్య శాస్త్రిగారు విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించారు’’ అన్నారు సాయికిరణ్. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసే పాట ఇది. రామజోగయ్యశాస్త్రిగారు మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈ పాటలోని సందేశం జనాలను ఆలోచింపచేస్తుంది. కీరవాణిగారి సంగీతం వింటూ పెరిగాను. నా సంగీతంలో ఆయన పాట పాడడం, పైగా ఆ పాటను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్‌రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్ యాదవ్ (వైజాగ్), నిర్మాతలు: ప్రతిభ అడివి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్, సతీష్ డేగల. -
ఇప్పుడు చాలెంజ్‌లు మానేశాను!
యన్.టి. రామారావు జీవితం ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం ‘యన్.టి.ఆర్ : కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు. ► సాధారణంగా హీరోస్‌ని లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్‌తో చూపిస్తాం. యన్.టి. రామారావుని ఎలా చూపించారు? ఎగ్జాగిరేషన్ లేకుండా మామూలుగా చూపించాం. ఆయన జీవితం గురించి చెప్పాలంటే 30 గంటలు సినిమా తీసుండాలి. ► సంగీత దర్శకుడిగా ఈ సినిమా ఓ చాలెంజ్ అనుకోవచ్చా? కాదు.. ఎంజాయబుల్. చాలెంజింగ్ అనే పదాన్ని ‘చెత్త సినిమా’కు సంగీతం ఇచ్చినప్పుడు వాడుతుంటాను. మనసుకి నచ్చిన సబ్జెక్ట్స్ చేయడం ఎప్పుడూ చాలెంజ్ కాదు. అలాగే ఇప్పుడు ‘చాలెంజ్‌లు’ స్వీకరించడం మానేశాను. ► ఆ ఉద్దేశంతోనే ఆ మధ్య ‘చెత్త దర్శకులతో పని చేశాను’ అని ట్వీట్ చేశారా? అప్పుడు అలాంటి చాలెంజింగ్ సినిమాలు చేసి ఇప్పుడు ఎందుకు విమర్శించారు? వయసులో ఉన్నప్పుడు చాలా పనులు చేస్తాం. వయసు అయిపోయిన తర్వాత చేయలేం. వయసులో ఉన్నప్పుడు 20 పకోడీలు తింటాం. కానీ వయసైపోయాక తినలేం. అలాంటిదే ఇది కూడా. అలా అని ఆ సినిమాలు చేశానని రిగ్రెట్ అవ్వడం లేదు. ► మన అభిప్రాయాలను మనసులో దాచుకోవాలి. లేదా మాటలకు ఫిల్టర్ వేసుకుని మాట్లాడాలంటారు ఇండస్ట్రీలో.. నా అభిప్రాయాలను బహిరంగంగా చెప్పినా కూడా ఫలానా వ్యక్తి అని చెప్పలేదు కదా. సుబ్బారావు, పుల్లారావు అని పేరు పెట్టి విమర్శించలేదు కదా. సరదాగా ఓ విలేకరి ‘ఈ ప్రాంతంలో సగం మంది మూర్ఖులు అన్నాడట. దాంతో ఒకతను ఇలా అంటావా? మాట వెనక్కి తీసుకో అన్నారట. దానికి అతను ‘సగం మంది మూర్ఖులు కాదు’ అన్నాడట. ఆ సగం మంది ఎవరని ఎవరికీ తెలియదు. వాళ్లకు వాళ్లే ఆలోచించుకోవాలి. ► ‘ఇక రిటైర్ అవుతున్నా’ అని గతంలో ప్రకటించారు. మనసు మార్చుకున్నారా? మనసు ఇప్పుడూ మార్చుకోలేదు. రిటైర్ అయిపోయినట్టే. కానీ ‘చాలెంజింగ్’ సినిమాల నుంచి మాత్రమే. పకోడీలు తినడం లేదు. పెరుగన్నం తింటున్నా. ► మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ మీరు గమనిస్తే పాట పాటలానే ఉందా? స్టాండర్డ్ అలానే ఉందా? పాటకు పల్లవి ప్రాణం. అప్పుడూ.. ఇప్పుడూ. సో అలానే ఉన్నట్టే. పాట నిడివి 3 నుంచి 5 నిమిషాలు. అది ఉంటే ఉన్నట్టే. సాహిత్యం, సింగర్ ఉన్నారా? వాళ్లు ఉంటే ఉన్నట్లే. స్టాండర్డ్ విషయానికి వస్తే ఈ డిబేట్ అప్పుడు కూడా ఉంది. సో స్టాండర్డ్ మారలేదు అంటాను. పాట చెక్కు చెదరకుండా అలానే ఉంది. ► మీకు రీప్లేస్మెంట్ ఎవ్వరూ రాలేదంటాం. ఏమంటారు? ఆప్షన్ లేదని మీరంటారు. అది మీ భావం. దాసరిగారో పాట రాశారు. ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము...’ అని. ఎవరి వల్లా జీవితం ఆగదు. భర్త చనిపోయిన స్త్రీని చూసి ఆయన లోటు తీరనిది అని అంటాం. భర్త చనిపోతే భార్య సతీసహగమనం చేసుకోవాలా? అలా చేయడం తప్పు. తీరని లోటని చచ్చిపోమంటామా? బతికుండమంటావా? వాస్తవాన్ని అంగీకరించమంటాం. ప్రత్యామ్నాయం చూసుకోవాలంటాం కదా. ఇది కూడా అంతే. మీకు రీప్లేస్మెంట్ లేదనేది అపోహ అంటాను. ఎందరో వస్తున్నారు కదా. ► కానీ క్వాలిటీలో తేడాలుంటాయి కదా? దీన్ని కూడా ఏకీభవించను. మీకు ఫలనా రెస్టారెంట్లో బిర్యానీ నచ్చొచ్చు. నాకు వేరే హోటల్లో పూరీ నచ్చొచ్చు. కళలకు, సైన్స్‌కు తేడా అదే. లెక్కలు, సైన్స్‌లో వందకు వంద మార్కులు సాధించొచ్చు. కానీ తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్‌లో వేయరు. అవి ఆర్ట్స్. ఆ తేడాను అలా నిర్ణయించి పెట్టారు. చరిత్రకారులు కూడా చరిత్రను ఒక్కో దృష్టితో చెబుతారు. కొలమానం లేనప్పుడు రీప్లేస్మెంట్, పోలికలు ఉండవు. పని జరుగుతూ ఉంటుంది. ► మ్యూజిక్‌లో మీరు చూసిన మార్పేంటి? ఇది వరకు రికార్డింగ్ అంటే ఓ స్టూడియోలో పేద్ద రికార్డింగ్ ల్యాబ్. ఒక ఇంజనీర్, స్టాఫ్. లోపలకు అడుగుపెడితే సెపరేట్ గదులు, మెషినరీ చాలానే ఉండేవి. ఆరోజుల్లో అలా ఉండేది. ఇప్పుడు.. ఫలనా హోటల్లో ఫలనా రూమ్ నెంబర్లో కంపోజింగ్ అంటారు. పక్క గదిలో ఏదో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. మరో గదిలో మరోటి.. మరోటి... వీటి మధ్యలో రికార్డింగ్. అక్కడో మైక్ ఉంటుంది. పాడి వెళ్లిపోవడమే. అప్పటికీ ఇప్పటికీ నేను గమనించిన అతి పెద్ద మార్పు అదే. అప్పటికి అది నచ్చింది. ఇప్పుడు ఇది నచ్చింది. నచ్చింది కాబట్టే ఇంకా మ్యూజిక్ చేయగలుగుతున్నాను. ► ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల్లో పాటలెన్ని ఉన్నాయి? ఫస్ట్ పార్ట్‌లో నాలుగు, సెకండ్ పార్ట్‌లో నాలుగున్నాయి. ► ఈ సినిమాకి పాటలివ్వడంపై మీ అనుభూతి? రామారావుగారి మీద నాకు ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన సినిమాకు నన్ను సంగీతం చేయమనడాన్ని గర్వంగా ఫీల్ అవుతాను. -
2.ఓ కోసం కీరవాణి
సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.ఓ సినిమా కోసం భారతీయ సినీ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారనటంలో ఏమాత్రం అతిషయోక్తి లేదు. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ విజువల్వండర్గా రూపొందుతున్న ఈసినిమాలో ఓ పాటను టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు ఆలపించారు. ఇప్పటికే 2.ఓ లోని రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. తాజాగా మూడో పాటను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. బుల్లి గువ్వ అంటూ సాగే ఈ తెలుగు పాటను కీరవాణి ఆలపించారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వయంగా వెల్లడించారు. ఈ పాట కూడా ట్రైలర్‌తో పాటు శనివారం విడుదల కానుంది. @mmkeeravaani Garu ...Thanks for singing Bulliguva for #2point0 Telugu ... Looking forward to the release tomorrow 👍 — A.R.Rahman (@arrahman) 2 November 2018 -
రాజమౌళి ఫ్యామిలీ నుంచి హీరో..!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలకు ఆయన కుటుంబం అంతా కలిసి పనిచేస్తారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళి ప్రతీచిత్రానికి ఆయన అన్న సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతమందిస్తూ వస్తున్నారు. ఈ కుటుంబం నుంచి టెక్నికల్ ఫీల్ట్‌లో చాలా మందే ఉన్నా ఇంత వరకు తెర మీద కనిపించిన వారు చాలా తక్కువ. తాజాగా ఈ ఫ్యామిలీ నుంచి ఓ హీరో రాబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కీరవాణి తనయుడు సింహా త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న డిఫరెంట్ సినిమాతో సింహా అరంగేట్రం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో కీరవాణి మరో కొడుకు కాల భైరవ సంగీత దర్శకుడిగా మారనున్నాడట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కీరవాణి తనయుడు సింహా -
నాగచైతన్య ‘సవ్యసాచి’ ట్రైలర్ లాంచ్
-
హరికృష్ణ గురించి ఆసక్తికర విషయం చెప్పిన కీరవాణి
నేతలు, ఉన్నతాధికారుల పిల్లలు ఎలా ఉంటారో.. ఎంతా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారో అందరికి తెలిసిన సంగతే. అందరూ అలా ఉండకపోయినా కొందరైనా తమ తల్లిదండ్రుల హోదాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ అధికారులు.. సామాన్యుల మీద జులుం ప్రదర్శిస్తుంటారు. కానీ ఓ ముఖ్యమంత్రి కుమారుడు.. తానేవరో, తన తండ్రి హోదా ఏమిటనే విషయాలు వెల్లడించకుండా.. సాధారణ వ్యక్తిలాగా ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన చలానా చెల్లించిండంటే నమ్మడానికి కాస్తా కష్టంగానే ఉంటుంది. కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ఆ వ్యక్తికి తండ్రి సీఎం అయినంత మాత్రాన కుమారులు తలబిరుసుగా.. అమర్యాదగా ప్రవర్తించకూడదని తెలుసు. అందుకే అంతా సాధరణంగా ఉండగలిగాడు. ఆయనే నందమూరి హరికృష్ణ.. భేషజాలు తెలియని వ్యక్తిత్వం ఆయన సొంతం. ఈ ఆసక్తికర విషయాన్ని సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కీరవాణి... ‘ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, ఒక సారి హరికృష్ణ ట్రాఫిక్ సిగ్నల్ దాటారు. దాంతో ట్రాఫిక్ పోలీసులు రాసిన చలానా కట్టి వెళ్లిపోయారు.. తప్ప తాను ఎవరో చెప్పలేదు’ అంటూ కీరవాణి, హరికృష్ణ గురించి తన ట్విటర్లో షేర్ చేశారు. ఇంత గొప్ప వ్యక్తిత్వమున్న ఆ రథసారథిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. హరికృష్ణ మృతి ఆయన కుటుంబానికే కాక సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు అంటున్నారు అభిమానులు. రెండో వివాహాన్ని తండ్రి ఒప్పుకోలేదు తండ్రి అంటే అపార గౌరవం ఉన్న హరికృష్ణ తండ్రికి ఇష్టం లేని పని ఒకటి చేశారంట. అది షాలినిని రెండో వివాహం చేసుకోవడం. హరికృష్ణ షాలిని(జూ ఎన్టీఆర్ తల్లి)ని వివాహం చేసుకోవడం ఆయన తండ్రి ఎన్టీఆర్‌కి నచ్చలేదు. కానీ హరికృష్ణ ఈ విషయంలో తండ్రితో కూడా విభేదించారు. అయితే జూ. ఎన్టీఆర్ పుట్టిన తర్వాత ఆ విభేదాలన్ని దూరమయినట్లు సమాచారం. అప్పుడు ఎన్టీఆరే స్వయంగా తన మనవడికి తన పేరు ‘నందమూరి తారక రామరావు’ అని పెట్టుకున్నారని మరో సినీ ప్రముఖుడు తెలిపారు. -
డియర్ కామ్రేడ్
‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి’ చిత్రాల ఫేమ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఛలో’ ఫేమ్ రష్మిక మండన్న ఈ చిత్రంలో కథానాయిక. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్. రంగినేని నిర్మాతలు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కెమెరా స్విచ్చాన్ చేయగా, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. దర్శకులు సుకుమార్, కొరటాల శివ చిత్రబృందానికి స్క్రిప్ట్ అందించారు. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ‘డియర్ కామ్రేడ్’ సినిమా తెరకెక్కించనున్నట్లు ఈ సందర్భంగా చిత్రబృందం పేర్కొంది. తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ çస్వరాలు అందిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: ప్రవీణ్ మర్పురి. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ ఎమ్ ఎమ్ కీరవాణి
-
స్పెషల్ సీన్‌తో ‘ఎన్టీఆర్’
సాక్షి, హైదరాబాద్ : నందమూరి అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. మార్చి 29వ తేదీన దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ లాంఛ్ కానుంది. ఇక తొలి షాట్‌ను ఆసక్తికరమైన సన్నివేశాలతోనే చిత్రీకరించాలని దర్శకుడు తేజ భావిస్తున్నాడంట. ‘1940లో ఎన్టీఆర్ మద్రాస్‌లో అడుగు పెట్టిన ఘట్టాన్నే ఫస్ట్‌షాట్‌గా తీయబోతున్నాడంట. అక్కడి నుంచే ఆయన వెండితెర నట ప్రస్థానం మొదలైందన్నది తెలిసిందే. అందుకే ఆ సీన్‌ను ప్రత్యేకంగా తెరకెక్కించేందుకు తేజ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఒక రోజు కేటాయించి.. వేసవి తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక సినిమా లాంఛ్‌కు ముఖ్య అతిథులుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని.. పలువురు సినీ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని సమాచారం. బాలకృష్ణ లీడ్ రోల్లో కనిపించబోతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ ఎంఎం కీరవాణి కాగా.. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలకృష్ణ లు సంయుక్తంగా ‘ఎన్టీఆర్’ను నిర్మించబోతున్నారు. -
వైద్యులు సేవకుల్లా పనిచేయాలి
శ్రీకాకుళం రూరల్: వైద్య వృత్తి పూర్తిచేసిన వారంతా సమాజంలో పేదల పట్ల సేవకుల్లా పనిచేయాలని ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి అన్నారు. ఏదైనా కొత్త వ్యాధి సోకితే దానిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసి నిర్ధారణ చేయాలని సూచించారు. శ్రీకాకుళం రూరల్ మండలంలో రాగోలు వద్ద ఉన్న జెమ్స్ వైద్య కళాశాలలో 2012–2018వ బ్యాచ్‌కు చెందిన సుమారు 90 మంది వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేశారు. కళాశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన కీరవాణి మాట్లాడుతూ తను పెంచుకున్న అమ్మాయికి ఒక వ్యాధి సోకిందని దానిపై తన భార్య స్టడీచేసిందని ఈ సందర్భంగా తెలిపారు. ఇంటర్మీడియెట్ వరకే చదువుకున్నానని, ఈ కార్యక్రమంలో తనకు గ్రాడ్యూయేట్గా గౌరవించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వైద్యవృత్తి చేపట్టిన వారిలో డాక్టర్ బొల్లినేని భాస్కర్‌తో పాటు రామోజీరావు అంటే తనకు చాలా ఇష్టమన్నారు. జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవగా ప్రజలకు సేవలందించడం అభినందనీయమన్నారు. అప్పట్లో ఆరోగ్యశ్రీను ప్రవేశపెట్టిన సమయంలో దాని విధివిధానాలను బొల్లినేని భాస్కరరావుతో డిజైన్ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. అదేవిధంగా జెమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలందరికీ వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి సీఈవో చీఫ్ మెంటర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ త్వరలోనే టెలీ మెడిషన్ సేవలు నలబై కేంద్రాల్లో తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వీటిని త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తమ బొల్లినేని మెడిస్కిల్స్ ద్వారా జిల్లాలో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, సంవత్సరానికి 5 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బొల్లినేని మెడిస్కిల్స్ పనిచేస్తోందన్నారు. అనంతరం వైద్య విద్యార్థులకు కలెక్టర్ ధనంజయరెడ్డి, ఎంఎం కీరవాణి చేతులుమీదుగా పట్టాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి పద్మజ, డైరెక్టర్ డాక్టర్ అంబేడ్కర్, సూపరింటెండెంట్ గిరిధర్‌గోపాల్, బొల్లినేని ఆస్పత్రుల సీఈవోలు అద్విక్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది మాది కేరళ రాష్ట్రం. ఎంసెట్ కోసం విజయవాడలో కోచింగ్ తీసుకున్నాను. జెమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేయడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ప్రజలకు సేవచేసేందుకు ముందంజలోనే ఉంటాను. జనరల్ ఫీజీషియన్ కావడమే నా లక్ష్యం. – జార్జ్ టిసా, వైద్య విద్యార్థిని, కేరళ, జెమ్స్ వైద్య కళాశాల ఆర్దోపెడిక్ సర్జన్ కావాలని ఉంది మాది శ్రీకాకుళంలోని పొందూరు గ్రామం. ఐదు సంవత్సరాల పాటు జెమ్స్ వైద్య కళాశాలలో చదివి ఎంబీబీఎస్ పూర్తిచేయడం చాలా ఆనందంగా ఉంది. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు నా వైద్య సేవలందిస్తాను. ఆర్దోపెడిక్ సర్జన్ కావడమే నా లక్ష్యం.– పి.సుమన్ చంద్ర, శ్రీకాకుళం,జెమ్స్ వైద్య కళాశాల -
చిరంజీవిగారి అభినందన మరచిపోలేను
‘‘నాది వైజాగ్. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. నన్ను నేను హీరోగా చూసుకోవాలనేది నా కోరిక. అందుకు చాలాకాలం ట్రై చేశా’’ అని హీరో రంజిత్ అన్నారు. రంజిత్, పాలక్ లల్వాని జంటగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేమ్ త్రికోటి పి. దర్శకత్వంలో భరత్ సోమి నిర్మించిన ‘జువ్వ’ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి చిత్రం ‘నువ్వు నేను ఒకటవుదాం’. రెండో సినిమా ‘జువ్వ’ని మా అన్నయ్య డా. భరత్ చాలా ఇష్టపడి నిర్మించారు. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఇదొక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. రొమాన్స్, యాక్షన్, మంచి పాటలు, ఫన్ అన్నీ ఉంటాయి. ఇందులో నా పాత్ర పేరు రానా. ఎప్పుడూ జాలీగా, సరదాగా ఉండే కుర్రాడి పాత్ర. ఫైట్స్, రొమాన్స్, ఫన్.. ఇలా అన్ని సమయాల్లోనూ జాలీగానే ఉండే క్యారెక్టర్. త్రికోటిగారికి నాలెడ్జ్ ఎక్కువ. షూటింగ్ సమయంలో ఆయన వద్ద నుంచి చాలా నేర్చుకున్నాను. కీరవాణిగారు వంటి పెద్ద సంగీత దర్శకుడు నా సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవిగారు అడగ్గానే టీజర్ రిలీజ్ చేసి, ‘నీది ఫొటోజెనిక్ ఫేస్’ అని మెచ్చుకున్నారు. ఆయన అభినందన మరచిపోలేను. ఫ్రెష్ లవ్‌స్టోరీ, స్పోర్ట్ప్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌లో నటించాలని ఉంది. నెక్ట్స్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
సైరాపై మరో గుసగుస
సాక్షి, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి గురించి ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంపిక చేశారనేది దాని సారాంశం. ముందుగా ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని అధికారికంగా ప్రకటించారు. కానీ, డేట్లు సర్దుబాటు కాకపోవటంతో రెహమాన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇక తర్వాత థమన్ పేరు తెరపైకి వచ్చింది. అటుపై కీరవాణి పేరు వినిపించింది. ఇక ఇప్పుడు క్లాసిక్ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయారాజా పేరు చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం చిరు ఇళయరాజాను కలిశాడన్న ఓ వార్తే. అయితే సైరా చరిత్రకు సంబంధించిన కథ కావటంతో పాటల కన్నా ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పైనే ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చిరు భావిస్తున్నాడంట. ఈ నేపథ్యంలో కీరవాణి వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉండొచ్చని టాక్. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సైరా.. రెండో షెడ్యూల్‌కు రెడీ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటిదాకా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో స్పష్టత లేకపోవటం విశేషం. ఏది ఏమైనా ఈ ఊహాగానాలకు త్వరలో నిర్మాత రామ్ చరణ్ పుల్ స్టాప్ పెట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. -
రొమాన్స్-కామెడీ-సెక్స్... పిచ్చి వర్మ
సాక్షి, సినిమా : విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పై ఎట్టకేలకు సంగీత దర్శకుడు కీరవాణి స్పందించారు. జీఎస్టీతో తన సంగీతాన్ని వర్మ మరో మెట్టు ఎక్కించాడంటూ కీరవాణి పొగడ్తలు కురిపించారు. పొర్న్ స్టార్ మియా మల్కోవాతో వర్మ రూపొందించిన వీడియోకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. ‘‘సెల్యులాయిడ్ పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు తనతో 1991లో 'రొమాన్స్'ను, 1992లో 'కామెడీ'ని, 2018లో 'సెక్స్'ను పలికించాయి. ఇక ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించబోతున్నా. నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి(వర్మను ఉద్దేశించి) కృతజ్ఞతలు’’ అంటూ కీరవాణి ఓ ట్వీట్ చేశారు. కాగా, కీరవాణి కంటే ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్మ ఓ ట్వీట్ చేశాడు. వివాదాలు చుట్టు ముట్టినా.. మియా మల్కోవా స్వగతం వీడియో ఆన్లైన్లో విడుదలై ట్రెండ్ సెట్ చేసింది. Love @RGVzoomin for uplifting my music in the process of showcasing his brilliance in various kinds of celluloid aesthetics. Romance in 1991, Comedy in 1992, and Sex in 2018. Horror and Violence to follow soon this year, Thanks to the mad movie maker for believing in me. — mmkeeravaani (@mmkeeravaani) 28 January 2018 -
కీరవాణి మార్క్ మెలోడి ‘ఓ కల’
‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేం త్రికోటి దర్శకత్వంలో రంజిత్, పలక్ లల్వాని జంటగా తెరకెక్కుతున్న సినిమా జువ్వ. ఇటీవల ఈ సినిమా పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. భరత్ సోమి నిర్మిస్తున్న ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతమందించారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ మేకింగ్ వీడియోతో పాటు ‘ఓ కల’ అంటూ సాగే మెలోడి సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. వశిష్ట్ వర్మ సాహిత్య మందించిన ఈ పాటను కీరవాణి తనయుడు కాలభైరవతో కలిసి దామిని ఆలపించారు.