MM Keeravani To Compose Music For Malayalam Movie After 27 Years - Sakshi
Sakshi News home page

27 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళ సినిమాకు కీరవాణి సంగీతం

Published Wed, May 31 2023 9:17 AM | Last Updated on Wed, May 31 2023 1:49 PM

MM Keeravani To Compose Music For Malayalam Movie After 27 Years - Sakshi

‘నాటు.. నాటు...’ అంటూ దేశీ ట్యూన్‌తో దేశీయులతోనే కాదు... విదేశీయులతో కూడా స్టెప్పులేయించారు ఎంఎం కీరవాణి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ఈ పాట ఆస్కార్‌ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కీరవాణిని అందరూ పాన్‌ ఇండియా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అంటున్నారు. నిజానికి ఆయన ఎప్పుడో పాన్‌ ఇండియా సంగీతదర్శకుడు.

(చదవండి: త్వరలో భోళా మానియా)

తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల చిత్రాలకు సంగీతం అందించారు. కాగా 27ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన మలయాళ సినిమా ‘మెజీషియన్‌’ అంగీకరించారు. గతంలో మలయాళంలో ‘దేవరాగం’ (1996)కి సంగీతదర్శకుడిగా వ్యవహరించారు. ఇక ‘మెజీషియన్‌’కి కీరవాణి మూడు పాటలకు స్వరాలందిస్తారని తెలిసింది. బేబీ జాన్‌ వల్యత్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement