magician
-
అబ్రకదబ్ర లోనూ ఆమె ముద్ర
‘నీపై నీకు నమ్మకం ఉంటే అద్భుతం సాధ్యం అవుతుంది’ అనే మాట మెజిషియన్ లక్ష్మికి తెలియనిదేమీ కాదు. ఆ నమ్మకం వల్లే గానం నుంచి ఇంద్రజాలం వరకు ఎన్నో విద్యల్లో ప్రావీణ్యం సాధించింది ‘ఆహా!’ అనిపిస్తుంది...అయిదు అంగుళాల పదునైన మేకును సుత్తితో ముక్కు లోనికి పంపుతూ లక్ష్మి చేసే సాహసం చూసి ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడుస్తుంది. అటూ ఇటూ కదులుతూ చేతిలోని గొడుగును ఆడిస్తూ ఒకదాని తరువాత ఒకటి చొప్పున అలవోకగా 30 కు పైగా గొడుగులు, స్వింగ్ఫ్లవర్స్ తీయడం చూస్తే ఔరా అనిపిస్తుంది. నంబర్స్‌తో మెంటలిజం మ్యాజిక్ చేసి అవాక్కు చేయడమే కాదు, వస్తువుల్ని మాయం చేయడం, పుట్టించడం, మనిషిని రెండు భాగాలు చేసినట్టు భ్రమింప చేయడం... ఇలా ఆమె చేసే ఇంద్రజాలం ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.ఇంద్రజాలంతోనే కాదు తన గానంతో కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది లక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండ లక్ష్మీప్రసన్నదేవి భర్త రాము సింగర్, డ్యాన్సర్, మిమిక్రీ ఆర్టిస్టు, మెజీషియ¯Œ , ఎంటర్టైనర్గా సుపరిచితుడు. భర్తతోపాటు ఎన్నో ప్రాంతాలకు వెళుతుండేది లక్ష్మి. అలా వెళ్లడం ద్వారా వివిధ కళా రూపాలకు ప్రేక్షకుల నుంచి వచ్చే అపురూప స్పందనను ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది.రెండేళ్ల క్రితం భర్తతో కలిసి కేరళలో జరిగిన మ్యాజిక్పోటీలకు వెళ్లింది లక్ష్మి. ఆపోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనించింది. మహిళలు కనిపించని ఆ లోటే తనను మ్యాజిక్‌పై ఆసక్తి పెంచుకునేలా చేసింది. ‘నేను మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను’ తన మనసులో మాటను భర్తకు చెప్పింది.అతడు ఎగతాళిగా నవ్వి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోగానీ ‘భేషుగ్గా నేర్చుకోవచ్చు’ అనడమే కాదు ఇల్లే పాఠశాలగా ఇంద్రజాల విద్య నేర్పడం మొదలుపెట్టాడు. భర్త నుంచి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకున్న లక్ష్మి చేసిన మొదటి మ్యాజిక్ షోకు మంచి స్పందన వచ్చింది. తనమీద తనకు నమ్మకం వచ్చింది.ఇక అప్పటి నుంచి ‘మ్యాజిక్’ తని ఇంటి పేరుగా మారింది. బర్త్‌డే పార్టీల నుంచి మ్యారేజ్ వరకు రకరకాల ఫంక్షన్లలో ఇప్పటివరకు వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. గుంటూరులో జరిగిన ‘అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్’ రాష్ట్రస్థాయిపోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. తాజ్ మ్యాజిక్ సొసైటీ ఆగ్రాలో నిర్వహించిన జాతీయస్థాయిపోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.దేశవ్యాప్తంగా మేకు మ్యాజిక్ చేస్తున్న ఏడుగురు మెజిషీయన్లలో ఏకైక మహిళను తానే అంటుంది లక్ష్మి. పాటలు పాడటంలో నైపుణ్యాన్ని సాధించిన లక్ష్మి యాంకర్‌గా, సింగర్‌గా వెయ్యికి పైగా షోలు చేసింది. ‘ఇంకా ఎన్నో కళలు నేర్చుకోవాలని ఉంది. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వాలని ఉంది’ అంటుంది లక్ష్మీప్రసన్నదేవి.ఆ చప్పట్లు చాలు...ప్రేక్షకులలో ఒకరిగా ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలను చూసి చప్పట్లు కొట్టాను. ఇప్పుడు నేను ప్రదర్శన చేస్తుంటే అలాంటి చప్పట్లు వినడం అపురూపంగా ఉంది. లక్షలు, కోట్లు అక్కర్లేదు. ఆ చప్పట్లు చాలు కళాకారుడిలో నిత్య ఉత్సాహం నింపడానికి. కళకు ప్రాంతం, జెండర్ అనే తేడా తెలియదు. కళాకారులలో ఏ కొంచెం ప్రతిభ ఉన్నా ప్రపంచం సొంతం చేసుకుంటుంది. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేను ‘ఇప్పుడు ఇవన్నీ ఎందుకు!’ అనుకోలేదు. ‘నేను ఎందుకు నేర్చుకోకూడదు’ అని మాత్రమే అనుకున్నాను. అలా అనుకోవడం వల్లే మెజీషియన్‌గా, సింగర్‌గా, యాంకర్‌గా నాకంటూ ఎంతో కొంత గుర్తింపు వచ్చింది. మరిన్ని కళలు నేర్చుకొని, దేశవ్యాప్తంగా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాను.– దండ లక్ష్మీప్రసన్నదేవి – పెనుపోతుల విజయ్‌కుమార్, సాక్షి, భీమవరం ఫొటోలు: బడేటి తిరుపతి వెంకటేశ్వరరావు -
Lok sabha elections 2024: రాచరిక మాంత్రికుడు రాహుల్: మోదీ
హోషంగాబాద్/సాక్షి బెంగళూరు: ఒక్క దెబ్బతో దేశంలోని పేదరికాన్ని నిర్మూలించవచ్చంటూ కాగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. రాహుల్‌ను రాచరిక మాంత్రికుడిగా అభివరి్ణంచారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పిపారియా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘ఒక్కదెబ్బతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చని కాంగ్రెస్ రాజకుమారుడు ప్రకటించారు. నిజంగా నవ్వొస్తోంది. ఆ రాజరిక మాంత్రికుడు ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లారు. ఆయన నాన్నమ్మ 50 ఏళ్ల క్రితం గరీబీ హఠావో అంటూ నినాదం ఇచ్చారు. పేదరికం మాత్రం పోలేదు. అందుకే ఆ రాజకుమారుడి మాటలను జనం పట్టించుకోవడం లేదు. ఆ కుటుంబ(సోనియా గాం«దీ) సభ్యులు 2014 కంటే ముందు పదేళ్ల పాటు రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడిపించారు. అప్పుడు పేదరికం గుర్తుకురాలేదు. ఇప్పుడు హఠాత్తుగా పేదరికాన్ని నిర్మూలించే మంత్రం కనిపెట్టారు. ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు. పేదరికంపై జోక్‌లు వేయొద్దని కోరుతున్నా’’ అని మోదీ స్పష్టం చేశారు. -
ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడు: ప్రధాని మోదీ
భోపాల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. ఇన్నాళ్లూ ఈ రాయల్ మాంత్రికుడు ఎక్కడ దాక్కున్నాడని రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని ఒకే ఒక్క దెబ్బకు లేకుండా చేస్తానన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని ఎద్దేవా చేశారు. ఆదివారం(ఏప్రిల్14) మధ్యప్రదేశ్‌లోని హొషాంగాబాద్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మేనిఫెస్టోలోని ప్రతీ హామీ దేశాన్ని దివాతా తీయిస్తుందని హెచ్చరించారు. కాగా, గత వారం రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒకే ఒక దెబ్బతో దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తామన్నారు.‘మీరు గనుక దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే మీ ఖాతాల్లోకి లక్ష రూపాయాలు వచ్చి పడతాయి. డబ్బులు వస్తూనే ఉంటాయి మీ ఖాకతాల్లోకి. ఒకే ఒక్క దెబ్బకు పేదరికం లేకుండా పోవాలి’అని రాహుల్ ప్రజలకు హామీ ఇచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుంటుంబాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల -
అంతర్జాతీయ మేజిషియన్కు అరుదైన గౌరవం!
అంతర్జాతీయంగా ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ మేజిషియన్ సామల వేణుకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర చలనచిత్ర సెన్సార్ బోర్డ్‌లో సలహా ప్యానెల్ సభ్యునిగా నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రసార, సమాచార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించింది. అంతర్జాతీయ ఇంద్రజాలికుడైన సామల వేణు భారతదేశంతో పాటు విదేశాల్లో మన సంస్కృతిని బలోపేతం చేయడానికి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. గతంలో బాలల చలనచిత్రోత్సవాల్లో సామల వేణు రెండుసార్లు జ్యూరీ మెంబర్‌గా ఉన్నారు. ఆయన గత 42 ఏళ్లుగా 34 కంటే ఎక్కువ దేశాలలో 7వేల కంటే ఎక్కువ మ్యాజిక్ షోలను ప్రదర్శించారు. -
అవసరమైతే మ్యాజిక్కులు చేసుకుని బతుకుతా.. రాజస్థాన్ సీఎం కౌంటర్
జోధ్ పూర్లో నూతనంగా నిర్మించిన రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవం సందర్బంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీకి చేసిన "ఇంద్రజాలికుడు" వ్యాఖ్యలకు స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను పొట్టకూటి కోసం అవసరమైతే మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటాను కానీ జోధ్ పూర్ ప్రజలకు మచ్చ తెచ్చే పని మాత్రం చేయనని అన్నారు. రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవంలో... 15వ శతాబ్దానికి చెందిన మెహరాన్ ఘడ్ కోటకు సందర్శకుల రాకపోకలు సాగేందుకు వీలుగా నిర్మించిన రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒకప్పుడు జోధ్ పూర్ ఎలా ఉండేది? ఇక్కడ నీళ్లు ఉండేవి కాదు, రైలు సదుపాయం కూడా లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రోడ్లు, రైళ్లు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య ఇలా ఇప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ 42 ఏళ్లలో ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి అంతా చేశానని అన్నారు. మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటా... ఈ సందర్భాంగా కేంద్రం చేసిన అభివృద్ధిని తానే చేశానని చెప్పుకుంటూ ఇంద్రజాలం చేసి ప్రజలను మభ్య పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. అవును నేను ఇంద్రజాలికుడినే.. అవసరమైతే పొట్టకూటి కోసం మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటాను కానీ... జోధ్ పూర్ ప్రజలు తలదించుకునే పనిని ఎన్నడూ చేయనని అన్నారు. మాయ చేస్తోంది మీరు. మీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో చెప్పడానికి ఇదే రావు జోధా మార్గ్ ఉదాహరణ. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందే ప్రారంభమైన ఈ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఆలస్యం చేశారు. ఖర్చు కూడా 39 వేల కోట్ల నుండి 72 వేల కోట్లకు పెంచేశారు. ఇప్పటివరకు బీజేపీ ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను కొనసాగించకుండా జాప్యం చేశారన్నారు. -
27 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళ సినిమాకు కీరవాణి సంగీతం
‘నాటు.. నాటు...’ అంటూ దేశీ ట్యూన్‌తో దేశీయులతోనే కాదు... విదేశీయులతో కూడా స్టెప్పులేయించారు ఎంఎం కీరవాణి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’లోని ఈ పాట ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కీరవాణిని అందరూ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. నిజానికి ఆయన ఎప్పుడో పాన్ ఇండియా సంగీతదర్శకుడు. (చదవండి: త్వరలో భోళా మానియా) తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల చిత్రాలకు సంగీతం అందించారు. కాగా 27ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన మలయాళ సినిమా ‘మెజీషియన్’ అంగీకరించారు. గతంలో మలయాళంలో ‘దేవరాగం’ (1996)కి సంగీతదర్శకుడిగా వ్యవహరించారు. ఇక ‘మెజీషియన్’కి కీరవాణి మూడు పాటలకు స్వరాలందిస్తారని తెలిసింది. బేబీ జాన్ వల్యత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
నగ్నపూజల మాంత్రికుడు.. టీడీపీ నాయకుడు
రేణిగుంట: చేతబడి చేశారేమో అనే అనుమానంతో ఓ మహిళ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి చెందిన మాసారపు సుబ్బయ్య అనే మాంత్రికుణ్ణి ఆశ్రయించగా.. ఆ మాంత్రికుడు ఆమెపై బలాత్కారం చేయబోయిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తెలుగుదేశం పార్టీ నాయకుడైన సుబ్బయ్య శ్రీకాళహస్తిలో మాంత్రికుడిగా చెలామణి అవుతున్నాడు. రేణిగుంట మండలం కరకంబాడికి చెందిన 35 ఏళ్ల మహిళకు చేతబడి వదిలిస్తానని చెప్పిన సుబ్బయ్య ఈ నెల 14న పూజా సామగ్రితో ఆమె ఇంటికి వెళ్లాడు. పూజలో నగ్నంగా కూర్చోవాలని మాంత్రికుడు సుబ్బయ్య కోరగా.. ఆమె నిరాకరించింది. దీంతో చేతులతో బంధించి బలాత్కారం చేయబోగా.. ఆమె తప్పించుకుని గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కామ మాంత్రికుడు సుబ్బయ్యను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. గోర్లతో రక్కి... చాకుతో పొడవబోయాడు ఆ మహిళ పూజలో నగ్నంగా కూర్చునేందుకు నిరాకరించి ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. మాంత్రికుడు ఆమె వీపు, చేతి భాగంలో గోర్లతో రక్కి బలాత్కారం చేసేందుకు యత్నించాడని రేణిగుంట అర్బన్ సీఐ సుబ్బారెడ్డి వెల్లడించారు. అతని నుంచి విడిపించుకుని బయటకు వచ్చేందుకు ఆ మహిళ ప్రయత్నించగా.. నిమ్మకాయలు కోసిన చాకుతో ఆమెను పొడిచేందుకు ప్రయత్నించాడని తెలిపారు. దీంతో ఆమె ప్రాణభయంతో గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీయగా.. చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోగా మాంత్రికుడు కారులో పరారయ్యాడన్నారు. పదేళ్ల క్రితం ఆటో డ్రైవర్.. ఇప్పుడు టీడీపీ నేత మాంత్రికుడు మాసారపు సుబ్బయ్య పదేళ్ల క్రితం ఆటో తోలుకుంటూ జీవనం సాగించేవాడు. తనకు మంత్ర శక్తులు తెలసునని స్థానికులను నమ్మించి శ్రీకాళహస్తిలోని బహదూరుపేటలో మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇంటి వద్దే తాయెత్తులు కడుతూ ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నాడు. తిరుపతి జిల్లా టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సుబ్బయ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల వెంకటసు«దీర్‌రెడ్డికి నమ్మిన బంటుగా చక్రం తిప్పుతున్నాడు. సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులతో వచ్చే అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు. మహిళలకు మాయమాటలు చెప్పి వశపర్చుకుని వారి మాన, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా నిలదీస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెడతానంటూ భయపెట్టేవాడు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుదీర్‌రెడ్డి రాజకీయ భవిష్యత్ బాగుండాలని శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో సుబ్బయ్య తాంత్రిక పూజలు చేసి నరబలులు కూడా ఇచ్చాడన్న ఆరోపణలున్నాయి. దొంగ మాంత్రికుని ముసుగులో అకృత్యాలు, ఆగడాలకు పాల్పడుతున్న సుబ్బయ్య అక్రమాల డొంకను పోలీసులు కదిలించారు. సమగ్ర విచారణ చేపడుతున్నారు. విచారణలో మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెలుగుచూసే వీలుంది. -
మహిళపై లైంగికదాడికి మాంత్రికుడి యత్నం
రేణిగుంట : చేతబడి అనుమానంతో తన వద్దకు వచ్చిన మహిళను ఓ మాంత్రికుడు నగ్నంగా పూజలో పాల్గొనాలంటూ బలవంతం పెట్టాడు. మాట వినకపోవడంతో ఆమైపె లైంగిక దాడికి యత్నించాడు. కామాంధుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పరారైన మాంత్రికుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామానగర్‌లో జరిగింది. ఈ వివరాలను రేణిగుంట అర్బన్ సీఐ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. తారకరామానగర్‌కు చెందిన 35 ఏళ్ల మహిళకు ఇటీవల అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఆస్పత్రులకు వెళ్లినా తగ్గకపోవడంతో.. తనకు ఎవరైనా చేతబడి చేశారేమోనని ఆందోళన చెందింది. దీంతో వారం కిందట శ్రీకాళహస్తి పట్టణం బహదూర్‌పేటకు చెందిన మాసారపు సుబ్బయ్య వద్దకు వెళ్లింది. ఇంటికి చేతబడి జరిగిందని.. రూ.20 వేలు ఇస్తే క్షుద్రపూజలు చేసి విముక్తి కల్పిస్తానంటూ ఆమెను సుబ్బయ్య నమ్మబలికాడు. రూ.7,500 అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఈనెల 14వ తేదీన రాత్రి 10 గంటలకు సుబ్బయ్య కారులో ఆమె ఇంటికి పూజా సామగ్రిని తీసుకువచ్చాడు. ఇంట్లోనే ముగ్గులు వేసి.. గుంతలు తవ్వి కొబ్బరికాయలు, నిమ్మకాయలు పెట్టాడు. ముగ్గుపై నగ్నంగా కూర్చుంటే పూజ ప్రారంభిస్తానని చెప్పగా.. అవాక్కయిన ఆ మహిళ నిరాకరించింది. దీంతో ఆమైపె సుబ్బయ్య లైంగిక దాడికి యత్నించాడు. బయటకు వచ్చేందుకు ఆమె పెనుగులాడుతుండటంతో.. చాకుతో పొడిచేందుకు ప్రయత్నించాడు. సుబ్బయ్యను తోసేసిన బాధితురాలు గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వచ్చేలోపే సుబ్బయ్య కారులో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు. మంగళవారం ఉదయం రేణిగుంట చెక్‌పోస్ట్ కూడలి వద్ద సుబ్బయ్యను అరెస్ట్ చేసినట్లు సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్ఐ ఈశ్వరయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వివాహితపై అఘాయిత్యానికి యత్నించి కటకటాలుపాలైన శ్రీకాళహస్తికి చెందిన సుబ్బ య్య టీడీపీ నేత అనుచరుడు. పదేళ్ల కిందట ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్న సుబ్బ య్య తనకు మంత్ర శక్తులు తెలుసునని స్థాని కులను నమ్మించి శ్రీకాళహస్తిలోని బహుదూరుపేటలో మంగళ, శుక్ర, ఆదివారాల్లో తన ఇంటి వద్దే అమ్మవారికి పూజలు చేసి తాయత్తులు కడుతూ గుంజుకునే వాడు. ఎస్టీ సెల్లో కీలక పదవి మాసారపు సుబ్బయ్య టీడీపీ తిరుపతి జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ సోషల్ మీడియాలో టీడీపీ వాణిని బలంగా వినిపిస్తున్నాడు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డికి నమ్మిన బంటు. అతనిని సుధీర్‌రెడ్డి పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌లకు పరిచయం చేసి వారితో ఫొటోలు దిగిన పిరిస్థితి. మాంత్రికుడు మహిళలకు మాయమాటలు చెప్పి వశపరుచుకునేవాడనే ఆరోపణలున్నాయి. అయితే తన వెనుక రాజకీయ అండ ఉండడంతో అతని ఆకృత్యాలను బయటపెట్టేందుకు ఎవ్వరూ సాహసించలేదు. బొజ్జల సుధీర్ కోసం తాంత్రిక పూజలు టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డికి ఇతనితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కోవలోనే ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలని ప్రతివారం శ్రీకాళహస్తి స్వర్ణముఖీ నదిలో దిగంబరంగా సుబ్బయ్య తాంత్రిక పూజలు చేసి నరబలులు కూడా ఇచ్చాడనే ఆరోపణలున్నాయి. -
మాటే మంత్రమై...
చిన్న వయసులో ఉన్నప్పుడు ఇండోర్ (మధ్యప్రదేశ్)లో జరిగిన మ్యాజిక్ షోకు వెళ్లాడు రాజ్ షమని.మెజిషియన్ టోపి నుంచి కుందేలు పిల్లను బయటికి తీశాడు. మంత్రదండం నుంచి పూలవర్షం కురిపించాడు.ఈ అబ్బురాలను చూసి ‘మెజిషియన్ అయితే ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో కదా!’ అనుకున్నాడు రాజ్. పెద్దయ్యాక రాజ్ మెజిషియన్ కాలేదుగానీ ‘మాటల మాంత్రికుడు’ అయ్యాడు! సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా బోలెడు పేరు తెచ్చుకున్నాడు.... పదహారు సంవత్సరాల వయసులో ఇండోర్‌లో తండ్రి చేసే వ్యా పారానికి చేదోడువాదోడుగా ఉండేవాడు రాజ్ షమని. తండ్రితో పాటు డిష్ సోప్స్ అమ్మేవాడు. ‘కాలాన్ని కనిపెట్టుకొని ఉండాలి’ అనేది వ్యా పారసూత్రం. ఆ వయసులో అతడికి ఇది తెలుసో లేదోగానీ డిష్ సోప్ నుంచి ΄పౌ డర్‌కు, ΄పౌ డర్ నుంచి లిక్విడ్‌కు, డిష్వాషర్ జెల్‌కు బిజినెస్‌ను మార్చాడు. అంతకు ముందు ఉండీ లేనట్లుగా ఉన్న వ్యా పారం కొత్త ఊపిరి పోసుకొని లాభాల బాటలో పరుగెత్తింది.రాజ్‌కు తన గురించి తాను తెలుసుకునేలా చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత...సోషల్ మీడియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబైకి వచ్చాడు రాజ్.‘మరీ ఎక్కువగా ఉత్సాహపడుతున్నావు. ఇక్కడ బాగానే ఉంది కదా’ అన్నారు ఇండోర్ ఫ్రెండ్స్. అయితే రాజ్ షమని ఒక్క విజయం దగ్గర ఆగిపోయే టైప్ కాదు. ఉత్సాహమే అతని ఇంధనం. కొన్ని సంవత్సరాల కష్టం తరువాత మన దేశంలోని మోస్ట్–ఫాలోవ్డ్ కంటెంట్ క్రియేటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ షమని. మరో విశేషం...మన దేశంలోని ఎంటర్ప్రెన్యూర్షిప్కు సంబంధించిన పాడ్‌కాస్ట్‌లలో రాజ్ షమని చేసిన ‘ఫిగర్ ఔట్’ పాడ్‌కాస్ట్ టాప్‌లో నిలిచింది. పన్నెండు నెలల వ్యవధిలో 100 మిలియన్ వ్యూలు వచ్చాయి.తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఎంతోమంది స్టార్టప్‌ల వైపు రావడానికి కారణమైన రాజ్ తొమ్మిది స్టార్టప్‌లలో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నాడు. ‘వినియోగదారుల ఇష్టాలపైనే వ్యా పారాన్ని నిర్మించాలి’ అని చెప్పే రాజ్ షమని డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ తమ కన్జ్యూమర్ బ్రాండ్స్‌ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం, విజయవంతం చేయడంలో సహాయపడే ‘హౌజ్ ఆఫ్ ఎక్స్’ వెంచర్ స్టార్ట్ చేశాడు. ఈ వెంచర్ ఇన్వెస్టర్ల జాబితాలో నితిన్ కామత్( జెరోదా–కో ఫౌండర్), వినీత సింగ్ (షుగర్ కాస్మెటిక్స్)లాంటి వ్యా పారదిగ్గజాలు ఉండడం విశేషం. మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు 26 సంవత్సరాల రాజ్ షమని.ఇప్పటివరకు ఇరవైకి పైగా దేశాల్లో స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చిన రాజ్ షమని ‘బిల్డ్, డోన్ట్ టాక్’ పేరుతో వ్యక్తిత్వ వికాస పుస్తకం రాశాడు. ఈ పుస్తకం గురించి ఇలా పరిచయం చేసుకుంటాడు రాజ్...‘మన స్కూల్లో మ్యాథ్స్, సైన్స్‌లాంటి సబ్జెక్ట్‌లు తెలుసుకుంటాం. అయితే ఒక వస్తువును ఎలా అమ్మాలి? స్నేహసంబంధాలను ఏర్పర్చుకోవడం ఎలా? మానసిక ఆరోగ్యంపై ఎలా శ్రద్ధ చూపా లి? ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి....మొదలైన విషయాలు స్కూల్లో తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు. అందుకే ఈ పుస్తకం బడిలోకి రండి. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’ ‘హౌజ్ ఆఫ్ ఎక్స్’ ఇన్వెస్టర్లలో ఒకరైన నితిన్ కామత్ ఇలా అంటాడు...‘ఐడియాలు, ప్రో డక్ట్ ఎంత ముఖ్యమో వ్యక్తులు కూడా అంతే ముఖ్యం. సోషల్ మీడియాలో రాజ్ షమని సాధించిన విజయాలే మా నమ్మకానికి కారణం’ఒక్క విజయం దగ్గరే ఆగిపోయే అలవాటు లేని రాజ్ షమని, తన విజయాలకు మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదు. ఇతరులను కూడా గెలుపు బాటలో నడిపించాలనుకుంటున్నాడు. -
ఇదేంది రా మామా...ఈ వయ్యారి యాడికెల్లి వచ్చింది? కనిపెట్టగలరా?
న్యూఢిల్లీ: మెజీషియన్లు తమ అద్భుతమైన యామాజాలంతో జనాన్ని మెస్మరైజ్ చేస్తారు. రకరకాల జిమ్ముక్కులతో మంత్రం వేసి మాయచేసి మ్యాజిక్ చేయడం మనందరికి తెలిసిందే. పిట్టల్ని, బట్టల్ని మన ముందే కనికట్టు చేసి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యంగా అందమైన అమ్మాయిలను క్షణాల్లో మాయం చేసిడం బాగా ఆకట్టుకుంటూ ఉంటారు ప్రముఖ మెజీషియన్లు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓరి నీ మ్యాజిక్కో! ఇదేం మ్యాజిక్ రా మామా సాధారణ ప్రజలు అబ్బుర పడిపోవడం కూడా సహజమే.అలాంటి మ్యాజిక్కు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది. 1.3 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోపై పలు ఫన్నీ ఫన్నీ కమెంట్లతో నెటిజన్లు సందడి చేస్తున్నారు. మరి వీకెండ్ మూడ్‌లో ఉన్న మీరు కూడా ఆ అమ్మడు ఎక్కడనుంచి ఎలా వచ్చింది అనే విషయాన్ని బాగా పరిశీలించండి. ఆ కనికట్టు ఏంటో కనిపెట్టండి. (ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?) Next-level magic ✨ pic.twitter.com/AxrzcAOJKy — Next Fucking Level (@NxtFuckingLvl) February 3, 2023 -
మాయ చేసే మెస్సీనే బోల్తా కొట్టించాడు..
ఫుట్‌బాల్‌లో లియోనల్ మెస్సీది ప్రత్యేక స్థానం. మైదానంలో తన ఆటతో అభిమానులను మాయ చేయగల సత్తా అతని సొంతం. గతేడాది ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపించిన మెస్సీ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. మారడోనా తర్వాత దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందిన మెస్సీ ఎట్టకేలకు తన ఫిఫా వరల్డ్‌కప్ కలను సాకారం చేసుకున్నాడు. అలాంటి మెస్సీనే తెలివిగా బోల్తా కొట్టించాడు మెజీషియన్. కార్డ్ ట్రిక్ ప్లేతో తన మ్యాజిక్‌ను చూపించి మెస్సీనే మెస్మరైజ్ చేశాడు. విషయంలోకి వెళితే.. ప్రస్తుతం మెస్సీ పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ) క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి పీఎస్జీ ప్లేయర్స్‌కు పారిస్‌లో ఒక పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి మెస్సీ సహా ఇతర పీఎస్జీ ప్లేయర్లు హాజరయ్యారు. ఇదే పార్టీకి జూలిస్ డెయిన్ అనే మెజీషియన్ కూడా వచ్చాడు. మెస్సీ దగ్గరికి వచ్చి కార్డ్ ట్రిక్ ప్లే మ్యాజిక్ షో చూపిస్తానన్నాడు. మెస్సీని ఒక కార్డు సెలెక్ట్ చేసుకోవాలని.. కానీ అది ఏ కార్డు అనేది తనకు చూపించొద్దన్నాడు. అలా మెస్సీ ఏస్(A) కార్డును సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన మ్యాజిక్ ట్రిక్‌తో మెస్సీ ఏంచుకున్న కార్డును మెజీషియన్ కరెక్టుగా చూపించడంతో పాటు అర్థం కాని భాషలో మాట్లాడాడు. ఆ సమయంలో మెస్సీ భార్య ఆంటోనెల్లా కూడా అక్కడే ఉంది. ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో తెలియక మెజీషియన్ పడుతున్న కష్టాన్ని చూసి మెస్సీ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ అందించిన తర్వాత ఆటకు రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరికొన్ని రోజులు తన ఆటను కొనసాగిస్తానని మెస్సీ మనసులో మాటను చెప్పాడు. కానీ గత రెండురోజులుగా మెస్సీ త్వరలోనే రిటైర్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా మెస్సీ కూడా అర్జెంటీనా జెర్సీని పట్టుకొని.. 'ఇక ముగిసింది' అన్నట్లుగా హింట్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. 35 ఏళ్ల మెస్సీ.. లీగ్-1లో భాగంగా మోంట్పిల్లీర్తో మ్యాచ్‌లో గోల్ చేయగా.. 3-1తో పీఎస్జీ విజయం సాధించింది. View this post on Instagram A post shared by Julius Dein (@juliusdein) చదవండి: వాళ్లిద్దరు నిజంగా కలిశారా..? గిల్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్ -
అబ్రకదబ్ర.. చేతిలో నుంచి విభూతి, నోటిలో నుంచి శివలింగం
చేతిలో నుంచి విభూతి, నోటిలో నుంచి శివలింగం తీయడం వంటివి చూసి దైవాంశ శక్తులున్న వారే ఇలా చేయగలరని గుడ్డిగా నమ్మడం, చేతబడి, చిల్లంగి వంటివి ఉన్నాయన్న మూఢ నమ్మకాలతో దారుణంగా మోసపోతున్న ప్రజల్లో ఇంద్ర జాలకులు చైతన్య కల్పిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఓ అడుగు ముందుకేసి అవన్నీ ఊహాజనితమేనంటూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలకుడు పద్మశ్రీ పీసీ సర్కార్ (సీనియర్) జయంతి ఫిబ్రవరి 23న ఏటా ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే కోవిడ్ ప్రభావంతో ఎక్కడా సరైన ప్రోగ్రామ్‌లు లేక ఇంద్రజాలంపైనే ఆధారపడి జీవిస్తున్న కళాకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఇంద్రజాలకుల అభిప్రాయాలిలా ఉన్నాయి. – విజయనగరం సమాజంలో మార్పుకోసం కృషి గత 48 ఏళ్లుగా ఇంద్రజాల రంగంలో రాణిస్తూ, జాతీయస్ధాయిలో జిల్లా పేరును నిలబెట్టేందుకు కృషిచేస్తున్నాను. సమాజంలో మార్పుకోసం అహర్నిశలూ శ్రమిస్తున్నాను. సుమారు పదివేలకు పైగా ప్రదర్శనలు దేశమంతా ఇవ్వగలిగాను. కళ ఎప్పుడూ మరుగున పడిపోదు. కళాకారుల కళపైనే ఆధారపడి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి. పూర్వం విద్య గోప్యంగా ఉండేది. ప్రస్తుతం యూ ట్యూబ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత బహిర్గతమైంది. అందులోనూ కేవలం 40 శాతం నిజం ఉంటుంది. పూర్వం థియేటర్ షోలు, స్టాండర్డ్ ఫ్లాట్‌ఫామ్‌లు ఉండేవి. ప్రస్తుతం బర్త్‌డే, మ్యారేజ్‌డే షోలు మాత్రమే ఉంటున్నాయి. చిన్నపాటి స్థలంలో అద్బుతాలు సృష్టించే అవకాశం తక్కువగా ఉంటుంది. – సీహెచ్. శ్యామ్, సీనియర్ మెజీషీయన్ ఆసక్తే ప్రేరణ కల్పించింది చిన్న నాటి నుంచి ఇంద్రజాలమంటే ఎంతో ఆసక్తి. అదే ఆసక్తి నాలో ప్రేరణ కల్పించి, నేర్చుకునేలా చేసింది. గ్రామగ్రామాన అవకాశం వచ్చినప్పుడల్లా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు కృషిచేస్తున్నాను. హెల్త్ డిపార్ట్మెంట్లో అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నప్పటికీ ఎక్కడ అవకాశం వచ్చినా ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నాను. – పవన్ ఆశిష్, మెజీషీయన్ ఐదు వేలకు పైగా ప్రదర్శనలిచ్చా చేతబడి, చిల్లంగి పూర్తిగా మోసం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించేందుకు మేజిక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఏ ప్రాంతానికి వెళ్లినా మూఢనమ్మకాలను పారద్రోలడానికి కృషిచేస్తున్నాను. ప్రభుత్వం సరైన ప్రోత్సాహం ఇస్తే మంచి కార్యక్రమాలను చేయడానికి సిద్ధం. – ఎస్కె.సలీమ్, ఇంద్రజాలికుడు మేజిక్ సిస్టర్స్‌గా ప్రతిభ మేజిక్ సిస్టర్స్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు అందుకున్నాం. చిన్నప్పటినుంచి నాన్న చారి మా గురువు. 2006 నవంబరు 14న ఢిల్లీలో జాతీయస్థాయి అవార్డును ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకోవడం తృప్తినిచ్చింది. చిన్నప్పటి నుంచి గ్రామగ్రామాన పర్యటించి, ప్రజల్లో మూఢ నమ్మకాలు పారదోలడంపై అవగాహన కల్పిస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటి మేజిక్ సిస్టర్స్‌గా పేరుగాంచాం. – సుస్మిత, మౌనిక -
భూతవైద్యుడితో పాటు సహకరించిన వ్యక్తుల అరెస్టు
జైపూర్(చెన్నూర్): భూత వైద్యం పేరిట బాలింతను చింత్రహింసలకు గురిచేసిన మాంత్రికుడు, అతడికి సహకరించిన వ్యక్తులను మంగళవారం జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. భూతవైద్యం నెపంతో మండలంలోని కుందారం గ్రామంలో బాలింతను చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. భూతవైద్యంపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జైపూర్ అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ భూపతి నరేందర్, శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాలను వెల్లడించారు. కరీంగనర్ జిల్లా శంకరపట్నం మండలం గడ్డపాక గ్రామానికి చెందిన కనుకుట్ల రజిత, జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్‌లు ప్రేమించుకొని గత ఏడాది మంచిర్యాల ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. వారికి ప్రస్తుతం మూడు నెలల పాప కూడా ఉంది. రజిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం.. ప్రేమవివాహం కావడంతో కట్నం తీసుకురాలేదన్న కోపంతో రజితను ఎలాగైన వదిలించుకోవాలని రజిత భర్త మల్లేశ్, అతని కుటుంబ సభ్యులు రజిత బంధువు పులికోట రవీందర్‌తో కలిసి పథకం రచించారు. దీనికి జమ్మికుంట మండలం శాయంపేట గ్రామానికి చెందిన దొగ్గల శ్యామ్ అనే భూతవైద్యుడిని సంప్రదించారు. గతనెల 21న కుందారం గ్రామంలోని మల్లేశ్ ఇంటికీ రవీందర్, శ్యామ్‌లు వచ్చి రజితకు దెయ్యం పట్టిందని, దాన్ని వదిలించాలని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ విచక్షణారహితంగా కొట్టారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రజిత భర్త మల్లేశ్ తన ఫోన్లో చిత్రీకరించాడు. రజితకు వెంటనే చికిత్స అందించకుండా మంత్రాల నెపంతో కాలయాపన చేయడంతో రజిత తన సోదరుడు సురేశ్‌కు విషయాన్ని చెప్పింది. దీంతో ఆమెను వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంగనర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిన రజిత ఆప్పత్రిలోనే మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. కేసులో ప్రధాన నిందితులు ఏ–1 దొగ్గల శ్యామ్(భూత వైద్యుడు), ఏ–2 పులికోట రవీందర్ (రజిత చిన్నాన్న), ఏ–3 సెగ్యం మల్లేశ్ (రజిత భర్త)లను అరెస్టు చేసి వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. -
లాక్డౌన్: ఉచితంగా ఒత్తిడి తగ్గిస్తా
తిరువనంతపురం: కరోనా మహమ్మారి విభృంజించడంతో దాన్ని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మొదట ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించగా దానికి మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. దీంతో అప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కాక తప్పడం లేదు. అయితే ఇంట్లో ఉండటం వల్ల చాలా మందిలో ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అలాంటి వారి కోసమే తాను ఉచితంగా సర్వీస్ చేస్తానంటున్నారు ప్రముఖ మెజీషియన్ సమజ్. (లాక్డౌన్: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్) కేరళకు చెందిన సమజ్ తన మ్యాజిక్‌షో తో ఎందరినో ఆకట్టుకొని ప్రతిష్టాత్మక మెర్లిన్ అవార్డు కూడా పొందారు. కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వారిలో ఒత్తిడి పెరిగిపోతుందని ప్రభుత్వం, పోలీసు శాఖ వారు అనుమతి ఇస్తే తను ఇంటి నుంచే అలాంటి వారి కోసం మ్యాజిక్ షో చేస్తాను అని చెప్పారు. తాజాగా తనతో ఉంటున్న కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ సమజ్ ఓ షో చేశారు. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం ఆ కార్మికులకు అండగా నిలిచింది. (ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు జక్కన్న ఛాలెంజ్) ఇక లాక్డౌన్ విషయంపై సమజ్ మాట్లాడుతూ.. ‘నేను ఇంట్లో ఖాళీగా కూర్చొన్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. నేను నా ప్రజల కోసం, వారికి ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ పని ఎందుకు చేయకూడదు అని ఆలోచించాను. ప్రభుత్వం అనుమతినిస్తే కచ్ఛితంగా చేస్తాను. మ్యాజిక్ అనేది వినోదాత్మకమైనది. ఇలాంటి కష్టకాలంలో ప్రజల ఒత్తిడి తగ్గించడానికి నా వంతు సాయం నేను చేస్తాను’ అని సమజ్ తెలిపారు. ఇంజనీరింగ్ చేసిన సమాజ్ ఆ వృత్తిని వదిలేసి చాలా దశాబ్ధాలుగా ప్రొఫెషనల్ మెజీషియన్‌గా కొనసాగుతున్నాయి. ఎన్నో మ్యాజిక్ షోస్ చేసిన ఆయన దేశ విదేశాల్లో అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. -
‘లడ్డూలు తినాలన్న కోరికే ఇలా మార్చింది’
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : ఐదు దశాబ్దాల కాలంలో 36 దేశాల్లో 37 వేలకుపైగా ఇంద్రజాల ప్రదర్శనలు. 4 ప్రపంచ రికార్డులు. వేలాది సన్మానాలు. ఇంద్రజాలంతో వయోబేధం లేకుండా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అసమాన∙ప్రతిభ కలిగిన వ్యక్తి అతను. ఆయనే జాదూగర్ ఆనంద్‌గా ప్రసిద్ధికెక్కిన ప్రముఖ ఇంద్రజాలికుడు ఆవíస్తి ఆనంద్. ఇంద్రజాల ప్రదర్శనలో భాగంగా మదనపల్లెకు వచ్చిన ఆయనతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. సాక్షి : మీ పేరు...కుటుంబ నేపథ్యం? ఆనంద్ : నా పేరు ఆవస్తి ఆనంద్. మాది మధ్యప్రదేశ్ రాష్ట్రం, జబల్పూర్ నగరం. 1952లో జనవరి 3న జన్మించాను. మాది ఉన్నత విద్యావంతుల కుటుంబం. నాన్న ఏ.పి.అవస్తి, వృత్తిరీత్యా వైద్యుడు. అమ్మ మహేశ్వరిదేవి ఫ్రొఫెసర్. జబల్పూర్లో పాఠశాల విద్య,ఇండోర్‌లో మెట్రిక్యులేషన్, డిగ్రీ, పీజీ పూర్తి చేశాను. మా అమ్మానాన్నలకు నలుగురు సంతానం. ముగ్గురు అక్కయ్యలు. నేను చివరి వాడిని. సాక్షి : మీకు ‘జాదూగరి’వైపు దృష్టి ఎప్పుడు మళ్లింది? ఆనంద్ : నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్లేదారిలో కొందరు గారడీ చేసేవారు. రోజూ అక్కడికి వెళ్లి గారడీ చూసేవాడిని. వారు గాల్లో నుంచి నాకు లడ్డూలు తీసి ఇచ్చేవారు. రోజూ లడ్డూలు ఉచితంగా తినేవాడిని. కొన్ని రోజులయ్యాక గారడీవారు మకాం మార్చేస్తే, లడ్డూలు తినడానికి అలవాటుపడిన నాకు లడ్డూల మీద ఉన్న కోరికతో వారిని వెతుక్కుంటూ వెళ్లేవాడిని. ఆ సమయంలో స్వతహాగా నేను కూడా గారడీ చేసి లడ్డూలు తయారు చేయాలని అనుకున్నా. ప్రయత్నించి విఫలమయ్యాను. కానీ ప్రయత్నం వదలలేదు. ఎక్కడ గారడీ, మ్యాజిక్ షోలు జరిగినా వెళ్లి చూసేవాడిని. అలా ..అలా చిన్నపాటి మేజిక్‌లు నేర్చుకుని, మా స్కూల్లో ప్రదర్శించి, అందరి మన్ననలు పొందేవాడిని. గణేష్, దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలలో నా ప్రదర్శనలు ఇచ్చేవా డిని. వారు ఇచ్చే డబ్బులు అమ్మా,నాన్న పాకెట్ మనీతో ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకాలను కొనేవాడిని. అలా మొదలైన నా ప్రస్థా నం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి ‘జాదూగర్’గా మార్చింది. ∙నాకు గురువులు ఎవరూలేరు. స్వయంకృషితో ఈ స్థాయికి చేరా. సాక్షి : మీకు తల్లిదండ్రుల సహకారం ? ఆనంద్ : లేదు. మా అమ్మానాన్నలు నన్ను కూడా డాక్టర్ చేయాలనుకున్నారు. నేను మెజీషి యన్ అవడం ఏమాత్రం వారికి ఇష్టం లేదు. సాక్షి : మేజిక్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఆనంద్ : 18 ఏళ్ల వయసులో ‘ఇంద్రజాలం’ చేయడం ప్రారంభించా. అంతే కాదు ఒళ్లు గగు ర్పొడిచే నదిలో ‘అండర్ వాటర్ ఎస్కేప్ విన్యా సాన్ని 40 సెకండ్లలో ప్రదర్శించి బయటకు వచ్చేశా. ఇది కూడా స్వతహాగానే నేర్చుకున్నా. సాక్షి : ఎన్ని రికార్డులు సాధించారు? ఆనంద్ : ఇప్పటి వరకు నేను 4 ప్రపంచ రికార్డులు సా«ధించా. 18 ఏళ్ల వయస్సులో అండర్ వాటర్ ఎస్కేప్‌గా మొదటి రికార్డు. 19 ఏళ్లప్రాయంలో బ్లైండ్ ఫోల్డ్‌ఫో నిర్వహించి రెండో ప్రపంచ రికార్డు సాధించా. ఇండోర్ నుంచి భూపాల్ వరకు 210 కిలోమీటర్లు కళ్లకు గంతలు కట్టుకుని బైక్ మీద ప్రయాణం చేయడం. 36 దేశాలలో 37 వేలకుపైగా ప్రదర్శనలు నిర్వహించి మూడో ప్రపంచ రికార్డు సాధించా. అత్యంత వేగవంత మెజీషియన్‌గా 4వ ప్రపంచ రికార్డు సాధించా. సాక్షి : ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు? ఆనంద్ : ఇంద్రజాలాన్ని ప్రభుత్వాలు ఓ కళగా గుర్తించాలి. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో మ్యాజిక్ అకాడమీలు ఏర్పాటు చేసి ఇంద్రజాలాన్ని ప్రోత్సహించాలి. -
బయటపడితే మ్యాజిక్.. లేదంటే ట్రాజిక్
కోల్‌కతా : ఇంద్రజాల ప్రదర్శనతో జనాలను ఆశ్చర్యపరచాలని భావించిన ఓ మేజిషియన్ చివరకు తానే కానరాకుండా పోవడంతో విషాదం అలుముకుంది. మ్యాజిక్ అంటేనే రకారకాల ట్రిక్కులు ప్రయోగించి క్షణాల్లో మనల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఒక వేళ అవి ఫెయిలయితే ఫలితం దారుణంగా ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి కోల్‌కతాలో చోటు చేసుకుంది. ట్రిక్కు పని చేయకపోవడంతో ఏకంగా మేజిషయనే గల్లంతయ్యాడు. వివారాలు.. జాదుగర్ మంద్రాకేగా ప్రసిద్ధి పొందిన చంచల్ లాహిరి (40) ఆదివారం పోలీసులు, మీడియా, కుటుంబసభ్యులు చూస్తుండగా విన్యాసం ప్రదర్శించేందుకు గంగా నదిలోకి దిగారు. ఉక్కు సంకెళ్లు, తాడుతో తనను తాను ఓ బాక్స్‌లో బంధించుకుని గంగా నదిలోకి దిగి సురక్షితంగా బయటకు వచ్చే విన్యాసాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జి మీదుగా గంగా నదిలోకి దిగారు చంచల్ లాహిరి. కానీ దురదృష్టవశాత్తు కనిపించకుండా పోవడంతో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 21 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఇదే విన్యాసం విజయవంతంగా చేసినట్లు విన్యాసం ప్రారంభానికి ముందు లాహిరి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ బాక్సులో కూర్చుని సంకెళ్లతో బంధించుకున్నాను. తాళం వేసేశారు. 29సెకన్లలో బయటికి వచ్చేశాను. ఈసారి బయటకు రావడం కష్టమే. బయటకు రాగలిగితే మ్యాజిక్ అవుతుంది. లేదంటే ట్రాజిక్ అవుతుంది’ అని లాహిరి వ్యాఖ్యానించారు. ఆయన ఊహించినట్లే మ్యాజిక్ కాస్తా ట్రాజిక్ అవడం విచారకరం. -
మోదీ గొప్ప ఇంద్రజాలికుడు
జోవాయ్: దేశంలో ప్రజాస్వామాన్ని మాయం చేయగల గొప్ప ఇంద్రజాలికుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కుంభకోణాలకు పాల్పడినవారిని ఇక్కడ మాయం చేసి.. భారత చట్టాలు చేరుకోలేని చోటకు పంపటం మోదీ మ్యాజిక్ అని విమర్శించారు. బుధవారం మేఘాలయలోని జోవాయ్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. ‘అప్రయత్నంగానే చాలా అంశాలను మోదీ తన చేతి వేళ్లతో కనిపించేటట్లు, మాయమయ్యేటట్లు చేయగల సమర్థుడు. కుంభకోణాలకు పాల్పడిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు ఇక్కడ మాయమై విదేశాల్లో కనిపించడం.. అదీ మన చట్టాలు చేరుకోలేని చోటు కావడమే మోదీ మ్యాజిక్. త్వరలోనే ఆయన దేశం నుంచి ప్రజాస్వామ్యాన్నీ కూడా మాయం చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం అవినీతిని అంతమొందించలేదు కానీ.. అలాంటి కుంభకోణాలకు పాల్పడిన వారిని మాత్రం కనిపించకుండా చేయగలిగింద’ని రాహుల్ విమర్శించారు. జీవితంపై భరోసా కల్పించడం, భద్రత, ఆర్థిక అభివృద్ధిలోనూ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ట్వీటర్ ద్వారా కూడా ప్రధానిపై రాహుల్ విమర్శనాస్త్రాలు సంధించారు. పీఎన్బీ కుంభకోణం, రాఫెల్ ఒప్పందాలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలపాలని ప్రశ్నించారు. వచ్చే మన్‌కీ బాత్ ఎపిసోడ్లో నీరవ్ మోదీ కుంభకోణం, రాఫెల్ ఒప్పందాల గురించీ మోదీ మాట్లాడాలన్నారు. ‘మోదీజీ మీ ఏకపాత్రాభినయ కార్యక్రమం మన్‌కీ బాత్‌లో గతనెల ఇచ్చిన సూచనలను మీరు విస్మరించారు. స్వీకరించలేనప్పుడు సూచనలు కోరటమెందుకు? ఈసారి మీ ఉపదేశాన్ని నేను వింటాను’ అని రాహుల్ ట్వీటర్ ద్వారా విమర్శించారు. -
వివాహేతర సంబంధం గుట్టు రట్టు చేసిందని..
-
భార్యకు దెయ్యం పట్టిందని.. మాంత్రికుడితో భర్త.!
సాక్షి, హైదరాబాద్ : అక్రమ సంబందాన్ని రట్టుచేసిన ఓ భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించగా భార్యను బాగా చూసుకుంటానని చెప్పాడు ఓ షాడిస్టు భర్త. కొంతకాలానికి తన భార్యకు ఆరోగ్యం బాగుండడం లేదని, దెయ్యం పట్టిందని చెప్పి మాంత్రికుడితో పూజలు చేయించి ఆమెకు ఎక్కడపడితే అక్కడ వాతలు, గాయాలు పెట్టించాడు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు, భాదితురాలి కథనం ప్రకారం శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట గ్రామానికి చెందిన కంచుగంట్ల నాగేశ్‌తో గత 10 సంవత్సరాల క్రితం కంచుగంట్ల మంగ(26)కు వివాహనం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కాగా గత 5 సంవత్సరాలుగా నాగేశ్ శ్రీలత అనే మహిళతో అక్రమ సంబందం పెట్టుకుని భార్య మంగను శారీరకంగా, మానసికంగా వేదించడం మొదటు పెట్టాడు. దీంతో భర్త అక్రమ సంబందాన్ని తెలుసుకుని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించింది. పంచాయతీ పెద్దలు నాగేశ్‌ను మందలించడంతో భార్య మంగను బాగా చూసుకుంటానని ఒప్పుకున్నాడు. భార్య పంచాయతీ పెట్టిదన్న పగతో ఉన్న నాగేశ్ గత నెల రోజుల కిందట ఇంట్లో ఉన్న పిండి పదార్ధాల్లో భార్య మంగకు తెలియకుండా భాస్వారం(మత్తు పదార్ధాలు) కలుగపగా వంట చేసే సమయంలో గమనించి వాటిని బయట పడేసింది. దీంతో తన భార్య మంగకు పిచ్చిపట్టి ఇంట్లో వస్తువులను బయట పారేస్తుందంటూ గ్రామంలో అందరికి చెబుతూ వేదించడం మొదలు పెట్టాడు. కాగా ఈ నెల 18న ఉదయం తన పుట్టింటికి వెళ్లివస్తానని మంగ తన భర్త నాగేశ్‌ను అడగగా ఎక్కడికి వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు. అనంతరం తనకు తెలిసిన ఓ మాంత్రికుడిని ఇంటికి తీసుకువచ్చాడు. మాంత్రికుడు ఇంట్లో ముగ్గు వేశారు. మంగకు బలవంతంగా మత్తు ట్యాబ్లెట్స్ వేసి ముగ్గు వద్ద కూర్చోవెట్టారు. -
ఉప్పు...నిప్పు
ఒక కష్టం వస్తే... తీరే దారి కోసం చూస్తారు ఆ కష్టాన్ని తీర్చే వారి కోసం చూస్తారు కష్టాన్ని కాల్చేసే నిప్పులాంటి మంత్రం కోసం వెదుకుతారు అందుకే... నిప్పుల మీద నడిచే మంత్రగాడే దిక్కనుకున్నారు కష్టాల పెనం మీద నుంచి తప్పిస్తాడనీ అనుకున్నారు కానీ... అతగాడు... ద్వేషం అనే నిప్పుల్లోకి తోసేశాడు నాణేనికి రెండువైపులూ తెలిసిన మాయగాడతడు ఊరిని రెండుగా చీల్చాడు ఒకరికి బొమ్మ చూపించాడు ఒకరికి బొరుసు చూపించాడు ఊరిని ఉప్పు - నిప్పులా కణకణ మండించాడు ‘‘అయ్యో... అయ్యో! ఎంత ఘోరం!! అయినా గట్టిగా ఉన్న మనిషి పిట్టపిడుగున పోయాడు పాపం’’ సుందరయ్య పార్థివ దేహాన్ని చూస్తూ నొచ్చుకున్నది వరలక్షమ్మ. ‘‘పొద్దున పొలానికి మా ఇంటి ముందు నుంచే పోతూ నన్ను పలకరించాడొదినా. ఇంతలో మనిషిని ఇలా చూడాల్సి వచ్చింది’’ రమణమ్మ మాటల్లో ఆవేదన. ‘‘కాలువ మళ్లించి వస్తానని వెళ్లాడు’’ అంటూ కన్నీరు మున్నీరవుతోంది సుందరయ్య భార్య ఈశ్వరమ్మ. ఇంటి బయట మగవాళ్లు ఉత్తరక్రియల ఏర్పాట్లలో ఉన్నారు. అంతుబట్టని మరణం అని సరిపెట్టుకున్నారు కొడుకులిద్దరూ. తండ్రితో అనుబంధాన్ని దేవుడు అంతవరకే రాశాడని కళ్లు తుడుచుకున్నది కూతురు. అల్లుడు దగ్గరుండి ఇంట్లో వాళ్లకు ధైర్యం చెబుతున్నాడు. దశదిన కర్మలు పూర్తయ్యాయి. గుండెల్లో గూడు కట్టుకున్న బాధను అదిమి పెట్టుకుని డైలీ రొటీన్‌కు సిద్ధమవుతున్నారు సుందరయ్య భార్యాపిల్లలు. అయితే... సుందరయ్య మరణం ఇంటికే కాదు ఊరంతటికీ మానని గాయంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ‘‘నిజమేనా రమణమ్మా! నువ్వు వాళ్లింటికి వెళ్తుంటావుగా! పాపం సుందరయ్యకు చేతబడి చేశార్ట. అందుకే పోయాడంటున్నారు’’ గుసగుసగా అడిగింది పద్మావతి. ‘‘ఏమోనమ్మా. అప్పుడెప్పుడో కోటయ్యకి- సుందరయ్యకి పొలం గట్ల తగాదా ఉండేది. పంటలు పెట్టాక ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారాయె. అయినా కోటయ్య అంత పాపానికి ఒడిగట్టి ఉంటాడా? ఆ... కొడుకులు అంతటి కాలాంతకులే మరి’’ అంటూ ఆశ్చర్యపోతూనే సమాచారకథనాన్ని చిక్కబరిచింది రమణమ్మ. రెండో రోజు సాయంత్రానికి సుందరయ్య చేతబడి వల్లనే పోయాడని ఊరంతా గుప్పుమంది. ప్రతీకారపు రంకెలు! మంత్రగాడి ముందు దీనంగా కూర్చుని ఉంది ఈశ్వరమ్మ. పక్కనే కొడుకులు. ‘‘ఎవరైనా ఊరికే ఎందుకు చేయిస్తారు. వినాశం కోరుకునే వాళ్లే చేయిస్తారు. రోగాన పడి కోలుకునే చేత కూడా కాదది. ఏకంగా మనిషిని రక్తం కక్కించి ప్రాణం పీల్చుకునే చేతబడి చేశారు’’ ఆజ్యం పోశాడు మంత్రగాడు. పెద్ద కొడుకులో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఈశ్వరమ్మ కొడుకు భుజం మీద చేయి వేసింది తొందర పడకూడదన్నట్లు. నిప్పుల నడకలో ట్రిక్కు! పాదం చర్మం మందంగా ఉంటుంది. నిప్పు మీద కాలు పెట్టిన వెంటనే కాలదు. చర్మం కాలడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. ఈ లోపు అడుగు తీసేస్తాం. నిప్పు వేడి చర్మాన్ని కాల్చేలోపే అడుగు తీసేస్తామన్నమాట. అయితే కాలి పిక్కలకు తగిలే వేడిని భరించగలగాలి. అది ప్రాక్టీస్‌తో వస్తుంది. ఒక్క సుందరయ్య ఇల్లే కాదు. ఊరిలో ప్రతి ఒక్కరికీ ఏదో ఓ సమస్య. తమ మీద ఎవరో కుట్ర పన్నారనే ఆందోళన. ఎవరనే అన్వేషణతో ఒకరి మీద మరొకరికి ఈర్షాసూయలు చాపకింద నీరులా పాకిపోయాయి. కనిపిస్తే కత్తులు దూసుకునేటంత కోపంగా ఉంటున్నారు. ‘‘రమణమ్మా! మనం అనుకున్నది నిజమే. స్వాములోరు కూడా అదే చెప్పార్ట. ఇంకేం అనర్థం వస్తుందోనని ఈశ్వరమ్మ కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోంది. ఆ పిల్లాడేమో తిరుగుబడి చేయిస్తానని రంకెలు వేస్తున్నాడు’’ అన్నది పద్మావతి. ‘‘అయినా ఒకూళ్లో ఉండేటోల్లం. ఇట్లా చేసుకుని ఏం బావుకుంటారో’’ అన్నది పద్మావతి ఒకింత బాధగా. నిప్పులు కురిసే ఆగ్రహం! ఇదేమీ రెండు వర్గాల పోరు కాదు. ఒక కుటుంబం వాళ్లు ఫలానా కుటుంబం పట్ల ద్వేషంతో రగిలిపోతుంటే, మరొకరు వాళ్లకు అనుమానం ఉన్న వాళ్ల మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకరికొకరు ఎదురుపడితే కళ్లలో నిప్పులు కురిపించుకుంటున్నారు. వెరసి గ్రామంలో ఎవరూ నిశ్చింతగా జీవించడం లేదు. ఊరు ఎందుకలా మారింది? మంత్రగాడి దగ్గరకు వచ్చిన వాళ్లు తమ కష్టాలను చెప్పుకున్నప్పుడు... ‘మీ మీద కోపంతో ఉన్న వారెవరో మీ మీద చేతబడి చేయించారు. అందుకే మీ ఇంట్లో ఇన్ని కష్టాలు వచ్చాయి. మీ కష్టాలు తొందరగా తీరిపోవాలంటే వారి మీద తిరిగి చేతబడి చేయవచ్చు. లేదంటే మీరు శాంతి పూజలు చేయించుకుంటూ ఉంటే మెల్లగా కష్టాలు పోతాయి’ వంటి మాటలతో నమ్మించేవాడు. నీ శత్రువుల ఆటకట్టించి నీ చుట్టూ తిరిగేలా చేస్తానని ఒకరిని, నీ మీద చేతబడి జరిగింది తిరుగుబడి చేయాలని మరొకరిని నమ్మించేవాడు. ఊరి వాళ్లను మానసికంగా విడగొట్టి పూజలు, దక్షిణ పేరుతో డబ్బు గుంజుతూ హాయిగా బతికేసేవాడు. స్వామివారు(మంత్రగాడు) చెప్పినట్లు చేయకుండా ఎదురు ప్రశ్నిస్తే అనర్థాలు జరుగుతాయని శిష్యగణం భజన మరో వైపు. ఈ డ్రామాకు తెరపడడానికా అన్నట్లు ఓ రోజు సుందరయ్య కొడుకు కోటయ్య మీద దాడి చేశాడు. కోటయ్య కొడుకు అదే స్థాయిలో సవాల్ చేయడంతో దావానలం బహిర్గతమైంది. కొమ్ములు తిరిగిన కోపం! ‘‘పొద్దున సాములోరి దగ్గరకు వెళ్లిన. పెద్ద బావ చేతబడి చేయించడంతోనే మన బర్రె చచ్చిపోయిందంట. మన ఇంటిని ఇంకా పీడ పట్టి పీడిస్తూనే ఉందంట’’ భర్తతో చెప్పింది నూకాలమ్మ. ‘‘దాని పాడితోనే ఇంటిని వెళ్లబార్చిన. అది పోయిన కాణ్నించి చేతిలో రూపాయాడడం లేదు...’’ స్వగతంగా అనుకుంటోంది. భర్తలో ఆమె కోరుకున్న ప్రతిస్పందన కనిపించకపోవడంతో గొంతు పెంచి... ‘‘వాళ్లకు తగ్గ శాస్తి జరగాలి, తిరుగు తిరుగుబడి చేయిద్దాం’’ అన్నది కసిగా. ‘‘మా అన్న అట్లా చేయడు. నువ్వూరుకో. ఈ మాట ఎక్కడా అనకు’’ అన్నాడామె భర్త మందలింపుగా. ‘‘అంతా నీకు మల్లేనే ఉంటారా? అన్న చేయకపోతే వదిన చేయదా? పెళ్లయినప్పటి నుంచి చూస్తున్నా... మీ వదినకు నా మీద కొరకొరే ఆమె పుట్టింటికంటే కలిగిన ఇంటి నుంచి వచ్చాగా మరి’’ భర్తను కసురుకుంటూ తన వాదనను సమర్థించుకుంటోంది. ఇక భర్తతో కుదిరే పని కాదని రానున్న మంగళవారం స్వాములోరి దగ్గరకు వెళ్లి తిరుగుబడి చేయించాల్సిందేనని మనసులోనే తీర్మానించుకుంది నూకాలమ్మ. మంటల చీలికలు! దాదాపుగా అన్ని ఇళ్లలోనూ ఇలాంటి ఆవేశకావేషాలే. ఒకరి మీద మరొకరు చాడీలు చెప్పుకోవడంలోనే రోజు సరిపోతోంది. ఇలా ఉండగా ఓ రోజు... సుందరయ్య పెద్ద కొడుకు పక్క పొలం యజమాని కోటయ్య మీద దాడి చేసి గాయపరిచాడు. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఊరు ఒక్కసారిగా భగ్గుమన్నది. తిరుగు దాడి చేసి తీరుతామని కోటయ్య కొడుకు సవాల్ చేశాడు. ఊరు రెండుగా చీలిపోయింది. ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామం పోలీసు పహారాలోకి వెళ్లింది. సంకెళ్లతో, బూట్ల నాడాలతో అదుపు తెచ్చే సమస్య కాదని అర్థం కాగానే హేతువాద బృందం సహాయం కోరారు పోలీసులు. ఎత్తుకు పై ఎత్తు! నల్గొండ జిల్లా, నకిరేకల్ దగ్గర జరిగింది. మేము ఊళ్లో అడుగుపెట్టినప్పటి నుంచి మా కదలికలన్నీ మంత్రగాడికి చేరుతూనే ఉన్నాయి. ఊరి వారి ద్వారా మంత్రగాడు గ్రామస్తులను నమ్మించడానికి ఎలాంటి మాయలు చేశాడో తెలుసుకున్నాం. నిప్పుల మీద నడవడం వంటివన్నీ మేము కూడా చేసి చూపించాం. ప్రతి దానికీ శాస్త్రీయతను విడమరిచి చెప్పాం. సమావేశం మొదలుపెట్టినప్పుడు పది మంది కూడా లేరు. గ్రామస్తులంతా తలుపులేసుకుని కిటికీల నుంచి చూస్తూ ఉండిపోయారు. జనం మా ఎదురుగా ఉన్నట్లే ప్రసంగం మొదలుపెట్టాం. మా కార్యకర్తలందరి ప్రసంగాలు పూర్తయ్యేసరికి మూడు వందల మంది పోగయ్యారు. మోసపోయామని గ్రహించగానే ఆవేశంతో మంత్రగాడి ఇంటికి పరుగులు తీశారు. పోలీసుల జోక్యంతో దాడి ఆగింది. మంత్రగాడిని అదుపులోకి తీసుకున్నారు. సుందరయ్య మరణానికి నాలుగు రోజుల ముందు నుంచి నీళ్ల విరేచనాల వల్ల బిపి పడిపోవడమేనని అక్కడి ఆర్ఎంపి అన్నాడు. - టి. రమేశ్, జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ పారని మంత్రం! ‘‘సుశీలా! మనూళ్లో అందరూ నిప్పుల మీద నడుస్తున్నారే! చూద్దాం రా’’ వగరుస్తూ వచ్చింది కళ్యాణి. మరో నలుగురు పిల్లలు పరుగు తీస్తూ వెళ్లి విచిత్రంగా చూశారు. ‘‘హత్తెరికి! మనూరి స్వాములోరు చేసేవి కూడా ఇవ్వేగా మరి’’ నోరెళ్లబెట్టాడు సతీశ్. ఇదంతా సైన్స్ తెలుసుకున్న వాళ్లు శాస్త్రీయ పరిజ్ఞానం లేని వారిని మోసం చేయడానికి చేస్తున్న మాయ అని పిల్లలకు త్వరగానే అర్థమైంది. అతీంద్రియ శక్తులేవీ ఉండవని, నిప్పుల మీద నడవవచ్చని తెలుసుకున్నారు. పిల్లలతో మొదలై ఒకరి తర్వాత మరొకరుగా దాదాపుగా నలభై మంది నిప్పుల మీద నడిచారు. ఊరంతా కలిసి కరడుకట్టిన మూఢత్వాన్ని కళ్లగంతలను విప్పినట్లు విప్పేశారు. - వాకా మంజులారెడ్డి (గమనిక: పేర్లు మార్చడమైంది) -
మెజీషియన్‌గా మారనున్న హీరోయిన్!
తిరువనంతపురం: మంజూ వారియర్ ఓ నటిగానే చాలా మందికి తెలుసు. కానీ ఆమె త్వరలో ఓ ఇంద్రజాలికురాలిగా మారబోతోంది. అయితే ఈ అవతారం ఎత్తుతోంది డబ్బులు సంపాదించడానికి మాత్రం కాదండోయ్.. పిల్లల సంరక్షణ కోసం ఈ పని చేయనుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన బాలల అత్యవసర నిధి విభాగమైన యూనిసెఫ్ కోసం ప్రముఖ ఇంద్రజాలికుడు, యూనిసెఫ్ ప్రచారకర్త గోపీనాథ్ ముథ్కద్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి 1000 రోజుల లోపు వయసున్న చిన్నారుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించనున్నారు. సహజంగానే సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే మంజు కూడా ఇందులో తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. గోపీనాథ్‌తో కలిసి మ్యాజిక్ కూడా చేయనున్నారు. ఇందుకోసం అమె ఇంద్రజాల పాఠాలు కూడా నేర్చుకుంటున్నారట. మ్యాజిక్ ద్వారానే తల్లులకు అవగాహన కల్పిస్తానని మంజూ చెబుతున్నారు. -
గోటితో పోలేదు...
మంత్రాలకు చింతకాయలు రాలతాయా? రాలవు. మరేం రాలతాయి? ప్రాణాలు! మారణాయుధం... టార్గెట్‌ని మాత్రమే కొడుతుంది. మంత్రగాడి మాట ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలీదు. వాళ్లంటాడు... వీళ్లంటాడు... నలుపంటాడు... ఎరుపంటాడు... జడంటాడు... ముడంటాడు... అంజనం వేసి... ‘అదిగో చూడు’ అంటాడు. మూర్ఖుడి చేతిలో రాయీ... మంత్రగాడి నోటి మాటా... రెండూ ఒకటే. ఎవరి ప్రాణాలు రాలిపడతాయో చెప్పలేం. పాపం... ఇక్కడైతే... ఒక కుటుంబం కుటుంబమే రాలిపోయింది! చుక్కలో ఏం కనిపిస్తోంది?’’ - మాంత్రికుడు. ‘‘ఒక ఛాయగా ఉంది. ఏంటో తెలియడం లేదు’’ అయోమయంగా చూస్తోంది సరోజనమ్మ. ‘‘అది మనిషి నీడ కావచ్చేమో బాగా చూసి చెప్పు’’ ‘‘అవును, మనిషే’’ అన్నది సరోజనమ్మ. ‘‘ఆడా?మగా?’’ ‘‘ఆడమనిషి’’ ‘‘ఏం చేస్తోంది?’’ ‘‘ఏదో నూరుతోంది. పచ్చడేమో!’’ ‘‘ఆమె ఎక్కడ ఉంది?’’ ‘‘ఇంటి పెరట్లో’’ ‘‘అదెవరిల్లు?’’ ‘‘ఏమో... మా పెరడులాగానే ఉంది’’ ‘‘ఆమె ఏ రంగు దుస్తులు ధరించింది?’’ ‘‘నల్లచీరకు ఆకుపచ్చ అంచు, ఎర్ర రవికె’’ క్లూ ఏదో దొరికినట్లు తలపంకించాడు మంత్రగాడు. ‘ఎంత ఎత్తు ఉంది?’’ ‘‘నాకంటే ఎత్తుగా... పక్క వీధి రంగమ్మ ఎత్తు’’ ‘‘జుట్టు ముడి వేసుకుని ఉందా, జడ వేసుకుందా?’’ ‘‘ముడి వేసుకుని ఉంది’’ ‘‘రంగమ్మది జడా!, ముడి వేసుకుంటుందా?’’ ‘‘రంగమ్మ ముడేసుకుంటుంది’’ ‘‘బాగా చూడు... ఆమె రంగమ్మలాగానే ఉందా?’’ చెప్పలేకపోతోంది సరోజనమ్మ. సందిగ్దతతో కుడిచేతి బొటన వేలి మీద రాసిన అంజనం వైపే చూస్తోంది. మరికొంత అంజనం తీసుకుని ఆమె గోరు మీద రాశాడు మాంత్రికుడు. చిక్కగా నల్లగా కంటికి పెట్టుకునే కాటుకలా ఉంది అంజనం. అంజనం ఉన్న వేలిని పట్టుకున్నాడు మాంత్రికుడు. ‘‘కన్నార్పకుండా చూడు నీకంతా తెలుస్తోంది. నీ మీద చేతబడి చేసిన వాళ్లను నువ్వే పట్టేస్తున్నావు. మనిషిని గుర్తు పట్టు’’ అంటూ మాటలతో మాయ చేస్తున్నాడు. హిప్నటైజ్ అయినట్లు మగతగా సరోజనమ్మ కళ్లు మూత పడుతున్నాయి. ‘‘ఆమె రంగమ్మేనా చెప్పు’’ ఆమె చెంపల మీద చేత్తో తడుతూ అడుగుతున్నాడు ఆమె భర్త. కావచ్చేమో అనిపిస్తోంది... అవుననడానికి మనసు రావడం లేదు. తల అటూ ఇటుగా ఊపుతూ స్పృహతప్పి పడి పోయింది.మాంత్రికుడు కమండలంలోని నీటిని తీసుకుని మంత్రించి ఆమె మీద చల్లాడు. తన భుజం మీద ఉన్న తుండుతో సరోజనమ్మ ముఖం తుడిచాడు ఆమె భర్త. ఆమెను ఒక పక్కగా చాప మీద పడుకోబెట్టారు. ‘‘చేతబడి జరిగింది’’ నిర్ధారించాడు మాంత్రికుడు. నివ్వెరపోయాడు సరోజనమ్మ భర్త. ‘‘అందుకేనేమో స్వామీ! ఎప్పుడూ పీడకలలే. అర్ధరాత్రి లేచి కూర్చున్నదంటే ఇక నిద్రపోవడానికే భయపడుతుంటుంది. కళ్లు మూసుకుంటే ఎవరో తన చుట్టూ తిరుగుతున్నారని చెబుతోంది’’ అని వాపోయాడు. ‘‘చేతబడి ఎవరు చేశారనేది అమ్మాయి నోటితోనే చెప్పిందిగా’’ లౌక్యంగా పిక్చర్ తెస్తున్నాడు మాంత్రికుడు. ‘‘నా భార్య బతికేదెలా స్వామీ’’ మాంత్రికుని కాళ్లు పట్టుకున్నాడు సరోజనమ్మ భర్త. ‘‘విరుగుడు చేద్దాం’’ సాలోచనగా అన్నట్లుగా మాట జార్చాడు. అంతటితో ఆగక... ‘‘నల్లరంగు దుస్తులు ధరించి మీ ఇంటికి వచ్చిందంటే మీకు కీడు చేయడానికే. అదీ శనివారం రోజున. నీ భార్యకు ఒంట్లో బాగోలేదని, పనిలో సహాయం చేయడం అనే వంకతో వచ్చింది. ఓ మూల చేతబడి చేసిన మిరపకాయలు పెట్టి వెళ్లింది. ఆ మిరపకాయలను శుక్రవారం రోజు మీ ఇంటి నుంచే తీసుకెళ్లింది. మీరెవరూ గమనించలేదు’’ తప్పంతా మీదేనన్నట్లు కలరిచ్చాడు. ‘‘ఇంట్లో మనిషిలాగ తిరిగేది. ఇంత కుట్ర చేసిందా’’ కదిలిపోతున్నాడు సరోజనమ్మ భర్త. ‘‘రంగమ్మ చేతబడి చేసినట్లు నీ భార్యకు చెప్పకు. ఆడవాళ్లు మాట మనసులో దాచుకోలేరు. రేపు రంగమ్మ మీ ఇంటికి రాగానే గొడవపెట్టుకుంటే ఆమె జాగ్రత్తపడుతుంది. చేతబడి సంగతి తెలిసిపోయిందని ఇంకా పెద్ద క్షుద్రపూజ చేయిస్తుంది. అప్పుడు మనం చేసే విరుగుడు పారదు. మనిషిని వారంలో ప్రాణాలు తీసే పూజలున్నాయి. విరుగుడు అయ్యే వరకు రహస్యం’’ ఆదేశిస్తున్నట్లే ఉంది గొంతు. పాలిపోయిన ముఖంతో తలూపాడాయన. సరోజనమ్మ కదలడం కనిపించింది. ఆమెను లేపి నీటిలో విబూది కలిపి తాగించాడు మాంత్రికుడు. మాంత్రికుడి కనుసైగను గమనించిన అనుచరుడు వెంటనే స్పందించాడు. ‘‘గురువు గారు ఆమెకి మంత్రం చెప్తారు. ఎవరూ ఉండకూడదు’’ అంటూ బయటకు దారి తీశాడు. ‘‘తండ్రిలాంటి వాణ్ని. భయపడవద్దు’’ అని ఆమెకి భరోసా ఇచ్చాడు. ఇక విషయంలోకి వచ్చాడు... ‘‘నీకు చేతబడి చేసిందో మహిళ. ఆమె నీ భర్త మీద మనసు పడింది. నిన్ను అడ్డు తొలగించాలని కుట్ర పన్నింది. భర్తను జాగ్రత్త చేసుకో’’ అన్నాడు. మంత్రం వేసినట్లు తలూపింది సరోజనమ్మ. ఇంటికి వచ్చినప్పటి నుంచి సరోజనమ్మ మనసు మనసులో లేదు. భర్త ఎటు వెళ్తున్నా వెయ్యి కళ్లతో కనిపెడుతోంది. ఆమె భర్త మాత్రం చేతబడి విరుగుడు చేయించడానికి వనరులు సమకూర్చుకునే పనిలో ఉన్నాడు. విరుగుడు అంటే చిన్న ఖర్చు కాదు. బియ్యం, నల్ల కోడి కావాలి, మద్యం, డబ్బు... దక్షిణ ఇవ్వాలి. విరుగుడు సామగ్రి కొంటున్నట్లు ఊర్లో ఎవరికీ తెలియకూడదు. తన జాగ్రత్తలో తానున్నాడు. అతడి కదలికలు సరోజనమ్మను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పుట్టింటి వాళ్లకు కబురు చేసింది. సమాచారం తెలిసిందే తడవుగా నలుగురు అన్నదమ్ములూ, మరిది (చెల్లెలి భర్త) వచ్చి వాలిపోయారు. ఒక రోజు... ఇంకా తెల్లవారనే లేదు. రంగమ్మ ఇంట్లో హాహాకారాలు. దొరికిన వారిని దొరికినట్లు నరికేశారు సరోజనమ్మ సోదరులు, మరిది. రంగమ్మ, ఆమె భర్త, అత్త, మామ, పిల్లలు... అంతా చనిపోయారు. రెండు గంటల్లో మారణహోమం. ఎవరికీ మాట్లాడే అవకాశమే లేదు. మాకు తెలియదు మొర్రో అని మొత్తుకోవాలని ఉన్నా వినే స్థిమితం వచ్చిన ఒక్కరిలోనూ లేదు. అంతా అయిపోయింది. పోలీసులు వచ్చేటప్పటికి హంతకులు పారిపోయారు. ఆ ఇంటికి వచ్చిన చుట్టాలనే చిన్న వివరం తప్ప ఆ ఊర్లో ఎవరికీ హంతకుల ఆనవాళ్లు పెద్దగా తెలియదు. తన బావమరుదులు ఇంతటి దారుణానికి ఒడిగడతారని సరోజనమ్మ భర్తకు కూడా తెలియదు. పోలీసుల విచారణలో విషయాలు బయటకు వచ్చాయి. అయినా మాంత్రికుడిని అరెస్టు చేయడానికి ఆధారం లేదు. మంత్రాలను, క్షుద్రవిద్యలను అరికట్టి తీరాలని జిల్లా కలెక్టరు నుంచి ఆదేశాలు వచ్చాయి. హేతువాద సంఘాల జోక్యంతో అంజనం పేరుతో చేసే మాయ అని తెలిసిన తర్వాత మాంత్రికుడి ఇంటిని సోదా చేశారు. పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా అరెస్టు చేశారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇదో రకం ప్రతీకారం ఇలాంటి సంఘటనలు ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్, గంజాం, సుందర్‌గఢ్, రాయగడ ప్రాంతాల్లో ఎక్కువ. సంతాలి, కోహ్లా గిరిజన తెగల్లో విపరీతంగా జరుగుతాయి. ఏడాదికి కనీసం యాభై మంది మహిళలను చేతబడి చేస్తున్నారనే ఆరోపణలతో హతమారుస్తున్నారు. అది కూడా ఒంటరి మహిళల మీద ఈ అరాచకం ఎక్కువ. ఈ కేసులో కూడా రంగమ్మ అనే మహిళను దోషిగా మార్చింది మాంత్రికుడే. అతడి దగ్గర సహాయకురాలిగా పని చేయమని గతంలో అడిగినప్పుడు ఆమె అంగీకరించకపోవడమే ఈ కుట్రకు అసలు కారణం. (ఈ కథనంలో వ్యక్తుల పేర్లు మార్చడమైంది) అంజనంలో రంగమ్మ ఎలా కనిపించింది? ఆముదంతో దీపం వెలిగిస్తారు. దీపం పైన అడ్డు పెట్టి దాని నుంచి వెలువడే నుసి గోడకు అంటేటట్లు చేస్తారు. తర్వాత దానిని గోడ నుంచి గీకి పొడి చేసి మరికొంత ఆముదం కలుపుతారు. దీనిని మాంత్రికులే స్వయంగా తయారుచేసుకుంటారు. ఇది ఆముదం కలిసి ఉండడంతో మెరుస్తూ ఉంటుంది. కుడిచేతి బొటన వేలి గోరు మొత్తానికి రాస్తారు. మనిషిని ప్రశ్నల ద్వారానే హిప్నటైజ్ చేస్తారు. వెనుక అటూ ఇటూ నడిచే మనుషుల నీడ గోరు మీద కదులుతూ ఉంటుంది. ఎవరూ కదలకపోతే మాంత్రికుని అనుచరులే ఆ పని చేస్తారు. నీడగా ఏదో లీలగా కదులుతున్నట్లు కనిపించగానే అంజనం వేయించుకున్న వాళ్లు తమ మస్తిష్కంలో ఉన్న రూపం, భావనలతో స్పందిస్తారు. గోరు కుంభాకార కటకంలాగ పని చేస్తుంది. దూరంగా ఉన్న మనిషి రూపం కూడా చిన్నగా ప్రతిబింబిస్తుంది. వాహనాలకు ఉండే మిర్రర్లాగ అన్నమాట. ఎస్. శంకర శివరావు కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ -
మాంత్రికుడి చేతిలో పోలీస్ భార్య బురిడీ
భివండీ, న్యూస్‌లైన్ : మాంత్రికుని చేతిలో మోసపోయిన ఓ పోలీస్ భార్య ఉదంతం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఠాణే కోపిరి ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న టేంగర్ ప్రాంతానికి చెందిన ఓ పోలీసు భార్య రూపాలి (34) తన సమస్యలను విన్నవించుకొనేందుకు కల్యాణ్ నాకలోని సుందర్బేన్ కాంపౌండ్‌లో నివసించే మాంత్రికుడికి వద్దకు వెళ్లింది. ఆమె సమస్యలు పరిష్కరించడానికి మాంత్రికుడు రూ. 35 వేలు ఖర్చు అవుతాయని చెప్పాడు. ఆమె తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో ఆభరణాలు ఉన్నా తీసుకురావాలని మాంత్రికుడు చెప్పాడు. దీంతో ఆమె మంగళవారం తన వద్ద ఉన్న రూ. 25 వేల విలువచేసే బంగారు గొలుసు, రూ.34 వేలు విలువ చేసే నెక్లస్‌తో పాటు ఐదు వేల నగదును ఇచ్చింది. మాంత్రికుడు తనను మోసం చేశాడని గుర్తించి బుధవారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
నేను గాని అబ్రకదబ్ర గాని అంటే...
ఆయన గానీ... అబ్రకదబ్ర అంటే కంటి ముందు ఉన్నవి కనిపించకుండా పోతాయి. లేనివి రంగురంగుల్లో ముందుకు వస్తాయి. అతడే... మహేంద్రజాలికుడు సామల వేణు. ఇటీవల ‘ఛూ..మంతర్’ పేరుతో సికింద్రాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ మెజీషియన్స్ సమ్మేళనం- 2014లో అంతర్జాతీయ మెజీషియన్స్ సొసైటీ అధ్యక్షుడు టోనీ హస్సినీ చేతుల మీదుగా మ్యాజిక్ ఆస్కార్గా పిలుచుకునే మెర్లిన్ అవార్డ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా వేణు చెప్పిన కొన్ని విషయాలు... నాన్న సామల శ్రీనివాస్ రోడ్లు, భవనాల శాఖలో ఇంజినీర్. ‘‘బాగా చదువుకొని అమెరికాకు వెళ్లవచ్చు కదా!’’ అన్నారు నాన్న. అమ్మ సుగుణ కూడా నాన్నకు కోరస్ పలికింది. ‘‘అమెరికా ఏమిటి...ఎన్నో దేశాలకు వెళతాను’’ అన్నాను. ఎలా మాట నిలబెట్టుకోవాలని ఆలోచించా. ఇంద్రజాలం వైపు మనస్సు వెళ్లింది. తొలి రోజుల్లో తొలి ట్రిక్‌ను బి.వి.పట్టాభిరాం దగ్గర నేర్చుకున్నాను. కలకత్తా వెళ్లి ప్రసిద్ధ మెజీషియన్లు పీసీ సర్కార్, కేలాల్ల దగ్గర శిక్షణ తీసుకున్నాను. 2003లో హైదరాబాద్‌లో మెజీషియన్స్ అకాడమీ పెట్టాను. ఇప్పటి వరకు 30 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. 1993లో కెనడాలో తొలి అంతర్జాతీయ ఇంద్రజాల పోటీలో పాల్గొన్న అనుభవం జీవితంలో మరువలేనిది. అందులో నాలుగో స్థానం సాధించాను. అదే ఈ రంగంలో రాణించాలనేందుకు స్ఫూర్తిని ఇచ్చింది. ఇంటర్నేషనల్ మ్యాజిక్ స్టార్ డేవిడ్ కాపర్ఫీల్డ్ను కలుసుకోవడం మధురానుభూతి. ఆయన అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని మాయం చేసిన తీరు ఆశ్చర్యపరిచింది. నేను కూడా అంతర్జాతీయ స్థాయిలో అలాంటి ప్రదర్శన చేసే ప్రయత్నంలో ఉన్నాను. డేవిడ్ కాపర్ఫీల్డ్తో పాటు కె.లాల్, పీసీ సర్కార్, ముతుకాడ్, ఫ్రాంజ్ హారీలాంటి మెజీషియన్లను అభిమానిస్తాను.జాతీయ స్థాయిలో మ్యాజిక్ అకాడమీని స్థాపించి మెజీషియన్లకు ఒక వేదిక కల్పించి వారి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా గత దశాబ్దకాలంగా కృషి చేస్తున్నాను. ప్రతియేటా జాతీయ స్థాయిలో ఇంద్రజాల ఉత్సవాలు నిర్వహిస్తున్నాను. - కోన సుధాకర్‌రెడ్డి -
మెజీషియన్స్
అబ్రకదబ్ర అంటూ కాకిని కోకిల చేసే ‘మాయ’గాళ్లు మెజీషియన్లు. ఇన్నాళ్లూ మేజిక్ అంతా వన్‘వ్యూన్’ షోనే. ఇప్పుడిప్పుడే ఉమెన్ కూడా ఈ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ మెజీషియన్స్ షోలో లేడీ మెజీషియన్లు తమ ‘మాయ’లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ‘మాయ’గాళ్లకు దీటుగా ‘షో’ చేసి సత్తా చాటారు. ఈ సందర్భంగా వారిని పలకరించిన ‘సిటీప్లస్’తో మేజిక్ ఫీల్డ్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. ఫ్యామిలీ అంతా... మా నాన్న మెజీషియన్. మా చెల్లెలు కూడా అంతర్జాతీయ స్థాయిలో మెజీషియన్‌గా పేరుతెచ్చుకుంది. వాళ్ల స్ఫూర్తితోనే నేనూ ఈ రంగంలో అడుగుపెట్టా. ఇదో అద్భుతమైన కళ. ప్రేక్షకుల స్పందన, ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనివి. మా నాన్నే నా ఫేవరె ట్ మెజీషియన్. ఇప్పుడు ఇంటర్ చదువుతున్నా. భవిష్యత్తులో దీన్నే వృత్తిగా ఎంచుకుంటా. మహిళలు కూడా మగాళ్ల కంటే బాగా మేజిక్ చేయగలరని నిరూపించడమే నా ధ్యేయం. - జినియా నాన్న స్ఫూర్తితో.. మా నాన్న ప్రదీప్ ఇంటర్నేషనల్ మెజీషియన్. చిన్నప్పటినుంచి ఆయనను చూస్తూ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. ఐదేళ్ల నుంచే మేజిక్ చేస్తున్నా. నేను హైదరాబాద్‌లోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డ్యాన్స, పాటలు పాడటం వంటివి అందరూ చేస్తారు. మేజిక్ అలా కాదు.. ఇదో యూనిక్ టాలెంట్. అందుకే ఈ రంగంలో అడుగుపెట్టా. - శైలీ ప్రోత్సాహం బాగుంది.. మాది మహారాష్ట్రలోని పుణే. చిన్నప్పుడే మేజిక్ మాయలో పడిపోయా. మాటలు రాని వయసు నుంచి మేజిక్ చేస్తున్నా. మా ఇంట్లో బాగా ప్రోత్సహిస్తున్నారు కూడా. ఇక ఇందులో రాణించాలంటే రోజూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మంచి మెజీషియన్‌గా పేరు తెచ్చుకోగలం. - మజితా - ప్రవీణ్ కాసం -
మీ మాయలోడిని నేనే.. టోనీ
అంతర్జాతీయ మెజీషియన్: ఆయన గానీ.. ఒక ఈల గానీ వేశాడంటే.. ఉన్నవి అమాంతంగా మాయమైపోతాయి. లేనివి మన ముందుకొచ్చేస్తాయి. అబ్రకదద్ర అంటూ కళ్లు మూసి తెరిచే లోగా మాయాజాలం చేసేస్తాడు. మంత్రదండంతో మతులు పోగొడతాడు. మాయాజాలంతో జనాలను కట్టిపడేస్తాడు.. మహేంద్రజాలికుడు టోని హ స్సిని. టర్కీలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ ఈయన ‘ఛూ.. మంతర్’ పేరుతో జరుగుతున్న అంతర్జాతీయ మెజీషియన్స్ సమ్మేళనం-2014 కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మేజిక్ మస్తీ చేస్తున్న టోనీ మహేంద్రజాలం కథాకమామీషు ఆయన మాటల్లోనే.. నాకప్పుడు 16 ఏళ్లుంటాయి. ఉద్యోగాల వేటలో ఉండగా.. లండన్‌లో మెజీషియన్ వస్తువులు అమ్మే దుకాణంలో కొలువు కుదిరింది. అక్కడే మేజిక్ అంటే ఏంటో తెలిసింది. ఆసక్తి పెరగటంతో ఇంద్రజాలం నేర్చుకున్నాను. నాలుగేళ్ల తర్వాత అమెరికా వె ళ్లాను. కొన్నేళ్లు సాధన చేశాను. నమ్మకం కలిగిన తర్వాత ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాను. పలు దేశాల్లో 20 వేల వరకు ప్రదర్శనలిచ్చాను. కాస్ట్లీ కళ.. నా అనుభవంలో తెలిసిందేమిటంటే.. మేజిక్ డబ్బుతో ముడిపడి ఉన్న కళ. ఇందులో వాడే పరిక రాల ధర ఎక్కువగా ఉంటుంది. అవి కొనగలిగినపుడే మేజిక్‌లో అద్భుతాలు సృష్టించగలం. అలాగే వివిధ బుక్స్ చదవాలి. ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి. థీమ్ అనుకుని దానికి తగ్గట్టుగా పరికరాలు సమకూర్చుకోవాలి. నిరంతరం సాధన చేస్తేనే మంచి మెజీషియన్‌గా నిలబడగలుగుతారు. పిల్లలను మేజిక్ వైపు మళ్లించాలి తల్లిదండ్రులు తమ పిల్లలను మేజిక్ వైపు ప్రోత్సహించాలి. అయితే మంచి మెజీషియన్ అవుతాడు. లేదంటే స్టడీస్‌లో బాగా రాణించగలుగుతాడు. అమెరికాలో మెజిక్ కోసం ప్రయివేట్‌గా స్కూల్స్, అకాడెమీలు నడుస్తున్నాయి. భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మేజిక్ కోర్సును ప్రవేశపెట్టారు. ఆస్కార అవార్డంత గొప్పది సినీ పరిశ్రమకు ఆస్కార్ ఎంత గొప్పో.. మెర్లిన్ అవార్డు మెజీషియన్లకు అంతకన్నా గొప్పది. గ్రేట్ మెజీషియన్‌గా పేరొందిన మెర్లిన్ పేరుతో 1968లో ఈ అవార్డు నెలకొల్పాం. ఇరవై ఏళ్ల కిందట పీసీ సర్కార్‌కు ఇచ్చాం. ఈసారి హైదరాబాద్‌కు చెందిన సామల వేణుకు దీన్ని ప్రదానం చేయబోతున్నాం. ఛూ..మంతర్ సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్ తొలిసారిగా అంతర్జాతీయ మెజీషియన్ల సమ్మేళనానికి వేదిక కాబోతోంది. 13 దేశాలకు చెందిన 600 మంది మెజీషియన్స్ ఇందులో పాల్గొంటున్నారు. ఈ నెల 20(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు షో మొదలవుతుంది. హాజరవ్వాలనుకునేవారు 9014663413 నంబర్‌ను సంప్రదించవచ్చు. - కోన సుధాకర్‌రెడ్డి., ఫొటో: సతీష్ -
రమ్యంగా...రికార్డ్ మ్యాజిక్
నా చేతుల్లో ఏమీ లేదంటూ ఖాళీ చేతులు చూపిస్తుందా అమ్మాయి... ఆ ఖాళీ చేతుల్లో నుంచి తెల్లపావురం రెక్కలు విచ్చుకుంటూ గాల్లోకి ఎగిరిపోతుంది. ఉన్నట్టుండి గాలిలో ఒక గొడుగు విచ్చుకుంటుంది... అంతే వేగంగా అమ్మాయి చేతిలో నుంచి సీడీలు పుట్టుకొచ్చేస్తాయి. ప్రేక్షకుల్ని కనికట్టు చేస్తున్న ఆ అమ్మాయి రమ్యశ్రీ! టీనేజ్లోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న లేడీ మెజీషియన్...మైనారిటీ అయినా తీరక ముందే తాజాగా పన్నెండు గంటల నిర్విరామ ప్రదర్శనతో రికార్డుల్లోకెక్కిన పిడుగు... వేదిక మీద ఏకధాటిగా పన్నెండు గంటల సేపు సాగిన ఇంద్రజాల ప్రదర్శన అది. రక్తదానం ఆవశ్యకత, నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ, మద్యపాన నిషేధం, ఇంధన పొదుపు, మహిళా సాధికారత... ఇలా మొత్తం పన్నెండు అంశాలపై ప్రదర్శన సాగింది. విజ్ఞానాన్ని మేళవించిన వినోదకార్యక్రమం అది. సామాజిక బాధ్యత స్పృహతో సాగిన ఇంద్రజాల ప్రదర్శన. ప్రేక్షకులను ఇంద్రజాలంతో కనికట్టు చేసిన మెజీషియన్ 17 ఏళ్ల రమ్యశ్రీ. ‘‘ఇంద్రజాలం గొప్ప మాధ్యమం. ఏ విషయాన్ని అయినా ఇంద్రజాలంతో చెబితే ఇట్టే గుర్తుండిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసే శక్తి ఇంద్రజాలానికి ఉంది. మెజీషియన్‌గా సామాజిక బాధ్యత ఉందనుకుంటున్నాను. అందుకే నా కార్యక్రమాల్లో ఎక్కువ సామాజికాంశాలే ఉంటాయి’’ అంటున్నారీ అమ్మాయి. కుటుంబమంతా... జానపద కాలం నుంచి కథల్లో తరచూ ఇంద్రజాలమహేంద్రజాల విద్యలు తెలిసిన వాడు... అనే పదమే వినిపించేది. ఇక నుంచి ఇంద్రజాల విద్య తెలిసిన అమ్మాయి అని స్త్రీ పాత్రనూ పరిచయం చేస్తూ కథల్ని తిరగరాసుకోమంటోంది రమ్యశ్రీలోని ప్రతిభ. ఈ సృజనాత్మకత ఆ కుటుంబంలోనే ఉంది. రమ్య తండ్రి రఘుబాబు మెజీషియన్, తల్లి నాగమణి మ్యాజిక్ మెటీరియల్, వెంట్రిలాక్విజమ్ బొమ్మలు చేస్తారు. మణి తల్లి సీతాదేవి కూడా ఇదే పని చేసేవారు. రఘుబాబు అదే సంగతి చెప్తూ... ‘‘రమ్యకి ఐదేళ్ల వయసులోనే నాతోపాటు స్టేజి మీద చిన్న చిన్న మ్యాజిక్కులు చేయడం అలవాటు చేశాను. మొదట్లో రెండు నిమిషాలు, మూడు నిమిషాలు చేయిస్తూ నిడివి పెంచాను. ఆరేళ్ల వయసులో తానొక్కతే ప్రదర్శన ఇచ్చింది. గత పన్నెండేళ్లుగా ఈ రంగంలో రోజుకో కొత్త అంశం నేర్చుకుంటోంది. రమ్యకు తొలిగురువును నేనే. ఆ తర్వాత బీహార్‌లోని బ్రిజ్మోహన్, కేరళలో నిపుణుల దగ్గర కొత్త టెక్నిక్స్ నేర్చుకుంది. తిరుపతిలో రవిరెడ్డి దగ్గర కళ్లకు గంతలు కట్టుకుని మోటర్‌బైక్ నడపడం నేర్చుకుంది. ఇప్పటికి రెండువేలకు పైగా ప్రదర్శనలిచ్చింది. పది పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో బహుమతులందుకుంది’’ అని వివరించారు. ‘‘మా అబ్బాయి వికాస్కీ, రమ్యకీ ఇద్దరికీ మా వారు మ్యాజిక్ నేర్పించారు. రమ్య ఇష్టంగా నేర్చుకుంది. ఇంద్రజాల ప్రదర్శనలు జరిగే గాలా షోలలో మేము తయారు చేసిన మ్యాజిక్ వస్తువుల స్టాల్ పెట్టేవాళ్లం. అలా రమ్య రెండేళ్ల పాపాయిగా ఉన్నప్పుడే ముంబయిలో ఇంద్రజాల ప్రదర్శన చూసింది’’ అంటారు రమ్య తల్లి నాగమణి. సీనియర్ల ప్రదర్శనలే పాఠాలు! రమ్య తాను గత జనవరి 27వ తేదీ చేసిన 12 గంటల ప్రదర్శనను ఉటంకిస్తూ... ‘‘ఆ ప్రదర్శనతో నాకు ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌కి అప్లయ్ చేశాను. గాలా షోలలో 30-40 మంది మెజీషియన్ల ప్రదర్శనలను గమనించడం మంచి ఎడ్యుకేషన్’’అంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన సందర్భాలను ఉదాహరిస్తూ... ‘‘ఏదైనా మ్యాజిక్ అంశం మిస్‌ఫైర్ అయినా కూడా దానికి అనుగుణంగా అప్పటికప్పుడే మార్చుకోవాలి. దానిని మేనేజ్ చేసి మరోలా ప్రెజెంట్ చేయాలి. లింకింగ్ రింగ్స్‌లో ఒక రొటీన్లో తేడా వస్తే మరో రొటీన్ చేస్తాం. ఒక్కోసారి ఈ తేడా సీనియర్ మెజీషియన్‌కు కూడా అర్థం కాదు. ఏదేమైనా సగంలో వదిలేయకుండా మరో రకంగా తిప్పుకోగలగాలి’’ అని ఈ అమ్మాయి వివరించారు. ‘‘ప్లేయింగ్ కార్డ్‌లు, సీడీలతో కనికట్టు చేయడానికి ఎక్కువ సాధన చేయాలి. సాధారణంగా రోజూ గంట సేపు ప్రాక్టీస్ చేయాలి. ఈ 12 గంటల ప్రదర్శనకు ముందు ఒక్కో కాన్సెప్ట్‌కి కొంత సమయం కేటాయించుకుని రోజుకి ఏడెనిమిది గంటలు ప్రాక్టీస్ చేశా. నిలబడడం, నడవడం వంటి ఫిట్నెస్ సాధించడానికి రెండు నెలలు శ్రమించా. పన్నెండు గంటల ప్రదర్శనకు 4 నెలలు ప్రాక్టీస్ చేశా’’నన్నారు.మహిళలు పెద్దగా ఆసక్తి చూపని రంగంలో అడుగుపెట్టి నంబర్‌వన్‌గా నిలిచిన రమ్య ట్రెండ్సెట్టరే. ‘‘రమ్య అత్యున్నత ప్రతిభ ఉన్న మెజీషియన్. భారతీయ మెజీషియన్లకు గర్వ కారణం’’ అని సీనియర్ మెజీషియన్ డా.బి.వి. పట్టాభిరామ్ ప్రశంసించారు. రమ్య గనక తన కృషిని ఇలాగే కొనసాగిస్తే లిమ్కా, గిన్నిస్ రికార్డుల్లో స్థానం సాధిం చడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. నన్ను మించిపోయింది! నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు రమ్య చాలా ఆసక్తిగా గమనించేది. తనని లేడీ మెజీషియన్‌ని చేయాలనుకున్నాను. నేను కోరుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా సాధించి... దేశంలో నంబర్‌వన్ లేడీ మెజీషియన్ అయింది. - రఘుబాబు, మెజీషియన్ నాన్నే నాకు ఆదర్శం! నాన్న ఉద్యోగం చేస్తూ కూడా తనకిష్టమైన ఇంద్రజాలాన్ని కొనసాగించారు. నేను సి.ఎ చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూ మ్యాజిక్‌ను కొనసాగిస్తాను. మ్యాజిక్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్లలో కనిపించే అబ్బురాన్ని చూడాలనిపిస్త్తుంది. - రమ్యశ్రీ, మెజీషియన్ - వాకా మంజులారెడ్డి