తిరువనంతపురం: కరోనా మహమ్మారి విభృంజించడంతో దాన్ని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మొదట ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించగా దానికి మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. దీంతో అప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కాక తప్పడం లేదు. అయితే ఇంట్లో ఉండటం వల్ల చాలా మందిలో ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అలాంటి వారి కోసమే తాను ఉచితంగా సర్వీస్ చేస్తానంటున్నారు ప్రముఖ మెజీషియన్ సమజ్. (లాక్‌డౌన్: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్)
కేరళకు చెందిన సమజ్ తన మ్యాజిక్‌షో తో ఎందరినో ఆకట్టుకొని ప్రతిష్టాత్మక మెర్లిన్ అవార్డు కూడా పొందారు. కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వారిలో ఒత్తిడి పెరిగిపోతుందని ప్రభుత్వం, పోలీసు శాఖ వారు అనుమతి ఇస్తే తను ఇంటి నుంచే అలాంటి వారి కోసం మ్యాజిక్ షో చేస్తాను అని చెప్పారు. తాజాగా తనతో ఉంటున్న కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ సమజ్ ఓ షో చేశారు. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం ఆ కార్మికులకు అండగా నిలిచింది. (ఎన్టీఆర్, రామ్చరణ్లకు జక్కన్న ఛాలెంజ్)
ఇక లాక్‌డౌన్ విషయంపై సమజ్ మాట్లాడుతూ.. ‘నేను ఇంట్లో ఖాళీగా కూర్చొన్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. నేను నా ప్రజల కోసం, వారికి ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ పని ఎందుకు చేయకూడదు అని ఆలోచించాను. ప్రభుత్వం అనుమతినిస్తే కచ్ఛితంగా చేస్తాను. మ్యాజిక్ అనేది వినోదాత్మకమైనది. ఇలాంటి కష్టకాలంలో ప్రజల ఒత్తిడి తగ్గించడానికి నా వంతు సాయం నేను చేస్తాను’ అని సమజ్ తెలిపారు. ఇంజనీరింగ్ చేసిన సమాజ్ ఆ వృత్తిని వదిలేసి చాలా దశాబ్ధాలుగా ప్రొఫెషనల్ మెజీషియన్‌గా కొనసాగుతున్నాయి. ఎన్నో మ్యాజిక్ షోస్ చేసిన ఆయన దేశ విదేశాల్లో అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment