కోవిడ్‌ విజృంభణ, ఆ రాష్ట్రంలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌ | Kerala Announces Complete Lockdown For 2 days As Covid Cases Surge | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ విజృంభణ, ఆ రాష్ట్రంలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌

Published Wed, Jul 14 2021 12:34 PM | Last Updated on Wed, Jul 14 2021 1:27 PM

Kerala Announces Complete Lockdown For 2 days As Covid Cases Surge - Sakshi

తిరువనంతపురం: కేరళలో మరోసారి కోవిడ్‌ వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దేశంలో నమోదవుతోన్న మొత్తం కేసుల్లో దాదాపు 30 శాతం వరకు కేరళ నుంచి నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వాప్తంగా రెండు రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 17, 18న(వీకెండ్‌) సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు కానున్నట్లు పేర్కొంటూ, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. ఈ రెండు రోజులు కేవలం నిత్యావసర సరుకులను విక్రయించే దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొంది.

కాగా కేరళలోని ప్రాంతాలను టెస్ట్ పాజిటివిటీ రేటు ఆధారంగా 4 కేటగిరీలుగా విభజించారు. టీపీఆర్‌ 5 లోపు ఉంటే కేటగిరీ-ఏ, టీపీఆర్ 5 నుంచి 10 మధ్య ఉంటే కేటగిరీ-బీ, టీపీఆర్ 10-15 మధ్య ఉంటే ఉంటే కేటగిరీ-సీ, టీపీఆర్ 15పైన ఉంటే కేటగిరీ-డీగా వర్గీకరించారు. కేటగిరీ ఏ, బీ, సీ ప్రాంతాల్లో అన్ని షాపులను రాత్రి 8 వరకు తెరిచి ఉంచవచ్చు. ఆ తర్వాత ఏ దుకాణమూ తెరవరాదు. ఇక కేటగిరి-డీ ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అక్కడ కేవలం నిత్యావసర వస్తువులను అమ్మే దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement