COVID-19
-
‘ఇప్పటికీ ఆ బాధ వెంటాడుతోంది’
మెల్బోర్న్: మూడేళ్ల క్రితం 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆసీస్ గడ్డపై అడుగు పెట్టాడు. అయితే ఆ సమయంలో అమల్లో ఉన్న కోవిడ్ ఆంక్షల కారణంగా వ్యాక్సిన్ వేసుకున్న వారినే దేశంలోకి అనుమతించారు. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా జొకోవిచ్‌ను విమానాశ్రయంలోనే నిలిపి వేశారు. ఆ తర్వాత అతను కోర్టును ఆశ్రయించడం, ఇతర పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. చివరకు టోర్నీలో ఆడకుండానే జొకోవిచ్‌ను ఆ్రస్టేలియా దేశం నుంచి అధికారులు పంపించి వేశారు. నాటి ఘటన తనను ఇప్పటికీ వెంటాడుతోందని, ఆస్ట్రేలియాకు ఎప్పుడు వచ్చినా దానిని మర్చిపోలేకపోతున్నానని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే లక్ష్యంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు అతను ఇప్పుడు మళ్లీ వచ్చాడు. ‘నాటి ఘటన నాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా ఎప్పుడు ఆ్రస్టేలియాకు వచ్చినా అదే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. పాస్‌పోర్ట్, ఇమిగ్రేషన్ విభాగం నుంచి వద్ద తనిఖీలు జరుగుతుంటే నావైపు ఎవరైనా వస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. పాస్‌పోర్ట్‌ను చెకింగ్ చేస్తుంటే కూడా నన్ను రానిస్తారా, అదుపులోకి తీసుకుంటారా, వెనక్కి పంపిస్తారా అనే సందేహాలు వస్తుంటాయి’ అని జొకోవిచ్ అన్నాడు. అయితే నిజాయితీగా చెప్పాలంటే నాటి సంఘటనకు సంబంధించి తనకు ఎవరీ మీదా కోపంగానీ, ప్రతీకార భావనగానీ లేదని అతను స్పష్టం చేశాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 10 సార్లు విజేతగా నిలిచిన జొకోవిచ్... గత ఏడాది సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. అయితే రిటైరయ్యే లోగా ఇక్కడ కనీసం మరో టైటిల్ సాధించాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు. బ్రిటన్ మాజీ ఆటగాడు ఆండీ ముర్రేను కోచ్‌గా ఎంచుకున్న తర్వాత జొకోవిచ్ ఆడనున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే కానుంది. ఈనెల 12న ప్రారంభమయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ కోసం జొకోవిచ్ మంగళవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. -
ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్లు.. కరోనాకు ముందే..
చైనాలో పుట్టిన హ్యూమన్ మెటా నిమో వైరస్(హెచ్ఎంపీవీ) ఇప్పుడు భారత్‌ను తాకింది. కరోనాను మరచిపోకముందే హెచ్ఎంపీవీ కేసులు భారత్‌లో నమోదవుతుండటంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వైరస్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ వైరస్‌కు ముందే ప్రపంచంలో ఎన్నోవైరస్‌లు ఉన్నాయి. అవి వివిధ కాలాల్లో జనాలను వణికించాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు ఆ వైరస్ల కట్టడికి పలు చర్యలు చేపట్టాయి.ప్రపంచంలో దాదాపు 3 లక్షల 20 వేల రకాల వైరస్‌లున్నాయి. ఈ వైరస్లలో అత్యంత ప్రమాదకరమైనవి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కరోనా వైరస్ కంటే ముందు ఏఏ వైరస్లు ప్రపంచాన్ని వణికించాయనే విషయానికొస్తే..రోటా వైరస్రోటా వైరస్‌ను చైల్డ్ కిల్లర్ వైరస్(Child killer virus) అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పిల్లల ప్రాణాలను హరిస్తోంది. ఇది నవజాత శిశువులు, 6 నుండి 8 ఏళ్ల వయసు గల పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.స్మాల్ పాక్స్దీనిని మశూచి అని అంటారు. ప్రపంచంలోని ఇతర వైరస్‌లకు మించి 30 నుండి 50 కోట్ల మంది మరణాలకు ఇది కారణంగా నిలిచింది. ఈ వైరస్ పునరుత్పత్తి సంఖ్య 3.5 నుండి 6 మధ్య ఉంటుంది. అంటే ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి మూడు నుంచి ఆరుగురికి తిరిగి వైరస్ సోకుతుంది. ఈ వైరస్ మరణాల రేటు(Mortality rate) 90 శాతం. అయితే టీకా ద్వారా, ఈ వైరస్‌ను సమూలంగా నిర్మూలించారు.తట్టుదీనిని మీజిల్స్ అని కూడా అంటారు. ఇది గత 150 ఏళ్లలో దాదాపు 20 కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. గతంలో ఈ వ్యాధి ప్రతి ఏటా సుమారు 2 లక్షల మందిని బలితీసుకుంది. అయితే ఈ వైరస్‌ను వ్యాక్సినేషన్ ద్వారా నియంత్రించారు. మీజిల్స్ వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఈ వైరస్ 18 మందికి సోకే అవకాశముంది.డెంగ్యూదోమల వల్ల డెంగ్యూ వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను ప్రపంచంలోని 110 దేశాలలో కనుగొన్నారు. ఇది ప్రతి సంవత్సరం సుమారు 10 కోట్ల మందికి సోకుతోంది. వారిలో 20 వేల మంది మరణిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంటారు.ఎల్లో ఫీవర్(Yellow fever)ఈ వైరస్ సోకిన బాధితుడు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. బాధితుని ముక్కు, కళ్ళు, నోటి నుంచి రక్తస్రావం జరుగుతుంది. ఈ స్థితికి చేరుకున్న రోగులలో 50 శాతం మంది 7 నుండి 10 రోజుల్లో ప్రాణాలు కోల్పోతారు. ఇప్పటి వరకూ ఎల్లోఫీవర్ ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మందికి సోకింది. ఈ వైరస్ కారణంగా 30 వేల మంది మృతిచెందారు.ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా)ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఫ్లూ కారణంగా మరణిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన స్పానిష్ ఫ్లూ 10 కోట్ల మందిని బలితీసుకుంది.రేబిస్పురాతన కాలం నుండి రాబిస్‌ను ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణిస్తున్నారు. గబ్బిలం లేదా కుక్క కాటు వల్ల రేబిస్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది మరణిస్తున్నారు. రేబిస్ మరణాలు ఎక్కువగా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలో సంభవిస్తున్నాయి.హెపటైటిస్-బీ అండ్ సీహెపటైటిస్ బీ వల్ల ఏటా 7 లక్షల మంది మృతిచెందుతున్నారు. ప్రస్తుతం ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటిగా నిలిచింది. ఈ వైరస్ తొలుత శరీరంలోని కాలేయంపై దాడి చేస్తుంది. దీనికి తగిన చికిత్స అందుబాటులో లేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది హెపటైటిస్ సీ కారణంగా మరణిస్తున్నారు.ఎబోలా- మార్బర్గ్ వైరస్ఎబోలా- మార్బర్గ్ వైరస్లు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లుగా గుర్తించారు. ఈ వైరస్ల నియంత్రణకు ఇంకా చికిత్స గానీ, వ్యాక్సిన్‌ను గానీ అభివృద్ధి చేయలేదు. అయితే ఈ వైరస్ల మరణాల రేటు 90 శాతం వరకు ఉంది. ఈ రెండు వైరస్ల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. వీటి బారిన పడిన బాధితుడు రక్తస్రావ జ్వరం, అవయవ వైఫల్యం లాంటి సమస్యలను ఎదుర్కొంటాడు.హెచ్ఐవీ, ఎయిడ్స్నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది హెచ్ఐవి వైరస్‌తో బాధపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం గత 30 ఏళ్లలో ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మంది ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2.5 కోట్ల మంది ఎయిడ్స్ కారణంగా మృతిచెందారు.ఇది కూడా చదవండి: ‘చొరబాట్ల’కు మూడు రూట్లు.. వివిధ రేట్లు.. ఏజెంట్ల మాయాజాలం ఇదే -
ముఖ్యమంత్రిగా అవకాశం.. వద్దనుకున్న సోనూసూద్.. ఎందుకంటే?
ఢిల్లీ : కరోనా (covid-19) సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood) రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల సోనూసూద్ ఓ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తులు ‘నాకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు. నేను తిరస్కరించా. అప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్నారు. అదీ వద్దన్నా. రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చింది. వాటిని వద్దనుకున్నాను. రాజకీయాల్లో (politics) ఉండి దేని కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉండదన్నారు. స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేనందునే రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించినట్లు చెప్పారు. రెండు కారణాలతో రాజకీయం చేస్తారు. ఒకటి డబ్బు కోసం, అధికారం కోసం. వాటిల్లో దేనిపైనా నాకు ఆసక్తిలేదు. ప్రజాసేవ చేస్తున్నాను. ఇందుకోసం ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. నేను ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే చేస్తాను. అదే రాజకీయం చేస్తే జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. స్వేచ్ఛను కోల్పోతామని భయం కూడా ఉంది. ఎవరైనా ప్రజాదరణ పొందుతున్నప్పుడు జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని అనుకుంటారు. కానీ మనం ఎంత ఎంతుకు ఎదిగితే అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మీరు అక్కడ ఎంతకాలం నిలదొక్కుకోగలరన్నది ముఖ్యం.రాజకీయాల్లోకి వస్తే ఢిల్లీలో ఇల్లు, ఉన్నత పదవి, భద్రత, విశిష్ట అధికారాలు ఉంటాయని నాకు చాలా మంది చెప్పారు. అవన్నీ బాగున్నాయి. నేను వాటిని వినడానికి ఇష్టపడుతున్నాను. అంతే తప్పా ఇంకా దేని గురించి ఆలోచించడం లేదు. నటుడిగా కొనసాగుతా. నాలో ఒక నటుడు,దర్శకుడు మిగిలి ఉన్నారు, నేను రాజకీయాలకు వ్యతిరేకం కాదు, గొప్ప పని చేసే రాజకీయ నాయకులను నేను గౌరవిస్తాను’ రాజకీయాలపై సోనూసూద్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కోవిడ్ వెంటాడినా ఏపీ వృద్ధి ముందుకే
సాక్షి, అమరావతి: రెండేళ్లపాటు కోవిడ్ సంక్షోభం వెంటాడినా గడచిన ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్ర వృద్ధి ముందుకే సాగింది. ఐదేళ్ల పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1.94 లక్షల కోట్లు పెరిగింది. వ్యవసాయ, తయారీ, పారిశ్రామిక, సేవలు, నిర్మాణ రంగాలన్నింటిలోనూ వృద్ధి కొనసాగింది. స్థిర ధరల ఆధారంగా వృద్ధి గణన మాత్రమే నిజమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్ధికరంగ నిపుణులు పేర్కొంటారు. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రంగాల వృద్ధి గణాంకాలను విడుదల చేసింది. ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా జీఎస్డీపీ 31.04 శాతం వృద్ధి నమో దైనట్టు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. సగటు వార్షిక వృద్ధి 6.20 శాతం నమోదైంది. వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి 16.46 శాతం నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 3.29 శాతం నమోదైంది. సంక్షోభంలోనూ.. కోవిడ్ సంక్షోభం ప్రపంచాన్ని రెండేళ్లు వెంటాడింది. ఆ పరిస్థితుల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగించడం వల్లే ఈ వృద్ధి నమోదైందని ఆర్ధిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తయారీ రంగం ఐదేళ్లలో 58.39 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 11.67 శాతం నమోదైంది. పారిశ్రామిక రంగంలో 46.62 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 9.32 శాతంగా నమోదైంది. నిర్మాణ రంగంలో గత ఐదేళ్లలో 41.50 శాతం వృద్ధి నమోదవ్వగా.. సగటు వార్షిక వృద్ధి 8.3 శాతంగా ఉంది. ఐదేళ్లలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో 42.04 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 8.40 శాతంగా ఉంది. సేవా రంగం 22.90 శాతం వృద్ధి నమోదు చేయగా.. సగటు వార్షిక వృద్ధి 4.5 శాతంగా నమోదైంది. -
తిరుగు వలసలు చెబుతున్నదేమిటి?
కోవిడ్ మహమ్మారి కాలంలో లక్షలాది మంది నగరాల నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. మహమ్మారి ముగిసిన తర్వాత వీరందరూ తిరిగి నగరా లకు చేరుకుంటారన్న అంచనాలకు భిన్నంగా గ్రామాల్లోనే ఉండిపోయారు. 2020–22 మధ్య కాలంలో గ్రామీణ శ్రామిక శక్తికి సుమారు 5 కోట్ల 60 లక్షల మంది కార్మికులు జోడించబడ్డారు. వీళ్లలో ఎక్కువమంది యువత. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లాంటివాటిని మినహాయిస్తే, చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇవన్నీ కూడా జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని చాటుతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్యను తగ్గించే ఆర్థిక విధానాలకు బదులుగా, వ్యవసాయాన్ని స్థిరమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చాలి.భారత ప్రజలు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. గత ఐదేళ్లలో, పట్టణ కేంద్రాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, ‘తక్కువ–ఉత్పాదకత’ కలిగిన వ్యవసాయం నుండి కార్మికులను బయటకు నెట్టడానికి సంకల్పించిన విధానం ఇప్పుడు అడ్డం తిరిగింది.కోవిడ్–19 మహమ్మారి కాలంలో మొదటిసారి తిరుగు వలసలు (రివర్స్ మైగ్రేషన్) మొదలయ్యాయి. లక్షలాది మంది పట్టణ పేదలు అనంత దూరాలు, చాలామంది కాలినడకన తమ తమ ఊళ్లకు ప్రయా ణించారు. దేశ విభజన రోజుల తర్వాత ఇది ప్రజల అతిపెద్ద చలనం. కనీవినీ ఎరుగనంత స్థాయిలో సాగిన ఈ అంతర్–రాష్ట్ర వలసలు, రాష్ట్రం లోపలి వలసలు తాత్కాలికమని నమ్మారు. కానీ, మహమ్మారి ముగిసిన తర్వాత శ్రామికశక్తి నగరాలకు తిరిగి వస్తుందనే అంచనాను తోసిపుచ్చుతూ, వాళ్లలో ఎక్కువ మంది తమ ఊళ్లలోనే ఉండడానికి ఇష్టపడటం జరిగింది.వ్యవసాయంలోనే ఉపాధి‘నేషనల్ శాంపిల్ సర్వే’, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ల డేటా ఆధారంగా, ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’, న్యూఢిల్లీకి చెందిన ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్’ రూపొందించిన ఒక నివేదికలో వ్యవసాయ ఉపాధి పెరిగిందని తేలింది. సాధారణ అభి ప్రాయానికి విరుద్ధంగా, 2020–2022 మధ్య గ్రామీణ శ్రామికశక్తికి 5 కోట్ల 60 లక్షలమంది కార్మికులు జోడించబడ్డారు. నిరుద్యోగం వృద్ధి చెందుతున్న సమయంలో, నగరాల్లో లభించే ఉపాధి అవకాశాలు వలస కార్మికులకు అంతగా ఆకర్షణీయంగా లేవని ఇది నిరూపిస్తోంది. తయారీ రంగంలో మందగమనం, నిర్మాణ రంగ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టడం వల్ల నగరాలకు వలస వచ్చినవారు గ్రామాలకు తిరిగి వెళ్లడమే మంచిదని భావించారు.ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2004–05, 2018–19 మధ్య అంటే 13 సంవత్సరాల కాలంలో 6 కోట్ల 60 లక్షల మంది వ్యవసాయ శ్రామికులు పట్టణాలలో చిన్న ఉద్యోగాల కోసం వలస వెళ్లారు. కానీ 2018–19, 2023–24 మధ్య ఐదేళ్లలో 6 కోట్ల 80 లక్షల మంది పైగా ప్రజలు గ్రామాలకు తిరిగి వచ్చారని జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యా లయానికి చెందిన ఆర్థికవేత్త హిమాన్షు అంచనా వేశారు. వ్యవసాయం అకస్మాత్తుగా లాభదాయకంగా మారిందని దీని అర్థం కాదు. ప్రజ లను పొలాల నుండి బయటకు నెట్టడం ఆచరణీయమైన వ్యూహం కాదని ఇది స్పష్టంగా చెబుతోంది.గ్రామీణ శ్రామిక శక్తిలో వ్యవసాయం వాటా 2018–19లో 42.5 శాతం నుండి 2023–24లో 46.1 శాతానికి పెరిగిందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక చెబుతోంది. పైగా ఇందులో గణనీయమైన యువ జనాభా కూడా ఉంది. ఇది విస్మరించలేని సందేశాన్ని ఇస్తోంది. ప్రజలను ఆ రంగం నుండి బయటకు నెట్టాలనే లక్ష్యంతో సంవత్సరాలుగా వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా వెనుకపట్టున ఉంచిన విధానాల మీద మన ఆర్థిక ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ ఢిల్లీ సరిహద్దుల్లో ఒక సంవత్సరం పాటు జరిగిన ఆందోళనల తరువాత రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. తమకు సరైన ఆదాయాన్ని నిరంతరం తిరస్కరించడంపై రైతాంగం ఆగ్రహంతో ఉంది.ప్రపంచ బ్యాంకుకు దూరంగా– గాంధీజీకి దగ్గరగా!భారతదేశం తన వ్యవసాయరంగం నుండి 40 కోట్ల మంది ప్రజలను నగరాలకు వలసబాట పట్టించాలని ప్రపంచ బ్యాంకు 1996లో కోరింది. ఇది బ్రిటన్, ఫ్రాన్ ్స, జర్మనీల ఉమ్మడి జనాభా కంటే రెండింతలకు సమానం. అయితే పట్టణ కేంద్రాలకు వలస వెళ్లడానికి వీలుగా ఆర్థిక పరిస్థితులను సృష్టించే బదులు, వ్యవ సాయాన్ని ఆచరణీయమైన వాణిజ్యంగా మార్చడం ద్వారా వ్యవ సాయాన్ని పునర్నిర్మించడంపై దృష్టి సారించాలి. మహాత్మా గాంధీ కోరుకున్నది ఇదే. వలస కార్మికులు తిరిగి వచ్చిన రేటు ఆయన అభి ప్రాయం ఎంత సరైనదో చూపిస్తుంది. అందువల్ల, ప్రపంచ బ్యాంకు ఆలోచనను విడనాడి వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం, వ్యవసాయాన్ని స్థిరమైన, ఆచరణీయమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.మీకు ఇంకా నమ్మకం లేకుంటే, ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్’ (నాబార్డ్)కు చెందిన ‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే 2021–22’ నివేదికను చూడండి. దీని ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న జనాభా వాటా సంవత్సరాలుగా గణనీయంగా పెరి గింది. 2016–17లోని 48 శాతం నుండి 2023–24లో గరిష్ఠంగా 57 శాతానికి చేరుకుంది. వ్యవసాయ కుటుంబాల సంఖ్యలో పెను గంతు స్థానికుల తిరిగిరాకను స్పష్టంగా సూచిస్తోంది. వ్యవసాయ కుటుంబాల వాటా 2016–17లో 42 శాతం నుండి 2021–22 నాటికి 36 శాతానికి తగ్గిన పంజాబ్; 70 నుండి 63 శాతానికి తగ్గిన హిమాచల్ ప్రదేశ్, కొంచెం తగ్గుదల చూపిన గుజరాత్, కర్ణాటకలను మినహాయిస్తే... అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల పెరుగుదల గణనీయంగా ఉంది. వ్యవసాయ కుటుంబాలు గోవాలో 3 నుండి 18 శాతానికి, హరియాణాలో 34 నుండి 58 శాతానికి పెరిగాయి. ఉత్తరా ఖండ్‌లో 41 నుంచి 57 శాతం; తమిళనాడులో 13 నుండి 57 శాతం పెరుగుదల కనబడింది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పెరుగుదల ధోరణినే చూపుతున్నాయి.కారణాలు ఏమైనప్పటికీ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, పీరి యాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, నాబార్డ్ చేసిన మూడు అధ్యయనాలు కూడా ఉపాధి, జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యతను చాటుతున్నాయి. అందుకే గృహ ఆహార భద్రతను నిర్ధారించడంలో వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని విస్మరంచకూడదు.ఆందోళనలో శుభవార్త వ్యవసాయంలో సంఖ్యలను తగ్గించడంపై ఆధారపడిన మును పటి ఆర్థిక విధానాలను రివర్స్ మైగ్రేషన్ తారుమారు చేసినప్పటికీ, వ్యవసాయంలో ఉపాధి పెరుగుదలను ప్రధాన ఆర్థికవేత్తలు ‘ఆందో ళన కలిగించే అంశం’గా చూస్తున్నారు. భారతదేశంలో కనిపిస్తున్న ఈ తిరుగు వలసల ధోరణి తక్కువ మధ్య–ఆదాయ వర్గానికి ప్రత్యే కమైనదిగా చూస్తున్నారు. కానీ వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన ఆర్థిక విధానాలను పునరుజ్జీవింపజేయవలసిన అవస రాన్ని ఇది సూచిస్తుంది. మారుతున్న క్షేత్ర వాస్తవికతను గుర్తించాల్సిన సమయం ఇది.ప్రభుత్వం తగిన వనరులను కల్పించడానికి సిద్ధంగా ఉంటే, వ్యవసాయంపై ఆధారపడటం దాని సొంత ఆచరణీయ మార్గాలను సృష్టిస్తుంది. వ్యవసాయం కోసం కేటాయించే బడ్జెట్ వ్యయంలో ఏదైనా పెరుగుదలను ప్రతిపాదిస్తే, అది ఆర్థిక లోటుకు అదనపు మొత్తంగా పరిగణించడాన్ని ఆర్థికవేత్తలు ఇకనైనా మానేయాలి. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం మాత్రమే రైతుల నష్టాలను బడ్జెట్ కేటాయింపుల ద్వారా భర్తీ చేయడం లేదు. నేను తరచుగా చెప్పినట్లు, రైతులు దాదాపు 25 సంవత్సరాలుగా ఏటా పంట నష్టపోతున్నారు. రైతులకు ‘దేవుడే దిక్కు’ అయ్యే ఈ లోపభూయిష్ట ఆర్థిక రూపకల్పన ఇకనైనా అంతం కావాలి.ఒక విధంగా తిరుగు వలసలను శుభవార్తగా చూడాలి. వనరులను అత్యంత అవసరమైన చోట ఉంచడానికి ఇది సరైన సమయం. అది చివరకు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’కు దారి తీస్తుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
మోదీకి డొమినికా జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి విజృంభించి దేశాన్ని కలావికలం చేస్తున్న వేళ భారత్ అందించిన ఆపన్నహస్తంతో తెరిపినపడిన డొమినికా దేశం తన కృతజ్ఞత చాటుకునేందుకు సిద్ధపడింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయానికి గుర్తుగా మోదీకి ‘ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ను ప్రదానం చేయనున్నట్లు ది కామన్వెల్త్ ఆఫ్ డొమినికా గురువారం ప్రకటించింది. భారత ప్రభుత్వ ఉదార గుణాన్ని స్మరించుకుంటూ ఆ దేశ ప్రధాని హోదాలో ఉన్న మోదీకి తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గయానాలోని జార్జ్‌టౌన్ పట్టణంలో నవంబర్ 19 నుంచి 21వ తేదీదాకా జరిగే ఇండియా–కరికోమ్ శిఖరాగ్ర సదస్సులో మోదీకి ఈ అవార్డ్‌ను అందజేస్తారు. ‘‘2021 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఆదేశాలతో భారతసర్కార్ మాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనికా కోవిడ్19 వ్యాక్సిన్లు అందించింది. మా స్థాయికి అది పెద్ద సాయం కావడంతో వాటిలో కొన్నింటిని మా పొరుగు దేశాలకూ సాయంగా అందించగలిగాం. ఆరోగ్యం, వైద్యం, సమాచార సాంకేతిక రంగాల్లోనూ భారత్ మాకు ఎంతో సాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో వాతావరణమార్పు నిరోధక చర్యలు చేపట్టడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకను గుణంగా ముందడుగు వేయడంలో మాకు వెన్నంటి నిలిచింది’’ అని ఆ దేశ ప్రధాని కార్యాలయం కొనియాడింది. -
కోవిడ్ కక్కిన విషం.. స్వీట్ లిటిల్స్లో చేదు చక్కెర
కోవిడ్ తర్వాత పిల్లల్లో టైప్– 1 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందేమోనని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా ఇది జరిగేందుకు అవకాశముందనే పరిశోధకుల రిపోర్టులు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’ (జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్)లో ప్రచురితమయ్యాయి.పరిశోధకుల అధ్యయన ఫలితాల వివరాలివి... వైరస్ తాలూకు ప్రభావంతో చిన్నారుల సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు.. వారి క్లోమ (ప్యాంక్రియాస్) గ్రంథిలోని బీటా కణాలు దెబ్బతీయడం వల్ల పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ వచ్చే ముప్పుందని పేర్కొంటున్నారు.అధ్యయన ఫలితాలు చెప్పేదేమిటంటే... జర్మనీలో ఫిబ్రవరి 2015 నుంచి అక్టోబరు 2023 వరకు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు పరిశోధకులు 509 మంది చిన్నారులపై ఓ సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. ఏడాది మొదలుకొని పదహారేళ్ల వయసున్న పిల్లల్లో మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీలనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఈ అధ్యయనం సాగింది. ఈ ‘మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీస్’ అనేవి ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీసే ్రపోటీన్లు. ప్యాంక్రియాస్‌ను అవి అలా దెబ్బతీయడంలో చిన్నారుల్లో అది టైప్–1 డయాబెటిస్‌కు కారణమవుతుంది. ఐలెట్ ఆటో యాంటీబాడీస్... ప్యాంక్రియాస్‌ను దెబ్బతీయడం జరిగితే ముందు లక్షణాలు కనిపించకపోయినప్పటికీ... తుదకు అది టైప్–1 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఈ తరహా పరిశోధనల అవసరమెందుకంటే... డయాబెటిస్ వ్యాధిలో రక్తంలో చక్కెరను నియంత్రించాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగదు. లేదా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ దేహం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోకపోవచ్చు. దాంతో రక్తంలో చక్కెర ఎక్కువవ్వడంతో తొలిదశల్లో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా నిశ్శబ్దంగా దెబ్బతీసే చక్కెర వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’గా నిపుణులు చెబుతుంటారు. జీవనశైలి సమస్యల్లో ఒకటైన ఈ వ్యాధిని దురదృష్టవశాత్తూ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. దాంతో అది దేహంలోని కీలకమైన అవయాలను... మరీ ముఖ్యంగా గుండె, రక్తనాళాలు, కళ్లు, మూత్రపిండాలు, నరాలను దెబ్బతీస్తుంది. అందువల్ల చిన్నపిల్లల్లో కనిపించే చక్కెరవ్యాధి (జువెనైల్ డయాబెటిస్) అని పిలిచిన ఈ వ్యాధి... ఇప్పుడు యువత పెద్దయ్యాకా వారిని ప్రభావితం చేస్తుండటంతో మనదేశ నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి్టపెడుతున్నారు.గట్ మైక్రోబియమ్ అసమతౌల్యత వల్ల... జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందనీ, ఈ సూక్ష్మజీవుల సమూహాన్నే ‘గట్ బ్యాక్టీరియా’ లేదా ‘గట్ మైక్రోబియమ్’ అంటారనీ, దీనివల్లనే ప్రతి ఒక్కరిలోని వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఏదైనా వైరస్ సోకాక... ఈ గట్ మైక్రోబియమ్లో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య తగ్గి, కీడు చేసేవి పెరగడం వల్ల గట్ మైక్రోబియమ్ సమతౌల్యతలో మార్పుల వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, బలహీనమవుతుంది. ఈ పరిణామం డయాబెటిస్, గుండెజబ్బుల వంటి అనేక దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులకు కారణమవుతుంది.యాంటిజెన్స్కు ఎక్స్పోజ్ కానివ్వపోవడంతో... మునపటి తరంతో పోలిస్తే ఇటీవల పిల్లలను స్వాభావికమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కానివ్వకుండా అత్యంత రక్షణాత్మకమైన రీతిలో తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. పిల్లలు ఆరుబయట ఆడుతూ, ్రపాకృతిక పర్యావరణానికీ, అందులోని కొన్ని వ్యాధికారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు చిన్నారుల్లో ఆ వ్యాధికారకాలను ఎదుర్కొనే యాంటిజెన్స్ ఉత్పన్నం అవుతాయి. కానీ తల్లిదండ్రుల అతిజాగ్రత్త కారణంగా వారు నేచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండటం తగ్గిపోవడంతో కొన్ని రకాల హానికారక అంశాలకు యాంటిజెన్స్ ఉత్పాదన లేకుండా పోయి, సహజ రక్షణ కవచం ఏర్పడకుండా పోయింది. ఈ అంశం కూడా పిల్లల్లో సహజ రక్షణ వ్యవస్థను బలహీనం చేసిందనే అభి్రపాయం కూడా ఇంకొందరు నిపుణులనుంచి వ్యక్తమవుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిందే... కనబడుతున్న తార్కాణాలను బట్టి, ప్రస్తుతానికి టైప్–1 డయాబెటిస్‌కు మందులేదనే వాస్తవానికి బట్టి రాబోయే భావితరాలను వ్యాధిగ్రస్తం కాకుండా చూసుకునేందుకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. డయాబెటిస్ ఉన్న పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు ... 👉చాలా ఎక్కువ నీరు తాగుతూ ఉండటం; మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్తుండటం. 👉రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటును మానేసిన పిల్లలు అకస్మాత్తుగా మళ్లీ పక్క తడపటం మొదలుపెట్టడం ∙బాగా ఆకలితో ఉండటం; మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం ∙చాలా తేలిగ్గా అలసిపోతుండటం, చాలా నిస్సత్తువగా, నీరసంగా ఉండటం ∙కొందరిలో చూపు మసగ్గా కనిపిస్తుండటం (బ్లర్డ్ విజన్) ∙జననేంద్రియాల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్లు (క్యాండిడియాస్) వంటివి వస్తుండటం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపోతే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు.టైప్–1 డయాబెటిస్‌ను ఎదుర్కొనే తీరు(మేనేజింగ్ టైప్–1 డయాబెటిస్) పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ కనిపించినప్పుడు కింద పేర్కొన్న ఆరు అంశాల ద్వారా దాన్ని మేనేజ్ చేయాలి. అవి... 1. ఇన్సులిన్ : డయాబెటిస్తో బాధపడే పిల్లల విషయంలో ప్రస్తుతానికి ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స. 2. పర్యవేక్షణ (మానిటరింగ్) : పిల్లల్లో కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపోదు. వారు తిన్న దాన్ని బట్టి ఎంత మోతాదులో ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్ని నిత్యం పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఈ అంశాన్ని పిల్లలు ఎంత తిన్నారు, ఎలాంటి ఆహారం తీసుకున్నారు, దాని వల్ల రక్తంలో ఎంత గ్లూకోజ్ వెలువడుతుంది... వంటి అనేక అంశాలను పర్యవేక్షించుకుంటూ ఇన్సులిన్ ఇస్తుండాలి. 3. ఆహారం : కేవలం రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను చూసుకుంటూ యాంత్రికంగా ఇన్సులిన్ ఇవ్వడం కాకుండా... పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు కాబట్టి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా ఆహారం ఉండేలా చూపుకోవాలి. ఆహారంలో తగిన పాళ్లలో పిండిపదార్ధాలను (కార్బోహైడ్రేట్స్) సమకూర్చే కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), మాంసకృత్తులు (్రపోటీన్లు), ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు ఇస్తుండాలి. వీటిని పిల్లల వయసు, బరువు, రోజంతా చేసే శ్రమ వంటి అంశాల ఆధారంగా ఓ ప్రణాళిక రూ΄÷ందించి, దానికి అనుగుణంగా అవసరమైన మోతాదుల్లో ఇవ్వాలి. 4. శారీరక శ్రమ : ఈ రోజుల్లో చిన్నారులు ఆరుబయట ఆడుకోవడం చాలా తక్కువ. పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర మోతాదులు స్వాభావికంగానే నియంత్రితమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లల్లో ఒళ్లు అలిసేలా ఆడుకోవడం చాలా అవసరం.5. గ్లూకోజ్‌ను పరీక్షించడం : పిల్లల రక్తంలో గ్లూకోజ్ మోతాదుల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. 6. కీటోన్ మోతాదుల కోసం మూత్రపరీక్ష : మూత్రంలో కీటోన్ మోతాదులను పరీక్షించడం కోసం తరచూ మూత్రపరీక్షలు చేయిస్తూ ఉండాలి. చిన్నారుల్లో పెరుగుతున్న కేసులు... కోవిడ్–19 ఇన్ఫెక్షన్ అన్నది ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్‌ను పెంచడం వల్ల ఆ అంశం ఈ వ్యాధిని ప్రేరేపిస్తోందంటున్నారు మరికొందరు నిపుణులు. ఇక జామా రిపోర్టును అనుసరించి, కోవిడ్–19 బారిన పడ్డ పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన ఆర్నెల్ల నుంచి ఏడాది కాలంలోనే టైప్–1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు మామూలు పిల్లల కంటే 16% ఎక్కువ. మన దేశంలో నిర్దిష్టమైన గణాంకాలు లేకపోయినప్పటికీ... పాశ్చాత్య దేశాల అధ్యయనాల ప్రకారం చూస్తే కోవిడ్ (సార్స్–సీవోవీ2) ఇన్ఫెక్షన్ తర్వాత టైప్–1 డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎంటరోవైరస్, సైటో మెగాలో వైరస్, రుబెల్లా వైరస్లు ఎటాక్ అయ్యా కూడా టైప్–1 డయాబెటిస్ రావడం జరిగినట్లే... కోవిడ్19 విషయంలోనూ జరుగుతోందని మరికొందరు నిపుణుల అభి్రపాయం.కారణాలుటైప్–1 డయాబెటిస్‌కు జన్యుపరమైన కారణాలను ముఖ్యంగా చెప్పవచ్చు. దాంతోపాటు బాధితులు కొన్ని వైరస్‌లకు గురికావడం కూడా మరో ముఖ్యమైన అంశం. కోవిడ్–19 కూడా ఒక రకం వైరల్ ఇన్ఫెక్షన్ కావడం కూడా ఈ ముప్పును పెంచుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్), 2022 నివేదిక ప్రకారం మన దేశంలో టైప్–1 డయాబెటిస్తో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 95,600 మంది 14 ఏళ్లలోపు చిన్నారులని తేలింది. -
ముంచుకొస్తున్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్..ఏకంగా 27 దేశాలకు..!
కోవిడ్-19 ప్రపంచ దేశాలను ఎంతలా గడగడలాడించిందో అదరికి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది అనుకునేలోపు ఆ మహమ్మారి ఏదో రూపంలో నేను ఉన్నానంటూ కన్నెర్రజేస్తోంది. ఇప్పటివరకు ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్ వంటి రకరకాల సబ్వేరియంట్లుగా రూపాంతరం చెంది కలవరపెడుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ ఎక్స్ఈసీ అనే కొత్త వేరియంట్ రూపంలో దూసుకొస్తోంది. తొలిసారిగా ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన కేసుని జర్మన్లో గుర్తించారు. అలా ఇది యూకే, యూఎస్, డెన్మార్క్, పోలాండ్, చైనాతో సహా 27 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఇది యూరప్‌లో వేగంగా విజృంభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్‌లో కూడా ఈ వైరస్ వృద్ధి తీవ్రంగా ఉందని వెల్లడించారు. ఈ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్‌ని ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ హైబ్రిడ్ కేఎస్ 1.1, కేపీ, 3.3గా చెబుతున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా, లండన్‌లోని జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్ మాట్లాడుతూ.. ఇతర కోవిడ్ వేరియంట్లతో పోలిస్తే ఈ ఎక్స్ఈసీ తొందరగా వ్యాప్తి చెందదని, అయినప్పటికీ టీకాల వంటి రక్షణ అందిచడం మంచిదని సూచించారు. శీతకాలంలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్లేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ..ఈ వేరియంట్ ఉధృతి ఇప్పుడే ప్రారంభమయ్యింది. ఇది తీవ్ర రూపం దాల్చడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్లొచ్చు. ఈ ఎక్స్ఈసీ కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వంశానికి చెందిన ఉపవేరియంటే కాబట్టి దీన్ని వ్యాక్సిన్ల, బూస్టర్ డోస్‌లతో అదుపు చేయగలం అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందర్నీ పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.ఎక్స్ఈసీ లక్షణాలు..జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులతో సహా మునుపటి కోవిడ్ వేరియంట్ల మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత ఛార్జ్ చేస్తాడంటే..?) -
రానున్నది మరో మహమ్మారి.. బిల్‌గేట్స్ ఆందోళన
ప్రపంచం వచ్చే 25 ఏళ్లలో అత్యంత భారీ యుద్ధాన్నో లేక కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారినో ఎదుర్కొనబోతోందని ఆందోళన చెందుతున్నారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.వాతావరణ విపత్తులు, పెరిగిపోతున్న సైబర్ దాడులపై ప్రజలను హెచ్చరించిన బిల్‌గేట్స్.. తనను రెండు ఆందోళనలు అత్యంత కలవరపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో ఒకటి రానున్న మహా యుద్ధం కాగా మరొకటి కోవిడ్‌ను మించిన మహమ్మారి.‘ప్రపంచంలో ప్రస్తుతం చాలా అశాంతి నెలకొంది. ఇది మహా యుద్ధాన్ని రేకెత్తించవచ్చు. ఒక వేళ ఆ యుద్ధం నుంచి బయటపడినా రాబోయే 25 సంవత్సరాలలో మరొక మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది’ అని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.ఒకవేళ మహమ్మారి విజృంభిస్తే.. కోవిడ్‌కు మించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటుందని, దీనికి దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న తనను వేధిస్తోందన్నారు. అమెరికా విషయాన్ని తీసుకుంటే కోవిడ్ సమయంలో మిగిలిన దేశాల కంటే మిన్నగా ఉంటుందని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారని కానీ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి..బిల్ గేట్స్ 2022లో “తదుపరి మహమ్మారిని నివారించడం ఎలా ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2020 కోవిడ్ సమయంలో వివిధ దేశాల సన్నద్ధత లోపాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బలమైన క్వారంటైన్ విధానాలు, వ్యాధి పర్యవేక్షణ, టీకా పరిశోధన, అభివృద్ధి వంటి వాటిపై దేశాలకు పలు సూచనలు సైతం చేశారు. -
Karnataka: మరో కుంభకోణం వెలుగులోకి.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల లూటీ
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా మరో భారీ స్కాం వెలుగుచూసింది. కరోనా సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తేలింది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ పాలనలో కోవిడ్‌పై పోరాటానికి కేటాయించిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి.దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని కమిషన్ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఆగస్టు 31వ తేదీన సుమారు 1722 పేజీలతో కూడిన నివేదికను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును విశ్లేషించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకు కమిషన్‌కు ఆరు నెలల అదనపు గడువు ఇచ్చారు.తాజాగా ఈ నివేదికపై చర్చించేందుకు నేడు మంత్రివర్గం సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఈ నివేదికపై చర్చించిన సిద్ధరామయ్య.. కొన్ని కీలక విషయాలను గుర్తించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వందల కోట్లు దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు మిస్ అయ్యాయని కమిటీ గుర్తించిందని సీఎం ఆ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.కొవిడ్ సమయంలో రాష్ట్రం వెచ్చించిన సొమ్ము మొత్తం విలువ రూ.13 వేల కోట్లు. కానీ దానిని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అందులో రూ.1,000 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న ఆరు నెలల్లో తుదిరూపు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతోంది.పార్లమెంట్ శీతాకాల సమావేశంలో దీనిని సమర్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముడా స్కామ్ వచ్చిన తరుణంలోనే ‘కొవిడ్’ కుంభకోణం నివేదిక తేవడంపై మీడియా అడిగిన ప్రశ్నపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ముడా వ్యవహారంపై విమర్శలు రాబట్టి రెండు నెలలు కూడా కావడం లేదు. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీని ఏడాదిక్రితం ఏర్పాటుచేశారు. అసలు రెండింటిని ఎలా పోలుస్తారు. ఇది దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు. -
మరోసారి కరోనా పంజా?
న్యూఢిల్లీ: కోవిడ్–19 సృష్టించిన విలయాన్ని దేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ప్రాణాంతక మహమ్మారి కాటుకు లక్షల మంది బలయ్యారు. క్రమంగా వైరస్ వ్యాప్తి నిలిచిపోయింది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, కోవిడ్–19 మరోసారి విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. అమెరికాలో 25 రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతున్నట్లు సెంటర్ ఫర్ డిసీజజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. దక్షిణ కొరియాలో చాలామంది కరోనా బారినపడి, చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇండియాలో ఈ ఏడాది జూన్, జూలైలో 908 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు బాధితులు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో జూన్ 24 నుంచి జూలై 21 మధ్య వారానికి సగటున 17,358 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలియజేసింది. ఇతర దేశాల్లో ఉన్నట్లుగా ఇండియాలో పరిస్థితి అంత తీవ్రంగా లేకపోయినా మనం అన్నింటికీ ఇప్పటి నుంచే సిద్ధపడి ఉండడం మంచిదని నోయిడాలోని శివ నాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వైరాలజిస్టు దీపక్ సెహగల్ సూచించారు. వైరస్ మరోసారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఈసారి వైరస్ వ్యాప్తిలో వేగం 11 శాతం పెరిగిందని, బాధితుల్లో 26 శాతం మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసిందని వెల్లడించారు. ఇది నిజంగ ఆందోళకరమైన పరిణామమేనని పేర్కొన్నారు. -
కోవిడ్ మందుకు ఆయుష్ అనుమతి!
కొవిడ్ వైరస్ బారిన పడినవారిలో ఇప్పటికీ కొన్ని స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వారికోసం రెమిడియమ్ థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ ఫార్మాసూటికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సంయక్తంగా ‘కోరోక్విల్-జెన్’ అనే ఔషధాన్ని తయారు చేశాయి. ఈమేరకు తాజాగా ఈ డ్రగ్ భారత ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు కూడా పొందింది.ఈ సందర్భంగా రెమిడియమ్ థెరపెటిక్స్ సీఈఓ కృష్ణన్ మాట్లాడుతూ..‘కొవిడ్ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటికీ స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు రెమిడియం థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్-చెన్నై, ఢిల్లీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ యూనివర్శిటీ సహకారంతో ‘కోరోక్విల్-జెన్’ను అభివృద్ధి చేశాయి. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్న జింక్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్ మిశ్రమం ఇందులో ఉంటుంది. దానివల్ల కొవిడ్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. ఈ ఔషధాన్ని వాడే రోగులు ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి. ఈ డ్రగ్‌కు తాజాగా భారత ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు లభించాయి. కొవిడ్‌తో కలిగే అనారోగ్య సమస్యలతోపాటు క్షయ, ఆస్తమా, సీజనల్ అలర్జీలు, పల్మనరీ, ఇతర శ్వాసకోశ రుగ్మతల చికిత్సలో కోరోక్విల్-జెన్ ఉపయోగించేందుకు లైసెన్స్ లభించింది’ అన్నారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలో వ్యక్తిగత వివరాలు మార్చుకోండిలా..! -
భారత్‌లోనే కోవిడ్-19 మరణాలు ఎక్కువ.. ఖండించిన కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్-19 సమయంలో భారత్‌లో అధిక మరణాలు సంభవించాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం తెలిపింది. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో పేర్కొన్న అధ్యయనాన్ని కేంద్రం కొట్టిపారేసింది. భారత్‌లో అధికారిక కోవిడ్-19 మరణాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల కంటే 1.5 రెట్లు ఎక్కువ అని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నివేదించారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, అధిక-ఆదాయ దేశాలలో కనిపించే నమూనాలతో పోలిస్తే, మహమ్మారి సమయంలో మహిళల కంటే పురుషులలో అధిక మరణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే,ఆ రిపోర్ట్‌పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. సైన్స్ అడ్వాన్సెస్ పేపర్లో నివేదించబడిన అదనపు మరణాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. జర్నల్స్ లోపభూయిష్టంగా ఉందని, ఆమోదయోగ్యం కాని ఫలితాలను చూపుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
2020లో భారత్‌లో కరోనాతో... 11లక్షల అధిక మరణాలు
న్యూఢిల్లీ: కరోనా వల్ల 2020లో భారత్‌లో కేంద్రం చెప్పిన వాటికంటే ఏకంగా 11.9 లక్షల అధిక మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఇది భారత్ అధికారిక గణాంకాల కంటే 8 రెట్లు, డబ్ల్యూహెచ్ఓ అంచనాల కంటే ఒకటిన్నర రెట్లు అధికం! 2019తో పోలిస్తే ఈ మరణాలు 17 శాతం అధికమని అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్, మరికొన్ని విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2019 నుంచి 2020 దాకా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బాధితుల డేటాను సైతం పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్–19 సంబంధిత మరణాల్లో మూడింట ఒక వంతు మరణాలు ఇండియాలోనే చోటుచేసుకున్నాయని వెల్లడించారు. కోవిడ్–19 ప్రభావం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం 2.6 ఏళ్లు తగ్గినట్లు తెలిపారు. మహిళల ఆయుర్దాయం 3.1 ఏళ్లు, పురుషుల ఆయుర్దాయం 2.1 ఏళ్లు తగ్గినట్లు గుర్తించారు. అధ్యయనం వివరాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో ప్రచురించారు.అవన్నీ కరోనా మరణాలు కాదు అధ్యయనం గణాంకాలపై కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. ఈ గణాంకాల్లో వాస్తవం లేదని, అవన్నీ కరోనా మరణాలు కావని పేర్కొంది. -
మరో కరోనా వేవ్.. జపాన్‌లో పెరుగుతున్న కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోల్లాన్ని ఎవరూ మరచిపోలేరు. తాజాగా జపాన్‌లో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇవి అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ వేరియంట్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19కు చెందిన 11వ వేవ్ ఇప్పుడు జపాన్ను వణికిస్తోంది.జపాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కజుహిరో టటేడా తెలిపిన వివరాల ప్రకారం కేపీ.3 వేరియంట్ జపాన్‌లో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం.ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో కోవిడ్ -19 బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. అయితే ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైనవి కావని టాటెడా చెప్పారు. కేపీ వేరియంట్ త్రీ సాధారణ లక్షణాలు అధిక జ్వరం, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి, అలసట. జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ అంతటా జూలై 1 నుండి 7 వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది. -
ఇలా బైడెన్‌కి మూడోసారి..! వృద్ధాప్యం కోవిడ్ సమస్యలను పెంచుతుందా?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్ - 19 పాజిటివ్‌గా తేలిందని, ఆయన స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్నారని వైట్ హౌస్ ప్రకటించింది.ఆయన గతంలో వ్యాక్సీన్ వేయించుకున్నారని, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని అధ్యక్షుడి ప్రెస్ కార్యదర్శి కరీన్ జీన్ పియరీ చెప్పారు. బైడెన్‌కు గతంలోనూ రెండుసార్లు కోవిడ్ సోకింది. సరిగ్గా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్ కరోనా బారినపడటం పార్టీ నేతలను కలవరపాటుకి గురి చేసింది. ఆయన టీకాలు వేయించుకున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కోసం తన డెలావేర్ బీచ్ హౌస్‌లో ఉన్నారని, అక్కడ నుంచి విధులు కొనసాగిస్తారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. బైడెన్‌కి కరోనా రావడం ఇది మూడోసారి. అమెరికా అధ్యక్షుడు కేసును బట్టి వృద్ధులు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండేల్సిందేనని తెలుస్తోంది. అదీగాక యూఎస్‌లోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా 65 అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులలో కరోనే కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వృద్ధులు కరోనా బారిన పడుకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందువల్ల వారికే ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ తదితరాల గురించి తెలుసుకుందాం. వృద్ధులకే ఎందుకు..వృద్ధలు, చిన్నపిల్లల్లో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. వృద్ధాప్య కారణంగా ఉండే వయసురీత్య సమస్యలు కూడా కోవిడ్ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఊబకాయం, ఉన్నవారు ఆస్పత్రిలో చేరే ప్రమాదం ఉంది. వృద్ధులలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాల్సిందే.జ్వరం లేదా చలిదగ్గుశ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిఅలసటకండరాలు లేదా శరీర నొప్పులుతలనొప్పిరుచి లేదా వాసన యొక్క కొత్త నష్టంగొంతు మంట ముక్కు కారటంవికారం లేదా వాంతులుఅతిసారంమరింత తీవ్రంగా ఉంటే..కోవిడ్-19 ఉన్న పెద్దలు కూడా డెలిరియం, వివరించలేని హైపోక్సియా వంటి విలక్షణమైన లక్షణాలు కనిపించొచ్చు. ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలు, వేగవంతమైన శ్వాస, మైకం, పెరిగిన హృదయ స్పందన రేటు, రక్తపోటు పడిపోవడం తదితరాలు.బూస్టర్లు ఎందుకు..బూస్టర్ మోతాదులను సాధారణంగా వారి రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరచడానికి వృద్ధులకు సిఫార్సు చేస్తారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ కూడా సాధారణంగా 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు ఉంటే..వారి సంరక్షణార్థం ఈ బూస్టర్ షాట్లను సిఫార్సు చేస్తోంది.రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా వృద్ధులను రక్షించడంలో బూస్టర్ లేదా ముందుజాగ్రత్త మోతాదు సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది లక్షణాలు స్వల్పంగా ఉండేలా చేసి ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. (చదవండి: వామ్మో ఎంత పొడుగు జుట్టు!..గిన్నిస్ రికార్డులకెక్కింది!) -
కరోనా రికార్డులు దాటేస్తున్న వడదెబ్బ మృతులు?
దేశరాజధాని ఢిల్లీలో వడగాడ్పుల బీభత్సం కొనసాగుతోంది. ఎండలకు తాళలేక మృతి చెందుతున్నవారి సంఖ్య గతంలో ఎదురైన కరోనా మహమ్మారి మరణాలను మించిపోతున్నది. ఢిల్లీలోని పలు శ్మశానవాటికల వద్ద దహన సంస్కారాలకు ఎదురుచూస్తున్న మృతదేహాల క్యూ కనిపిస్తోంది.ఢిల్లీ కార్పొరేషన్‌కు చెందిన బోద్ ఘాట్‌లో కరోనా తర్వాత అత్యధిక దహన సంస్కారాలు జూన్ 19న ఒక్క రోజులో జరిగాయి. బుధవారం రాత్రి 12 గంటల వరకు నిగమ్ బోద్ ఘాట్ వద్ద 142 మృతదేహాలను దహనం చేశారు. కరోనా కాలంలో 2021 ఏప్రిల్‌న 253 మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు.నిగమ్ బోద్ ఘాట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడానికి వడదెబ్బ కారణం కావచ్చన్నారు. ఈ జూన్‌లో ఇప్పటివరకు 1,101 మృతదేహాలను దహనం చేశామన్నారు. నిగమ్ బోద్ ఘాట్ల వద్ద మృతదేహాల అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు చాలాసేపు వేచిచూడాల్సి వస్తోంది.దేశంలో కరోనా తాండవమాడుతున్న 2022 జూన్‌లో ఈ ఘాట్‌లో మొత్తం 1,570 మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. ఇప్పుడు ఈ రికార్డు బద్దలయ్యేలా వేసవి ఉష్ణోగ్రతలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నిగమ్ బోద్ ఘాట్‌లో వారం రోజులుగా జరిగిన దహన సంస్కారాల గణాంకాలు ఇలా ఉన్నాయి.జూన్ 14 - 43జూన్ 15- 53జూన్ 16 - 70జూన్ 17 - 54జూన్ 18 - 97జూన్ 19- 142 (అర్ధరాత్రి 12 గంటల వరకు)ఢిల్లీలో సంభవిస్తున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పేదల పాలిట శాపంగా మారాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో మృతదేహాలు కనిపిస్తున్నాయి. వడగాడ్పుల కారణంగా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 48 గంటల్లో 50 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండ తీవ్రతకు తొమ్మది రోజుల్లో 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరంతా వడదెబ్బ కారణంగా మృతిచెందారా లేదా అనేది ఆరోగ్యశాఖ అధికారులు ఇంకా ధృవీకరించలేదు. -
EPF Update: ఇక ఆ సౌకర్యం లేదు.. ప్రకటించిన ఈపీఎఫ్‌వో
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇకపై కోవిడ్ -19 అడ్వాన్స్‌లను అందించబోమని ప్రకటించింది. కోవిడ్ -19 ఇకపై మహమ్మారి కానందున, తక్షణమే ఈ అడ్వాన్స్ నిలిపివేయాలని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించిందని ఈపీఎఫ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది. మినహాయింపు పొందిన ట్రస్టులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది.కరోనా మహమ్మారి సమయంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులు రెండుసార్లు డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ ఆప్షన్‌ను మొదటి వేవ్ సమయంలో ప్రవేశపెట్టగా, సెకండ్ వేవ్‌లో మరో అడ్వాన్స్‌తో పొడిగించారు. ఈ వెసులుబాటు కింద ఈపీఎఫ్ఓ చందాదారులు మూడు నెలల బేసిక్ వేతనం, కరువు భత్యాలు లేదా తమ ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌లో 75 శాతం ఏది తక్కువైతే అది నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉండేది.కాగా పిల్లల చదువులు, పెళ్లిళ్ల, మెడికల్ ఎమర్జెన్సీ, రెసిడెన్సియల్ ప్రాపర్టీ కొనుగోలు వంటి వాటి కోసం ఉద్యోగుల ఈపీఎఫ్ నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. నగదు ఉపసంహరణ కోసం ఆన్లైన్లోనే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది. ఈ ఆన్లైన్ విత్‌డ్రాయల్ ప్రక్రియను ఇప్పుడు మరింత సులభతరం చేసింది.పీఎఫ్ విత్‌డ్రా ఎలా?» ముందుగా మీరు మీ పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అర్హులా కాదా నిర్ధారించుకోండి.» ఈపీఎఫ్ పోర్టల్ లో మీ వ్యక్తిగత వివరాలు అప్టు డేట్‌గా ఉండేలా చూసుకోండి.» మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) ఇప్పటికే యాక్టివేట్ కాకపోతే యాక్టివేట్ చేయండి.» పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణ కోసం ఈపీఎఫ్ ఫారాన్ని పూర్తి చేయండి.» రిటైర్మెంట్ తర్వాత లేదా రెండు నెలల కంటే ఎక్కువ నిరుద్యోగం తర్వాత మాత్రమే పూర్తి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.ఆన్లైన్లో క్లెయిమ్ ఇలా..» మీ UAN క్రెడెన్షియల్స్ ఉపయోగించి మెంబర్ ఇంటర్ ఫేస్ ని యాక్సెస్ చేసుకోండి.» మీ యూఏఎన్ తో లింక్ చేసిన అన్ని సర్వీస్ అర్హతలు, కేవైసీ ఆవశ్యకతలను మీరు తీర్చారని నిర్ధారించుకోండి.» సంబంధిత క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోండి.» యూఐడీఏఐతో మీ రిజిస్టర్డ్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఉపయోగించి మీ వివరాలను ధ్రువీకరించండి.» ఆన్లైన్ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయండి. -
COVID-19: సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ వేవ్
సింగపూర్: సింగపూర్‌లో కోవిడ్–19 మరోసారి విజృంభిస్తోది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కేవలం వారం వ్యవ ధిలో 25,900 కేసులు నమోద య్యాయి. దీంతో, ప్రభుత్వం మాస్క్‌లు ధరించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆరోగ్యమంత్రి ఓంగ్ యె కుంగ్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ‘దేశంలో కోవిడ్ వేవ్ ప్రారంభ దశలో ఉంది. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో, జూన్ మధ్య నుంచి చివరి వరకు భారీగా కేసులు నమోదవుతాయి’ అని చెప్పారు. గత వారంలో మే 5 నుంచి 11వ తేదీ వరకు కేసులు 25,900పైగా నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో 13,700 కేసులొచ్చాయి. ఆ వారంలో రోజుకు 181 నుంచి 250 మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే, ఐసీయూ కేసులు సరాసరిన రోజుకు మూడు మాత్రమే ఉన్నాయని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధాశ్రమాల్లో ఉండేవారు అదనపు డోసు కోవిడ్ టీకా తీసుకోవాలని మంత్రి సూచించారు. -
వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?
-
కోవిడ్ సమయంలో ‘ఊపిరి’పోశారు
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్ పడకలను భారీగా పెంచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2020 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో కేవలం 2,643 ఆక్సిజన్ పడకలు మాత్రమే ఉండగా అనంతరం నాలుగేళ్లలో అదనంగా 15,376 ఆక్సిజన్ పడకలను పెంచినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల సంఖ్య 18,019కి చేరినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి చాలా వేగంగా ఆక్సిజన్ పడకలను పెంచడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించడానికి పలు చర్యలను చేపట్టింది. ఆక్సిజన్ పడకల సంఖ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నారు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. వికసిత్ భారత్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు అనుసరించిన ఉత్తమ ఆచరణలను నీతి ఆయోగ్ వెల్లడించింది. మార్చి 2020లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అంటువ్యాధుల చట్టాన్ని అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. రాజకీయ నిబద్ధత, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం, టెలిమెడిసిన్ వంటి డిజిటల్ సాంకేతిక సాధనాల వినియోగం, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ముందస్తు శిక్షణ, అవగాహన కోసం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రచారాలు, నిఘాపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మరణాల రేటు తక్కువగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. రాజకీయ నిబద్ధతతో పాటు అధికారులు, భాగస్వాముల మధ్య సమన్వయం, ముందస్తు స్క్రీనింగ్‌లు, నిఘా, ట్రేసింగ్, టెస్టింగ్, ఐసోలేటింగ్, డిజిటల్ పద్ధతులు ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొంది. క్షేత్ర స్థాయి పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలను అవసరమైన సాధనాలతో సన్నద్ధం చేయడం, కమ్యూనిటీలతో నిమగ్నమవ్వడం, ప్రజల మానసిక, సామాజిక అవసరాలను పరిష్కరించడం, అవసరమైన ఆరోగ్య సేవల పంపిణీకి హామీ ఇవ్వడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అదుపులో ఉంచిందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలో అత్యధికంగా కోవిడ్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించినట్లు తెలిపింది. -
కోవిడ్ టీకాను ఎలా చూడాలి?
‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ టీకా వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి దుష్ప్రభావాలు అరుదుగానైనా కలగడమే ఆ నిర్ణయానికి కారణం. ఇదే టీకాను ‘కోవిషీల్డ్’ పేరుతో ఇండియాలో కోట్లాది డోసులు వేయడం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని విస్మరించకూడదు. మహమ్మారులు దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి పెద్ద దేశంలో ఆసుపత్రుల్లో పడకలు కూడా అందుబాటులో లేని కాలంలో, ఈ టీకా లక్షలాది మందిని చనిపోకుండా నిరోధించిందని మరిచిపోరాదు.ఆంగ్లో–స్వీడిష్ ఔషధ తయారీదారు అయిన ‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. భారతదేశంలో ‘కోవిషీల్డ్’ పేరుతో వచ్చిన ఈ టీకాను ఆస్ట్రా–జెనెకా సహకారంతో పుణెకు చెందిన ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ తయారు చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 175 కోట్ల టీకా డోసులను అందించారు. టీకాల ఉపసంహరణకు ‘భిన్న రకాల వేరియంట్లకు బహుళ టీకాల లభ్యత వల్ల కాలం చెల్లిన టీకాలు మిగిలిపోవడం’ కారణమని ఆస్ట్రా–జెనెకా సంస్థ పేర్కొంది. సరళంగా చెప్పాలంటే, తీవ్రమైన దుష్ప్రభావాల కేసులకు సంబంధించిన కోర్టు విచారణలు,కంపెనీ ఎదుర్కొంటున్న 100–మిలియన్ పౌండ్ల(సుమారు వెయ్యి కోట్ల రూపాయలు) మేరకు క్లాస్ యాక్షన్ వ్యాజ్యం(ఎక్కువమందికి సంబంధించిన కేసు) నేపథ్యంలో ఇది కేవలం వ్యాపార నిర్ణయం. కోవిడ్–19 టీకా ‘చాలా అరుదైన సందర్భాల్లో, టీటీఎస్‌కు కారణం కావచ్చు’ అని కంపెనీ, ఫిబ్రవరిలో అంగీకరించినట్లు నివేదించబడింది.‘టీటీఎస్’ అంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో థ్రాంబోసిస్. ఇది శరీరంలో ప్లేట్లెట్లు పడిపోవడానికీ, రక్తం గడ్డకట్టడానికీ కారణమవుతుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తలనొప్పులు, సులభంగా గాయపడటం వంటి లక్షణాలు దీంట్లో ఉంటాయి. బ్రిటన్ లో చాలా మంది వ్యక్తులు తాము వివిధ రకాల గాయాలతో బాధపడుతున్నామని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా, కొన్ని కుటుంబాలు ఆస్ట్రా–జెనెకాపై, సీరమ్ సంస్థపై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏమి చేయాలని ప్రజారోగ్యం నిర్దేశిస్తుంది, భారతదేశంలో దీనికి ఏదైనా భిన్నంగా చేయగలిగి ఉండేవాళ్లమా అనేదాని గురించి నేను ఆలోచిస్తున్నాను. మాజీ ప్రజారోగ్య పాలనాధికారిగా నా అభిప్రాయాలను ఇచ్చే ముందు, ఇద్దరు అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. నేను మొదటగా భారతదేశ ప్రముఖ మైక్రోబయాలజిస్టు, వైరాలజిస్టులలో ఒకరైన డాక్టర్ గగన్ దీప్ కాంగ్‌తో మాట్లాడాను. ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్లేషనల్, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆమె అభిప్రాయం మేరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 మార్చిలో అస్ట్రా–జెనెకా టీకా టీటీఎస్ దుష్ప్రభావం కలిగించే ప్రమాదం గురించి ప్రకటించింది. 2021 మే నాటికి దానిని ధ్రువీకరించింది. 2021 అక్టోబర్‌లో ‘కోవిషీల్డ్’కు సంబంధించిన ప్రమాద కారకాన్ని చేర్చడానికిగానూ సీరమ్ సంస్థ తన టీకా లేబుల్‌ను నవీకరించింది. టీటీఎస్ వల్ల, కొందరు రోగులు దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లు, కొన్ని సందర్భాల్లో చివరికి మరణాలు సంభవించాయని మనకు పొడికథలుగా మాత్రమే తెలుసు. అలాంటప్పుడు టీకాను కొనసాగించడం లేదా కొనసాగించకపోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి? మనకు ప్రత్యామ్నాయం ఉందా?గగన్‌దీప్ కాంగ్ మనకు తెలియని వాటి గురించి వివరించారు. ‘‘ప్రమాదం వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇది భౌగోళికతపై కూడా ఆధారపడి ఉండొచ్చు. భౌగోళికత సమస్యను రోటావైరస్ టీకాల కోసం మనం చేసినట్లుగా ఫార్మావిజిలె¯Œ ్స ద్వారా మాత్రమే లెక్కించవచ్చు. నిష్క్రియాత్మకంగా అంటే ప్రజలు సమస్యను నివేదించే వరకు వేచి ఉండటం మరొక మార్గం. ఈ విధానంలో ఉన్న సమస్య ఏమిటంటే, టీకా వేసిన మొదటి కొన్ని గంటలలో లేదా రోజులలో దుష్ప్రభావం చూపకుంటే అది టీకాతో సంబంధం ఉన్నదిగా గుర్తించబడకపోవచ్చు.ప్రమాదం–ప్రయోజనం నిష్పత్తి, ముఖ్యంగా డెల్టా వేవ్ విషయంలో చూస్తే, ప్రయోజనమే ఎక్కువగా ఉండింది; ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా, యువకులకు కొంత తక్కువగా. పాశ్చాత్య దేశాలను అనుసరించి, 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కోవిషీల్డ్‌ను వేయడం నిలిపివేసి ఉంటే, మన ప్రత్యామ్నాయం ‘కోవాక్సిన్ ’ అయివుండేది. ఇది తక్కువ సరఫరాలో ఉంది. ఫలితంగా యువకులకు రోగనిరోధక శక్తి విస్తరించేది. భారతదేశానికి నిర్దిష్టంగా టీటీఎస్ డేటా లేనందున, పర్యవేక్షించడం కష్టంగా ఉండేది’’ అని ఆమె చెప్పారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన సెంటర్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కృష్ణన్ దీనిని విభిన్నంగా చెప్పారు: ‘‘అరుదైన దుష్ప్రభావం ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోవడానికి భారీస్థాయి ప్రజారోగ్య ప్రయోజనం కారణమైంది. దుష్ప్రభావాలపై దృష్టి కేంద్రీకరించడం వలన టీకా వేసుకోవాలా వద్దా అనే సంకోచం ఏర్పడుతుంది. అంటే మనం ఆ దుష్ప్రభావాలను దాచిపెట్టాలని కాదు... వెనక్కి చూసుకుంటే, మెరుగైన, మరింత సూక్ష్మమైన, సమతుల్యమైన సమాచారం సహాయపడి ఉండేదని చెప్పడం మెరుగు. అరుదైన దుష్ప్రభావాలను ఎదుర్కొన్న వారికి పరిహారం కోసం కూడా మనం ప్లాన్ చేసి ఉండవచ్చు.’’దుష్ప్రభావాల క్లెయిమ్‌లను పరిశీలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పీడకలగా మారేదని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు. టీకాలు అత్యంత వేగంగా పూర్తి చేయడానికి అవి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. మహమ్మారి దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. అత్యంత హాని కలిగే వారికి ప్రాధాన్యతనిచ్చి టీకాలు వేసేలా చూసుకోవాలి. భారతదేశంలో ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేని కాలంలో వేలాది మంది ప్రజలు చనిపోకుండా టీకాలు నిరోధించాయి.ఇక టీకాను అభివృద్ధి చేయడానికి తీసుకునే సాధారణ సమయం పదేళ్లు. దీనికి భిన్నంగా అస్ట్రా–జెనెకా టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దానిని తప్పక గుర్తించి, గౌరవించాలి. ఇది కచ్చితంగా లక్షలాది మందిని తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకుండా లేదా చనిపోకుండా నిరోధించింది. తీవ్రమైన దుష్ప్రభావాల గురించి బాగా అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నవారు పట్టించుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అంతేనా? ఏదైనా నిపుణుల సంఘం ఇచ్చిన ప్రతికూల సలహా దేన్నయినా అణచిపెట్టారా? రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సిన ముఖ్యమైన, చర్య తీసుకోదగిన సమాచారం ఏదైనా ఉండిందా? అలా కాదంటే మాత్రం వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేయడానికి ప్రయోజనపు సమతూకం స్పష్టంగా అనుకూలంగా ఉంది.భారతదేశంలోని భారీ జనాభాకు టీకాలు వేయకుండా ఆటంకం కలిగించే శక్తిమంతమైన టీకా వ్యతిరేక ఉద్యమాన్ని మనం అదృష్టవశాత్తూ చూడలేదు. రద్దీగా ఉండే నగరాలు, ఆరు లక్షలకు పైగా గ్రామాలలో ప్రజలు చెదిరిపోయి ఉన్నందున ప్రజారోగ్య స్పందన అనేది సహజంగానే పెద్ద ఎత్తున వ్యాధిగ్రస్తులను మరియు మరణాలను నిరోధించడానికి ఉద్దేశించారు. అందులో చర్చకు తావులేదు. కుటుంబాలు, సంఘాల ఎంపికకు టీకాను వదిలేసివుంటే, లక్షలాదిమందిని ప్రమాదంలో పడేసేది. వయసు లేదా భౌగోళికతపై లేని డేటాను వెతుకుతూ పోతే, టీకా కార్యక్రమం పట్టాలు తప్పివుండేది. ఒక్కో జిల్లాలో దాదాపు 20 లక్షల జనాభా కలిగిన భారతదేశంలోని దాదాపు 800కు పైగా జిల్లాల్లోని జిల్లా ఆరోగ్య కార్యకర్తలు అప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నారు.కొన్ని సమయాల్లో, మంచి (ఈ సందర్భంలో, దుష్ప్రభావాలను పర్యవేక్షించడం) అనేది కూడా గొప్ప శత్రువుగా (లక్షలాదిమందికి టీకాలు అందని అపాయం ఉండటం) మారవచ్చు. భారతదేశానికి సంబంధించి, ఈ క్షణపు వాస్తవం ఇది!- వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి; మాజీ ప్రధాన కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- శైలజా చంద్ర -
కోవాగ్జిన్‌తోనూ సైడ్ ఎఫెక్ట్స్..
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆందోళనలు తగ్గేలోపే భారతీయ కంపెనీ తయారు చేసిన మరో కోవిడ్ వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’తోనూ సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు ఓ తాజా అధ్యయనం వెలువడింది.భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తీసుకున్న కొంతమందిని బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధక బృందం ఏడాదిపాటు పరిశీలించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది ప్రతికూల సంఘటనలను నివేదించారు. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు మొత్తం 1,024 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 304 (47.9 శాతం) మంది టీనేజర్లు, 124 మంది (42.6 శాతం) పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొన్నట్లు నివేదించారు. 10.5 శాతం మందిలో చర్మ సమస్యలు, 10.2 శాతం మందిలో సాధారణ రుగ్మతలు, 4.7 శాతం మందిలో నాడీ సంబంధిత సమస్యలు, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు, 2.7 శాతం మందిలో కంటి సమస్యలు గుర్తించారు.సైడ్ ఎఫెక్ట్స్ వార్తల నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వాణిజ్య కారణాలతో మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న కొన్ని రోజులకే ఈ అధ్యయనం వెలువడటంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. -
అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తాము సరఫ రా చేసిన కోవిడ్ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు యూకేకు చెందిన ఫార్మా కంపెనీ అ్రస్టాజెనెకా వెల్లడించింది. కోవిడ్ అప్డేటెడ్ వ్యాక్సిన్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని, అందుకే వాణిజ్య కారణాలతో తమ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేసింది. అ్రస్టాజెనెకా కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చే సింది. అస్ట్రాజెనెకా టీకాతో దు్రష్పభావాలు తలెత్తుతున్నట్లు కోర్టుల్లో కేసులు నమోదవడంతో న్యాయ విచారణ జరుగుతోంది. -
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా సంస్థ తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్ నుంచి తొలగిస్తున్న సంస్థ ప్రకటించింది. కొన్ని వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్) కారణంగా చాలా అరుదుగా థ్రోంబోసిస్ అనే అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఈమేరకు సంస్థ వీటిని ధ్రువపరుస్తూ యూకే కోర్డులో పత్రాలను అందజేసింది. అనంతరం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.కొత్త కొవిడ్ వేరియంట్లతో పోరాడే వ్యాక్సిన్‌ను ఇకపై సంస్థ తయారు చేయదని, దానికి సంబంధించిన డ్రగ్‌ను సరఫరా చేయదని సంస్థ స్పష్టం చేసింది. ఐరోపాలో సరఫరా చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ వాక్స్జెవ్రియా మార్కెటింగ్‌ను తొలగిస్తున్నట్లు చెప్పింది. అధిక సరఫరా వల్ల దీనికి డిమాండ్ తగ్గిందని పేర్కొంది. ఇకపై ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి జరగదని వివరించింది.వ్యాక్సిన్‌ను రూపొందించడానికి గతంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఆస్ట్రాజెనెకా ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యూకే ఆధారిత ఫార్మా కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్ అందించేందుకు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ఒకపై ఆ ఒప్పందాలు రద్దైనట్లు తెలిసింది.ఇదీ చదవండి: సిబ్బంది అనారోగ్యంతో 70కి పైగా విమానాలు రద్దుఅసలేం జరిగిందంటే..యూకేకు చెందిన జామీ స్కాట్ అనే వ్యక్తి 2021లో కొవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. అప్పటినుంచి నిత్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వైద్య పరీక్షలు చేసిన అనంతరం తన శరీరంలో రక్తం గడ్డకడుతుందని వైద్యులు గుర్తించారు. అయితే టీకా వేయించినప్పటి నుంచి ఈ సమస్య ఉండడంతో తన అనారోగ్యానికి అదే కారణమని అనుమానం వ్యక్తంచేశారు. మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత తన పరిస్థితికి టీకానే కారణమని నిర్థారణ అయింది. తాను థ్రోంబోసైటోపెనియా, థ్రాంబోసిస్ బారిన పడినట్లు తేలింది. దాంతో యూకే కోర్టులో దావా వేశారు. తాజాగా కంపెనీ వివరణ ఇస్తూ చాలా అరుదుగా ఇలాంటి వాటికి అవకాశం ఉందని అంగీకరించింది.