జయశంకర్ భూపాలపల్లిలో కోవిడ్‌ కలకలం | Five People Of Family Tested Covid-19 Positive In Jayashankar-Bhupalpally | Sakshi
Sakshi News home page

జయశంకర్ భూపాలపల్లిలో కోవిడ్‌ కలకలం

Published Mon, Dec 25 2023 11:00 AM | Last Updated on Mon, Dec 25 2023 3:52 PM

Five People Of Family Tested Positive Covid 19 In Jayashankar Bhupalpally - Sakshi

జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్‌ కలకలం రేపింది. గణపురం మండలం గాంధీనగర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

దీంతో.. ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టు నిర్వహించగా నలుగురికి కోవిడ్  లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. వారిని ఇంట్లోనే ఐసోలేట్‌ చేశామని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో మధుసూదన్‌ తెలిపారు. జిల్లాలోని వంద పడకల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు.

చదవండి: Year Ender 2023: జనం‍ సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement