jayashankar bhupalapally
-
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్
Updates: ఈఎన్సీ చీఫ్ మురళీధర్ కామెంట్లు.. ► మేడిగడ్డ బ్యారేజ్‌లో మొత్తం నాలుగు పిల్లర్లు 18,19,20,21 కుంగినాయి ► 20వ పిల్లర్ ఎక్కువగా 1.256 మీటర్ల మేర కుంగింది ► మూడు పిల్లర్లు పూర్తిగా తొలగించాల్సి వస్తుంది ► ఆ పిల్లర్లు తొలగించడం కష్టతరంగా మారింది ► ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ఈ పిల్లర్లల మీదే ఆధారపడి ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తుగ్లక్ చర్య: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ► కిందికి పోయినా వాటర్‌ను పైకి లిఫ్ట్ చేయడం ఏం పిచ్చి డిజైన్ ► వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు ► ఇంజనీరింగ్ అధికారులు వాస్తవాలు బయట పెట్టాలి ► అసెంబుల్డ్ మోటార్లతో వేల కోట్ల డబ్బు దోచుకున్నారు ► అప్పటి పాలకులు చెప్పినట్లు ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు తలూపారు ► మీ మాట వినకపోతే లీవ్ పెట్టి వెళ్లి పోవాల్సింది ► ఎకరానికి 12 వేల ఖర్చు వస్తుంది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్లు ► ప్రజల్లో చర్చ జరుగుతుందే నేను అడుగుతున్నా ► 152 మీటర్ల వరకు ప్రాజెక్టు ఎత్తు ఉండేలా నిర్మాణం ఉండాలని మహారాష్ట్రతో చర్చలు జరుగుతున్నాయి ► రాష్ట్రం ఏర్పడిన తర్వాత 148 మీటర్లకే ప్రాజెక్టు కట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుంది. ► కేసీఆర్ తన మార్క్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ► డయాఫ్రామ్ వాల్ కాంక్రీట్‌తో వేసి ఉంటే ఈ రోజు బ్యారేజ్‌లు డ్యామేజ్ అయ్యేవి కాదు. ► సీకెండ్ ఫైల్ ఫేలవ్వడం వల్లే బ్యారేజ్‌లు దెబ్బతిన్నాయి. ► ప్రాజెక్టు నిర్మాణంలో అప్ స్టీన్ కటాఫ్, డౌన్ స్టీన్ కటాఫ్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ► ప్రమాదం ఉందని 2022 ఎప్రిల్ 28న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖలు రాసాడు.. అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు. ► టెండర్లు పిలవడానికి చూపిన ఇంట్రెస్ట్... సేఫ్టీకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ► వరద ఉధృతిని అంచనా వేయకుండా పంప్ హౌస్‌ల నిర్మాణం ఎలా చేసారు ► బ్యారేజ్‌లో ఇసక తీయాల్సిన అవసరం ఏమోచ్చింది.. తీసిన ఇసుకను ఏం చేసారు ► మునిగిపోయిన పంప్‌ల స్థానంలో కొత్త వాటి కోసం బడ్జెట్ అలకేషన్ చేయాలని మళ్ళీ ఫైల్‌ను ఫైనాన్స్ డిపార్టుమెంట్లో పెట్టారు ► 3 టీఏంసీ లిఫ్ట్ కోసం టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ ద్వారా ఎలా కాంటాక్ట్ ఇచ్చారు ► కాళేశ్వరంకు మీడియాను ఎందుకు నియంత్రించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు ► కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మా కాంగ్రెస్ అభిప్రాయం ఒకటే ► 38 వెల కోట్లతో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టు కోసము వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయకట్టు ప్రణాళిక రూపొందించడం జరిగింది ► కానీ ప్రభుత్వం మారడం వల్ల ప్లాన్ మార్చి మేడి గడ్డ దగ్గర నిర్మించడం జరిగింది ► ఒక బ్యారేజ్ తుమ్మిడి హాట్టి దగ్గర అనుకున్నాం కానీ.. అన్నారం, సుందిల్ల ఇలా ఎక్కువ ప్రాజెక్ట్ లు నిర్మించడం వల్ల వ్యాయం పెరిగింది ► ఆనాడు 38 వెల కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు 18 లక్షల ఎకరాల కు 80 వేల కోట్లు ఖర్చు చేశారు ► ప్రపంచం లోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు.. అద్భుతం అన్నారు. ► కానీ మేడిగడ్డ డ్యామేజ్ కావడం దురదృష్టం ► అక్టోబర్ 21 నాడు ప్రాజెక్టు పెద్ద శబ్దంతో కుంగడం జరిగింది ► కానీ ఆనాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోరు మెదపలేదు ► ఎక్కడ రివ్యూ చేయలేదు,స్టేట్ మెంట్ ఇవ్వలేదు ► మా ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు మొత్తం విషయంపై జ్యుడిషియల్ విచారణ చేపడతాం అని చెప్పాం చేపడతాం ► అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు కోవడానికి ఈ రోజు రావడం జరిగింది ► అధికారులతో రివ్యూ తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తాం ► CWC అప్రోవల్ చేసింది రూ. 80 వెల కోట్లు కానీ ఇప్పుడు లక్షన్నర కోట్లు పెరిగింది. ► 38 వెల కోట్లు ప్రాజెక్ట్ ఈరోజు వరకు సుమారు 95 వేల కోట్ల ఖర్చు జరిగింది. ► కంట్రోల్ ఆడిట్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ► మేడి గడ్డ ఒక్కటే కాదు అన్నారం, కూడా నష్టం జరిగింది.. సుందిల్లను కూడా పరిశీలించాలి ► మూడు బ్యారేజీల రిపేర్‌కు అయ్యే ఖర్చు ప్రజల మీద భారమే అవుతుంది ► కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బు మొత్తం వృధా ► పైగా ప్రజలపైన వడ్డీలు పడుతున్నాయి ► కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జ్యుడీషియల్ విచారణ చేయబోతున్నాం ► ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపం జరిగింది ► డిజైన్ , నిర్మాణం ఫెయిల్ అయ్యాయి ► ENC మరోసారి రిటన్‌గా నివేదిక ఇవ్వాలి ► తుమ్మిడిహట్టి మరోసారి రీడిజైన్ చేయబోతున్నాం ► మాకు తుమ్మిడిహట్టి మీద పూర్తి అవగాహన ఉంది ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు ► అన్నారం, మేడిగడ్డ, సుంధిళ్ళ బ్యారేజ్లే కాళేశ్వరంకు కీలకం ► అందులో అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్‌లు డ్యామేజ్ అయ్యాయి ► బాంబు దాడులను తట్టుకునే విధంగా ప్రాజెక్టుల ను నిర్మిస్తారు ► అలాంటిది మేడిగడ్డ బ్యారేజ్ బాంబు దాడి వల్ల డ్యామేజ్ అయిందని ఎలా భావిస్తున్నారు ► ఇరిగేషన్ శాఖ లో 8 నుంచి 9 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి ► గత ప్రభుత్వం మాకు పెండింగ్ బిల్లులు వదిలిపెట్టి వెల్లింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఉండే కీలక అంశాలు ► గోదావరిలో వాటర్ ఎంత లభ్యం అవుతుంది ► ప్రాణహితకు కాళేశ్వరంకు మధ్య తేడా ఏంటి? ► రీ డిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి? ► ప్రాణహిత ద్వారా ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండేది ► కాళేశ్వరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత నీరు ఇచ్చారు ► ఇప్పటి వరకు కాళేశ్వరం విద్యుత్ ఖర్చు ఎంత? ► మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంటి? ► మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్టీకి ఇప్పుడు ఏం చేయాలి? మేడిగడ్డకు మంత్రుల బృందం ► హైదరాబాద్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్‌కు తెలంగాణ మంత్రుల బృందం బయలుదేరింది ► మంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ► మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేకా వెంకట స్వామి. ► మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ►అక్టోబర్ 21న మెడగడ్డ పిల్లర్ కుంగిపోయింది. ►నవంబర్ 30న ఎన్నికలు డిసెంబర్ 3న ఫలితాలు, డిసెంబర్ 7వరకు కేసిఆర్ సీఎంగా ఉన్నారు ►కానీ కాళేశ్వరంపై ఒక్కసారి మాట్లాడలేదు. ఇది చాలా సిగ్గుపడాల్సిన సంఘటన ►అన్ని విషయాలు నిర్దారణ చేస్తాం.నిజానిజాలు అన్ని మీడియాకు వెల్లడిస్తాం ►మూడేళ్లలో ఈ ప్రోజెక్ట్ కుంగటం సిగ్గు చేటు. ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలి ►లక్ష కోట్ల ప్రోజెక్ట్ లో ఇంత భారీ అవినీతి జరిగింది ► మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన సమయం నుంచి బ్యారేజ్ చూడటానికి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. మరో వైపు కుంగిన ప్రాంతాన్ని చూపిస్తామని చెప్పిన మంత్రులు మేడిగడ్డ పర్యటనకు బయలుదేరనున్నారు. అధికారులు బ్యారేజ్‌కు ఇరువైపులా బారికేడ్లతో మూసివేశారు. దీంతో మంత్రుల మేడిగడ్డ పర్యటన ఉత్కంఠగా మారింది. జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సందర్శనకు తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్థానిక అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మేడిగడ్డకు చేరుకుంటారు. అనంతరం E-IN-C ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పైర్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష చేస్తారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంపు కార్యాలయానికి తిరుగు ప్రయాణం కానున్నారు. -
జయశంకర్ భూపాలపల్లిలో కోవిడ్ కలకలం
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. గణపురం మండలం గాంధీనగర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టు నిర్వహించగా నలుగురికి కోవిడ్ లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. వారిని ఇంట్లోనే ఐసోలేట్ చేశామని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని వంద పడకల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. చదవండి: Year Ender 2023: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
అటెండర్ తో బూట్లు మోపించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
-
మునిగిన మోరంచపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగు పోటెత్తడంతో.. కుందయ్యపల్లి గ్రామ సరిహద్దు నుంచి లక్ష్మారెడ్డిపల్లి వరకు సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పున వరద ప్రవహించింది. మధ్యలో ఉన్న మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. గ్రామంలోని 280 ఇళ్లలోని సుమారు వెయ్యి మంది సమీపంలోని భవనాలపైకి ఎక్కి తడుచుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇద్దరు వరద నీటి నుంచి తప్పించుకునేందుకు చెట్టుపైకి ఎక్కి కూర్చుండిపోయారు. వరదలో గ్రామానికి చెందిన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, గంగడి సరోజన, గడ్డం మహాలక్ష్మి, మరికొందరు గల్లంతయ్యారు. బోట్ల సాయంతో కొందరిని రక్షించారు. సాయంత్రానికి వరద తగ్గింది. ఇక బాధితులను కాపాడేందుకు వచ్చిన రెండు హెలికాప్టర్లు.. చిట్యాల మండలంలో మోరంచవాగులో చిక్కుకున్న అస్సాం, జార్ఖండ్‌లకు చెందిన ఆరుగురు బ్రిడ్జి నిర్మాణ కార్మికులను కాపాడి ఒడ్డుకు చేర్చాయి. ♦ పెద్దవంగర మండలం పొచంపల్లి ఎర్రకుంట చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. కొంపల్లి, మహబూబ్‌పల్లి గ్రామాల మధ్య కాలువలో కొట్టుకుపోయి జోగు సంజీవ్ అనే వ్యక్తి చనిపోయాడు. ♦ ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం మారేడుగొండ చెరువుకు గురువారం తెల్లవారుజామున 3 చోట్ల గండిపడటంతో పక్కనే నివసించే బండ సారయ్య, ఆయన భార్య, తల్లి వరదలో కొట్టుకుపోయారు. సారయ్య మృతదేహం లభ్యమైనా మిగతా వారి ఆచూకీ దొరకలేదు. ♦ హనుమకొండ జిల్లా కన్నారం గ్రామానికి చెందిన పొన్నాల మహేందర్ (32) కన్నారం చెరువు మత్తడి నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. ♦ వరంగల్‌లోని 56వ డివిజన్ టీఎన్జీవోస్ కాలనీ–2కు చెందిన గట్టు రాజు(37) వరదలో గల్లంతయ్యాడు. -
ప్రకృతి కాంత హోయలు.. రెండు హరివిల్లులు
సాధారణంగా ఆకాశంలో ఇంద్రధనస్సు ఒక సమయంలో ఒకటే ఏర్పడుతుంది. అయితే ఆదివారం నిజామాబాద్ జిల్లా నందిపేట్ గ్రామ శివారులో రెండు ఇంద్రధనుస్సులు ఏర్పడ్డాయి. సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షం కురిసిన అనంతరం రంగుల హరివిల్లు ఇలా వెల్లివిరిసింది. –ఇందూరు(నిజామాబాద్ అర్బన్) పంటలను ముంచిన బ్యాక్‌వాటర్ మహదేవపూర్: మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వచ్చిన వరదలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అబట్పల్లి వద్ద మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్లో 79 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో బ్యాక్‌వాటర్‌తో కొంగలవాగు, పెద్దంపేట వాగు ఉప్పొంగి సూరారం, పెద్దంపేట గ్రామాల్లోని దాదాపు 300 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. నష్టం అంచనా వేసి సాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బ్యారేజీలో 94.80 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉందని, ప్రస్తుతం కురిసిన వర్షానికి 25,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొన్నారు. -
అత్తామామల వేధింపులు తాళలేక ‘అల్లుడి’ ఆత్మహత్య..
సాక్షి, గార్ల(జయశంకర్ భూపాలపల్లి) : అత్తామామల వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన అల్లుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా గార్లలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం బజార్‌కు చెందిన బరిబద్దల రాకేష్(26)కు నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన స్నేహతో ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన నాటి నుంచి అత్తామామలు మునీందర్, రేణుకతో పాటు ఇతర బంధువులు రాకేష్‌ను వేధిస్తున్నారు. ఏం పనిచేయకుండా జులాయిగా తిరుగుతూ భార్యను ఎలా పోషిస్తావంటూ ఫోన్లో మానసికంగా వేధించేవారు. దీంతో రాకేష్ బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మృతుడు రాకేష్ భార్య స్నేహ ఇరవై రోజుల క్రితమే బాబుకు జన్మనిచ్చింది. మృతుడి తండ్రి రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై డి.నాగేశ్వరరావు తెలిపారు. చదవండి: ఘోరం: కన్నబిడ్డకు విషమిచ్చి చంపిన తల్లి.. -
గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు
సాక్షి, ములుగు : దీపావళి పండుగ రోజున ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగరాయపురం గ్రామానికి చెందిన16మంది గోదావరి స్నానానికి వెళ్లగా.. నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. వారిలో శ్రీకాంత్, తుమ్మ కార్తీక్, అన్వేష్, ప్రకాష్ ఉన్నారు. ప్రస్తుతం గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మరికాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
మానవత్వం మరిచారు..!
సాక్షి, భూపాలపల్లి : ఆపదలో ఉన్న ఓ మహిళను ఆస్పత్రికి చేర్చాల్సిన 108 సిబ్బంది ఆమె గుండె కొట్టుకోవడం లేదని చెప్పడం, అప్పటిదాకా ఆమెను తరలించిన ఆటో డ్రైవర్ నిజంగానే చనిపోయిందేమోనని మార్గ మధ్యంలోనే వదిలేసి వెళ్లడం, కరోనా భయంతో సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సమయానికి వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. ఈ అమానవీయ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన శంకరమ్మ (45) మొక్కు తీర్చుకోవడానికి మంచిర్యాల జిల్లా భీమారం మండలం తాళ్లగూడెంలో ఉండే తన చెల్లి ఇంటికి మంగళవారం వచ్చింది. అక్కడ ఆమె శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతూ పడిపోయింది. నోటి నుంచి నురుగులు, ముక్కు నుంచి రక్తం రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. అది రావడం ఆలస్యమవడంతో ఆమెను ఆటోలో తీసుకుని బయల్దేరారు. జైపూర్ మండలం వెలిశాల సమీపంలోకి రాగానే 108 వాహనం వారికి ఎదురైంది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శంకరమ్మను ఆటోలోనే పరీక్షించిన 108 సిబ్బంది ఆమె గుండె కొట్టుకోవడం లేదని, పల్స్ పడిపోయిందని చెప్పి ఆస్పత్రికి తరలించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్ సైతం మహిళను రోడ్డుపైనే దింపి వెళ్లిపోగా, ఆ కుటుంబం సహాయం కోసం ఎంతమందిని వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రైవేటు అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. దానిలో మంచిర్యాలకు తరలిస్తుండగానే శంకరమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా వైద్యసాయం అందాల్సినవారిని తక్షణమే ఆస్పత్రికి తరలించాల్సిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కరోనా భయంతో ఎవరూ దగ్గరకు రాకపోవడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
కాళేశ్వరం వద్ద పటిష్ట భద్రత
కాళేశ్వరం: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మావోయిస్టుల యాక్షన్ టీంలు సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించడంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో మావోల కదలికలపైన నాలుగు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన, మేడిగడ్డ బ్యారేజీల పైనుంచి మహారాష్ట్ర–తెలంగాణకు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపు గల మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. గోదావరి ప్రవాహం తగ్గుతుండటంతో అటువైపున పోలీసులు దృష్టి పెట్టారు. మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌హౌస్, గ్రావిటీ కాల్వల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు, సివిల్ పోలీసులు పహారా కాస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఓఎస్డీ శోభన్‌కుమార్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐలు నర్సయ్య, హతిరాం, కాళేశ్వరం ఎస్సై శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, డిస్ట్రిక్ట్ గార్డ్స్, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
ఎన్నికల్లో ఓటమి: అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, భూపాలపల్లి : మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. పట్టణంలోని 5వ వార్డు నుంచి టీఆర్ఎస్ తరపున పోటీచేసిన సింగనవేన విజేత ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె భర్త చిరంజీవి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమి లేదని వైద్యులు వెల్లడించారు. సంఘటన తెలిసిన అనంతరం మాజీ స్పీకర్, వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి బాదితుడిని పరామర్శించారు. కాగా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి చిరంజీవి ఓడిపోగా.. ఈసారి కూడా 78 ఓట్ల తేడాతో ఆయన భార్య ఓడిపోయారు. ఎన్నికల కోసం గతంలో రూ. 8 లక్షలు, ప్రస్తుతం రూ. 15 లక్షలు ఖర్చు చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. -
బొగ్గుగని కార్మికుల టోకెన్ సమ్మె విజయవంతం
సాక్షి, భూపాలపల్లి: బొగ్గు పరిశ్రమల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని బొగ్గుగని కార్మికులు మంగళవారం చేపట్టిన టోకెన్ సమ్మె విజయవంతమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొగ్గుగని కార్మికులు స్వచ్ఛందంగా టోకెన్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెతో భూపాలపల్లి ఏరియాలోని 6700 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో సుమారు 7 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగి, సంస్థకు 2 కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్‌లోని కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెలో టీజీజీకేఎస్, ఏఐటీసీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీసీ, సీఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, బీఎమ్ఎస్ వంటి పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. సుమారు 600 మంది బొగ్గుగని కార్మికులు పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు బొగ్గు పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులపై తమ నిరసనను తెలిపారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టోకెన్ సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎమ్ఎస్, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూతో పాటు కోల్ ఇండియా సంఘాలు.. సింగరేణిలో ఒక్క రోజు టోకెన్ సమ్మెకు పిలుపు నిచ్చాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీజీజీకేఎస్ కూడా సమ్మెకు మద్దతు తెలిపింది. మణుగూరు ఏరియాలో అత్యవసర విధులకు సంబంధించిన కార్మికులు తప్ప, మిగతా 90 శాతం మంది కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో మణుగూరు ఏరియాలో సుమారు 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. -
ఆర్టీసీ బస్సు బోల్తా
కాటారం(మల్హర్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ పీవీనగర్ వద్ద కాటారం – మంథని ప్రధాన రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రయాణికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోదావరిఖని డిపోకు చెందిన (ఏపీ 01 వై 2992) నంబర్ అద్దె బస్సు గోదావరిఖని నుంచి మంథని మీదుగా భూపాలపల్లికి 63 మంది ప్రయాణికులతో బయలుదేరింది. పెద్దపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన అడవిసోమన్‌పల్లి మానేరు వంతెన దాటిన అనంతరం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు రోడ్డు పక్కకు దిగి పల్టీ కొట్టింది. దీంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు అప్రమత్తమై బస్సు లోపల భాగాలను గట్టిగా పట్టుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, 30 మంది ప్రయాణికులు తీవ్రగాయాలపాలవ్వగా మరో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాణికుల తల, కాళ్లు, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలయ్యాయి. పలువురికి తీవ్ర రక్తస్రావమైంది. బాధితులు 108, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో క్షతగాత్రులను కాటారం, మహదేవపూర్, మంథని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయించారు. -
కేంద్రంలో చక్రం తిప్పేది కేసీఆరే
సాక్షి, భూపాలపల్లి: ఎన్నికల అనంతరం కేంద్రంలో చక్రం తిప్పేది సీఎం కేసీఆరే అని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి 17 స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో చక్రం తిప్పుతామన్నారు.మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఎస్సార్ ఫంక్షన్‌హాల్ నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి అధిక మెజారిటీ ఇస్తే అభివృద్ధి ఆగదని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. తనకు అధిక మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. చక్రం తిప్పేది మనమే.. ఫెడరల్‌ఫ్రంట్ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే చక్రం తిప్పడమే కాదు ఏకంగా ఢిల్లీ గడ్డపై కేసీఆర్ కూర్చుండే అవకాశం ఉందని ఆయన అన్నారు. అన్ని ఎంపీ స్థానాల్లో గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నడుచుకుంటూ వస్తోందన్నారు. 16 ఎంపీ స్థానాలు ఉంటేనే కేంద్రంలో చక్రం తిప్పుతారా అని బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయని, కేవలం 2 ఎంపీ స్థానాలతో తెలంగాణ తెచ్చిన విషయం మర్చిపోయారా అని గుర్తు చేశారు. దేశం మొత్తం టీఆర్ఎస్ పథకాలనే కాపీ కొడుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో 24 గంటల కరెంట్ లేదు, రైతుబంధు లేదు, అభివృద్ధి పనులు లేవని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ దుకాణం ఎత్తేసిందని త్వరలో ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి అధిక మెజారిటీతో పసునూరి దయాకర్‌రావును గెలిపించారని, ఈ సారి కూడా అదే స్ఫూర్తితో భారీ మెజారిటీ అందించాలని కార్యకర్తలను కోరారు. ఏ గ్రామంలో అయితే 80 శాతం ఓట్లు టీఆర్ఎస్కు వస్తాయో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని దయాకర్‌రావు అన్నారు. 65వేలకు పైగా మెజారిటీ రావాలి.. లోక్‌సభ ఎన్నికల్లో భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 65 వేలకు పైగా మెజారిటీ రావాలని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. అభివృద్ధి రుచిచూడాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. వందకు వందశాతం 16 స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, గిరిజన యునివర్సిటీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని, స్వయంగా కేసీఆరే ప్రధానిని అడిగిన పట్టించుకోలేదన్నారు. అదే మనకు 16 స్థానాలు ఉంటే అన్నింటిని సాధించుకోవచ్చని కడియం శ్రీహరి అన్నారు. పొరపాట్లు జరిగేతే క్షమించండి.. తన వల్ల పొరపాట్లు జరిగితే క్షమించాలని, ఎంపీ ఎన్నికల్లో మాత్రం భారీ మెజారిటీ అందించి పసునూరి దయాకర్‌ను గెలిపించాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి కోరారు. భూపాలపల్లి నియోజకవర్గానికి ఎంపీ ఎన్నికలు మంచి అవకాశమని, అభివృద్ధి చెందడానికి మరో అవకాశం వచ్చిందని అన్నారు. భూపాలపల్లి అభివృద్ధి కోసం ఓట్ల రూపంలో కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఆయన అన్నారు. జిల్లా కేంద్రం ఇక్కడే.. కానీ కండీషన్ అప్లై ఇటీవల జిల్లా కేంద్రం తరలింపుపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్న తరుణంలో కార్యకర్తల సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. మధుసూదనాచారి జిల్లా కేంద్రం తరలింపుపై స్పష్టత ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లిని కోరారు. ఎర్రబెల్లి ప్రసంగించే సమయంలో జిల్లా కేంద్రం ఎక్కడికి పోదని, అన్ని కార్యాలయాలకు భవనాలు ఇక్కడే కట్టిస్తాం అని అన్నారు. అయితే ఇది మీరిచ్చే మెజారిటీపై ఆధారపడుతుందని కార్యకర్తలతో అన్నారు. మెజారిటీ రాకపోతే జిల్లా కేంద్రం తరలింపుపై ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు జిల్లా కార్యకర్తలు పాల్గొన్నారు. -
జలపాతం... ప్రకృతి గీతం
ఎటు చూసినా ప్రకృతి రమణీయతే. కొండా కోనల మధ్యఎగిసిపడే నీటి పరవళ్లు. మనసుకు హాయిగొలిపే సుందర దృశ్యాలు. కనుచూపు మేర చక్కదనాల పచ్చదనాలు. లయల హొయలొలుకుతూ జాలువారే జలపాతాలు. గుట్టలపై నుంచి దూకుతూ సవ్వడి చేసి నీటి సరిగమల సరాగాలు. తనివితీరా జలకాలాడి అపురూప జ్ఞాపకాలను మదిలో దాచుకోవాల్సిందే. ప్రకృతి ప్రేమికులు ఆనంద పారవశ్యంలో ఓలలాడాల్సిందే. ఇదిగో అలాంటి జలపాతాలు పర్యాటకులను ఊరిస్తున్నాయి. రా.. రమ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణలోని జయశంకర్ భూపాల్పల్లి, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలు జలపాతాలకు వేదికగా నిలుస్తున్నాయి. జయశంకర్‌భూపాల్‌పల్లి జిల్లా ఏటూరునాగారం సమీపంలోని కొండ కోనల్లో బొగత జలపాతం పాలధారలను తలపిస్తూ ఎగసిపడుతోంది. పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. హైదరాబాద్ నగర పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ఆ వివరాలు ఇవీ.. బొగత.. వెళదాం ఇలా.. ♦ పర్యాటకుల డిమాండ్‌ను బట్టి హైదరాబాద్ నుంచి బొగత జలపాతానికి టీఎస్‌టీడీసీ ప్యాకేజీలు ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాల్లో వీలైనన్ని బస్సులు నడుపుతోంది. ♦ చార్జి: పర్యాటకులు టోల్, పార్కింగ్, ఎంట్రీ రుసుముతో కలిపి ఏసీ బస్సుకు ఒక్కొక్కరు రూ. 1500, నాన్ ఏసీ బస్సుకు రూ. 1400 చెల్లించాలి. ఆహారం ఖర్చులు అదనం. ♦ ఉదయం 7 గంటలకు బషీర్‌బాగ్ టూరిజం కార్యాలయం చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు బయలుదేరుతుంది. 7.30కు సికింద్రాబాద్‌లోని యాత్రీ నివాస్‌కు చేరుకొంటుంది. అక్కడి నుంచి లక్నవరం చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి, బొగత జలపాతాన్ని తిలకించిన తర్వాత హన్మకొండలోని టూరిజం హరిత హోటల్లో డిన్నర్ ముగించుకొని తిరిగి హైదరాబాద్ బయలు దేరుతారు. కుంటాల, పొచ్చెరకు ఇలా.. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన జలపాతాలైన కుంటాల, పొచ్చెర జలపాతాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. ఉదయం 7 గంటలకు బషీర్‌బాగ్‌లోని టూరిజం కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. 7.30కి సికింద్రాబాద్ యాత్రీ నివాస్‌కు చేరుకొంటుంది. అక్కడ నుంచి నేరుగా కుంటాల, పొచ్చెర జలపాతాలకు తీసుకెళ్తారు. అక్కడి జలపాతాలను పర్యాటకులు చూసిన తర్వాత తిరిగి బయలుదేరి హైదరాబాద్‌కు రాత్రి 10 గంటలకు చేరుకొంటారు. చార్జీలు: టోల్, పార్కింగ్, ఎంట్రీ రుసుముతో కలిపి ఒక్కొక్కరికి ఏసీ బస్సుకు రూ.1500, నాన్ఏసీ బస్సుకు రూ.1400 చెల్లించాలి. భోజన ఖర్చులు అదనం. ఇదే మంచి తరుణం.. జలపాతాల అద్భుత దృశ్యాలను చూసే అనువైన సమయం. జలపాతాలను చూసేందుకు గైడ్ సదుపాయం ఉంది. ఈ యాత్ర గొప్ప పర్యాటకులకు గొప్ప జ్ఞాపకంగా మిగులుతుంది. గ్రేటర్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – బి.మనోహర్, టీఎస్‌టీడీసీ ఎండీ రిజర్వేషన్ల కోసం... బషీర్‌బాగ్ కార్యాలయం (040– 29801039,40), 9848540371, ట్యాంక్‌బండ్ కార్యాలయం ( 040– 2350165), 9848125720, యాత్రీ నివాస్ 040– 27893100, 9848126947, కూకట్పల్లి 040–23052028, 984854037, టోల్ ఫ్రీ: 1800 42546464లోసంప్రదించవచ్చు. -
మూడు జిల్లాల్లో ‘కృషి కళ్యాణ్’
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, అనుబంధరంగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తగిన సబ్సిడీలు ఇస్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్రం ఈ నెల ఒకటో తేదీ నుంచి కృషి కళ్యాణ్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 111 జిల్లాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమురం భీం జిల్లాల్లో అమలు చేయనుంది. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఆ 3 జిల్లాల్లో 75 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. జూన్ మొదటి తేదీ నుంచి జూలై 31 వరకు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆ గ్రామాల్లో ప్రణాళిక అమలు చేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. భూసార కార్డుల పంపిణీ.. ఈ పథకంలో భాగంగా గ్రామంలో పూర్తిగా భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేస్తారు. పప్పులు, నూనెగింజలకు సంబంధించి రైతులందరికీ మినీకిట్స్ ఇస్తారు. రైతు కుటుంబంలోని ఐదుగురికి ఉద్యాన, వెదురు మొక్కలను పంపిణీ చేస్తారు. పశువులకు వచ్చే బోవైన్ వ్యాధి వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం ఇస్తారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కృషి విజ్ఞాన కేంద్రాలతో రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వంటివి కృషి కళ్యాణ్ అభియాన్ పథకంలో ఉన్నాయి. యంత్రాల కొనుగోలుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తాయి. మొత్తం సబ్సిడీ రూ.2.5 కోట్లు మించరాని కేంద్రం స్పష్టం చేసింది. -
సైకో వీరంగం: ఒకరి మృతి
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో మంగళవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. మండలంలోని జాకారం గ్రామంలో వృద్ధుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అంతే కాకుండా సమీపంలోని బాలికల వసతిగృహంపైనా దాడికి దిగాడు. ఈ దాడిలో కాపలాగా ఉన్న వాచ్మెన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు సైకోను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. సైకోను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతి చెందిన వృద్ధుడిని అబ్బాపూర్ గ్రామస్తుడు కొంగొండ నర్సయ్య(75) గా గుర్తించారు. గాయపడిన వాచ్‌మెన్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పోలీసులే లక్ష్యంగా.. మందుపాతరలు
వెంకటాపురం: భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం(నుగూరు) మండల పరిధిలోని పాలేం వాగు సమీపంలో శనివారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోలు అమర్చిన మందుపాతరను గుర్తించారు. ప్రాజెక్ట్ సమీపంలోని కొప్పుగుట్ట వద్ద మావోలు అమర్చిన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు.