గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు | Four People Missing In Godavari At Mulugu | Sakshi
Sakshi News home page

గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు

Published Sat, Nov 14 2020 6:46 PM | Last Updated on Sat, Nov 14 2020 7:57 PM

Four People Missing In Godavari At Mulugu - Sakshi

సాక్షి, ములుగు : దీపావళి పండుగ రోజున ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగరాయపురం గ్రామానికి చెందిన16మంది గోదావరి స్నానానికి వెళ్లగా.. నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. వారిలో శ్రీకాంత్, తుమ్మ కార్తీక్, అన్వేష్, ప్రకాష్ ఉన్నారు. ప్రస్తుతం గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మరికాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement