mulugu
-
ములుగులో ముస్తాబైన కొత్త ఐలాండ్
-
మాయలేడి.. జగత్ కిలాడి!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ మృతికి కారణమైన యువతిపై ఆరా తీస్తున్న పోలీసులకు, నిఘావర్గాలకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. యువతి గత మూడేళ్లలో ప్రేమ పేరిట ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీశ్ నాలుగో వ్యక్తిగా చెబుతున్నారు. పూర్వ నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి స్కెచ్ వేస్తే చాలు.. ఎదుటివారికి దిమ్మతిరిగి పోవాల్సిందే. కొంతకాలం హైదరాబాద్ హయత్‌నగర్ ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పలువురిని ఆకట్టుకుని, ఆపై వారిని అష్టకష్టాలు పెట్టినట్లు ఒక్కొక్కొటిగా విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఆ యువతిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కావడానికి కారణంతో పాటు ఓ ఎస్ఐ, మరో న్యాయమూర్తిపై ప్రైవేట్ కంప్లయింట్ చేయడం పూర్వ నల్లగొండ జిల్లాలో అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై సూర్యాపేట జిల్లాతో పాటు హయత్‌నగర్‌లోనూ తనను ప్రేమించి మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అన్నీ గుర్తించే దూరం పెట్టిన హరీశ్? కొద్దిరోజులుగా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా చిట్‌చాట్ చేసిన ఎస్ఐ హరీశ్.. ఆమె గురించి పలు విషయాలు తెలిశాకే దూరం పెట్టారన్న చర్చ జరుగుతోంది. తనకున్న సోర్స్ ద్వారా ఆమె ప్రవర్తన తెలుసుకున్న హరీశ్ ఆమెను దూరం పెట్టారని మరో వాదన వినిపిస్తున్నది. అయితే ఇటీవల హరీశ్‌కు హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరి ఈనెల 14న నిశి్చతార్థం కూడా జరగబోతున్నదని తెలుసుకున్న సదరు యువతి మళ్లీ వెంటబడినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఈనెల 1న నేరుగా వాజేడు పోలీసుస్టేషన్‌కే చేరుకున్న ఆమె.. హంగామా చేసి పరువు తీసే ప్రయత్నాన్ని హరీశ్ పసిగట్టాడు. ఈ క్రమంలో రాజీ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఆ మాయలేడి పన్నాగంలో చిక్కుకుని విలవిల్లాడిన హరీశ్.. ప్రాణంకంటే పరువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చి తనువు చాలించడం అందరినీ కలచి వేసింది. కాగా, తమ కుమారుడి ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆ యువతిని విచారించి న్యాయం చేయాలని హరీశ్ తండ్రి రుద్రారపు రాములు తాజాగా పోలీసు అధికారులను కోరారు. ఇదే సమయంలో హరీశ్ సోదరుడు, సీఆర్పీఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్న కుమారస్వామి కూడా గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన సోదరుడి ఆత్మహత్యపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. -
ములుగు ఎన్కౌంటర్: మధు మృతదేహం అప్పగింతకు ఆదేశం
హైదరాబాద్, సాక్షి: ములుగు జిల్లా ఏటూరు నాగారం మావోయిస్టుల ఎన్కౌంటర్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. మల్లయ్య అలియాస్ మధు మృతదేహాన్ని కూడా భార్య ఐలమ్మకు అప్పగించాలని ఆదేశించింది. శుక్రవారం(నవంబర్ 6) మధ్యాహ్నాంలోగా అప్పగింత పూర్తి చేయాలని.. మృతదేహంపై గాయాలుంటే గనుక ఫొటోలు, వీడియోలు తీయాలని స్పష్టం చేసింది. ఏటూరునాగారం మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. గత విచారణలో.. ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల్లో ఈగోలాపు మల్లయ్య అలియాస్ మధు తప్ప మిగిలిన ఆరుగురి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. మల్లయ్య మృతదేహం అప్పగించకపోవడంతో.. భార్య ఐలమ్మ అలియాస్ మీనా హైకోర్టును ఆశ్రయించారు.గత విచారణలో.. ‘‘ఈ ఎన్కౌంటర్ బూటకమని, మావోయిస్టులు తినే ఆహారంలో మత్తుపదార్థాలు కలిపి చిత్రహింసలు పెట్టి చంపారు’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్ కుమార్. అలాగే.. శవ పంచనామాలో కుటుంబసభ్యులను అనుమతించలేదని, పోస్ట్‌మార్టం ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో జరగలేదని పేర్కొన్నారు. మల్లయ్య మృతదేహాన్ని చూడటానికి ఐలమ్మను కేవలం 10 నిమిషాలే అనుమతించారని, ఈ కొద్ది సమయంలోనే ఆమె తన భర్త మృతదేహంపై దాదాపు 11 గాయాలను గుర్తించారని తెలిపారు. శవ పంచనామాకు పిటిషనర్‌ను అనుమతించలేదన్నారు. ఎన్‌హెచ్చార్సీ మార్గదర్శకాల ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో శవ పంచనామా జరిపించేలా ఆదేశించాలని కోరారు. ఇది ఎన్కౌంటర్ కాదని.. కస్టోడియల్ డెత్ అని ఆరోపించారు. వాదనలు నమోదు చేసుకున్న విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. పిటిషనర్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమె భర్త మల్లయ్య మృతదేహం తప్ప మిగితావాళ్లవి వారి బంధువులు అడిగితే అప్పగించాలని స్పష్టం చేసింది. పోస్ట్‌మార్టం ఎగ్జామినేషన్, శవపంచనామా నిర్వహణలో అనుసరించిన విధానంపై సంక్షిప్త వివరాలు సమర్పించాలని పేర్కొంది. ఇవాళ.. మృతదేహం అప్పగింతపై ఆదేశాలిచ్చింది.చల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఈ నెల 1న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు మరణించిన ఘటనపై కలెక్టర్ దివాకర ఇదివరకే విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ములుగు ఆర్డీవో వెంకటేశ్‌ను నియమించారు. -
రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓ యువతి వేధింపుల కారణంగానే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. తమ కుమారుడి మృతికి సదరు యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి ఏడు నెలల కిందట హరీష్‌కు కాల్ చేసింది. మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్‌లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి ఎస్ఐ హరీష్ ఆరా తీశాడు. దీంతో అతనికి కొన్ని విషయాలు తెలిశాయి.ఈ 26 ఏళ్ల యువతిది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం. ఊళ్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయింది. ఈ విషయాలను తెలుసుకున్న హరీశ్.. ఆమె పెళ్లి ప్రతిపాదనను నిరాకరించాడు. ఇంట్లో వాళ్లు చూసే సంబంధాన్ని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్ల కట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ఈ క్రమంలో వారిద్దరి మధ్య అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎస్సై ప్రయత్నించగా, సదరు యువతి అందుకు అంగీకరించకలేదు. అంతేకాకుండా తమ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన హరీశ్ తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తమ కుమారుడి మృతికి యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ నెల ఆరో తేదీన హరీష్‌కు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. -
ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ.. రేపటికి వాయిదా
సాక్షి,హైదరాబాద్ : ఆదివారం (డిసెంబర్ 1) ఉదయం 6.15 గంటల సమయంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు–గ్రేహౌండ్స్ బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రకటించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన ఒక మావోయిస్టు ఉండగా మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని ఆయన తెలిపారు.అయితే, చెల్పాక ఎన్‌కౌంటర్‌పై పోలీసులు, రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్పాక ఎన్కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పౌరహక్కుల సంఘం పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణ సందర్భంగా పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత చిత్ర హింసలకు గురిచేసి ప్రాణలు తీసినట్లు తెలిపారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారన్న న్యాయవాది..ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు. అయితే, అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగిందని,ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మృతదేహాలను రేపటి వరకు భద్ర పర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ భద్రపరిచిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్
సాక్షి,వరంగల్: ములుగు జిల్లాలో ఆదివారం(డిసెంబర్1) తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఏటూరునాగారం చల్పాక సమీపంలో కూంబింగ్ చేస్తుండగా గ్రేహౌండ్స్ బలగాలకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నారు.ఎన్కౌంటర్లో మృతిచెందింది వీళ్లే..1. కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, టీఎస్సీఎమ్ కార్యదర్శి ఇల్లందు-నర్సంపేట 2. ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్పూర్ 3. ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్4. ముస్సాకి జమున 5. జైసింగ్, మావోయిస్టు పార్టీ సభ్యుడు6.కిషోర్, మావోయిస్టు పార్టీ సభ్యుడు7.కామేష్, మావోయిస్టు పార్టీ సభ్యుడు -
మేడారం మినీ జాతర తేదీలు ఖరారు
సాక్షి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పేరుగావించిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. ఈ మేరకు శనివారం సమావేశమైన మేడారం పూజారులు.. మినీ జాతర తేదీలను ప్రకటించారు. జాతరకు సంబంధించిన ఏర్పాటు ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం కోరింది.కాగా ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలోనే వచ్చే భక్తులు ప్రస్తుతం ఏడాది పొడవునా తమకు అనుకూలమైన సమయంలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనంలో కొలువైన వనదేవతలు జనం మధ్యకు రావడంతో అడవి అంతా జనసంద్రమవుతుంది. మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
మాకు రారా కొత్త టీచర్లు?
వాజేడు: చదువుకునేందుకు విద్యార్థులున్నా.. ఉపాధ్యాయులు లేని పాఠశాల అది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల బదిలీల్లో ఇక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు కాచారం, మరొకరు మంగపేట మండలం చుంచుపల్లికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఒక ఉపాధ్యాయినిని నియమించగా.. ఆమె బీఈడీ ఓడీలో ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. కాగా, పే సెంటర్ ఇన్చార్జ్ హెచ్ఎం కేశవరావు ఇతర పాఠశాలల ఉపాధ్యాయుల్లో రోజుకొకరిని జంగాలపల్లి పాఠశాలకు పంపిస్తూ నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీలోనూ ఈ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.66 మందికి ఇద్దరే టీచర్లా?అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం.. పర్వత్‌పల్లి పాఠశాలకు తాళంబషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పర్వత్‌పల్లి ప్రాథమిక పాఠశాలకు గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 66 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారని, అందులో భరత్ అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడిని బుధవారం అధికారులు రిలీవ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తుంటే తమ గ్రామానికి ఎందుకు నియమించలేదని నిలదీశారు. టీచర్లు లేని పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్‌ను పాడు చేయలేమని స్పష్టం చేశారు. కొత్తగా ఉపాధ్యాయులను నియమించే వరకు పిల్లలను బడికి పంపేదిలేదంటూ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాఠశాలలో సద్దాం హుస్సేన్, రవీందర్‌రెడ్డి అనే ఇద్దరు టీచర్లే లిఉన్నారని వీరు ఐదు తరగతులకూ పాఠాలు ఎలా బోధిస్తారో అధికారులే చెప్పాలన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు చెప్పారు. మరోవైపు త్వరలో కొత్త టీచర్లు వస్తారని, విద్యార్థులను బడికి పంపాలని ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చూడండి: డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు (ఫొటోలు) -
వాయుగుండాలు.. పెనుగాలులు.. క్లౌడ్ బరస్ట్!
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం–తాడ్వాయి అటవీ ప్రాంతంలోని 332 హెక్టార్ల పరిధిలో ఆగస్టు 31న సుమారు 50 వేల చెట్లు నేలకూలడానికి గల శాస్త్రీయ కారణాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు అటవీశాఖ అధికారులతో చర్చించారు. మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో పీసీసీఎఫ్ డోబ్రియాల్ ఆధ్వర్యంలో ఈ అంశంపై వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), జాతీ య వాతావరణ పరిశోధన ప్రయోగశాల (ఎన్ఏఆర్ఎల్), ఎ¯న్జీఆర్ఐ, ఐఎండీ శాస్త్రవేత్తలు, ఎ¯న్ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏకకాలంలో ఏర్పడిన వాయుగుండాల వల్ల పెను గాలులు వీయడంతోపాటు కుంభవృష్టి (క్లౌడ్ బరస్ట్ ) వర్షాలు కురవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలోని సారవంతమైన నేల కూడా భారీ స్థాయిలో చెట్లు కుప్పకూలేందుకు దారితీసిందని భావిస్తున్నట్లు చెప్పారు. అక్కడి నేలలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల వాటి వేర్లు భూమి లోపలకు బదులు అడ్డంగా విస్తరించడం వల్ల చెట్లు 130– 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులను తట్టుకోలేక పడిపోయి ఉండొచ్చన్నారు. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే చెట్లు కూలిన ప్రదేశంలో సారవంతమైన భూమి ఉన్నందున చెట్ల పునరుజ్జీవనానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో కేంద్ర, రాష్ట్రాలకు నివేదిక.. పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ మాట్లాడుతూ చెట్లు నేలకొరిగిన ప్రాంతంలో కలుపు మొక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని తద్వారా చెట్లు త్వర గా పెరిగే అవకాశం ఉంటుందని అటవీ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు ములుగు డీఎఫ్‌వో రాహుల్ కిషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అటవీ నష్టాన్ని శాస్త్రవేత్తలకు వివరించారు. వర్క్‌షాపులో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
కోడి పందేల స్థావరంపై దాడి.. 14 మందిని అరెస్ట్
వాజేడు: లక్షీపురం, గెర్రగూడెం గ్రామాల శివారులోని ఊర చెరువు వద్ద కోడి పందేల స్థావరంపై వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు.పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొంతమంది కోడి పందేలు ఆడుతూ పోలీసులను చూసి పారిపోయారు. పారి పోతున్న వారిని వెంబడించి పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.ఈ దాడిలో 14 మందిని అదుపులోకి తీసుకోగా.. వారి నుంచి 5 కోడి పుంజులు, 4 కోడి కత్తులు, రూ.28,900 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరీశ్ తెలిపారు. -
బైరి నరేష్ అడ్డగింత.. తీవ్ర ఉద్రిక్తత
ములుగు, సాక్షి: ఏటూరు నాగారంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. నాస్తికుడు బైరి నరేష్‌పై అయ్యప్ప భక్తులు భగ్గుమంటున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. అందుకు కారణం.. బైరి నరేష్ వాహనం కారణంగా ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలు కావడమే. సోమవారం.. కోరేగావ్ సమావేశం కోసం బైరి నరేష్ ఏటూరు నాగారం వెళ్లాడు. అది తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు అయ్యప్ప స్వాములు. గతంలో అయ్యప్ప మీద చేసిన వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ బైరి నరేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నరేష్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అయితే నరేష్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అయ్యప్ప స్వాములు వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో.. నరేష్ వాహనం ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలయ్యాయి. బాధితుడ్ని పోగు నర్సింహారావుగా గుర్తించారు. దీంతో నరేష్‌ను అరెస్ట్ చేయాలంటూ స్వాములు అందోళన చేపట్టారు. గతంలో.. ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్ అంగీకరించాడు. -
అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క!
వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారిగా నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ములుగు జిల్లా ప్రారంభమయ్యే తొలి గ్రామం మహ్మద్‌గౌస్‌పల్లి నుంచి విజయోత్సవ ర్యాలీ మొదలైంది. ఇక్కడ కార్యకర్తలు మంత్రిని గజమాలతో సన్మానించారు. ర్యాలీ మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, జవహర్‌నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, పస్రా మీదుగా మేడారం వరకు కొనసాగింది. మహ్మద్‌గౌస్‌పల్లిలో గజమాలతో స్వాగతం గట్టమ్మకు చీర సారె.. గట్టమ్మ ఆలయం వద్ద మంత్రికి మహిళలు కోలాటాలు, బంజార, ఆదివాసీ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె గట్టమ్మ తల్లికి చీరసారె, పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి ప్రచార రథంలో ములుగు వరకు ర్యాలీగా వచ్చారు. మంత్రి పర్యటనకు ఎస్పీ గాష్‌ఆలం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కూచన రవళిరెడ్డి, కిసాన్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బానోత్ రవిచందర్, వంగ రవియాదవ్‌తోపాటు అధికార ప్రతినిధి అహ్మద్‌పాషా, సీనియర్ నాయకుడు బాధం ప్రవీణ్ కుమార్, ఒజ్జల కుమార్, ఇమ్మడి రాజుయాదవ్, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, రేవంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలే నా కుటుంబ సభ్యులు.. ర్యాలీ సందర్భంగా మల్లంపల్లి, ములుగులో సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గం నా ఇల్లు.. ప్రజలే నా కుటుంబ సభ్యులు.. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా ఉండలేదని, అధికారం ఉందనే భావనను మరిచి ప్రజల మధ్యలో ఉండి వారికి సేవ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నా ములుగు ఆడబిడ్డగా, ఆత్మీయ సోదరిగానే ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకుసాగుతానన్నారు. సమ్మక్కకు మొక్కుతున్న మంత్రి సీతక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని పార్టీ ప్రజా ప్రతినిధులను కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ, ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు సీతక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమక్క–సారలమ్మలను దర్శించుకున్న తర్వాత ఐటీడీఏ అతిథి గృహంలో మేడారం జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవి కూడా చదవండి: పాలనలో మార్పు చూపిస్తాం! : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు -
కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఆ నేతలు బీఆర్ఎస్లో చేరతారు: అమిత్ షా
ములుగు: కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్ఎస్లో చేరుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరించలేక.. గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య బీఆర్ఎస్ వివాదం సృష్టిస్తోందని మండిపడ్డారు. గిరిజనులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గిరిజనులను మోసం చేయడం కాంగ్రెస్ లక్షణమని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ అని చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోదీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అత్యధిక గిరిజన ఎంపీలు బీజేపీకి చెందినవారే ఉన్నారని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క పండుగలను జాతీయ పండుగగా చేయాలని ప్రకటించామని చెప్పారు. నవంబర్ 30న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ కూడా ఇక్కడే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తూప్రాన్‌లో జరిగిన సభలో మాట్లాడారు. అటు.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్ -
ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మకండి: కేసీఆర్
-
ఒక ఆదివాసీ బిడ్డగా కేసీఆర్ కు ఎందుకు నచ్చడం లేదు ?
-
సీతక్కకు ప్రచారం ఎక్కువ..పని తక్కువ: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, ఆమెకు పని తక్కువ ప్రచారం ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణభవన్‌లో ములుగుకు చెందిన బీజేపీ నేత రాములు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు హరీశ్‌రావు కండువా కప్పి ఆహ్వానించారు. చేరికల సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘ నిరుపేద అమ్మాయి నాగజ్యోతి. ములుగులో ఈసారి ఆమెను గెలిపించాలని కోరుతున్న. ఓడిపోతున్నానని తెలిసి కోపంతో సీతక్క ఇష్టం వచ్చినట్లు నోరు జారుతోంది. ఆమె ఓటమి ఖాయం. 5 గంటల కరెంట్ ప్రచారంతో అబాసుపాలైంది. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? వ్యవసాయానికి ఎంత హెచ్‌పీ మోటార్ వాడుతారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి. కర్ణాటక లో రెండు గంటల కరెంట్ కూడా రావటం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెప్తున్నాడు. వంద అబద్ధాలు ఆడైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. 11సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వడం కాంగ్రెస్‌కు చేతకాలేదు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం పక్కా. కేసీఆర్‌ను కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మేం తిట్టలేమా’ అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇదీ చదవండి.. నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య -
ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి..
సాక్షి, మహబూబాబాద్: పాము కాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన గుంజె స్వాతి, రాజు దంపతులు తమ కుమారుడు నిఖిల్(12)తో కలిసి ఇంట్లో కింద నిద్రించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున బాలుడి నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గమనించిన వైద్యులు బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు. కాగా, ఒక్కగానొక్క కొడుకు పాము కాటుతో మృతి చెందడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: సినిమాల్లో అవకాశాలు రాలేదని.. -
కవిత మీద సీతక్క ఫైర్
-
దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ బస్సు యాత్ర.. ములుగు బహిరంగ సభ లైవ్ అప్డేట్స్ 06:55PM ములుగు సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ►రామప్ప ఆలయం అద్భుతంగా ఉంది ►ఇంత అందమైన ఆలయాన్ని ఎప్పుడు చూడలేదు ►దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి ►కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చింది ►రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయం తీసుకోవు ►కానీ, కాంగ్రెస్ ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంది ►తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ గౌరవించింది ►కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి మోసం చేశారు ►అందరికీ ఉద్యోగాలిస్తామని కేసీఆర్ మోసం చేశారు ►ధరణి పోర్టల్‌లో అవినీతి జరిగింది ►రూ.లక్ష రుణమాపీ అన్నారు.. గుర్తుందా? చేశారా? ►కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు తన జేబులో వేసుకున్నారు ►దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారు ►బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే ►తెలంగాణ కోసం మరికొన్ని గ్యారెంటీలను ప్రకటిస్తున్నాం ►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ.2,500 ►రూ.500కే గ్యాస్ సిలిండర్ ►ఇళ్లకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితం ►తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములకు 250 గజాల జాగా ►నిరుద్యోగ యువతను కేసీఆర్ మోసం చేశారు ►సీఎం ఇస్తామన్న మూడెకరాల భూమి వచ్చిందా? ►కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చెప్పామో.. అదే చేశాం ►రాజస్థాన్‌లో ఉచిత వైద్యం అన్నాం .. ఇస్తున్నాం, అదీ దేశంలోనే అత్యుత్తమ సేవలతో! ►ఛత్తీస్‌గడ్‌లో రైతులకు రుణమాఫీ చేశాం ►రూ.2,500 మద్దతు ధరతో వరి కొనుగోలు చేస్తున్నాం ►కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం ►ప్రతీనెలా మహిళలు, రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నాం ►జల్, జమీన్, జంగల్ హామీలను కాంగ్రెస్ నెరవేర్చింది ►బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి ►పోడు భూములు, అసైన్డ్ భూముల విషయంలో న్యాయం చేస్తాం ►అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ►తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే 06:26PM ములుగు సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగం ►రామప్ప లాంటి అందమైన గుడిని ఎప్పుడూ చూడలేదు ►ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు ►మీ కలలు సాకారం అవుతాయని నమ్మి బీఆర్ఎస్కి ఓటేశారు ►పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని.. భవిష్యత్తు మారుతాయని అనుకున్నారు ►బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది ►తెలంగాణ కలను బీఆర్ఎస్ నాశనం చేసింది ►తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం జరగలేదు ►మీ కలను కాంగ్రెస్ అర్థం చేసుకుంది ►సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతం ►కాంగ్రెస్ హయాంలోనే ఐఐటీ, ఐఐఎంలు వచ్చాయి ►తెలంగాణ కోసం కాంగ్రెస్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ►తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోనియాగాంధీకి తెలుసు ►అయినా సోనియా గాంధీ మీ కోసం నిర్ణయం తీసుకున్నారు ►దూరదృష్టితో తెలంగాణ ఏర్పాటునకు కృషి చేశారు ►రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నారు ►మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చేందుకే నిర్ణయం తీసుకున్నారు ►తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ► లక్ష ఉద్యోగాల్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది ►నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే.. వారి వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్నారు ►కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ►తెలంగాణలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది ►వరి రూ. 2,500, మొక్కజొన్నకు రూ.2,200 మద్దతు ధర ఇస్తాం ►రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం ► ఇందిరమ్మ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తాం ►బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి కుటుంబానికే ప్రాధాన్యత దక్కింది ►అమరులను కాంగ్రెస్ గౌరవిస్తుంది.. శ్రీకాంత్ చారికి నా నివాళి ►బీఆర్ఎస్ కేబినెట్లో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు ►గల్ఫ్ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడతాం ►ఆదివాసీల హక్కుల్ని బీఆర్ఎస్ పెద్దలు లాక్కుంటున్నారు ►మీ భూముల నుంచి మిమ్మల్ని వెళ్లగొడుతున్నారు ►మీకు రావాల్సిన డెవలప్మెంట్ ఫండ్‌ను మళ్లిస్తున్నారు ►ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గిరిజనులకు ఇళ్లు ►గత కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పోడు భూముల పట్టాలు ఇచ్చింది ►18 ఏళ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాం ►ఈ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల భర్తీపై దృష్టి పెట్టలేదు ►రకరకాల మాఫియాలను ప్రొత్సహించింది ►మీ కోసం ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ తెచ్చింది ►గ్యారెంటీలు ఇస్తామన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పనులు మొదలుపెట్టాం 06:10PM ములుగు సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్ ►తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు ►అందుకే సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు ►ఆడబిడ్డల కోసం మహాలక్ష్మి పథకం తెస్తాం ►ప్రతీ నెల 1వ తేదీన రూ. 2,500 ఆడబిడ్డల ఖాతాలో జమ చేస్తాం ►అధికారంలోకి వస్తే రూ.500 కే సిలిండర్ఇస్తాం ►రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.15వేలు జమ చేస్తాం ►ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు ఫ్రీ ►మన బతుకులు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ►కళ్యాణ లక్ష్మి పేరుతో ఆడబిడ్డలకు తులం బంగారం ►ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కరీంనగర్ గడ్డ నుంచి సోనియా గాంధీ ప్రకటించారు ►ఇచ్చిన మాటకు సోనియా తెలంగాణ ప్రకటించారు ►తెలంగాణలో ఎక్కడ చూసిన అరాచకం, అవినీతి అధిపత్యం రాజ్యమేలుతోంది ►అవినీతి పాలనను పాతాలంలోకి తొక్కాలి ►తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని గాంధీ కుటుంబం వచ్చింది ►ఆరు గ్యారంటీ స్కీమ్ లతో ప్రజల ముందుకు వచ్చారు ►మహాలక్ష్మి గ్యారంటీ స్కీమ్ మహిళల కోసం సోనియా గాంధీ తెచ్చారు ►ప్రతినెల మహిళలకు 2500 ఇచ్చేందుకు సోనియా ముందుకు వచ్చారు ►500 రూ.లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే భాద్యత సోనియా గాంధీ తీసుకున్నారు ►రైతులకు మద్దతు ధర తో పాటు క్వింటాల్ కు 500 బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ►నిరుద్యోగ యువతకు యువ వికాస్ పథకం క్రింద 5 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ►షాదీముబారక్ కళ్యాణ లక్ష్మీ సహాయంతో పాటు తులం బంగారం ఇవ్వాలని నిర్ణయించాం 06:05PM ►రాష్ట్ర సంపదను ప్రజలకు పంచాలనే ఆరు గ్యారెంటీలను ప్రకటించాం: భట్టి ►ప్రతీ గ్యారెంటీని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి: భట్టి ►గిరిజనులకు పోడు భూములు పంచాలన్న చట్టాన్ని నిర్వీర్యం చేశారు.. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి: భట్టి ►ఆరు గ్యారంటీ స్కీమ్ లను తప్పకుండా అమలు చేస్తాం: భట్టి 06:00PM ►ములుగు బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక ►మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్న రాహుల్, ప్రియాంక ►తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ రాహుల్ ఫేస్బుక్ రీల్ ►బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి ►ఈ విజయయాత్ర రాబోయే మార్పుకి సంకేతమంటూ పోస్ట్ ►రాహుల్ మాటిస్తే కట్టుబడి ఉంటారు: ఎమ్మెల్యే సీతక్క ►కాంగ్రెస్ వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తాం ►అధికారంలోకి వచ్చాక ఆరుగ్యారంటీలు అమలు చేస్తాం 05:20PM ►రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్ విజయభేరి తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించిన రాహుల్, ప్రియాంక ►ములుగు రామానుజాపురం బహిరంగ సభా స్థలికి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ నేతలు ►కాసేపట్లో బహిరంగ సభ ►బహిరంగ సభ నుంచే మహిళా డిక్లరేషన్ ప్రకటన 05:10PM ►ప్రత్యేక పూజల అనంతరం.. రామప్ప ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంకలు ►ఆలయ చరిత్రను వివరిస్తున్న అధికారులు 04:52PM ►రామప్ప ఆలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ కీలక నేతల ప్రత్యేక పూజలు ►కాసేపట్లో కాంగ్రెస్ తొలి విడత బస్సు యాత్ర ప్రారంభం 04:42PM ►ములుగు జిల్లా రామప్ప కు చేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ►స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు. 04:30PM ►మరి కాసేపట్లో రామప్పకు చేరుకోనున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ. ►రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ►అనంతరం విజయభేరి బస్సు యాత్ర ప్రారంభం ►ఆదివాసీ గిరిజన సంప్రదాయ పద్ధతిలో రాహుల్, ప్రియాంక గాంధీ లకు స్వాగతం ►కోయ కళాకారులు లంబాడీలు డప్పు నృత్యాలతో స్వాగతం 04:15PM ►రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ►రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే సీతక్క ►కాసేపట్లో రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంకలు ► రామప్ప ఆలయం నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ► బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు బయల్దేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ►బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ► ములుగు జిల్లా నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటన కోసం భారీ బందోబస్తు ఏర్పాటు నేటి నుంచి కాంగ్రెస్ విజయభేరి తొలి విడత బస్సు యాత్ర. ములుగు జిల్లా రామప్పలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. అనంతరం సాయంత్రం జరిగే రామానుజాపురంలో బహిరంగ సభలో ప్రసంగించడంతో పాటు మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్న రాహుల్, ప్రియాంకలు. మూడు రోజులపాటు బస్సు యాత్రలో పాల్గొనున్న రాహుల్ గాంధీ. బస్సు యాత్రతో పాటు పాదయాత్రలో కూడా పాల్గొనున్న రాహుల్. -
డెంగీ జ్వరమే కదా.. అని తేలికగా తీసుకున్నారో.. ఇక అంతే!!
మహబూబాబాద్: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని(35) విషజ్వరంతో బుధవారం రాత్రి చనిపోయింది. రజని వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీల వద్ద నాలుగు రోజులు వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. దీంతో ఏటూరునాగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ పరీక్షలు చేసి టైఫాయిడ్‌గా తేల్చారు. మెరుగైన వైద్యం నిమిత్తం ములుగు వెళ్లాలని సూచించడంతో ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు. రజిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళ.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో ఉంటున్న మనీష(30) రాఖీ పండుగ సందర్భంగా వాజేడు మండల పరిధిలోని మొరుమూరు కాలనీ గ్రామానికి వచ్చింది. ఆమె ఇక్కడికి జ్వరంతోనే వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ తీసుకెళ్లినట్లు సమాచారం. ఆరు నెలల పాప.. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎస్కే.గౌస్– సహర దంపతుల కుమార్తె మినహ(6నెలలు) డెంగీ జ్వరంతో బాధపడుతూ వారంరోజుల నుంచి ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలించగా గురువారం చనిపోయినట్లు తండ్రి గౌస్ తెలిపారు. -
అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: ఎమ్మెల్యే సీతక్క
సాక్షి, ములుగు జిల్లా: ప్రజాసేవ, డబ్బు సంచుల మధ్య యుద్ధం మొదలవుతుందని, ప్రశ్నించే గొంతు నొక్కేందుకే కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఆమె మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మిడతల దండులాగా బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని, తనను ఓడించడానికి డబ్బు సంచులతో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘కష్టం ఎక్కడున్నా సీతక్క అక్కడ ఉంటుంది. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక నన్ను టార్గెట్ చేస్తున్నారు. సీతక్క బాగా పని చేస్తుందని అసెంబ్లీలో పొగుడుతున్నారు. ఇక్కడ కొచ్చి ఓడించమంటున్నారు. ములుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని డబ్బు సంచులతో ముడి పెడుతున్నారు. ప్రజలే నా కుటుంబం.. నియోజకవర్గం ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారు. బీఆర్ఎస్ నాయకులంతా దండయాత్రలు చేసి ములుగును భయాందోళన గురిచేస్తున్నారు’’ అంటూ సీతక్క నిప్పులు చెరిగారు. చదవండి: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా! -
రసవత్తరంగా ములుగు రాజకీయం!
నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న మహిళ దళ నేత ములుగు ఎమ్మెల్యే( సీతక్క)కావడం గనార్హం. తిరుగులేని నాయకురాలుగా నాడు టీడీపీ నేడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజల ఆదారాభిమానాలు చూరగొన్న వ్యక్తి సీతక్క. మావోయిస్టు కుటుంబం నేపథ్యం ఉన్న జడ్పీ చైర్ పర్సన్ బడా నాగజ్యతికి బీఆర్ఎస్ నుండి టికెట్ దక్కంది. దాంతో ములుగు రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ పోటీ హోరాహోరీగా రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క, బడా నాగజ్యోతీలు నువ్వా-నేనా అన్నట్టుగా బరిలోకి దిగనున్నారు. దాంతో ములుగు రాజకీయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పోడు భూముల అంశం, తలాపునే గోదావరి ఉన్నా త్రాగు సాగు నీటి సమస్య ఎదుర్కోవడం. ఆదివాసి గిరిజన గూడాలకు ఇప్పటికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం. గోదారి పరివాహక ముంపు ప్రాంతానికి కరకట్ట నిర్మాణం చేయకపోవడం. ఏటూరునాగారం డివిజన్ కేంద్రం, మల్లంపల్లి మండలం చేయాలనే డిమాండ్. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : మారుమూల ఏజన్సీ ఆటవీ ప్రాంతం. నక్సల్స్ ప్రభావితం గల నియోజకవర్గం, పర్యాటక ప్రాంతం. ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతర మేడారం ప్రధాన పార్టీల అభ్యర్థులు: కాంగ్రెస్ సీతక్క (సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ బడే నాగజ్యోతి (కన్ఫాం) బీజేపీ తాటి కృష్ణ (ఆశావాహులు) భూక్య జవహార్ లాల్ రాజు నాయక్ (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు : వ్యవసాయంపై ఆదారపడ్డ ఆదివాసిగిరిజన ఓటర్లు ఎక్కువ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్టీ లంబాడా ఓటర్లు 34400 ఎస్టీ కోయ నాయకపోడు ఎరుకల గుత్తి కోయ 48250 ఓసి బిసి కలిపి మొత్తం ఓటర్లు 125525 నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : ములుగు నియోజకవర్గం పూర్తిగా ఏజన్సీ ప్రాంత.. గోదావరి నది తీరంలో ఉంటుంది. నక్సల్స్ ప్రభావిత ఏరియా, తెలంగాణ రాష్ట్రంలోనే 80 శాతం అడవులు ఉన్న నియోజకవర్గం. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలు కొలువైన ప్రాంతం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఉంది. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వైష్ణవాలయం , పర్యాటక కేంద్రాలు లక్నవరం సరస్సు .రామప్ప సరస్సు రామప్ప దేవాలయం. -
లారీ బీభత్సం..! ఆటోను 30 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో..
వరంగల్: వలస జీవులను లారీ మింగేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆరుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయా కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు చెందిన సుమారు పది కుటుంబాలు తేనే సేకరణ కోసం వరంగల్ జిల్లా కేంద్రానికి వచ్చి ఓసిటీ మైదానంలో డేరాలు వేసుకుని నివాసం ఉంటున్నాయి. నెల రోజుల క్రితం వచ్చిన ఈ వలసజీవులు నిత్యం ఉదయమే ఇక్కడ నుంచి ఆటోల్లో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి తేనె సేకరించి తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. రోజుమాదిరిగానే బుధవారం ఉదయం రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఒక ఆటోలో వర్ధన్నపేట, తొర్రూరు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద లారీ రాంగ్రూట్లో వచ్చి ఆటోను ఢీకొంది. అలాగే కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తుల్లో ఒకే కుటుంబానికి చెందిన కురేరి సురేష్ (43), అతడి కుమారులు అమిత్ కురేరి (23), నితీష్ కుమార్ కురేరి (11), సురేష్ సోదరి కుమారులు (మేనల్లుళ్లు) రూప్‌చంద్ దామి(33), జలావత్ దామి అలియాస్ జాబీర్ (19)తోపాటు ఆటోడ్రైవర్ నగరంలోని కరీమాబాద్ ఏసీరెడ్డి నగర్‌కు చెందిన బట్టు శ్రీనివాస్ (42)మృతి చెందారు. మృతుడి కురేరి సురేష్ మరో కుమారుడు అమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు ప్రీతి, పూజ తెలిపారు. ఆకలి తీర్చిన వ్యాపారులు.. రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు మృతి చెందారని తెలుసుకున్న లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌కు చెందిన పలువురు వ్యాపారులు చలించారు. తమ కుటుంబ సభ్యులు మృతి చెందారని, అందుకే ఉదయం నుంచి ఏమి తినలేదని చెప్పడంతో భోజనం తయారు చేయించి వారి ఆకలి తీర్చినట్లు వ్యాపారులు బిట్ల కృష్ణ, పాపాని భాస్కర్, బూర ప్రకాశ్ తెలిపారు. అమ్మా వస్తున్నా.. అంతలోనే దుర్మరణం ఖిలా వరంగల్: అమ్మా వస్తున్నా...కలిసి భోజనం చేద్దాం అంటివి.. అంతలోనే మాయమైనవా.. రెండు రోజులాయే నా చేతి కూడు తినక కొడుకా...తినకుండానే వెళ్లిపోయినావా .. అంటూ ఆటోడ్రైవర్ బట్టు శ్రీనివాస్ తల్లి రాజమ్మ రోదిస్తుంటే అక్కడున్న వాళ్లంతా కంటితడి పెట్టుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ఆటోడ్రైవర్ బట్టు శ్రీనివాస్ కూడా ఉన్నారు. శ్రీనివాస్‌కు పదేళ్ల క్రితం వివాహం జరగగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం బతుకుదెరువు కోసం భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులతో రెండు నెలల క్రితం భార్య కల్పన తన పిల్లలను వెంటబెట్టుకుని నర్సంపేట ద్వారక పేటలోని పుట్టింటికి వెళ్లిపోగా.. శ్రీనివాస్ మాత్రం పుప్పాలగుట్ట ఏసీరెడ్డినగర్లోని తన పెద్దన్న నివాసం ఉండే తల్లి రాజమ్మ ఇంటికి చేరుకున్నాడు. అతను ప్రస్తుతం నాగమయ్య టెంపుల్ సమీప కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని అద్దె ఆటో నడిపిస్తున్నాడు. బుధవారం ఉదమే యజమానికి ఆటో ఇచ్చేసి ఇంటికి వస్తాననుకున్నాడు. ఈ లోపు ఓసిటీలో డేరాలు ఏర్పాటు చేసుకున్న జైపూర్‌కు చెందిన వలస జీవులు అండర్ బ్రిడ్జి వద్ద బట్టు శ్రీనివాస్ ఆటో ఎక్కి తొర్రూరులో దించాలని కోరారు. దీంతో వారిని ఎక్కించుకుని బయలుదేరగా ఇల్లంద వద్ద లారీ ఢీకొంది. దీంతో శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో శ్రీనివాస్ సోదరుడు బట్టు కిషన్, వదిన మాలతీ, మృతుడి తల్లి రాజమ్మ, నర్సంపేట నుంచి చేరుకున్న భార్య కల్పన, ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో వరంగల్ పుప్పాలగుట్ట ఏసిరెడ్డినగర్లో విషాదం నెలకొంది. -
ఉపాధ్యాయుని సమయస్పూర్తితో దక్కిన 40 మంది పిల్లల ప్రాణాలు
-
ములుగు NDRF రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
సాక్షి, ములుగు: ఉత్కంఠకు తెర దించుతూ పర్యాటకులందరినీ ఎన్డీఆర్ఎఫ్ రక్షించింది. ములుగు అడవుల్లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. వీరభద్రం అడవుల్లో చిక్కుకున్న మొత్తం పర్యాటకులంతా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. వర్షాకాలం సీజన్ కావడంతో వీరభద్రం గ్రామం సమీపంలోని ముత్యంధార Muthyaladhara Waterfall జలపాతం చూసేందుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో నీటి ప్రవాహం పెరగడంతో కొందరు పర్యాటకులు అడవుల్లో చిక్కుకుపోయారు. దీంతో వీలైనంత త్వరగా వాళ్లను రక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ తరుణంలో పోలీసులతో పాటు రెస్క్యూ టీం వాళ్లను రక్షించే యత్నం చేశారు. కానీ, వీలుకాలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్లను రక్షించారు. బాధితులను అంకన్నగూడెంకు చేర్చగా.. అక్కడి జిల్లా కలెక్టర్, ఎస్పీ వాళ్లను రిసీవ్ చేసుకున్నారు. ముత్యంధార జలపాతం దేశంలోనే అతిపెద్ద జలపాతాల్లో ఒకటిగా పేరుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం సీజన్లో దీనిని చూసేందుకు జనం ఎక్కువగా వస్తుంటారు. వీరభద్రం గ్రామం నుంచి ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతానికి చేరుకుంటారు పర్యాటకులు.