సాక్షి, ములుగు : జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం పొంగి పొర్లుతోంది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలపాతంలోకి భారీగా వదరనీరు వచ్చి చేరుతోంది. దీంతో బొగతా అందాలను వీక్షించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే జలపాతం ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగుతూ 5 అడుగుల పై నుంచి దూకుతోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వరద నీరు చేరడంతో పర్యాటకులు స్నానాలు చేయకుండా అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నీటిలోకి దిగేందుకు కూడా అనుమతి నిలిపివేశారు. పర్యాటకుల రక్షణ కోసం రెస్క్యూ టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యాటకులను అప్రమత్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment