bogatha waterfalls
-
నేను అమెరికా నుంచి వచ్చా బొగత జలపాతాల అందాలకు ఫిదా
-
భూలోక స్వర్గమంటే ఇదేనా.. ఈ జలపాతాలు తప్పక చూడాల్సిందే!
ప్రకృతిలో ఎన్నో సుందర దృశ్యాలు కళ్లు ముందు కనిపిస్తుంటాయి. వాటిని చూసినపుడు ఎంతో ఆనందంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాగా, వానాకాలంలో వాటర్ ఫాల్స్‌ను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ప్రపంచంలో ఫేమస్ జలపాతం అనగానే.. అందరికీ నయాగరా వాటర్ గుర్తుకు వస్తాయి. కాగా, మన దేశంలో కూడా నయాగరా వాటర్ ఫాల్స్‌కు తీసిపోని ఓ జలపాతం ఉంది. అంతకుమించిన అందాలు.. కర్ణాటకలోని ఉన్నాయి. షిమోగా జిల్లాలోని జోగ్ జెర్సొప్పా జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతం ఎంతో సుందరంగా కనిపిస్తోంది. చుట్టూ ఎత్తయిన కొండల మధ్య నుంచి వచ్చే ఈ జలపాతం పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశమని ఓ విదేశీ టూరెస్ట్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశాడు. ఇది నయాగరా ఫాల్స్ కాదు. జోగ్ ఫాల్స్. అద్భుతమైన వీడియో చూడండి వ్యాఖ్యలు చేశారు. Incredible india... - This is not Niagara Falls… This is Jog Falls, located in Shimoga district of Karnataka, India....#jogfalls#NiagaraFalls#Telanganarains#rainyday pic.twitter.com/gkkLxT3Drl — Das Vanthala (@DasVanthala) July 13, 2022 ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో జలపాతాలు సైతం భారీ వర్షాల కారణంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో ములుగు జిల్లాలోని భోగతా, ఆదిలాబాద్‌లోని కుంతాల, ఆసిఫాబాద్‌లోని మిట్టే జలపాతాలు కట్టిపడేస్తున్నాయి. ఈ క్రమంలనే మరో నెటిజన్.. కేరళలోని త్రిసూర్ జిల్లా అత్తిరప్పిల్లి జలపాతాలను మర్చిపోవద్దంటూ ట్వీట్ చేశాడు. #Bogatha Waterfall In Full Flow 😍👌#WaterfallsOfTelangana 📸: @HiWarangalpic.twitter.com/2bCK47nFnC — Hi Hyderabad (@HiHyderabad) July 9, 2022 Mitte Waterfalls Asifabad District, Telangana 📸: @PraneethSimon #WaterfallsOfTelangana pic.twitter.com/crVjPDV7RY — Hi Hyderabad (@HiHyderabad) July 10, 2022 -
బొగత... మన నయాగరా...కిషన్ రెడ్డి
ప్రస్తుతం వానలు కురుస్తున్న నేపథ్యంలో బొగత జలపాతం పర్యాటకులకు మరోసారి సందర్శనీయ ప్రదేశం గా మారింది. కనువిందు చేసే బొగత అందాలను సందర్శించాలంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కూ యాప్ పై తన అభిప్రాయం పంచుకున్నారు..."తెలంగాణ "నయాగర"గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా,వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది. ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని" ఆయన కోరారు. Koo App తెలంగాణ "నయాగర"గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా,వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది.ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని కోరుతున్నాను. View attached media content - Kishan Reddy Gangapuram (@kishanreddybjp) 29 June 2022 -
వావ్.. జలజల జలపాతాలు
వర్షాలతో తెలంగాణలోని జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కొండల నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహాలను చూసి సందర్శకులు పులకించిపోతున్నారు. జలకాలాటలతో సందడిగా గడుపుతున్నారు. సందడిగా బొగత.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధి చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకుంది. చిలుకల పార్క్, ప్రకృతి అందాలను వీక్షిస్తూ పర్యాటకులు ఆనందంగా గడిపారు. – వాజేడు సదర్మాట్కు జలకళ నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం మండలాల ఆయకట్టుకు సాగు నీరందించే సదర్మాట్ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించు కుంది. కనీస నీటిమట్టం 7.6 అడుగులు కాగా ప్రస్తుతం 8 అడుగుల మేర నుంచి వరద వెళుతోంది. జల సోయగాన్ని తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. – ఖానాపూర్ ఆహ్లాదం.. భీమునిపాదం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపంలోని అటవీ ప్రాంతంలో భీమునిపాదం జలపాతం కనువిందు చేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి గుట్టలపైనుంచి వరద నీరు జలపాతానికి చేరడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. – గూడూరు జలజల జలపాతం.. ఇటీవల కురిసిన వర్షాలతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. శని, ఆదివారాల్లో భారీవర్షాలు కురవడంతో జలపాతం ఉధృతి పెరిగింది. దీంతో పర్యాటకుల రద్దీ నెలకొంది. – సైదాపూర్ (హుస్నాబాద్) కన్నుకుట్టేలా.. మిట్టే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మిట్టే జలపాతం జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ వాగుపై సప్తగుండాలు ఉండటం విశేషం. – సిర్పూర్ (యూ) (ఆసిఫాబాద్) -
Photo Feature: బడులు రెడీ.. విజయవాడ హైవేపై రద్దీ
పంటల సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా రైతు అవతారం ఎత్తి స్వయంగా విత్తనాలు చల్లారు. ఇక తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వానా కాలం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లోని జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మరిన్ని ‘చిత్ర’విశేషాల కోసం ఇక్కడ చూడండి. -
ఉరకలేస్తున్న తెలంగాణ నయాగర..బొగత జలపాతం
-
బాహుబలి.. జలధారి..
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాలు ఈ సీజన్లో తడిసిముద్దయి జలసిరితో కళకళలాడుతున్నాయి. దగ్గర ప్రాంతాలు, వారాంతాల్లో వెళ్లి వచ్చే వీలుండడంతో సిటిజనులకు వాటర్ ఫాల్స్ క్రేజీగా మారాయి. దీంతో మారుమూల అడవుల్లో దాక్కున్న జలపాతాలూ వెలుగు చూస్తున్నాయి. వానలు ముమ్మరంగా కురిసే టైమ్‌లో మాత్రమే కళకళలాడే వీటిని సందర్శించిన వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం.. బాహుబలి.. జలధారి.. నగరం నుంచి దాదాపు 270కి.మీ దూరంలో ఉంది బొగత జలపాతం. ములుగు జిల్లా ఏటూరు నాగారం, మీదుగా 10 కి.మీ ప్రయాణం చేస్తే బొగత చేరుకోవచ్చు. అత్యంత వెడల్పుగా ఉండే ఈ జలపాతాన్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని పిలుస్తున్నారు. ఇక్కడ గత రెండేళ్ల నుంచి సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. ఫు#డ్ కి చిన్న చిన్న హోటల్స్,రెస్టారెంట్స్ ఉన్నాయి. కృత్రిమంగా కట్టిన పూల్‌లో వాటర్ ఫ్లో ఎక్కువ లేనప్పుడు హాయిగా ఆడుకోవచ్చు. జలధారలను వాచ్ టవర్ నుంచి చూడడం చక్కని అనుభవం. ముత్యమంటి నీటి ధార... ఏటూరు నాగారం దాటాక రైట్ తీసుకుంటే వెంకటాపురం మండలంలో 7 కి.మీ చిక్కని అడవిలో ప్రయాణిస్తే ముత్యాలధార జలపాతం ఉంటుంది. ద్విచక్రవాహనాలైతే 4 కి.మీ వరకూ వెళ్లొచ్చు. ట్రాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కొంత దూరం పూర్తిగా నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం విచిత్రమైన అనుభూతినిస్తుంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన జలపాతాల్లో ఒకటి ఇది. పైన ఉన్న రాక్ స్ట్రక్చర్ వల్ల చినుకులు ముత్యాల్లా మెరుస్తుంటాయి. ఎక్కువగా ట్రెక్కర్స్ వెళ్లే దీనిని సాహసయాత్రనే చెప్పాలి. నీళ్లలో నడక గంట సేపు ఉంటుంది. బాగా వాన పడిన సమయమైతే మోకాలి లోతు నీళ్లలో నడవాలి. స్థానికంగా దొరికే ట్రాక్టర్స్ ట్రిప్‌కి రూ..3 వేల దాకా వసూలు చేస్తారు. ఎలాంటి వసతి సౌకర్యాలు ఉండవు, ఫుడ్, దొరకదు. పొచ్చర..జరజర నిజామాబాద్ వెళ్లే దారిలో పొచ్చర వాటర్ ఫాల్స్ ఉంది. మెయిన్ వాటర్ ఫాల్స్ వెనుక 100 మీటర్ల ఎత్తులో చెక్‌డ్యామ్ ఉంటుంది. అదీ పెద్దగా లోతు ఉండదు. పార్కింగ్ సౌకర్యం, సెక్యూరిటీ, ఫుడ్‌స్టాల్స్ వంటివి ఉంటాయి. వెళ్లి రావడానికి రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కరోజులో వెళ్లి వచ్చేయవచ్చు. ఆడు‘కుంటా’లలా నగరం నుంచి 260 కి.మీ. ఆదిలాబాద్ నుంచి 70 కి.మీ ప్రయాణం చేస్తే వస్తుంది. ఇది 45 మీటర్లతో ఎత్తయిన జలపాతాల్లో ఒకటిగా పేరొందింది. పలు కుంటలు/సరస్సులు కలిపినది కాబట్టి దీన్ని కుంటాల అంటారు. నగరం నుంచి వాటర్ ఫాల్స్ ఎంట్రీ దాకా చక్కని రవాణా సౌకర్యం ఉండడంతో దీనికి వెళ్లి రావడం చాలా సులభమైన విషయం. జలపాతం అడుగుదాకా వెళ్లడానికి 300కిపైగా మెట్లు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలూ ఉన్నాయి. సమీప ప్రాంతంలోనే మరికొన్ని గుడులు, జలపాతాలు కూడా ఉన్నాయి. అవీ చూసిరావచ్చు. హిల్స్ ఎక్కి దిగితే ఫాల్స్... పోచర నుంచి 10, 15 కి.మీ దాటాక హైవే నుంచి 10కి.మీలలో ఉంటుంది గాయత్రి వాటర్ ఫాల్స్ . ఇదొక కఠినమైన ప్రయాణం. మ«ధ్యలో తగిలే గ్రామంలో ఉన్నవారు మనల్ని గాయత్రి వాటర్ ఫాల్స్‌కి తీసుకువెళ్లి తీసుకురావడానికి కొంత మొత్తం తీసుకుని సర్వీస్ ఇస్తారు. అత్యంత ఎత్తయిన వాటర్ ఫాల్స్‌లో ఒకటిగా పేరున్న ఈ జలపాతం చూడడానికి 3 కొండలు దిగి ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఈ ఫాల్స్‌లోకి దిగడానికి మాత్రం కుదరదు. నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉంటుంది. మల్లెలంత హాయిగా... శ్రీశైలం హైవేలో వెళుతుంటే మున్ననూరు చెక్‌పోస్ట్ నుంచి ఎడమవైపు 10 కి.మీ వెళ్లాక మల్లెల తీర్థం ఉంటుంది. హాయిగా ఫ్యామిలీతో సులభంగా వెళ్లి రాగల వాటర్ ఫాల్స్ ఇది. జలపాతం నీళ్లలో శుభ్రంగా ఆడుకోవచ్చు. ఇక్కడ సౌకర్యాలు ఓ మోస్తరుగా ఉంటాయి. నగరం నుంచి ఒక్కరోజులో వెళ్లి రావచ్చు. శ్రీశైలం వెళ్లేటప్పుడు కూడా మధ్యలో 2/3 గంటల్లోచూసేయవచ్చు. -
పరవళ్లు తొక్కుతున్న బొగతా జలపాతం
-
ఉప్పొంగుతున్న బొగత; కాస్త జాగ్రత్త!
సాక్షి, ములుగు : జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం పొంగి పొర్లుతోంది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలపాతంలోకి భారీగా వదరనీరు వచ్చి చేరుతోంది. దీంతో బొగతా అందాలను వీక్షించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే జలపాతం ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగుతూ 5 అడుగుల పై నుంచి దూకుతోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వరద నీరు చేరడంతో పర్యాటకులు స్నానాలు చేయకుండా అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నీటిలోకి దిగేందుకు కూడా అనుమతి నిలిపివేశారు. పర్యాటకుల రక్షణ కోసం రెస్క్యూ టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యాటకులను అప్రమత్తం చేస్తున్నారు. -
జలపాతం... ప్రకృతి గీతం
ఎటు చూసినా ప్రకృతి రమణీయతే. కొండా కోనల మధ్యఎగిసిపడే నీటి పరవళ్లు. మనసుకు హాయిగొలిపే సుందర దృశ్యాలు. కనుచూపు మేర చక్కదనాల పచ్చదనాలు. లయల హొయలొలుకుతూ జాలువారే జలపాతాలు. గుట్టలపై నుంచి దూకుతూ సవ్వడి చేసి నీటి సరిగమల సరాగాలు. తనివితీరా జలకాలాడి అపురూప జ్ఞాపకాలను మదిలో దాచుకోవాల్సిందే. ప్రకృతి ప్రేమికులు ఆనంద పారవశ్యంలో ఓలలాడాల్సిందే. ఇదిగో అలాంటి జలపాతాలు పర్యాటకులను ఊరిస్తున్నాయి. రా.. రమ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణలోని జయశంకర్ భూపాల్పల్లి, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలు జలపాతాలకు వేదికగా నిలుస్తున్నాయి. జయశంకర్‌భూపాల్‌పల్లి జిల్లా ఏటూరునాగారం సమీపంలోని కొండ కోనల్లో బొగత జలపాతం పాలధారలను తలపిస్తూ ఎగసిపడుతోంది. పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. హైదరాబాద్ నగర పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ఆ వివరాలు ఇవీ.. బొగత.. వెళదాం ఇలా.. ♦ పర్యాటకుల డిమాండ్‌ను బట్టి హైదరాబాద్ నుంచి బొగత జలపాతానికి టీఎస్‌టీడీసీ ప్యాకేజీలు ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాల్లో వీలైనన్ని బస్సులు నడుపుతోంది. ♦ చార్జి: పర్యాటకులు టోల్, పార్కింగ్, ఎంట్రీ రుసుముతో కలిపి ఏసీ బస్సుకు ఒక్కొక్కరు రూ. 1500, నాన్ ఏసీ బస్సుకు రూ. 1400 చెల్లించాలి. ఆహారం ఖర్చులు అదనం. ♦ ఉదయం 7 గంటలకు బషీర్‌బాగ్ టూరిజం కార్యాలయం చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు బయలుదేరుతుంది. 7.30కు సికింద్రాబాద్‌లోని యాత్రీ నివాస్‌కు చేరుకొంటుంది. అక్కడి నుంచి లక్నవరం చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి, బొగత జలపాతాన్ని తిలకించిన తర్వాత హన్మకొండలోని టూరిజం హరిత హోటల్లో డిన్నర్ ముగించుకొని తిరిగి హైదరాబాద్ బయలు దేరుతారు. కుంటాల, పొచ్చెరకు ఇలా.. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన జలపాతాలైన కుంటాల, పొచ్చెర జలపాతాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. ఉదయం 7 గంటలకు బషీర్‌బాగ్‌లోని టూరిజం కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. 7.30కి సికింద్రాబాద్ యాత్రీ నివాస్‌కు చేరుకొంటుంది. అక్కడ నుంచి నేరుగా కుంటాల, పొచ్చెర జలపాతాలకు తీసుకెళ్తారు. అక్కడి జలపాతాలను పర్యాటకులు చూసిన తర్వాత తిరిగి బయలుదేరి హైదరాబాద్‌కు రాత్రి 10 గంటలకు చేరుకొంటారు. చార్జీలు: టోల్, పార్కింగ్, ఎంట్రీ రుసుముతో కలిపి ఒక్కొక్కరికి ఏసీ బస్సుకు రూ.1500, నాన్ఏసీ బస్సుకు రూ.1400 చెల్లించాలి. భోజన ఖర్చులు అదనం. ఇదే మంచి తరుణం.. జలపాతాల అద్భుత దృశ్యాలను చూసే అనువైన సమయం. జలపాతాలను చూసేందుకు గైడ్ సదుపాయం ఉంది. ఈ యాత్ర గొప్ప పర్యాటకులకు గొప్ప జ్ఞాపకంగా మిగులుతుంది. గ్రేటర్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – బి.మనోహర్, టీఎస్‌టీడీసీ ఎండీ రిజర్వేషన్ల కోసం... బషీర్‌బాగ్ కార్యాలయం (040– 29801039,40), 9848540371, ట్యాంక్‌బండ్ కార్యాలయం ( 040– 2350165), 9848125720, యాత్రీ నివాస్ 040– 27893100, 9848126947, కూకట్పల్లి 040–23052028, 984854037, టోల్ ఫ్రీ: 1800 42546464లోసంప్రదించవచ్చు. -
సినిమా షూటింగ్‌లకు అడ్డాగా బొగత జలపాతం
వాజేడు జయశంకర్ జిల్లా : బొగత జలపాతం అందాలు ఇంత వరకు పర్యాటకులకే సొంతమయ్యాయి. ఇప్పుడు సినిమా షూటింగ్‌ల పుణ్యమా అని ప్రంపంచవ్యాప్తంగా వెండితెర, బుల్లితెరలమీద దర్శమిస్తున్నాయి. సినిమా హాల్లో, టీవీల్లో బొగత సోయగాలను చూసి ప్రేక్షకులు స్వయంగా స్పాట్‌కు వెళ్లాలని తహతహలాడుతున్నారు. ఈ జలపాతం జయశంర్ భూపాలపల్లి జిల్లా వాజేడు చీకుపల్లి అడవి ప్రాంతంలో ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం అందాలను చూసి తరించాల్సిందే. జలపాతం వద్ద ఇప్పటికే సినిమా పాటలతో పాటు బతుకమ్మ పాటలను చిత్రీకరించారు.అయితే గతంలో జలపాతం వద్ద సినిమాలు చిత్రీకరించడానికి కొందరూ టెక్నీషియన్లు వచ్చారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా చుట్టూ తిరిగి రావడానికి విముఖత వ్యక్తం చేసి ఇక్కడ షూటింగ్‌లను విరమించుకున్నారు. పూసూరు–ముల్లకట్ట వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేకపట్టడంతో జలపాతం వద్ద సినిమాల చిత్రీకరణకు మార్గం సులువైంది. దీంతో ఇక్కడ షూటింగ్ తీయడానికిసినిమా వాళ్లు ఉత్సాహం చూపుతున్నారు. విదేశీయులు రాక.. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు సుపరిచితమైన బొగత జలపాతం. సినిమా షూటింగ్‌లతో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను సంపాదించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో జాలు వారుతున్న జలపాతంలో సేదతీరడానికి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల పర్యాకులు విచ్చేస్తున్నారు. అంతేకాకుండా విదేశీ పర్యాటకులు సైతం వచ్చి బొగత అందాలను తనివితీరా ఆస్వాదించి తమ కెమెరాల్లో బంధించుకున్నారు. రోజురోజుకూ పర్యాటకుల రద్దీ పెరుగుతోంది. జలపాతం వద్ద బతుకమ్మ పాట.. గత సంవత్సరం బొగత జలపాతం వద్ద రెండు సినిమా పాటలు, రెండు బతుకమ్మ పాటలను చిత్రీకరించారు. అనువంశీల ప్రేమ కథ, సరోవరం చిత్రాల్లో పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ఆ తర్వాత దసరా పండుగ సమయంలో బతుకమ్మపై టీవీ యాంకర్ మంగ్లీతో ఒక పాటను, మరో బతుకమ్మ పాటను గ్రూపుగా చిత్రీకరించారు. ఈ ఏడాది జూన్ నెలలో సావిత్రీ సీరియల్ లోని ఒక ఎపిసోడ్ సైతం చిత్రీకరించారు. దీంతో బొగత సినిమా, సీరియళ్ల చిత్రీకరణకు అనువైన ప్రదేశంగా ఉంది. చిన్న సినిమాలు తీసే డైరెక్టర్లు జలపాతాన్ని ఎంచుకుంటున్నారు.గోదావరి బ్రిడ్జి వద్ద..సినిమాల్లో గోదావరికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలంటే రాజమండ్రి, పాపికొండలు లాంటి ప్రదేశాలను ఎంచుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వాజేడు మండల కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలోని పూసూరు వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం జరుగడం, బొగత జలపాతం అందుబాటులో ఉండటంతో సినిమా వాళ్లు ఇక్కడ షూటింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. గత ఏడాది బొగత జలపాతం వద్ద అనువంశీల ప్రేమ కథ సినిమాలో పాటను చిత్రీకరించిన సమయంలో గోదావరి వద్ద కూడా పాటను చిత్రీకరించారు. -
బొగత జలపాతం అభివృద్ధికి కృషి
రూ. 12 కోట్లతో పర్యాటకులకు సౌకర్యాలు తెలంగాణ టూరిజం చైర్మన్ పేర్వారం రాములు ఏటూరునాగారం : ఖమ్మం జిల్లా వాజేడులోని బొగత జలపాతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ డీజీపీ, తెలంగాణ టూరిజం చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. ఏకో టూరిజం ఆధ్వర్యంలో రూ. 12 కోట్లతో ఇక్కడ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. బొగత జలపాతాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ నిర్మించనున్న భవనాలు, హోటళ్లు, అతిథి నివాస గృహాలు, పర్యాటకుల కోసం ఏ ర్పాటు చేసే సౌకర్యాల మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం పేర్వారం రాములు మాట్లాడుతూ ప్రకృతితో పెనువేసుకున్న జలపాతాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈఈ శ్యామూ ల్ లక్కపల్లి, పర్యాటకశాఖ జిల్లా మేనేజర్ నాథన్ , యూనిట్ మేనేజర్లు సురేష్, శ్రీకాంత్, ఎస్ఈ గంగారెడ్డి, డీటీఓ శివాజీ, ఎస్సై వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. బొగత జలపాత -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతు
ఖమ్మం జిల్లాలోని బొగత జలపాతం వద్ద శనివారం ఓ విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి జలపాతాన్ని వీక్షించడానికి వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి గల్లంతయ్యాడు. ఇది గమనించిన స్నేహితులు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంజనీర్ మృతదేహం కోసం జలపాతం వద్ద గాలింపు చర్యలు చేపట్టారు.