Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ | RGV Saaree 2025 Movie Review And Rating In Telugu, Check Storyline, Cast, Highlights, Positives And Negatives In Film | Sakshi
Sakshi News home page

Saaree Movie Review: తొలిసారి సందేశం ఇచ్చిన ఆర్జీవీ.. ‘శారీ’ ఎలా ఉందంటే..?

Published Fri, Apr 4 2025 4:16 PM | Last Updated on Fri, Apr 4 2025 4:38 PM

RGV Saaree Movie Review And Rating In Telugu

ఆర్జీవి డెన్‌ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘శారీ’(Saaree Movie Review ). ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు.  ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. నేడు(ఏప్రిల్‌ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..?
ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య  నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్‌ సంభ్యాల్‌)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
‘నాకు నచ్చినట్లుగా సినిమా తీస్తా.. ఇష్టం అయితే చూడండి లేదంటే వదిలేయండి’ అని డైరెక్ట్‌గా చెప్పే ఏకైక డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్‌ని క్రియేట్‌ చేశాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా తీయడం లేదు. గత కొన్నాళ్లుగా ఆర్జీవీ డెన్‌ నుంచి వచ్చే చిత్రాలేవి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడడం లేదు.  మరి ‘శారీ’  అయినా ఆడుతుందా అంటే.. ‘సారీ’ అనక తప్పదు.  

అయితే ఇటీవల ఆర్జీవి నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే.. ఇది కాస్త బెటర్‌ అనే చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలిసారి ఆర్జీవి తన చిత్రంతో ఓ సందేశం అందించాడు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు.. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్‌ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో  ఈ చిత్రంలో చూపించారు.  అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలోనే ఆరాధ్యను ఎంత అందంగా చూపించాలి అనే దానిపైనే ఎక్కువ పెట్టాడు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అనేలా సినిమాను తెరకెక్కించారు.  ఆర్జీవి గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు.  కానీ అది వర్కౌట్‌ కాలేదు.(Saaree Movie Review ) 

తెరపై ఆరాధ్యను చూసి ఒకనొక దశలో చిరాకు కలుగుతుంది.  సత్య యాదు పాత్ర కూడా అంతే.  ప్రతిసారి ఫోటో తీయడం.. చీరలో ఆరాధ్యను ఊహించుకోవడం.. ఓ పాట.. ఫస్టాఫ్‌ అంతా ఇలానే సాగుతుంది.  ఇక సెకండాఫ్‌ ప్రారంభంలో కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సైకో చేసే పనులు పాత చిత్రాలను గుర్తుకు తెస్తాయి.  కిడ్నాప్‌ తర్వాత ఆరాధ్య, సత్య యాదుల మధ్య వచ్చే సన్నివేశాలు బోర్‌ కొట్టిస్తాయి. కథంతా అక్కడక్కడే తిప్పుతూ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. మితీమీరిన వయోలెన్స్‌ని పెట్టి భయపెట్టె ప్రయత్నం చేశారు.  అంతకు మించి కథ-కథనంలో కొత్తదనం ఏమి లేదు.  ఆర్జీవి నుంచి అది ఆశించడం కూడా తప్పే సుమా..!

ఎవరెలా చేశారంటే.. 
శారీ సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే శారీలో ఆరాధ్య అదరగొట్టేసింది. వర్మ మెచ్చిన నటి కాబట్టి.. ఆయనకు ‘కావాల్సినట్లుగా’ తెరపై కనిపించి కనువిందు చేసింది.  యాక్టింప్‌ పరంగానూ పర్వాలేదనిపించింది. ఇక సైకో కిట్టుగా సత్య యాదు అదరగొట్టేశాడు. ఒకనొక దశలో తన నటనతో భయపెట్టేశాడు.  మిగిలిన నటీనటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే నటించారు.  సాంకేతికంగా సినిమా పర్వాలేదు. 

శశిప్రీతమ్ రీరికార్డింగ్‌  కొన్ని చోట్ల మోతాదును మించి పోయింది. పాటలు అంతగా గుర్తుండవు. శబరి సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఆరాధ్యను అందంగా చూపించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.  సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది.  ఆర్జీవీ సినిమాలకు  పెద్ద బడ్జెట్‌ ఉండడు. రెండు మూడు పాత్రలు, ఒక ఇళ్లు చాలు.. సినిమాను చుట్టేస్తాడు. ఈ  సినిమా కూడా అలానే ఉంది. పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ సినిమాను ఉన్నంతలో రిచ్‌గానే తీర్చిదిద్దారు. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement