aaradhya
-
చిలుకతో వర్మ హీరోయిన్ పోటీ.. అరుణాచలంలో బిగ్‌బాస్ బ్యూటీ
బ్లూ డ్రెస్‌లో రీతూ చౌదరిజ్ఞాపకాలు పంచుకున్న హీరోయిన్ అన్షుడీప్ నెక్ టాప్‌ను ఇలా ఫిక్స్ చేయండంటోన్న అన్షులా కపూర్రామచిలుకతో పోటీపడుతున్న ఆరాధ్య దేవిఅరుణాచల శివుడిని దర్శించుకున్న బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ, యాంకర్ లాస్య View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor) View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
రామ్ గోపాల్ వర్మ 'శారీ' మూవీ HD స్టిల్స్
-
'శారీ' ట్రైలర్.. చీరలో కనిపిస్తే టార్గెట్ చేసే మృగం
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న తాజా చిత్రం శారీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. కేవలం ఆమె ఫోటోతోనే సినిమాపై అంచనాలు పెంచేసిన వర్మ.. తాజాగా ట్రైలర్‌తో మరింత బజ్ క్రియేట్ చేశారు. ఒక వ్యక్తిపై ప్రేమ మరీ ఎక్కువైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. పాన్ ఇండియా రేంజ్లో ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రముఖ బిజినెస్‌మాన్ రవి వర్మ నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'శారీ' తీశారు. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు.ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలో యూనిట్ పేర్కొంది. -
ఐశ్వర్యారాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య బర్త్ డే స్పెషల్.. అరుదైన ఫోటోలు
-
‘శారీ’ హీరోయిన్ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో ఆర్జీవీ సందడి (ఫోటోలు)
-
Aishwarya Rai 50th Birthday: ఐశ్వర్య రాయ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఆ సీన్స్‌ని కాపీ కొట్టలేదు
‘‘లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఖుషి’ సినిమా ఉంటుంది. విప్లవ్, ఆరాధ్య పాత్రల్లో విజయ్ దేవరకొండ, సమంతల నటన, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఒక్క మాటలో చె΄్పాలంటే ‘ఖుషి’లో అన్ని వాణిజ్య అంశాలుంటాయి’’ అని ఛాయాగ్రాహకుడు జి. మురళి అన్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జి. మురళి మాట్లాడుతూ– ‘‘సినిమాటోగ్రఫీలో శిక్షణ ΄÷ంది, సినిమాల్లోకి వచ్చాను. ఎవరి వద్దా అసిస్టెంట్‌గా చేయలేదు. తెలుగులో నా తొలి సినిమా ‘అందాల రాక్షసి’. ఆ తర్వాత ‘ఖుషి’నే. ప్రేమ గురించి కలలు కనే యువకుడికి ప్రేమ, జీవితం అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండవని తెలిసి రావడమే ఈ సినిమా నేపథ్యం. మణిరత్నంగారి సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్‌గారు చూపించే విజువల్ బ్యూటీ ‘ఖుషి’లో చూస్తారు. అయితే అలాంటి సీన్స్‌ను మేం కాపీ కొట్టలేదు.. అలాంటి అనుభూతి కలిగించేలా విజువల్స్ ఉంటాయి. ఈ సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. కెమేరా ద్వారా ఆ ఎమోషన్ని తీసుకొచ్చేందుకు నా ప్రయత్నం చేశాను. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌గార్లకు సినిమాల మీద ఉన్నంత ΄్యాషన్ నేను ఇంకో ్ర΄÷డక్షన్లో చూడలేదు. శివ నిర్వాణగారు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. -
ఐశ్వర్యరాయ్‌తో విడాకులు? అభిషేక్ బచ్చన్ ట్వీట్ వైరల్
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ల వైవాహిక జీవితం గురించి కొద్దిరోజులుగా తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిమధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు ప్రస్తుతం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన నీతా-ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్‌కు ఐష్ అభిషేక్ లేకుండా కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లడంతో వీరి విడాకుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. కొంతకాలంగా సినిమా ఫంక్షన్లు, పార్టీలు, ఈవెంట్లకు ఐశ్వర్య ఒక్కతే హాజరవుతుంది. లేదా కూతుర్ని వెంటేసుకొని వెళ్తుంది. దీంతో ఐష్-అభిషేక్‌ల మధ్య పొసగడం లేదని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ అనుమానాలను అభిషేక్ ఖండించారు. ఓ ఈవెంట్లో ఆరాధ్యతో కలిసి ఉన్న ఐశ్వర్యరాయ్ ఫోటోను షేర్ చేస్తూ.. ఓ నెటిజన్ మై ఫేవరెట్ పీపుల్(My Fav People)అని పేర్కొనగా..దీనికి అభిషేక్ స్పందిస్తూ.. నాకు కూడా ఫేవరెట్(Mine Too) అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఐశ్వర్య-అభిషేక్ విడిపోనున్నారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కాగా 2007లో ప్రేమ వివాహం చేసుకున్న ఐష్-అభిషేక్‌లకు కూతురు ఆరాధ్య సంతానం. My fav people ❤️♥️ @juniorbachchan pic.twitter.com/hAoODtjuTD — Shruti (@Shrutibwb) April 1, 2023 -
నన్ను ట్రోల్ చేయండి.. నా కూతురి జోలికొస్తే ఊరుకోను: హీరో
Abhishek Bachchan Lashes Out At Trolls Attacking Daughter Aaradhya: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తైనా క్షణాల్లో వైరలవుతుంది. వారితో పాటు వాళ్ల ఫ్యామిలీపై కూడా జనాల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందిగానూ అనిపిస్తుంది. తమ అంచనాలకు తగ్గట్లు వారితో ఏమాత్రం మార్పులు కనిపించినా జనాలు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌లకు సైతం ఎదురైంది. ఇటీవలె కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంట పడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్లింది. ఐశ్వర్య ఎప్పుడూ కూతురి చేయి పట్టుకొనే నడిపించడం, ఆరాధ్య వంకరగా నడుస్తుందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్.. తన కూతురి నడకపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. నేను పబ్లిక్ ఫిగర్‌ని. నన్ను ఎంతైనా ట్రోల్ చేయండి పడతాను. కానీ నా కూతుర్ని అనేడానికి మీకు హక్కు లేదు. దమ్ముంటే ఆ మాటలు నా ఎదురుగా వచ్చి అనండి అంటూ ట్రోలర్స్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అభిషేక్ చేసిన ఈ కామెంట్స నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
జై సియ రామ్.. ఆరాధ్య భక్తి పాట,ఆట
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ల ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్ పుట్టిన రోజు నేడు. సోమవారం 9వ పడిలోకి అడుగుపెట్టారు ఈ చిన్ని బచ్చన్. ఆరాధ్య తాత, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ 9వ పడి వరకు ప్రతీ ఏటా దిగిన ఫొటోలను ఓ చోట చేర్చి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఆరాధ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నా ప్రేమతో’ అనే శీర్షికను ఉంచారు. ( డైరెక్టర్‌తో స్టెప్పులేయించిన శ్రుతీ హాసన్ ) తన ట్విటర్ ఖాతాలో ఆరాధ్యకు సంబంధించిన ఓ వీడియో పోస్టును కూడా ఆయన షేర్ చేశారు. ఓ అభిమాని షేర్ చేసిన పోస్టును ఆయన రీట్వీట్ చేశారు. దీపావళి సందర్భంగా మనవరాలు దేవుడి పాట పాడుతున్న వీడియో అది. ‘జై సియ రామ్, జై జై సియ రామ్’ అంటూ పాడుతూ.. దానికి తగ్గట్టుగా చక్కడా ఆడింది. -
ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్
-
ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్‌బీ ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. శనివారం రోజున అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమితాబ్ కోడలు ఐశ్వర్య రాయ్, మనువరాలు ఆరాధ్యకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. బిగ్‌బీ కుటుంబ సభ్యులందరికీ కరోనాకు సంబంధించిన టెస్టులను నిర్వహించగా.. నిన్నటి రోజున కేవలం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కి సంబంధించిన రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. అందులో కొన్ని ఫలితాలు ఈ రోజు రాగా.. వాటిలో ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. అయితే ఇప్పటికే అమితాబ్ ఇంటిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. బిగ్‌బీ అమితాబ్, అభిషేక్ బచ్చన్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన వెంటనే ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. (అమితాబ్, అభిషేక్‌లకు కరోనా) -
‘తన మాటలకు గర్వంగా ఉంది’
ముంబై: అభిషేక్ బచ్చన్, ఐశర్యారాయ్‌ల గారాలపట్టి ఆరాధ్యకు స్టార్ కిడ్‌గా ప్రత్యేక అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆరాధ్య ఎరుపు, పచ్చని రంగులతో ఉన్న చీరను ధరించి తాను చదివే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలో సందడి చేసింది. ఆరాధ్య ఈ వేడుకల్లో మహిళ సాధికారత, గొప్పతనం గురించి ముద్దుముద్దుగా మాట్లాడింది. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తన మనమరాలు ఆరాధ్య మాట్లాడిన వీడియోను అమితాబ్ బచ్చన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఆరాధ్య మహిళల గొప్పతనం, సాధికారతపై మాట్లాడటం చాలా గర్వించదగిన విషయం’ అని బిగ్ బీ కామెంట్ చేశారు. మహిళల గురించి ఆరాధ్య మాట్లాడిన మాటలకు బిగ్‌బీ ఆనందంతో పొంగిపోయారు. the proudest moment and voice .. of the girl child .. of Aaradhya , my own .. https://t.co/Gsa9gBIgBA — Amitabh Bachchan (@SrBachchan) December 22, 2019 ఈ వేడుకలో అభిషేక్ బచ్చన్, ఐశర్యారాయ్లతోపాటు స్టార్ కిడ్స్ తల్లిదండ్రులు.. షారుక్‌ఖాన్, కరిష్మా కపూర్, లారాదత్తా తదితరులు పాల్గొన్నారు. స్టార్స్ కిడ్స్ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీరంతా తిలకించారు. ఈ వేడుకలకు అమితాబ్ బచ్చన్ హాజరు కాలేకపోయారు. బిగ్ బీ తాజాగా నాగరాజ్ మంజులే చిత్ర షూటింగ్లో ఉన్నారు. పాఠశాల వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కనెక్షన్ ద్వారా అమితాబ్ ఆరాధ్య మాట్లాడిన వీడియోను తిలకించారు. -
అభిమానుల ప్రేమే నా బలం
హీరోయిన్గా ఐశ్వర్యా రాయ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అందాల సుందరి సాధించిన అవార్డులు, చేసిన పాత్రలను బట్టి ఆమె కొత్త కథానాయికలకు ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఐశ్వర్యా రాయ్‌లోని ఇలాంటి లక్షణాలే ఆమెకు ప్రఖ్యాత హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్స్ ఎక్స్‌లెన్స్ అవార్డును తెచ్చిపెట్టాయి. ఉమెన్ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండియా (డబ్ల్యూఐఎఫ్‌టి) –2018 అవార్డ్స్‌లో భాగంగా ఐశ్వర్యను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డ్స్ ప్రదాన కార్యక్రమం అమెరికాలో జరిగింది. ఈ వేడుకలో తల్లి బ్రిందా రాయ్, కూతురు ఆరాధ్యతో కలసి ఐశ్వర్యా రాయ్ పాల్గొన్నారు. ‘‘ఈ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. శ్రేయోభి లాషులు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమే నా బలం’’ అని అవార్డ్ సీక్వరించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఐశ్వర్యా రాయ్. అలాగే ఈ వేడుకలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, డైరెక్టర్ జోయా అక్తర్ కూడా పాల్గొన్నారు. జాన్వీ కపూర్‌కు ‘ధడక్’ సినిమాకు బెస్ట్ డెబ్యూ కేటగిరీలో డబ్ల్యూఐఎఫ్‌టి ఎమరాల్డ్ అవార్డు రాగా, జోయా అక్తర్‌కు వైలర్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ డైరెక్షన్ అవార్డ్ దక్కింది. ‘‘నా మిసెస్‌కి ఈ అవార్డ్ రావడం హ్యాపీగా ఉంది. అక్కడున్న ఆరాధ్య తనకు ప్రేమతో హగ్ ఇస్తుంది. నేనేమో ఆ ఫోటో చూస్తూ ప్రౌడ్ హస్బెండ్‌లా ఫీల్ అవుతున్నాను’’ అని అభిషేక్ తన ఆనందాన్ని ట్వీటర్లో పేర్కొన్నారు. -
అమ్మకుట్టీ..! అచ్చం ఐశ్వర్యలాగే..!
బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్యరాయ్, తన కూతురు ఆరాధ్యతో కలిసి పారిస్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆరేళ్ల ఆరాధ్యతో కలిసి పారిస్ ట్రిప్ వెళ్లిన ఐష్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రెండు ఫొటోలను షేర్ చేశారు. చెక్క గుర్రాల రంగుల రాట్నం వద్ద బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఐశ్వర్య బ్యూటీఫుల్ లుక్ ఇస్తూ ఉన్న ఫోటోను ‘టుడే’ అని క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశారు. అచ్చం అమ్మలాగే పోజు ఇస్తూ ఆరాధ్య అదే ప్లేస్‌లో ఫొటో దిగింది. ఈ ఫొటోను ‘మై లవ్’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐశ్వర్య ప్రస్తుతం అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావ్‌లతో కలిసి ‘ఫన్నేఖాన్’. చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎవ్రీబడీ ఫేమస్’ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 3న విడుదల కానుంది. Today ....✨ A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Jul 6, 2018 at 11:07am PDT 😍💖😘My LOVE 💖 A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Jul 6, 2018 at 2:41pm PDT -
స్కూల్ చంకెక్కిందా?
మంగళూరులో పెళ్లి. బాజాబజంత్రీ. పెళ్లికూతురు, పెళ్లికొడుకు వెరీ హ్యాపీ. హండ్రెడ్ టైప్స్ ఫుడ్డు. ఫిఫ్టీ టైప్స్ స్వీట్లు. ఇక స్నాకులు, పానీయాలు లెక్కలేనన్ని. కానీ ఎవరూ అటు చూడ్డం లేదు. పెళ్లికొడుకునీ, పెళ్లికూతుర్నీ చూడటం లేదు. స్వీట్లను, హాట్లను, పానీయాలనూ చూడ్డం లేదు. ఎందుకూ అనుకుంటున్నారా? నైట్ మ్యారేజ్‌లో కరెంటు పోయిందనుకుంటున్నారా? అదేదీ కాదండీ, పెళ్లికి ఐశ్వర్యారాయ్ వచ్చింది. ఆవిడొస్తే ఇంకేమన్నా కనిపిస్తుందా అండీ. దానికి తోడు చంకలో ఇంకో అందమైన అమ్మాయి. అదేనండీ.. కూతురు ఆరాధ్య. అంతా బానే ఉందండీ, వచ్చినందుకు ఐశ్వర్యకు ప్రాబ్లమ్ లేదు. పిలిచినందుకు పెళ్లికూతురు వైపు వాళ్లకూ ప్రాబ్లం లేదు. మంగళూరు మంగళూరంతా హ్యాపీ. కానీ అదేంటో.. షిర్జమాన్కి నచ్చలా! ‘ఎప్పుడు చూసినా ఆరాధ్య.. అమ్మ చంకలో వేలాడుతుంది. స్కూల్‌కి పోదా? అసలా స్కూలేం స్కూలు? మా అమ్మ చంక ఎక్కాలీ అన్నప్పుడల్లా సెలవిస్తుందా? వి.ఐ.పి.లకు ఇలాంటి వెసులుబాట్లు కూడా ఉంటాయా? మా పిల్లలేం పాపం చేశారు వాళ్లకు కూడా మేం పెళ్లిళ్లకు పోయినప్పుడు సెలవులు ఇవ్వొచ్చుగా. ఇవన్నీ ఎందుకు లెండి. అసలు అమ్మాయి చదువేం కావాలి? అందం చందం ఉండే చాలు, చదువు సంధ్య అక్కర్లేదు అనుకుంటున్నారా’అని కాస్త ఘాటుగానే ట్వీటిందండోయ్. ఇంతకీ షిర్జమాన్? ఎవరో మరి. ఆమె ఉండటం అయితే ఫారిన్లో నట. అక్కణ్ణుంచి, ఇక్కడి విశేషాలు చదివి ట్వీట్ చేసింది. -
కూతురి కోసం చెవులు కుట్టించుకున్న హీరో
కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన సందడి చేశారు. గూంజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్షు గుప్తాకు మద్ధతుగా అభిషేక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో అమితాబ్, అభిషేక్ లు కాసేపు తమ స్థానాలు మార్చుకోనున్నారు. అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యతగా మారి ప్రశ్నలు సందిస్తుంటే బిగ్ బి హాట్ సీట్లో కూర్చోని సమాధానాలు ఇచ్చారు. అంతేకాదు ఈ సందర్భంగా అభిషేక్ తన కూతురు ఆరాధ్యకు చెవులు కుట్టించే సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి వెల్లడించారు. ఆరాధ్యకు చెవులు కుట్టించే సమయంలో అభిషేక్ ముందుగా తన చెవులు కుట్టించుకున్నారట. తన గారల పట్టికి ఎంత నొప్పి కలుగుతుందో తెలుసుకునేందుకు అభిషేక్ ఇలా చేశారట. ఈ విషయాన్ని అభిషేక్ స్వయంగా వెల్లడించారు. శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో అన్షుతో కలిసి అభిషేక్ 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. -
ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చిన అందాల తార!
ముంబై: బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యతో కలిసి న్యూయార్క్ వెళ్లింది. ఇప్పటికే ఆమె భర్త అభిషేక్ బచ్చన్ అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆయనను కలిసి.. కొన్ని రోజులు అక్కడ విహరించేందుకు ఆమె వెళ్లింది. బయట ఎప్పుడూ కనిపించిన ఫ్యాషనబుల్‌గా కనిపించే ఐశ్యర్య ముంబై ఎయిర్‌పోర్టు వద్ద కూతురు ఆరాధ్యతో కనిపించడంతో ఫొటోగ్రాఫర్లు క్లిక్మన్నారు. ఆ ఫొటో ఈ మీకోసం చూడండి. -
ఈసారి అమితాబ్ వాలెంటైన్ ఎవరంటే..?
ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఏం చేసినా జనాలు ఇట్టే ఆకర్షితులై పోతారు. ఆయన చేసే ప్రతి పని కూడా అంతే ఆసక్తిగా ఉంటుంది. సాధారణంగా ప్రేమికుల రోజు అంతా తమ ప్రియమైన వారితో గడుపుతారు. ఆ విషయాలు చాలా గోప్యంగా ఉంచుతారు. కొంతమంది మాత్రమే ఆ విషయాలు బయటకు చెబుతారు. బాలీవుడ్ బిగ్ బీ మాత్రం తాను ఈసారి గడిపిన తన వాలెంటైన్ గురించి చెప్పారు. అయితే, ఆ వాలెంటైన్ ఎవరో కాదు.. తన ముద్దుల మనువరాలు ఆరాధ్య. అవును.. అమితాబ్ బచ్చన్ ఈసారి ప్రేమికుల రోజును తన చిట్టిపొట్టి మనుమరాలితో సరదాగా గడిపారంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన బ్లాగ్‌లో రాశారు. ఓ ఇటాలియన్ రెస్టారెంటుకు వెళ్లి ఏం చక్కా పిజ్జా లాగించేశారంట. ఆ తర్వాత పిజ్జా తీసుకొచ్చిన వెయిటర్స్‌కు ఆరాధ్య థ్యాంక్స్ అని కూడా చెప్పిందట. ఆ తర్వాత హ్యాపీ వాలెంటైన్స్ డే అని విష్ చేసుకుంటూ తిరిగి కుటుంబమంతా ఇంటికొచ్చారని అమితాబ్ చెప్పారు. అంతేకాదు.. డిన్నర్‌కు బయటకు తీసుకెళ్లిన తనకు ఆరాధ్య థ్యాంక్స్ అని చెప్తుండగా.. అసలు ఆ ఐడియా ఇచ్చిన తనకే థ్యాంక్స్ అని చెప్పానని, తన ఆలోచనలు కుటుంబం మొత్తాన్ని ఒక చోట చేర్చిందని.. నిజంగా తను చాలా క్యూట్ కదా? అంటూ అమితాబ్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. -
ధోనీ కారును ఓ అమ్మాయి ఛేజ్ చేసి..
రాంచీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంతూరు రాంచీలోని ఉమెన్స్ కాలేజీ విద్యార్థిని ఆరాధ్యకు అతనితో సెల్ఫీ దిగాలన్నది కల. ఆరాధ్య కోరిక నెరవేరే రోజు ఇటీవల వచ్చింది. అయితే ఆమె దీనికోసం చిన్న సాహసమే చేసింది. రాంచీలో జరిగిన భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే తర్వాత గత నెల 26న ధోనీ తన హమ్మర్ కారులో విమానాశ్రయానికి బయల్దేరాడు. ఈ విషయం తెలుసుకున్న ఆరాధ్య స్కూటీ వేసుకుని ధోనీ కారును ఫాలో అయ్యింది. మధ్యలోనే ధోనీ కారును ఛేజ్ చేసిన ఆరాధ్య విమానాశ్రయం వరకు అలాగే ఆగకుండా వెళ్లింది. ధోనీ విమనాశ్రయం చేరుకోగానే టర్మినల్ వద్ద ఆరాధ్య అతణ్ని కలసి తన సెల్ఫీ కోరికను చెప్పింది. ధోనీ ఆమె మాటను మన్నించి సెల్ఫీ దిగాడు. ఆరాధ్య ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ముచ్చట తీర్చుకుంది. -
ఐష్ కుమార్తె మరో హీరోను తండ్రి అనుకుని..
బాలీవుడ్ అందాలతార ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ల ముద్దుల తనయ ఆరాధ్య.. షూటింగ్ సెట్లో పొరపాటు పడిందట. మరో హీరో రణవీర్ కపూర్‌ను తన తండ్రి అభిషేక్‌గా భావించిన ఆరాధ్య అతని దగ్గరకు వెళ్లి కౌగిలించుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఈ విషయాన్ని చెప్పింది. ఐశ్వర్య, రణవీర్ జంటగా ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌కు ఐశ్వర్య తన కూతురును తీసుకెళ్లింది. సెట్లో కూర్చున్న రణవీర్‌ను చూసిన ఆరాధ్య తన తండ్రి అనుకుని అతని దగ్గరకు వెళ్లింది. అభిషేక్ తరచూ క్యాప్ పెట్టుకుని జాకెట్ వేసుకుంటాడు. ఆ రోజు రణవీర్ కూడా అచ్చం అభిషేక్ మాదిరిగా క్యాప్ పెట్టుకుని, జాకెట్ ధరించాడు. దీంతో ఆరాధ్య పొరపాటు పడిందని, రణవీర్‌ను అభిషేక్‌లా భావించిందని ఐశ్వర్య చెప్పింది. ఆరాధ్యకు రణవీర్ అంటే ఇష్టమని, అతనితో ఎక్కువసేపు గడిపేదని తెలిపింది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఏ దిల్ హై ముష్కిల్ కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు నటించినందున విడుదల చేయబోమని థియేటర్ల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలపై అనిశ్చిత ఏర్పడింది. కరణ్ జోహార్ ఇటీవల కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్‌ను కలసి సాయం కోరాడు. అంతకుముందు ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలో రణవీర్, ఐశ్వర్య హాట్ హాట్ సన్నివేశాల్లో నటించారు. విడుదల చేసిన ఈ సినిమా స్టిల్స్‌లో ఐష్ హాట్‌గా కనిపించింది. -
మనవరాళ్లకు అమితాబ్ లేఖ!
సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మనవరాళ్లకు అమితాబ్ ఓ అందమైన లేఖ రాశారు. ఫేమ్ కలిగిన కుటుంబంలో జన్మించిన మీకు.. మహిళలకు ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి తప్పించుకునే అవకాశాలను మాత్రం ఆ 'ఫేమ్' ఇవ్వలేదని లేఖలో పేర్కొనడం విశేషం. మహిళ జీవితంలో ఎదురయ్యే సున్నిత సమయాలను, సమస్యలను ప్రస్తావించిన అమితాబ్ లేఖను పూర్తిగా చూద్దాం.. లేఖలోని సారాంశం డియర్ నవ్య, ఆరాధ్య.. మీ ముత్తాత గార్లు అయిన డా.హరివన్ష రాయ్ బచ్చన్, హెచ్ పీ నందల పేర్లు మీ ఇంటిపేరుగా నిలవడం వల్ల మీకు ఒక గుర్తింపు వస్తుంది. మీరు నంద అయినా లేక బచ్చన్ అయినా ముందు గుర్తించవలసింది మీరు కూడ ఒక మహిళేనని!. మీరు మహిళలు కాబట్టే ఇతరులు వారి వారి ఆలోచనలు మీపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఎలా ఉండాలో, ఎవరిని కలవాలో, ఎక్కడి వెళ్లాలో.. కూడా వాళ్లే చెప్తారు. వారి ఆలోచనల నీడల్లో మీరు జీవించొద్దు. మీ తెలివితేటలతో మీ జీవితాన్ని మీరే లీడ్ చేయాలి. మీ గుణం మంచిది అనడానికి మీరు వేసుకునే స్కర్ట్ పొడవు సింబల్ అనే ఎదుటివారిని మాటలను నమ్మొద్దు. మీ స్నేహితులను మీరే ఎన్నుకోండి. మీకు ఎవరిని పెళ్లాడాలని అనిపిస్తే వారినే వివాహం చేసుకోండి. అనవసర కారణాలతో ఇతరులను వివాహం చేసుకోకండి. ఇతరులు మాట్లాడతారు. కానీ మీరు ప్రతి ఒక్కరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేరేవాళ్లు ఏం అనుకుంటారో అని ఎప్పుడూ ఆలోచించొద్దు. మీ కర్మలకు కర్త, క్రియ మీరే కావాలి. అప్పుడే మీ తప్పులను మీరే సరిదిద్దుకో గలుగుతారు. నవ్య.. నీ ఇంటిపేరు ఓ మహిళ ఎదుర్కొనే కష్టాలనుంచి నిన్ను కాపాడలేదు. ఆ కష్టాల నుంచి నిన్ను నువ్వే రక్షించుకోవాలి. ఆరాధ్య.. ఈ లేఖ సారాంశం నీకు అర్ధమయ్యే సమయానికి నేను నీకు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ, నేను ఈ రోజు చెబుతున్నవి ఆ సమయానికి ఇలానే ఉంటాయని భావిస్తున్నాను. మహిళగా జీవించడం కష్టమే కావొచ్చు. కానీ నీ లాంటి వాళ్లు ఆ కష్టాలు లేకుండా చేస్తారని నా విశ్వాసం. నీకు నువ్వే హద్దులు పెట్టుకోవడం, నీకు ఇష్టమైన దాన్ని ఎంచుకోవడం, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం అంత సులువు కాకపోవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్న మహిళలకు నువ్వు ఒక ఉదాహరణగా నిలవొచ్చు. నువ్వు ఇది చేస్తే, నేను సాధించిన దాని కన్నా ఎక్కువ సాధించిన వ్యక్తివి అవుతావు. అది నాకు గొప్ప గౌరవం. అప్పుడు నేను అమితాబ్ బచ్చన్ ను కాదు ఆరాధ్యకు తాతయ్యను అవుతాను!. ప్రేమతో.. మీ తాతయ్య -
హల్ చల్ చేస్తున్న ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో
నటుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ఫ్యాన్ క్లబ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన ముద్దుల కూతురు ఆరాధ్యను ఒడిలో కూర్చోపెట్టుకొని ఉంది. తన నాలుగేళ్ల కూతురుకు ఐష్ ఆప్యాయంగా ముద్దుపెడుతున్న ఈ ఫోటో చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఇటీవల తల్లి ఐష్ కోసం ఆరాధ్య చేసిన ఓ సంఘటనను కూడా సోషల్ మీడియాలో గుర్తు తెచ్చుకుంటున్నారు. 'సరబ్జిత్' షూటింగ్లో బిజీగా ఉంటున్న ఐశ్వర్య కాస్త అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, గొంతు నొప్పితో ఆమె బాధపడుతుండటంతో సరబ్జిత్ షూటింగ్‌కు ఓ వారం రోజులు విరామం ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఐశ్వర్య ప్రతిరోజూ ఆరాధ్య స్కూలు వదిలే సమయానికి వెళ్లి తనను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. తల్లి ఆరోగ్యాన్ని రెండు రోజులుగా గమనిస్తున్న ఆరాధ్య స్కూల్లో విరామ సమయంలో 'గెట్ వెల్ సూన్' కార్డు తయారు చేసిందట. ఎప్పటిలానే సాయంత్రం అమ్మ స్కూల్ గేట్ వద్దకు రాగానే తన చిట్టి చిట్టి చేతులతో తయారుచేసిన 'గెట్ వెల్ సూన్' కార్డును అమ్మకిచ్చిందట. అంతే ఐశ్వర్య ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. పిల్లలను తీసుకెళ్లడానికి స్కూల్ వద్దకు చేరుకున్న ఇతర తల్లిదండ్రులు కూడా ఆరాధ్య ఆలోచనకు తెగ ముచ్చటపడ్డారు. ఆరాధ్య విషయంలో నేను చాలా అదృష్టవంతురాలినంటూ మురిసిపోతుంది ఐశ్వర్య. -
అమ్మ కోసం ఆరాధ్య ఏం చేసిందంటే..
అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముద్దుల కూతురు ఆరాధ్య అమ్మ చేత కంటతడి పెట్టించింది. అయితే ఆ కంటతడి పట్టలేనంత సంతోషంతో వచ్చింది. ఇటీవల 'సరబ్జిత్' షూటింగ్లో బిజీగా ఉంటున్న ఐశ్వర్య కాస్త అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, గొంతు నొప్పితో ఆమె బాధపడుతుండటంతో సరబ్జిత్ షూటింగ్‌కు ఓ వారం రోజులు విరామం ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఐశ్వర్య ప్రతిరోజూ ఆరాధ్య స్కూలు వదిలే సమయానికి వెళ్లి తనను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. తల్లి ఆరోగ్యాన్ని రెండు రోజులుగా గమనిస్తున్న ఆరాధ్య స్కూల్లో విరామ సమయంలో 'గెట్ వెల్ సూన్' కార్డు తయారు చేసిందట. ఎప్పటిలానే సాయంత్రం అమ్మ స్కూల్ గేట్ వద్దకు రాగానే తన చిట్టి చిట్టి చేతులతో తయారుచేసిన 'గెట్ వెల్ సూన్' కార్డును అమ్మకిచ్చిందట. అంతే ఐశ్వర్య ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. పిల్లలను తీసుకెళ్లడానికి స్కూల్ వద్దకు చేరుకున్న ఇతర తల్లిదండ్రులు కూడా ఆరాధ్య ఆలోచనకు తెగ ముచ్చటపడ్డారు. ఆరాధ్య విషయంలో నేను చాలా అదృష్టవంతురాలినంటూ మురిసిపోతుంది ఐశ్వర్య. -
కూతురుతో కలిసి గణపతిని దర్శించుకున్న ఐష్
-
ఎంత వినయం, ఎంత విధేయత!
ముంబై: అబ్బో ఏం వినయం. ఏం విధేయత. పెద్దలంటే ఎంత గౌరవం. ఎంత సంస్కారం. పెంపకం అంటే అది. సంస్కారమంటే ఇది. నిండా నాలుగేళ్లు కూడా లేని వయసులోనే అంత సంస్కారమంటే అది పెద్దల పెంపకానికి నిదర్శనం. వారి సంస్కృతి సంప్రదాయాలకు మచ్చుతునక. ఇవీ.... ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ల గారాలపట్టి ఆరాధ్యబచ్చన్పై కురిపిస్తున్న ప్రసంశలు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్తూ ఐశ్వర్యారాయ్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన తండ్రిని కలుసుకుంది. ఆయనకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది. వెంటనే ఆమె కుమార్తె చిన్నారి ఆరాధ్య బచ్చన్ కూడా తల్లిని ఫాలో అయిపోయింది. తల్లి దగ్గర నుంచి ఒక్క ఉదుటున వెళ్లి తాతగారి కాళ్లకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకుంది. దీంతో ఐశ్వర్యతో పాటు అక్కడున్న అందరూ చిన్నారి సంస్కారానికి మురిసిపోయారు. గతంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఏదైనా ఇంపార్టెంట్ పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ల పాదాలకు నమస్కారం పెట్టి వెళ్లేవాడని బాలీవుడ్ జనాలు గుర్తు చేసుకుంటున్నారు. అమితాబ్ అలవాట్లు, సంస్కారం, సంప్రదాయం అతని తనయుడు అభిషేక్‌కు కూడా వచ్చాయని, అతను కూడా ముఖ్యమైన పనుల మీద వెళ్లేటప్పుడు పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటాడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వారి సంస్కారం, సంప్రదాయాలే వారి వారసురాలు, చిన్నారి ఆరాధ్యబచ్చన్కు కూడా వచ్చాయని, అమితాబ్, ఐశ్వర్య ఫ్యాన్స్ ముచ్చట పడుతున్నారు. -
ఎంత వినయం ! ఎంత సంస్కారం !
-
తాతను మురిపిస్తున్న గడుగ్గాయి
ముంబై: మూడేళ్ళ ఆ గడుగ్గాయి వయసుకు మించిన తెలివితేటలతో 72 ఏళ్ల తాతను తెగ మురిపిస్తోందట. తన ముద్దు ముద్దు మాటలతో ..అదేంటి.. ఇదేంటి.. అంటూ తెగ ప్రశ్నలు కురిపిస్తోందట. ఇంతకీ ఎవరా గడుగ్గాయి ..ఎవరా తాత అనుకుంటున్నారా.. అదేనండి.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన మనవరాలు ఆరాధ్య బచ్చన్.. ఎపుడూ షూటింగులతో బిజీబిజీగా ఉండే అమితాబ్, మనవరాలు ఆరాధ్య కబుర్లతో, కథలతో మురిసిపోతూ, తన ఆనందాన్ని ప్రకటిస్తూ బ్లాగ్ లో కమెంట్స్ పోస్ట్ చేశారు. 'మా బుజ్జి ఆరాధ్య నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటుంది... ఇంటితో పాటు, తన స్నేహితులు, బొమ్మలమీద వింత వింత కథలు చెబుతూ మాట్లాడుతుందంటూ' అమితాబ్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. పెద్ద ఆరిందాలా చమత్కారంగా మాట్లాడుతోంటే.. భలే ముచ్చటగా ఉంది.. తనతో సమయం గడపటం చాలా సంతోషంగా ఉందన్నారు అమితాబ్. ఈ దుష్ట ప్రపంచంలోకి అడుగిడబోతున్న చిన్నారుల జీవితాల్లో సంతోషం నిండిన రోజులివే కదా..అంటూ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, అందాల తార ఐశ్యర్యరాయ్ ల ముద్దుల పట్టి ఆరాధ్య. 2011లో ఈ బాలీవుడ్ తారలకు ఆరాధ్య పుట్టింది. -
అభిషేక్, ఐశ్వర్య.. ఆన్‌స్క్రీన్ క్లాష్
అభిషేక్, ఐశ్వర్యల మధ్య కీచులాట మొదలైందని ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేశాయి. ఇన్నేళ్ల పచ్చని సంసారంలో ఇదేంటని ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసింది. తన గారాల పట్టి ఆరాధ్య కోసం ఇన్నేళ్లూ సినిమాలకు దూరంగా ఉన్న ఐశ్వర్య.. ‘ఏ దిల్ హే ముష్కిల్’ సినిమాతో మరో ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతోంది. ఈ అందాల సుందరి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా.. అభిషేక్ నటిస్తున్న ‘హౌజ్‌ఫుల్ 3’ సినిమా రెండూ ఒకేసారి బాక్సాఫీస్ ముందుకు వచ్చేలా ఉన్నాయట. అదీ 2016లో. ఎప్పుడో ఆన్‌స్క్రీన్‌లో ఇద్దరి సినిమాలు క్లాష్ అవుతున్నాయని.. గాసిప్ రాయుళ్లు ఆఫ్‌స్క్రీన్‌లో ఇప్పుడే ముసలం పుట్టిందని వదంతులు పుట్టించారు. -
పెదనాన్న కొడుకే దారుణానికి పాల్పడ్డాడు
* బంధువులే యమపాశాలుగా మారుతున్నారు *మొన్న ఆరాధ్య.... తాజాగా ఉదయ్ కిరణ్ హైదరాబాద్: అయినవారే వారి.. పాలిట మృత్యువుగా మారుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారి ఆరాధ్య ఉదంతం మరవక ముందే ...అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. ఒకరేమో భార్యతో సన్నిహితంగా ఉండేందుకు చిన్నారి అడ్డు వస్తుందని బాబాయి పాశవికంగా చంపి పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తే...మరొకరు డబ్బు కోసం సోదరుడినే స్నేహితులతో కలిసి హతమార్చారు. బాటసింగారంకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్‌ను హతమార్చింది కూడా స్వయానా పెదనాన్న కొడుకే. వివరాల్లోకి వెళితే బాటసింగారం బిల్‌కలెక్టర్ పెంటయ్య కుమారుడు ఉదయ్‌కిరణ్. పెద్దఅంబర్‌పేట్‌లోని రాజాశ్రీ విద్యామందిర్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. నిన్న స్కూల్‌కు వెళ్లిన ఉదయ్ కిడ్నాప్‌కు గురయ్యాడు. పెంటయ్య అన్న కొడుకు, మాజీ హోం గార్డు నవీన్‌తో పాటు మరో నలుగురు డబ్బు కోసం కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. వనస్థలిపురం చెరువుకట్ట వద్ద విద్యార్థి మృతదేహం బయటపడింది. నిందితులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఉదయ్‌కిరణ్ తమను గుర్తు పట్టేయడంతో కిడ్నాప్ వ్యవహారం బయటపడుతుందని భయపడి అతడిని గొంతు నులిమి, హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
ఆరాధ్య చనిపోలేదు... ఊరెళ్ళింది..!
-
ఆరాధ్య చనిపోలేదు... ఊరుకెళ్లింది
ఒంగోలు : ముద్దులు మూటగట్టే తన పాప దారుణ హత్యకు గురైందన్న వార్త విని ...ఆరాధ్య తల్లి సాహితి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆరాధ్యా చనిపోలేదని... ఊరుకెళ్లిందంటూ ఆమె చెబుతున్న తీరు చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. అప్పటివరకూ తమ మధ్యే ఆడుకున్న చిన్నారి ... ఇకలేదనే విషయాన్ని...ఆరాధ్య కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరాధ్య బాబాయ్ లక్ష్మీనారాయణ ఎందుకిలా చేశాడో అంతు పట్టడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై చిన్నారి తాతయ్య నాగేంద్రరావు మాట్లాడుతూ ఆరాధ్యను తన చిన్నల్లుడు ఎందుకు హతమార్చాడో అర్థం కావటం లేదన్నారు. ఆరాధ్యను లక్ష్మీనారాయణ ముద్దు చేసేవాడని, ఎత్తుకుని ఆడించే వాడని అన్నారు. భార్యతో సన్నిహితంగా ఉండేందుకు పాప అడ్డుగా ఉందని చంపటం దారుణమన్నారు. ఇష్టం లేకుంటే వాళ్లు వేరే వెళ్లిపోతే సమస్య పరిష్కారం అయ్యేదని ఆయన అన్నారు. అంతేకానీ పాపను చంపేంతగా కక్ష కడతాడనుకోలేదన్నారు. ఏమి ఆశించి ఈ పని చేశాడో తెలియటం లేదన్నారు. అయితే తమ మధ్య ఎలాంటి కుటుంబ విభేదాలు లేవని అన్నారు. పాప కనిపించకపోవటంతో పోలీసులు అందర్ని విచారించారని, అయితే తన చిన్నల్లుడిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తానే ఆరాధ్యను చంపేసినట్లు ఒప్పుకున్నాడని నాగేంద్రరావు తెలిపారు. కాగా ఆరాధ్య పిన్ని సింధు..లక్ష్మీనారాయణ ప్రేమ వివాహం చేసుకున్నారు. ముందు పెద్దలకు ఇష్టం లేకపోయినా అనంతరం వారు అంగీకరించటంతో ...అందరూ కలిసే ఉంటున్నారు. -
అడ్డుగా ఉందనే ఆరాధ్యను చంపేశాడు!
-
అడ్డుగా ఉందనే ఆరాధ్యను చంపేశాడు!
ఒంగోలు : అభం శుభం తెలియని చిన్నారి ఆరాధ్యను సొంత బాబాయే దారుణంగా హత్య చేశాడు. తన భార్యతో సన్నిహితంగా గడపడానికి చిన్నారి అడ్డుగా ఉందనే కారణంతో అతడు ప్రాణాలు తీశాడు. ఒంగోలులోని రాజా పానగల్ రోడ్డులో ఉన్న శ్రీధర్, సాహితి దంపతులు తమ బిడ్డ ఆరాధ్యను ఎవరో కిడ్నాప్ చేశారంటూ నిన్న మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి బాబాయ్ లక్ష్మీనారాయణే చిన్నారిని చంపేశాడని తేల్చారు. ఆరాధ్య పిన్ని సింధూతో లక్ష్మీనారాయణకు మూడు నెలల క్రితం పెళ్లైంది. ఆరాధ్య ఎక్కువగా పిన్ని దగ్గరే ఉంటుంది. దీంతో తాను తన భార్యతో సన్నిహితంగా గడపటానికి అవకాశం ఉండట్లేదనే కోపంతో ఆరాధ్యను లక్ష్మీనారాయణ చంపేసినట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటి బయట ఆడుకుంటున్న ఆరాధ్యను బైక్‌పై ఊరి బయట పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అర్ధరాత్రి చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన ఒంగోలు పోలీసులు, నిందితుడు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. -
నేను బరువు తగ్గడానికి కారణం తనే!
మెరుపు తీగకు చిరునామా అన్నట్లుగా సన్నగా ఉండేవారు ఐశ్వర్యారాయ్. కానీ, పాప పుట్టిన తర్వాత బొద్దుగా తయారయ్యారు. తల్లయిన రెండు, మూడేళ్ల తర్వాత కూడా బరువు తగ్గకపోవడంతో విమర్శలపాలయ్యారు ఐష్. అయితే, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ, ఐష్ ఇటీవల బాగా బరువు తగ్గారు. హఠాత్తుగా ఇంత స్లిమ్ కావడానికి గల కారణం ఏంటి? అనే ప్రశ్న ఐశ్యర్యా రాయ్ ముందుంచితే - ‘‘మా అమ్మాయి ఆరాధ్య. తను నడవడం మొదలుపెట్టిన తర్వాత ఇంటిల్లిపాదినీ పరుగులు పెట్టిస్తోంది. తన పనులు చేస్తూ, తన వెనకాల పరిగెత్తడంవల్ల క్రమ క్రమంగా బరువు తగ్గాను. అఫ్కోర్స్ వ్యాయామాలు కూడా చేశాననుకోండి’’ అని పేర్కొన్నారు. తల్లయిన తర్వాత ఐశ్వర్యా రాయ్ అంగీకరించిన తొలి చిత్రం ‘జాజ్బా’. సంజయ్ గుప్తా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా కోసం ఐశ్వర్యా రాయ్‌ని బరువు తగ్గమని సంజయ్ చెప్పారనే వార్త వినిపించింది. అయితే, అలాంటిదేమీ లేదనీ, ఐష్ ఇప్పుడు బాగున్నారనీ ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. -
అక్కడ నన్నెవరూ గుర్తుపట్టరు!
‘‘అక్కడికెళ్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ‘నేను’ అనే భావన అక్కడ నాలో ఉండదు. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు నేను అందరిలో ఒక్కదాన్నే. ఆ అనుభూతి నన్ను తెలీని ఆనందానికి లోనుచేస్తుంటుంది’’ అంటున్నారు ఐశ్వర్యరాయ్. ఇంతకీ ఐష్‌కి అంతటి ప్రశాంతతనిస్తున్న ఆ ప్రదేశం ఏంటా? అనుకుంటున్నారా! ముంబయ్‌లోని జుహూ అనే ప్రాంతంలో ఉన్న శనిదేవుని ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతి శనివారం దర్శించుకుంటారు ఐష్. ఆ సమయంలో తనకు కలిగే అనుభూతుల గురించి మాట్లాడుతూ -‘‘సాధారణంగా నేను ఎక్కడకెళ్లినా అక్కడ హంగామా ఉంటుంది. సెలబ్రిటీని కాబట్టి అవన్నీ తప్పవు. కానీ... శని దేవాలయానికి వెళ్లేటప్పుడు మాత్రం అలాంటి హంగామా ఏమీ ఉండకుండా చూసుకుంటాను. ఎందుకంటే... అక్కడ నేను సెలబ్రిటీని కాను. అక్కడ దేవుడు మాత్రమే సెలబ్రిటీ. నేను సాధారణమైన భక్తురాలిని అంతే. అక్కడి భక్తులు కూడా నన్ను ఎప్పుడూ గుర్తు పట్టలేదు కూడా. ఎవరో సాధారణ స్త్రీ అని అనుకుంటారు. మా అమ్మాయి ఆరాధ్య పుట్టాక, తనను కూడా ప్రతి శనివారం వెంటబెట్టుకొని శనిదేవుని ఆలయానికి వెళ్తున్నాను. ఆ అలయంలో దొరికిన ప్రశాంతత నాకు ఇంకెక్కడా దొరకదు’’ అన్నారు. -
మ్యాక్స్ కార్ట్ ఓపెన్ విజేత ఆరాధ్య
సాక్షి, హైదరాబాద్: మైక్రో మోటార్‌స్పోర్ట్స్ రోటాక్స్ మ్యాక్స్ కార్ట్ ఓపెన్‌లో మైక్రో మ్యాక్స్ విభాగంలో యశ్ ఆరాధ్య విజేతగా నిలిచాడు. జేకే టైర్ సంస్థ ఆధ్వర్యంలో లాహిరి రిసార్ట్స్‌లోని కార్ట్ సెంటర్లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో శనివారం బెంగళూరుకు చెందిన మెకో రేసింగ్ డ్రైవర్ ఆరాధ్య.. ఐదు రేసులకుగాను నాలుగింటిలో గెలిచి 48 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మెకో రేసింగ్కే చెందిన షహన్ అలీ మొహిసిన్ (ఆగ్రా) 45 పాయింట్లతో రెండో స్థానం పొందాడు. ఇక జూనియర్ మ్యాక్స్ విభాగంలో రికీ డానిసన్ (బీపీసీ రేసింగ్) 48 పాయింట్లతో విజేతగా నిలవగా, 45 పాయింట్లు సాధించిన ఆకాశ్ గౌడ (మెకో రేసింగ్)కు రెండో స్థానం దక్కింది. సీనియర్ మ్యాక్స్ కేటగిరిలో రేయో రేసింగ్ డ్రైవర్ నయన్ చటర్జీ (ముంబై) 50 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ కేటగిరిలో 45 పాయింట్లు పొందిన కొల్హాపూర్‌కు చెందిన కృష్ణరాజ్ డి మహాదిక్ (మొహైత్ రేసింగ్) రెండో స్థానంలో నిలిచాడు. -
ప్లేస్కూల్కి ఆరాధ్యతో కలిపి ఐశ్వర్య
-
స్కూల్కెళుతున్న ఐశ్వర్యారాయ్!
ఐశ్వర్యారాయ్ ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తున్నారు. ఇది చదవగానే ‘ఈ వయసులో పాఠశాలకు వెళ్లడం ఏంటి?’ అని ఆశ్చర్యంగా ఉంది కదూ. తన కూతురు ఆరాధ్య కోసమే ఆమె పాఠశాల బాట పట్టారు. ఇటీవలే ఆరాధ్యను ప్లే స్కూల్లో చేర్చారు. పిల్లలను తొలిసారి స్కూల్‌కు పంపించేటప్పుడు ఏ తల్లీతండ్రికైనా ఒకింత బెంగగా ఉంటుంది. కొంతమంది పిల్లలు వెళ్లనని మారాం కూడా చేస్తుంటారు. కానీ, ఆరాధ్య అలాంటి పిల్ల కాదు. చక్కగా స్కూల్కెళ్తున్నారట కానీ, ఐశ్వర్యకే స్కూల్లో పిల్ల ఎలా ఉంటుందో అని బెంగ పట్టుకుంది. అందుకని తనే స్వయంగా ఆరాధ్యను డ్రాప్ చేయడంతో పాటు స్కూల్ వదిలే వరకు అక్కడే ఉంటున్నారట. దీన్నిబట్టి కూతురి విషయంలో ఆమె ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అర్థమవుతోంది. అయితే, స్కూల్ నియమ నిబంధనల ప్రకారం తల్లిదండ్రులను లోపలికి అనుమతించరు. గేట్ దగ్గరే వదిలిపెట్టి వెనక్కి తిరగాల్సిందే. కానీ, ఐష్ సీన్ వేరు కదా. మాజీ అందాల సుందరి, స్టార్ హీరోయిన్, బచ్చన్ ఇంటి కోడలు కాబట్టి నిబంధనలను పట్టించుకోకుండా కూతురితో పాటు స్కూల్లో ఉండనిస్తున్నారని ఊహించవచ్చు. -
ఐష్ నన్ను నన్నుగానే ఇష్టపడింది
తానో బాలీవుడ్ స్టార్‌నో.. లేదా బచ్చన్ కుటుంబం నుంచి వచ్చాననో ఐశ్వర్య తనను పెళ్ల చేసుకోలేదని, తనను తానుగానే ఇష్టపడిందని అభిషేక్ బచ్చన్ అన్నాడు. 'కాఫీ విత్ కరణ్' షోలో అభిషేక్ ఈ విషయం చెప్పాడు. భూ ప్రపంచంలోనే అత్యంత అందగత్తె అయిన ఐశ్వర్యా రాయ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా అభద్రతా భావంతో ఉన్నారా అని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మాట చెప్పాడు. ఈ భూమ్మీద తనకు సంబంధించి ఐశ్యర్యే అత్యంత అందగత్తె అని, ప్రతిరోజూ అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు మాత్రం చాలా భయంగా అనిపిస్తుందని అన్నాడు. అందం విషయంలో ఆమెతో పోటీ పడగలిగే పరిస్థితి లేదని తెలిపాడు. అందుకే తామిద్దరం అంత మంచి జంట కాకపోవచ్చని కూడా వ్యాఖ్యానించాడు. అయితే, ఐశ్వర్యను మాత్రం ఈ విషయంలో ఆకాశానికి ఎత్తేశాడు. ఆమె చాలా సామాన్యంగా ఉంటుందని, అసలు అంత సాధారణంగా ఉంటుందని ఎవరూ అనుకోలేరని అభిషేక్ చెప్పాడు. తాను కూడా ఐశ్వర్యను అందగత్తె అని చూసి పెళ్లి చేసుకోలేదని, ఆమె మనసును చూసే పెళ్లి చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. అందుకే తామిద్దరి మధ్య అందం అనే సమస్య ఎప్పుడూ రాలేదని జూనియర్ బచ్చన్ చెప్పాడు. 2007లో పెళ్లి చేసుకున్న అభిషేక్, ఐశ్వర్య దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. -
నా జీవితానికి గొప్ప బహుమతి: ఐశ్వర్య
బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ శుక్రవారం 41 ఏట అడుగుపెట్టారు. దీపావళి పండగతోపాటు నా పుట్టిన రోజు కూడా రావడం చాలా సంతోషం కలిగిస్తోంది. ఈ జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడికి రుణపడి ఉంటాను, ఇంత గొప్ప జీవితాన్ని ప్రసాదించిన నా తల్లి తండ్రులకు కృతజ్ఞతలు అని అన్నారు. ప్రస్తుతం తన కూతురే తనకు ప్రపంచం అని.. నా జీవితానికి ఆరాధ్య గొప్ప బహుమతి అని అన్నారు. తన కూతరు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఆర్ధరాత్రి బర్త్ డే పాటను పాడింది అని ఐశ్వర్య తెలిపింది. తన పుట్టిన రోజున క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ధన సహాయం అందించారు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ బాధితులను ఆదుకుంటాను. ఈ సంవత్సరం కూడా కొంత ఆర్ధిక సహాయాన్ని అందించాను అని అన్నారు. బాలీవుడ్ లో అగ్రతారగా రాణిస్తున్న 2007లో అభిషేక్ బచ్చన్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
అమ్మతనం నాకు దేవుడిచ్చిన వరం
‘‘జీవితంలో మార్పు సహజం. మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం వ్యక్తిగతంగా బలపడటానికి, మంచి మనిషిగా మారడానికి తోడ్పాటునిస్తాయి’’ అని ఐశ్వర్యారాయ్ అన్నారు. ఇటీవల ముంబైలో ‘లైఫ్ సెల్’ అనే జీవకణ నిధి (స్టెమ్‌సెల్ బ్యాంకింగ్)ని ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన ఐష్ తన కుమార్తె ఆరాధ్య జీవకణాలను కూడా స్టెమ్ సెల్లో భద్రపరిచారు. ఈ సందర్భంగా ఐష్ మాట్లాడుతూ -‘‘అమ్మతనం నాకు దేవుడిచ్చిన గొప్పవరం. అంతే కాదు గొప్ప జ్ఞాపకం కూడా. ఆరాధ్య నా జీవితంలోకి రావడం గొప్ప అనుభూతి. ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ గురించి నాకు పెళ్లికి ముందే తెలుసు. మిత్రులు, వైద్యుల ద్వారా ఈ వివరాలు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కుమార్తె జీవకణాలను భద్ర పరచడం చాలా ఆనందంగా ఉంది. స్టెమ్ సెల్ ప్రాముఖ్యత గురించి దేశంలో అన్ని వర్గాల వారూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని పేర్కొన్నారు ఐశ్వర్య. -
మాతృత్వం దేవుడు ప్రసాదించిన గొప్పవరం: ఐశ్వర్యరాయ్
మాతృత్వం తనకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరం అని మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ అన్నారు. జీవితంలో మార్పు సహజం అని.. ప్రతి అనుభవం వ్యక్తిగతంగా బలపడటానికి.. మంచి మనిషిగా మారడానికి తోడ్పాటును అందిస్తాయన్నారు. తల్లిగా మారడం తనకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరమే కాకుండా మధురమైన జ్క్షాపకం అని ఐశ్వర్య తెలిపింది. తమ జీవితాల్లోకి తన కూతురు ఆరాధ్య రావడం గొప్ప అనుభూతి, ఓ ప్రత్యేకమైన అనుభవం అన్నారు. ముంబైలో లైఫ్ సెల్ అనే జీవ కణ నిధి (స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ) శాఖను ఆరంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ పాల్గొన్నారు. తన కూతురు ఆరాధ్య కు చెందిన జీవకణాలను భద్ర పరిచానని ఆమె తెలిపారు. వైద్యులు, స్నేహితుల ద్వారా వైద్యరంగంలో జీవకణాలను భద్రపరిచే విషయాన్ని పెళ్లికి ముందే తెలుసుకున్నానని ఐశ్వర్య ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.