
‘‘సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి? అనే అంశంపై తీసిన చిత్రమే ‘శారీ’. ఈ సినిమాకు నేను మూల కథ అందించాను. కథ రాసినప్పుడు నేను ఊహించనదానికంటే సినిమాను బాగా తీశాడు దర్శకుడు గిరికృష్ణ కమల్.
ఈ సినిమా సబ్జెక్ట్‌ను చర్చిస్తున్నప్పుడు, అతని ఆలోచనలు నచ్చి, ‘శారీ’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించాను’’ అని దర్శక–నిర్మాత–రచయిత రామ్‌గోపాల్ వర్మ అన్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘శారీ’. గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ పతాకాలపై రవిశంకర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో గిరికృష్ణ కమల్ మాట్లాడుతూ– ‘‘సత్య, ఆరాధ్య... ఇలా ప్రధానంగా రెండు పాత్రలతో సాగే ఇంటెన్స్ డ్రామా ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘ఇది నాకో డ్రీమ్ ప్రాజెక్ట్’’ అని పేర్కొన్నారు ఆరాధ్య దేవి. ‘‘ఈ మూవీలో ఉన్నవి తక్కువ పాత్రలే అయినా, అవి ఎఫెక్టివ్‌గా ఉంటాయి’’ అని తెలిపారు సత్య యాదు. ‘‘గులాబి’ సినిమా నుంచి రామ్‌గోపాల్ వర్మతో వర్క్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు ఏ మూవీ కోసం పిలిచినా రెడీగా ఉంటాను’’ అని చె΄్పారు ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్.