
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న తాజా చిత్రం శారీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. కేవలం ఆమె ఫోటోతోనే సినిమాపై అంచనాలు పెంచేసిన వర్మ.. తాజాగా ట్రైలర్‌తో మరింత బజ్ క్రియేట్ చేశారు. ఒక వ్యక్తిపై ప్రేమ మరీ ఎక్కువైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ మూవీ తీశారు.
పాన్ ఇండియా రేంజ్‌లో ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రముఖ బిజినెస్‌మాన్ రవి వర్మ నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'శారీ' తీశారు. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు.
ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలో యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment