
‘‘సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అనే నేపథ్యంలో ‘శారీ’ రూపొందింది. నేనీ చిత్రానికి మూల కథ రాశాను. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు. ‘శారీ’లో సందేశం ఉంటుందని చెప్పను గానీ, ఈ సినిమా చూశాక అమ్మాయిలు జాగ్రత్త పడతారు’’ అని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. సత్య యాదు, ఆరాధ్యా దేవి ప్రధాన పాత్రల్లో గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శారీ’.
C

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవారిపై కేసులు పెట్టడంపై స్పందిస్తూ.. తాము చేస్తున్న యాడ్స్ లీగలా? కాదా? అనేది యాక్టర్స్‌కు, స్టార్స్‌కు తెలియకపోవచ్చు. దానిపై అధికారులు నటీనటులకు అవగాహన కల్పించాలి. అంతేగానీ సడెన్‌గా చర్యలు తీసుకోవడం సరికాదు’’ అన్నారు. ‘‘ఆరాధ్య, సత్య బాగా నటించడం వల్ల దర్శకుడిగా నాపై ఒత్తిడి తగ్గింది’’ అని గిరి కృష్ణకమల్ చెప్పారు. ‘‘ఈ సినిమాలో నా పాత్ర చిన్నదే అయినా కథలో కీలకంగా ఉంటుంది’’ అని సత్య యాదు తెలిపారు.
చదవండి: పాన్ ఇండియా సినిమాకు నిర్మాతగా 20ఏళ్ల యువతి సక్సెస్
Comments
Please login to add a commentAdd a comment