Betting App Case
-
బడా హీరోలు, సెలబ్రిటీలకు బిగుస్తున్న ఉచ్చు
-
సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్/మియాపూర్: ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజగుట్ట ఠాణాలో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కాగా... తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మందిపై రిజిస్టరైంది. ఇందులో సినీనటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తదితరులు నిందితులుగా ఉన్నారు. మియాపూర్‌కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాలక్రమంలో బానిసలుగా...: బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌కు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫణీంద్ర గత ఆదివారం తమ కాలనీకి చెందిన యువకులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే వారిలో అత్యధికులు ఈ యాప్స్‌పై ఆసక్తి చూపడాన్ని గమనించారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమే దీనికి కారణమని ఫణీంద్ర గుర్తించారు. ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారం యువతను ప్రధానంగా డబ్బు అవసరం ఉన్న వారిని బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోకి లాగుతోందని, అనేకమంది వాటిలో డబ్బు పెట్టి నిండా మునిగిపోతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు ఫణీంద్ర గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పూర్తి వివరాలు సమరి్పస్తూ బుధవారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా రంగంలోకి.. పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై బీఎన్ఎస్లోని 318 (4), 112 రెడ్ విత్ 49, గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4, ఐటీ యాక్ట్‌లోని 66 డీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నిందితుల్లో కొందరు పంజగుట్టలో నమోదైన కేసులోనూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల వివరాలను సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మరోపక్క పంజగుట్ట కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మంగళ, బుధవారాల్లో టేస్టీ తేజ, హబీబ్‌నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్‌ను ప్రశ్నించారు. గురువారం విష్ణు ప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని 3 నుంచి 8 గంటలపాటు ప్రశి్నస్తున్న అధికారులు కొందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాము కేవలం స్కిల్డ్ గేమ్ అని చెప్పడంతోనో, తెలియకో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేశామని కొందరు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ యాప్స్ నిర్వాహకులతో బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో తదుపరి విచారణకు బ్యాంకు స్టేట్మెంట్స్తో హాజరుకావాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు. మిగిలిన ఇన్ఫ్లూయన్సర్లు ఒకటిరెండు రోజుల్లో విచారణకు రానున్నారు. -
రానాపై బెట్టింగ్ యాప్ కేసు.. స్పందించిన టీమ్
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటిపై వస్తున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రానాపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రానా పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. స్కిల్ ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. అయితే ఈ అగ్రిమెంట్ 2017లోనే ముగిసిందని వెల్లడించింది. కేవలం చట్టబద్ధమైన కంపెనీలకే రానా ప్రమోట్ చేశారని పీఆర్ రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొందిఏదైనా ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షిస్తుందని వివరించారు. చట్టపరంగా అనుగుణంగా ఉంటేనే రానా అంగీకరిస్తారని తెలిపారు. రానా దగ్గుబాటి ప్రమోట్ చేసిన యాప్ చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికే ఈ ప్రెస్ నోట్ జారీ చేశామని వెల్లడించారు. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్లైన్ గేమ్‌లను హైలైట్ చేయడం చాలా అవసరమని.. ఇలాంటి గేమ్‌లు నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని.. అందువల్ల చట్టబద్ధంగా వీటిని అనుమతించారని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని నోట్లో ప్రస్తావించారు.బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్, యూట్యూబర్స్‌తో పాటు పలువురు బుల్లితెర నటీనటులపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియతో పాటు రీతూ చౌదరి పంజాగుట్ట పీఎస్‌లో పోలీసులకు వివరణ ఇచ్చారు. -
బెట్టింగ్ యాప్ కేసు.. అవును ప్రమోట్ చేశా.. కానీ: స్పందించిన ప్రకాశ్ రాజ్
బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను కూడా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు. అయితే 2016 జూన్‌లో ఓ యాడ్ చేసినట్లు తెలిపారు. అది కేవలం ఏడాది పాటు మాత్రమే చేసుకున్న అగ్రిమెంట్ అని వెల్లడించారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.ఈ వ్యవహారంపై వీడియోలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..' బెట్టింగ్ యాప్ కేసు గురించి ఇప్పుడే తెలిసింది. 2016లో ఓ యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను ఆ యాడ్ చేసిన మాట నిజమే. కానీ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లోనూ ఒప్పందం పొడిగిస్తామని కంపెనీ వాళ్లు అడిగారు. కానీ నేను ఆ యాడ్‌ను ప్రసారం చేయవద్దని కోరా. 9 ఏళ్ల కిందట ఏడాది పాటు ఒప్పందంతో చేసుకుని ఈ యాడ్ చేశా. ఇప్పుడు ఏ గేమింగ్ యాప్‌కు ప్రచారకర్తగా పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపా. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. ఒకవేళ పిలిస్తే నేను చేసిన ప్రకటనపై పోలీసులకు వివరణ ఇస్తా' అని అన్నారు.My response 🙏🏿🙏🏿🙏🏿 #SayNoToBettingAps #justasking pic.twitter.com/TErKkUb6ls— Prakash Raj (@prakashraaj) March 20, 2025 -
బెట్టింగ్ యాప్స్‌పై ప్రకాష్ రాజ్ వివరణ
-
Betting Apps: ఒక్కో వీడియోకు రూ. 90వేలు తీసుకున్నట్లు విష్ణుప్రియ వెల్లడి
-
బెట్టింగ్ యాప్స్ కేసు.. స్పందించిన విజయ్ దేవరకొండ టీమ్!
బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పేరు కూడా నమోదైన సంగతి తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై ఆయనర్ టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్స్ (Betting App Case)కి విజయ్ దేవరకొండ ప్రచారం చేయలేదని.. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రమోషన్స్ చేశారని క్లారిటీ ఇచ్చింది. విజయ్ ప్రచారం చేసిన కంపెనీలు అన్ని చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని , ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పీఆర్ టీమ్ తెలియజేసింది.విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు’అని ఆయన పీఆర్ టీమ్ పేర్కొంది. -
బెట్టింగ్ యాప్ కేసు.. భారీగా డబ్బులు వచ్చాయన్న విష్ణుప్రియ
బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో బిగ్‌బాస్ బ్యూటీ, యాంకర్ విష్ణుప్రియ ఇవాళ పోలీసుల విచారణకు హాజరైంది. తన లాయర్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ విచారణలో విష్ణు ప్రియ పలు కీలక విషయాలను వెల్లడించింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు పోలీసుల ఎందుట అంగీకరించింది.అయితే తాను దాదాపు 15 రకాల బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు పోలీసులకు వివరించింది. అలా ఒక్కో యాప్‌నకు దాదాపు రూ.90 వేలు ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ విచారణలో విష్ణుప్రియ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు.. ఆమె మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఈ కేసులో ఆమెను సుమారుగా రెండు గంటలకు పైగా విచారించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు యూట్యూబర్లతో పాటు సినీతారలపై కూడా కేసులు నమోదయ్యాయి. విష్ణు ప్రియతో పాటు సుప్రీత, టేస్టీ తేజ మరో 11 మంది బుల్లితెర నటులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బీ అలర్ట్.. వారికి కఠిన చర్యలు తప్పవు: సజ్జనార్ హెచ్చరిక
బెట్టింగ్.. ఈ పేరు వింటేనే ఎంతోమంది జీవితాలు ఛిద్రమైన ఉదంతాలు గుర్తుకు వస్తాయి. బెట్టింగ్ యాప్‌లు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ వ్యసనంలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఉండగా.. యువత సైతం తప్పుడు దారిలో వెళ్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. దీంతో, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘యువత, ఎందరో బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రెటీలు ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకపోవడం మంచిది. యాప్‌ను ఎవరు ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి యాప్ వస్తున్నాయి అనేది చూడాలి. ఎవరు అప్లోడ్ చేస్తున్నారు అనేది పర్యవేక్షించాలి. ఈ యాప్స్ ద్వారా ఎవరు లాభం పొందారు అనేది కూడా విచారణ చేపట్టాలి. ఇలాంటి యాప్స్ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు.ఇలాంటి యాప్స్‌పై అవగాహన కల్పించాలి. ఇప్పటకే పలు విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. డిజిటల్ అరెస్ట్, బ్యాంక్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, ఓఎల్ఎక్స్ నేరాలు ఇలాంటివి అన్నీ గతంలో జరిగాయి. ప్రధాని మోదీ కూడా డిజిటల్ అరెస్ట్ మోసాలను వివరించారు. దీంతో, మోసాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే, బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అందరికీ అవగాహన కల్పిస్తే మోసాలు తగ్గిపోతాయి. మళ్లీ చెబుతున్నాను.. బెట్టింగ్ యాప్స్ వెళ్లకండి. జీవితాలను నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడకండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కదలికలు, ప్రవర్తనను గమనించాలి’ అని కోరారు.అలాగే, ప్రస్తుతం మార్కెట్లో వేలాది బెట్టింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటిని ప్రోత్సహించే యూట్యూబర్లను, ప్రచారకర్తలను నమ్మ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రికెటర్లు, సినీ స్టార్లు, టీవీ సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు కోసం ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. కష్టపడి పనిచేస్తేనే డబ్బు వస్తుందని, షార్ట్‌కట్ మార్గాల్లో డబ్బును ఆశిస్తే నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే యూట్యూబర్లను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సజ్జనార్ తెలిపారు. ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే ఉద్యమం ఊపందుకుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం.. సారీ చెప్పాం.. ఇంకేంటి? సురేఖావాణి ఫైర్
ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ (Betting App Case) ప్రమోట్ చేసినవారిపై పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. ఈ జాబితాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, నటీనటులు ఉన్నారు. ఈ క్రమంలోనే నటి సురేఖావాణి కూతురు సుప్రీత (Supritha), టేస్టీ తేజ, రీతూ చౌదరి వంటివారు తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని లెంపకాయలు వేసుకున్నారు. ఇకపై దాని జోలికి వెళ్లమని.. ఎవరూ బెట్టింగ్ యాప్స్‌ను నమ్మొద్దని వీడియోలు రిలీజ్ చేశారు.అడిగారు.. చేశాం.. అంతే!ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం గురించి ప్రశ్నించిన యాంకర్‌తో నటి సురేఖావాణి (Surekha Vani) దురుసుగా మాట్లాడింది. అందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయమని ఎవరు అప్రోచ్ అయ్యారు? అని యాంకర్ అడిగింది. అందుకు సురేఖ.. మేము బెట్టింగ్ యాప్స్‌ను పెద్దగా ప్రమోట్ చేయలేదమ్మా.. వాళ్ల పోస్టులను రీపోస్ట్ చేయమంటే చేశామంతే! అని బదులిచ్చింది.తెలీక చేశాం.. సారీ చెప్పాంబెట్టింగ్ యాప్స్ గురించి తెలియనప్పుడు అలా పోస్టులు చేసి మళ్లీ ఇప్పుడెందుకు సారీ చెప్తున్నారు? అని యాంకర్ ప్రశ్నించింది. తెలియకుండా చేశాం కాబట్టే సారీ చెప్పాం.. అయినా తెలియకుండా ఎందుకు చేశారు? అంటున్నారు.. తెలీదు కాబట్టే చేశాం కదా.. మళ్లీ ఇదేం ప్రశ్న? అని సీరియస్ అయింది. పోస్టులో ఏముందో తెలుసుకోకుండా రీపోస్ట్ చేయొద్దు కదా? అని యాంకర్ అంటుంటే అందుకే కదా సారీ చెప్పింది అని సురేఖ విసుక్కుంది. మాకింకా తెల్లారలేదు.. విసుక్కున్న సురేఖఅంటే తెలియకుండానే ఆ యాప్స్ ప్రమోట్ చేశారంటారు.. అని యాంకర్ అడుగుతుంటే.. మీకు తెల్లారిందేమో.. కానీ మాకింకా తెల్లారలేదమ్మా.. నేను తర్వాత మాట్లాడతా.. అని ఫోన్ కట్ చేసింది. ఇకపోతే బెట్టింగ్ యాప్స్ కేసులో బుల్లితెర స్టార్స్‌తో పాటు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా, నిధి అగర్వాల్ వంటి టాలీవుడ్ స్టార్స్ సైతం ఉన్నారు.చదవండి: బెట్టింగ్ యాప్స్ కేసు: విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిపై కేసు! -
బెట్టింగ్ యాప్ ల ప్రమోటర్లపై ఉక్కుపాదం
-
బెట్టింగ్ యాప్స్ కేసు: విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిపై కేసు!
సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Case)తో ప్రజలను బెట్టింగ్ ఊబిలో దించుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని అధారంగా ఇప్పటికే కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. (చదవండి: పంజాగుట్ట పీఎస్‌కు విష్ణుప్రియ!)తాజాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి (Lakshmi Manchu), నిధి అగర్వాల్‌పై కూడా కేసు నమోదు చేశారు. అలాగే నటుడు ప్రకాశ్ రాజ్, హీరోయిన్లు ప్రణీత, అనన్య నాగళ్ల, బుల్లితెర నటులు సిరి హనుమంతు ,,శ్రీముఖి,, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి ,నాయిని పావని, నేహా పతాన్ ,పాండు, పద్మావతి ,ఇమ్రాన్ ఖాన్‌తో సహా మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. తన అడ్వకేట్‌తో కలిసి వెళ్లిన విష్ణుప్రియను పోలీసులు తమదైన శైలీలో విచారణ చేస్తున్నారు.