
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవారిలో యూట్యూబర్ల నుంచి సినిమా స్టార్ల వరకు చాలామంది ఉన్నారు. అయితే వీరిలో కొంతమందికి ఈ యాప్స్ గురించి కనీస అవగాహన లేదు. నిమిషానికి లక్షలు ఇస్తున్నారనగానే ముందూవెనకా ఆలోచించకుండా ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడేమో కేసు (Betting App Case)లో ఇరుక్కుని బాధపడుతున్నారు. ఆ జాబితాలో హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla) కూడా ఉంది.
అనన్య క్షమాపణలు
అవగాహన లేకపోవడం వల్లే సదరు యాప్స్‌ను ప్రమోట్ చేశామని అంగీకరించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది. నేను తెలిసి ప్రమోషన్స్ చేయలేదు. అందరు సెలబ్రిటీలు చేస్తున్నారు.. కాబట్టి అందులో తప్పేం లేదనుకున్నాను. కానీ ఇకమీదట జాగ్రత్తగా ఉంటాను. బాధ్యతగా మసులుకుంటాను అని పోస్ట్ పెట్టింది.
మరి ఇదేంటి? మాకెలా తెలుస్తుంది?
అదే సమయంలో మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడాన్ని తప్పు పట్టింది. ప్రభుత్వ ఆస్తులపై బెట్టింగ్ యాప్స్‌ను ఇలా యథేచ్చగా ప్రమోట్ చేస్తున్నారు. అలాంటప్పుడు అది చట్టరీత్యా నేరమని మాకెలా తెలుస్తుంది? అని ప్రశ్నించింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు.. ఆమె తెలియక చేశానని చెప్పాక నిందించడం సరి కాదని భావిస్తున్నారు.

మల్లేశంతో కెరీర్ మొదలు
మరికొందరేమో.. లక్షల మంది అభిమానులున్నప్పుడు ఏ చిన్న పోస్ట్ పెట్టాలన్నా దాని దుష్ప్రభావాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి అని సూచిస్తున్నారు. మల్లేశం సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది అనన్య నాగళ్ల. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మాస్ట్రో, మళ్లీ పెళ్లి వంటి పలు సినిమాలు చేసింది. గతేడాది.. తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలతో మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment