Ananya Nagalla
-
అనన్య నాగళ్ల గొప్పమనసు.. అలాంటి వారికోసం తానే స్వయంగా!
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవలే పొట్టేల్ మూవీతో అభిమానులను అలరించింది. సాహిత్ మోత్కూరి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మూవీలో అనన్య నటిస్తోంది. ఎస్డీటీ18 వర్కింగ్ టైటిల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.అయితే తెలుగమ్మాయి అయిన అనన్య సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో అభాగ్యులకు అండగా నిలిచారు. అసలే చలికాలం.. రోడ్లపై ఎక్కడపడితే ఎంతోమంది నిరాశ్రయులు నివసిస్తున్నారు. అలాంటి వారికోసం తానే స్వయంగా దుప్పట్లు అందించింది. బస్టాండ్‌లో నిద్రిస్తున్న వారికి తన వంతుసాయంగా వారికి దుప్పట్లు అందజేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ అనన్య చేసిన మంచిపనికి అభినందిస్తున్నారు. కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అనన్య ప్రధాన పాత్రలో తంత్ర మూవీతో ఆకట్టుకుంది. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. A warm gesture by @AnanyaNagalla as she distributes blankets to those in need 😍Truly Heartwarming #Humanity 💫#AnanyaNagalla 🫶🏻pic.twitter.com/JQQsbxaYWU— #𝐒𝐫𝐢𝐧𝐢𝐯𝐚𝐬 (@srinureddypalli) November 12, 2024 -
Pottel Review: ‘పొట్టేల్’ మూవీ రివ్యూ
టైటిల్: పొట్టేల్నటీనటులు: యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులునిర్మాణ సంస్థ: నిసా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగెదర్శకత్వం: సాహిత్ మోత్కూరిసంగీతం: శేఖర్ చంద్రసినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజుఈ మధ్యలో కాలంలో బాగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్న చిన్న సినిమా ‘పొట్టేల్’. పెద్ద మూవీ స్థాయిలో ప్రమోషన్స్ చేపట్టారు. దానికి తోడు ఓ ప్రెస్మీట్లో అనన్య నాగళ్లను ఓ లేడి రిపోర్టర్ అడిగిన ప్రశ్న వివాదాస్పదంగా మారడంతో ‘పొట్టేల్’మూవీ గురించి పెద్ద చర్చే జరిగింది. మొత్తంగా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ‘పొట్టేల్’పైనే కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొట్టేల్ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..1970-80 మధ్యకాలంలో సాగే కథ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఓ చిన్న పల్లెటూరు గుర్రంగట్టు. అక్కడ పటేళ్లదే రాజ్యం. ఆ ఊరిలో 12 ఏళ్లకు ఒక్కసారి బాలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండు సార్లు జాతర సమయానికి బలి ఇచ్చే పొట్టేల్ చనిపోవడంతో ఆ ఊర్లో కరువు తాండవిస్తుంది. అలాగే ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోతుంటారు. ఈసారి జాతరకు ఎలాగైనా పొట్టేల్ని బలి ఇవ్వాలని, దాని కాపాడాల్సిన బాధ్యతను గొర్రెల కాపరి పెద్ద గంగాధరి (యువచంద్ర కృష్ణ)కు అప్పగిస్తారు. పటేల్(అజయ్) చేసే మోసాలన్నీ గంగాధరికి తెలుసు. తన అవసరాల కోసమే బాలమ్మ సిగం(పూనకం రావడం) వచ్చినట్లు నటిస్తున్నాడని.. ఆయన మాటలు నమ్మొదని చెప్పినా ప్రజలెవరు పట్టించుకోరు. భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ల) మాత్రం గంగాధరి మాటలను నమ్ముతుంది. పటేళ్ల పిల్లల మాదిరే తన కూతురు సరస్వతికి కూడా చదువు చెప్పించాలనుకుంటాడు. ఇది పటేల్‌కు నచ్చదు. దీంతో ఊరి బడి పంతులు(శ్రీకాంత్ అయ్యంగార్)ని బ్రతిమిలాడి కూతురికి రహస్యంగా చదువు చెప్పిస్తాడు. ఇంతలో ఊరి జాతర దగ్గర పడుతుందనగా బాలమ్మ పొట్టేల్ కనిపించకుండా పోతుంది. గాంగాధరి తప్పిదం వల్లే పొట్టేల్ పోయిందని.. దాని తీసుకురావాల్సిన బాధ్యత అతనిదే అని పటేల్ ఆదేశిస్తాడు. అంతేకాదు బాలమ్మ పూనినట్లు నటిస్తూ.. పొట్టేల్ని తీసుకురాకుంటే ఈసారి జాతరలో గంగాధరి కూతురు సరస్వతిని బలి ఇవ్వాలని చెబుతాడు. ఊరి జనాలు కూడా ఇది బాలమ్మ ఆదేశం అని నమ్ముతారు. అసలు పొట్టేల్ ఎలా మాయం అయింది? కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం గంగాధరి ఏం చేశాడు. చివరకు పొట్టేల్ దొరికిందా లేదా? పటేల్ నిజస్వరూపం తెలిసిన తర్వాత ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే?ఎంత మంచి కథ అయినా సరే తెరపై ఆసక్తికరంగా చూపిస్తేనే విజయం సాధిస్తుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడు ఆ కథ గురించే ఆలోచించాలి. ఆ పాత్రలతో కనెక్ట్ కావాలి. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తూ ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చేయాలి. ఇదంతా జరగాలంటే కథతో పాటు కథనాన్ని బలంగా రాసుకోవాలి. కథ బాగుండి.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించపోతే ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. పొట్టేల్ విషయంలో అదే జరిగినట్లు అనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథ.. ఇవ్వాలనుకున్న సందేశం చాలా బాగుంది. కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు.పేరుకు ఇది చిన్న సినిమానే కానీ కథ మాత్రం చాలా పెద్దది. 1970-80 కాలంలో ఉన్న పటేళ్ల పెత్తనం, మూఢ నమ్మకాలు, సమాజంలో ఉన్న అసమానతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే చదువు యొక్క గొప్పదనాన్ని తెలియజేశాడు. సినిమా ప్రారంభంలోనే చాలా పాత్రలను పరిచయం చేశాడు. పటేల్ వ్యవస్థ బలంగా మారడానికి గల కారణాన్ని చూపించాడు. అలాగే బాలమ్మ జాతర నేపథ్యాన్ని కూడా ఓ యానిమేషన్ సీన్‌తో వివరించాడు. ఆ తర్వాత బుజ్జమ్మ, గంగాధరి లవ్‌స్టోరీ మొదలవుతుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకునే కథ పెద్దగా ఉండడంతో ప్రేమకథను త్వరగా ముగించి మళ్లీ అసలు కథను ప్రారంభించాడు. కూతురు చదవు కోసం హీరో పడే కష్టాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. కథ ప్రారంభం నుంచి మొదటి 30 నిమిషాలు ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ నెరేషన్లో కథనాన్ని సాగిస్తూ ప్రేక్షకుడు కథపై శ్రద్ధ చూపించేలా చేశాడు. అయితే హీరోహీరోయిన్ల మధ్య లవ్‌స్టోరీతో పాటు మరికొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో హింస ఎక్కువైనట్లు అనిపిస్తుంది. హీరో ప్రతిసారి పటేల్ చేతిలో దెబ్బలు తింటూనే ఉంటాడు. అలాగే కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. హింసను తగ్గించి, కథనాన్ని మరింత వేగవంతంగా నడిపించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించినవారంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. గొర్రెల కాపరి గంగాధరిగా యువచంద్ర కృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో బాగా నటించాడు. అనన్య నాగళ్ల పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పటెల్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. తెరపై ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. శ్రీకాంత్ అయ్యంగార్, నోయల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
ఐదేళ్ల కష్టం వృథా అయ్యింది.. ‘కమిట్మెంట్’ ప్రశ్నపై స్పందించిన అనన్య
‘పొట్టేల్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో హీరోయిన్ అనన్య నాగళ్లకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌ని ప్రస్తావిస్తూ.. ‘అవకాశాల కోసం హీరోయిన్లు కమిట్మెంట్ ఇవ్వాలట కదా .. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా?’అని ఓ మహిళా జర్నలిస్ట్ అనన్యను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు షాకైన అనన్య.. సున్నితంగా సమాధానం ఇచ్చి అక్కడితో ఆ ఇష్యూని ఆపేసింది. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. చాలా మంది అనన్యకు మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు.తాజాగా ఈ వైరల్ వీడియోపై అనన్య స్పందించింది. సంస్కారం ఉన్నవాళ్లు ఇలాంటి ప్రశ్నలు అడగరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతు..‘ఇంత డైరెక్ట్‌గా అలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారని ఇంటికి వెళ్లాక ఆలోచించాను. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు అడగరు. మీడియా వాళ్లు చాలా మంది నాకు కాల్ చేసి ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ..ఒక తెలుగమ్మాయిని అలా అడగడం బాధగా ఉందని చెప్పారు. వాళ్లు నా గురించి చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఒక తెలుగమ్మాయిని వాళ్లు ఇంతలా సపోర్ట్ చేస్తుండడం సంతోషంగా ఉంది. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. దాని కోసం ఐదేళ్లుగా ఇంట్లో వాళ్లతో ఫైట్ చేస్తున్నా. కానీ ఆ ఒక్క ప్రశ్నతో నా ఐదేళ్ల కష్టం వృథా అయిందనిపించింది. నేను ఇప్పుడు సక్సెస్ అయినా.. కమిట్మెంట్కు అంగీకరించాను కాబట్టి సక్సెస్ అయ్యానని అందరూ అనుకుంటారు. ఇప్పుడు మళ్లీ బంధువులందరూ ఇదే విషయం మా అమ్మను అడుగుతారు. ఆ జర్నలిస్ట్ ప్రశ్న వేసినప్పుడు నాకు ఇన్ని ఆలోచనలు రాలేదు. ఆమెకు సంస్కారం లేదా? ఇలాంటి ప్రశ్న వేసిందనుకున్నా ఇంటికి వెళ్లాక దీని గురించి ఎంతో ఆలోచించా. ఇంకా నయం ఆ ప్రెస్ మీట్‌కి మా అమ్మను రమ్మని చెప్పారు. తనే రానని చెప్పింది. వచ్చి ఉంటే చాలా బాధపడేది’అని అనన్య అన్నారు. కాగా అనన్య, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ‘పొట్టేల్’చిత్రం అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘పోటెల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అందుకు సంతోషంగా ఉంది: అనన్య నాగళ్ల
‘‘ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకు సుదీర్ఘమైన ప్రయాణం ఉంటోంది. ఈషా రెబ్బా, చాందినీ చౌదరిలాంటి వారు ఎప్పట్నుంచో సినిమాలు చేస్తున్నారు. కొందరు హీరోయిన్లు టాప్ లీగ్‌లో ఉండి, కొంతకాలం తర్వాత వెళ్లిపోతున్నారు. కానీ, తెలుగువారికి మాత్రం కెరీర్ పరంగా ఎక్కువ కాలం ఉంటోంది. ఇందుకు సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా, అజయ్ కీలక ΄పాత్రలో నటించిన చిత్రం పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.ఈ సందర్భంగా అనన్య నాగళ్ల మాట్లాడుతూ– ‘‘తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమల్లో అక్కడి స్థానిక హీరో యిన్లు 60–70 శాతం ఉంటే, మిగతావారు ఇతర పరిశ్రమలవారు ఉంటారు. కానీ మన దగ్గర 80 శాతం మంది ఇతర ఇండస్ట్రీ హీరోయిన్లు ఉన్నారు. కంటెంట్ బేస్డ్ చిన్న సినిమాలు, పరిమిత బడ్జెట్‌తో సినిమాలు చేసే దర్శక–నిర్మాతలు మాత్రమే తెలుగు హీరోయిన్లను ప్రిఫర్ చేస్తున్నారు.పొట్టేల్’ సినిమాలో బుజ్జమ్మ అనే బలమైన తల్లి ΄పాత్ర చేశాను. నటనకు అవకాశం ఉండి, నాకు నచ్చిన ΄పాత్రలు చేస్తున్నాను. తోటి హీరోయిన్లతో ΄పోటీ గురించి ఆలోచించే సమయం లేదు. నాకు ఓ మంచి కమర్షియల్ సక్సెస్ ఉండి ఉంటే నా కెరీర్ మరింత బాగుండేది. కోవిడ్ టైంలో నాకు పెద్దగా చాన్స్‌లు రాలేదు. ఉద్యోగాన్ని మానేసి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానని అప్పుడు పశ్చాత్తాప పడ్డాను. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, ‘కథకళి, లేచింది మహిళా లోకం’ సినిమాలు చేస్తున్నా’’ అన్నారు. -
రెడ్ కలర్ శారీలో ఎర్ర గులాబీల మెరిసిపోతున్న అనన్య నాగళ్ల (ఫొటోలు)
-
పొట్టేల్ రియల్‌పాన్ ఇండియన్ మూవీ: సంయుక్తా మీనన్
‘‘పొట్టేల్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ కథ మీద డైరెక్టర్ సాహిత్ నాలుగేళ్లు పని చేయడం మామూలు విషయం కాదు. మంచి రైటింగ్, డైరెక్షన్ ఉంటేనే ఇంత అద్భుతమైన సినిమా తెరపైకి వస్తుంది. ఈ ట్రైలర్లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు ఒక రియల్‌పాన్ ఇండియన్ ఫిల్మ్‌లా అనిపించింది’’ అని హీరోయిన్ సంయుక్తా మీనన్ అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో అజయ్ కీలకపాత్రలో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సంయుక్తా మీనన్ మాట్లాడుతూ– ‘‘నిశాంక్గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ΄ప్యాషన్నేట్ ప్రోడ్యూసర్ అనిపించింది. ఇలాంటి ΄ప్యాషన్ ఉన్న నిర్మాతలు పరిశ్రమకి కావాలి’’ అన్నారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ– ‘‘ట్రైలర్లో చూసింది ఒక శాతం మాత్రమే. ఈ చిత్రంలో గొప్ప కథ ఉంది’’ అని చెప్పారు. ‘‘చాలా ప్రేమించి ఈ చిత్రం చేశాం’’ అన్నారు యువ చంద్రకృష్ణ. ‘‘ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సాహిత్ మోత్కూరి పేర్కొన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో నిర్మించిన ఈ చిత్రం పెద్ద సౌండ్ చేయబోతోంది. సాహిత్ అద్భుతంగా తీశాడు’’ అని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే తెలిపారు. -
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే?
అనన్య నాగళ్ల ప్రస్తుతం పొట్టేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తంత్ర, డార్లింగ్ సినిమాలతో అలరించిన అనన్య మరోసారి అభిమానులను అలరించనుంది. సాహిత్ మోతూకూరి డైరెక్షన్లో వస్తోన్న పొట్టేల్ మూవీలో అనన్య లీడ్ రోల్లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.అయితే ఈవెంట్‌కు హాజరైన అనన్య నాగళ్లకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు? ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్ అడుగుతారని టాక్ ఉంది.. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అని అనన్యను ప్రశ్నించింది.(ఇది చదవండి: అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్ వచ్చేసింది!)దీనిపై అనన్య మాట్లాడుతూ..'నాకైతే ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. మీరు తెలుసుకోకుండా వందశాతం ఉంటుందని ఎలా చెబుతున్నారు. ఇండస్ట్రీలో అలా జరుగుతుంది అని చెప్పడం వందశాతం తప్పు. అవకాశం రావడం కంటే ముందే కమిట్మెంట్ అనేది టాలీవుడ్లో లేదు. ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్ అనేది సమానంగా ఉంటాయి. మీకు అనుభవం లేకపోయినా ఎలా అడుగుతున్నారు.. నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవు' అని అన్నారు. కాగా.. అనన్య నటించిన పొట్టేల్ సినిమా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాస్టింగ్ కౌచ్ గురించి జర్నలిస్ట్ నోరు మూయించిన అనన్య 💥#AnanyaNagalla #Pottel #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/3hlxsVeu4c— Telugu FilmNagar (@telugufilmnagar) October 18, 2024 -
అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్ వచ్చేసింది!
అనన్య నాగళ్ల, యువచంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం పొట్టేల్. 1980లోని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. బందం రేగడ్, సవారీ చిత్రాల ఫేమ్ సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఆ కాలంలో మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కూతురికి చదివించాలని తండ్రిపడే తపన.. ఆ నాటి పరిస్థితులే కథాంశంగా తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో పొట్టేల్ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీమందించారు. అజయ్, నోయెల్, ప్రియాంక శర్మ కీలక పాత్రలు పోషించారు. -
ఫ్లైట్‌లోనూ వదల్లేదు.. ఇలా కూడా చేస్తారా!
టాలీవుడ్ హీరోయిన్, తెలుగుమ్మాయి అనన్య నాగళ్ల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ ఏడాదిలో ఇటీవలే తంత్ర, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పొట్టేల్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంలో యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్నారు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ నిర్మించారు. కాగా.. పొట్టేల్ చిత్రాన్ని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు.అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మూవీ టీమ్. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో పొట్టేల్ చిత్రబృందం వచ్చినా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏకంగా వారు ప్రయాణించే ఫ్లైట్‌లోనే సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. ఫ్లైట్‌లో కూర్చుని ఉన్న ప్రయాణికులకు పొట్టేల్ మూవీ పోస్టర్లను అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాం' అంటూ అనన్య నాగళ్ల వీడియోను ట్విటర్లో పంచుకుంది. కాగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.(ఇది చదవండి: ఎందుకింత నెగెటివిటీ?.. నెటిజన్స్‌పై మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!)కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది.ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాంPottel promotions in flight #ananyanagalla #pottelonoct25th pic.twitter.com/TwftS1dxBn— Ananya Nagalla (@AnanyaNagalla) October 17, 2024 -
కన్ను కొట్టిన బుట్టబొమ్మ... ఫ్లవర్ డిజైన్ చీరలో తృప్తి!
ప్రకృతి ఒడిలో పూజా హెగ్డే పుట్టినరోజు వేడుకలుచీరలో అందాలన్నీ చూపించేస్తున్న తృప్తి దిమ్రిహాట్ బ్యూటీ ఆయేషా ఖాన్ చుడీదార్ లుక్గ్లామర్తో చంపేసేలా సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్గర్ల్స్ నైట్ అవుట్లో నిహారిక-వితిక షేరు-మహాతల్లిఎక్స్ప్రెషన్స్తో నవ్వించేస్తున్న కావ్య కల్యాణ్ రామ్జీన్ షర్ట్‌లో వయ్యారంగా చూస్తున్న పూజిత పొన్నాడ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Shweta Tiwari (@shweta.tiwari) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Meghaa Shetty (@meghashetty_officiall) View this post on Instagram A post shared by Asmita Sood (@asmita_s) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by KiKo (@kiaankokken) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Parul Gulati 🤍 (@gulati06) View this post on Instagram A post shared by Rathika RavindeR (@rathikaravinder) -
ఎందుకింత నెగెటివిటీ?.. నెటిజన్స్‌పై మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!
టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అంతకుముందు తంత్ర అనే హారర్ మూవీతో మెప్పించింది. ప్రస్తుతం పొట్టేల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల అనన్య ఓ వీడియో షేర్ చేసింది. దానిపై ఓ రేంజ్లో నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి.దీంతో తన వీడియోపై వస్తున్న ట్రోల్స్‌పై అనన్య స్పందించింది. ఎందుకింత నెగెటివీటీ అంటూ మండపడింది. ప్లాస్టిక్ వాడకం తగ్గించమని వీడియో షేర్ చేశా. దానిపై కొందరు విమర్శలు చేశారు. నేను చెప్పిన విషయం నచ్చితే చేయండి.. అంతేకానీ ఎందుకింత నెగటివిటీ ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించింది. అది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. సోషల్‌మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే అనన్య.. ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు. అందులో స్ట్రా సాయం లేకుండా కొబ్బరిబొండం నీళ్లు తాగుతూ కనిపించారు. మాములుగా నేను స్టీల్ స్ట్రా వెంట తెచ్చుకుంటాను.. అది లేని పక్షంలో ఈ విధంగా కొబ్బరినీళ్లు తాగుతా. ప్లాస్టిక్ వాడకాన్ని కాస్త తగ్గిద్దాం. చిన్న చిన్న పనులే పెద్ద మార్పులకు శ్రీకారం చుడతాయి అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు.2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. తాజాగా ఆమె నటించిన పొట్టేల్ అక్టోబర్ 25న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
వయ్యారి భామలు.. చీర కట్టులో ఇంత అందమా!
చుడీదార్లో చూడ చక్కగా తెలుగమ్మాయి ఈషా రెబ్బాటర్కీలో చిల్ అవుతున్న 'బలగం' కావ్య కళ్యాణ్ రామ్చీరలో మల్లెపూలతో మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్దసరా శుభాకాంక్షలు చెప్పిన హీరోయిన్ అనన్య నాగళ్లఅహ్మదాబాద్లో నవరాత్రి సెలబ్రేషన్స్‌లో అప్సరరాణిపూల చీరలో బిగ్‌బాస్ స్రవంతి గ్లామర్ ట్రీట్అందానికే ఆధార్ కార్డ్‌లా కనిపిస్తున్న యాంకర్ రష్మీ View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Gayathri Gupta (@gayathrigupta) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Apsara Rani (@apsararaniofficial_) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Anala Susmitha (@anala.susmitha) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by I am Kangna Sharma (@kangnasharma16) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Reshma Pasupuleti (@reshmapasupuleti) View this post on Instagram A post shared by RIYA SEN DEV (@riyasendv) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Nainika Anasuru🦋 (@_.nainikadances) View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Gabriella (@gabriellacharlton_) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Hamida Khatoon (@hamida_khatoon_official) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) -
రిదా రేడియెన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో సందడి చేసిన అనన్య నాగళ్ళ (ఫొటోలు)
-
దసరాకి పొట్టేల్
దసరాకి థియేటర్స్‌లోకి ‘పొట్టేల్’ రానుంది. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పొట్టేల్’. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె ఈ చిత్రాన్ని నిర్మించారు.గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని దసరా పండక్కి రిలీజ్ చేయనున్నట్లుగా గురువారం చిత్రయూనిట్ వెల్లడించింది. ‘‘పొట్టేల్’ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. దీంతో దసరాకు ఈ సినిమా రిలీజ్ అనేది అడ్వాంటేజ్ అవుతుందని ఆశిస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: మోనిష్ భూపతి రాజు. -
అప్సరసలు ఈర్ష్య పడేంత గ్లామర్.. అనన్య ఓ నిలువెత్తు అందాల రాశి (ఫొటోలు)
-
స్కూల్లో ఉన్నప్పుడే ఆ టాలీవుడ్ హీరో అంటే క్రష్: అనన్య నాగళ్ల
2019లో విడుదలైన ' మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం వకీల్ సాబ్ మూవీతో మరింత ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సమంత నటించిన శాకుంతలం చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. తాజాగా ప్రియదర్శి నటించిన డార్లింగ్ చిత్రంలో మెరిసింది ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య.. టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.ప్రభాస్‌తో నటించే ఛాన్స్ వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేస్తారు? అన్న ప్రశ్నకు అనన్య నాగళ్ల స్పందించింది. ఆయనతో నటించే అవకాశం వస్తే.. ఏ క్యారెక్టర్ అయినా ఎగిరి గంతేసి చేస్తానని చెప్పింది. ప్రభాస్ నటించిన వర్షం సినిమా చూసినప్పటి నుంచి ఆయనంటే క్రష్. ఆ సమయంలో నేను స్కూల్లోనే చదువుతున్నా. ఆ సినిమాను నేను థియేటర్లో చూడలేదు. టీవీల్లో వచ్చినప్పుడు నేను, మా ఫ్రెండ్ కలిసి వర్షం సినిమా చూశామని అనన్య నాగళ్ల నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఏడాదిలో తంత్ర మూవీతో డిఫరెంట్ రోల్లో అనన్య నాగళ్ల మెప్పించారు. -
కృతి శెట్టి స్టైలిష్.. షాలినీ పాండే బ్లాక్ బస్టర్.. అలియా కూల్ లుక్
పెళ్లి ఫోటోలు అభిమానులతో పంచుకున్న వరలక్ష్మీ శరత్కుమార్స్టన్నింగ్ ఫోజులు ఇచ్చిన షాలినీ పాండేమీలోని అంతర్గత బలాన్ని స్వీకరించాలని కోరుతున్న కృతి శెట్టియాడ్ షూట్ కోసం బ్లాక్ డ్రెస్‌లో దుమ్మురేపిన అనన్య నాగళ్ల'పసుపు' ఇష్టమైన రంగు అంటూ ఇలా వివరణ ఇచ్చిన రష్మిక 'సూర్యరశ్మి, సన్ ఫ్లవర్స్, చిరునవ్వులు, ఆనందం వంటి దయ, సంతోషకరమైన అన్ని విషయాలను పసుపు రంగు సూచిస్తుంది.' View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ruhii Siingh (@ruhisingh12) -
ఫోన్ చేసి నన్ను బెదిరించారు.. ఇలాంటివి నమ్మకండి: టాలీవుడ్ హీరోయిన్
ప్రస్తుతం డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల బ్యాంక్ అకౌంట్స్ నుంచి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. చదవురాని వారితో పాటు అన్ని తెలిసి కూడా సైబర్ ఉచ్చులో పడుతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మభ్యపెట్టి దోచుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు సైతం వీరి బారిన పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల తనకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అసలేం జరిగిందో మీరు ఓ లుక్కేయండి.అనన్య మాట్లాడుతూ.. 'తన పేరుతో సిమ్ తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారని నాకు ఫోన్ చేశారు. మీ పేరుతో ఉన్న నంబర్ ద్వారా కొందరు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారు. ముంబయిలోని ట్రాయ్ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నాం. మీ నంబర్‌పై దాదాపు 25 వరకు మనీలాండరింగ్ లావాదేవీలు జరిగాయి.. మీకు జైలు శిక్ష పడుతుందని బెదిరించారు. కొద్దిసేపు వీడియో కాల్ ఆన్‌లో ఉంచి.. ఆ తర్వాత ఆఫ్ చేశారు. దీనిపై మీరు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయండి.. అని వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయి నన్ను నమ్మించేందుకు కొన్ని డాకుమెంట్స్ చూపించారు. అంతేకాదు.. ఆర్బీఐకి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలని నన్ను అడిగారు. ఆ తర్వాత నాకు థర్డ్ పార్టీ అకౌంట్ నంబర్ పంపి డబ్బులు బదిలీ చేయాలని కోరాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చి.. నేను అతన్ని నిలదీశాను. దీంతో అతనే నాపై తిరిగి గట్టిగా మాట్లాడాడు. నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానడంతో వీడియో కాల్ కట్ చేశాడు' అని తెలిపింది. ఇలాంటివి సంఘటనలు చాలా జరుగుతున్నాయని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అనన్య నాగళ్ల సూచించారు. దయచేసి ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. కాగా..టాలీవుడ్లో మల్లేశం, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. Please be careful guys!For full details https://t.co/XdpO2s7awh@cyberabadpolice @cpbbsrctc pic.twitter.com/d7EK5rVWAW— Ananya Nagalla (@AnanyaNagalla) June 24, 2024 -
ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్
ఓటీటీలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాల్ని ఎక్కువగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లిస్టులో వెంకటేశ్, రానా, నాగచైతన్య, అంజలి లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు హీరోయిన్ చేరింది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో)మల్లేశం, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల.. వీటితో పాటు ప్లే బ్యాక్, శాకుంతలం, మళ్లీ పెళ్లి, తంత్ర, అన్వేషి సినిమాలు చేసింది గానీ బ్రేక్ అందుకోలేకపోయింది. ఈ ఏడాది 'తంత్ర' అనే హారర్ మూవీతో వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'పొట్టేల్' అనే మూవీ ఉంది.మరోవైపు ఓటీటీలోకి కూడా అనన్య నాగళ్ల ఎంట్రీ ఇస్తోంది. 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేస్తోంది. అంజలి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సిరీస్ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. అంజలికి పుట్టినరోజు విషెస్ చెబుతూ చిన్న వీడియో రిలీజ్ చేశారు. అంజలి ఇప్పటికే ఓటీటీలో నవరస, ఫాల్, ఝాన్సీ సిరీస్ లు చేసింది. ఇకపోతే 'బహిష్కరణ' సిరీస్ ని త్వరలో సిరీస్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.(ఇదీ చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..) Happy Birthday @yoursanjaliWe cannot wait for the world to see your new avatar from #Bahishkarana#BahishkaranaOnZee5 Coming Soon!@PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @prasannadop@SidharthSadasi1 pic.twitter.com/YW4Stiidvy— ZEE5 Telugu (@ZEE5Telugu) June 16, 2024 -
బ్లాక్ డ్రెస్‌లో మెరిపిస్తున్న అనన్య నాగళ్ళ..(ఫొటోలు)
-
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్.. గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్!
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్ సందడి.. అలాంటి లుక్‌లో కనిపించిన టబు... అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న అనన్య నాగళ్ల... గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ హోయలు.. హోలీ వేడుకల్లో సందడి చేసిన మంచులక్ష్మి.. ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ పోజులు.. వేసవిలో చిల్ అవుతోన్న లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Tabu (@tabutiful) View this post on Instagram A post shared by Sushmita (@sushmitakonidela) -
Ananya Nagalla : నవ్వుతో పడేస్తున్న అనన్య నాగళ్ళ.. (ఫొటోలు)
-
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
Tantra Review: 'తంత్ర' సినిమా రివ్యూ
ఏ భాష తీసుకున్నా సరే హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సరిగ్గా తీయాలే గానీ హిట్ కొట్టడం పక్కా. ఈ మధ్య కాలంలో 'మసూద', 'విరూపాక్ష', 'మా ఊరి పొలిమేర' తదితర చిత్రాలు ఇలాంటి కథలతో వచ్చి అందర్ని భయపెట్టాయి. ఇప్పుడు అలాంటి కథతో తీసిన మూవీ 'తంత్ర'. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. అనన్య నాగళ్ల భయపెట్టిందా? హిట్ కొట్టిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథేంటంటే? రేఖ(అనన్య నాగళ్ల)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో నాన్న సంరక్షణలో పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన తేజూ (ధనుష్ రఘుముద్రి)ని ఇష్టపడుతుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ కథలో విగత ('టెంపర్' వంశీ), రాజేశ్వరి (సలోని) ఎవరు? వీళ్లకు రేఖకు సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఎలా ఉందంటే? హారర్ సినిమాల్లో లాజిక్స్ ఉన్నా లేకున్నా పర్వాలేదు. భయపెట్టే, వణుకు పుట్టించే సీన్స్ కచ్చితంగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. 'తంత్ర' విషయంలో అదే జరిగింది. స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే మంచి పాయింట్. హారర్ కథకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ దాన్ని సినిమాగా తీసే విషయంలో పూర్తిగా తడబడ్డారు. చూస్తున్నంత సేపు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సరికదా బోర్ కొడుతుంది. 'తంత్ర' సినిమాలో రక్త దాహం, పాతాళ కుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, చిన్నామస్తా దేవి.. అని ఆరు భాగాలు ఉంటాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్లస్ కాలేదు. ఈ పేర్లు లేకుండా కథ చెప్పినా సరే ఇబ్బంది ఏం ఉండేది కాదు. తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజలు లాంటి వాటి గురించి ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. భయపెడితే చాలు. కానీ దర్శకుడు.. వాటి గురించి ఒక్కోటి వివరించుకుంటూ వెళ్లడం సాగదీతగా అనిపించింది. దీంతో 'తంత్ర'.. సీరియల్ కంటే స్లోగా సాగింది. సాధారణంగా హారర్ సినిమాలు అంటే ఇంట్రెస్టింగ్ అనిపించే ఓ సీన్‌తో మొదలవుతాయి. 'తంత్ర'లో అలాంటిదేం లేకుండా చాలా ఫ్లాట్‌గా స్టోరీ వెళ్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. 'మా సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దు' అని.. మూవీ రిలీజ్‌కి కొన్నిరోజుల ముందు హడావుడి చేశారు. కాకపోతే ఒకటి రెండు సీన్లు తప్పితే పెద్దగా హారర్ ఎఫెక్ట్ అనిపించే సినిమా అయితే ఇది కాదు. ఎవరెలా చేశారు? రేఖగా ప్రధాన పాత్ర చేసిన అనన్య నాగళ్ల ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అయితే ఈమెకి తగ్గ సీన్స్ పడలేదు. క్లైమాక్స్‌లో కాస్త స్కోప్ దక్కింది. తేజూగా చేసిన ధనుష్ రఘుముద్రి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కాకపోతే ఇంకా ఇంప్రూవ్ కావాలి. రాజేశ్వరిగా ప్రత్యేక పాత్ర చేసిన సలోని.. ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసింది. ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. కానీ ఆ పాత్రని ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. మిగతా పాత్రధారులు తమ ఫరిది మేరకు నటించారు. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాతలో విషయం ఉంది. కాకపోతే పేపర్ మీద రాసుకున్నది స్క్రీన్‌పైకి తీసుకొచ్చేసరికి అనుభవలేమి కనిపించింది. క్షుద్రపూజాల నేపథ్యంలో క్యూరియసిటీ పాయింట్ రాసుకున్నప్పటికీ.. తీసే విషయంలో తడబడ్డారు. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్.. పాటలు, నేపథ్య సంగీతం పెద్దగా ఎలివేట్ చేయలేకపోయాయి. అలా అని పూర్తి బాగోలేవని కూడా కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'తంత్ర'.. ప్రేక్షకుల్ని భయపెట్టలేకపోయింది.