'అందమైన అమ్మాయిపై క్షుద్రపూజలు చేస్తే'.. ఆసక్తిగా ట్రైలర్! | Ananya Nagalla Latest Movie Tantra Trailer Out Now, Check Trailer Highlights Inside - Sakshi
Sakshi News home page

Tantra Movie Trailer Highlights: 'అందమైన అమ్మాయిపై క్షుద్రపూజలు చేస్తే'.. ఆసక్తిగా ట్రైలర్!

Published Thu, Feb 29 2024 9:22 AM | Last Updated on Thu, Feb 29 2024 10:13 AM

Ananya Nagalla Latest Movie Tantra Trailer Out Now - Sakshi

అనన్య నాగళ్ల లీడ్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘తంత్ర’. ఈ హారర్‌ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్‌ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీపై నరేష్‌ బాబు పి, రవి చైతన్య నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా అనన్య నాగళ్ల కనిపించనున్నారు. హారర్‌ నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే క్షుద్రపూజలు నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ యువతిపై క్షుద్రపూజలు ప్రయోగిస్తే ఏమవుతుంది? అనే కోణంలో తంత్రను రూపొందించారు. ట్రైలర్‌ చూస్తే హారర్‌ జానర్‌లో ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చూపించనున్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ధనుష్‌ రఘుముద్రి, సలోని, ‘టెంపర్‌’ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతమందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement