
‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. ‘వకీల్ సాబ్’తో మరింత ఫేమస్ అయింది. ఈ చిత్రం తర్వాత అనన్యకు వరుస అవకాశాలు లభించాయి. రీసెంట్‌గా విడుదలైన శాకుంతలం చిత్రంలోనూ ఓ మంచి పాత్ర పోషించింది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. తన ఫాలోవర్స్‌ని అలరిస్తుంది.
తాజాగా ఈ నటి.. తన బాయ్‌ఫ్రెండ్, ప్రేమవ్యవహారం గురించి స్పందించింది. ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన అనన్యను.. ‘నీ బాయ్‌ఫ్రెండ్ పేరు, అతని ఇన్‌స్టా ఐడీ చెప్పు’ అని ఓ నెటిజన్ అడిగాడు. దీనిపై అనన్య స్పందిస్తూ.. ‘బాయ్ ఫ్రెండా.. అంత సీన్ లేదు భయ్యా.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారని అనుకుంటున్నారు. అందుకే ఎవరూ ట్రై చేయడం లేదని అనుకుంటా.. అదే ప్రాబ్లమేమో’ అంటూ అనన్య నాగళ్ల నవ్వేసింది.
అలాగే మీ వాట్సాప్ డీపీ ఏంటని అడగ్గా.. ఆమె ఫోటో పెట్టింది. ఇక మరో నెటిజన్ ‘లాస్ట్ టైమ్ స్టేడియంలో మిమ్మల్ని బాటిల్‌తో కొట్టా.. చాలా బాధగా ఉంది’అని కామెంట్ చేయగా.. ‘మీరేనా కొట్టింది? తప్పు కదా? ఆ రోజు మీరు పిలిచినప్పుడు వెనక్కి తిరిగి హాయ్ కూడా చెప్పాను. అలా ఏ యాక్టర్‌తోనూ ప్రవర్తించకండి. మేము కూడా మనుషులమే కదా. నాకైతే ఆ రోజు చాలా భయమేసింది’ అని అనన్య రిప్లై ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment