Shaakuntalam Movie
-
అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?
సమ్మర్ పేరు చెప్పగానే పిల్లలకు సెలవులు గుర్తొస్తాయి. వయసైన పెద్దోళ్లకు టూర్స్ గుర్తొస్తాయి. అదే మూవీ లవర్స్‌కు మాత్రం కొత్త సినిమాలే గుర్తొస్తాయి. ఏ వారం ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా? దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ ఎదురుచూసేవాళ్లు. గత కొన్నేళ్లుగా వేసవికి తెలుగు బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. ఈసారి మాత్రం సందడి, హడావుడి ఏం లేకుండానే గడిచిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకనిర్మాతలు.. సంక్రాంతి, సమ్మర్, దసరా పండగ లాంటి వాటిని టార్గెట్ చేసుకుని మూవీస్ తీస్తుంటారు. ఈసారి సంక్రాంతికి చిరు-బాలయ్య హిట్స్ కొట్టేశారు. మార్చి చివర్లో నాని కూడా హిట్ కొట్టేశాడు. పాన్ ఇండియా చిత్రాలతో పెద్ద హీరోలందరూ బిజీ అయిపోవడంతో వాళ్లెవరివీ ఈసారి సమ్మర్ కు రిలీజ్ కాలేదు. ఇది మీడియం రేంజ్ హీరోలకు వరమైంది. కానీ దాన్ని వాళ్లు సరిగా వినియోగించుకోలేకపోయారు. (ఇదీ చదవండి: ఒక్క యాడ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు అన్ని కోట్లా?) ఏప్రిల్ నెలని తీసుకుంటే.. తొలివారంలో రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' మూవీతో థియేటర్లలోకి వచ్చారు. ఈ రెండు కూడా తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని, ప్రేక్షకుల డిసప్పాయింట్ చేశాయి. రెండోవారం సమంత 'శాకుంతలం' వచ్చింది. ట్రైలర్ కాస్త అటుఇటుగా ఉండటంతో అందరూ డౌట్ పడ్డారు. కరెక్ట్ గా అదే జరిగింది. ప్రీమియర్ షోలకే అసలు విషయం తెలిసిపోయింది. సామ్ కెరీర్ లోనే ఘోరమైన ఫ్లాప్ గా ఇది నిలిచింది. మూడో వారం వచ్చిన 'విరూపాక్ష'.. ఎవరూ కనీసం ఎక్స్ పెక్ట్ చేయనంత హిట్ అయిపోయింది. పూర్తిస్థాయి హారర్ కాన్సెప్ట్ కావడం 'విరూపాక్ష'కు చాలా ప్లస్ అయింది. స్టోరీకి సుకుమార్ తనదైన శైలిలో టచ్ ఇచ్చేసరికి.. ఈ సినిమా జనాలకు తెగ నచ్చేసింది. లాంగ్ రన్ లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. చివరి వారంలో వచ్చిన అఖిల్ 'ఏజెంట్'పై రిలీజ్ కి ముందు కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మార్నింగ్ షోకే రిజల్ట్ తేలిపోయింది. బొమ్మ ఫట్ అయిపోయింది. ఇలా ఏప్రిల్ మొత్తమ్మీద టాలీవుడ్ కి ఒక్కటంటే ఒక్కటే హిట్ దక్కింది. (ఇదీ చదవండి: టిఫిన్ సెంటర్‌కు స్టార్ హీరోయిన్.. ఎవరూ గుర్తుపట్టలేదు!) మే నెలని తీసుకుంటే.. తొలివారం గోపీచంద్ 'రామబాణం', అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమాలతో వచ్చారు. వీటిలో 'రామబాణం' ఫట్ మని బుడగలా పేలిపోయింది. 'ఉగ్రం' పర్వాలేదనిపించింది. కానీ పెద్దగా జనాలు తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. రెండో వారం వచ్చిన 'కస్టడీ'పై అక్కినేని ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ చైతూ వాళ్లని పూర్తిగా నిరాశపరిచాడు. నీరసమైన స్టోరీ లైన్ వల్ల చూసిన ప్రతిఒక్కరూ డిసప్పాయింట్ అయ్యారు. ఈ మూవీని ఫ్లాప్ గా డిక్లేర్ చేశారు. మూడో వారంలో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' చాలా అంటే చాలా నిరాశపరిచింది. మే చివరి వారంలో వచ్చిన 'మేమ్ ఫేమస్'కి కూడా సేమ్ రిజల్ట్. ఇలా ఎంతో సందడిగా ఉంటుందనుకున్న సమ్మర్.. ఎప్పుడూ లేనంత నీరసంగా సాగింది. 'బిచ్చగాడు 2' , 2018 లాంటి ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు.. ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశాయి గానీ మూవీ లవర్స్ ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' పైనే ఉన్నాయి. మరి రామయణం ఆధారంగా తీసిన ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో ఏమో? (ఇదీ చదవండి: సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు: పంచ్ ప్రసాద్) -
సత్తా చాటిన సమంత 'శాకుంతలం'.. ఏకంగా నాలుగు అవార్డులు!
సమంత, దేవ్ మోహన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రేక్షకులు ఆశించినంత స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. (ఇది చదవండి: NTR ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్: ఆర్జీవీ) అయితే అభిమానులను మెప్పించలేకపోయిన ఈ సినిమాకు అవార్డులు మాత్రం క్యూ కడుతున్నాయి. సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయిన ఈ మూవీకి గతంలో న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్- 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్‌గా,బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్‌గా అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: హీరోల కోసం హీరోయిన్లను వెయిట్ చేయించేవారు: ఆదాశర్మ) తాజాగా ఫ్రాన్స్‌లో కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమాకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో సత్తా చాటింది. ఈ విషయాన్ని గుణటీమ్ వర్క్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే దీనిపై నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా.. మరికొందరేమో ఈ సినిమాకు ఎవరు ఇచ్చారు? అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కాగా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Gunaa Teamworks (@gunaa_teamworks) -
'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్
సమంత ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అందరి అంచనాలు తలకిందలు చేస్తూ భారీ ఫ్లాఫ్గా నిలిచింది. దీంతో నిర్మాతలను ఊహించని విధంగా నష్టాలపాలు చేసింది శాకుంతలం. మరోవైపు ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నట్లు నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్స్ తెలిపింది. చదవండి: అనారోగ్యం బారిన పడిన బిగ్‌బాస్ బ్యూటీ అరియానా న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్‌గా,బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్‌గా శాకుంతలం అవార్డులను గెలుచుకున్నట్లు మేకర్స్ ప్రకటించగా, ఫ్లాప్ సినిమాకు కూడా ఇన్ని అవార్డులు ఇస్తారా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కాగా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. Our team is overwhelmed to have been honored with these prestigious Global Awards ✨ Thank you for this incredible recognition 🙏#Shaakuntalam streaming now on @PrimeVideoIN. https://t.co/obv3N5qKUw@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna… pic.twitter.com/2EjTVaOlLO — Gunaa Teamworks (@GunaaTeamworks) May 11, 2023 -
లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్:పాన్-ఇండియా స్టార్ సమంతా రూత్ ప్రభు కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన సమాచారం ఇపుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మీడియా నివేదికల ప్రకారం, 13వ అంతస్తులో కొనుగోలు చేసిన ఇల్లు 3,920 చదరపు అడుగులతో 7,944 చదరపు అడుగుల సూపర్ బిల్ట్-అప్ ఏరియా , 14వ అంతస్తులో 4,024 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్యూప్లెక్స్ ఏరియాతో ఉంది. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన సమంతా తాజాగా అత్యంత ఖరీదైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ (డ్యూప్లెక్స్) కొత్తగా సామ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో జయభేరి కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో ఖరీదైన డూప్లెక్స్ ప్లాట్‌ను తాజాగా సమంత సొంతం చేసుకుంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఆరు పార్కింగ్ స్లాట్లతో జయభేరి ఆరెంజ్ కౌంటీలో 3BHK లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ 13, 14 ఫ్లోర్లలో ఉందని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ నివేదించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.7.8 కోట్లు. ఇటీవల ముంబైలో రూ. 15 కోట్ల విలువైన రాజభవన అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతోపాటు జూబ్లీహిల్స్‌లో 100 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కూడా ఉందట. దీంతో ఆమె నికర విలువ రూ. 89 కోట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంతా రీసెంట్గా గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మైథలాజికల్ డ్రామా `శాకుంతలం`తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.కాళిదాసు నాటకం ఆధారంగా, శకుంతల, పెరూ రాజవంశం రాజు దుష్యంత్‌ల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ కూడా నటించారు.భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.11 కోట్లు మాత్రమే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తమిళ, మలయాళ, కన్నడ. హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న విడుదల కానుంది. మరోవైపు విజయ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా మంగళవారం రిలీజైన ఈ మూవీలో ఫస్ట్ సింగిల్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఓటీటీలోకి సమంత 'శాకుంతలం'.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. సుమారు 60కోట్లతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. చదవండి: అందుకే విడాకులు తీసుకున్నా, సమంత సంతోషంగా ఉండాలి: చై విడుదలైన తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో శకుంతలగా సమంత నటించగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించాడు. ఈ సినిమాతోనే అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్‌గా డెబ్యూ ఇచ్చింది. సినిమాకు ముందు భారీ హైప్ క్రియేట్ అయినా కథ, గ్రాఫిక్స్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈనెల 12న శాకుంతలం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి -
ఆ సినిమా నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది: దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాతల్లో దిల్ రాజు గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన చిత్రాలు నిర్మిస్తుంటారు. ఫ్లాపులు ఎదురైన వాటిని తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడే వారిలో దిల్ రాజు ముందుంటారు. అలాంటి దిల్ రాజును భారీగా దెబ్బతీసింది ఆ చిత్రం. ఇటీవలే ఆయన నిర్మించిన శాకుంతలం మూవీ థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో బోల్తా కొట్టింది. ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటించగా.. దేవ్ మోహన్, మధుబాల, అల్లు అర్హ నటించారు. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు స్పందించారు. (ఇది చదవండి: సర్ఫ్‌తో స్నానం.. టాయిలెట్ వాటర్‌తో కాఫీ తాగా: నటి ఆవేదన) దిల్ రాజు మాట్లాడుతూ.. 'శాకుంతలం మూవీ మిస్ ఫైర్ అయింది. సోమ, మంగళ వారాల్లో కలెక్షన్స్ రాలేదంటే ఇక ఫిక్స్ అయిపోవాలి. రియలైజేషన్ రావాలి. శాకుంతలం నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది. నా 25 ఏళ్ల కెరీర్లో ఇది ఊహించలేదు.'అని అన్నారు. ఇటీవలే బలగం, దసరా సినిమాలతో హిట్ అందుకున్న దిల్ రాజుకు శాకుంతలం షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. కాగా.. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రాజెక్టులు ఓకే అయ్యాయని దిల్ రాజు తెలిపారు. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాలో మెరిసిన యాంకర్ వర్షిణి) -
ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది: మధుబాల
మధు అంటే సినీఇండస్ట్రీలో పెద్దగా గుర్తు పట్టరేమో కానీ.. మధుబాల అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఆమె అసలు పేరు మధు అయితే సినిమాల్లోకి వచ్చాక మధుబాలగా మార్చుకుంది. ఆమెకు అంతలా పేరు తీసుకొచ్చిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా' మూవీనే. ఆమె ఒట్టయల్ పట్టాలమ్ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో మధుబాల నటించింది. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ మేనక పాత్రలో నటించింది. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఆశించినా ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా శాకుంతలం సినిమాపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించకపోవడంపై ఆమె తొలిసారి స్పందించారు. (ఇది చదవండి: సిల్క్ స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!) మధుబాల మాట్లాడుతూ.. 'కష్టపడి పనిచేసినప్పటికీ శాకుంతలం విజయం సాధించకపోవడం ఎంతగానో బాధపెట్టింది. సినిమా పూర్తయిన తర్వాత ఒక ఏడాది సీజీఐ కోసమే వర్క్ చేశారు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇవ్వాలనుకున్నారు. షూటింగ్లో నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌పై ఎలాంటి ఒత్తిడి పెంచలేదు. టాలీవుడ్ చిత్రాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ గొప్ప విజయాలు సాధించాయి. వాటి విజయాలకు సరైన కారణం అంటూ ఏదీ లేదు. అవీ ఎలా హిట్ అయ్యాయో అర్ధం కావట్లేదు. మా సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంతగా నిరాశ పరుస్తుందని మేం అనుకోలేదు.' అని అన్నారు. కాగా.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయాలనుంది: హాలీవుడ్ టాప్ డైరెక్టర్) -
సమంత సింపతీ డ్రామా....?
-
శాకుంతలం సినిమా పై సమంత షాకింగ్ రియాక్షన్
-
శాకుంతలం అట్టర్ ప్లాప్ అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీ
-
సమంత డిప్రెషన్లోకి వెళ్లిపోయిందా? నెట్టింట పోస్ట్ వైరల్
సమంత ప్రధాన పాత్రలో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో దుష్యంతుడిగా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సమంత స్టార్ ఇమేజ్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వస్తాయనుకుంటే శాకుంతలం విషయంలో ఇది వర్కవుట్ కాలేదు. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ఈ సినిమాకు దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయి. ప్రమోషన్స్‌తో బాగా హైప్ క్రియేట్ చేసినా సినిమా రిజల్ట్ మొత్తం తలకిందులయ్యింది. కథ, కథనాలతో పాటు సినిమాలోని వీఎఫ్ఎక్స్, శకుంతల, దుష్యంతుల కెమిస్ట్రీ, డబ్బింగ్.. ఇలా పలు విషయాల్లో శాకుంతలం విమర్శలను ఎదుర్కొంటుంది. వీకెండ్ కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో 'శాకుంతలం' రిజల్ట్ చూసి సమంత డిప్రెషన్లోకి వెళ్లిందని బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది. ఈ క్రమంలో శాకుంతలం మూవీ రిజల్ట్‌పై సమంత ఇన్‌డైరెక్ట్‌గా స్పందించింది. భగవద్గీతలోని..'కర్మణ్యే వాధికా రాస్తేమా ఫాలేషు కదాచన మా కర్మ ఫల హే తుర్ భూః మా తే సంగోత్స్వ కర్మణి..' అనే శ్లోకాన్ని పోస్ట్చేసింది. అంటే..'కర్మ ఫలితం మన చేతుల్లో ఉండదు. ప్రయత్నం చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. దాని ఫలితం ఏమిటనేది మనం నిర్ణయించలేము. ఫలితాలకు భయపడి ప్రయత్నం చేయడం మానరాదు. ఏదేమైనా ముందుకు సాగిపోవాలి' అని ఈ శ్లోకం అర్థం. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చిన సమంత..
-
అదే ప్రాబ్లమ్.. ఎవరూ ప్రపోజ్ చేయట్లేదు: అనన్య
‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. ‘వకీల్ సాబ్’తో మరింత ఫేమస్ అయింది. ఈ చిత్రం తర్వాత అనన్యకు వరుస అవకాశాలు లభించాయి. రీసెంట్గా విడుదలైన శాకుంతలం చిత్రంలోనూ ఓ మంచి పాత్ర పోషించింది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. తన ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. తాజాగా ఈ నటి.. తన బాయ్‌ఫ్రెండ్, ప్రేమవ్యవహారం గురించి స్పందించింది. ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన అనన్యను.. ‘నీ బాయ్‌ఫ్రెండ్ పేరు, అతని ఇన్‌స్టా ఐడీ చెప్పు’ అని ఓ నెటిజన్ అడిగాడు. దీనిపై అనన్య స్పందిస్తూ.. ‘బాయ్ ఫ్రెండా.. అంత సీన్ లేదు భయ్యా.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారని అనుకుంటున్నారు. అందుకే ఎవరూ ట్రై చేయడం లేదని అనుకుంటా.. అదే ప్రాబ్లమేమో’ అంటూ అనన్య నాగళ్ల నవ్వేసింది. అలాగే మీ వాట్సాప్ డీపీ ఏంటని అడగ్గా.. ఆమె ఫోటో పెట్టింది. ఇక మరో నెటిజన్ ‘లాస్ట్ టైమ్ స్టేడియంలో మిమ్మల్ని బాటిల్‌తో కొట్టా.. చాలా బాధగా ఉంది’అని కామెంట్ చేయగా.. ‘మీరేనా కొట్టింది? తప్పు కదా? ఆ రోజు మీరు పిలిచినప్పుడు వెనక్కి తిరిగి హాయ్ కూడా చెప్పాను. అలా ఏ యాక్టర్‌తోనూ ప్రవర్తించకండి. మేము కూడా మనుషులమే కదా. నాకైతే ఆ రోజు చాలా భయమేసింది’ అని అనన్య రిప్లై ఇచ్చింది. -
'శాకుంతలం' సినిమాలో మెరిసిన యాంకర్ వర్షిణి
'శాకుంతలం' సినిమాలో మెరిసిన యాంకర్ వర్షిణి సొగుసుతో ఫిదా చేస్తున్న బుల్లితెర యాంకరమ్మ వర్షిణి పూర్తి పేరు వర్షిణి సౌందరాజన్.. ఈమెది సొంతూరు తమిళనాడు మోడల్‌గా కెరీర్ ఆరంభించిన వర్షిణి పలు వ్యాపార ప్రకటనల్లో నటించింది బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం 'చందమామ కథలు'చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వర్షిణి 'పెళ్లి గోల' వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపును సంపాదించుకుంది -
‘శాకుంతలం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్.. భరతుడిగా అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ నటించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం (ఏప్రిల్ 14)విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. వీఎఫ్ఎక్స్ విషయంలో ఆడియన్స్ నిరాశకు గురయ్యారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం ఊహించినదానికంటే చాలా తక్కువ కలెక్షన్స్‌ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ. 4.70 కోట్ల గ్రాస్, రూ. 2.24 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో రూ.2 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టింది. (చదవండి: ‘శాకుంతలం’ మూవీ రివ్యూ) ఏరియా వైజ్‌గా చూస్తే.. నైజాంలో రూ. 52 లక్షలు, సీడెడ్ రూ.10 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ.8లక్షలు, వెస్ట్ గోదావరి రూ.4 లక్షలు, గుంటూరు రూ. 8 లక్షలు, కృష్ణ రూ. 8లక్షలు, నెల్లూరు రూ. 3లక్షలు చొప్పున వసూళ్లను రాబట్టింది. తమిళ్, కర్ణాటక, ఇతల ప్రాంతాలలో కలిసి రూ. 42 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల వెల్లడిస్తున్నాయి. ఈ వీకెండ్లో కలెక్షన్స్ కాస్త పెరిగే అవకాశం ఉంది. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తుంది. రూ.19 కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సినిమాకు ఫస్ట్ డే రూ 2.24 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చింది. అంటే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే.. ఇంకా రూ. 16.76 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా అనుకున్న టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి. -
అప్పుడే ఓటీటీలో శాకుంతలం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నీలిమ గుణ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ అలరించగా భరతుడిగా అల్లు అర్హ నటించింది. మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. రిలీజ్‌కు ముందు భారీ బజ్ క్రియేట్ అయినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర ఈ చిత్రం రాణించలేకపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే శాకుంతలం ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే చర్చ నడుస్తుంది. సినీ వర్గాల సమచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. భారీ ధరకే ఓటీటీకి విక్రయించినట్లు తెలుస్తుంది. ‘శాకుంతలం’ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత అంటే మే మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. -
శాకుంతలం మెప్పించిందా..?నొప్పించిందా..?
-
సమంత 'శాకుంతలం' సినిమా స్టిల్స్ చూశారా? (ఫోటోలు)
-
'శాకుంతలం' సినిమాకు ఊహించని షాక్, తొలిరోజే ఇలా జరిగిందేంటి..
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ రోజే ఊహించని షాక్ తగిలింది. శాకుంతలం షోలు రద్దయ్యాయి. ఎందుకంటే.. నేడు(ఏప్రిల్ 14)న డాక్టర్ బీఆర్ అబేద్కర్ జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమయింది. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఉండటంతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో అక్కడే ఉన్న ఐమాక్స్ థియేటర్‌పై భారీ దెబ్బ పడింది. థియేటర్‌కు వచ్చే అన్ని దారులు మూసివేయడంతో శాకుంతలం షోలను రద్దు చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 5 గంటలకు వేసే బెనిఫిట్ షోతో పాటు సాయంత్రం 6 గంటల వరకు అన్ని షోలను రద్దు చేశారు.ఆ తర్వాత రాత్రి పది గంటల నుంచి యథావిధిగా షోలు నిర్వహించనున్నారు. ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని యాజమాన్యం పేర్కొంది. An important update to our beloved fans & moviegoers in Hyderabad : Due to Dr. Ambedkar Statue Inauguration Tomorrow, all the shows at Prasads Imax have been Cancelled. Book your tickets accordingly in other screens!#Shaakuntalam in cinemas from Tomorrow! 🎟️… pic.twitter.com/TTjdOSloDT — Gunaa Teamworks (@GunaaTeamworks) April 13, 2023 -
Shaakuntalam Review: ‘శాకుంతలం’ మూవీ రివ్యూ
టైటిల్: శాకుంతలం నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్‌బాబు, అదితి బాలన్, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి, అల్లు అర్హ తదితరులు నిర్మాణ సంస్థ: గుణ టీమ్‌వర్స్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు : నీలిమా గుణ దర్శకత్వం: గుణశేఖర్ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్ ఎడిటర్ : ప్రవీణ్ పూడి విడుదల తేది: ఏప్రిల్ 14, 2023 కథేంటంటే.. విశ్వామిత్రుడు చేస్తున్న తపస్సుని భంగం చేయమని మేనక(మధుబాల)ను భూలోకానికి పంపిస్తాడు ఇంద్రుడు. అనుకున్నట్లే తన అందచందాలతో మేనక.. విశ్వామిత్రుని తప్పస్సుకి భంగం కలిగిస్తుంది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగాను కలుస్తారు. ఫలితంగా మేనక ఓ ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఓ మనిషి వల్ల పుట్టిన బిడ్డకి దేవలోకంలో ప్రవేశం లేకపోవడంతో ఆ చిన్నారిని భూలోకంలోనే వదిలి వెళ్లిపోతుంది మేనక. ఆ చిన్నారిని ఓ పక్షుల గుంపు మాలినీ నది తీరాన ఉన్న కణ్వ మహర్షి(సచిన్ ఖడేకర్) ఆశ్రమానికి తరలిస్తాయి. ఆమెకు శకుంతల(సమంత) అని పేరుపెట్టి కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు కణ్వ మహర్షి. ఒకరోజు దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) కణ్వాశ్రమానికి వెళ్తాడు. అక్కడ శకుంతలను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. శకుంతల కూడా దుష్యంత మహారాజుని ప్రేమిస్తుంది. గాంధర్వ వివాహంతో ఇద్దరూ ఒక్కటవుతారు. ఆ తర్వాత వీరిద్దరి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవేంటి? గర్భిణీగా ఉన్న శకుంతలకు దుష్యంత రాజ్యంలో జరిగిన అవమానం ఏంటి? శకుంతల గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రి కాదని దుష్యంతుడు ఎందుకు చెప్పాడు? శకుంతల, దుష్యంతుడు విడిపోవడానికి దుర్వాస మహాముని(మోహన్ బాబు) ఎలా కారణమయ్యాడు? గర్భవతిగా ఉన్న సమయంలో శకుంతల పడిన బాధలేంటి? ఆమెకు పుట్టిన బిడ్డ ఎక్కడ పెరిగాడు? తిరిగి వీరిద్దరు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు గుణశేఖర్. ఇదొక అందమైన ప్రేమ కావ్యమని అందరికి తెలిసిందే. చాలామందికి తెలిసిన కథ. ఇలాంటి కథలకు తెరరూపం ఇవ్వడం అంటే కత్తిమీద సాములాంటిదే. ప్రేక్షకులను మైమరిపించేలా విజువల్ ఎఫెక్స్, గ్రాఫిక్స్ ఉండాలి. కానీ ఈ విషయంలో గుణశేఖర్ టీమ్ దారుణంగా ఫేలయింది. నాసిరకమైన త్రీడీ హంగులతో సీరియల్‌కి ఎక్కువ సినిమాకు తక్కువ అన్నట్లుగా శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇప్పటికీ మహాభారతం చదవకపోయినా.. శకుంతల అంటే ఎవరో తెలియకపోయినా..ఈ సినిమా అర్థమవుతుంది. ఒక్కో విషయాన్ని చాలా నీట్‌గా, అందరికి అర్థమయ్యేలా వివరించారు. అయితే కథను కథలాగే చెప్పడం మైనస్. ఈ రోజుల్లో కథలో వేగం, బలమైన సంఘర్షణలు, ట్విస్టులు లేకపోతే.. ప్రేక్షకులు ఆదరించడం లేదు. వారిని రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయడానికి బలమైన కథ ఉండాలి. లేదంటే మైమరిపించేలేలా సాంకేతిక హంగులద్దాలి. కానీ ఈ రెండూ శాకుంతలంలో మిస్ అయ్యాయి. కథ ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా అలా.. వెళ్తుంది. కానీ ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. ఆహా..ఓహో..అనిపించేలా ఒక్కటంటే.. ఒక్క సన్నివేశం ఉండదు. ఫస్టాఫ్ మొత్తం విషయానికిస్తే.. పసిపాప శకుంతలను పక్షులు ఎత్తుకెళ్లి కణ్వాశ్రమంలో వదిలేయడం.. కణ్వ మహర్షి పెంచి పెద్ద చేయడం.. అక్కడి పక్షులు, జంతువులతో శకుంతలకు ఉన్న అనుబంధం.. దుష్యంతుడితో ప్రేమాయణం.. ఇలా సాగుతుంది. ఒక చిన్న ట్వీస్ట్‌తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లో సాగుతుంది. దుష్యంతుడి రాజ్యానికి శకుంతల వెళ్లడం.. ఆమెకు అవమానం జరగడం.. రాజ్యంలోని మనుషులు రాళ్లతో కొట్టడం..ఆమె అక్కడి నుంచి పారిపోవడం..ఇలా చాలా సంఘటనలు సెకండాఫ్‌లో జరుగుతాయి. ఫస్టాఫ్‌లో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. శకుంతల, దుష్యంతుడు లవ్‌స్టోరీ అంతగా ఆకట్టుకోదు. అలాగే వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ పండేందుకు బలమైన సీన్స్ కూడా ఉండవు. యుద్ధ సన్నివేశాలు సైతం అంత్యంత పేలవంగా సాగుతాయి. చాలా చోట్ల ఇది గ్రాఫిక్స్ అనే విషయం ఈజీగా తెలిసిపోతాయి. ఇక క్లైమాక్స్‌లో భరతుడిగా అల్లు అర్హ ఎంట్రీ అదిరిపోతుంది. దుష్యంతుడితో ఆమె చేసే వాదనలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే.. శకుంతల పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది సమంత. ప్రేమికురాలిగా, భర్తకు దూరమైన భార్యగా ఇలా డిఫెరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రలో ఆమె చక్కగా నటించింది. కానీ ఆమె డబ్బింగ్ మాత్రం పెద్ద మైనస్. ఇక దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ బాగానే సెట్ అయ్యాడు కానీ.. నటన పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆయన స్థానంలో టాలీవుడ్‌కి పరిచయం ఉన్న నటుడిని తీసుకుంటే బాగుండేమో. ఓ స్టార్ హీరోని పెడితే ఇంకా బాగుండేది. ఎందుకంటే సమంతతో సమానంగా ఆ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఉంది. అలాంటి పాత్రకు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని దేవ్ మోహన్ని ఎంచుకొని గుణ శేఖర్ పప్పులో కాలేశాడు. ఇక దుర్వాస మహర్షిగా మోహన్ బాబు బాగా సెట్ అయ్యాడు. ఆయన తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా.. ఆకట్టుకున్నాడు. మేనకగా మధుబాలను చూడడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ.. తన ముద్దు ముద్దు మాటలతో భరతుడి పాత్రకు న్యాయం చేసింది. తెలుగు డైలాగ్స్‌కి చక్కగా చెప్పింది. గౌతమి, అనన్యా నాగళ్ళ, జిష్షుసేన్ గుప్తా, శివ బాలాజీ, కబీర్ సింగ్, సచిన్ ఖడేకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ పూర్తిగా తేలిపోయింది. త్రీడీ అన్నారు కానీ.. ఆ ఫీలింగ్ పెద్దగా కలగదు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
వరుస ప్రమోషన్స్.. మళ్లీ అనారోగ్యం బారిన సమంత
Samantha: సమంత ప్రధాన పాత్రలో తెరకెకక్కిన సినిమా 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది వరకే రిలీజైన ట్రైలర్, పాటలతో సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. మరో వైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో సమంత కూడా ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఈక్రమంలో కెమెరా ఫ్లాష్‌లైట్స్ వల్ల తను కళ్లు కూడా తెరవడానికి ఇబ్బంది పడింది. తాజాగా సామ్ అనారోగ్యం బారిన పడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సమంతే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించింది. 'ఈ వారం అంతా శాకుంతలం మూవీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండాలని, మీ ప్రేమలో తడిసి ముద్దవ్వాలని అనుకున్నాను. కానీ బిజీ షెడ్యూల్స్, ప్రమోషన్స్ కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. ప్రస్తుతం నాకు జ్వరం కూడా వచ్చింది.. నా గొంతు కూడా పోయింది.. ఈ రోజు మల్లారెడ్డి కాళాశాలలో జరిగే ఈవెంట్లో శాకుంతలం టీం రాబోతోంది.. మీరంతా వెళ్లండి.. మీ అందరినీ నేను మిస్ అవుతున్నాను' అని సమంత ట్వీట్ చేసింది. అయతే శాకుంతలం సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండటం, సామ్ ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. గతంలో టాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగిన ఆయన వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు. దీంతో సినిమా అవకాశాలు కూడా తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న శాకుంతలం సినిమా గుణశేఖర్‌కు పూర్వ వైభవం తీసుకొస్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా రెండు రోజులు వెయిట్ చేయల్సిందే. (1/2)I was really excited to be amongst you all this week promoting my film and soaking in your love. Unfortunately the hectic schedules and promotions have taken its toll, and I am down with a fever and have lost my voice. — Samantha (@Samanthaprabhu2) April 12, 2023 -
30 కేజీల లెహెంగా.. చాలా ఇబ్బంది పడ్డా: సమంత
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ తేది దగ్గర పడుతుండడంతో సమంత వరుస ఇంటర్వ్యూలు పాల్గొంటున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. తాజాగా సమంత తన ఇన్‌స్టాలో ఈ సినిమాకు సంబంధించి ఐదు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సమంత షేర్ చేశారు. ఐదు ఇంట్రెస్టింగ్ విషయాలివే పూలు అంటే ఎలర్జీ అని సమంత తెలిపారు. ఈ సినిమా కోసం చేతికి, మెడకి పూలు చుట్టుకోవడంతో దద్దుర్లు వచ్చాయని వెల్లడించారు. అవీ టాటూలాగా కనిపించాయని.. ఆరు నెలలు అవి అలాగే ఉండిపోయాయని తెలిపింది. షూటింగ్ సమయంలో అవి కనిపించకుండా మేకప్‌తో కవర్ చేసినట్లు తెలిపింది. శాకుంతలంలో తన పాత్రకు సమంత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు వెల్లడించింది. ఇది చాలా కష్టంగా అనిపించిదని.. నిద్రలో కూడా డైలాగ్స్ కలలోకి వచ్చేవని తెలిపింది. అంతే కాకుండా సినిమా షూటింగ్ సమయంలో కుందేలు కరిచిందని సమంత తెలిపింది. సెట్లో చాలా కుందేళ్లు ఉండగా.. ఒకటి తనని కరిచిందని సమంత చెప్పుకొచ్చింది. ఆ కుందేలు తనకు నచ్చలేదని.. అసలు అది క్యూట్‌గానే లేదని చెప్పింది. ఈ సినిమాలో కనిపించే జుట్టు తనది కాదని.. అది ఒరిజినల్ కాదని సమంత వెల్లడించింది. శాకుంతం మూవీలోని ఓ పాటకు ధరించిన లెహెంగా బరువు 30 కేజీలు ఉందని సమంత తెలిపింది. దాంతో చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. రౌండ్ తిరిగినప్పుడు ఆ లెహెంగా బరువుకు ఫ్రేమ్ నుంచి పక్కకు వెళ్లడంతో.. కెమెరా మ్యాన్ గట్టిగా అరిచారని వెల్లడించింది. నేను వెళ్లడం లేదు.. లెహంగానే నన్ను లాక్కుని వెళ్తోందంటూ చెప్పడంతో సెట్ అంతా నవ్వులు కురిసేవని సమంత చెప్పింది. ఈ విషయాలు తెలుసుకున్న నెటిజన్లు సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
‘శాకుంతలం’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ ఫోన్ చేయలేదు: సమంత
‘‘ఒకప్పుడు నా లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్స్ లేవు. సో.. నేను చాలా సింపుల్‌గా, హ్యాపీగా ఉన్నాను. కానీ నా జీవితంలో నేను కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరైనా తమ జీవితాల్లో స్ట్రగుల్స్‌ను ఫేస్ చేసినప్పుడు వారు స్ట్రాంగ్‌గా మారిపోతుంటారు. నేనూ అంతే. నన్ను నేను ప్రత్యేకం అనుకోవడం లేదు. అయితే నా జీవితంలో నాకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇవి నా జీవితాన్ని నాశనం చేయకూడదని అనుకుని, ఇందుకు తగ్గట్లుగా జీవితంలో ముందుకెళుతున్నాను’’ అని సమంత అన్నారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’. ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత్ మహారాజుగా దేవ్‌మోహన్ నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సమంత మాట్లాడుతూ–‘‘శాకుంతలం’ పూర్తి కథ విన్నప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను. భారతీయ సాహిత్యంలో ఎంతోమంది ప్రేమించే శకుంతల పాత్రను పోషించడం నాకు పెద్ద బాధ్యతగా అనిపించింది. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్‌సిరీస్‌లో రాజీవంటి క్యారెక్టర్ చేసిన నేను వెంటనే శకుంతల పాత్ర చేయడానికి తొలుత భయపడి నో చెప్పాను. కానీ శకుంతల అంటే కేవలం అందమైన అమ్మాయి మాత్రమే కాదు.. హుందాతనం, ఆత్మగౌరవం కలిగిన యువతి కూడా. ఏ తరం అమ్మాయిలకైనా శకుంతల పాత్ర కనెక్ట్ అవుతుందని మళ్లీ ఆలోచించి ఒప్పుకున్నాను. తొలి సారిగా 3డీలో ‘శాకుంతలం’ ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. ఈ సినిమా కోసం గుణశేఖర్‌గారు మ్యాజికల్ వరల్డ్‌ను క్రియేట్ చేశారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షూటింగ్స్‌కి రమ్మని ఎవరూ నాకు ఫోన్ చేయలేదు. ఈ విధంగా నాకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించింది’’ అన్నారు. ‘‘కథను నమ్మి ‘శాకుంతలం’ సినిమా తీశాం’’ అన్నారు గుణశేఖర్. ‘‘ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే గుణశేఖర్‌గారి ప్రయత్నంలో నేనూ భాగమవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ‘దిల్’ రాజు. -
ఆ క్యారెక్టర్ చేయడానికి చాలా భయపడ్డా: సమంత
సమంత తాజాగా నటించిన చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వరుస ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శాకుంతలం మూవీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈవెంట్లో పాల్గొన్న సమంత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంతుని పాత్రలో నటిస్తున్నారు. సమంత మాట్లాడుతూ..'చిన్నప్పుడు ఈ కథ నాకు కొంత తెలుసు. నా ప్రతీ సినిమాకు ది బెస్ట్ ఇవ్వడానికి కృషి చేస్తా. ఫస్ట్ నేను ఈ క్యారెక్టర్ చేయడానికి భయపడ్డా. నాకు అన్ని ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. కానీ క్లిష్ట సమయంలోనే నేను చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యా. అర్హ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు అందరి ముఖాల్లో నవ్వు కనపడుతోంది. పాన్ ఇండియా సినిమాకు నా బెస్ట్ కోసం ఎంతో కృషి చేశా.' అని అన్నారు. (ఇది చదవండి: సమంత నాగచైతన్యను ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసిందా?) దిల్ రాజు మాట్లాడుతూ.. 'మన సొంత ప్లేస్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం చెప్పినా ప్రతిదీ వైరల్ అవుతుంది. కానీ బయట ప్లేస్‌లో అలా అవసరం లేదు బోల్డ్‌గా చెప్పొచ్చు. నాకు సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు ఉంది. ఈ జానర్లో కూడా చేద్దామనని ఈ సినిమా చేశా. ఏ భాషలో అయినా స్టార్ హీరోలు స్టార్ హీరోలే.' అని అన్నారు.