శాకుంతలం ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌, ఆకట్టుకుంటున్న మెలోడి సాంగ్‌ | Samantha Shaakuntalam Song Launch | Sakshi
Sakshi News home page

శాకుంతలం ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌, ఆకట్టుకుంటున్న మెలోడి సాంగ్‌

Published Thu, Jan 19 2023 6:24 AM | Last Updated on Thu, Jan 19 2023 9:13 AM

Samantha Shaakuntalam Song Launch - Sakshi

మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటించారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

ఈ చిత్రంలోని ‘మల్లికా మల్లికా మాలతీ మాలికా.. చూడవా చూడవా ఏడి నా ఏలిక’ అంటూ సాగే పాటను బుధవారం విడుదల చేశారు. చైతన్య ప్రసాద్‌ రాసిన ఈ పాటను రమ్య బెహ్రా పాడారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement