song launch
-
యాక్షన్ ఎంటర్టైనర్
అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించగా, అర్జున్ ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించారు. కాగా ఈ మూవీ నుంచి ‘సవదీక..’ అంటూ సాగే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను అరివు రాయగా, ఆంథోని దాసన్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘విడాముయర్చి’. అజిత్, త్రిషలపై వచ్చే ఈ పాట ఎనర్జిటిక్‌గా సాగుతుంది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేరా: ఓం ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సుబ్రమణియన్ నారాయణన్. -
నానా హైరానా మెలోడీ సాంగ్ HD స్టిల్స్.. రామ్‌చణ్, కియారా అదరగొట్టేశారుగా! (ఫోటోలు)
-
ఉగ్రావతారం
‘‘హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా భర్త ఉపేంద్రగారిని తొలిసారి ఇక్కడే కలిశాను. అందుకే హైదరాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరీర్లో తొలి యాక్షన్ ఫిల్మ్ ‘ఉగ్రావతారం’. ఈ పాత్రకు నేను సరిపోతానని డైరెక్టర్ గురుమూర్తిగారు నమ్మారు. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని నటి ప్రియాంకా ఉపేంద్ర అన్నారు. ప్రియాంకా ఉపేంద్ర లీడ్ రోల్లో గురుమూర్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉగ్రావతారం’.ప్రియాంకా ఉపేంద్ర సమర్పణలో ఎస్జీ సతీష్ నిర్మించిన ఈ సినిమా నవంబరు 1న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, నిర్మాత కరాటే రాజు, నటుడు సత్యప్రకాశ్ పాటను రిలీజ్ చేశారు. డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలపై మంచి సందేశాత్మాక చిత్రంగా ‘ఉగ్రావతారం’ ఉంటుంది’’ అన్నారు. -
నీలో... నాలో...
భవ భూతి, రేవతి ప్రేమలో పడ్డారు. ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం... లోలో ఎదలో వినిపించసాగే ఓ తాళం...’ అంటూ పాట అందుకున్నారు. భవ భూతిగా శ్రీవిష్ణు, రేవతిగా మీరా జాస్మిన్ నటించిన చిత్రం ‘శ్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం...’ అంటూ సాగే పాటను శనివారం విడుదల చేశారు.ఈ చిత్రంలో శ్రీవిష్ణు చేసిన నాలుగు పాత్రల్లో భవ భూతి ఒకటి. ఆ పాత్ర సరసనే మీరా జాస్మిన్ కనిపించనున్నారు. ఇక చిత్ర సంగీతదర్శకుడు వివేక్ సాగర్ స్వరపరచిన ఈ పాటకు భువనచంద్ర సాహిత్యం అందించగా రాజేశ్ కృష్ణన్, అంజనా సౌమ్య ఆలపించారు. ‘‘ఈ మెలోడీ ట్రాక్‌లో శ్రీవిష్ణు, మీరా జాస్మిన్ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఈ పాట ప్రేక్షకులను 1980, 90లలోకి తీసుకెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో దక్షా నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
చిన్నారి తల్లీ.. కలకు భయపడకు
గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’ అంటూ సాగేపాటని విడుదల చేసింది చిత్రయూనిట్.‘మొండి తల్లి పిల్ల నువ్వు.. అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి, కలకు భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించిన ఈపాటని సాహితీ చాగంటిపాడారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందిన చిత్రం ‘విశ్వం’. ఇటీవల విడుదలైన తొలిపాట ‘మొరాకో మగువా..’ కి మంచి స్పందన వచ్చింది. ‘తల్లి, కూతురు నేపథ్యంలో వచ్చే ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’పాట కథలోని భావోద్వేగాల లోతును తెలియజేస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్. -
ఫస్ట్ లవ్ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
పదింటికే చలీ జ్వరం...
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది.మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘క్యా లఫ్డా..’ అంటూ సాగే మూడోపాటని సోమవారం రిలీజ్ చేశారు. ‘నరం నరం గరం గరం... పదింటికే చలీ జ్వరం, నీ ఊహలే నిరంతరం... పోతోందిరా నాలో శరం...’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం అందించిన ఈపాటని ధనుంజయ్ సీ΄ాన, సింధూజ శ్రీనివాసన్పాడారు. రామ్, కావ్యాల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి. -
శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ సినిమా ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
పండగ వచ్చిందే చాన్నాళ్లకి...
గూడెంలోని ప్రజలందరూ ఆ రోజు శుభవార్త విన్నారు. ఆ ఆనందంలో ‘మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందే చాన్నాళ్లకి... అలికీ అలికీ ఊరే అలికీ ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్లకీ...’ అంటూ ΄ాడుకున్నారు. విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’ చిత్రంలోని ΄ాట ఇది. ΄ా. రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో ΄ార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూ΄÷ందింది. బుధవారం ఈ చిత్రంలోని ‘మనకి మనకి...’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరచిన ఈ ΄ాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా సింధూరీ విశాల్ ΄ాడారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. -
మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ
‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్... మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ’ అంటూ మొదలయ్యే ‘స్టెప్పా మార్’ పాట ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలోనిది. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019). ఈ సినిమాకు సీక్వెల్‌గా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కావ్యా థాపర్ హీరో యిన్. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.ఈ సినిమా నుంచి ‘స్టెప్పా మార్..’ అనే పాట లిరికల్ వీడియోను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సోమవారం విడుదల చేశారు. ‘‘ఇస్మార్ట్ శంకరే.. ఏక్ దమ్ డేంజరే... ఔర్ ఏక్ బార్ ఆయారే.. బేజారే..’ అంటూ సాగుతుంది ‘స్టెప్పామార్’ సాంగ్. తెలుగు వెర్షన్ పాటకు మణిశర్మ సంగీత సారథ్యంలో భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి, సాహితి పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నిశి తొలిచాడు దీపమై...
‘అధర్మాన్ని అణచెయ్యగ యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే... స్వధర్మాన్ని పరిరక్షించగ సమస్తాన్ని ప్రక్షాళించగ సముద్భవించే అవతారమిదే...’ అంటూ మొదలవుతుంది ‘కల్కి’ థీమ్ సాంగ్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది.ఈ సందర్భంగా ‘థీమ్ ఆఫ్ కల్కి’ పాటను మంగళవారం విడుదల చేశారు. ‘అధర్మాన్ని అణచేయగా..’ అంటూ మొదలై... ‘నిశి తొలిచాడు దీపమై... నిధనం తన ధ్యేయమై... వాయువే వేగమై...కలియుగ స్థితి లయలే కలబోసే కల్కి ఇతడే...’ అనే లిరిక్స్‌తో ‘థీమ్ ఆఫ్ కల్కి’ సాగుతుంది. కాలభైరవ, సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా కాలభైరవ పాడారు. -
కలలో బీట్ బాగుంది: సంగీతదర్శకుడు కోటి
‘‘కలలో... కలలో.. .’ పాట చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ పాట బీట్, లిరిక్స్, నటీనటుల వేషధారణ, నటన అన్నీ బాగా కుదిరాయి. ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు సంగీతదర్శకుడు కోటి. నటుడు అలీ ఫ్యామిలీ నుంచి సదన్ హీరోగా పరిచయమవుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రంలోని ‘కలలో... కలలో...’ అంటూ సాగే పాటను కోటి రిలీజ్ చేశారు.పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ల లింగయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా ప్రసాద్ హీరోయిన్. ‘‘ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో రూపోందించిన ఈ చిత్రంలోని ‘కలలో..’ అంటూ సాగే ప్రేమ పాటను సహజమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. వీనుల విందుగా, కనువిందుగా ఉంటుంది. త్వరలో సినిమాని విడుదల చేస్తాం ’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ, కెమెరా: ఈదర ప్రసాద్. -
రామానుజాచార్యుల చరిత్రతో...
సాయి వెంకట్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. జో శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి భాగం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘జయహో రామానుజ’ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సాయి వెంకట్ మాట్లాడుతూ– ‘‘మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి మెలగాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు రామానుజా చార్యులవారు. ఆయన గొప్పతనం ఈ తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ‘జయహో రామానుజ’ చిత్రాన్ని రూపోందించాను.సంగీత సాహిత్యాలు బాగుండాలని టైమ్ తీసుకుని ఖర్చుకు వెనకాడ కుండా సాంగ్స్ డిజైన్ చేశాం’’ అన్నారు. ‘‘జయహో రామానుజ’ సినిమా మా నాన్నగారు సాయి వెంకట్‌కి ఒక కల’’ అన్నారు నిర్మాత ప్రవళ్లిక. ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య, వెంకట్, హర్ష. -
గరం గరం యముడయో...
అతనితో పెట్టుకున్నవారి పాలిట యమడవుతాడు... గొడ్డలి చేత పట్టాడా అంతే సంగతులు. శత్రువులను పరుగులు పెట్టించి మరీ రఫ్ఫాడేస్తాడు. ‘సరిపోదా శనివారం’లో నాని చేస్తున్న సూర్య క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘గరం గరం... ’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. ‘గరం గరం యముడయో.. సహనాల శివుడయో..’ అంటూ ఈ పాట సాగుతుంది.హీరో ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చుతాడో ఈ పాటలో నాని లుక్స్, చేసే ఫైట్ ద్వారా చూపించారు. సంగీతదర్శకుడు జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటకు సహపతి భరద్వాజ్ సాహిత్యం అందించగా విశాల్ దద్లానీ పాడారు. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. ఆగస్టు 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
పీచు మిఠాయ్...
సైకిలు మీద ప్రేమ షికారుకు వెళ్లారు సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి. ఈ జాలీ రైడ్‌లో ‘పీచు మిఠాయ్...’ అంటూ పాట పాడుకున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’లో సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి ఓ జంటగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరి మధ్య ‘పీచు మిఠాయ్..’ అంటూ సాగే రొమాంటిక్, మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా విజయ్ ప్రకాశ్, హరిప్రియ పాడారు. తెలుగు, తమిళ భాషల్లో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 13న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌ని ఏషియన్–సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి విడుదల చేయనుంది. -
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
వైవీయూ: ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ‘సిద్ధం’ పాటల సీడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ఆవిష్కరించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీడీని రూపొందించిన సూర్య చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ఎన్ఆర్ఐ సూర్యనారాయణ, పాటల రూపకర్త, ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఎం.ప్రభాకర్‌లను భారతమ్మ అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లే శక్తి పాటకు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని పాటల రూపంలో గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానులకు ఈ పాటలను అందుబాటులోకి తెస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘సిద్ధం’ పాటల సీడీ రూపకల్పనకు సహకారం అందించిన బి.రామతులసి, డా.వి.ఉష, ఎన్.సుదీప్‌రెడ్డి పాల్గొన్నారు. -
చెబుతావా రత్నం
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కె. రాజ్‌కుమార్ విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చెబుతావా..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, సింధూరి విశాల్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘రత్నం’. ‘చెబుతావా..’ పాట మెలోడియస్గా, ఎమోషనల్‌గా సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఇదొక కొత్త ప్రయత్నం
ఆశిష్, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘లవ్ వీ’. ‘ఇఫ్ యు డేర్’ (నీకు ధైర్యం ఉంటే...) అనేది ఉపశీర్షిక. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రావాలి రా..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదబాద్‌లో జరిగింది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను చెబోలు అమల, గోమతీ అయ్యర్, అదితీ భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్విన్, సాయి శ్రేయ ఆలపించారు. ‘‘ఓ ఘోస్ట్ లవ్‌స్టోరీ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రం యూనిట్ పేర్కొంది. ‘‘లవ్ మీ ఒక కొత్త ప్రయత్నం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
పారడైసు పావడేసుకొచ్చెనండి...
‘జరగండి జరగండి... జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చెనండి... జరగండి జరగండి... పారడైసు పావడేసుకొచ్చెనండి...’ అంటూ పాట అందుకున్నారు రామ్‌చరణ్. ఈ జాబిలమ్మ ఎవరూ అంటే కియారా అద్వానీ. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని పాట ఇది. రామ్‌చరణ్ పుట్టినరోజు ప్రత్యేకంగా బుధవారం ‘జరగండి..’ లిరికల్ సాంగ్‌ను 150కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ పాడారు. అనిత సమర్పణలో జీ స్టూడియోస్ అసోసియేష¯Œ తో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
రోటీ కపడా రొమాన్స్ మూవీ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
ఎనిమిది భాషల్లో రికార్డు బ్రేక్
నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్యకృష్ణ, కాశీ విశ్వనాథ్ ముఖ్య తారలుగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పై చదలవాడ పద్మావతి నిర్మించిన చిత్రం ‘రికార్డు బ్రేక్’. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 8 భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మళ్లీ పుట్టి వచ్చినవా..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సాబు వర్గీస్ సంగీత సారథ్యంలో వరికుప్పల యాదగిరి ఈ పాటకు లిరిక్స్ అందించి, పాడారు. ‘‘అందరికీ నచ్చేలా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
‘బిచ్చగాడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రోమియో’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళినీ రవి హీరోయిన్గా నటిస్తున్నారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌పై విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ ధనశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌కి భాష్యశ్రీ సాహిత్యం అందించగా, ఆదిత్య ఆర్కే పాడారు. ‘‘విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో నటిస్తున్న చిత్రం ‘లవ్ గురు’. ఇందులో మనసుని కదిలించే చెల్లెలి సెంటిమెంట్ కూడా ఉంటుంది. వేసవిలో ఈ చిత్రం విడుదల చేయనున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: ఫరూక్ జే బాష. -
క్రైమ్ థ్రిల్లర్
‘‘కలర్ ఫోటో’ చిత్రానికి ముందు ‘మను చరిత్ర’ సినిమాలో శివ స్నేహితుడిగా చేశాను. నిర్మాత రాజ్ కందుకూరిగారు నన్ను కూడా తన కుమారుడు శివలానే చూసుకునే వారు. నేను హీరో కాకముందే నన్ను ఓ హీరోలా చూశారాయన. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’లోని ‘శివ ట్రాప్ ట్రాన్స్..’ పాట అద్భుతంగా ఉంది. ఈ సినిమాని అందరూ చూడాలి’’ అని హీరో సుహాస్ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ మూవీ మార్చి 1న విడుదల అవుతోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘శివ ట్రాప్ ట్రాన్స్..’ అనే పాటని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ లాంచ్ చేశారు. అనంతరం నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి సుహాస్ ముఖ్య అతిథిగా హాజరై, పాట రిలీజ్ చేశారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటని కాలభైరవ పాడారు. ‘‘మా సినిమాని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు శివ కందుకూరి. ‘‘యునిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు పురుషోత్తం రాజ్. ‘‘మా మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు స్నేహాల్, శశిధర్, కార్తీక్. ఈ వేడుకలో దర్శకుడు విజయ్ కనకమేడల, హీరోయిన్ వర్ష బొల్లమ్మ, నిర్మాత రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల పాల్గొన్నారు. -
Utsavam Movie: ఆకట్టుకుంటున్న ‘ఫస్ట్ కిస్’ సాంగ్
రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాశ్ జంటగా నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు మేకర్స్. ‘ఫస్ట్ కిస్..’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేసింది యూనిట్. చిత్ర సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల పాడారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఉత్సవం’ రూపొందింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ‘ఫస్ట్ కిస్..’ పాట యువతను ఆకట్టుకుంటుంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులందరూ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. -
డూడుం డుక్కుడుం బాగుంది
‘‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు–500143’ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాట బాగుంది. ఈ సాంగ్‌కి క్లాసికల్ టచ్ ఇవ్వడం బాగా నచ్చింది. ఈ సినిమాలోని ఇతర పాటలు ఎలా ఉంటాయో అని ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం తప్పకుండా మ్యూజికల్ హిట్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ అన్నారు. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు– 500143’. కొవ్వూరి అరుణ సమర్పణలో బ్లాక్ యాంట్ పిక్చర్స్‌పై భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాటని జీవీ ప్రకాశ్ కుమార్ విడుదల చేశారు. శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు. ఈ చిత్రానికి కెమెరా: నిఖిల్ సురేంద్రన్, నేపథ్య సంగీతం: కమ్రాన్.