
కాశీ విశ్వనాథ్, చదలవాడ శ్రీనివాసరావు
నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్యకృష్ణ, కాశీ విశ్వనాథ్ ముఖ్య తారలుగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పై చదలవాడ పద్మావతి నిర్మించిన చిత్రం ‘రికార్డు బ్రేక్’. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 8 భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మళ్లీ పుట్టి వచ్చినవా..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సాబు వర్గీస్ సంగీత సారథ్యంలో వరికుప్పల యాదగిరి ఈ పాటకు లిరిక్స్ అందించి, పాడారు. ‘‘అందరికీ నచ్చేలా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు చదలవాడ శ్రీనివాసరావు.
Comments
Please login to add a commentAdd a comment