
∙కేతికా శర్మ, శ్రీవిష్ణు, ఇవాన
శ్రీవిష్ణు హీరోగా, కేతికా శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘శిల్పి ఎవరో...’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు. ఈపాటకి శ్రీమణి సాహిత్యం అందించగా, యాజిన్ నిజార్‌పాడారు. ‘ఏఐ కూడా ఊహించలేదుగా ఇంత అందాన్ని ఏం చెప్పినా’ అనే పల్లవితో ఈపాట ఆరంభం అవుతుంది. ‘‘తన జీవితంలోని ఇద్దరమ్మాయిల (కేతిక, ఇవానా) అందంపై శ్రీవిష్ణు ప్రశంసలు కురిపిస్తూ ఈపాట సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది.