
మే 9న అనగానే తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిన రోజు అని అంటారు. ఎందుకంటే అదే రోజున రిలీజై హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా చిరు చిత్రాలు ఆ రోజున రిలీజైనవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. ఇప్పుడు అదే తేదీన మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్ ఉండబోతున్నాయి.
మొదటి దాని విషయానికొస్తే రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతడి మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మే 9నే ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాల్ని పెట్టగా.. ఇప్పుడు చరణ్ ఆ లిస్టులోకి చేరబోతున్నాడు.
(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ)

మరోవైపు చిరు కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒకటి. దీన్ని మే 9న రీ రిలీజ్ చేయబోతున్నారు. 2డీ, 3డీ వెర్షన్ తో ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గతంలో మే 9నే ఈ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఇలా ఒకేరోజున మెగా అభిమానులకు రెండు ట్రీట్స్ రాబోతున్నాయనమాట. లెక్క ప్రకారం మరొకటి కూడా ఉండాలి. అదే 'హరిహర వీరమల్లు'. పవన్ కల్యాణ్ నటించిన ఈ లేటెస్ట్ చిత్రాన్ని మే 9నే రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఈసారి కూడా వాయిదా గ్యారంటీ అని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి)
