
ప్రస్తుతం మైథలాజికల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి హీరోగా, దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘యముడు’. ఈ చిత్రానికి ‘ధర్మో రక్షతి రక్షితః’ ఉపశీర్షిక. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ సరికొత్త పోస్టర్ విడుదలైంది.
గతంలో విడుదలైన ‘యముడు’ టైటిల్ పోస్టర్, దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ఈ కొత్త పోస్టర్ మరింత శక్తివంతంగా, ఆకర్షణీయంగా ఉంది. జగదీష్ యముడి రూపంలో భయంకరంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేశారు. వెనుక ఉన్న మహిషాకారం, యముడి చేతిలోని సంకెళ్లు వంటి విజువల్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
హీరోయిన్‌ను యమపాశంతో బంధించిన దృశ్యం, యముడి ఆహార్యంలో జగదీష్ కనిపించిన తీరు రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.