Cinema News
-
సావిత్రి పాటకు అసభ్యంగా డ్యాన్స్.. సపోర్ట్ చేసిన డైరెక్టర్?
టాలీవుడ్లో మోస్ట్ ఐకానిక్ సాంగ్స్‌లో అహ నా పెళ్లంట ఒకటి. ఈ సాంగ్‌లో సావిత్రి కేవలం డ్యాన్స్ చేయడమే కాకుండా అద్భుతంగా హావభావాలు పండించింది. ఈ పాటను తాజాగా ఓ డ్యాన్స్ షోలో ఖూనీ చేశారు. పొట్టి డ్రెస్‌లో బెల్లీ డ్యాన్స్‌తో పాటను చెడగొట్టేశారు. ఆ ఎపిసోడ్‌కు గెస్టుగా వెళ్లిన డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) కాస్త ఆశ్చర్యపోతూనే కొత్తగా ఉందని మెచ్చుకున్నాడు.స్వేచ్ఛ లేదుపాటను ఖూనీ చేస్తుంటే ప్రశ్నించాల్సిందిపోయి ఇలా వంతపాడటమేంటని విమర్శలు వచ్చాయి. సారంగపాణి జాతకం సినిమా ఈవెంట్లో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. మోహనకృష్ణ మాట్లాడుతూ.. సాధారణంగా ఇలాంటి షోలకు అతిథులుగానే వెళ్తాం. అలా వెళ్లినప్పుడు మా పరిపూర్ణ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండదు. పైగా వాళ్లు కష్టపడి డ్యాన్స్ చేసినప్పుడు ఎంతో కొంత అభినందించాల్సిందే! ఆ అమ్మాయి నిజంగానే కష్టపడి డ్యాన్స్ చేసింది.కర్మకాలి..కాకపోతే ఆ పాటకు అలాంటి డ్యాన్స్ చేయొచ్చా? సందర్భానికి తగినట్లుగా ఉందా? లేదా? అన్నది చర్చనీయాంశం.. ఇకపోతే మేము షోకు వెళ్లినప్పుడు సాధారణంగా నవ్వినదాన్ని కూడా కట్ చేసి ఇంకోచోట చూపిస్తారు. అంతకుముందు కూడా కర్మకాలి నవ్వి ఓ వివాదంలో ఇరుక్కున్నాను. దానికి క్షమాపణ చెప్పే స్థితికి తీసుకొచ్చారు. అయితే ఇలాంటి షోలకు వెళ్లినప్పుడు సభామర్యాద పాటించి వారిని విమర్శించకూడదు. బెల్లీ డ్యాన్స్ అంటే నాకు ఇష్టమే. కానీ ఆ పాటకు అది సెట్ కాదనిపించింది. అయినా అవన్నీ అక్కడ చర్చించలేం అని క్లారిటీ ఇచ్చాడు. మోహనకృష్ణ దర్శకత్వం వహించిన సారంగపాణి జాతకం ఏప్రిల్ 25న విడుదల కానుంది.చదవండి: డిప్రెషన్.. అందుకే దూరమయ్యా.. క్షమించండి: నజ్రియా -
సమంత 'సిటాడెల్ 2' లేనట్లే.. ప్రకటించిన అమెజాన్
ఏ మాయ చేశావె సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది సమంత (Samantha Ruth Prabhu). తొలి చిత్రంలో అమాయకంగా కనిపించిన సామ్ తర్వాత యాక్షన్, ఛాలెంజింగ్ రోల్స్ చేసింది. 25 ఏళ్ల కెరీర్లో ఆమె ఎక్కువ కష్టపడ్డది సిటాడెల్ కోసమే! ఓపక్క మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పుడే సిటాడెల్లో యాక్షన్ సిరీస్ పూర్తి చేసింది.ఇండియన్ సిటాడెల్ :హనీ బన్నీలో వరుణ్ ధావన్- సమంతహాలీవుడ్ సిరీస్‌కు ఇండియన్ వర్షన్నిజానికి ఇది ఒరిజినల్ కాదు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించిన అమెరికన్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel)కు ఇది ఇండియన్ వర్షన్‌గా రూపొందింది. ఒరిజినల్ వర్షన్లో హాలీవుడ్ స్టార్ రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. న్యూటన్ థామస్- జెస్సికా ద్వయం రూపొందించారు. దీని ఇండియన్ వర్షన్ సిటాడెల్: హనీ బన్నీ (Citadel: Honey Bunny)లో వరుణ్ ధావన్, సమంత లీడ్స్ రోల్లో నటించగా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇది గతేడాది నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.హాలీవుడ్ సిటాడెల్లో రిచర్డ్ మాడెన్- ప్రియాంక చోప్రాఇకపై లేనట్లేతాజాగా దీనికి సీక్వెల్ నిలిపివేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సిటాడెల్ ఇండియన్ వర్షన్‌తో పాటు ఇటాలియన్ వర్షన్ (సిటాడెల్: డయానా) సీక్వెల్స్ ఆపేసి, బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నారు. దీని గురించి అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. సిటాడెల్: హనీ బన్నీ, సిటాడెల్: డయానా సిరీస్‌లను కొనసాగించడం లేదు. దానికి బదులుగా వీటిని మాతృకలో విలీనం చేసి సిటాడెల్ సెకండ్ సీజన్‌ను ముందుకు తీసుకొస్తాం. 2026లో రెండో సీజన్‌ను ముందుకు తీసుకొస్తాం అని పేర్కొన్నారు.చదవండి: ఘనంగా నటి అభినయ పెళ్లి.. ఫోటో చూశారా? -
అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్.. మూడో భారతీయ సింగర్‌గా రికార్డు!
మలయాళ ర్యాపర్, సింగర్ హనుమాన్‌కైండ్ (Hanumankind) సరిహద్దులు దాటుకుని ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్లిపోయాడు. అంతర్జాతీయంగా పాపులర్ అయిన కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్ (Coachella Music and Arts Festival 2025)లో భాగమయ్యాడు. ఇప్పటివరకు ఈ ఉత్సవంలో కేవలం ఇద్దరు భారతీయ సింగర్లు మాత్రమే భాగమయ్యారు. దిల్జిత్ దోసాంజ్, ఏపీ ధిల్లాన్ తర్వాత కోచెల్లాలో భాగమైన మూడో భారతీయ సింగర్‌గా హనుమాన్‌కైండ్ రికార్డు సృష్టించాడు. విజయ్ చివరి సినిమా అయిన జననాయగన్లో హనుమాన్‌కైండ్ ఓ స్పెషల్ సాంగ్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.హాలీవుడ్‌లోనే కెరీర్..అలాగే ఈ సంగీత ఫెస్టివల్లో కె. షానన్ ఎంట్రీ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ సింగర్ కుమార్ సాను కూతురే షానన్. ఈమె పుట్టింది ముంబైలో అయినా చదివింది, కెరీర్‌ను కొనసాగిస్తోంది మాత్రం అమెరికాలోనే! హాలీవుడ్ చిత్రాల్లో నటించడంతో పాటు పలు సాంగ్స్ పాడింది. ఆమె పాడిన గివ్ మి యువర్ హ్యాండ్ బిల్బోర్డ్ మ్యాగజైన్‌లోనూ ప్రదర్శితమైంది. ఇదే పాటను కోచెల్లా ఫెస్టివల్లోనూ ఆలపించి సంగీతప్రియులను ఉత్సాహపరిచింది. కోచెల్లా ఫెస్టివల్ ఏప్రిల్ 20న ముగియనుంది. View this post on Instagram A post shared by hanumankind (@hanumankind) చదవండి: దేవి శ్రీప్రసాద్కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే! -
UI మూవీ మీకర్థం కాదని తెలుసు.. ఐదారేళ్లయ్యాక మీకే..: ఉపేంద్ర
కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra).. డిఫరెంట్ సినిమాలకు ఈయన కేరాఫ్ అడ్రస్. ఏ, ఉపేంద్ర లాంటి విచిత్రమైన సినిమాలతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఉపేంద్రకు సీక్వెల్‌గా ఉప్పి 2 కూడా తీశారు. హీరోగా, దర్శకరచయితగా ఈయన తెరకెక్కించిన చివరి చిత్రం యూఐ. గతేడాది రిలీజైన ఈ సినిమా చాలామందికి అసలు అర్థమే కాలేదు. దీంతో ఎంత ప్రమోషన్స్ చేసినా చివరికి ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.ఐదారేళ్లయ్యాక అర్థమవుతుందిఈయన ప్రస్తుతం శివరాజ్ కుమార్‌తో కలిసి 45 మూవీలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ఈవెంట్లో యూఐ సినిమా రిజల్ట్ గురించి స్పందించారు. యూఐ సినిమా అర్థమవడం చాలా కష్టమని నాకు తెలుసు. నేను ఏడేళ్ల నుంచి చెప్తున్న విషయాన్నే ఈ మూవీలో స్ట్రాంగ్‌గా చెప్పాను. ఇంకో ఐదారేళ్లు అయ్యాక మీకు సినిమా అర్థమవుతుంది. నేను చేసిన ప్రయోగం ఏంటంటే.. థియేటర్లో సినిమా చూసేవాళ్లే అసలైన విలన్లు. అర్థం అయినా కానట్లే..దాన్ని మీరు జీర్ణించుకోవడం కష్టం. మీరెప్పుడూ స్క్రీన్‌పై కనిపించే విలన్నే చూస్తారు కదా.. కానీ యూఐ సినిమాలో ఉండే విలన్ మీరే. సినిమా చూస్తున్నప్పుడు ఆ విలన్ మీరే అని తెలుస్తుంది. అందుకే అంతా అర్థమయినా కూడా ఏమీ అర్థం కానట్లు నటిస్తారు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపేంద్ర కన్నడలో బుద్ధివంత 2, త్రిశూలం, 45 సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న కూలీలోనూ యాక్ట్ చేస్తున్నారు.చదవండి: దేవి శ్రీప్రసాద్కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే! -
దేవి శ్రీప్రసాద్కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే!
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విశాఖపట్నంలో నిర్వహించబోయే మ్యూజికల్ నైట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నాలుగు సార్లు ప్రయత్నించినా విశాఖ పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు. ఏప్రిల్ 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు డీఎస్పీ (Devi Sri Prasad) సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ లైవ్ షో కోసం ఆన్లైన్లో భారీగా టికెట్లు విక్రయించారు. కానీ భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేమని సీపీ శంఖబ్రత బాగ్చీ తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆక్వా వరల్డ్‌లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలోనే అనుమతులకు నిరాకరించారు. ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్.. తన సంగీత కచేరిని వాయిదా వేస్తాడా? లేదా వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by ACTC Events (@actc_events) చదవండి: కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. -
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
నచ్చినవారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇంకొన్నాళ్లయినా వారు తమతోనే ఉంటే బాగుండని బాధపడేవాళ్లు చాలామంది. బాలీవుడ్ నటి దియా మీర్జా (Dia Mirza) ఏళ్ల తరబడి అలాంటి బాధను అనుభవిస్తోంది. ఆమె తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి ఫ్రాంక్ హ్యాండ్రిచ్ను కోల్పోయింది. నాన్న చిన్నవయసులోనే వదిలిపెళ్లిపోయాడని, ఆయన ఇంకొంతకాలం తనతో ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు అనుకుంది. అన్నీ కళ రూపంలోనే..ఈ క్రమంలో తండ్రి ఫ్రాంక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను తల్చుకుని భావోద్వేగానికి లోనైంది. నేను గట్టిగా అరవాలనుకున్నప్పుడు ఏదైనా పెయింటింగ్ వేసేవాడినని నాన్న చెప్తూ ఉండేవాడు. ఆయన గొంతుక, ప్రార్థన, నిరసన.. అన్నీ కూడా కళ రూపంలోనే ప్రదర్శించేవాడు. తన మెదడులో తిరిగే భావాలను, ప్రపంచంలోని గొడవలను అన్నింటినీ కళగానే ముందుంచేవాడు. దాన్నొక బాధ్యతగా భావించేవాడు.చీమ నేర్పే పాఠాలుఅలాగే ప్రకృతితోనూ మమేకమయ్యేవాడు. చీమ పనితనం గురించి, అది మనకు నేర్పించే పాఠాల గురించి ఎక్కువగా చెప్పేవాడు. అవి ఎప్పుడూ కలిసికట్టుగా పని చేస్తూనే ఉంటాయి కానీ ఫిర్యాదులు చేయవని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పనిని ఆపవు అని చెప్పేవాడు. తనకన్నా 10 రెట్లు ఎక్కువ బరువును మోస్తుందనేవారు. ఆ చీమలు మనకు ఐకమత్యం, క్రమశిక్షణతో పాటు ఏ పనీ చిన్నది కాదని నేర్పిస్తాయన్నమాట!వచ్చే జన్మలో అయినా..హ్యాపీ బర్త్‌డే పప్పా.. మరో జన్మంటూ ఉంటే మనిద్దరం ఎక్కువకాలం కలిసుందాం. అప్పటివరకు నిన్ను నా ప్రతి అడుగులోనూ తలుచుకుంటూనే ఉంటాను అని రాసుకొచ్చింది. హిందీలో ఎన్నో సినిమాలు చేసిన ఆమె తెలుగులో వైల్డ్ డాగ్ మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) చదవండి: అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగనివ్వను: సమంత -
రూ.75 లక్షలు అడ్వాన్స్.. నితిన్ మోసం చేశాడు: నిర్మాత
హీరో నితిన్‌కు అడ్వాన్స్‌గా రూ.75 లక్షలిస్తే చివరకు ఆ సినిమానే చేయం అని చేతులెత్తేశాడు అంటున్నాడు నిర్మాత సత్యనారాయణ రెడ్డి. ఈయన.. ఢీ, భగీరథ, బన్నీ వంటి చిత్రాలను నిర్మించాడు. ఈయన కుమారుడు వేణు అలియాస్ వశిష్ట (Mallidi Vassishta) డైరెక్టర్‌గా బింబిసారతో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర మూవీ చేస్తున్నాడు.వశిష్ట ఇన్ని కష్టాలు పడ్డాడా?అయితే ఈ విజయాలకు ముందు వశిష్ట ఎన్నో కష్టాలు పడ్డాడు. వాటిని తండ్రి సత్యనారాయణ (Mallidi Satyanarayana Reddy) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'నితిన్ 'ఇష్క్' సినిమా సమయంలో ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి చాలా సమస్యల్లో ఉన్నారు. అప్పుడు నేను ఆ సినిమాను కొని వైజాగ్‌లో డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆయనకు ఎప్పుడైనా అవసరముంటే డబ్బులిచ్చేవాడిని. అలా మేము క్లోజ్ అయ్యాం.రూ.75 లక్షలు అడ్వాన్స్‌నా కుమారుడు వేణు (వశిష్ట)కు డైరెక్షన్ అంటే ఇష్టం ఉందని తెలిసి.. నితిన్ (Nithiin)తో సినిమా చేద్దాం అన్నాడు. మావాడిని నితిన్‌కోసం కథ రాసుకోమన్నాను. మేము ఓ నిర్మాతను సెట్ చేసుకున్నాం. ఆయనతో నితిన్‌కు అడ్వాన్స్‌గా రూ.75 లక్షలు, కెమెరామెన్ ఛోటాకు రూ.10 లక్షలు ఇప్పించాం. దాదాపు ఆ ప్రాజెక్ట్ మీద రెండుకోట్లు ఖర్చుపెట్టాం. కానీ వాళ్లకు మావాడు చెప్పిన కథ నచ్చలేదు. వేరేవాళ్లు రాసుకున్న కథను వశిష్టతో డైరెక్షన్ చేయిద్దామని ఫిక్స్ చేశారు.(చదవండి: అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వెళ్లిపోతానంటూ)వాడికి పెద్ద రేంజ్ ఉందటగా!ఇంతలో అఆ సినిమా రిలీజై పెద్ద హిట్టయింది. అఆ తర్వాత కొత్త డైరెక్టర్‌తో సినిమా చేస్తే మావాడి రేంజ్ పడిపోతుంది అని సుధాకర్ అన్నాడు. వాడికి పెద్ద రేంజ్ ఉంది కదా.. అది పడిపోతుందట.. అందుకని తర్వాత చేద్దాం అన్నారు. డబ్బులిచ్చిన నిర్మాతను పిలిపించి మాతో సినిమా చేయడం లేదని చెప్పేశారు. కాకపోతే నితిన్ హీరోగా పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాం. మీరే నిర్మాతగా ఉండండి అన్నారు. అప్పుడా నిర్మాత.. నేను మీతో పార్ట్నర్షిప్ చేయడానికి రాలేదు, నా డబ్బు నాకిచ్చేయండి అన్నారు. అలా మోసపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేశాం.కొత్త డైరెక్టర్‌తో ఎందుకని..మా వాడికి అల్లు శిరీష్ (Allu Sirish) క్లోజ్‌ఫ్రెండ్. మంచి కథ రాసుకోరా.. నేనే చేస్తా అని శిరీష్ ముందుకొచ్చాడు. సినిమా ముహూర్తం కూడా భారీగా జరిగింది. సరిగ్గా అప్పుడే శ్రీరస్తు.. శుభమస్తు సినిమా వచ్చి హిట్టయింది. దాంతో ఇలాంటి విజయం తర్వాత కొత్త డైరెక్టర్‌తో చేయడం ఎందుకు? అని శిరీష్ ఆలోచనలో పడ్డాడు. మాతో సినిమా చేయనన్నాడు. అల్లు అరవింద్ ఫీలయ్యాడు. నీకు ఎవరు కావాలో చెప్పు.. హీరోగా తీసుకొస్తా అని అరవింద్ మావాడిని అడిగాడు.హీరోగా ట్రై చేయమన్నాకానీ అప్పటికే వాడు చాలా బాధలో ఉన్నాడు. అది చూసి డైరెక్షన్ వదిలెయ్.. హీరోగా చేయరా అన్నాను. వాడిని హీరోగా లాంచ్ చేస్తూ సినిమా మొదలుపెట్టాం. కానీ, అది వర్కవుట్ కాదనుకున్నాడు. ఆ సినిమా వదిలేసి మళ్లీ డైరెక్షన్ మీదే పడ్డాడు' అని చెప్పుకొచ్చాడు. ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వశిష్ట ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా తీస్తుండటం మెచ్చుకోదగ్గ విషయం.చదవండి: గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ -
అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వెళ్లిపోతానంటూ..
అన్న కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కోసం తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎప్పుడూ అండగా ఉంటాడు. కల్యాణ్ రామ్ నటించిన పలు సినిమాల ఈవెంట్లకు తారక్ స్పెషల్ గెస్టుగా వెళ్లాడు. తాజాగా మరోసారి అన్న కోసం తమ్ముడు కదిలాడు. కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ (Arjun S/o Vyjayanthi Pre Release Event) శనివారం (ఏప్రిల్ 12) జరిగింది. ఈ కార్యక్రమానికి తారక్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు.విజయశాంతిని మాట్లాడనివ్వని ఫ్యాన్స్అతడిని చూసిన అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. అరుపులు, కేకలతో కార్యక్రమం దద్దరిల్లేలా చేశారు. అయితే స్టేజీపై ఎవరు మాట్లాడుతున్నా తన గురించే కేకలు వేస్తుండటంతో తారక్‌కు కోపమొచ్చింది. విజయశాంతి మైకు పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్టీఆర్‌ను కీర్తిస్తూ అభిమానులు కేకలేశారు. సీఎం.. సీఎం.. అని నినదిస్తూ ఆమెను మాట్లాడనివ్వలేదు.తారక్ ఆగ్రహంఒక్క నిమిషం సైలెంట్‌గా ఉంటే మాట్లాడతాను అని విజయశాంతి అభ్యర్థించినా అభిమానులు వినిపించుకోలేదు. దీంతో తారక్‌కు కోపమొచ్చింది. మౌనంగా ఉండకపోతే నేను స్టేజీపై నుంచి వెళ్లిపోతాను అంటూ సైగ చేశారు. దీంతో విజయశాంతి ఆయన్ను వెళ్లకుండా ఆపింది. మీ అభిమానుల ఉత్సాహం భయంకరంగా ఉంది. కట్రోల్ చేయలేకపోతున్నాం అంటూనే తన స్పీచ్ కొనసాగింది. సినిమాఅర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. కల్యాణ్ రామ్‌కు జంటగా సాయి మంజ్రేకర్ నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.చదవండి: తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి? -
మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఆ మధ్య కాస్త సైలెంట్ అయిపోయారనుకునేలోపే మరోసారి వీరి కుటుంబంలో చిచ్చు రాజుకుంది. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ మోహన్‌బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు మనోజ్ (Manchu Manoj). కూతురి బర్త్‌డే కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని ఆరోపించారు. అటువైపు మనోజ్, మోహన్‌బాబు మాత్రం ఈ ఆరోపణలపై స్పందించనేలేదు.కూతురితో ర్యాంప్ వాక్ఇలా కుటుంబ గొడవలతో మంచు ఫ్యామిలీలో ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా పోతోంది. మోహన్‌బాబు కూతురు లక్ష్మీ (Manchu Lakshmi Prasanna).. ఈ వివాదాలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు. తాజాగా ఆమె 'టీచ్ ఫర్ ఛేంజ్' వార్షిక ఫండ్రైజర్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కూతురితో కలిసి ర్యాంప్ వాక్ కూడా చేసింది. మనసారా ఏడ్చేసిన మంచు లక్ష్మిఆమె స్టేజీపై నిలబడిన సమయంలో మనోజ్ దంపతులు వెనక నుంచి వచ్చి సర్ప్రైజ్ చేశారు. తమ్ముడిని చూసి లక్ష్మికి కన్నీళ్లు ఆగలేదు. స్టేజీపై ఉన్న సంగతి కూడా మర్చిపోయి అతడిని పట్టుకుని మనసారా ఏడ్చేసింది. దీంతో మనోజ్-మౌనిక దంపతులు ఆమెను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. అక్కాతమ్ముళ్ల అనుబంధం ఎంత గొప్పదో అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by NAMASTE.BIGGBOSS (@namaste_biggboss) చదవండి: సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్.. అమ్మ ఒప్పుకోవట్లే -
మాస్ జాతర.. మరోసారి 'ఇడియట్' స్టెప్పులేసిన రవితేజ
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్‌లైన్. ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ధమాకా బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. తాజాగా ఈ సినిమా నుంచి తు మేరా లవర్ అనే పాట రిలీజ్ చేశారు. 2002లో వచ్చిన ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాటకు రీమిక్స్ చేసి దీన్ని రూపొందించారు. పాటే కాదు రవితేజ స్టెప్పులు కూడా రిపీట్ చేశాడు.ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫుల్ సాంగ్ ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. సామజవరగమన మూవీకి రైటర్‌గా పనిచేసిన భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. విధు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. చదవండి: అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే -
జాన్వీ కపూర్‌కు లంబోర్గిని కారు గిఫ్ట్.. అందుకోసమేనా?
నచ్చినవారికి గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. ఎవరికి తోచిన రీతిలో వారు ఆయా బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం ఏకంగా కోట్లు విలువ చేసే లగ్జరీ కారును తన స్నేహితురాలికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇంతకీ ఆ కారును అందుకుంది ఎవరో కాదు హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సింగర్, ఎంటర్ప్రెన్యూర్ అనన్య బిర్లా (Ananya Birla).. పర్పుల్ కలర్ లంబోర్గినిని జాన్వీకి శుక్రవారం నాడు గిఫ్ట్‌గా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తి ఆ లంబోర్గిని కారును జాన్వీ ఇంటికి డ్రైవ్ చేసుకుని వెళ్లి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ కారులో ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది. ఇక లంబోర్గిని కారు విలువ దాదాపు రూ.5 కోట్లు.ఎవరీ అనన్య బిర్లా?బిజినెస్ టైకూన్ కుమార్ మంగళం- నీరజ బిర్లాల కూతురే అనన్య. ఈమె సింగర్ మాత్రమే కాదు ఎంటర్ప్రెన్యూర్ కూడా! తాజాగా ఆమె మేకప్ బ్రాండ్‌ను కూడా లాంచ్ చేసింది. దీనికి జాన్వీ ప్రచారకర్తగా ఉండనుందని, అందుకు కృతజ్ఞతగా ఈ బహుమతిని పంపించిందని తెలుస్తోంది.జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ధడక్ చిత్రంతో సినీప్రయాణం ఆరంభించింది. గుంజన్ సక్సేనా, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి వంటి సినిమాలు చేసింది. దేవర: పార్ట్ 1 చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో పెద్ది మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే ఆమె చేతిలో పరమ సుందరి, సన్నీ సంస్కారీ కి తులసి కుమారి చిత్రాలున్నాయి. View this post on Instagram A post shared by Hashtag Magazine (@hashtagmagazine.in) View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)చదవండి: థియేటర్లలో ఆల్కహాల్ అమ్మకాలు.. తూలుతూ సినిమా చూడొచ్చు! -
గుండు గీయించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
ఆడవారికి కురులే అందం. కాస్త జుట్టు రాలినా అస్సలు తట్టుకోలేరు. అందులోనూ సెలబ్రిటీలు హెయిర్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటారు. అయితే ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం అందంగా కనిపించాలంటే జుట్టు తప్పనిసరా? అని తనకు తాను ప్రశ్నించుకుంది. అందం అంటే ఆత్మవిశ్వాసమే అంటూ గుండు గీయించుకుంది. ఇంతకీ తనెవరో కాదు స్టార్ హీరోయిన్, భానుప్రియ సోదరి శాంతిప్రియ (Shanthi priya). తాజాగా ఆమె గుండుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధైర్యంగా..'ఈ మధ్యే గుండు కొట్టించుకున్నాను. ఒక అమ్మాయిగా మనకు జీవితంలో చాలా పరిమితులు, షరతులు ఉంటాయి. ఇవన్నీ మనల్ని బోనులో బంధీలుగా చేస్తాయి. వాటి నుంచి స్వేచ్ఛ కోరుకున్నాను. నన్ను నేను విముక్తి చేసుకున్నాను. అందం అంటే ఇదే అనుకునే ప్రమాణాలను బ్రేక్ చేయాలనుకున్నాను. మనసు నిండా నమ్మకంతో ఎంతో ధైర్యంగా ముందడుగు వేశాను. అలాగే నా దివంగత భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అతడి బ్లేజర్‌ను ధరించాను' అని రాసుకొచ్చింది.పర్సనల్ లైఫ్- సినిమాఈమె తెలుగులో కాబోయే అల్లుడు, నాకు పెళ్లాం కావాలి, మహర్షి (1987), సింహస్వప్నం, యమపాశం, రక్త కన్నీరు, అగ్ని, కలియుగ అభిమన్యుడు, జస్టిస్ రుద్రమదేవి సినిమాల్లో నటించారు. తమిళ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశారు. 1994లో ఇక్కె పె ఇక్క సినిమాతో బ్రేక్ ఇచ్చిన శాంతిప్రియ.. మూడు దశాబ్దాల తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు. బ్యాడ్ గర్ల్ అనే తమిళ సినిమాతో మరోసారి సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకుల్ని పలకరించారు. వ్యక్తిగత విషయానికి వస్తే.. శాంతిప్రియ నటుడు సిద్దార్థ్ రాయ్‌ను 1992లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. 2004లో సిద్దార్థ్ రాయ్ గుండెపోటుతో మరణించాడు. View this post on Instagram A post shared by Shanthi Priya (@shanthipriya333) చదవండి: వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?: యాంకర్ రవి -
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
యాంకర్ రవి (Anchor Ravi), సుడిగాలి సుధీర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ ఈవెంట్లో వీరు సరదాగా చేసిన స్కిట్ బయట సీరియస్‌గా మారింది. అందులో రవి.. నందీశ్వరుడిపై నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడు చూడు అని చెప్పగా.. తనకు మాత్రం అమ్మాయి కనిపిస్తుంది అన్నాడు సుధీర్ (Sudigali Sudheer). ఈ స్కిట్‌పై జనాలు భగ్గుమన్నారు. ఓ వర్గాన్ని తక్కువ చేశారని మండిపడ్డారు. స్కిట్‌పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో యూట్యూబ్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశారు.ఆడియో వైరల్అయినప్పటికీ ఈ వివాదం సమసిపోలేదు. ఓ హిందూ ఆర్గనైజేషన్‌కు చెందిన ఓ వ్యక్తి యాంకర్ రవితో మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మీ స్కిట్ హిందువులను కించపరిచేలా ఉంది. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని సదరు వ్యక్తి యాంకర్ రవిని డిమాండ్ చేశాడు. అందుకు రవి స్పందిస్తూ.. చిరంజీవి గారు బావగారు బాగున్నారా? సినిమాలో ఇదే సన్నివేశం ఉంటుంది. ఆయన చేసినదాన్ని తప్పు అని ఎందుకు చెప్పలేదు? అది తప్పనలేదే?దాన్ని ఎవరూ తప్పనలేదు కాబట్టి మేమూ అదే తీసుకొచ్చి స్కిట్‌గా చేశాం. బావగారు బాగున్నారా? మూవీలోని ఆ సీన్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. అది ఎవరైనా తప్పని చెప్పుంటే మాకు తెలిసేది. అయినా మేము ఏ దేవుడినీ కించపరచలేదు. పైగా నందీశ్వరుడిని స్టేజీపైకి తెచ్చినప్పుడు అందరం షూలు కింద విడిచేసి ఈ స్కిట్ చేశాం. అయినప్పటికీ మా స్కిట్‌పై కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆ వీడియోను యూట్యూబ్‌లో నుంచి తీసేశాం. మేము ఎవరినీ కించపరచలేదని ధైర్యంగా చెప్తున్నాను. మేము ఏ తప్పూ చేయలేదు అని యాంకర్ రవి వివరణ ఇచ్చాడు.చదవండి: సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్ ఆన్సరిదే! -
మరో ఐటం సాంగ్‌లో మెరిసిన తమన్నా..
మిల్కీ బ్యూటీకి డ్యాన్స్ చేయడమంటే మహా ఇష్టం. అందుకే ఐటం సాంగ్స్ ఆఫర్ వచ్చినప్పుడు డ్యాన్స్‌కు స్కోప్ ఉంటోందని వెంటనే ఓకే చెప్పేస్తోంది. అలా జైలర్‌లో నువ్వు కావాలయ్యా.., స్త్రీ 2లో ఆజ్ కా రాత్.. పాటతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. తాజాగా రైడ్ 2లోని నషా పాటకు చిందేసింది. రైడ్ 2లో తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఐటం సాంగ్ చేస్తున్నట్లు ఇటీవల కొన్ని ఫోటోలు లీకయ్యాయి.మరో ఐటం సాంగ్..దీంతో చిత్రయూనిట్ ఎలాంటి సస్పెన్స్‌లు లేకుండా నషా పాటను విడుదల చేసింది. ఎప్పటిలాగే తమన్నా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో, స్టెప్పులతో అదరగొట్టేసింది. ఆజ్ కీ రాత్ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన విజయ్ గంగూలీయే ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. రైడ్ 2 విషయానికి వస్తే.. 2018లో వచ్చిన సూపర్ హిట్ మూవీ రైడ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ కథానాయకుడిగా, వాణీ కపూర్ హీరోయిన్గా నటించారు. రితేశ్ దేశ్‌ముఖ్ విలన్‌గా యాక్ట్ చేశారు. మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. చదవండి: ఆస్కార్‌లో కొత్త విభాగం.. ఆర్ఆర్ఆర్ విజువల్‌తో అనౌన్స్మెంట్ -
విశ్వంభర.. రామరామ సాంగ్ ప్రోమో చూశారా?
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా రామ రామ పాట ప్రోమో విడుదలైంది. చిరంజీవి నోటి నుంచి వచ్చిన జై శ్రీరామ్ నినాదంతో పాట మొదలవుతుంది. ఇందులో బాల హనుమాన్లు ముందు నడుచుకుంటూ వస్తుంటే అందులో ఒకరిని చిరు తన భుజాలపై ఎత్తుకుని నడుస్తున్నాడు. ప్రోమో అయితే అదిరిపోయింది. పూర్తి పాటను హనుమాన్ జయంతి (ఏప్రిల్ 12) రోజు ఉదయం 11.12 గంటలకు విడుదల చేయనున్నారు.అప్పుడే ఫుల్ సాంగ్ రిలీజ్..కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు. ఫుల్ సాంగ్ వినాలంటే రేపటివరకు ఆగాల్సిందే! విశ్వంభర విషయానికి వస్తే.. ఆంజనేయ స్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా, కునాల్ కపూర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. వాసుదేవ్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ మూవీని జూలై 24న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చదవండి: -
కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్
బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఈసారి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ (Akkada Ammayi Ikkada Abbayi Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడు పెంచింది. తాజాగా ఈ మూవీకి సపోర్ట్ చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ముందుకు వచ్చాడు.గ్లోబల్ స్టార్‌కు ఫస్ట్ టికెట్ఇందుకు సంబంధించిన ఓ సరదా వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. అందులో ప్రదీప్.. ఫస్ట్ డే మార్నింగ్ షో.. ఫస్ట్ టిక్కెట్టు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan)కు ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అది విన్న సత్య.. రామ్‌చరణ్ తనకు చాలా క్లోజ్.. నేను ఏది చెప్తే అంత అంటూ బిల్డప్ కొట్టాడు.చివర్లో మాత్రం..చివరకు చరణ్ ఎంట్రీ ఇచ్చి సత్యను చూసి ఎవరీ అబ్బాయి అనడంతో అతడి పరువు పోయినట్లయింది. చివర్లో మాత్రం సత్యను గుర్తుపట్టి పెద్ది షూటింగ్‌కు సమయానికి వచ్చేయ్ అన్నాడు. అనంతరం సత్య.. చెర్రీ కాళ్లు మొక్కగా అతడు కూడా తిరిగి పాదాలకు నమస్కరించడం విశేషం. తర్వాత చరణ్.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఫస్ట్ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఇది చూసిన అభిమానులు అంత పెద్ద స్టార్ అయ్యుండి ఇంత సింపుల్‌గా ఉండటం చాలా గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: సందీప్ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్ -
'ప్రేమకు జై' రిలీజ్ డేట్ ఫిక్స్
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది. అలా ఓ గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ 'ప్రేమకు జై'. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 11న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ వైవిద్యమైన ప్రేమ కథ చిత్రం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు తెరపై చూడని ఓ లవ్‌స్టోరీని చూపించబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రచార చిత్రాలు ఇప్పటికే వైరల్‌గా మారాయి.ఈ సందర్భంగా 'ప్రేమకు జై' దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ... ''పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత బాగా చేశారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఎంతో సహకరించారు. శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని అన్నారు. -
సందీప్ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్
అర్జున్ రెడ్డి సినిమా (Arjun Reddy)కు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హర్షవర్దన్ రామేశ్వర్ ఇస్తే పాటలకు రధన్ సంగీతం అందించాడు. అతడు అందించిన పాటలు బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. అయితే సరైన సమయానికి పాటలు ఇవ్వకుండా నా టైం మొత్తం వృధా చేశాడని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రధన్‌పై విమర్శలు గుప్పించాడు. సిద్దార్థ్ రాయ్ సినిమా దర్శకుడు కూడా రధన్ చెప్పిన సమయానికి పాటలు ఇవ్వకపోగా ఫోన్లు కూడా లిఫ్ట్ చేసేవాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన తండ్రిలాంటి వారుఇలా రధన్ వల్ల సినిమా లేటైందని దర్శకులు తిట్టుకున్నారు. తాజాగా ఈ వివాదంపై రధన్ స్పందించాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా (Akkada Ammayi Ikkada Abbayi Movie) ఈవెంట్లో అతడు మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) నాకు తండ్రిలాంటివారు. తండ్రి తిడితే ఆయన తిట్టారని ప్రచారం చేసుకోలేం. నాన్న మనల్ని కాకపోతే ఎవర్ని తిడతారు? దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆయన తండ్రిలాంటివారు కాబట్టి!అనుదీప్ తల్లిలా..ఆయన నన్ను తిట్టిన తర్వాత కూడా అనుదీప్ (జాతిరత్నాలు), ప్రదీప్ మాచిరాజు (అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి) నాపై నమ్మకంతో సినిమా ఆఫర్ ఇచ్చారు. అంతర్గత విభేదాలు తలెత్తినప్పుడు కొన్ని పట్టించుకోవాలి, కొన్నింటిని పట్టించుకోకూడదు. సందీప్ ఎప్పుడూ అలాగే ఉంటారు. ఒక తండ్రిగా తిట్టారు, తిడతారు. నేనైతే అవేవీ మనసుకు ఎక్కించుకోలేదు. నాన్న తిట్టాడని ఫీలయ్యానంతే! అర్జున్ రెడ్డిలో నేను చెత్త మ్యూజిక్ అయితే ఇవ్వలేదు కదా.. మంచి సంగీతం ఇచ్చానన్న తృప్తి ఉంది. అనుదీప్ నాకు తల్లిగా అనిపించారు. కొందరు తిడతారు, మరికొందరు దగ్గరకు తీసుకుంటారు. అందరూ ఒకేలా ఉండరు అని రధన్ వివరణ ఇచ్చాడు.చదవండి: లక్షలు పెట్టి టికెట్ తీసుకుంటే సెల్ఫీ కూడా లేదు.. హృతిక్‌పై అభిమానుల ఆగ్రహం -
Jack Movie Review: ‘జాక్’ మూవీ హిట్టా? ఫట్టా?
డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda). హ్యాట్రిక్ హిట్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాక్’తో నేడు(ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సిద్ధు ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ కావాలని కలలు కంటాడు. తనకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. ఆ రిజల్ట్ రాకముందే ఖాలీగా ఉండడం ఎందుకని దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదులు, హైదారాబాద్‌తో పాటు భారత్‌లోని ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు జాక్ ఏం పని చేస్తున్నాడో కనుక్కోమని ప్రైవేట్ డిటెక్టివ్ అఫిషాన్ బేగం (వైష్ణవి చైతన్య)కు లక్ష రూపాయలు ఇస్తాడు అతని తండ్రి పాన్ ఇండియా ప్రసాద్(నరేశ్). అఫిషాన్ బేగం భానుమతి పేరుతో జాక్కి దగ్గరై జాక్ పనిపై నిఘా పెడుతుంది. టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో పొరపాటున ‘రా’ఏజెంట్ మనోజ్(ప్రకాశ్ రాజ్)ని కిడ్నాప్ చేస్తాడు జాక్. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్ గ్యాంగ్‌ని జాక్ పట్టుకోగలిగాడా లేదా? అసలు జాక్ ‘రా’ ఏజెంట్ కావాలని ఎందుకు అనుకున్నాడు? చివరకు తను కోరుకున్న ఉద్యోగం పొందగలిగాడా లేదా? అనేదే తెలియాలంటే జాక్(Jack Movie Review) సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఒక శిలై ఉన్నానని భూమి కుంగునా?నేనొక శిల్పానని దైవం తుళ్లునా?మలిచిన శిల్పం, మలచని రాయి ఈ రెంటిలోన గొప్పది ..శిల్పమా? శిలా? ఏ జవాబు అందినా పోరు ఆగేదేనా..? రెండిటి మధ్యన..!.. సినిమా ఎండింగ్లో బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన ‘రాయి – శిల్పం’ థియరీ ఇది. ఇందులో నిజంగానే ఏది గొప్పదో చెప్పలేం కానీ ఈ సినిమా విషయంలో మాత్రం శిల్పి(దర్శకుడు) లోపం చాలానే ఉంది. మంచి రాయి( హీరో) ఉన్నప్పటికీ దాన్ని అందమైన శిల్పంగా మార్చడంలో తడబడ్డాడు. బొమ్మరిల్లు భాస్కర్ తన స్టైల్ కథను పక్కకు పెట్టి తీసిన సినిమా ఇది. ఇంట్రెస్టింగ్ పాయింట్ రాసుకున్నాడు. హీరో పాత్రను కూడా ఆసక్తికరంగానే తీర్చిదిద్దాదు. కానీ కథనం విషయంలో జాగ్రత్త పడలేదు. దేశానికి ముందుడి ప్రమాదం రాకుండా ఆపేదే ‘రా’ అంటూ ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ గురించి గొప్పగా చెప్పిన భాస్కర్.. కథలో మాత్రం ‘రా’ ఏజెంట్లను కమెడియన్ల కంటే తక్కువ చేసి చూపించారు. ‘రా’ , ఉగ్రవాదం ..ఇలాంటి కథలను సీరియస్‌గా చెప్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ భాస్కర్ సీరియస్ సబ్జెక్ట్ ఎంచుకొని దానికి కామెడీ టచ్ ఇచ్చాడు. ఇది పూర్తిగా సఫలం కాలేదు. మదర్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ.. దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు.‘వీడు కొంచెం క్రాక్’ అని సినిమాకు పెట్టిన ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే హీరో క్యారెక్టర్ని మలిచాడు. ఫస్టాఫ్ అంతా ఫన్వేలో నడుస్తుంది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం క్రాక్గానే అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో బలమైన సన్నివేశాలు లేనప్పటికీ స్క్రీన్‌ప్లేతో నెట్టుకొచ్చాడు. ఇంటర్వెల్ సీన్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. నేపాల్ ఎపిసోడ్ కొంతమేర ఆకట్టుకున్నా.. టెర్రరిస్టులతో జరిగే యాక్షన్ డ్రామా రక్తి కట్టించదు. బలమైన కథ లేకపోవడంతో ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ శిల్పాన్ని మరింత అందంగా చెక్కాల్సింది.ఎవరెలా చేశారంటే..డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్‌ని ఆకట్టుకున్న సిద్ధు..మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కొంచెం క్రాక్ ఉన్న జాక్ పాత్రకు న్యాయం చేశాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. క్లైమాక్స్‌లో ఫైట్ కూడా చేశాడు. అయితే జాక్ మాటలు, బిహేవియర్ చూస్తే ‘టిల్లు’ వద్దన్నా గుర్తుకు వస్తాడు. వైష్ణవి చైతన్య కు స్క్రీన్ స్పేస్ ఎక్కువే ఉన్నప్పటికీ ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. నటన పరంగాను మెప్పించడానికి అక్కడ స్కోపే లేదు. ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ‘రా’ ఏజెంట్ మనోజ్‌గా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పాత్రను అటు సీరియస్‌గాను..ఇటు పూర్తి కమెడియన్‌గాను మల్చలేక రెండింటికి మధ్య ఊగిసలాడేలా తీర్చిదిద్దారు. సుబ్బరాజు పాత్ర కూడా అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పాటలు అంతగా గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘బేబీ’బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘జాక్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి ఎక్స్(ట్విటర్)లో మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా చూసిన నెటిజన్స్.. తమ అభిప్రాయాన్ని ఎక్స్‌లో తెలియజేస్తూ.. యావరేజ్ సినిమా అంటున్నారు. మరికొంతమంది అయితే సిద్ధు ఖాతాలో తొలిసారి డిజాస్టర్ పడిందని చెబుతున్నారు. ఇంకొంత మంది సినిమా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. నెటిజన్ల అభిప్రాయాలపై ఓ లుక్కేయండి. #Jack Only for Siddu!!Just some comedy scenes and Siddu role, Nothing worked in film. Siddu dialogues, Comedy timing, Action helped film atleast for a One time watch. Stroy, Screenplay, Music, Songs, BGM, cinematography Everything 👎Only for Siddu Character and Some One…— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) April 10, 2025 ‘జాక్ సినిమా కేవలం సిద్ధుదే. కొన్ని కామెడీ సీన్లు, సిద్ధు క్యారెక్టర్ తప్ప మిగతావేవి ఆకట్టుకోలేవు. సిద్ధు డైలాగ్స్, కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, పాటలు, బీజీఎం, సినిమాటోగ్రఫీ..ఏది కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి’ అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ ఇచ్చాడు.#JACK - Half baked story which lacks connectivityRAW ni Royal ga chupinchali ila Rotha kadhu 🙏😭Prathi sari one liners tho cinema workout avvadhu Ani Inka yeppatiki ardam avvudho emo 🥱Intha cheppinaka kuda Theatre lo chusta ante velli ma laga Bugga avvandi #Tollywood pic.twitter.com/JX8h1lCMXD— 𝑺𝒖𝒋𝒆𝒆𝒗.𝑮 (@sujeev_Nani) April 9, 2025 జాక్ సగం వండి వదిలేసిన అన్నంలా ఉది. ఏ చోట కూడా కనెక్టివిటీ ఉండదు. ‘రా'ని రాయల్‌గా చూపించాలి కానీ ఇలా రోతలా కాదు. ప్రతిసారి వన్‌లైనర్‌తో సినిమా వర్కౌట్ అవ్వదని ఇంకా ఎప్పటికి అర్థం చేసుకుంటారో. ఇంత చెప్పినా కూడా థియేటర్లో సినిమా చూస్తా అంటే మీ ఇష్టం అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.Bhaskar’s attempt at a commercial mix fails due to weak writing and a messy screenplay. Siddhu tries hard, but dull scenes and flat dialogues drag him down. The spy plot is bland, comedy rarely clicks, music is forgettable, and poor visuals make it hard to sit through. #jack pic.twitter.com/jcIDJYqxdj— Dingu420 (@dingu420) April 10, 2025 భాస్కర్ తొలిసారి ప్రయత్నించిన కమర్షియల్ మిక్స్ వీక్ రైటింగ్, స్క్రీన్‌ప్లే కారణంగా ఫెయిల్ అయింది. సిద్దు హార్డ్ వర్క్ చేశాడు కానీ బలమైన సన్నివేశాలు లేకపోవడం కారణంగా అతని పాత్ర కూడా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదు. మ్యూజిక్ గురించి మర్చిపోవాలి. విజువల్స్ కూడా పూర్‌గా ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#Jack is a spy action comedy that disappoints big time as both the spy portions and comedy fail to deliver for the most part. Director Bhaskar tried to pack all commercial aspects in this film but none of them could make a solid impact because of the clumsy screenplay and weak…— Venky Reviews (@venkyreviews) April 9, 2025 జాక్ అనేది ఓ స్పై కామెడీ యాక్షన్ మూవీ. కానీ అందులో స్పై మూమెంట్స్ కానీ కామెడీ కానీ వర్కౌట్ కాలేదు.బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాల్ని పొందుపర్చాలనుకున్నాడు. కానీ అందులో ఏ ఒక్క అంశం కూడా జనాలకు కనెక్ట్ అయ్యేలా లేదు.గందరగోళంగా నడిచే స్క్రీన్ ప్లే.. వీక్ రైటింగ్‌తో బోరింగ్ అనిపిస్తుంది అని ఇంకో నెటిజన్ ట్వీట్ చూస్తూ 2 రేటింగ్ ఇచ్చాడు.#Jack: StarBoy for a Reason? Not Quite!Rating: ⭐️⭐️Jack ends up being a major disappointment in the spy genre. Director Bhaskar seems lost between what he wrote and what he tried to direct. The film feels like a comic spoof of spy thrillers but falls flat with a boring and…— Chay Reviews (@chay_reviews) April 10, 2025It's mind-boggling to see movies like #Jack and #Spy just deliberately use the patriotism angle but execute it in an extremely poor way which ultimately looks/feels like they're demeaning or humiliating our army, police, the RAW and the Indian Government 😥— LoneBatman (@SampathGNV) April 10, 2025#JackReview:Heavily banks on Siddhu’s performance and a quirky lead character. While the theme is decent, the execution falls flat. Filled with illogical scenes, weak action, poor cinematography, cheap VFX and forgettable songs, it ends up as a half baked— Adesh Neradi (@AdeshNerad31345) April 9, 2025Show completed:- #jack My rating 2.25/5Half baked Raw movie Illogical scenes in 2nd half pic.twitter.com/1Xq7al7OoY— venkatesh kilaru (@kilaru_venki) April 9, 2025 -
నా స్పీచ్‌తో అతని పదవి పోయింది.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధ్య కొన్నాళ్ల పాటు రాజకీయ వైర్యం కొనసాగిన సంగతి తెలిసిందే. 1996లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో రజనీకాంత్, జయలలిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే, దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు" అని ఆయన చేసిన ప్రకటన రాజకీయ రంగంలో సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యలు ఆ ఎన్నికల్లో జయలలిత అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా నిలిచాయి. తాజాగా ఈ ‘రాజకీయ వివాదం’పై రజనీకాంత్ స్పందించారు. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణం ఏంటో ఆయన వివరిస్తూ.. మాజీ మంత్రి వీరప్పన్ పట్ల జయలలిత వ్యవహరించిన తీరే.. తనను వ్యతిరేకంగా మాట్లాడేలా చేసిందని చెప్పారు.వీరప్పన్ పదవి పోయిందిసినీ నిర్మాత, రాజకీయ నాయకుడు ఆర్.ఎం. వీరప్పన్, రజనీకాంత్ మధ్య మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీరప్పన్ సత్య మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ‘బాషా’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 100 రోజుల వేడుకలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల కారణంగా వీరప్పన్ మంత్రి పదవి కోల్పోవలసి వచ్చిందట. ఈ వేడుకల్లో రజనీకాంత్ మాట్లాడుతూ.. తమిళనాడులో వారసత్య రాజకీయాల కారణంగా బాంబు సంస్కృతి పెరిగిపోయిందని.. రాష్ట్రం ఓ స్మశానంలా మారిందని అన్నారు. రజనీ వాఖ్యలు జయలలిత కోపానికి కారణం అయ్యాయట. దీంతో మంత్రిగా ఉన్న వీరప్పన్ని పదవి నుంచి తొలగించారట. జయలలితపై వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇదే ప్రధాన కారణం అని రజనీ అన్నారు.వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని చెప్పారు ‘నేను జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం, ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి అలా మాట్లాడాను. అయితే నా స్పీచ్ కారణంగా వీరప్పన్ పదవి పోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. మరుసటి రోజు ఫోన్ చేసి మాట్లాడాను. జయలలితతోనూ మాట్లాడతానని చెప్పాను. అయితే వీరప్పన్ మాత్రం దానికి అంగీకరించలేదు. ‘నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దను. నాకు ఏ పదవి అవసరం లేదు’ అని చెప్పారు. ఆయన ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా.. నేను చాలా బాధపడ్డాను. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి’ అని రజనీకాంత్ అన్నారు. వీరప్పన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ‘ఆర్వీఎం: ది కింగ్‌మేకర్’ డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ ఈ వివాదం గురించి స్పందించాడు. -
పవన్ టైటిల్.. మాపై బాధ్యత పెంచింది: యాంకర్ ప్రదీప్
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన మాటతీరుతో ఏ షోనైనా సరే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీగా అందిస్తాడు. ఆయన వేసే పంచ్‌లు, జోకులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాక, మనసు నిండా ఆనందాన్ని పంచుతాయి. అందుకే యాంకర్లలో ప్రదీప్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ టాలెంటెడ్ యాంకర్ వెండి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతున్నాడు. నాలుగేళ్ల కిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. హీరోగా మారారు. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది?చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సరైన సమయంలో మంచి అవకాశాలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి మంచి సపోర్టు లభించింది. ఆర్జేగా, టెలివిజన్ యాంకర్ గా యాక్టర్ గా ఇన్నోవేటివ్ గా వర్క్ చేసే అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మంచి కథ చెప్పే చాన్స్ కుదిరింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. లక్షల్లో ఒక్కరికి మాత్రమే లభించే అవకాశంగా భావిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారట కదా..కారణం ఏంటి?నా స్నేహితులకు నాలాగే సినిమా అంటే పిచ్చి. అందరికి మంచి చాన్స్‌లు వస్తున్నాయి. కానీ మేమంతా కలిసి ఓ సినిమా చేయలాని ఎప్పుటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు కుదిరింది. మంచి కథ ఉంది. అందరం కలిసి చేస్తే బాగుంటందని అనుకొని.. సినిమాను స్టార్ట్ చేశాం.ఈ కథకి ఫౌండేషన్ నుంచి వర్క్ చేసాం. అందుకే కొంచెం టైం పట్టింది. ఫ్యామిలీ అంతా కూర్చుని సమ్మర్లో హ్యాపీగా చూసే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ మా నుంచి ఎలాంటి కంటెంట్ ని ఆశిస్తారో అలాంటి కంటెంట్ ఇందులో ఉంది. ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఎలాంటి కథ అంటే..?మా సినిమాలో కథే మంచి ఎంటర్టైన్మెంట్. దీన్ని ఒక చందమామ కథల చూడొచ్చు. అనగనగా ఒక ఊరు. అక్కడ ఓ అమ్మాయి. ఆ ఊరికి వెళ్ళిన ఒక సివిల్ ఇంజనీర్. ఆ ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ రూల్స్ మధ్య హీరో ఎలా ఇరుక్కున్నాడు? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేయడం జరిగింది.పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ని హైప్ కోసమే పెట్టారా?లేదండి. మా కథ అనుకున్నప్పుడే లక్కీగా ఈ టైటిల్ ని అనుకున్నాం . పవన్ కళ్యాణ్ గారి డెబ్యు సినిమా టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నామంటే మాపై బాధ్యత పెరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. టైటిల్ కు తగ్గట్టు చాలా చక్కని అచ్చ తెలుగు సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ పర్ఫెక్ట్ అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తో ఒక సినిమా చేయడం మా అదృష్టం. చిన్న సినిమా కదా.. ఆ టైటిల్ పెడితే జనాల్లోకి ఈజీ వెళ్లొచ్చు అనిపించింది. కానీ కేవలం పబ్లిసిటీ కోసం అయితే ఈ టైటిల్ పెట్టలేదు.ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?-ఇందులో కృష్ణ అనే పాత్రలో కనిపిస్తాను. చాలా స్మార్ట్ క్యారెక్టర్. ఈ సినిమాలో నేను ఎంత చిరాకు పడతానో ఆడియన్స్ అంత ఎంటర్టైన్ అవుతారు. ఆ క్యారెక్టర్ పడే కష్టాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. డైరెక్టర్స్ నితిన్ భరత్ భరత్ కు నాతో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నారు. నా టైమింగ్ వాళ్ళకి తెలుసు. దానికి తగ్గట్టుగా ఈ కథని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు.దీపికా పిల్లి ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చింది?ఈ సినిమా హీరోయిన్ పాత్రకు ఒక తెలుగు అమ్మాయి కావాలి. ఆడిషన్స్, లుక్ టెస్ట్, వర్క్ షాప్ అన్నీ చేసిన తర్వాతే దీపికని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. తను చాలా అద్భుతంగా పెర్ఫర్మ చేసింది. ఆడియన్స్ డెఫినెట్ గా సర్ప్రైజ్ అవుతారు.మ్యూజిక్ డైరెక్టర్ రదన్ గురించి ?ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా మంచి స్కోప్ ఉంది. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ జోనర్ లో చేయడం జరిగింది. రదన్ బ్యూటీఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ ఆడియన్స్ కి చాలా అలరిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమాని చాలా క్వాలిటీ గా తీసాం. బాల్ రెడ్డి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. క్వాలిటీ పరంగా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్స్ నితిన్ భరత్ గురించి ?నితిన్ భరత్ నన్ను సర్ప్రైజ్ చేశారు.డెబ్యూ డైరెక్టర్స్ లాగా అనిపించలేదు. డేఫినెట్ గా చాలామంది యంగ్ డైరెక్టర్స్ కి నితిన్ భరత్ ఇన్స్పిరేషన్ అవుతారు. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఎక్కడ కూడా కొత్తవారితో పని చేసిన ఫీలింగ్ రాలేదు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు.కామెడీ సినిమా కదా.. సెన్సార్ యూ/ఏ ఇచ్చారేంటి?ఈ సినిమా సెన్సార్ సభ్యులు చూసిన తర్వాత చాలా కాలం తర్వాత హాయిగా నవ్వుకునే సినిమా తీశారని చెప్పారు. అది మాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సినిమాకి ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ ఇచ్చారు. రెండున్నర గంటల పాటు ఆడియన్స్ హాయిగా నవ్వుకునే సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ సినిమా చూశారు. సినిమా పూర్తవ్వగానే డీల్ క్లోజ్ చేశారు. ఇది సమ్మర్ కి ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా అని రిలీజ్ డేట్ ని వారే లాక్ చేశారు. ఇది మాకు మరింత కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. -
యాడ్స్‌లో అగ్రహీరోల హవా..రోజుకి అన్ని కోట్లా?
హైదరాబాద్ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్‌లో ఆ నలుగురూ కనపడుతుంటారు. అరవై లో ఇరవైలాగా యాడ్స్‌లోనూ కుర్రహీరోలకు పోటీగా అదరగొడుతుంటారు. తెలుగు సీనియర్ హీరోలు వయసు పెరుగుతున్నా తగ్గేదేలే అన్నట్టుగా ప్రకటనల ప్రపంచంలో దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) తన కెరీర్లో ఫిలిప్స్ ఇతర బ్రాండ్లకు ఎండార్స్మెంట్లతో సహా అనేక ప్రకటనలలో పాలుపంచుకున్నారు ఆయన చాలా కాలం క్రితమే ప్రముఖ బ్రాండ్స్‌కు పనిచేశారు. ఆయన చేసిన థమ్సప్ యాడ్ సంచలం సృష్టించడంతో పాటు వివాదాలకు కూడా కేంద్రబిందువైంది. ఆ యాడ్‌లో ఆయన ప్రస్తుత యువ కధానాయకుడు శర్వానంద్‌తో కలిసి కనిపించడం విశేషం. సమకాలీకులతో పోలిస్తే ఒకప్పుడు యాడ్ వరల్డ్‌లోనూ ముందున్న చిరంజీవి ప్రస్తుతం ఈ విషయంలో కొంత వెనుబడ్డారు. ఆయన కంట్రీ డిలైట్ ప్రకటనల్లో కనిపిస్తున్నారు.కింగ్ నాగార్జున(Nagarjuna Akkineni) ఒకప్పుడు ప్రకటనల విషయంలో చాలా దూసుకుపోయారని చెప్పాలి. సమకాలీకుల కంటే బాగా ముందుండేవారు. ఐదు పదుల వయస్సు దాటిన హీరోల్లో మిగిలిన వారితో పోలిస్తే ఆయన ఎక్కువగా ప్రకటనల్లో ఆయన కనిపించారు. నాగార్జున అక్కినేని డాబర్ మెస్వాక్ టూత్‌పేస్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు, అలాగే కేరళకు చెందిన కళ్యాణ్ జ్యువెలర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్. ఈ బ్రాండ్‌కి సంబంధించిన నాగ్ పోస్టర్లు ప్రకటనలు కళ్యాణ్ జ్యువెలర్స్‌కు మంచి గుర్తింపునిచ్చాయి. ఘడి డిటర్జెంట్‌తో సహా ఇతర ఉత్పత్తుల ప్రకటనలలో కూడా కనిపించిన నాగార్జున అమితాబ్ బచ్చన్ తో కలిసి యాడ్స్ కోసం స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం విశేషం.విక్టరీ వెంకటేష్(Venkatesh) దగ్గుబాటి మణప్పురం జనరల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ లిమిటెడ్ , రామ్రాజ్ కాటన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు అదే విధంగా బైక్ వొ మార్కెటింగ్ బ్రాండ్ ప్రమోషన్ కార్యకలాపాలలో కూడా పాల్గొన్నారు. మూవీ ఈవెంట్స్ ప్రమోషన్స్ కంపెనీ అయిన శ్రేయాస్ మీడియా విక్టరీ వెంకటేష్ మెడ్‌ప్లస్ ప్రకటనతోనే ప్రకటనల రంగంలోకి అడుగు పెట్టింది. బైక్ వోలో వ్యూహాత్మక పెట్టుబడిదారు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వెంకటేష్.. మార్కెటింగ్, ఔట్రీచ్ బ్రాండ్ ప్రమోషన్ కార్యకలాపాలకు సహకరిస్తున్నారు. ఈ భాగస్వామ్యం 2025 నాటికి భారతదేశం అంతటా 20,000 ఇవి ఛార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయాలనే లక్ష్యంతో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.తాజాగా అగ్రగామి రియల్ ఎస్టేట్ బ్రాండ్ కాసా గ్రాండ్ వెంకటేష్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. తాజాగా బాక్సాఫీస్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం తో...వెంకటేష్ ను మరింత మంది యాడ్ మేకర్స్ సంప్రదిస్తున్నట్టు సమాచారం.సమకాలీకులతో పోలిస్తే ఒకప్పుడు ప్రకటనల ప్రపంచంలో పూర్తిగా వెనుకపడిన మాస్ హీరో బాలకృష్ణ అరవై ఐదేళ్ల వయసులో బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కు టాప్ అడ్రెస్‌గా మారారు. తొలిసారి సౌత్ ఇండియా ఆధారిత కన్స్ట్రక్షన్ అండ్ ప్లాటింగ్ సర్వీసెస్ కంపెనీ సాయి ప్రియా గ్రూప్‌తో ప్రకటనల ప్రపంచంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం మాల్స్ దగ్గర నుంచి నగల బ్రాండ్ల దాకా ప్రమోట్ చేస్తున్నారు. రెండు రోజుల వర్క్‌కి గాను ఆయన రూ. 3 కోట్ల నుంచి ఆపైన దక్కించుకుంటారని యాడ్ నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు, ఆయన ఓ రిటైల్ బ్రాండ్ ప్రచారంలో నటి ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి కనిపించాడు. ‘అఖండ‘, ‘భగవంత్ కేసరి’ ‘వీరసింహారెడ్డి‘ వంటి హ్యాట్రిక్ హిట్లతో, నటుడిగా అతని స్థాయి పెరిగింది. ‘వరుసగా మూడు బ్లాక్బస్టర్లు కొట్టడంతో టాలీవుడ్లో తన సమకాలికుల కంటే యాడ్ వరల్డ్‌లో ముందున్నాడు -
యూపీ సీఎంను కలిసిన మంచు విష్ణు.. కన్నప్ప కొత్త డేట్ ఇదే..
హీరో మంచు విష్ణు, ఆయన తండ్రి మోహన్‌బాబు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. బుధవారం నాడు యోగిని కలిసి ఆయనకు శ్రీరాముని జ్ఞాపికను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరి వెంట కన్నప్ప కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఉన్నారు.ఈ విషయాన్ని విష్ణు (Manchu Vishnu) ఎక్స్ (ట్విటర్)లో వెల్లడించాడు. నా ఫేవరెట్ హీరో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)గారిని కలిశాను. ఆయన మా కన్నప్ప సినిమా కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు రమేశ్ గొరిజాలా వేసిన పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చాం. కన్నప్ప.. జూన్ 27న వస్తోంది అని ట్వీట్ చేశాడు.మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయంటూ సినిమాను వాయిదా వేశారు. ఏప్రిల్ 25న తన సినిమా భైరవం రిలీజ్ అవుతుందన్న భయంతోనే విష్ణు కన్నప్పను వాయిదా వేశాడని మనోజ్ ఆరోపించాడు. ఇంతలో విష్ణు.. కన్నప్ప జూన్‌లో రానుందని ప్రకటించాడు. Met one of my favorite Hero Sri. @myogiadityanath ji. He was gracious to launch the date announcement poster of #Kannappa. Gifted him a painting of Ramesh Gorijala. Such a Humble and powerful aura he has. Kannappa on June 27th. #HarHarMahadev pic.twitter.com/4EECXoDE9I— Vishnu Manchu (@iVishnuManchu) April 9, 2025 చదవండి: నా సినిమాకు భయపడి 'కన్నప్ప' వాయిదా: మంచు మనోజ్ -
బ్రేకప్.. మంత్రతంత్రాలు వస్తే ఆ పని చేస్తా: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia), బాలీవుడ్ నటుడు విజయ్(vijay) విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట..పెళ్లి విషయంలో గొడవ జరిగి విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే అటు తమన్నా కానీ ఇటు విజయ్ కానీ ఈ బ్రేకప్ రూమర్స్‌పై స్పందించకుండా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమన్నా ఓదెల 2 సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. తాజాగా ముంబైలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి తమన్నా హాజరై మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ విలేకరి బ్రేకప్ గురించి పరోక్షంగా ప్రశ్నించగా.. తమన్నా తనదైన శైలీలో సమాధానం ఇచ్చింది.ఓదెల 2 సినిమా ట్రైలర్ ఈవెంట్ మంగళవారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో తమన్నాతో పాటు చిత్రబృందం అంతా పాల్గొంది. ట్రైలర్ రిలీజ్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి..‘మంత్ర తంత్రాలు ఉపయోగించి ఎవరి మీదనైనా విజయం (హిందీలో విజయ్) సాధించాలనుకుంటున్నారా?’అని పరోక్షంగా విజయ్ బ్రేకప్ గురించి ప్రశ్నించింది. దీనికి తమన్నా సమాధానం చెబుతూ.. ‘మంత్ర తంత్రాలతో అలాంటి పనులు జరుగుతాయి అంటే నేను నమ్మను. ఒకవేళ అదే నిజమైతే మీ(మీడియా)పై మంత్రాలను ప్రయోగిస్తా. అప్పుడు అందరూ నా చేతుల్లో ఉంటారు. నేను చెప్పింది వింటారు. నేను ఏం చెబితే అదే రాసుకుంటారు’ అని నవ్వుతూ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్‌తో బ్రేకప్ అయింది కాబట్టే..అతని పేరు కూడా చెప్పడానికి ఆమెకు ఇష్టం లేకనే ఇలా సమాధానం చెప్పిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.ఇక ఓదెల 2 సినిమా విషయానికొస్తే.. 2022లో ఓటీటీలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఓదెల’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇందులో తమన్నా శివశక్తిగా కనిపించబోతుంది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అటెన్షన్ కోసమే ఇలా.. నేను అస్సలు తగ్గను: కరాటే కల్యాణి
సినీనటి హేమ (Actress Hema) తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కరాటే కల్యాణి (Karate Kalyani), తమన్నా సింహాద్రి సహా పలు యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు పంపింది. గతంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిందంటూ కల్యాణిపై రూ.5 కోట్ల పరువునష్టం దావా వేసింది. తాజాగా ఈ వ్యవహారంపై నటి కరాటే కల్యాణి స్పందించింది. ఉన్నదే చెప్పా..ఆమె మాట్లాడుతూ.. నేనేమీ పార్టీలకు, పబ్బుకు వెళ్లలేదు. నాకు మద్యం అలవాటు కూడా లేదు. ఏ తప్పూ చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పట్టుబడిందని మీడియాలో వచ్చిన వార్తలు చూసే మాట్లాడాను. గతంలో ఆమె నన్ను కించపరుస్తూ చాలాసార్లు మాట్లాడింది. నన్ను చులకనగా చూసేది. మరి నువ్వేంటక్కా? ఇలా దొరికిపోయావు? అని అప్పుడు ఓ వీడియో చేశాను. మీడియాలో చూసిందే పెట్టాను తప్ప సొంతంగా సృష్టించలేదు కదా! భయమా?అలాంటప్పుడు ఆమె మీడియాపై కేసు వేయాలి కానీ నాపై వేయడం దేనికి? మీడియా అంటే భయమా? మీడియాను ఏం అనలేక నాపై కేసు వేద్దామనుకున్నావా? లేదా ఈ మధ్య ఎవరూ నిన్ను పట్టించుకోవడం లేదని అటెన్షన్ కోసం ఈ పని చేశావా? మీరు లీగల్ నోటీసులు పంపినంత మాత్రాన నేను భయపడను. నేను తగ్గేరకం కాదు. నేను కూడా తనకు నోటీసులు పంపుతాను అని కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది.చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు -
'డియర్ ఉమ' టీజర్.. నిర్మాతగా తెలుగమ్మాయి సుమయ రెడ్డి
ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘డియర్ ఉమ’ (Dear Uma) చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. తెలుగమ్మాయి సుమయ రెడ్డి(Sumaya Reddy) ఈ సినిమాలో హీరోయిన్గా నటించడమే కాకుండా, నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించారు. బహుముఖ ప్రతిభ కలిగిన సుమయ రెడ్డి, సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. సాయి రాజేష్ మహాదేవ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు రాసి, దర్శకత్వం వహించారు. అనేక విజయవంతమైన చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన రదన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.ఇప్పటివరకూ ‘డియర్ ఉమ’ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచాయి. వీటిని బట్టి చూస్తే, ఇది ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది. ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ అందమైన సందేశంతో పాటు అధిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందింది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా వంటి అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తయారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. -
విజయాల శ్రీ‘లీల’వెనుక రహస్యాలివే...
యువ నటి శ్రీలీల(sreeleela) నిస్సందేహంగా భారతీయ సినీరంగంలో తదుపరి పెద్ద స్టార్ కానుంది అంటున్నాయి సినీజోస్యాలు. తన అందం, ఆకర్షణ, ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అసాధారణమైన ఇతర నైపుణ్యాలతో, ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. పుష్ప2లోని కిస్సిక్ పాటతో ఆమె ఉత్తరాది ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపారు. నిజానికి పుష్ప తొలి భాగంలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ అయినా కూడా సమంతకు రానంత పాప్యురారిటీ శ్రీలీలకు వచ్చింది. ఆ పాట ఆమె హిందీ చిత్రసీమలోకి రెడ్‌కార్పెట్ వేసింది. దాంతో సౌత్‌లోనూ ఆమె క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది, ఇక ఆమె బాలీవుడ్లో మెరిసిపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే...శ్రీలీల తాజా హిందీ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇటీవల, ఈ చిత్రం సెట్ నుంచి అనేక వీడియోలు ఫొటోలు ఆనలైన్ లో ప్రత్యక్షమయ్యాయి. మరుసటి తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎరుపు రంగులో వదులుగా ఉండే దుస్తులు ధరించిన శ్రీలీల లుక్ ని, ఆమె రూపాన్ని మెచ్చుకుంటూ ఆమె పాత్ర గురించి ఊహాగానాలు చేస్తూ, అభిమానులు వీటిని షేర్ చేస్తున్నారు. ఓ రకంగా ఈ చిత్రానికి దక్షిణాదిలో విపరీతమైన టాక్ రావడానికి కారణం శ్రీలీలే అని చెప్పాలి. అందం, ప్రతిభ ఆత్మవిశ్వాసాల కలయికగా శ్రీలీల బాలీవుడ్లో రంగప్రవేశం చేస్తోంది. ఖచ్చితంగా కొన్నేళ్ల పాటు భారతీయ సినీరంగాన్ని ఊపే సత్తా ఆమెకు ఉందని బాలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీలను ఈ స్థాయిలో నిలబెట్టిన కొన్ని ముఖ్యమైను అంశాలను పరిశీలించాలి..కన్నడ చిత్రం కిస్ (2019)తో శ్రీలీల మరపురాని అరంగేట్రం చేసింది, ఆమె సహజమైన సౌందర్యం, ప్రకాశవంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయం ఆమెకు కొత్త అవార్డులను సంపాదించిపెట్టింది, ఇది భారతీయ చలనచిత్రంలో ఆమె మంచి జర్నీకి నాంది పలికింది.రెండో విషయంగా చెప్పాల్సి వస్తే ఆమె నృత్య,నటనా ప్రతిభ గురించే చెప్పాలి. ధమాకా (2022)లో, జింతాక్ పాటలో చురుకైన రిథమ్, గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ లతో శ్రీలీల తెలుగు సినిమాకి డాన్స్ డార్లింగ్‌గా మారింది.పెళ్లి సందడి (2021)లో సాంప్రదాయంగా కనపడి, భగవంత్ కేసరి (2023)లో యాక్షన్ సీన్స్ వరకు శ్రీలీల తనలోని షేడ్స్ స్కిల్స్ బాగా పండించింది. స్కంద (2023), ఆదికేశవ (2023), గుంటూరు కారం (2024) చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో తన స్కిల్స్‌కు సానబట్టింది.భాషపై పట్టు కూడా శ్రీలలకు అచ్చొచ్చిన మరో అంశం. కన్నడ, తెలుగు, తమిళం ఇంగ్లీషు భాషలపై ఆమెకున్న పట్టు ఆమెని విభిన్న భాషా చిత్రాల్లో, భిన్న పరిశ్రమల్లో బలంగా నిలబెట్టింది. వివిధ భాషా నేపథ్యాలకు చెందిన అభిమానులతో ఆమె సులభంగా మమేకం కాగలుగుతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ఒడిసిపట్టగల శ్రీలీల ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా ఆకట్టుకోగలుగుతోంది. ఆమె వార్డ్రోబ్ ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ గా పేరొందింది.అధిక ఫ్యాషన్‌తో యువత కు మరింత దగ్గర కాగలుగుతోంది. ఆమె ఫ్యాషన్ లుక్స్ ఆమెను మ్యాగజైన్లపై, వెబ్‌సైట్స్‌లో తళుక్కుమనేలా చేస్తున్నాయి. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (2023) వంటి చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు, శ్రీలీల తన వైద్య విద్య పరిజ్ఞానం గురించి ఆమె స్వచ్ఛంద సేవల గురించి బాగా వెలుగులోకి వచ్చింది. ఆమె సహకారం అందిస్తున్న గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు మహిళల విద్యకు మద్దతు అందించడం వంటివి ఆమెను నటిగా మాత్రమే కాక అంతకు మించి భారతీయ సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన రోల్ మోడల్‌గా అవతరించేందుకు అవకాశం అందిస్తున్నాయి. -
సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ కూతురు.. ‘ఎంట్రీ’ కోసం ఎన్ని కష్టాలో..!
సినిమా ఇండస్ట్రీలో ‘నెపోటిజం’ అనే పదం తరచూ వినిపిస్తూ, వివాదాస్పద చర్చలకు కారణమవుతోంది. ప్రముఖ నటులు, దర్శకుల పిల్లలకు ఈ నెపోటిజం ఒక వరంగా కనిపించినా, అది వారికి శాపంగా మారుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. స్టార్ కుటుంబాల నుంచి వచ్చే యువ ప్రతిభావంతులు తమ టాలెంట్‌తో ముందుకు వచ్చినప్పటికీ, వారి లాంచింగ్ సమయంలో వారిపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన స్టార్ కిడ్స్‌కి తమ తల్లిదండ్రుల పేరు, పరిచయాల ద్వారా సులభంగా అవకాశాలు పొందవచ్చనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, తమ స్వంత గుర్తింపు సాధించడం అంత సులభం కాదు. టాలెంట్ ఉన్నవారు కూడా, తమను తాము నిరూపించుకోవాల్సిన ఒత్తిడితో పాటు, ప్రేక్షకులు పెట్టుకునే భారీ అంచనాలను సైతం అందుకోవాల్సి వస్తోంది. అయితే తనను మాత్ర నెపోకిడ్గా చూడడానికి అవకాశం ఇవ్వబోను అంటోంది అవంతిక సుందర్. తమిళ హీరోయిన్ ఖుష్భూ, స్టార్ డైరెక్టర్ సుందర్ దంపతులు పెద్ద కూతురే ఈ అవంతిక సుందర్. లండన్‌లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ త్వరలోనే వెండితెర ఎంట్రీ చేయబోతుంది. మంచి కథ కోసం ఎదురు చూస్తోంది. సొంత నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ ఖుష్భూ-సుందర్ దంపతులు తమ కూతురు డెబ్యూ ఫిల్మ్‌ని నిర్మించడానికి సుముఖంగా లేరట. అంతేకాదు కథల ఎంపిక విషయంలోనూ జోక్యం చేసుకోబోమని చెప్పారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అవంతికనే చెప్పింది.నాకు అది ఇష్టం లేదు కానీ...నా తల్లిదండ్రులు నన్ను లాంచ్ చేయాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అంతేకాదు నేను ఏ సినిమా చేయాలో ఏది చేయకూడదో కూడా చెప్పబోమని నాతో అన్నారు. నాకు ఏది సౌకర్యంగా అనిపిస్తుందో అదే చేయమని మాత్రమే సలహా ఇచ్చారు. వాళ్ల సపోర్ట్ తీసుకోవడం వ్యక్తిగతంగా నాకు అది ఇష్టం లేదు. నా సొంతంగానే రాణించాలనుకుంటున్నాను. కానీ నా పెరెంట్స్ కారణంగా ఇండస్ట్రీలో నాకొక స్పెసల్ స్థానం ఏర్పడిందనేది వాస్తవం. కనీసం ఇండస్ట్రీకి చెందినవారిని పరిచయం చేసుకోవాలన్నా తల్లిదండ్రుల సపోర్ట్ కావాలి. నాకున్న అడ్వాంటేజ్ అదొక్కటే. దాని వాడుకోకుండా సొంతంగానే ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పడం తప్పే అవుతుంది. ఒక స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అనేది ఎంత ఒత్తిడితో కూడుకున్నదో నాకు తెలుసు. అయితే నేను వాళ్లకంటే ఎక్కువగా సక్సెస్ సాధిస్తానని చెప్పలేను. కానీ ఖచ్చితంగా సక్సెస్ ని సాధించడానికి నా వంతు ప్రయత్నం చేయగలను’ అని అవంతిక చెప్పుకొచ్చింది.అదే నా మైనస్నేను ఏ భాషలోనైనా సరే నటించడానికి రెడీగా ఉన్నాను. మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాను. అయితే నా మూవీ జర్నీకి నా హైట్ ఒక అడ్డంకిగా మారుతుందని నాకు తెలుసు. ఇలా ఎక్కువగా హైట్ ఉండడం వల్ల నా ఫస్ట్ ఛాన్స్ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది. టీనేజ్‌లో నేను అధిక బరువుతో, కళ్లద్దాలు పెట్టుకుని ఉండేదాన్ని. దీంతో హీరోయిన్లలా కనిపించడం కష్టమని చాలా బాధపడ్డాను. కానీ కరోనా తర్వాత నా శరీరాన్ని మార్చుకుని నా కలను సాధించాలనుకున్నాను.. ఇప్పుడు నాకు అన్ని రకాల పాత్రలను పోషించాలని ఉంది’ అని అవంతిక అన్నారు. -
26 ఏళ్ల నాటి అత్యంత ఖరీదైన సినిమా...ఇంకా విడుదల కాలేదు..!
ప్రస్తుతం అంతా భారీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించకపోతే వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల బుర్రలోకెక్కించలేం అన్నట్టుగా ఉంది పరిస్థితి. కధ, కధనాలను బట్టి బడ్జెట్ అనడం కన్నా బడ్జెట్‌ను బట్టి కధ అన్నట్టు మారిపోయింది. ఐదూ, పది కోట్లతో తీసే సినిమాల గురించి మాట్లాడుకోవడం కూడా దండగ అన్నట్టుగా నోరెత్తితే భారీ సినిమాలే చర్చకు నోచుకుంటున్నాయి. అయితే భారీ చిత్రాలు అనేవి ఇప్పుడే కాదు ఒకప్పుడూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలు దశాబ్ధాల క్రితమే తలపెట్టారు. అలాంటి ఒక సినిమా, ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే చరిత్రలోనే నెం1 భారీ చిత్రం అని పేర్కొనదగ్గ సినిమా... పాతికేళ్ల క్రితమే ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా పేరు మరుదనాయగం (Marudhanayagam).‘మరుదనాయగం‘ అనేది 18వ శతాబ్దపు యోధుడు మహ్మద్ యూసుఫ్ ఖాన్ గురించిన చారిత్రక నాటకం స్ఫూర్తితో తలపెట్టారు. హిందీ, తమిళం, తెలుగు ఆంగ్లంతో సహా పలు భాషలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్(Kamal Haasan) ను ఎంతో ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మక కాలపు చిత్రం మరుధనాయగం సినిమా 1997లో, తన స్వీయ దర్శకత్వంలో ప్రారంభించారు. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ అతిధిగా ఇది భారీ స్థాయిలో షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సుజాత స్క్రిప్ట్ రాశారు. నాజర్, సత్యరాజ్, విష్ణువర్ధన్ తదితర నటులు కూడా ఈ సినిమాకు ఎంపికయ్యారు.(చదవండి: ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల)ప్రత్యేక పాత్రల కోసం అమితాబ్, రజనీకాంత్‌లను కూడా సంప్రదించినప్పటికీ వాళ్లు తిరస్కరించారు. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు కీలకపాత్రలో హాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ కేట్ విన్స్లెట్ ని కూడా అనుకున్నారు. సినిమా టెస్ట్ షూట్ కోసం, కమల్ హాసన్ మాజీ భార్య, నటి సారిక బ్రిటీష్ ఫ్రెంచ్ సైన్యం అధికారులతో పాటు హిందూ ముస్లిం యోధులను ప్రతిబింబించేలా 7,400 వరకు దుస్తులు ఉపకరణాలను తయారు చేయించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూ.1 కోటి ఖర్చుతో టెస్ట్ షూట్ చేశారు. అప్పట్లోనే ఈ సినిమాకు రూ.80 నుంచి 90 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు..అంటే ప్రస్తుతం లెక్కల ప్రకారం చూస్తే...ఇది రూ..650 కోట్ల వరకూ ఉండొచ్చు.(చదవండి: ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్)అట్టహాసంగా అతిరధుల సమక్షంలో ప్రారంభమైన ఈ సినిమా,30 నిమిషాల రన్ టైమ్ పూర్తయిన తర్వాత 1998 చివరలో షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని సహ–నిర్మాతగా నిర్మించాలని అనుకున్న ఒక బ్రిటిష్ కంపెనీ, అర్ధంతరంగా వెనక్కి తగ్గడంతో, మరుధనాయగం పనులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. బ్రిటీష్ నిర్మాణ సంస్థ ఉపసంహరణ కారణంగా ఏర్పడిన ఆర్థిక పరిమితులు అడ్డంకిగా మారాయి. ఈ సినిమా పూర్తి కాలేదు... ఇప్పటికీ విడుదల కాలేదు, ప్రాజెక్ట్ ఎక్కడిది అక్కడే ఉండిపోయింది. ఆ బ్రిటిష్ కంపెనీ ఉపసంహరించుకోకుంటే ఈ సినిమా ఖచ్చితంగా పూర్తయి విడుదలై ఉండేది ఎన్నో సంచలనాలు నమోదు చేసేది.ఆ బ్రిటిష్ కంపెనీ సినిమా నిర్మాణం నుంచి ఉపసంహరించుకోవడానికి కారణం భారతదేశంలో జరిగిన పోఖ్రాన్ అణు బాంబు పరీక్ష . అంటే కమల్ సినిమా ఆగిపోవడానికి మన భారతరత్న నాటి అణు పరీక్షల సారధి అబ్ధుల్ కలాం పరోక్షంగా కారణం అయ్యారన్నమాట. అయితే అది తన కలల ప్రాజెక్ట్ అని కమల్ హాసన్ చెబుతుంటారు. కానీ ఇప్పుడు గానీ ఆ సినిమా స్క్రిప్ట్‌ను పునరుద్ధరించాలంటే గణనీయమైన మార్పులతో పాటు, దీనికి ఓ యువ కథానాయకుడు అవసరమని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికైనా తెరకెక్కుతుందో లేదో.... -
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), రాజీవ్ కనకాల(Rajeev Kanakala ) మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడంటే ఎన్టీఆర్ షూటింగ్స్, ఫ్యామిలీతో బిజీ అయ్యాడు కాబట్టి స్నేహితలతో కలవలేకపోతున్నాడు. కానీ ఒకప్పుడు మాత్రం ఖాలీ సమయం దొరికితే చాలు రాజీవ్‌తో పాటు ఒకరిద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడిపేవాడు. వయసులో తనకంటే తొమ్మిదేళ్లు పెద్దవాడైన రాజీవ్‌తో ఎన్టీఆర్ స్నేహం చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. రాజీవ్ కూడా ఎన్టీఆర్ తనతో స్నేహం చేస్తాడని ఊహించలేదట. అనుకోకుండా వీరిద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజీవ్. ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా షూటింగ్ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మొదట్లో సార్ సార్ అంటూ మాట్లాడేవాడు. ఓ సారి నేనే ‘సార్ వద్దులే రాజీవ్ అని పిలువు చాలు’ అని చెప్పా. మరుసటి రోజు షూటింగ్‌కి రాగానే ‘రాజీవ్’ అని పిలిచాడు. నేను ఏదో అలా పిలవమని చెప్పానే అనుకో ఎన్టీఆర్ అలా పిలిచేస్తాడా(నవ్వుతూ..). సరే హరికృష్ణ గారి అబ్బాయి కదా అనుకొని లైట్ తీసుకున్నా. మరుసటి రోజు ‘రాజీవ్ గారు..’ అన్నారు. ‘పోనీలే కనీసం ‘గారు’ చేర్చాడు కదా సంతోషం అన్నుకున్నా. ఆ తర్వాత రోజు ఇంటర్వెల్ సీన్ షూటింగ్ జరుగుతోంది. నేను ఇలా నడుచుకుంటూ వస్తున్నా.. బిల్డింగ్ పైన ఉన్న ఎన్టీఆర్.. ‘ఒరేయ్ రాజా..’ అన్నారు. రాజీవ్‌గారు నుంచి రారానా? అని షాకయ్యాను. ఏంటి ‘రా’ అంటున్నావ్ అని అడిగా. మరి ఫ్రెండంటే అనరా? ఎన్టీఆర్ అన్నాడు. ఆ తర్వాత ఓ సారి మేమిద్దరమే ఉన్నప్పుడు ఓ విషయం షేర్ చేసుకొని ఎమోషనల్ అయ్యాం. ఆ తర్వాత మరింత క్లోజ్ అయ్యా.. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది’ అని రాజీవ్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ ని మొదటి సారి సెట్లో చూసినప్పుడు ఇతనితో పని చేయడమే కష్టం అనుకున్నాడట రాజీవ్. అలాంటింది ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. View this post on Instagram A post shared by Sakshi (@sakshinews) -
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి (Allu Sneha Reddy)కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. సినిమాల్లో నటించకపోయినా ఓ స్టార్ హీరోయిన్‌కు ఉన్నంత ఫాలోవర్స్‌లో ఆమెకు ఉన్నారు. తరచు అల్లు అయాన్, అర్హ ఫోటోలను షేర్ చేయడంతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు హెల్త్ టిప్స్ కూడా ఇస్తుంటారు. అందుకే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను పెద్ద ఎత్తున ఫాలో అవుతుంటారు.తాజాగా స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఓ అమ్మాయికి బ్లడ్ ఎక్కిస్తున్నట్లుగా ఓ ఫోటో షేర్ చేశారు. ‘నాకు ప్రస్తుతం ఏం కావాలంటే’ అంటూ దీనికి క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ బ్లడ్ ప్యాకెట్‌పై ట్రావెల్ అని రాసుంది. దీనిని చూసిన అల్లు అభిమానులు అల్లు కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయ్యిందా అని ఆందోళన చెందుతున్నారు. ఆమెకే హెల్త్ బాగోలేక ఆస్పత్రిలో చేరిందని, ఈ విషయాన్ని చెప్పడానికే ఆ ఫోటోని షేర్ చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అల్లు స్నేహ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.కాగా,అల్లు అర్జున్-స్నేహల వివాహం 2011 మార్చి 6న జరిగింది. ఈ జంటకి 2014లో అయాన్ జన్మించగా.. 2016లో అర్హ పుట్టింది. అల్లు అర్జున్ సినిమాలు, షూటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉంటే..స్నేహ ఫ్యామిలీని చూసుకుంటూ భర్తకు తోడుగా ఉంటుంది. -
మొదటి పెళ్లి దుస్తుల్ని వేలంలో అమ్మేశా, రెండో పెళ్లి దుస్తులు..వెల్లడించిన నటి
నటి దియా మీర్జా మన హైదరాబాదీ అమ్మాయే. మిస్ ఏసియా పసిఫిక్ ఇంటర్నేషనల్‌గా అందాల సుందరిగా కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత వరుసగా విభిన్న భాషల్లో సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తెలుగులో ఆమె చివరగా నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలో చేసింది. సినిమాలతో పాటు పలు రకాల వ్యాపారాలు కూడా చేస్తూ స్థిరపడిన దియా మీర్జా... వ్యక్తిగత జీవితంలో ప్రేమ పెళ్లి మాత్రం విఫలమైంది. ఆమె గత 2014లో తన వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాని పెళ్లాడింది. అయితే ఐదేళ్లలోనే ఆ పెళ్లి పెటాకులైందని ఆమే స్వయంగా ప్రకటించింది. అనంతరం రెండేళ్లు గ్యాప్ ఇచ్చి అప్పటికే వివాహితుడు, ఒక బిడ్డకు తండ్రి అయిన వైభవ్ రేఖిని పెళ్లి చేసుకుని దియా మీర్జా రేఖిగా మారింది. అయితే విడాకుల తర్వాత కూడా ఎప్పుడూ తన మొదటి పెళ్లి గురించి దియామీర్జా మాట్లాడింది లేదు. ఇటీవల మాత్రం ఒక ఇంటర్వ్యూలో, దియా మీర్జా తన పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ఆ తరహా ఆలోచనల వెనుక ఉన్న పలు అంశాల్ని గురించి మాట్లాడుతూ తన రెండవ పెళ్లిని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ తరహాలో చేసుకున్నట్టు వివరించింది.తమ ఇంటి తోటలోనే అత్యంత నిరాడబంరంగా సహజమైన పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. చేతితో తయారు చేసిన వ్యక్తిగతీకరించిన బహుమతులు స్థానిక సహజమైన అలంకరణ ఉత్పత్తులనే వివాహం కోసం వాడినట్టు తెలిపారు. ఆహార వ్యర్థాలను తగ్గించడానికి అతిథులకు శాకాహార మాంసాహార వంటకాల ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారిస్తూ, భోజనాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేశామన్నారు. కేవలం ఓ మహిళా పూజారితో దంపతులు సాదాసీదాగా వేడుక పూర్తి చేశామన్నారు. వధువుగా ధరించడానికి బాలీవుడ్ వధువులకు సాధారణమైన లెహెంగాకు బదులుగా ఎరుపు రంగు బనారసీ చీరను దియా ఎంపిక చేసుకోవడం విశేషం.ఇదే సందర్భంగా ఆమె తన మొదటి పెళ్లి గురించి కూడా గుర్తు చేసుకుంది. ఆ పెళ్లి ఒక ఫార్మ్ హౌజ్‌లో జరిగింది. ఆడంబరంగా జరిగిన ఆ పెళ్లిలో ఆమె ఖరీదైన దుస్తులను ఎంచుకుంది. ఆ పెళ్లిలో ఆమె బాలీవుడ్ వధువుల తరహాలోనే లెహంగానూ ధరించింది. అయితే వివాహాల తర్వాత బ్రైడల్ లెహంగాలు తరచు నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది. వాటిని పారవేయలేక, ఇటు ధరించనూ లేక వార్డ్‌రోబ్స్‌లో ఉంచుతారంది. ఒక పర్యావరణ అనుకూల మనస్తత్వంతో తాను దాన్ని ఇష్టపడలేదని చెప్పింది. దాంతో ఆమె తన మొదటి పెళ్లిలో తాను ధరించిన తన వివాహ లెహంగాను వేలం వేయాలని అనుకుంది. అనుకున్నట్టుగానే దాన్ని మంచి ధరకు వేలం వేశానని వెల్లడించింది. నిరుపయోగంగా పడి ఉండకూడదనే తాను తన రెండవ పెళ్లికి సాధారణ చీరను ఎంచుకున్నానని తన భర్త వైభవ్ రేఖీ సైతం అదే పనిచేశారని తెలిపింది. పెళ్లి తర్వాత అలమారాలో ఉపయోగించకుండా కూర్చోకుండా జీవితాంతం ధరించగలిగే దుస్తులను ఆయన కూడా ఎంచుకున్నట్లు కూడా ఆమె పేర్కొంది. ఆమె పెళ్లి రోజున, దియా మీర్జా సాంప్రదాయ ఎరుపు రంగుకు దూరంగా డిజైనర్ రీతూ కుమార్ తయారు చేసిన ఆకుపచ్చ జర్దోసీ ఘరారాను ఎంచుకుంది. -
రోజుకి రూ.లక్ష..అయినా ఊటీలో సినిమా షూటింగ్స్ బంద్...ఎందుకంటే?
దక్షిణాది ఉత్తరాది తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషా చిత్రాల షూటింగ్ లకు స్వర్గధామం లాంటిది తమిళనాడులోని ఉదకమండలం...అదే ఊటీ(Ooty) . మన రోజా, గీతాంజలి తదితర దక్షిణాది చిత్రాలతో పాటు నాటి ‘ఖయామత్ సే ఖయామత్ తక్ నుంచి నిన్నా మొన్నటి బర్ఫీ దాకా ఊటీ అంటే సినిమా షూటింగ్‌లకు అచ్చొచ్చిన బ్యూటీగా నిలిచింది. ‘అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ,‘ ‘అందాజ్ అప్నా అప్నా,‘ ‘బర్ఫీ,‘ ‘దిల్ సే,‘ ‘జో జీతా వోహీ సికందర్,‘ ‘రాజా హిందుస్తానీ,‘ వంటి బాలీవుడ్ సినిమాలు ఊటీ అందాలకు అద్దం పట్టాయి.ఏళ్లు గడుస్తున్నా, అనేక రకాల షూటింగ్ స్పాట్స్ అందుబాటులోకి వస్తున్నా ఊటీకి మాత్రం షూటింగ్స్ తాకిడి తగ్గడం లేదు. ఇటీవల ‘రివర్‌డేల్‘ అనే కాల్పనిక పట్టణానికి నేపథ్యంగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘ది ఆర్చీస్‘ కూడా ఊటీలో చిత్రీకరించారు. అలాగే ది లారెన్స్ స్కూల్, లవ్‌డేల్‌తో సహా ‘రాజ్‘ చిత్రం కూడా ఊటీలో తీసినవే. ఏటా వందలాదిగా షూటింగ్స్ కు ఊటీ కేంద్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఊటీలోని బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్, టాయ్ ట్రైన్ తదితర ప్రాంతాలతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న తేయాకు తోటలు కూడా సినిమా కెమెరాలకు పని చెబుతూనే ఉంటాయి.ఈ నేపధ్యంలో ప్రస్తుతం పర్యాటకుల తాకిడితో ఊటి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముఖ్యంగా గత ఏడాది కనీ విని ఎరుగని స్థాయిలో భారీ సంఖ్యలో పర్యాటకులు ఊటీకి వెల్లువెత్తారు. ఊటీకి వెళ్లేదారిలో భారీగా ట్రాఫిక్ జామ్స్ సైతం ఏర్పడ్డాయి. ఇక గత వేసవిలో ఊటీలో కాలుష్యం ఎన్నడూ లేనంత స్థాయిలో నమోదైంది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఇ పాస్ వంటి నిబంధనలతో పర్యాటకుల రాకను నియంత్రించింది. రాకపోకలను కట్టుదిట్టం చేసింది. అయితే గత ఏడాది అనుభవాలతో ఈ సారి ప్రభుత్వం మరింత ముందుగా మేల్కొంది. ముందస్తుగానే అంటే ఏప్రిల్ నెల రాకుండానే ఇ పాస్ నిబంధన విధించడంతో పాటు ఊటీలోకి 6వేల వాహనాలకు మాత్రమే ఎంట్రీ వంటి పలు ఆదేశాలు జారీ చేసింది. అదే క్రమంలో సినిమా షూటింగ్స్ పైనా నిషేధం విధించింది. ఈ ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ప్రభుత్వ బొటానికల్ గార్డెన్, గవర్నమెంట్ రోజ్ గార్డెన్ సహా ఎనిమిది పార్కులలో సినిమా షూటింగ్‌లను అక్కడి ఉద్యానవన శాఖ తాత్కాలికంగా నిషేధించింది. వందల, వేల సంఖ్యలో పర్యాటకులు తమ సెలవులను ఆస్వాదించేందుకు ఈ పార్కులను సందర్శిస్తుండటంతో వారికి ఇబ్బందులు ఎదురవకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యానవన శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ‘‘మేము చెన్నైలోని మా ఉద్యానవన శాఖ డైరెక్టర్ నుంచి సరైన అనుమతి పొందిన తర్వాత మాత్రమే చిత్ర యూనిట్లను అనుమతిస్తున్నాం. సినిమా నిర్మాతలు ఒక రోజు షూటింగ్ కోసం కనీసం 25,000 నుంచి గరిష్టంగా 1 లక్ష వరకు చెల్లించాలి. అయితే, వేసవి సెలవుల కారణంగా ఈ ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊటీలోని పలు పార్కులలో అన్ని సినిమా షూటింగ్‌లను తాత్కాలికంగా నిషేధించాం’’ అని చెప్పారు. -
రహస్య సంభాషణల కోసం కొరియన్ భాష.. మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దక్షిణాది నటుడిగా తన ప్రయాణం ప్రారంభించిన ఆర్ మాధవన్ (R Madhavan ) ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రముఖ నటుడిగా మారారు. కేవలం అభినయానికే ప్రాధాన్యతను ఇస్తూ టాప్ నటులుగా మారిన అతి తక్కువ మందిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. గత ధోరణికి భిన్నంగా ఆయన ఇటీవల కాస్త ఎక్కువగానే ఇస్తున్న ఇంటర్వ్యూల్లో అనేక సమకాలీన, సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నారు. తాజాగా చాలా మంది తల్లిదండ్రులకు సమకాలీన పాప్ సంస్కృతి పరిశీలకులకు సుపరిచితం అయిన ఓ అంశాన్ని ప్రస్తావించాడు, ప్రస్తుతం భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కె.పాప్ పట్ల ఆయన తొలిసారిగా స్పందించాడు.ప్రస్తుత ఓటీటీ యుగం పుణ్యమా అని అనేక దేశాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలు మన యువతకు చేరువయ్యాయి. అందులో అత్యంత వేగంగా పిల్లల్ని ఆకట్టుకుంటోంది కొరియన్ పాప్ (K Pop) సంగీతం, కొరియన్ సినిమా, సిరీస్‌లు. ఈ కొరియన్ సంస్కృతి పట్ల భారతీయ పిల్లలు పెంపొందించుకున్న గాఢమైన ఆకర్షణపై మాధవన్ ఆశ్చర్యంతో పాటు తన ఆందోళనను సైతం వ్యక్తం చేశారు, ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన ఊపందుకుంటున్న ధోరణిపై తన ఆలోచనలను ఆందోళననను పంచుకున్నాడు.‘దక్షిణాదిలో–ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో–కె–పాప్ సరికొత్త సంస్కృతిగా అవతరిస్తోంది‘ అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. యువత లో కె–పాప్ సంస్కృతి ఊహలకు అందనంత లోతుగా అల్లుకుపోతోందని వారి కథా కథనాలలో భారతీయ సినిమా తో పోలిస్తే అంత వైవిధ్యం ఏం ఉందో? అదెందుకు వారిని అంతగా ఆకట్టుకుంటుందో తెలియడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే వీటన్నింటి కన్నా తల్లిదండ్రులకు మరింత ఆందోళనను కలిగించే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదేమిటంటే... అనేకమంది భారతీయ యువత కొరియన్ భాషను నేర్చుకుంటున్నారు అనేది. నిజానికి అన్యభాషా చిత్రాలను ఆదరించడం, వారి సంగీతాన్ని ఎంజాయ్ చేయడం ఎప్పుడూ ఉండేదే. అయితే ఏకంగా కొరియన్ భాషను నేర్చుకుని మరీ ఆ సంగీతం, వినోదాన్ని ఆస్వాదించాలనే వారి బలమైన ఆసక్తి పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆయన మరో రహస్యాన్ని కూడా బహిర్గత పరిచాడు. కొరియన్ భాషను నేర్చుకుంటున్న పిల్లలు వారి తల్లిదండ్రులకు అర్థం కాని రహస్య సంభాషణల కోసం కోడ్ లాంగ్వేజ్ గా కూడా ఉపయోగిస్తున్నారనే చేదైన వాస్తవాన్ని ఆయన తెలియజేశాడు. సాంకేతిక విప్లవం కారణంగా ఇప్పటికే టీనేజర్లు రకరకాల మాయాజాలాల్లో ఇరుక్కుపోతున్న పరిస్థితుల్లో కొరియన్ భాషలో వారు సాధించే పట్టు ద్వారా పొందే ప్రయోజనం కేవలం సినిమా, పాప్ సంగీత వినోదానికే పరిమితం కాగా...దాని వల్ల తల్లిదండ్రులకు కలిగే నష్టం అంతకు మించి ఉండబోతోందని ఒక టీనేజర్ తండ్రి కూడా అయిన మాధవన్ చెబుతున్న విషయం ప్రతీ ఒక్క పేరెంట్ గుర్తు పెట్టుకోవాల్సిందే అనడంలో సందేహం లేదు. -
నేను కాపీ కొట్టలేదు.. ఏళ్లకిందటే రాసుకున్న కథ ఇది: లాపతా లేడీస్ రచయిత
బాక్సాఫీస్ వద్ద అంతంతమాత్రమే ఆడినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది లాపతా లేడీస్ (Laapataa Ladies). బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ చిత్రాన్ని 2019లో వచ్చిన అరబిక్ మూవీ నుంచి కాపీ కొట్టారని ఇటీవల ట్రోలింగ్ జరిగింది. బుర్ఖా సిటీ అనే అరబిక్ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్‌ను యథాతథంగా తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.టూ బ్రైడ్స్ పేరిట రిజిస్టర్తాజాగా ఈ ఆరోపణలపై లాపతా లేడీస్ కథారచయిత బిప్లాబ్ గోస్వామి (Biplab Goswami) స్పందించాడు. అరబిక్ సినిమాను తెరకెక్కించడానికంటే ముందే తను ఈ కథను రిజిస్టర్ చేయించినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశాడు. అందులో ఏముందంటే.. లాపతా లేడీస్ కథ ఎన్నో ఏళ్లకిందట రాసుకున్న కథ. 2014 జూలై 3న ఈ కథను స్క్రీన్రైటర్స్ అసోసియేషన్‌లో టూ బ్రైడ్స్ పేరిట క్లుప్తంగా రిజిస్టర్ చేయించాను. ఎప్పుడో రాసుకున్నా..పరదా కారణంగా పెళ్లికొడుకు పొరపాటున వేరొకరి భార్యను ఇంటికి తీసుకురావడం.. తీరా ఇంటికొచ్చాక జరిగిన తప్పిదానికి బాధపడటం.. ఇవన్నీ కూడా ఆ కథలో పొందుపర్చాను. అలాగే పెళ్లికొడుకు తన భార్య ఆచూకీ వెతికిపెట్టమని పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడని.. పరదా కప్పుకున్న భార్య ఫోటోను పోలీస్‌కు ఇస్తాడని కూడా పేర్కొన్నాను. 2018 జూన్ 30న పూర్తి స్క్రిప్ట్‌ను రిజిస్టర్ చేయించాను. అదే ఏడాది జరిగిన సినీస్తాన్ స్టోరీటెల్లర్స్ పోటీలో నా కథకుగానూ రన్నరప్ అవార్డు గెల్చుకున్నాను. దశాబ్దాల నుంచి ఉన్నదే!పరదాల కారణంగా అమ్మాయిల్ని గుర్తుపట్టడం కష్టంగా మారుతుందనే అంశాన్ని దశాబ్దాల తరబడి ఉపయోగిస్తున్నాం. విలియం షేక్స్పియర్, అలెగ్జాండర్ డుమాస్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ఎందరో రచయితలు సైతం తమ కథల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. వధువులు మారిపోతే అనే అంశాన్ని ప్రధానంగా తీసుకున్న లాపతా లేడీస్ తెరకెక్కింది. ఇది పూర్తిగా ఒరిజినల్ స్టోరీ. కథ, డైలాగ్స్, పాత్రలు, సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే.. అంతా కూడా ఏళ్లతరబడి మేము చేసిన అధ్యయనానికి ప్రతీకగా నిలిచాయి. 100% ఒరిజినల్లింగ వివక్ష, అసమానత్వం వంటి సమస్యల్ని స్పష్టంగా చూపించాం. మా కథ, పాత్రలు, డైలాగ్స్ అన్నీ కూడా నూటికి నూరుపాళ్లు ఒరిజినలే! కాపీ కొట్టామంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి ఆరోపణలు మా శ్రమకు ఫలితం లేకుండా చేస్తాయి. నాకే కాదు, నా టీమ్ మొత్తం చేసిన కృషిని దెబ్బ తీస్తాయి అని రచయిత బిప్లాబ్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Biplab Goswami (@biplabgoswamicinema) చదవండి: రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా? -
రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?
ఆలసించిన ఆశాభంగమే! పురజనుల వేడుకోలు వలన కొద్ది రోజులు మాత్రమే హెచ్చింపబడినది. తెనుగు టాకీల కనులారా వీక్షించి జన్మము సార్థకము చేసికొనుడు. అనేకులకు టిక్కెట్లు దొరకక వెనుకకు మరలిపోవలసి వచ్చుచున్నది. – దుర్గా కళా మందిరం, బెజవాడ. (93 ఏళ్ల క్రితం, ఆనాటి పత్రికల్లో వచ్చిన ఒక సినిమా ప్రకటన ఇది).∙∙ ఈ మాటాడు చిత్రమును చూడని వారి జన్మ నిరర్థకము. ఒకవేళ మీకు తెలుగు భాషయందు ప్రవేశము లేకున్నను, ఒక దఫా వచ్చి కనులార గాంచవలసిందే. – సెలక్టు పిక్చర్సు సర్క్యూట్స్, బెంగుళూరు. (ఇది కూడా అదే సినిమాకు సంబంధించిన వాల్ పోస్టర్ ప్రకటన). ఆ సినిమా : శ్రీరామ పాదుకా పట్టాభిషేకము! శ్రీరాముడి పాత్ర ఉన్న తొలి తెలుగు టాకీ చిత్రం. సినిమాల్లో ఇప్పటికీ శ్రీరాముడంటే శ్రీ నందమూరి తారక రామారావు అన్నట్లుగానే ఉంటుంది. ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రను పోషిస్తే– ఆయన ఆ పాత్రలో కాక, ఏకంగా శ్రీరాముడిలోనే ఒదిగిపోయారా అన్నట్లుగా ఉంటుందని ఆయన అభిమానులు అంటారు. శ్రీ రాముడిగా ఎన్టీఆర్ తొలి సినిమా ‘సంపూర్ణ రామాయణం’ (1958). రెండోది లవకుశ (1963), మూడు రామదాసు (1964), నాలుగు శ్రీరామాంజనేయ యుద్ధం (1975), ఐదు శ్రీరామ పట్టాభిషేకం (1978). ఎన్టీఆర్ కంటే ముందు అక్కినేని నాగేశ్వరరావు; ఎన్టీఆర్ తర్వాత హరనాథ్, శోభన్‌బాబు, కాంతారావు, రవికుమార్, శ్రీకాంత్, సుమన్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ శ్రీరాముడి పాత్రల్లో కనిపించారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందు, ఏఎన్నార్ కంటే కూడా ముందు... తొలిసారి తెలుగు తెర మీద ప్రత్యక్షమైన రాముడొకరు ఉన్నారు. ఆయనే యడవల్లి సూర్యనారాయణ!∙∙ ‘జననానికి’ ముందే ‘పట్టాభిషేకం’తెలుగులో తొలి మాటల చిత్రం (టాకీ) ‘భక్త ప్రహ్లాద’ అయితే రెండో టాకీ చిత్రం ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. రెండూ ఒకే ఏడాది పూర్తయ్యాయి. భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరిలో, శ్రీరామ పాదుకా పట్టాభిషేకం 1932 డిసెంబరులో విడుదలయ్యాయి. ఈ రెండో చిత్రంలోనే రాముడిగా నటించారు యడవల్లి సూర్యానారాయణ. అంటే, ఏఎన్నార్ రాముడిగా నటించిన ‘సీతారామ జననం’ (1944) చిత్రానికి పన్నెండేళ్లకు ముందు, ఎన్టీయార్ తొలిసారి రాముడిగా నటించిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి 26 ఏళ్లకు ముందే ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’లో రాముడి పాత్రను పోషించి, తెలుగు టాకీ తొలి రాముడిగా ప్రఖ్యాతిగాంచారు యడవల్లి. ∙∙ యువ దర్శకుడి చేతిలో తొలి రాముడు‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రాన్ని బాదామి సర్వోత్తమ్ దర్శకత్వంలో సాగర్ స్టూడియోస్ వారు నిర్మించారు. సీతగా సురభి కమలాబాయి నటించారు. రాముడు అరణ్యవాసం నుండి తిరిగి వచ్చేవరకు, సింహాసనంపై రాముడి పాదుకలను (పాదరక్షలను) ఉంచి భరతుడు రాజ్యపాలన చేయటమే ఈ చిత్ర కథాంశం. బాదామి సర్వోత్తమ్ (1910–2005) ఇరవై ఏళ్ల వయసులో ముంబైలోని ‘సాగర్ మూవీ టోన్’ కంపెనీలో పని చేస్తూ ఆ స్టూడియో వాళ్లు నిర్మించిన అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ సినిమాలలో తొలి టాకీ చిత్రాలకు హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహిస్తే, రెండు భాషల్లోనూ తర్వాతి చిత్రాలకు బాదామి సర్వోత్తమ్ దర్శకత్వం వహించారు. ఇరవై రెండేళ్ల వయసుకే ఆయనకు ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. సీతమ్మగా ‘కమలమ్మ’‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రంలో సీతగా నటించే నాటికి సురభి కమలాబాయి వయసు 25 ఏళ్లు. తొలి తెలుగు సినిమా నటి. గాయని. 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ‘భక్త ప్రహ్లాద’లో లీలావతి పాత్రను ధరించారు. రంగస్థల కుటుంబంలో జన్మించిన కమలాబాయి బాల్యంలో కృష్ణుడిగా, ప్రహ్లాదుడిగా నటించారు. కౌమార దశ దాటాక మగ పాత్రలు వేయటం మాని, మహిళల పాత్రలలోకి వచ్చేశారు. కమలాబాయి నటనా ప్రతిభ గురించి విని సాగర్ స్టూడియోస్ వాళ్లే ఆమెను సగౌరవంగా బొంబాయి ఆహ్వానించారు. ఆ స్టూడియో ఆర్టిస్ట్‌గా కమలాబాయి పదేళ్ల పాటు అక్కడే ఉండి, వారు నిర్మించిన అనేక సినిమాలలో నటించారు. ∙∙ రాముడి పాత్ర ‘సాగర్’ ఇచ్చిందేతొలి తెలుగు సినీ రాముడు యడవల్లి సూర్యనారాయణ (1888–1939) కూడా రంగస్థలం నుంచి వచ్చినవారే. సినిమాల్లోకి రాకముందు రంగస్థలంలో ఆయన సూపర్ స్టార్. వివిధ నాటక సమాజాలతో ఉన్న సత్సంబంధాలున్న వారి ప్రోత్సాహంతో ఆయన కూడా సాగర్ మూవీటోన్ గ్రూప్ వారి ప్రతిష్ఠాత్మక యాక్టర్ అయిపోయారు. ‘పాదుకా పట్టాభిషేకంలో’ శ్రీరాముడి పాత్రకు ఎంపికయ్యారు. సినిమాల్లోకి వచ్చేసరికి యడవల్లి వయసు 46 ఏళ్లు. అప్పట్నుంచి మూడేళ్లు సినిమాల్లో ఉండి, తిరిగి నాటక రంగంవైపు వచ్చారు. -
అమ్మో అన్ని యాడ్స్ శోభితకు ఎలా వచ్చాయి? సీక్రెట్ ఇదే..
అక్కినేని వారి ఇంటికి కోడలు అనే కేరాఫ్ శోభితా ధూళిపాలా (Sobhita Dhulipala)ను ఇటీవలే వరించి ఉండొచ్చు గానీ... ఆమె పేరుకు ముందు అత్యంత ప్రాచుర్యం కలిగిన జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్ చేరడం మాత్రం చాలా రోజుల నుంచే ఉంది. అందాల సుందరి కిరీటం దక్కించుకోవడం దగ్గర నుంచి మొదలుపెడితే... ఒకటొకటిగా ఈ తెలుగమ్మాయి దక్కించుకున్న విజయాలు అంత చిన్నవేమీ కావు. బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాల నుంచి మంకీ మ్యాన్ వంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లకు కూడా విస్తరించింది ఓ వైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో రాణిస్తూనే మరోవైపు కమర్షియల్ బ్రాండ్స్ రూపొందించే ప్రకటనల యాడ్ వరల్డ్ కి కూడా హాట్ ఫేవరెట్‌గా మారింది శోభిత. ఆమె భీమా జ్యువెల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్, అలాగే జాక్వార్ ఇండియా హర్ స్టోరీ ప్రచారాలలో కూడా తళుక్కుమన్నారు.యాడ్ గల్లీ డాట్ కామ్ ప్రకారం...ఆమె ఇండో–ఫ్యూజన్ ఫ్యాషన్ డిజైనర్ లేబుల్ అయిన క్యుబిక్ ప్రచారాలలో కూడా కనిపించింది. అంతేకాక ఆమె దాసోస్ క్యాబినెట్ల ప్రచారాలలో కూడా పాల్గొన్నారు. ఐశ్వర్య, సుష్మితాసేన్, ప్రియాంకచోప్రాలను మినహాయిస్తే.. అందాల సుందరి కిరీటం దక్కించుకున్నవారిలో శోభిత స్థాయి విజయాలు మరెవరూ సాధించలేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ప్రకటనల్లో , యాడ్ వరల్డ్ అయితే ఆమెకి తిరుగేలేదు. నటిగా సరే, ప్రకనటల్లోనూ యాడ్ క్వీన్‌గా ఆమె రాణించడానికి ఏయే అంశాలు దోహదం చేశాయి? దీని గురించి మోడలింగ్, యాడ్ రూపకల్పన నిపుణులు ఏమంటున్నారంటే... అందం...విలక్షణం... ఆమె అందం కళాత్మక సున్నితత్వంల విలక్షణ సమ్మేళనం, అందుకే శోభితా ధూళిపాళ క్లాస్, మాస్‌లకు ఇష్టమైన సెలబ్రిటీగా ఉద్భవించింది, ఒక ప్రత్యేకమైన అద్భుతమైన అందం ఆమె స్వంతం.డస్కీ కలర్ క్లాసిక్ ఛార్మ్ సాంప్రదాయ మోడల్స్, సెలబ్రిటీల నుంచి శోభితను ప్రత్యేకంగా నిలబెడుతోంది. లగ్జరీ బ్రాండ్లు ఆమె విలక్షణమైన రూపాన్ని ఇష్టపడతాయి, ఆమె హై–ఎండ్ ఫ్యాషన్, అందం ఆభరణాల బ్రాండ్లకు అనువైన ఎంపికగా మారింది. భారతీయతను ప్రతిబింబిస్తూనే.. ఆమె గ్లోబల్ అప్పీల్ ఆమెను వేర్వేరు ప్రాంతాలలోని వైవిధ్యభరిత అభిరుచులు కలిగిన విభిన్న రకాల వినియోగదారులతో కనెక్ట్ కావాలనుకునే బ్రాండ్లకు అనువైన, విలువైన అంబాసిడర్‌గా మార్చింది. ఫ్యాషన్...ఓ స్టోరీ టెల్లింగ్... వ్యక్తిగతంగా ఆమె పాతకాలపు చీరలు, టైలర్డ్ సూట్లు లేదా మినిమలిస్టిక్ సిల్హౌట్‌లు లాంటి కాండిడ్ ఫ్యాషన్ సె¯Œ ్సకు ప్రసిద్ధి చెందింది.ఆమె ఫ్యాషన్‌ను కేవలం ధరించదు దాని ద్వారా ఓ చక్కని కథ చెబుతుంది ఆమె రెడ్ కార్పెట్ ఎడిటోరియల్ లుక్స్ జాగ్రత్తగా క్యూరేట్ చేయబడినట్లు అనిపిస్తుంది, తద్వారా హస్తకళను ప్రదర్శించే హెరిటేజ్ బ్రాండ్లకు ఆమె సరైన ప్రతినిధిగా మారింది. ఆమెకు ఇంటెలక్చ్యువల్ లుక్స్ ఓ వరం. ఆమె తరచుగా సాహిత్యం, కళ చరిత్ర గురించి అనర్గళంగా మాట్లాడుతుంది, ఇవి ఆమెను కేవలం ఒక గ్లామర్ క్వీన్‌గా మాత్రమే కాకుండా ఆలోచనా పటిమ కలిగిన శక్తివంతమైన మహిళగా చూపిస్తోంది. ఈ మేధోపరమైన ఆకర్షణ ఆమెను సంస్కారవంతమైన, వివేకం గల వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే బ్రాండ్లు ఎంచుకోవడానికి కారణమవుతోంది. శోభితా ధూళిపాలా ఆధునిక అందపు స్టైలిష్ లుక్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుతుందని నిరూపితం కావడమే ఆమె మరిన్ని బ్రాండ్స్‌తో పనిచేసేందుకు ఉపకరిస్తోంది. -
జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్ రోషన్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్లో హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ (War 2 Movie)లోనూ భాగమయ్యాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. జార్జియాలో జరిగిన వార్ 2 ఈవెంట్లో హృతిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హృతిక్ (Hrithik Roshan) మాట్లాడుతూ.. వార్ సినిమా సీక్వెల్ ఎలా ఉంటుందోనని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడీ సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది. మొదటి భాగం కంటే కూడా ఇదే మరింత బాగుంటుంది.ఎన్టీఆర్‌తో డ్యాన్స్..జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ కోస్టార్. తను అద్భుతమైన వ్యక్తి, చాలా తెలివైనవాడు. ఒక పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయింది. ఆ పాటలో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ చేయాలంటే కాస్త భయంగా ఉంది. తను ఎలాగైనా చేయగలడు. నేను కూడా బాగా డ్యాన్స్ చేస్తానని అనుకుంటున్నాను. మీరు మా సినిమాను తప్పక ఆదరించాలి అని చెప్పుకొచ్చాడు. వార్ 2 విషయానికి వస్తే.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీతో తారక్ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఇకపై డైరెక్టర్‌గానూ..హృతిక్ రోషన్ నెక్స్ట్ 'క్రిష్ 4' సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంతో అతడు దర్శకుడిగా మారనున్నాడు. '25 ఏళ్ల క్రితం నిన్ను నటుడిగా ప్రవేశపెట్టాను.. మళ్లీ పాతికేళ్ల తర్వాత నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది' అని హృతిక్ తండ్రి రాకేశ్ ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు.చదవండి: జైలు నుంచి విడుదల, మహేశ్ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్.. వీడియో వైరల్ -
వారియర్ లుక్‌లో రష్మిక.. పాటతో అలరించిన విజయ్ దేవరకొండ!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna), టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.ఈ రోజు(ఏప్రిల్ 5)రష్మిక బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్"(The Girlfriend) సినిమా నుంచి విశెస్ చెబుతూ కొత్త పోస్టర్, టీజర్ సాంగ్ 'రేయి లోలోతుల' రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రష్మిక వారియర్ లుక్ లో గన్, కత్తితో పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. 'రేయి లోలోతుల' పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించారు. విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాద ఆకట్టుకునేలా పాడారు. ఈ పాటలో వచ్చే పోయెమ్ ను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రాశారు. 'రేయి లోలోతుల' పాట ఎలా ఉందో చూస్తే - 'రేయి లోలోతుల సితార, జాబిలి జాతర, కన్నులలో వెన్నెలలే కురిసే, మదిమోసే తలవాకిట తడిసే, యెద జారెనే మనసు ఊగెనే, చెలి చెంతలో జగమాగెనే, యెద జారెనే మనసా..' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. -
మారిపోయిన మనిషిని గుర్తు చేసేలా ‘అరి’ థీమ్ సాంగ్
‘పేపర్ బాయ్’ఫేం జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక.వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్.ఇప్పటికే ఈ చిత్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలకు చూపించగా..వారంతా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఈ తరం తప్పకుండా చూడాల్సిన సినిమా అని సూచించారు. ఇక తాజాగా ఈ చిత్రం థీమ్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్.‘మషినేనా నువ్వు..ఏమై పోతున్నావ్.. మృగమల్లే జారీ..దిగజారిపోయావ్’ అంటూ సాగే ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. షణ్ముఖ ప్రియ అద్భుతంగా ఆలపించింది. ఇక అనూప్ రూబెన్స్ తనదైన సంగీతంతో పాటను మరోస్థాయికి తీసుకెళ్లాడు. సినిమాలోని కీలక పాత్రలన్నింటిని పరిచయం చేస్తూ.. అసలు ఈ సినిమా కథేంటి? ఎం సందేశం ఇవ్వబోతుందనే విషయాలను తెలియజేలా థీమ్ సాంగ్ ఉంది. ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని కొత్తగా చూపించామని చిత్రబృందం పేర్కొంది. -
సాయి పల్లవి ‘పొట్టి డ్రెస్’ కథ తెలుసా?
ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే.. స్కిన్ షో కచ్చితంగా చేయాల్సిందేనా? పొట్టి దుస్తులు ధరించి.. తెరపై అందాలను ప్రదర్శిస్తేనే ‘స్టార్’ హోదా వస్తుందా? అంటే కాదని బల్లగుద్ది చెప్పొచ్చు. ‘నీకేం తెలుసు..‘ఎక్స్పోజింగ్’చేస్తేనే సినిమా చాన్స్‌లు వస్తాయట’ అని ఎవరైనా అంటే..వారికి సాయి పల్లవి (Sai Pallavi) గురించి చెప్పండి. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ కేవలం నటనతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. సంప్రదాయ దుస్తులతోనే నటించి ‘స్టార్’ హీరోయిన్గా ఎదిగింది. అలా అని గ్లామర్ షో చేస్తున్నవారిని తప్పు పట్టడం లేదు. కానీ గ్లామర్ షో చేస్తేనే స్టార్ హోదా వస్తుందనుకోవడంలో నిజం లేదని సాయి పల్లవి నిరూపించింది.అయితే సాయి పల్లవి మొదటి నుంచి పొట్టి దుస్తులకు వ్యతిరేకం కాదు. కానీ ఆమె తెరపై అలాంటి డ్రెస్సుల్లో కనిపించకపోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. గతంలో ఓ సారి పొట్టి దుస్తులతో టాంగో డ్యాన్స్ చేసిందట. ప్రేమమ్ సినిమా తర్వాత ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అయిందట. అయితే అందులో అందరూ తన ప్రదర్శనను చూడకుండా.. డ్రెస్సింగ్‌పై విమర్శలు చేశారట. నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ చూసి తనకే ఎలాగో అనిపించి.. ఇకపై పొట్టి దుస్తులు ధరించ కూడదని నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సాయి పల్లవి. అంతేకాదు ఎంత పెద్ద సినిమా అయినా సరే.. అసౌకర్యంగా ఉండే దుస్తులు ధరించకూడదని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చింది.సినిమా విషయాలకొస్తే.. ఇటీవలే తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రామాయణంలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. దీంతో పాటు శివకార్తికేయన్‌తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. -
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సీక్వెల్స్ సందడి చేస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే అదే లైన్‌తో వరుసగా 2, 3 తీయడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోతోంది. అయితే ఇప్పటి దాకా సీక్వెల్స్ అంటే 2 లేదా 3కే పరిమితం కాగా...ఓ సినిమా మాత్రం పెద్ద ఎత్తున సీక్వెల్స్‌తో కొత్త ట్రెండ్‌ని సెట్ చేయనుంది. ఆ సినిమా పేరు హిట్.నేచురల్ స్టార్ నాని నిర్మాణ బాధ్యతలు పంచుకుని శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్లు రెండూ కమర్షియల్ గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే హిట్ 3 (HIT 3) కూడా రానున్న సంగతి మనకి తెలుసు. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.నిజానికి హిట్ ‘హిట్ 2’లో నాని కనిపించినట్టే హిట్ 3లో హీరో అడివి శేష్, విశ్వక్సేన్ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్ మాత్రం స్పెషల్ రోల్ చేస్తున్నాడు కానీ, విశ్వక్సేన్ మాత్రం లేకపోవడానికి కారణం...నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి విశ్వక్ సేన్ సుముఖుత వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో అతని రిఫరెన్స్ ను మాత్రమే తీసుకుంటారట. అయితే హిట్ 2లో చేసినట్టే... క్లైమాక్స్ లో ‘హిట్ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్ చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బాలకృష్ణ ‘హిట్ 4’లో హీరో గా చేయనున్నారంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. కారణమేమో గానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు చిరపరిచితమైన తమిళ హీరో కార్తీ ‘హిట్ 4’ లో హీరోగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రివీల్ చేసే విధంగా ‘హిట్ 3’ లో కార్తీ కామియో ఉంటుందని సమాచారం. అయితే ఈ విశేషాలను టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుందా? లేక సర్ప్రైజ్ కోసం సీక్రెసీ మెయిన్టైన్ చేస్తుందా? చూడాలి. -
దేవర 2, అదుర్స్ 2 చిత్రాలపై ఎన్టీఆర్ క్లారిటీ.. ఫ్యాన్స్‌కి పండగే!
‘‘షూటింగ్‌కి వెళ్లి కెమేరా ముందు నిల్చున్న ప్రతిసారీ నాకు వణుకు వస్తుంటుంది. అలాగే మీ ముందు (ఫ్యాన్స్) మాట్లాడాలన్నా... (నవ్వుతూ). ఒక నటుడికి వినోదం పండించడం అనేది చాలా కష్టం. అందుకే నేను ‘అదుర్స్ 2’ చేయడానికి కాస్త భయపడుతున్నాను. మళ్లీ జీవితంలో అలాంటి కామెడీ మూవీ వస్తుందో లేదో’’ అని హీరో ఎన్టీఆర్(Jr NTR) అన్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, ‘సత్యం’ రాజేశ్, కార్తికేయ, విష్ణు, ప్రియాంకా జవాల్కర్, రెబ్బా మోనికా జాన్ (స్పెషల్ సాంగ్) ఇతర పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్‌మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘అభిమాన సోదరులకు పేరు పేరునా కృతజ్ఞతలు. చాలా కాలమైంది మనం కలుసుకుని. నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. ఎన్ని బాధలు, కష్టాలు ఉన్నా మనల్ని నవ్వించే మనిషి ఉంటే చాలు కదా అనిపిస్తుంది. ఈ రోజు దర్శకుడు కల్యాణ్ శంకర్ మనకి దొరికాడు. ‘మ్యాడ్ స్క్వేర్’తో మళ్లీ సక్సెస్ కొట్టిన కల్యాణ్‌కి అభినందనలు. ఓ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో జనాలని రంజింపచేయడం చాలా కష్టం. కానీ మీరు సాధించారు. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. ఈ మూవీలో మురళీధర్గారు అద్భుతంగా నటించారు. లడ్డు పాత్ర చేసిన విష్ణు లేకుంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కాదేమో? అనిపించింది. డైరెక్టర్ శోభన్‌గారి అబ్బాయిలు సంతోష్, సంగీత్‌లను చూస్తే ఆయన గుర్తొస్తారు. మనకి బాగా ఇష్టమైన వాళ్లు మనకి దూరమైనా మన చుట్టూనే ఉంటారు. మీ నాన్నగారు కూడా గర్వపడుతుంటారు. ‘మ్యాడ్’లో రామ్ నితిన్‌ని చూస్తే నేను యంగ్‌గా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నారు. నాకు 2011లో పెళ్లయింది. నార్నే నితిన్ అప్పుడు చాలా చిన్నపిల్లాడు. నాతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కానీ, ధైర్యం చేసి నా వద్దకు వచ్చి నాతో చెప్పిన ఒకే ఒక్క మాట ‘బావా... నేను యాక్టర్ అవుతాను’ అని.. అంతే ధైర్యంగా నేను ‘నా సపోర్ట్ నీకు ఉండదు... పోయి చావ్ అన్నాను’. కానీ, ఇండస్ట్రీలో తన కెరీర్ ఎలా ఉండబోతోంది? అనే భయం ఉండేది. నీకు నువ్వుగా ముందుకెళ్లు అన్నాను. తనే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లాడు. ఈ రోజు తనని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సునీల్ లేకపోతే ‘మ్యాడ్ స్క్వేర్’ లేదు. సంగీత దర్శకుడు భీమ్స్, రచయిత కాసర్ల శ్యామ్‌తో పాటు ఈ సినిమాకి పని చేసిన అందరికీ అభినందనలు. వీళ్లందరి వెనకాల కనపడని ఓ శక్తే మా చినబాబు. త్వరలోనే మేం ఓ సినిమా చేయబోతున్నాం. ఇక ‘దేవర’ చిత్రాన్ని ఆదరించినందుకు, మీ (ఫ్యాన్స్) భుజాలపైన మోసినందుకు ధన్యవాదాలు. ‘దేవర 2’ (Devara 2) కచ్చితంగా ఉంటుంది. కాకపోతే మధ్యలో ప్రశాంత్ నీల్గారు వచ్చారు. నేను ఫ్యాన్స్ కోసమే కష్టపడుతుంటాను. మిమ్మల్ని ఆనందపరచడానికే బతికుంటాను. మీరెప్పుడూ కాలర్ ఎత్తుకునేలాగే ప్రయత్నిస్తాను.. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు.. కానీ మీకోసం కష్టపడుతూనే ఉంటాను’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్. నేను వచ్చినప్పటి నుంచి ‘జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్’ అనే స్లోగన్స్ చూస్తుంటే... జేఏఐఎన్టి... జెయింట్ గుర్తొస్తోంది. సో.. ఎన్టీఆర్ జెయింట్’’ అన్నారు. ఈ వేడుకలో ‘మ్యాడ్ స్క్వేర్’ నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులకు షీల్డ్‌లు ప్రదానం చేశారు. -
‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో తీసిన ఓ లవ్ థ్రిల్లర్ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసాడు. అప్పుడెప్పుడో తెరకెక్కిన 28 డిగ్రీస్ సెల్సియస్ (28°C) అనే సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజయింది. పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ?ముందునుంచే ఈ సినిమాని ఆరేళ్ళ క్రితం సినిమా అని ప్రమోట్ చేసారు. దీంతో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మంచిది. ఇప్పుడంటే థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ ఆరేళ్ళ క్రితం ఒక లవ్ స్టోరీతో థ్రిల్లర్ తీయడం కొత్తే. ఒక మనిషికి ఏదో హెల్త్ సమస్య ఉండటం అనుకోకుండా వాళ్ళు చనిపోవడం, వాళ్ళు చనిపోయాక ఎలా చనిపోయారు అని థ్రిల్లింగ్ గా సాగే సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా అదే కోవలో థ్రిల్లింగ్ తో పాటు కాస్త హారర్ అనుభవం కూడా ఇస్తుంది(28 Degree Celsius Movie Review).ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతోనే సాగుతుంది. లవ్ స్టోరీ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. లవ్ సీన్స్, డైలాగ్స్ రొటీన్ అనిపిస్తాయి. హీరోయిన్ కి ఆరోగ్య సమస్య ఉందని తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ హాఫ్ ఏంటి అని ఇంట్రెస్ట్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం హారర్ థ్రిల్లర్ లా ఆసక్తిగా చూపించి కాస్త భయపెడతారు కూడా. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ ట్రై చేసినా అంతగా పండలేదు.ఎవరెలా చేసారంటే..? నవీన్ చంద్ర ప్రేమ కథలో, భార్య చనిపోతే బాధపడే పాత్రలో బాగా నటించాడు. షాలినీ వడ్నికట్టి అందాల ఆరబోతకు దూరంగా ఉండి సింపుల్ గా పద్దతిగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. ప్రియదర్శి, వైవా హర్ష నవ్వించే ప్రయత్నం చేసారు. దేవియాని శర్మ తన పాత్రలో బాగా మెప్పిస్తుంది. సంతోషి శర్మ, అభయ్, రాజా రవీంద్ర మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు. శ్రీచరణ్ పాకాల మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. లవ్ స్టోరీ రొటీన్ అనిపించినా థ్రిల్లింగ్ పార్ట్ మాత్రం బాగా రాసుకొని తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్. నిర్మాణ పరంగా అప్పట్లోనే ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.టైటిల్ : 28°Cనటీనటులు: నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, దేవియని శర్మ, ప్రియదర్శి, వైవా హర్ష, సంతోషి శర్మ.. తదితరులునిర్మాణ సంస్థలు: వీరాంజనేయ ప్రొడక్షన్స్నిర్మాతలు: సాయి అభిషేక్ఎడిటింగ్: గ్యారీ BHదర్శకత్వం, కథ: డా. అనిల్ విశ్వనాధ్ సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశి పచ్చిపులుసు విడుదల: ఏప్రిల్ 04, 2025 -
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
ఆర్జీవి డెన్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘శారీ’(Saaree Movie Review ). ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. నేడు(ఏప్రిల్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘నాకు నచ్చినట్లుగా సినిమా తీస్తా.. ఇష్టం అయితే చూడండి లేదంటే వదిలేయండి’ అని డైరెక్ట్‌గా చెప్పే ఏకైక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్‌ని క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా తీయడం లేదు. గత కొన్నాళ్లుగా ఆర్జీవీ డెన్ నుంచి వచ్చే చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. మరి ‘శారీ’ అయినా ఆడుతుందా అంటే.. ‘సారీ’ అనక తప్పదు. అయితే ఇటీవల ఆర్జీవి నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే.. ఇది కాస్త బెటర్ అనే చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలిసారి ఆర్జీవి తన చిత్రంతో ఓ సందేశం అందించాడు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు.. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ చిత్రంలో చూపించారు. అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలోనే ఆరాధ్యను ఎంత అందంగా చూపించాలి అనే దానిపైనే ఎక్కువ పెట్టాడు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అనేలా సినిమాను తెరకెక్కించారు. ఆర్జీవి గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ అది వర్కౌట్ కాలేదు.(Saaree Movie Review ) తెరపై ఆరాధ్యను చూసి ఒకనొక దశలో చిరాకు కలుగుతుంది. సత్య యాదు పాత్ర కూడా అంతే. ప్రతిసారి ఫోటో తీయడం.. చీరలో ఆరాధ్యను ఊహించుకోవడం.. ఓ పాట.. ఫస్టాఫ్ అంతా ఇలానే సాగుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సైకో చేసే పనులు పాత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. కిడ్నాప్ తర్వాత ఆరాధ్య, సత్య యాదుల మధ్య వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కథంతా అక్కడక్కడే తిప్పుతూ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. మితీమీరిన వయోలెన్స్‌ని పెట్టి భయపెట్టె ప్రయత్నం చేశారు. అంతకు మించి కథ-కథనంలో కొత్తదనం ఏమి లేదు. ఆర్జీవి నుంచి అది ఆశించడం కూడా తప్పే సుమా..!ఎవరెలా చేశారంటే.. శారీ సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే శారీలో ఆరాధ్య అదరగొట్టేసింది. వర్మ మెచ్చిన నటి కాబట్టి.. ఆయనకు ‘కావాల్సినట్లుగా’ తెరపై కనిపించి కనువిందు చేసింది. యాక్టింప్ పరంగానూ పర్వాలేదనిపించింది. ఇక సైకో కిట్టుగా సత్య యాదు అదరగొట్టేశాడు. ఒకనొక దశలో తన నటనతో భయపెట్టేశాడు. మిగిలిన నటీనటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శశిప్రీతమ్ రీరికార్డింగ్ కొన్ని చోట్ల మోతాదును మించి పోయింది. పాటలు అంతగా గుర్తుండవు. శబరి సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఆరాధ్యను అందంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. ఆర్జీవీ సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉండడు. రెండు మూడు పాత్రలు, ఒక ఇళ్లు చాలు.. సినిమాను చుట్టేస్తాడు. ఈ సినిమా కూడా అలానే ఉంది. పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ సినిమాను ఉన్నంతలో రిచ్‌గానే తీర్చిదిద్దారు. -
హృదయాలను హత్తుకునేలా ‘‘అనగా అనగా కథలా’ పాట
సత్య రాజ్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న భారీ చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’. ఈ మూవీకి దర్శకుడు మోహన్ శ్రీవత్స. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్లు అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా మరో ఫీల్ గుడ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.అనగా అనగా కథలా అంటూ సాగే ఈ పాటను టీకేఆర్ కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో బుధవారం నాడు కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ పాటను కార్తిక్ ఆలపించారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ అందించిన హృద్యమైన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక సనరే రాసిన సాహిత్యంతో తాతయ్య అనే ఎమోషన్, మనవరాలితో తాతయ్యకు ఉండే అనుబంధాన్ని చక్కగా వివరించారు.పాటను రిలీజ్ సందర్భంగా సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘టీకేఆర్ కాలేజ్‌లోని విద్యార్థుల ఉత్సాహం, ఎనర్జీ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇలా పద్నాలుగు వేల మంది విద్యార్థుల సమక్షంలో పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా పాటను విడుదల చేసిన తీగల కృష్ణారెడ్డి గారికి.. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన హరనాథ్ రెడ్డి గారికి, అమర్ నాథ్ రెడ్డి గారికి థాంక్స్. త్రిబాణధారి బార్భరిక్ చిత్రంలోని 'అనగా అనగా కథలా' పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ .. ‘నా మొదటి హీరో సత్య రాజ్ గారు అవ్వడం నా అదృష్టం. 170 చిత్రాల్లో హీరోగా చేసిన సత్య రాజ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రంలోని పాటను ఈ కాలేజీలో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. పాటను విడుదల చేసేందుకు సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి థాంక్స్. మా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని అన్నారు. -
‘డియర్ ఉమ’ వచ్చేస్తోంది
ప్రస్తుతం ప్రేక్షకులు సాధారణ ఫార్మాట్లో వచ్చే చిత్రాల కంటే విభిన్న కంటెంట్, కొత్త కాన్సెప్ట్‌లతో రూపొందిన సినిమాలను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే, వినూత్నమైన కథాంశంతో ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘డియర్ ఉమ’ (Dear Uma) చిత్రం తెరకెక్కింది. తెలుగమ్మాయి సుమయ రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్గా నటించడమే కాకుండా, నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బహుముఖ ప్రతిభ కలిగిన సుమయ రెడ్డి, సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు.నిర్మాణ బాధ్యతలను సుమయ రెడ్డి నిర్వహించగా, నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. సాయి రాజేష్ మహాదేవ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు రాసి, దర్శకత్వం వహించారు. అనేక విజయవంతమైన చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన రదన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.ఇప్పటివరకూ ‘డియర్ ఉమ’ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచాయి. వీటిని బట్టి చూస్తే, ఇది ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది. ఈ ప్రేమకథను ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ అందమైన సందేశంతో పాటు అధిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందింది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా వంటి అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తయారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. -
నితిన్‌తో లిప్‌లాక్ చేయలేనన్న నటి..ఇప్పుడేమో గ్లామర్ షోకి సై!
నటీనటులు ట్రెండ్‌కు తగ్గట్లు మారాలి. అప్పుడే వరుస అవకాశాలు వస్తాయి. అలా కాదని పరిమితులు విధిస్తే అక్కడే ఆగిపోతారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకుంది కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఒకప్పుడు స్కిన్ షోకి దూరంగా ఉన్న కీర్తి..ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఎక్స్ఫోజింగ్కి తాను కూడా రెడీ అంటోంది. సర్కార్ వారి పాట సినిమాతోనే తనలోని గ్లామర్ యాంగిల్‌ని పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి.బాలీవుడ్ నుంచి కూడా పిలుపొచ్చింది. ఆమె నటించిన తొలి హిందీ సినిమా 'బేబీ జాన్'లో రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఆ సీన్లకు ఎస్ చెప్పడంతోనే కీర్తికి ఆ చాన్స్ వచ్చిందట. అయితే ఇంతకంటే తక్కువ రొమాన్స్ ఉన్న పాత్రలను సైతం ఒకప్పుడు కీర్తి రిజెక్ట్ చేసిందట.లిప్‌లాక్ సీన్ ఉందని నితిన్ ‘మ్యాస్ట్రో’ని వదులుకుందట. ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్గా కీర్తినే అనుకున్నారు. కథ మొత్తం విని లిప్‌లాక్ సీన్ ఉందని, అలాంటి సన్నివేశాల్లో నటించలేనని చెప్పిందట. ఇది నాలుగేళ్ల కిందటి మాట. అదే ఇప్పుడు అయితే కీర్తి లిప్‌లాక్ సీన్‌కి నో చెప్పేది కాదేమో. అప్పుడే ఇలాంటి సీన్లకు రెడీ అని చెబితే..ఆమె ఖాతాలో చాలా సినిమాలు చేరేవి. రెమ్యునరేషన్ కూడా బాగానే పెరిగేది. ఏది ఏమైనా మహానటిలో మార్పు వచ్చింది. పోటీ ప్రపంచంలోనే కొనసాగాలంటే స్కిన్ షో చేయాల్సిందేనని రియలైజ్ అయినట్లు ఉంది. ఇప్పుడైనా వరుస అవకాశాలు వచ్చి మళ్లీ బిజియెస్ట్ హీరోయిన్గా మారుతుందేమో చూడాలి. -
తమన్నాలా నేనెప్పుడు చేయలేదు: హెబ్బా పటేల్
‘ఓదెల రైల్వే స్టేషన్ లాక్ డౌన్ టైం లో చేసిన సినిమా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయంలో సంపత్ నంది గారు అండ్ టీం ధైర్యంగా ముందుకు వచ్చి ఓదెల చేయడం జరిగింది. నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ అవుతుందని నేను అనుకోలేదు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. మేము ఊహించిన దాని కంటే గొప్ప విజయం దక్కింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బావుందని మెచ్చుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ వస్తుందని నేను ఊహించలేదు’ అని హెబ్బా పటేల్(Hebah Patel) అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట సింహా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హెబ్బా పటేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఓదెల 2 (Odela 2 Movie) సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల2 చాలా పెద్ద సినిమా. చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.⇢ ఇందులో తమన్నా గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను నా సిస్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్స్ లో కనిపిస్తాను. ఫస్ట్ పార్ట్ లో నా క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఈ సెకండ్ పార్ట్ లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ⇢ తమన్నా గారు ప్రతి క్యారెక్టర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఒక క్యారెక్టర్ కోసం ఆమె ప్రిపేర్ అయ్యే విధానం నాకు చాలా నచ్చింది. ఓదెల2 కోసం చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. నిజానికి ఓదెల సినిమా చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ గురించి నేను ముందుగా ఏం ప్రిపేర్ కాలేదు. తమన్నా గారిలా హోంవర్క్ నేనెప్పుడూ చేయలేదు. ఫ్యూచర్లో అలాంటి హోంవర్క్ చేయాలని నేర్చుకున్నాను.⇢ సంపత్ గారు విజనరీ ఫిలిం మేకర్. ఆయన ఫస్ట్ ఓదెల కథలో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది. అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ నేను చేయగలనా? అనిపించింది. అయితే సంపత్ గారు ప్రయత్నించమని చెప్పారు. ఆయన నాపై అలాంటి నమ్మకాన్ని ఉంచడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నమ్మకం నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సంపత్ గారు చాలా నైస్, కైండ్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.⇢ కుమారి 21ఎఫ్ సినిమా నాకు ఒక ఫేమ్ తీసుకొచ్చింది. ఓదెల సినిమా యాక్టర్ గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది. నేను అన్ని రకాల పాత్రలు చేయగలనని నమ్మకాన్ని కల్పించింది. ఒక నటిగా ఓదెల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.⇢ అజినీస్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. ఆయన మ్యూజిక్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. బ్యాగ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ కి కావాల్సిన పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ⇢ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం ఆనందంగానే ఉంది. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే ఒక నటిగా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. సక్సెస్ ఫెయిల్యూర్ ఏది ఫైనల్ కాదు. పనిచేసుకుంటూ వెళ్లడమే మన చేతిలో ఉంది. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. మరో 10 ఏళ్లు నటిగా ప్రయాణిస్తానని నమ్మకం ఉంది.⇢ ఇప్పటివరకు చాలా జోనర్స్ సినిమాలు ట్రై చేశాను. ఒక ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా అవుతున్నాయి. ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ స్టార్ట్ కాబోతుంది. -
ఓటీటీ ఆఫర్స్ రాలేదు..ఇది అది మార్చు అని ఇబ్బంది పెట్టారు: నవీన్ చంద్ర
ఏ హీరోకైనా సక్సెస్, ఒక మార్కెట్ ఉండాలి. లేకుంటా ఆయన సినిమాల రిలీజ్ లకు ఇబ్బందులు తప్పవు. ఆరేళ్ల క్రితం నా సినిమాలు సరిగా ఆడకపోవడం వల్ల అప్పుడు నటించిన ‘28°C’ మూవీకి బిజినెస్ జరగలేదు. ప్పటికి థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇంతగా లేవు. ఇది లవ్ అండ్ థ్రిల్లర్ కాబట్టి సినిమా ఎవరికి చూపించినా కొన్ని ఛేంజెస్ చెప్పేవారు. సినిమాలో అది మార్చు ఇది మార్చు అని డైరెక్టర్ గారిని చాలా ఇబ్బంది పెట్టారు. ఓటీటీల్లో కూడా సరైన ఆఫర్స్ రాలేదు.పొలిమేర సక్సెస్ తర్వాత ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు "28°C" సినిమా చూసి ఇంత మంచి ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చారు. "28°C" థియేటర్ లోనే కాదు రేపు టీవీ, ఓటీటీ ఏ వేదిక మీద రిలీజైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు యంగ్ హీరో నవీన్ చంద్ర అన్నారు. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "28°C". ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవీన్‌చంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయ్యింది. ఒకరోజు రెస్టారెంట్ లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్ గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. వినగానే ఈ కథ కొత్తగా ఉందని అనిపించింది. అప్పటికి నాపై అందాల రాక్షసి మూవీ ఎఫెక్ట్ చాలా ఉండేది. ఆ మూవీ తర్వాత కొన్ని వేరే జానర్ మూవీస్ చేసినా లవ్ స్టోరీ మూవీస్ లో ఎక్కువ ఆఫర్స్ వచ్చేవి. "28°C" సినిమాను బిగిన్ చేశాం. ఆ మూవీలో నేను తప్ప మిగతా అంతా కొత్త వాళ్లే. ఫస్ట్ డే షూటింగ్ తర్వాత డైరెక్టర్ అనిల్ మూవీని బాగా తెరకెక్కించగలడనే నమ్మకం ఏర్పడింది.→ "28°C" సినిమా రెండు ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి వైజాగ్, రెండోది జార్జియా. ఫస్ట్ అమెరికా అనుకున్నాం కానీ ఆ టైమ్ లో విదేశీ ఆర్టిస్టులకు ఎంట్రీ కష్టంగా ఉండేది. జార్జియా వెళ్లినప్పుడు కూడా రెండుసార్లు రిజెక్ట్ అయి వెనక్కి వచ్చాం. ఆ తర్వాత లోకల్ గా ఈ వార్త బాగా ప్రచారం కావడంతో మళ్లీ చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చారు.→ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సమస్య ఉంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అప్పుడు కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరు డాక్టర్స్ గా సెటిల్ అవుతారు. అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్ లోనే చూసుకోవాలి. ఇలా నిజంగా ఎవరికీ జరగదు. పుస్తకాల్లో ఉన్న ఒక థియరీని తీసుకుని దాన్ని సినిమాటిక్ గా మలిచారు మా డైరక్టర్. డాక్టర్ కాబట్టి అనిల్ విశ్వనాథ్ సినిమాలో మెడికల్ టర్మ్స్ చాలా డీటెయిల్డ్ గా రాశారు.→ కోవిడ్ తర్వాత థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ ఎక్కువయ్యాయి. మూవీస్ లో హింస పెరిగింది. సొసైటీలో కూడా హింస పెరిగింది. ఎక్కడ చూసినా క్రైమ్ న్యూస్ వింటూనే ఉన్నాం. సినిమాల్లోనూ అలాంటి క్రైమ్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను హీరోగా చేసే సినిమాలకు ప్రొడక్షన్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అని చూసుకుంటున్నాను. క్యారెక్టర్స్ చేస్తే అది లైఫ్ లీడ్ చేయడానికి, కొంత డబ్బు సంపాదించడానికి, నా క్రాఫ్ట్ ను కెరీర్ ను లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నా.→ అరవింద సమేత వీర రాఘవలో నేను చేసిన క్యారెక్టర్ కు చాలా మంచి పేరొచ్చింది. నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యానర్ లో రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర చిత్రంలో ఓ సరికొత్త క్యారెక్టర్ లో నన్ను చూస్తారు. గేమ్ ఛేంజర్ లో ఉండిపోవడం వల్ల సూర్య రెట్రో మూవీలో మెయిన్ విలన్ గా నటించే అవకాశం మిస్ అయ్యింది. ఇప్పుడు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో షో టైమ్ తో పాటు 11 అనే మరో మూవీ ఉంది. నాకు బాగా పేరు తెచ్చిన ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది. -
అందుకే పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టాం: నితిన్-భరత్
‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) సినిమా ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి సరదాగా నవ్వుకుంటూ చూసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్స్ నితిన్–భరత్ చెప్పారు. ప్రదీప్ మాచిరాజు(pradeep Machiraju), దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మాంక్స్– మంకీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నితిన్, భరత్ మాట్లాడుతూ– ‘‘ప్రదీప్‌గారి ఫస్ట్ సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. అప్పుడే ఆయనతో సినిమా తీయాలనుకున్నాం. అలా మేం చెప్పిన కథ ప్రదీప్‌కి నచ్చడంతో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ఆరంభమైంది. ఇది పవన్ కల్యాణ్ గారి సినిమా టైటిల్. కచ్చితంగా పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతుందని అనుకున్నాం. అలాగే కాన్సెప్ట్ కూడా టైటిల్‌కి యాప్ట్‌గా ఉండడం వల్లే పవన్ కల్యాణ్ గారి టైటిల్ తీసుకోవడం జరిగింది. రొమాంటిక్ ఎంటర్టైనర్లా రూపొందిన ఈ సినిమాలో వినోదం సందర్భానుసారంగా, ఆర్గానిక్‌గా ఉంటుంది. తెలుగు అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుని, ఆడిషన్స్ చేసి, దీపికని తీసుకున్నాం. ప్రదీప్‌గారి ఫ్రెండ్స్ ఈ మూవీ నిర్మించారు. రథన్గారి అద్భుతమైన సంగీతం, బాల్ రెడ్డిగారి విజువల్స్ ఆకట్టుకుంటాయి. మా సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌కి నచ్చడంతో విడుదల చేస్తున్నారు’’ అన్నారు. -
మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు
‘‘34 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఆదిత్య 369’ (Aditya 369 Movie) రీ రిలీజ్ కావడం అద్భుతమైన అనుభూతి. ఈ సినిమాని ఇప్పుడు తీసుంటే బాగుండేది అనిపించిన క్షణాలు ఉన్నాయి. శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నేటి టెక్నాలజీతో కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ చేసి రీ రిలీజ్ చేస్తుంటే... ప్రేక్షకులకే కాదు.. నాలాంటి వాళ్లకి కూడా సినిమా చూడాలనిపిస్తుంది. ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్’’ అని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa) పేర్కొన్నారు. బాలకృష్ణ, మోహిని జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఆదిత్య 369’ సీక్వెల్‌కి కథ సిద్ధం చేశాం. ఈ మూవీ ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు బాలకృష్ణ. ఈ మూవీని ప్రకటించినప్పటికీ కుదరల్లేదు. కానీ, ఆయన మాత్రం ఎప్పటికైనా సీక్వెల్ చేయాలని అంటుంటారు. అది ఎప్పుడు అవుతుందన్నది దైవ నిర్ణయం. ఇక నేను కాలేజీలో చదువుతున్నప్పుడు హెచ్. జి. వెల్స్ రచించిన ‘ది టైమ్ మిషన్’ నవల ఆధారంగా ‘ఆదిత్య 369’ తీశాను. ఈ కథలో లీనమై సంగీతం అందించారు ఇళయరాజా. పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్.. ఇలా ముగ్గురు కెమేరామెన్లు పని చేయడం దైవ నిర్ణయం. పేకేటి రంగాగారు శ్రీకృష్ణ దేవరాయలవారి సెట్‌ని, టైమ్ మెషిన్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు’’ అని తెలిపారు. -
రాత్రికి రాత్రే బుల్డోజర్లు.. అసలేం జరుగుతుంది?: రష్మిక
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో 400 ఎకరాల భూ వివాదంపై స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna ) స్పందించారు. ఈ విషయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. "రాత్రికి రాత్రే బుల్డోజర్లు. విద్యార్థుల అరెస్టులు. హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో నిజంగా ఏమి జరుగుతోంది?" అంటూ ఆమె ప్రశ్నించారు.ఈ వివాదం గత కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాల్చింది. విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఐటీ పార్క్ నిర్మాణం కోసం వేలం వేయాలని ప్రతిపాదించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తాజాగా రాజకీయ పార్టీలు తోడవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. (చదవండి: హార్డ్ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్.. బాధగా ఉందన్న సమంత!)400 ఎకరాల స్థలంలో పచ్చని చెట్లను నరికివేయడంతో, ఆ అడవిపై ఆధారపడిన మూగజీవుల జీవనాధారం కోల్పోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా, జీవవైవిధ్యానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నిరసనకు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా మద్దతు ఇస్త్ననారు. స్టార్ హీరోయిన్ సమంత, నాగ్ అశ్విన్, నటి రేణూ దేశాయ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. -
హార్ట్ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్.. బాధగా ఉందన్న సమంత!
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం నేపథ్యంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనలకు దిగడం..వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయడంతొ ఈ వివాదం ఇంకాస్త పెద్దదైంది. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదంతా పక్కకి పెడితే ప్రకృతి ప్రేమికులు మాత్రం 400 ఎకరాల్లో ఉన్న చెట్లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు.(చదవండి: 'రేపోమాపో నేను చనిపోతాను.. తల్లిగా అడుక్కుంటున్నా..', 'మూగజీవాల్ని ఏం చేస్తారు?')సినీ ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే సినీ నటి రేణు దేశాయ్, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, యాంకర్ రష్మి తదితరులు ఈ వివాదంపై స్పందిస్తూ.. చెట్లను, జంతువులను కాపాడుకోవాలని కోరారు. ఇక తాజాగా ప్రముఖ హీరోయిన్ సమంత, యాంకర్, నటి అనసూయ సైతం ఈ వివాదంపై స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల కథనంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలంగాణ టుడేలో వచ్చిన ఆర్టికల్‌ని పోస్ట్ చేసిన సమంత..బులడోజర్స్ తో 400ఎకరాల్లో చెట్లను నరకటం చాలా బాధగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయని.. అడవుల్ని నరుక్కుంటూ పోతే.. ఇప్పటికే ఉన్న దానికంటే.. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అటవీ జంతువులు, పక్షులను కాపాడండి అని నినాదం ఇచ్చింది.ఇక సోషల్ మీడియా సంచలనం అనసూయ సైతం ఈ వివాదంపై ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. హెచ్‌సీయూ క్యాంపస్‌లోని రాత్రి పూట వీడియోలు, జింకలు, ఇతర మూగజీవాలు సేద తీరుతున్న వీడియోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ..ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ రాసుకొచ్చింది. -
తెలుగులో ‘కరాటే కిడ్: లెజెండ్స్’.. ట్రైలర్ రిలీజ్
ఇండియాలో అత్యంత ప్రాచుర్య పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన కరాటే కిడ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త భాగం కరాటే కిడ్: లెజెండ్స్(Karate Kid: Legendత) కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కరాటే కిడ్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు లేని విధంగా, ఈ ఆరవ భాగంలో రెండు ఐకానిక్ పాత్రలు — జాకీ చాన్ (Mr. Han) మరియు రాల్ఫ్ మాకియో (Daniel LaRusso) కలిసి తొలిసారి స్క్రీన్‌పై కనిపించనున్నారు. ట్రైలర్లో ఆ పాత్ర కు వారు కష్టపడిన విధానం, వారి శిక్షణ, మిస్టర్ మియాగీ లెగసీకి ఘన నివాళిని కూడా అందించడం మీరు ఈ ట్రైలర్లో చూశారు.ఈ కథ లీ ఫాంగ్ (బెన్ వాంగ్) అనే కుంగ్ ఫూ ప్రతిభావంతుడిని కేంద్రంగా సాగుతుంది. అతడు తన తల్లితో కలిసి న్యూయార్క్ నగరానికి వచ్చి ఓ ప్రసిద్ధ పాఠశాలలో చేరతాడు. అక్కడ ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక లోకల్ కరాటే చాంపియన్‌తో గొడవలు మొదలవ్వడం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.తనను తానే రక్షించుకోవాలనే ఉద్దేశంతో, లీ ఫాంగ్ కుంగ్ ఫూ గురువు మిస్టర్ హాన్ మరియు లెజెండరీ కరాటే కిడ్ డేనియల్ లారూసోల నుంచి శిక్షణ తీసుకుంటాడు. ఇద్దరి శైలి మిళితంతో అతడు ఓ అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ పోరుకు సిద్ధమవుతాడు. ఈ ఏపిసోడ్ అందర్ని ఎంతో అలరించే విధంగా ఉంటుంది. జొనథన్ ఎన్‌ట్‌విసిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాకీ చాన్, రాల్ఫ్ మాకియో, బెన్ వాంగ్, జోషువా జాక్సన్, సేడీ స్టాన్లీ, మరియు మింగ్-నా వెన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
విగ్ కూడా పెట్టుకోరు.. రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) బయట ఎంత సింపుల్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎక్కువగా తెల్ల పంచె, షర్ట్ ధరించే కనిపిస్తాడు. సినిమా ఈవెంట్స్‌కి కూడా అలానే వెళ్తాడు. అవసరం అయితే తప్ప మేకప్ వేసుకోరు. ఆయన సినిమాలను అభిమానించే వాళ్లు ఎంత మంది ఉన్నారో..ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వాళ్లుకూడా అంతే ఉన్నారు. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ..రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా(Mukesh Khanna) ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ హీరోలలో ఎంతో మందికంటే రజనీకాంత్ చాలా గొప్పవాడని, రియల్ హీరో అంటే ఆయనేనని పొగడ్తలతో ముంచేశాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు రజనీకాంత్‌ని వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు కూడా మేకప్ వేసుకోరు. కనీసం విగ్గు కూడా ధరించడు. ఫ్యాన్స్‌తో ఓ సామాన్య వ్యక్తిలాగే ప్రవర్తిస్తాడు.బాలీవుడ్ హీరోల్లో ఎవరూ కూడా రజనీకాంత్‌లా ఉండలేరు. మేకప్ లేకుండా వాళ్లు బయట తిరగలేరు. వాళ్లతో పోలిస్తే రజనీకాంత్ చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన రియల్ హీరో’ అని మేకేష్ చెప్పుకొచ్చాడు. తన సినీ కెరీర్ గురించి చెబుతూ.. డైలాగులు లేని కారణంగా చాలా పెద్ద సినిమాలు వదులుకున్నానని చెప్పారు. విలన్‌గా చేయడం ఇష్టంలేక సినిమాలను దూరం పెట్టానని చెప్పారు. ‘మహాభారతం’ సీరియల్లో మొదట దుర్యోధనుడి పాత్ర ఇస్తే నో చెప్పానని, ఆ తర్వాత భీష్ముడి పాత్ర వచ్చిందని చెప్పారు. బాలీవుడ్ హీరోలపై ముకేశ్ ఖన్నా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి."రూహీ"(1981) చిత్రంలో ముకేశ్ ఖన్నా తన సినీ కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత అతను "వక్త్ కీ దీవార్" (1981), "దర్ద్ కా రిష్తా" (1982) వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాడు. 1980లలో అతను అనేక హిందీ చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించాడు, కానీ అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. 1997లో దూరదర్శన్‌లో ప్రసారమైన "శక్తిమాన్" అనే టెలివిజన్ సీరియల్‌తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్లో అతను శక్తిమాన్ అనే సూపర్‌హీరో పాత్రను పోషించాడు. ఈ పాత్ర అతన్ని ఇంటింటికీ చేర్చింది, ముఖ్యంగా పిల్లల్లో అతను అత్యంత ప్రజాదరణ పొందాడు. "శక్తిమాన్" సీరియల్‌ను అతను స్వయంగా నిర్మించడం విశేషం.‘మహాభారతం’ లో పోషించిన భీష్మ పాత్ర అతన్ని భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపింది. నటనతో పాటు నిర్మాణం మరియు దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చాటిన ముకేష్ ఖన్నా, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. -
నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చలనచిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. యానిమల్, పుష్ప 2: ద రూల్, ఛావా.. ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుని బాక్సాఫీస్ క్వీన్‌గానూ మారింది. అయితే రంజాన్ పండక్కి రిలీజైన హిందీ సినిమా సికందర్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.నా విషయంలో నిజం కాదుఅయితేనేం.. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. మరో మూడు రోజుల్లో రష్మిక మందన్నా బర్త్‌డే (ఏప్రిల్ 4). ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఇది నా బర్త్‌డే మంత్.. చాలా ఎగ్జయిట్‌గా ఉన్నాను. వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్న ఆసక్తి సన్నగిల్లుతుందని విన్నాను.నమ్మబుద్ధి కావట్లేకానీ నా విషయంలో మాత్రం అది నిజం కాదు. ఏ యేటికాయేడు నా బర్త్‌డే జరుపుకునేందుకు మరింత సంతోషంగా, ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అప్పుడే నాకు 29 ఏళ్లు వచ్చేస్తున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. గడిచిన ఏడాదిలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. అందుకోసమైనా ఈ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే!' అని రాసుకొచ్చింది.చదవండి: హెచ్‌సీయూ వివాదం.. నేనెలాగో చనిపోతాను.. దయచేసి.. : రేణూ దేశాయ్ విన్నపం -
హాలీవుడ్లో విషాదం.. ‘బాట్‌మ్యాన్’ ఇక లేరు!
హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. టాప్ గన్, బ్యాట్‌మ్యాన్ ఫరెవర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో యావత్ సినీ ప్రపంచాన్ని అలరించిన హాలీవుడ్ హీరో వాల్ కిల్మర్ (Val Kilmer)(65) కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 1న లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1980, 90 దశకాల్లో తన నటనతో కిల్మర్ అందర్నీ ఆకట్టుకున్నాడు. 1986లో రిలీజైన టాప్ గన్ చిత్రం వాల్ కిల్మర్కి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చిపెట్టింది. తన కెరీర్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'టాప్ గన్'లో ఐస్‌మ్యాన్, 'బాట్మన్ ఫరెవర్'లో బాట్‌మ్యాన్, 'ది డోర్స్'లో జిమ్ మారిసన్ వంటి పాత్రలు ఆయనకు విశేష గుర్తింపు తెచ్చాయి. టోంబ్‌స్టోన్(1993), ట్రూ రొమాన్స్(1993), హీట్(1995), ద గోస్ట్ అండ్ ద డార్క్నెస్(1996) చిత్రాల్లోనూ కిల్మర్ నటించాడు. అతను నటించిన చివరి చిత్రం టాప్ గన్ మావరిక్ 2022లో రిలీజై మంచి విజయం సాధించింది.ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ లాంటి యానిమేషన్ చిత్రాలకు అతను వాయిస్ ఓవర్ ఇచ్చాడు.కిల్మర్ వ్యక్తిగత విషయాలకొస్తే....అతని పూర్తి పేరు వాల్ ఎడ్వర్డ్ కిల్మర్. లాస్ ఏంజిల్స్‌లో డిసెంబర్ 31, 1959లో జన్మించాడు. చాట్స్వర్త్లో అతని బాల్యం గడిచింది. 1988లో తోటి నటి జోవాన్ వాలీతో ప్రేమ వివాహం జరిగింది. వీరికి కూతురు మెర్సిడీస్, కుమారుడు జాక్ ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 1996లో విడాకులు తీసుకున్నారు. -
'మ్యాడ్ స్క్వేర్'కి భారీ వసూళ్లు ఎందుకు వస్తున్నాయంటే..: నాగవంశీ
‘మ్యాడ్ స్క్వేర్ విడుదలకు ముందే.. కథ, లాజిక్స్ ని పక్కన పెట్టి ఈ సినిమాని చూడమని మేము కోరాం. ప్రేక్షకులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, కేవలం నవ్వుకోవడానికి ఈ సినిమాని చూస్తున్నారు. అందుకే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయి’ అని అన్నారు నిర్మాత నాగవంశీ. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రూ.69.4 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమా భారీ విజయం సాధించడంతో నాగవంశీ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..సినిమా విడుదలైన నాలుగైదు రోజుల్లోనే మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల బాట పట్టడం సంతోషంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లను దృష్టిలో ఉంచుకొని, మొదటి వారాంతం కొన్ని చోట్ల టికెట్ ధరలను పెంచడం జరిగింది. మొదటి వారాంతం వచ్చిన వసూళ్లతో అందరూ సంతోషంగా ఉన్నాం. అందుకే ఈరోజు అన్ని చోట్లా సాధారణ టికెట్ ధరలతోనే సినిమాని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి, కుటుంబ ప్రేక్షకులు మరింత మంది మా సినిమాని చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.సీక్వెల్ హైప్ తో ఆడటానికి ఇది పెద్ద హీరో సినిమా కాదు, భారీ బడ్జెట్ సినిమా కాదు. అయినా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. దానికి కారణం వినోదం. మేము స్వయంగా థియేటర్లకు వెళ్లి చూశాము. ప్రేక్షకులు సినిమా చూస్తూ, ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.సెకండ్ హాఫ్ డల్ అయిందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ, నిజానికి ప్రేక్షకులు సెకండ్ హాఫ్ నే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. సునీల్ గారి ట్రాక్ అందరికీ బాగా నచ్చింది.ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఎలాగైతే మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిందో.. మ్యాడ్ స్క్వేర్ కూడా నాలుగు రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.రివ్యూ అనేది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నచ్చితే నచ్చిందని రాస్తారు, లేదంటే నచ్చలేదని రాస్తారు. అందులో తప్పు లేదు. అలా నిజాయితీగా ఇచ్చే రివ్యూలను మేము స్వాగతిస్తాము. కానీ, కొందరు సినిమాని చంపేయాలనే ఉద్దేశంతో.. రివ్యూ రాసి ఊరుకోకుండా, అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది తప్పు. సినిమా బతికితేనే, అందరం బాగుంటాం అనే విషయాన్ని గ్రహించాలి. -
చిరు సినిమా: అనిల్ రావిపూడి కెరీర్లోనే అత్యధిక పారితోషికం!
అనిల్ రావిపూడి(Anil Ravipudi ).. టాలీవుడ్లో హిట్ సినిమాకు ఈ పేరు కేరాఫ్‌గా మారింది. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాడు. రీసెంట్గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో విక్టరీ వెంకటేశ్‌కి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించేందుకు రెడీ అయ్యాడు అనిల్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న MEGA157(వర్కింగ్ టైటిల్) మూవీ పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్ కంటే ముందే ప్రమోషనల్ వీడియోని వదిలాడు అనిల్. పూజా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన టీమ్‌ని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని క్రియేట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం మాదిరే చిరు సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి కచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ తన ఫోకస్ అంతా చిరు సినిమాపైనే పెట్టాడు. అయితే ఈ చిత్రం కోసం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భారీగానే పారితోషికం పుచ్చకుంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు రూ.10-12 కోట్లు తీసుకున్న అనిల్.. ఈ చిత్రం భారీ హిట్ కావడంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు. మెగాస్టార్ సినిమాకు అత్యధికంగా రూ.20 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. కెరీర్ ప్రారంభంలో పటాస్ చిత్రానికి అనిల్ రూ.50 లక్షలు మాత్రమే తీసున్నాడు. ఇప్పుడు రూ. 20 కోట్లకు ఎగబాకాడు. సూపర్ హిట్ ఇచ్చి భారీగా వసూళ్లను రాబట్టే సత్తా ఉండడంతో రూ.20 కోట్లే కాదు అంతకంటే కాస్త ఎక్కువ అయినా ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. -
జార్జియా అధికారులతో ఇబ్బంది పడ్డా: నిర్మాత
‘28°C’ సినిమా 2019లోనే పూర్తయింది. 2020లో మేలో విడుల చేయాలనుకున్నాం. కానీ కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. కొన్ని రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అనుకుంటే, అది నెలల తరబడి సాగింది. దీంతో మా సినిమా విడుదల ఆలస్యమై ఇప్పుడు (ఏప్రిల్ 4) రిలీజ్ అవుతుంది. ఈ మూవీ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మూవీ వైజాగ్ లో ప్రారంభించినప్పుడే నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆ తర్వాత జార్జియాలో షూటింగ్ కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఎన్ని సమస్యలు వచ్చినా కంటెంట్ మీద నమ్మకంతో ఇప్పటిదాకా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రేక్షకులు థియేటర్స్ లో మా సినిమాకు మంచి రెస్పాన్స్ ఇస్తారనే ఆశిస్తున్నాం’ అన్నారు యువ నిర్మాత సాయి అభిషేక్. ఆయన నిర్మించిన తొలి సినిమా 28°C( 28 డిగ్రీల సెల్సియస్). నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ తన మొదటి సినిమాగా "28°C" రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సాయి అభిషేక్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..నేను, డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ సన్నిహిత స్నేహితులం. మాకిద్దరికీ సినిమాలంటే అమితమైన ఇష్టం ఉండేది. అనిల్ "క్షణం" సినిమా కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడు. నేను కూడా దర్శకత్వం వైపు కొన్ని ప్రయత్నాలు చేశాను. కొన్ని రోజుల తర్వాత, మేమిద్దరం కలిసి ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాం. అనిల్ విశ్వనాథ్ "28°C" అనే టెంపరేచర్ ఆధారంగా చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథ ప్రేక్షకులకు కూడా ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుందనే నమ్మకంతో సినిమాను ప్రారంభించాం.మొదట్లో ఈ సినిమా కోసం వేరే హీరోలను అనుకున్నప్పటికీ, చివరికి నవీన్ చంద్ర ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని భావించాం. హీరోయిన్గా మొదట అంజలిని ఎంచుకున్నాం, కానీ కొంత ఆధునికత కోసం కొత్త ముఖం ఉంటే బాగుంటుందని షాలినీని ఎంపిక చేశాం. షూటింగ్‌ను వైజాగ్‌లో మొదలుపెట్టాం, ఆ తర్వాత గోవా, జార్జియాలకు వెళ్లాం. నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత నాణ్యతతో సినిమాను రూపొందించాం. సినిమా కథాంశంపై మా బృందం అందరికీ గట్టి విశ్వాసం ఉండేది.హీరో నవీన్ చంద్ర మాకు చాలా సహకరించాడు. సినిమాపై మాతో పాటు అతనికి కూడా గట్టి నమ్మకం ఉంది. షూటింగ్ సమయంలోనే కాకుండా, ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో కూడా మద్దతుగా నిలుస్తున్నాడు. అతని పాత్ర ప్రేక్షకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం. అలాగే, హీరోయిన్ షాలినీ కూడా అద్భుతంగా నటించింది. "28°C" టెంపరేచర్ వద్ద హీరోయిన్ ఆరోగ్య పరిస్థితి ఒక విధంగా ఉంటుంది, ఆ ఉష్ణోగ్రత దాటితే ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఈ జంట ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ఒకే జానర్లో సాగదు, విభిన్న జానర్లను కలుపుతూ ఒక తీవ్రమైన ప్రేమకథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు.సినిమా తీసే సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వైజాగ్‌లో షూటింగ్ ప్రారంభించినప్పుడే నా కాలు విరిగింది. ఆ తర్వాత జార్జియాలో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. మేము షూటింగ్ కోసం భారీగా ఖర్చు చేశామని స్థానిక మీడియా ద్వారా తెలుసుకున్న జార్జియా అధికారులు చివరికి చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, కథాంశంపై నమ్మకంతో ఇప్పటివరకు ధీమాగా ఉన్నాం. ప్రేక్షకులు థియేటర్లలో మా సినిమాకు సానుకూల స్పందన ఇస్తారని ఆశిస్తున్నాం.ప్రస్తుతం కొన్ని కథలు విన్నా, అయితే ఏదీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. "28°C" సినిమా రిలీజ్ తర్వాత మా సంస్థ నుంచి కొత్త మూవీని అనౌన్స్ చేస్తాం. -
తండ్రి వయసు వ్యక్తితో అలా చూసి, నాన్న షాక్ చెందారన్న నటి
సాధారణంగా అందంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందేంత అభినయం కూడా ఉండడం అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సాధించగలిగిన విజయం. అలాంటి విజయవంతమైన కధానాయికల్లో అమలాపాల్ ఒకరు. తమిళం, మలయాళం తెలుగు సినిమాలలో నటిస్తూ బహుభాషా నటిగా తన అందానికి, అభినయానికి సమాన ప్రశంసల్ని పొందిన ఈ నటి నిర్మాత కూడా. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో సహా ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతగా అమల పాల్(Amala Paul) పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే ఏమీ తెలీకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నాటి అమలాపాల్‌కి ప్రస్తుతం ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉందని ఆమె అంటోంది.అమలా పాల్,నటిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తాను విజయాలు మాత్రమే కాదు మరెన్నో సవాళ్లతో నిండిన ప్రయాణాన్ని సాగించానని వెల్లడించింది. . వ్యక్తిగత వృత్తి పరమైన ఎదుగుదలతో పాటు జీవితంలోని హెచ్చు తగ్గులు తన మార్గానికి ఒక రూపాన్ని ఇచ్చాయి అంటోంది. మళ్లీ ప్రేమ, మళ్లీ పెళ్లి, తల్లి కావడం...ఇలాంటి వ్యక్తిగత అనుభవాలను తన అభిమానులతో పంచుకుంటూ.. ఈ 15 సంవత్సరాలలో, ఆమె తన అనుభవాల ద్వారా ఎదురుదెబ్బల నుంచి చాలా నేర్చుకున్నానంది. అమలాపాల్ 2010లో నటించిన తమిళ చిత్రం ‘‘ సింధు సమవేలి’’ ఆమె కెరీర్ ను వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రభావితం చేసింది. ఆమె సింధు సమవేలి(Sindhu Samaveli)లో ఓ బోల్డ్ పాత్రను పోషించింది ఎందరినో ఇబ్బంది పెట్టిన శృంగార సన్నివేశాల్లో నటించింది. ఆ సాహసం ఆమె వ్యక్తిగత జీవితం ప్రారంభ కెరీర్ రెండింటినీ ఎదురుదెబ్బలు ఎదుర్కునేలా చేసింది.తండ్రి వయసు ఉండే తన మామగారితో అక్రమ సంబంధానికి ఒడిగట్టే కోడలు సుందరి పాత్రలో ఆమె నటించిన ఆ చిత్రం విడుదలైన తర్వాత తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,.ఆ సినిమా విషయంలో వెల్లువెత్తిన ప్రతికూలత తనను బాగా భయపెట్టిందని, ముఖ్యంగా ఆ సినిమా చూసి తన తండ్రి తీవ్రంగా కలత చెందారని ఆమె వెల్లడించింది. తన పాత్ర చూపించే సామాజిక ప్రభావాన్ని తాను అంచనా వేయలేకపోయానని అంగీకరించింది. ‘మనం అలాంటి పాత్ర చేయకూడదని, అది చెడ్డదని లేదా అది మన సమాజం అంగీకరించే విషయం కాదని ఆ చిత్రం విడుదల తర్వాత మాత్రనే నేను అర్ధం చేసుకోగలిగాను’’ అంటూ ఆమె గుర్తు చేసుకుంది. అయితే అప్పుడు తాను కేవలం 17 లేదా 18 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్న నటిని.. కావడంతో దర్శకుడి సూచనలను గుడ్డిగా అనుసరించడం మాత్రమే చేయగలిగానంది. ఈ వివాదం ఆమెను మానసికంగా ప్రభావితం చేయడమే కాకుండా కెరీర్ పరంగానూ వ్యతిరేక పరిణామాలకు దారి తీసింది. సింధు సమవేలి తరువాత, ఆమె తన తదుపరి చిత్రం మైనా ప్రారంభ ప్రమోషన్లలలో సైతం దేనికీ ఆమెను పిలవలేదు, ఆ తర్వాత ఆమెకు తరువాత కమల్ హాసన్ రజనీకాంత్ వంటి దిగ్గజ నటుల నుంచి సైతం కాల్స్ వచ్చాయి, అయితే విపరీతమైన వ్యతిరేకత పట్ల భయం కారణంగా, ఆమె చెన్నైకి వెళ్లలేకపోయింది.అమలాపాల్ సక్సెస్ తర్వాత ఆ వివాదాస్పద చిత్రం మరోసారి రీ–రిలీజ్ అయింది. అప్పుడు కూడా ప్రమోషనల్ మెటీరియల్ తప్పుదారి పట్టిస్తోందంటూ వివాదాన్ని రేకెత్తించింది. వీటన్నింటి నేపధ్యం ‘‘ సినిమా కేవలం వ్యాపారాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని నేను గ్రహించాను, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నటి ఎదురు దెబ్బలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి‘ అని ఆమె స్పష్టం చేసింది. -
దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ
ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ (mad square) చిత్రం మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. మూడురోజుల్లోనే ఈ మూవీ రూ. 50.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఈ మధ్యకాలం అత్యధిక వసూళ్లను రాబట్టిన చిన్న చిత్రంగా రికార్డు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ సాధించడంతో పెంచిన టికెట్ల ధరను సాధారణ స్థాయికి తీసుకువచ్చామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ( Suryadevara Naga Vamsi) తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా గురించి నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై గ్రహం వ్యక్తం చేశాడు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ఆయన ప్రశ్నించారు.‘సినిమా రిలీజ్ తర్వాత రివ్యూలు వచ్చాయి. అప్పుడు ప్రెస్ మీట్‌పెట్టాను కానీ నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ల పని వాళ్లు చేశారు అనుకున్నాను. కానీ, సినిమా బాగా ఆడుతున్నప్పటికీ.. ఆ రివ్యూల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతోందని అంటున్నారు. ఈ సినిమ ఎలా ఉన్నా చూడటానికి ఇదేమైనా ‘బాహుబలి2’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్2’ కాదు కదా! సినిమా ఆశించినంత లేకపోయినా చూడటానికి ఇందులో నటించిన వాళ్లేమీ పెద్ద హీరోలు కాదు. ‘మ్యాడ్ స్క్వేర్’ బాగుంది కాబట్టి చూస్తున్నారు. వేరే మూవీలు బాగోలేవని దీన్ని చూడటం లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. కంటెంట్ లేదు. సెకండాఫ్ పండలేదని అంటున్నారు. నేను థియేటర్లో చాలాసార్లు సినిమా చూశా. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూవర్లకు తెలియడం లేదా?మీరు (మీడియా) మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్స్ రన్ అవుతున్నాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్ పనిచేస్తాయి. దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేసి చూపించండి. నా సినిమా ఆర్టికల్స్ రాయకండి. నా సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు.సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి’ అని నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వాళ్ల కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు: కల్యాణ్ రామ్
‘‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలోని అమ్మ పాత్రకి విజయశాంతిగారు ఒప్పుకోవడం వల్లే నేను ఈ సినిమా చేశాను. అమ్మలను గౌరవించడం మన బాధ్యత. వాళ్ల కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. మా సినిమాని అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాం’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కల్యాణ్‌రామ్, సయీ మంజ్రేకర్ జోడీగా, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘నాయాల్ది..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను సోమవారం నరసరావుపేటలో రిలీజ్ చేశారు మేకర్స్. రఘురాం సాహిత్యం అందించిన ఈ పాటని నకాష్ అజీజ్, సోనీ కొమాండూరి పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘ఈ వేడుక చూస్తుంటే పాట రిలీజ్‌లా లేదు.. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సక్సెస్‌మీట్‌లా ఉంది’’ అన్నారు. ‘‘పల్నాటి పౌరుషం కల్యాణ్‌రామ్‌గారి క్యారెక్టర్లో కనిపిస్తుంది’’ అన్నారు ప్రదీప్ చిలుకూరి. ‘‘ఈ సాంగ్‌ను పల్నాడులో లాంచ్ చేయడం చాలా గర్వంగా ఉంది’’ అని అశోక్ వర్ధన్ చెప్పారు. ఎన్టీఆర్.. సీఎం..సీఎం ఈ పాట ఈవెంట్‌కి కల్యాణ్‌రామ్ వచ్చింది మొదలు ఎన్టీఆర్ సీఎం అంటూ అభిమానులు పెద్దగా నినాదాలు చేశారు. హీరో ఎన్టీఆర్ ఫ్లెక్సీని ప్రద ర్శిస్తూ సీఎం.. సీఎం.. అనే నినాదాలతో హోరెత్తించారు. -
బ్యాంకాక్‌లో భూకంపం.. ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి: నటి
మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం (Myanmar, Thailand Earthquake) రెండు దేశాలను అతలాకుతలం చేసింది. పలు నగరాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఆ శిథిలాల కింద మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. భూకంపం సృష్టించిన విధ్వంసంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికీ ఆ షాక్‌లో నుంచి తేరుకోలేకపోతున్నారు.నా చేతులు ఇంకా వణుకుతున్నాయిబ్యాంకాక్లో భూకంపం వచ్చినప్పుడు మలయాళ బుల్లితెర నటి, యాంకర్ పార్వతి కృష్ణ (Parvathy Krishna) అక్కడే ఉంది. తాజాగా ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి. ఇంకా నేను బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నా జీవితంలో అతి భయంకరమైన భూకంపం చూశాను. బ్యాంకాక్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అందరూ షాకయ్యారు. నా కళ్లముందే భారీ భవనాలు నేలకొరిగాయి. ఎక్కడ చూసినా హాహాకారాలేజనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఎక్కడచూసినా హాహాకారాలే! ఎక్కడికైనా వెళ్దామంటే రవాణా వ్యవస్థ కూడా స్థంభించిపోయింది. ఎవరి ముఖం చూసినా భయమే కనిపిస్తోంది. ఆ సమయంలో నేను ప్రేమించినవాళ్లను తల్చుకున్నాను. నా కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడాను. ఎట్టకేలకు ఫ్యామిలీతో అయినా మాట్లాడినందుకు సంతృప్తిగా అనిపించింది.లైఫ్‌లో సెకండ్ ఛాన్స్భూకంపం క్షణాల్లో అంతా మార్చేసింది. జీవితంలో నాకు సెకండ్ ఛాన్స్ దొరికినట్లుగా ఉంది. బతకడానికి మరో అవకాశం దొరికినందుకు, అందరినీ కలిసే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉంది. భూకంపం వల్ల ప్రభావితులైనవారిని తలుచుకుంటేనే బాధగా ఉంది. ఈ కష్టసమయాన్ని దాటేందుకు మీరు ధైర్యం కూడదీసుకోవాలని కోరుకుంటున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అలాగే వీలైనంత త్వరగా తాను ఇండియాకు తిరిగిరావడానికి సహకరించినవారికి కృతజ్ఞతలు తెలిపింది. పార్వతి.. మాలిక్, ఏంజెల్స్, వర్షంగళ్కు శేషం, గ్ర్ర్.. సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by PARVATHY KRISHNA (@parvathy_r_krishna)చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్ -
Vaishnavi Chaitanya: ఒక్క హిట్...తెలుగమ్మాయికి భారీ రెమ్యునరేషన్
తారల తలరాతలు మార్చడానికి ఒకే ఒక్క సినిమా చాలు. హిట్ పడ్డాక ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆ హిట్ కోసం తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya) చాలా కాలమే ఎదురు చూసింది. కెరీర్ ప్రారంభంలో 'లవ్ ఇన్ 143 అవర్స్' 'ది సాఫ్ట్వేర్ డెవలపర్' 'అరెరె మానస' 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్ తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి... అటు తర్వాత 'అల వైకుంఠపురములో' 'వరుడు కావలెను' వంటి క్రేజీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమాల్లో చేసినవి చిన్న పాత్రలే అయినప్పటికీ వాటితో కూడా యూత్ ను మెప్పించారు.అందువల్ల 'బేబీ' సినిమాలో వైష్ణవికి మెయిన్ హీరోయిన్ ఛాన్స్ వరించింది.ఆ ఒక్క చిత్రమే ఈ తెలుగమ్మాయి జీవితాన్ని మార్చేసింది.ఆ చిత్రంలో యూత్ లోనే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు వైష్ణవి. ఇప్పుడు ఆమె నటిస్తున్న 'జాక్' సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆమె ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' బ్యానర్ పై అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు '90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించనున్నారు వైష్ణవి. 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇలా 2 పెద్ద బ్యానర్లలో మెయిన్ హీరోయిన్ గా చేస్తూ బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్లు, డిమాండ్ ఉన్న హీరోయిన్లు బాగా తక్కువగానే ఉన్నారు. మొన్నటి వరకు ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఫామ్‌లో లేరు. ఇలాంటి టైంలో దర్సకనిర్మాతలకి వైష్ణవి చైతన్య వైపు మొగ్గు చూపుతున్నారు.ఇది ఆమెకి కలిసొచ్చినట్టు అయ్యింది. దీంతో వైష్ణవి పారితోషికం కూడా పెరిగినట్టు సమాచారం. ఇటీవల ఓ కొత్త సినిమా కోసం వైష్ణవి చైతన్యకి కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట ఓ యువ నిర్మాత, దర్శకుడు. వైష్ణవికి యూత్‌లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు అంత మొత్తం ఇచ్చేందుకు ఈ దర్శకనిర్మాతలు సిద్దమైనట్టు సమాచారం.ఇలా తన అప్ కమింగ్ సినిమాకి గాను వైష్ణవి పారితోషికం కోటి రూపాయల మార్క్ టచ్ అయినట్టు స్పష్టమవుతోంది. -
Moana 2 : ‘మోఆనా2 ’ మూవీ రివ్యూ
కిడ్స్ మోఆనా2 (Moana 2) ఓటీటీలోకి వచ్చేసింది. . ఫస్ట్ పార్ట్ చూసివ వాళ్ళకి ఇది ఇంకా బాగా నచ్చుతుంది. బట్ కిడ్స్ ఇది మీ ఎగ్జామ్స్ టైం. సో మీ ఎగ్జామ్స్ అయిపోగానే ఫస్ట్ మీ ఛాయిస్ మోఆనా2 అవ్వాలి. ఎందుకంటే ఈ సారి మోర్ అడ్వెంచరస్ అండ్ మచ్ మరో ఫన్ తో మోఆనా ఉంది కాబట్టి. ఫస్ట్ పార్ట్ లో లాగానే మావోయి మొఆనా2లో కూడా ఓ టాస్కులో హెల్ప్ అవుతాడు. మోఆనా2 లో మోఆనా తన ఆన్సిస్టర్స్ కోసం వెతుకుతూ ఉంటుంది.ఈసారి మోటుఫెటు అనే ద్వీపం కోసం కూడా సెర్చ్ చేస్తుంటుంది. మౌయ్ తన టాటూ డాన్స్‌తో రచ్చ చేస్తాడు. డిస్నీ విజువల్స్‌లో ఎప్పటిలాగే మాయ చేశారు. మోఆనా ధైర్యంగా సముద్రంలో తిరుగుతుంది. మోఆనా ఈ అడ్వెంచర్ లో బోలెడన్ని వింత క్యారెక్టర్స్ తగులుతాయి. అవి భలే తమాషాగా ఉంటాయి. అవి ఏంటి, అలాగే మోఆనాకి తన ఆన్ సిస్టర్స్ దొరుగుతారా లేదా అన్నది మాత్రం మీ ఎగ్జామ్స్ అయ్యాక జియో హాట్ స్టార్ ట్యూన్ చేయండి. మోఆనా తో ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ కిడ్స్ అండ్ హావ్ ఎ బ్లాస్టింగ్ హాలిడేస్.-ఇంటూరు హరికృష్ణ -
బ్రేకప్ రూమర్స్.. స్టార్ ప్రొడ్యూసర్‌తో తమన్నా హాట్ ఫోటో షూట్
తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ రూమర్స్ గత కొద్ది రోజులుగా అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇటీవల విడిపోయినట్లు తెలుస్తోంది. గతంలో పలు ఈవెంట్స్, వెకేషన్లలో కలిసి కనిపించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఫోటోలు షేర్ చేసేవారు. కానీ ఇటీవల వీరిద్దరు విడివిడిగా కనిపించడం..సోషల్ మీడియా నుంచి ఫోటోలను తొలగించడంతో బ్రేకప్అయినట్లు రూమర్స్ వచ్చాయి. అవి నిజమే అన్నట్లుగా అటు తమన్నా, ఇటు విజయ్‌ల మాటలు ఉన్నాయి. రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్ లాగా ఆస్వాదించాలి, అప్పుడే సంతోషంగా ఉంటారని విజయ్ అంటే.. ప్రేమను వ్యాపార లావాదేవీలా చూడటం ప్రారంభించినప్పుడే సమస్యలు మొదలవుతాయని తమన్నా అంటోందీ. పెళ్లి విషయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయట. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్రతిపాదించగా, విజయ్ మాత్రం అందుకు సుముఖత చూపలేదట. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తి, చివరకు విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.హాట్ ఫోటోలతో హల్చల్బ్రేకప్ రూమర్స్‌పై తమన్నా, విజయ్‌లలో ఒకరు కూడా స్పందించలేదు. పైగా వీరిద్దరు కూడా విడివిడిగా చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. తమన్నా అయితే వరుస సినిమాలతో పాటు పలు ప్రైవేట్ పార్టీలకు హాజరవుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ మిల్కీ బ్యూటీ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరన్ జోహార్‌తో హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలను తమన్నా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా..అవికాస్త వైరల్‌గా మారాయి. బ్రేకప్ తర్వాత తమన్నా మరింత సంతోషంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సినిమాల విషయాకొస్తే.. తమన్నా ప్రస్తుతం ఓదెల 2 లో నటిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె నాగసాధువుగా కనిపించనుంది. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
‘SSMB 29’లో నాన్న లుక్ అదిరిపోతుంది: సితార
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh babu) గారాల పట్టి సితార (Sitara) కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. సినిమాల్లోకి రాకపోయినా ఓ స్టార్ హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. ఆమె ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. అతి చిన్న వయసులోనే అత్యధిక ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. అయితే ఈ చిన్నారి త్వరలోనే వెండితెరపైకి రావడం ఖాయం. మహేశ్ కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పాడు. చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వచ్చే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. హీరోయిన్గా మారకముందే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. తండ్రిని మించిన తనయ అనిపించుకుంటుంది. తాజాగా సీతూ పాప హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పీఎంజే 40వ స్టోర్ ఓపెనింగ్‌కి వెళ్లింది. దీంతో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివెళ్లారు. షాపు ఒపెనింగ్ అనంతరం సితార మీడియాతో మాట్లాడుతూ మహేశ్ బాబు, రాజమౌళి సినిమా(SSMB 29) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘ఎస్ఎస్ఎంబీ29’ నాన్న లుక్ అదిరిపోతుంది. మీరు ఊహించుకుంటున్నదానికంటే ఎక్కుకే ఈ సినిమా ఉంటుంది. ఇంతకంటే ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను’ అని చెప్పింది. అలాగే తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పీఎంజే కోసం మరోసారి మహేశ్‌తో కలిసి యాడ్ చేయబోతున్నట్లు సితార వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందే సితార ఇలా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, షాపు ఓపెనింగ్స్ కి వెళ్లడం పట్ల ఘట్టమనేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
Mega 157: ఉగాదికి స్టార్ట్.. సంక్రాంతికి రిలీజ్!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో ఇది 157వ సినిమా. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది సందర్భంగా నేడు (మార్చి 30) రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా జరిగాయి. హీరో వెంకటేశ్, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు.సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనుందని, చిరంజీవి కొత్త గెటప్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. ఒక పాత్ర కోసం ఇప్పటికే అదితిరావు హైదరిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ని ఇంకా ఫైనల్ చేయలేదు. చిరంజీవి సినిమాల విషయాలకొస్తే..ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు ‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. -
టీనేజ్ లవ్ స్టోరీ మధురం.. రిలీజ్ ఎప్పుడంటే?
యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించిన చిత్రం మధురం. రాజేష్ చికిలే డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ పతాకంపై యం.బంగార్రాజు నిర్మించాడు. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. 'మధురం.. ఇట్స్ ఎ క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది" అని అన్నారు.చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ.. '1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టినట్లు చూపించాం. సినిమా చూశాక అప్పటి వాళ్ళ స్కూల్ డేస్.. కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ ఉంటుంది" అని చెప్పారు. హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతూ.."ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇందులో నా క్యారెక్టర్ అందరిని అలరిస్తుంది. ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని చెప్పారు. -
డొక్కా సీతమ్మగా ఆమని.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ (Andhrula Annapurna Dokka Seethamma). టి.వి. రవి నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతం అందించారు. ఎం.రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం..400 ఎంకరాలు అమ్మేసి..అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ‘డొక్కా సీతమ్మ లాంటి మహనీయులైన కథతో సినిమా తీస్తుండటం గొప్ప విషయం. ఇలాంటి వారి గురించి జనాలకు తెలియాలి. నాలుగు వందల ఎకరాలు అమ్మేసి అందరికీ అన్నం పెట్టిన మహనీయురాలు. ఆమని గారు చేస్తున్న ఈ పాత్రతో ఆమె మీద అందరికీ గౌరవం పెరుగుతుంది’ అని అన్నారు. దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ.. ‘అందరిలాగే చిరంజీవి గారిని చూసి అభిమానిగా మారి 2012లో ఇండస్ట్రీకి వచ్చాను. నా అదృష్టం: దర్శకుడుమొదటి సినిమానే డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలైన కథతో చేస్తుండటం నా అదృష్టం. నా మొదటి చిత్రానికి సుచిత్రమ్మతో ఓ పాట చేయించాలని అనుకున్నాను. చంద్రబోస్ గారు ఇచ్చిన మాట సాయంతోనే ఈ సినిమా స్థాయి పెరిగింది. ఆమని గారు అద్భుతంగా నటించారు. మురళీ మోహన్ గారు అందించిన సహకారాన్ని మర్చిపోలేను. ఆర్ట్ డైరెక్టర్ రవన్న అద్భుతంగా సెట్స్ వేశారు. త్వరలోనే ట్రైలర్‌తో వస్తాం’ అని అన్నారు.ఆమనికి జాతీయ అవార్డు రావాలిమురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. వచ్చిన ప్రతీ ఒక్కరికీ కడుపునిండా అన్నం పెట్టి పంపేవారు. ఇలాంటి గొప్ప వారి గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. ఆమని చాలా మంచి ఆర్టిస్ట్. అలాంటి గొప్ప ఆర్టిస్ట్‌కు డొక్కా సీతమ్మ పాత్ర వచ్చింది. ఆమని గారికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి’ అని అన్నారు. ఆమని మాట్లాడుతూ .. ‘దర్శకుడు వచ్చి డొక్కా సీతమ్మ గారి కథ చెప్పారు. నేను బెంగళూర్‌కు చెందిన వ్యక్తిని. నాకు ఆమె గురించి ఎక్కువగా తెలీదు. రాసిపెట్టి ఉండాలి: ఆమనిదర్శకుడు కథ చెప్పిన తరువాత గూగుల్‌లో ఆమె గురించి సర్చ్ చేశాను. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అన్నది నాకర్థమైంది. ఇలాంటి పాత్ర చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. ఈ పాత్ర దొరకడం నా అదృష్టం’ అని అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ .. ‘డొక్కా సీతమ్మ లాంటి మహనీయుల కథను సినిమాగా అనుకోవడమే పెద్ద సాహసం. డొక్కా సీతమ్మ అంటే బ్రిటీష్ వారికి కూడా తెలుసు. లండన్ రాజు గారి ఆహ్వానాన్ని కూడా తిరస్కరించి ఇక్కడే ఉండి అందరికీ సేవ చేశారు. ఇలాంటి చిత్రంలో డొక్కా జోగన్న పాత్రను మురళీ మోహన్ గారు, డొక్కా సీతమ్మగా ఆమని గారు నటిస్తుండటం వారి అదృష్టం’ అన్నారు.చదవండి: నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్ల పంపిణీ -
ఆ సమయంలో చనిపోవాలనుకున్నా.. ధైర్యంతో ‘పొలిమేర’ స్క్రిప్ట్ రాశా: డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్
"పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28°C" ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా అనిల్ మీడియాతో ముచ్చటిస్తూ తన తొలి సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో ఆయన మాటల్లో.. "28°C" సినిమాతో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇది మొదటి సినిమా. స్క్రిప్ట్ ను బాగా లవ్ చేశాను. 2017లో స్టార్ట్ చేశాం. క్వాలిటీ పరంగా రాజీ పడకపోవడంతో బడ్జెట్ పెరిగింది. 2020 మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. మార్చి లో లాక్ డౌన్ వచ్చింది. ఆ తర్వాత సినిమాల రిలీజ్ ల పరిస్థితి ఎలా మారిందో మీకు తెలుసు. ఓటీటీకి ఆఫర్స్ వచ్చాయి గానీ మేము సినిమాకు పెట్టిన ఖర్చుకు వారు ఆడిగిన రేట్ కు సంబంధం లేదు. అందుకే మూవీని ఓటీటీకి ఇవ్వలేదు. పైగా మా సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవాలనే కోరిక ఉండేది. ఏది జరిగినా మన మంచికే అనుకుంటా. "28°C" సినిమా ఇప్పుడు రిలీజ్ కావడం వల్ల మంచే జరిగిందని భావిస్తాఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సూపర్ న్యాచురల్ షేడ్స్ ఉంటాయి. మెడికల్ గా 28°C అనే అంశాన్ని కథలో మిక్స్ చేశాం. బ్రెయిన్ డ్యామేజీ అయిన వారు ఎక్కువ వేడి, చల్లదనం తట్టుకోలేరు. అది థియరీగా ఉంది. ఈ అంశాన్ని సినిమా కోసం ఎఫెక్టివ్ గా ఉపయోగించాం. టైటిల్ కనిపించే ప్రశ్నార్థకం మిమ్మల్ని సినిమా చివరి వరకు క్యూరియాసిటికి గురిచేస్తుంది.ఈ సినిమాను మొదట అడివి శేష్ కోసం అనుకున్నాం. అయితే శేష్ క్షణం తర్వాత బిజీ అవడం వల్ల కుదరలేదు. నవీన్ చంద్రకు స్క్రిప్ట్ చెబితే ఆయనకు బాగా నచ్చి చేసేందుకు ముందుకొచ్చారు. జార్జియాలో 25 డేస్ షూటింగ్ చేశాం. ఆ షెడ్యూల్ కోసం మేము పడిన కష్టం మాటల్లో చెప్పలేను. అనివార్య కారణాలతో రెండుసార్లు జార్జియాకు వెళ్లకుండా అధికారులు తిరిగి పంపేశారు. థర్డ్ టైమ్ మేము అక్కడికి వెళ్లి షూట్ చేయగలిగాం. మూడోసారి కెమెరా కిట్స్ ఉన్నబ్యాగులు మిస్ అయ్యాయి. జార్జియాలో షాపింగ్ చేసి వాటిని కొని షూటింగ్ చేశాం. ఇలాంటి ఎక్సిపీరియన్స్ లు చాలా ఉన్నాయి కాబట్టే "28°C" సినిమా అనుభవాలతో పుస్తకం రాయాలని అనుకున్నా."28°C" రిలీజ్ ఆగిపోయినప్పుడు నా పర్సనల్, ప్రొఫెషనల్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఈ మూవీలో నేను కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. సినిమా రిలీజ్ ఆగిపోయి నెక్ట్స్ ఏంటి అనే డైలమాలో ఉండేవాడిని. ఆత్మహత్య ఆలోచనలు కూడా కలిగేవి. అయితే బతికే సాధించాలనే పట్టుదలతో పొలిమేర స్క్రిప్ట్ చేసుకుని ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో పొలిమేర 2 చేశాను. ఇప్పుడు పొలిమేర సిరీస్ లో థర్డ్ పార్ట్ చేస్తున్నాం. పొలిమేరతో వచ్చిన గుర్తింపుతో "28°C" సినిమా బాగా రిలీజ్ అవుతుందని నమ్ముతున్నా.నా స్నేహితుడు వంశీ నందిపాటి "28°C" సినిమా చూసి ఇంతమంచి మూవీని రిలీజ్ చేయాలని ముందుకొచ్చాడు. ఇప్పుడు మా లక్ష్యం ఈ సినిమాతో డబ్బులు సంపాదించడం కాదు మా ఫస్ట్ మూవీని థియేటర్స్ లో చూసుకోవడం. అందుకే వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ ఇప్పించమని వంశీని అడిగాను. "28°C" సినిమా చూసి నవీన్ చంద్ర ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు."28°C" సినిమా రిలీజ్ కావడం ఆలస్యమైంది. అయితే అదృష్టవశాత్తూ ఇలాంటి కథతో మరే మూవీ థియేటర్స్ లో గానీ ఓటీటీలో గానీ రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే చాలా బాధపడేవాడిని. నేను యూనిక్ బ్యాక్ డ్రాప్స్ తో కథలు రాస్తాను. అదే నాకు అడ్వాంటేజ్ అయ్యిందని భావిస్తా. సినిమాను క్రిస్ప్ గా 2 గంటలు ఉంటుంది. అనవసర సన్నివేశాలు తీసేసి టు ది పాయింట్ మూవీని తెరపై చూపించబోతున్నాం.నా నెక్ట్స్ మూవీ పొలిమేర 3 త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తాం. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఉంటుంది. సీజీ వర్క్ భారీగా ఉండబోతోంది. అందుకే ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ పట్టింది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పొలిమేర 3 పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రొడక్షన్ వ్యాల్యూతో ఉంటుంది. ఇందులో ఓ స్టార్ కీలక పాత్రలో నటిస్తారు.నేను షో రన్నర్ గా నా టీమ్ మెంబర్ నాని కాసరగడ్డ డైరెక్షన్ లో అల్లరి నరేష్ తో 12ఎ రైల్వే కాలనీ మూవీ చేస్తున్నాం. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాశాను. నేను కెరీర్ మొదలుపెట్టినప్పుడు నాకు పెద్దగా సపోర్ట్ లేదు. నాకున్న గుర్తింపుతో ఇప్పుడు నా కొలీగ్స్ కు నేను ఆ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తున్నా. నాకు షెర్లాక్ హోమ్స్ సాహిత్యం ఇష్టం. త్వరలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. -
హృదయాన్ని కదిలించేలా ‘చూస్తున్నవేమో’ పాట
తల్లి సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకుని వచ్చిన పాటలన్నీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. అమ్మ ప్రేమను కీర్తించే టాలీవుడ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి మదర్ సెంటిమెంట్‌ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ‘మాతృ’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు. ‘రా రాజా’ చిత్రంతో దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటిన బి. శివ ప్రసాద్, ఇప్పుడు ‘మాతృ’ సినిమాతో తన సినీ అభిరుచిని మరోసారి ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. మనసును ఆకట్టుకునే లిరికల్ వీడియోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు చిత్ర బృందం. తాజాగా, తల్లి కోసం పడే వేదనను హృదయస్పర్శిగా చూపించే ‘చూస్తున్నవేమో’ అనే ఎమోషనల్ పాటను రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర స్వరకల్పన, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, కారుణ్య గాత్రంతో ఈ పాట పదే పదే వినాలనిపించేలా ఉంది. జాతీయ అవార్డు గ్రహీత అయిన సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం గుండెల్ని పిండేసేలా ఉండగా, కారుణ్య గొంతులోని ఆర్ద్రత శ్రోతలను భావోద్వేగంతో నింపుతోంది.ఈ అద్భుతమైన పాటను ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ప్రశంసించారు. హృదయాన్ని తడమగలిగిన ఈ పాటను మెచ్చుకుంటూ, ప్రస్తుత కాలంలో మదర్ సెంటిమెంట్‌పై సినిమాలు లేదా తల్లి ప్రేమను చాటే పాటలు అరుదుగా వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మాతృ’ టీంను అభినందిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు. -
దివ్యభారతి ఆత్మ వెంటాడిందా? ఏడ్చేసిన నాగార్జున హీరోయిన్!
తక్కువ కాలమే నటించినా, యావద్భారత సినీ ప్రేక్షకులు మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం మరచిపోలేని కధాయికల్లో నెం1 గా నిలుస్తుంది దివ్యభారతి. చిరంజీవితో రౌడీఅల్లుడు, వెంకటేష్‌తో బొబ్బిలిరాజా, మోహన్‌బాబుతో అసెంబ్లీ రౌడీ వంటి చిత్రాలలో నటించిన దివ్యభారతి అందాన్ని చూసేందుకు తెరకు కళ్లప్పగించిన ప్రేక్షకులెందరో. అటువంటి అందాల నటి, ఎంతో భవిష్యత్తు ఉన్న యువనటి అకస్మాత్తుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఆ తర్వాత అప్పటి ఆమె సహనటీనటులు ఆమె గురించి అడపాదడపా తలచుకుంటూ ఆవేదన చెందడం చూస్తున్నాం. అదే క్రమంలో తాజాగా అప్పటి దివ్యభారతి సహ నటి, అత్యంత ఆత్మీయ నేస్తం అయిన ఆయేషా ఝుల్కా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివ్యభారతి గురించి కొన్ని విశేషాలు పంచుకుంది.దివ్యతో తనకున్న బంధం గురించి అయేషా మాట్లాడుతూ, ‘మేము రంగ్ షూటింగ్లో ఉండగా.. ఈ సంఘటన మొత్తం జరిగింది. నేను ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు–ఆమె అందులో నా చెల్లెలిగా నటించింది–మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. ఇతర సెట్లలో చేస్తున్నప్పుడు కూడా ఆమె వచ్చి నాతోనే కబుర్లు చెబుతూ ఉండేది’’ అంటూ తమ అనుబంధం గురించి వివరించింది.ఆయేషా జుల్కా దివ్య భారతి 1993లో రొమాంటిక్ చిత్రం రంగ్లో కలిసి నటించారు. ఈ చిత్రంలో కమల్ సదానా, జీతేంద్ర, అమృతా సింగ్, ఖాదర్ ఖాన్ బిందు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అయేషా, దివ్య సిస్టర్స్‌గా నటించారు. అయితే సినిమా విడుదలకు ముందే దివ్య కన్నుమూసింది.సినిమా స్క్రీనింగ్ సమయంలో దివ్య తో అనుబంధాన్ని తలచుకుంటూ... ఆ దురదృష్ఖకర సంఘటన తర్వాత తాను చాలా రాత్రులు నిద్రపోలేకపోయానని ఆయేషా గుర్తు చేసుకుంది. ‘‘ మా మధ్య ఫ్రెండ్స్‌ని మించిన బంధం ఉంది, ఆ సంఘటన తర్వాత నేను ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు, చేయలేకపోయాను, డబ్బింగ్ చెప్పడానికి బదులు నేను భోరున ఏడ్చాను దాంతో డబ్బింగ్ వాయిదా వేయవలసి వచ్చింది. కాబట్టి అదంతా జరిగింది, ఆపై మేము ఫిల్మ్ సిటీలో ఆ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు... దివ్య తెరపై కనిపించిన క్షణంలో, స్క్రీన్ ఒక్కసారిగా పడిపోయినట్టయింది.. దివ్య నా చెంతనే ఉన్నట్టు ఓ ఫీలింగ్...బాధ అనుభవించాను దాంతో ఆ రాత్రి నేను చాలా సేపు నిద్రపోలేకపోయాను’’ అంటూ దివ్యభారతి మరణం తర్వాత కూడా తనతోనే ఉందని ఆమె చెప్పింది. గత 1991లో వచ్చిన కుర్బాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన అయేషా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది, ఆమెను లైమ్‌లైట్‌లోకి తీసుకెళ్లింది... అక్షయ్ కుమార్ సరసన ఖిలాడీలో ఆమె నటన ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది, ఆ తర్వాత అమీర్ ఖాన్ సరసన జో జీతా వోహీ సికందర్, మిథున్ చక్రవర్తి సరసన దలాల్ లతో పాటు మరిన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మూడు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్లో, 60 చిత్రాలకు పైగా పనిచేసింది. తెలుగులో అక్కినేని నాగార్జున సరసన నేటి సిద్ధార్ధ సినిమాలో ఆమె నటించి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించింది. ఈ సినిమాలో నాగ్‌తో ఆమె లిప్‌లాక్ కూడా చేయడం విశేషం. -
‘ఓరీ’ దేవుడా.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు మేనేజర్!
ఓరీ(Orry) అలియాస్ ఓర్హాన్ అవత్రమని.. ఈ పేరు బాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి బాగా తెలుసు. బాలీవుడ్ తారల పార్టీల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ నిలిస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. జాన్వీ కపూర్, అనన్య పాండే, సుహానా ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ కిడ్స్ పార్టీల్లో మనోడు కచ్చితంగా ఉండాల్సిందే. ఇలా స్టార్స్‌తో కలిసి తిరుగడంతో మనోడికి కూడా ‘స్టార్’ హోదా వచ్చేసింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేంది. ఇన్‌స్టాలో ఏ పోస్ట్ పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా ఈ సోషల్ మీడియా సంచలనం గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇతని మేనేజర్‌గా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పని చేస్తోంది. ఆమె ఎవరో కాదు ‘ఖడ్గం’ఫేం కిమ్ శర్మ(kim sharma).కిమ్ శర్మ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించి, 2000లో 'మొహబ్బతేన్' చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగు సినిమా 'ఖడ్గం' (2002)లో నటించి మంచి పేరు సంపాదించింది. అయితే, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ఈ అందాల తార సినీ పరిశ్రమకు వీడ్కోలు పలికింది. ఆ తర్వాత ఆమె బిజినెస్ రంగంలోకి ప్రవేశించి, ప్రస్తుతం ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ సోషల్ మీడియా స్టార్ ఓరీకి సంబంధించినది. కిమ్ శర్మ తన చాకచక్యంతో ఓరీ నికర విలువను రూ. 10 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. ఒకప్పటి హీరోయిన్ నుంచి మేనేజర్‌గా స్థానం మార్చుకున్న ఆమె జీవన ప్రస్థానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
తమన్నా(Tamannaah Bhatia), విజయ్ వర్మల మధ్య బ్రేకప్ అంటూ గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో విజయ్ వర్మ (Vijay Varma) తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సంబంధంలో కోపం, బాధ, సంతోషం, చిరాకు వంటి భావోద్వేగాలన్నీ అనుభవించాలని, వాటిని స్వీకరించడం ద్వారానే ఆ బంధాన్ని సంతోషమయం చేసుకోవచ్చని అన్నారు. "రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్ లాగా ఆస్వాదించాలి. అప్పుడే నీవు సంతోషంగా ఉంటావు" అని విజయ్ పేర్కొన్నారు.మరోవైపు, తమన్నా కూడా ప్రేమపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రేమను వ్యాపార లావాదేవీలా చూడటం ప్రారంభించినప్పుడే సమస్యలు మొదలవుతాయి. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కంటే ఒంటరిగా ఉన్నప్పుడే నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను" అని ఆమె అన్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలను బట్టి చూస్తే, వీరు విడిపోయారనే వార్తలు నిజమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమన్నా పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. అంతేకాక, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వెల్లడించారు. కానీ, ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్రతిపాదించగా, విజయ్ మాత్రం అందుకు సుముఖత చూపలేదట. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తి, చివరకు విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బ్రేకప్ గురించి వీరిద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
అలాంటి ఫ్యాన్స్ ఉండడం నా అదృష్టం: విజయ్ దేవరకొండ
కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా అభివృద్ధిలో ఒక స్టార్ హీరోగా తన వంతు కృషి చేస్తానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన 'వాట్ ఇండియా థింక్స్ టుడే' కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. హీరోగా తన సక్సెస్, గ్లోబల్ గా తెచ్చుకున్న గుర్తింపు, పాన్ ఇండియా ట్రెండ్ లో టాలీవుడ్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ వంటి అంశాలతో పాటు తన కొత్త సినిమా "కింగ్ డమ్" విశేషాలు ఈ కార్యక్రమంలో తెలిపారు.హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - హీరోగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం, ఇంతమంది అభిమానం పొందడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా, ఏ కొద్ది మందికో దక్కే అవకాశమిది. మనం అన్నిసార్లూ సక్సెస్ ఫుల్ సినిమాలు చేయకపోవచ్చు. కానీ ప్రతి సందర్భంలో ప్రేమించే ఫ్యాన్స్ ఉండటం నా అదృష్టం. స్టార్ గా ఎదిగిన తర్వాత నాలో కలిగిన ఫీలింగ్ ఒక రిలీఫ్ లాంటిది. (చదవండి: లూసిఫర్2 కలెక్షన్ల సునామీ.. ప్రకటించిన మోహన్‌లాల్)మనం సాధించాల్సింది సాధించిన తర్వాత దక్కే సంతృప్తి అది. ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రపంచం చాలా చిన్నదైంది. మనం K డ్రామాస్ చూస్తున్నాం, కొరియన్ బీటీఎస్ ను ఇష్టపడుతున్నాం. అలాంటప్పుడు సౌత్ సినిమాను నార్త్ ప్రేక్షకులు అభిమానించడంలో ఆశ్చర్యం లేదు. సక్సెస్, ట్రెండ్ అనేది ఒక సర్కిల్ అయితే అందులో ఇప్పుడు టాలీవుడ్ వంతు వచ్చింది. రేపు మరో ఇండస్ట్రీ లీడ్ తీసుకోవచ్చు. మన దగ్గర ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని అనుకుంటున్నా. దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా తమ మొదటి సినిమా నాతో చేశారు. ఇవాళ నేనిక్కడ ఉన్నానంటే వారి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది.రాజమౌళి గారు బాహుబలి తీసినప్పుడు అదొక పెద్ద రిస్క్. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ సాహసం చేశారు. ప్రతి ఇండస్ట్రీ ఇలాంటి స్ట్రగుల్ పడాలి. అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేయగలదు. నా కొత్త సినిమా "కింగ్ డమ్"(Kingdom Movie) టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో తారక్ అన్న, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ తమ వాయిస్ లతో మా టీజర్ ను మరింత ఎఫెక్టివ్ గా చేశారు. వారి వాయిస్ వల్ల మా టీజర్ ఇంకా బాగా ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. ప్రేక్షకులకు సరికొత్త కథలు చెప్పాలి, టాలీవుడ్ సక్సెస్ లో నా వంతు కృషి చేయాలని ప్రయత్నిస్తున్నా. అన్నారు. -
ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి: ‘రాబిన్‌హుడ్’ నిర్మాత
‘‘రాబిన్‌హుడ్’ (Robinhood Movie ) క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మేం థియేటర్స్‌కి వెళ్లి చూశాం. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి, సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత యలమంచిలి రవిశంకర్. (చదవండి: రాబిన్‌హుడ్ మూవీ రివ్యూ)నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇతర ΄ాత్రలు పోషించారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. (చదవండి: 'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!)ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘రాబిన్ హుడ్’లో మంచి కథతో పాటు వినోదం, ఫైట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో పాటు యువత వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా ఇది’’ అన్నారు. ‘‘మేము రెండు థియేటర్స్‌ని విజిట్ చేశాం. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తుండటం సంతోషంగా అనిపించింది. ఈ ఉగాదికి మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది’’ అన్నారు వెంకీ కుడుముల. -
Robinhood : సర్ప్రైజ్... హుక్ స్టెప్ లేపేశారు!
రాబిన్‌హుడ్(Robinhood) సినిమాను బాగా జనాల్లోకి తీసుకెళ్లిన పాట ‘అదిదా సర్ప్రైజ్’. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట ఎంత సూపర్ హిట్ అయిందో దానికంటే ఎక్కువగా కేతికా శర్మ వేసిన స్టేప్పులు కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. ఒక మహిళలతో అలాంటి హుక్ స్టెప్పులు ఎలా వేయిస్తారంటూ నెటిజన్స్ చిత్ర యూనిట్‌పై మండిపడ్డారు. మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశంపై సీరియస్‌గా స్పందించి, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లకు హెచ్చరికలు జారీ చేసింది. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కూడా ఈ స్టెప్పులపై స్పందించారు. (చదవండి: ‘రాబిన్‌హుడ్’ హిట్టా? ఫట్టా?)అయితే వీరిద్దరు కూడా అది పెద్ద తప్పేమి కాదులే అన్నట్లుగా మాట్లాడారు. మరోవైపు కొంతమంది నెటిజన్స్ మాత్రం ఈ స్టెప్పులను బాగా ఎంజాయ్ చేశారు. అలాంటి క్యాస్టూమ్నే ధరించి రీల్స్ చేశారు. ఇలా మొత్తంగా అదిదా సర్ప్రైజ్ ‘రాబిన్‌హుడ్’కి కావాల్సినంత ప్రమోషన్ చేసిపెట్టింది. మేకర్స్ కూడా ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మల్లెపూల కాస్ట్యూమ్ గురించి, ఆ స్టెప్పుల గురించి మాట్లాడుతూ..వివాదాన్ని ప్రమోషన్స్‌కి వాడుకునే ప్రయత్నం చేశారు. కానీ మహిళా కమిషన్ బహిరంగ లేఖ రాయడంతో వాళ్లు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రిలీజ్ తర్వాత మళ్లీ కాంట్రవర్సీ జరగకుండా పాటలోని ఆ హుక్ స్టెప్ని తీసేశారు. ఈ స్టెప్పులను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు కానీ.. సినిమాలో మాత్రం ఆ హుక్‌స్టెప్ కనిపించకుండా మ్యానేజ్ చేసి ప్రేక్షకులను ‘సర్ప్రైజ్’ చేశారు. చిత్రం బృందం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమే. ఈ సినిమా కంటే ముందు బాలయ్య ‘డాకు మహారాజ్’ మూవీపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఆ సినిమాలోని ‘దబిడిదిబిడి’ పాట స్టెప్పులపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్యను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అయినా కూడా మేకర్స్ అవేవి పట్టించుకోకుండా.. సినిమాలో ఆ స్టెప్పులను అలానే ఉంచేశారు. రాబిన్‌హుడ్ టీం మాత్రం కాంట్రవర్సీకి దారి తీసిన స్టెప్పులను తొలగించి.. తమ సినిమాపై ఎలాంటి వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. -
ఆస్కార్ నామినేషన్.. ఇండియాలో రిలీజ్‌కు నోచుకోని చిత్రం
యూకే నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన సినిమా సంతోష్ (Santosh Movie). బ్రిటీష్ ఇండియన్ ఫిలిం మేకర్ సంధ్యా సూరి తెరకెక్కించిన ఈ మూవీ భారత్‌లో రిలీజ్‌కు నోచుకోవడం లేదు. పలు సున్నితమైన అంశాలను చూపించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. కొన్ని సన్నివేశాలను తీసేయమని కోరిందని, అది ఇష్టం లేకపోవడం వల్లే భారత్‌లో దీన్ని విడుదల చేయడం లేదని పేర్కొంది.ఎంతో ప్రయత్నించా..దీని గురించి సంధ్యా సూరి (Sandhya Suri) మాట్లాడుతూ.. సినిమాలో చూపించిన సమస్యలు భారత్‌కు కొత్తేమీ కాదు. వీటి గురించి గతంలోనూ ఎన్నో సినిమాల్లో ప్రస్తావించారు. అయినప్పటికీ మా సినిమా రిలీజ్‌కు ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. బహుశా మా సినిమాలో హీరో లేకపోవడం నచ్చట్లేదేమో! ఈ మూవీని భారత్‌లో రిలీజ్ చేయడం నాకెంతో అవసరం. దీనికోసం అన్నిరకాలుగా ప్రయత్నించాను. కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. మా చిత్రంలో కొన్ని సన్నివేశాలు తొలగించమని సీబీఎఫ్సీ కోరింది. వారు చెప్పినట్లు చేస్తే కథ తీవ్రత తగ్గిపోతుంది. సినిమాను దెబ్బతీయడం ఇష్టం లేక రిలీజ్ చేయడం లేదు. ఇది మాకెంతో బాధగా ఉంది అని పేర్కొంది.ఆస్కార్ నామినేషన్చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళ కథ ఇది. వితంతువు పోలీసుగా మారి.. దళిత అమ్మాయి హత్య కేసును ఎలా ఛేదిస్తుందన్నది సినిమాలో చూపించారు. కుల వివక్ష, అంటరానితనం, అధికారుల క్రూరత్వం, లైంగిక వేధింపులను ప్రస్తావించారు. ఈ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అలాగే యూకే నుంచి అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. డిసెంబర్లో షార్ట్ లిస్ట్ అయినప్పటికీ అవార్డు అందుకోలేకపోయింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన శెహానా గోస్వామి ఉత్తమ నటిగా ఏషియన్ ఫిలిం అవార్డు గెలుచుకుంది.చదవండి: మలయాళంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ఎల్ ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? -
Robinhood: ‘రాబిన్‌హుడ్’ మూవీ ట్విటర్ రివ్యూ
హీరో నితిన్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఆయన ఖాతాలో ఇటీవలి కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘మాస్ట్రో’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో నితిన్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హీస్ట్ కామెడీ చిత్రంలో నితిన్‌కి జోడీగా శ్రీలీల నటించింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచారచిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రాబిన్‌హుడ్’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.రాబిన్‌హుడ్ చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొందరు అంటుంటే...యావరేజ్ అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Done with my show,good 2nd half, where each & every episode worked out except cringe Leela portions. David Bhai cameo at the end is hilarious!!adidha suprisu song is good..!! Overall a decent commercial entertainer 2.5/5 #Robinhood— Peter Reviews (@urstrulyPeter) March 27, 2025 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్ బాగుంది. శ్రీలీల పోర్షన్ మినహా ప్రతి ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది. డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చివరిలో వచ్చి నవ్వులు పూయిస్తోంది. అదిదా సర్ప్రైజ్ సాంగ్ బాగుంది. ఓవరాల్‌గా ఇది డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని ఓ నెటిజన్ 2.5 రేటింగ్ ఇచ్చాడు.#RobinhoodGood 1st half and a bad second half.Not better than bheeshma(as compared by hero). @actor_nithiin @sreeleela14 @VenkyKudumula pic.twitter.com/hZHFLIoHA5— Nenu (@nenuneneh) March 28, 2025 ‘ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ బాగోలేదు. భీష్మతో పోలిస్తే మాత్రం ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.#Robinhood Review : SUMMER FULL FAMILY ENTERTAINER - 3.5/5 🔥🔥🔥ACTOR @actor_nithiin and #RajendraPrasad GAARU DUO WAS THE BIGGEST ASSET TO THE FILM 🎥 DIRECTOR @VenkyKudumula DEALED THE SIMPLE STORY WITH HIS TRADEMARK COMEDY AND SCREENPLAY 💥💥🔥🔥👍👍NEW STAR ⭐️… pic.twitter.com/b8EFYU2PD4— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 28, 2025‘సమ్మర్ ఫుల్‌ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. రాజేంద్రప్రసాద్, నితిన్ పాత్రలు పండించిన కామెడీ సినిమాకు ప్రధాన బలం. ఓ సింపుల్‌స్టోరీని వెంకీ కుడుముల తనదైన కామెడీ సీన్లతో, స్క్రీన్ ప్లేతో చక్కగా తీర్చిదిద్దాడు’ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్‌చ్చాడు.#Robinhood Bagundhi 2nd half >>>> 1st half David Bhai entry ki theaters resound aeeeComedy bagundhi Songs placement worst except adhi dha suprise song.Overall ga good film😂— NAvANeETh (@Navaneethkittu) March 28, 2025రాబిన్‌హుడ్ బాగుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బెటర్. డేవిడ్ భాయ్ ఎంట్రీకి థియేటర్స్‌లో రీసౌండే. కామెడీ బాగుంది. అదిదా సర్ప్రైజ్ మినహా మిగతా పాటల ప్లేస్‌మెంట్స్ బాగోలేవు. ఓవరాల్‌గా గుడ్ మూవీ అని ఓ వ్యక్తి ట్విటర్లో రాసుకొచ్చాడు. Done with 1st Half of #Robinhood !Here is the #Review so far:Strictly Average!! As a commercial cinema, plot and treatment is quite routine, but the comedy by #VennelaKishore & #RajendraPrasad garu worked out to an extent! Generated good laughs in the theatre! Needs a very… https://t.co/3yhnScEFtP— FILMOVIEW (@FILMOVIEW_) March 27, 2025POSITIVE REPORTS 💥 from the Premiere Shows #Robinhood. Congratulations💐 #teamRobinhood @actor_nithiin @VenkyKudumula @sreeleela14 @gvprakash @MythriOfficial pic.twitter.com/Du6ClOcmao— Mallesh Chetpally (@Mallesh_Nithiin) March 28, 2025#Robinhood Review : SUMMER FULL FAMILY ENTERTAINER - 3.5/5 🔥🔥🔥ACTOR @actor_nithiin and #RajendraPrasad GAARU DUO WAS THE BIGGEST ASSET TO THE FILM 🎥 DIRECTOR @VenkyKudumula DEALED THE SIMPLE STORY WITH HIS TRADEMARK COMEDY AND SCREENPLAY 💥💥🔥🔥👍👍NEW STAR ⭐️… pic.twitter.com/b8EFYU2PD4— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 28, 2025Show completed:- #Robinhood Fun entertainer 👍Above average movie 2.75/5 First half is good Okayish Second half Not a story based film ... go with the flow Go with your family , have fun#Robinhood series will continue... 2nd part villain @davidwarner31 pic.twitter.com/yrd3PGpsl6— venkatesh kilaru (@kilaru_venki) March 27, 2025#Robinhood2.75/5A good entertainer with loads of fun😀Nithiin & Venky Kudumula's combo generates a laugh riot in 1st half and the second half is a mix of emotion & entertainment.Vennela Kishore and RP comedy worked well. The pre-climax and climax are the heart of the film.— BioScope Telugu (@BioScope_Telugu) March 28, 2025 -
నాలుగు నెలల్లో రూ.3,000 కోట్ల కలెక్షన్స్! బాక్సాఫీస్ క్వీన్‌గా రష్మిక
రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఇండస్ట్రీ ఏదైనా ఆమె అడుగు పెడితే బ్లాక్ బస్టర్ వెల్ కమ్ చెపాల్సిందే. హీరో ఎవరైనా సరే.. ఆమె జోడి కడితే కెరీర్ లో బిగ్ హిట్ అందుకోవాల్సిందే. అలా అని మహానటి పేరు లేదు. గ్లామర్ క్వీన్ అనే క్రేజ్ కూడా లేదు. టోటల్‌గా లక్ ఫ్యాక్టర్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. ఇండియన్ సినిమాలో తనని తిరుగులేని నటిగా నిలబెడుతోంది. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.నాలుగు నెలల్లో మూడు వేల కోట్లు!రష్మిక కథానాయికగా నటించిన పుష్ప 2 (Pushpa 2: The Rule) గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయింది. ఈ మూవీతో 1800 కోట్ల వసూళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛావా రిలీజ్.. 800 కోట్ల కలెక్షన్స్. అంటే ఏడాదిలోపే, 2600 కోట్ల వసూళ్లు. ఇప్పుడు ఈద్‌కు మరో బాలీవుడ్ ఫిలిం సికిందర్ సినిమా రిలీజ్ అవుతోంది. ఎంత లేదనుకున్నా ఈద్ సమయంలో సల్మాన్ సినిమా అంటే ఈజీగా మూడు నాలుగు వందల కోట్లు కొల్లగొడుతుంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో మూడు వేల కోట్ల వసూళ్లకు రష్మిక కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది అనేది సంచలనం సృష్టిస్తోంది.దేశ సినీచరిత్రలోనే..బాలీవుడ్‌ను ఏళ్లకు ఏళ్లు ఏలిన దీపిక, ఆలియా భట్, కత్రినాకైఫ్‌కు కూడా ఇలాంటి రికార్డ్ లేదు. భవిష్యత్తులో వారు అందుకునే ఛాన్స్ కూడా లేదు. వీటికి అంతకు ముందు రష్మిక నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ యానిమల్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే హిందీ ఇండస్ట్రీలో రష్మిక కలెక్షన్స్ రికార్డ్ రూ.3500 కోట్లు దాటుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరే హీరోయిన్‌కు ఈ స్థాయి బ్లాక్ బస్టర్స్ లేవు. ఈ రేంజ్ కలెక్షన్స్ లేవు. అందుకే రష్మిక నేమ్ అంత స్పెషల్ గా మారింది. బాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ క్వీన్ అనిపించుకుంటోంది.(చదవండి: మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్)కొంత కష్టం.. కొంత అదృష్టంకెరీర్ బిగినింగ్ నుంచి రష్మికకు లక్ ఫ్యాక్టర్ ఎక్కువ. పైగా కష్టపడం ఈ హీరోయిన్‌కు మరింత ఇష్టం. అందుకే ఇంత అందలం. ఆకాశమే హద్దుగా స్టార్ డమ్. ఒక్క బ్లాక్ బస్టర్ అందివస్తేనే కెరీర్ పరుగులు పెడుతుంది. అలాంటిది బాలీవుడ్లో రష్మికపై బ్లాక్ బస్టర్స్ వర్షం కురుస్తోంది. హిట్ మీద హిట్, రికార్డుల మీద రికార్డులు వస్తున్నాయి, పడుతున్నాయి. సికందర్లో తనకంటే 31 ఏళ్ల పెద్ద వయసు ఉన్న సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ఆడిపాడింది రష్మిక. ఇక్కడ కూడా మంచి మార్కులే వేయించుకుంది. తనదైన నటనతో సల్మాన్ మనసు గెల్చుకుంది. అందుకే భాయ్ జాన్.. ఏజ్ గ్యాప్‌పై ఓపెన్ అయిపోయాడు.రష్మికకు, వాళ్ల ఫాదర్ కు లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఎందుకని ప్రశ్నించాడు. సికిందర్ తర్వాత కూడా మరిన్ని క్రేజీ మూవీస్ చేయబోతోందీ బ్యూటీ. అందులో స్త్రీ సిరీస్ లాంటి హారర్ కామెడీ మూవీ కూడా ఉంది. సికిందర్ బాక్సాఫీస్ రిజల్ట్ అనుకున్న స్థాయిలో ఉన్నా, లేకపోయినా ఆ తర్వాత కనిపించే హారర్ కామెడీ మెప్పించకపోయినా బాలీవుడ్లో రష్మిక కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏం లేదు. ఎందుకంటే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ లైన్లో ఉంది. ఆలాగే పుష్ప-3 పట్టాలెక్కాల్సి ఉంది. ఈ రెండు సీక్వెల్స్‌తో రష్మిక నేమ్, రష్మిక రికార్డ్స్, రష్మిక కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.చదవండి: కమెడియన్ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య -
పోటీ తప్పదనే మైండ్‌సెట్‌తో ఉండాలి: ‘మైత్రీ’ నిర్మాత
‘‘రాబిన్ హుడ్’లో మంచి వినోదం ఉంది. ఓ హార్ట్ టచింగ్ పాయింట్‌ను ఈ సినిమాలో టచ్ చేశాం. ఆడియన్స్ కొత్త అనుభూతి పొందుతారు’’ అని నితిన్ అన్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నాది చాలా ఇంటలెక్చువల్ రోల్. క్లైమాక్స్‌లో నా క్యారెక్టర్ రౌండప్, వచ్చే ట్విస్ట్‌లు, షాక్‌లు ఆడియన్స్‌కు ఫ్రెష్‌గా అనిపిస్తాయి’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో ఫన్ ఉన్నప్పటికీ కథలో ఆత్మ మాత్రం ఎమోషనే. ఆ ఎమోషన్ సీక్వెన్స్ బాగా వర్కౌట్ అయింది’’ అని తెలిపారు వెంకీ కుడుముల. ‘‘ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో సోలో రిలీజ్ డేట్ ఆశించకూడదు. మేం వస్తున్నామన్నప్పుడు మా ఒక్క సినిమానే ఉంది. కానీ ఇప్పుడు రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. మనం మూవీ చేస్తున్నప్పుడే పోటీ తప్పదనే మైండ్ సెట్‌తో దిగాలని భావిస్తా. ఇక వచ్చే ఏడాది మా బ్యానర్‌కు చాలా ముఖ్యం. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్, రామ్‌చరణ్– బుచ్చిబాబు, ప్రభాస్–హను రాఘవపూడి, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రాహుల్ సంకృత్యాన్–విజయ్ దేవరకొండ మూవీ, పవన్ కల్యాణ్ సినిమా... ఈ అరడజను సినిమాలపై మా ప్రస్తుత ఫోకస్ ఉంది. ఇక తమిళ హీరో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నాం. మా బేనర్లో ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి’’ అని నిర్మాత రవిశంకర్ అన్నారు. -
‘ఎల్2: ఎంపురాన్’ మూవీ రివ్యూ
మోహన్‌లాల్(mohalal) సినిమాలకు మాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ ఉంటుంది. ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ‘లూసిఫర్’ చిత్రం యావత్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే ‘ఎల్2: ఎంపురాన్’ (L2: Empuraan Telugu Movie Review ). పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేశారు మేకర్స్. టాలీవుడ్లో దిల్ రాజు విడుదల చేస్తుండడంతో ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. లూసిఫర్ చిత్రం ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. పీకేఆర్ మరణంతో కేరళలో రాజకీయ అలజడి మొదలవ్వడం.. సీఎం సీటు కోసం కుట్రలు చేసిన బాబీ(వివేక్ ఒబెరాయ్)ని స్టీఫెన్ (మోహన్‌లాల్) అడ్డుకొని.. పీకేఆర్ కొడుకు జతిన్ రాందాస్(టొవినో థామస్)ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తాడు. అక్కడితో లూసిఫర్ కథ ముగుస్తుంది. సీఎం అయిన తర్వాత జతిన్ రాందాస్ బుద్ది కూడా మారుతుంది. సొంత ప్రయోజనాల కోసం మతతత్వ వాది బాబా భజరంగి(అభిమన్యు సింగ్)తో చేతులు కలిపి ఎల్‌యూఎఫ్ పీకేఆర్ అని కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లోకి వెళ్తాడు. ఈ విషయం లండన్‌లో ఉన్న స్టీఫెన్(మోహన్ లాల్)కి తెలుస్తుంది. తన రాష్ట్రాన్ని కబలించడానికి శత్రువులంతా ఏకమై రాజకీయ యుద్ధం చేయడానికి సిద్ధమైతే..స్టీఫెన్ దాన్ని ఎలా తిప్పికొట్టాడు? అనేది సినిమా కథ. అసలు స్టీఫెన్ నేపథ్యం ఏంటి? ఖురేషీ అబ్రాన్‌గా పేరు మార్చుకొని విదేశాల్లో ఏం చేస్తున్నాడు? అతని కోసం ఇతర దేశాల గుఢాచార సంస్థలు ఎందుకు వెతుకుతున్నాయి. జతిన్ కొత్త పార్టీని స్థాపించిన తర్వాత పీకేఆర్ కూతురు ప్రియ(మంజు వారియర్) ఎలాంటి నిర్ణయం తీసుకుంది? బల్రాజ్ పటేల్ కాస్త బాబా భజరంగిగా ఎలా మారాడు? భజరంగికి జయేద్ మసూద్(పృథ్విరాజ్ సుకుమార్) మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(L2: Empuraan Movie Review ) ఎలా ఉందంటే..ఆరేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్ చిత్రంలో మోహన్‌లాల్‌ని డిఫరెంట్‌గా చూపించడంతో పాటు పొలిటికల్ డ్రామాను బాగా పండించాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. సీక్వెల్‌కి కూడా అదే ఫాలో అయ్యాడు. హీరోతో పాటు ప్రతి పాత్రకు భారీ ఎలివేషన్స్ ఇచ్చాడు.కథ-కథనాన్ని కూడా బాగానే రాసుకున్నాడు. కానీ కథ కంటే ఎక్కువ ఎలివేషన్స్‌పైనే దృష్టిపెట్టాడు. మోహల్‌లాల్ వచ్చే ప్రతి సీన్‌కి ఎలివేషన్ పెట్టడం కొన్నిచోట్ల అతిగా అనిపిస్తుంది. అలాగే సినిమాలోని ప్రతి పాతకు ఓ ప్లాష్‌బ్యాక్ స్టోరీ చూపించడంతో కథనం సాగదీసినట్లుగా సాగుతుంది. సీన్ల పరంగా చూస్తే మాత్రం సినిమా అదిరిపోతుంది. ప్రతి ఐదు పది నిమిషాలకు గూస్బంప్స్ తెప్పించే సన్నివేశం ఉంటుంది. సినిమా ప్రారంభమైన యాభై నిమిషాల వరకు మోహన్‌లాల్ తెరపై కనిపించడు. ఆయన వచ్చి ఈ రాజకీయ అలజడిని ఎలా అడ్డుకుంటాడో అనేలా కథనాన్ని నడిపించి.. ఆయన ఎంట్రీ కోసం ఎదురు చూసేలా చేశారు. ప్రేక్షకుడు ఎదురుచూపులకు ఏ మాత్రం నిరాశ కలగకుండా ఎంట్రీ సీన్ ఉంటుంది. హీరో విదేశాల్లో ఉన్నప్పుడు వచ్చే యాక్షన్ సీన్లు హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తాయి. ఆయా సన్నివేశాలను స్టైలీష్‌గా తీర్చి దిద్దారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ద్వితియార్థం మొత్తం కేరళ రాజకీయాల చుట్టే జరుగుతుంది. అయితే సినిమాల్లో చాలా లేయర్లు ఉండడం.. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కొన్ని సన్నివేశాలు పెట్టడం ఆడియెన్స్ ని డీవియేట్ చేస్తుంది. ఇక సినిమాకి మరో ప్రధాన మైనస్ ఎంటంటే.. డైలాగులు. ఈ సినిమాలోని డైలాగులలో ఎక్కువగా ఓ మతం ప్రజలు వాడే పదాలే ఎక్కువగా కలిపిస్తాయి . డబ్బింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేస్తే బాగుండేది. క్లైమాక్స్‌లో మోహల్ లాల్, పృథ్విరాజ్ కలిసి చేసే ఫైటింగ్ సీన్ ఫ్యాన్స్‌ని ఈలలు వేయిస్తుంది. పార్ట్ 3పై ఆసక్తిని పెంచేలా ముగింపు ఉంటుంది. స్టీఫెన్ అలియాస్ ఖురేషీ అబ్రాన్ నేపథ్యం పూర్తిగా తెలియాలంటే ‘ఎల్ 3’ కోసం ఎదురు చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. మోహన్‌లాల్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఆయన ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘ఎల్2:ఎంపురాన్’లో స్టీఫెన్‌గా, ఖురేషి అబ్రాన్‌గా రెండు పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఫ్యాన్స్ సినిమా చూడడానికి ఆయన ఎంట్రీ సీన్ ఒకటి చాలు. తెరపై ఆయన కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్‌కి పునకాలే. సీఎం జతిన్ రాందాస్‌గా టోవినో థామస్ సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర కోసం రాసుకున్న సన్నివేశాలే సినిమాకు కీలకం. మంజు వారియర్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. పొలిటికల్ లీడర్‌గా ఆమె బాగా నటించారు. సెకండాఫ్‌లో ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక విలన్ బాబా భజరంగీ అలియాస్ బల్రాజు పటేల్‌గా అభిమన్యు సింగ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతావారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. హాలీవుడ్ మూవీ స్థాయిలో యాక్షన్ సీన్లను తీర్చిదిద్దారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. దీపక్ దేవ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేసి, నిడివిని తగ్గిస్తే బాగుండేదేమో. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ పిక్చర్స్, శ్రీ గోకులం మూవీస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘ఎల్ 2: ఎంపురాన్’ మూవీ ట్విటర్ రివ్యూ
మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న L2: ఎంపురాన్ (L2:Empuraan) మూవీ ఎట్టకేలకు నేడు(మార్చి 27) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అభిమానుల్లో మొదటి భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. మాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలు మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఇప్పటికే బొమ్మ పడపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఎంపురాన్ ఎలా ఉంది? లూసిఫర్ స్థాయిలో విజయం సాధిస్తుందా లేదా? మోహన్‌లాల్ ఖాతాలో మరో భారీ హిట్ పడినట్టేనా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే.ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో ఎంపురాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. కథలో డెప్త్, స్క్రీన్‌ప్లేలో ఉన్న ఉత్కంఠను మెచ్చుకుంటున్నారు. పృథ్విరాజ్ మేకింగ్, మోహన్‌లాల్ యాక్టింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. మరికొంత మంది లూసిఫర్ రేంజ్లో సినిమా లేదని కామెంట్ చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ కావాలని దళపతి విజయ్, మమ్ముట్టితో పాటు పలువురు టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. 🔥 #EmpuraanReview: A light Storytelling in the First Half, Extraordinary Interval, Exceptional Second half with Outstanding Climax - Surprising Post Credit #Mohanlal #tovinothomas#PrithvirajSukumaran #Empuraan #L2E pic.twitter.com/N1ROnfByRI— MJ Cartels (@Mjcartels) March 26, 2025 లైట్ స్టోరీ టెల్లింగ్‌తో ఫస్టాఫ్ ఆకట్టుకునేలా ఉంది. ఇంటర్వెల్ సీన్, సెకండాఫ్ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.Face The World AbraamHello is coming to hunt down Box office #Empuraan #L2E#Mohanlal #L2Empuraan#KajalAggarwal #Sikandar #Devara #JrNTR #JanaNayagan #ThalapathyVijay #VeeraDheeraSooran#RamCharan #NTRNeel #Nayanthara #RC16 #Thudarum #AlappuzhaGymkhana #Bazooka pic.twitter.com/Br8cHlXQPQ— AD Signatures (@AD_Signatures) March 27, 2025Best wishes to the entire cast and crew of #Empuraan for a historic victory! Hope it crosses boundaries across the world and makes the entire Malayalam industry proud. Rooting for you, Dear Lal and Prithvi 😊 pic.twitter.com/ipPJ7SNO67— Mammootty (@mammukka) March 26, 2025#L2E #Empuraan - Bang ON entry for Mohanlal after an Hour with peak commercial elevation. Hollywood level visuals & stunts🥵Director Prithviraj 🔥🔥 pic.twitter.com/WdHqFt1K00— AmuthaBharathi (@CinemaWithAB) March 27, 2025#EmpuraanReview First Half - MASSSSSS So far 🤯🔥First half primarily focused on Character & story building 🎯💯Mohanlal Entry & Interval block are filled with peak elements 🔥🥵 ENGAGING waiting for Second Half ⚡⚡#Empuraan pic.twitter.com/2IbwJCcR26— Pan India Review (@PanIndiaReview) March 27, 2025#Empuraan Jungle Poli 💥💥🔥🔥🔥Peak Theatre Experience 💥🔥🔥🔥🔥 pic.twitter.com/AZOsFy5X16— Kerala Box Office (@KeralaBxOffce) March 27, 2025#EMPURAAN FIRST HALF - FIRE MAXXX With Peak Interval Block🙏🏻🔥#PRITHVRAJSUKUMARAN Making, Visuals & Frames are Just Lit That Never Seen before in Mollywood!Finally my Man #MOHANLAL Unleashed His Stardom Upto The Potential & Theatre Erupted for Each😭🔥 pic.twitter.com/GxEaySFFWZ— Abin Babu 🦇 (@AbinBabu2255) March 27, 2025#L2Empuraan ReviewFIRST HALFGood & Engaging 👍#Mohanlal Shines 🙌The story is built well 👌Each n every star cast are terrific till now 👏BGM & Technical Aspects 🔥#PrithvirakSukumaran’s direction going well💯Interval🔥#Empuraan #L2EmpuraanReview #EmpuraanReview pic.twitter.com/QzgmXDliko— Swayam Kumar Das (@KumarSwayam3) March 27, 2025 -
శంకర్ వరప్రసాద్‌గా చిరంజీవి.. మెగా అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి (Anil Ravipudi) అంటేనే హాస్యానికి, విజయానికి చిరునామా. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మామూలు సక్సెస్ అందుకోలేదు. ఎవరూ ఊహించనంతగా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ సంతోషంలో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్నామని మాటిచ్చేశాడు. కాకపోతే ఈసారి వెంకీమామతో కాదు.. చిరంజీవి (Chiranjeevi Konidela)తో! ఇందుకోసం వైజాగ్ వెళ్లి సినిమా కథ సిద్ధం చేసుకున్నాడు. కథకు పచ్చజెండా ఊపిన చిరుగ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్లో చిరంజీవిని చూస్తారని అభిమానులకు మాటిచ్చాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా అప్డేట్ ఇచ్చాడు. 'కథ పూర్తయింది. చిరంజీవిగారికి ఫైనల్ స్క్రిప్ట్ చదివి వినిపించాను. నా కథలోని శంకర్ వరప్రసాద్ పాత్రను పరిచయం చేశాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇంకెందుకు లేటు.. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకు శ్రీకారం చుట్టేద్దాం' అని ఎక్స్(ట్విటర్)లో ట్వీట్ చేశాడు.చిరంజీవి ఒరిజినల్ పేరుతో..షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఈ సినిమా నిర్మితం కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. ఇది చూసిన అభిమానులు ఉగాదికి ముందు ఎంత మంచి శుభవార్త చెప్పారు.. ఇంకో బ్లాక్‌బస్టర్ తథ్యం అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఇందులో శివ అనే పదాన్ని తీసేసి మిగతాది యథాతథంగా వాడేశారు. మెగాస్టార్ అసలు పేరును వాడేస్తున్న అనిల్ రావిపూడి సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే వచ్చే సంక్రాంతిదాకా ఆగాల్సిందే! Final script narration done & locked 📝☑️🔒 చిరంజీవి గారికి నా కధ లో పాత్ర“శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను .. 😄He loved & enjoyed it thoroughly ❤️🔥ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో… ‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం 🥳#ChiruAnil MegaStar @KChiruTweets garu…— Anil Ravipudi (@AnilRavipudi) March 26, 2025 చదవండి: అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. శోభిత హర్ట్ -
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
కుటుంబ గొడవలతో ముంచు ఫ్యామిలీ పరువు రోడ్డునపడింది. విష్ణు (Vishnu Manchu)- మనోజ్ (Manoj Manchu)కు మధ్య సఖ్యత కుదరట్లేదు అనుకుంటే.. మనోజ్- మోహన్‌బాబు మధ్య కూడా గొడవలు జరగడం అభిమానులనే కాదు ఇండస్ట్రీని సైతం షాక్‌కు గురి చేసింది. ఇలా వీరింట్లో ఏదో ఒకరకంగా తగవులాడుతూనే ఉన్నారు. ఈ రచ్చ వల్ల తన పిల్లలు ఇబ్బందిపడుతున్నారంటోంది మంచు మోహన్‌బాబు పెద్ద కోడలు, విష్ణు సతీమణి విరానిక (Viranica Manchu). ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయితాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కుటుంబ కలహాలపై స్పందించింది. విరానిక మాట్లాడుతూ.. కుటుంబమన్నాక గొడవలు అవుతూనే ఉంటుంది. కేవలం మా ఫ్యామిలీ అనే కాదు ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి. కానీ చాలావరకు బయటకు రావు. దురదృష్టవశాత్తూ మా కుటుంబంలోని గొడవలు బయటకువచ్చాయి. దానికి మనమేం చేయలేం. నాకు నా పిల్లలు ముఖ్యం. వారికోసం ఏదైనా భరిస్తాను. ఒక స్పాంజిలా అన్నింటినీ ఓపికగా స్వీకరిస్తాను. పిల్లలకన్నా నాకెవరూ ముఖ్యం కాదు. కానీ జరుగుతున్న రచ్చ వల్ల నాకన్నా నా పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. భయపడిపోతున్నారు. నాలుగో ప్రెగ్నెన్సీపై ట్రోలింగ్అసలేం జరుగుతుంది? తాతయ్యకేమైనా అవుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. అందుకే పిల్లల్ని.. వివాదాలకు చాలా దూరంగా ఉంచుతాను. నేను ధైర్యంగా ఉంటేనే వారికి ఎంతోకొంత ధైర్యం చెప్పగలను అని విరానిక చెప్పుకొచ్చింది. అలాగే తను నాలుగోసారి గర్భం దాల్చినప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేశారంది. మీకేం పని లేదా? అంటూ నోటికొచ్చినట్లు తిట్టారని బాధపడింది. విష్ణుకు, తనకు పిల్లలంటే ఇష్టమని.. అందుకే నలుగుర్ని కన్నామని విరానిక పేర్కొంది.చదవండి: అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత -
ఛలో గల్ఫ్ అన్న బన్నీ, చరణ్.. టాలీవుడ్ సీక్రెట్ అదేనా?
గత కొంతకాలంగా దక్షిణాది సినిమాలకు అత్యంత విశ్వసనీయ నేస్తంగా వర్ధిల్లుతున్నాయి గల్ఫ్ దేశాలు.. ముఖ్యంగా దుబాయ్. మన అవార్డు ఫంక్షన్ల నుంచీ, సంగీత కార్యక్రమాలు, ఇతరత్రా ఈవెంట్స్ దాకా దుబాయ్‌తో భాయ్ భాయ్ అంటుంటారు దక్షిణాది చిత్ర ప్రముఖులు.. అందులోనూ మన తెలుగు సినీ ప్రముఖులు మరింత ముందుంటార ని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల ఏ వేడుకా లేకపోయినా, ఏ ముఖ్యమైన కార్యక్రమం లేకపోయినా కూడా టాలీవుడ్ స్టార్లు తరచుగా దుబాయ్‌కి రాకపోకలు సాగిస్తుండడం కనిపిస్తోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి.(చదవండి: వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా?)చీమ చిటుక్కు మంటే చాలు చిటికెలో దాన్ని బయటకు తెచ్చేసి చీల్చి చెండాడేసే ఈ సోషల్ మీడియా యుగంలో... రహస్యాల్ని కాపాడుకోవడానికి తెరమీద వీరోచితంగా పోరాటాలు చేసే హీరోలు...తెరవెనుక మాత్రం ఛలో దుబాయ్ అంటున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది.వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా, తెలుగు టాప్ స్టార్లు, డైరెక్టర్లు ఇప్పుడు అరబ్ దేశాలను తాము ఇష్టపడే సమావేశ గమ్యస్థానాలుగా మార్చుకుంటున్నారని అర్ధమవుతోంది. దీనికి కొన్ని నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఇటీవల, టాలీవుడ టాప్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు సుకుమార్ లు అబుదాబిలో చక్కర్లు కొడుతూ కనిపించారు, వారి తదుపరి చిత్రం గురించి చర్చించడానికే వీరిద్దరూ ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారని సమాచారం. రంగస్థలం తో భారీ విజయాన్ని నమోదు చేసిన వీరి కాంబినేషన్, ఆధునిక టచ్‌తో కూడిన యాక్షన్–ప్యాక్డ్ చిత్రం కోసం మళ్లీ చేతులు కలిపింది. (చదవండి: సల్మాన్ కొత్త సినిమాకు ఘోరమైన పరిస్థితి!)మరోవైపు టాప్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా దుబాయ్‌లో ప్రఖ్యాత తమిళ దర్శకుడు అట్లీతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఇప్పటికే బన్నీ తదుపరి చిత్రంపై రకరకాల అంచనాలు , పుకార్లు షికారు చేస్తుండగా, వాటికి ఊతమివ్వడం ఇష్టం లేకే బన్నీ, అట్లీలు కూడా గల్ఫ్ బాట పట్టి ఉంటారని అంటున్నారు.‘ఈ తారలు మీడియా హడావిడి, తొంగి చూడడాలు లేకుండా వారితో సహకరించడానికి ఆసక్తి ఉన్న పరిశ్రమ పెద్దల జోక్యం లేకుండా చర్చలు జరపడానికి తగిన గోప్యతను కోరుకుంటారు‘ అని ఒక నిర్మాత తెలిపారు. అకాల లీక్‌లు తరచుగా వాస్తవాలను ఇష్టారాజ్యంగా వక్రీకరిస్తాయని ఆ నిర్మాత వివరిస్తున్నారు. ‘ప్రత్యర్థి నిర్మాతలు కొన్నిసార్లు మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం, సగం వండిన సమాచారాన్ని అందజేస్తారు, ఇది అనవసరమైన ఊహాగానాలకు దారి తీస్తుంది. ఒక ప్రాజెక్ట్ పాన్–ఇండియా చిత్రం అని చెప్పవచ్చు, మరొక దాంట్లో అల్లు అర్జున్ తో స్క్రీన్ ను పంచుకోనున్నారంటూ ఎవరెవరో తారలను సూచిస్తుంది, ఇది చిత్రాన్ని రూపొందించే రూపకర్తల వాస్తవ ప్రణాళికల చుట్టూ గందరగోళాన్ని సృష్టిస్తుంది.‘హైదరాబాద్, ముంబై చెన్నై లు ఫొటో/ వీడియోగ్రాఫర్లతో నిండిపోవడంతో, తెలుగు తారలు అధికారిక ప్రకటనలు చేయడానికి ముందుగా, ప్రాజెక్ట్‌లను ఖరారు చేయడానికి తెలివిగా తగిన ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో, ఒక్క ఎయిర్‌పోర్ట్‌ను చూసినా లేదా లీక్ అయిన ఇమేజ్ అయినా కూడా విపరీతమైన పుకార్లు నిరాధారమైన ఊహాగానాలకు దారి తీస్తుంది. ‘తరచుగా, ఈ నివేదికలలో ఎటువంటి నిజం ఉండదు,‘ అని ఆ నిర్మాత విశ్లేషించారు. -
డైరెక్టర్‌తో నయనతార గొడవ.. ఖుష్బూ క్లారిటీ
ఖుష్బూ సుందర్ భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్.సితో స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) గొడవ పడిందనే రూమర్ గత మూడు,నాలుగు రోజులుగా తమిళ్ ఇండస్ట్రీలో బాగా వినిపించింది. సుందర్.సి దర్శకత్వంలో నయన్ ‘మూకుతీ అమ్మన్ 2’ అనే సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమా సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌కు, నయనతారకు గొడవ జరిగిందని, దీంతో సుందర్.సి షూటింగ్ నిలివేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు సుందర్‌తో కూడా నయన్ గొడవకు దిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై సుందర్ సతీమణి, నటి ఖుష్భూ(Khushbu Sundar) క్లారిటీ ఇచ్చింది.‘మూకుతీ అమ్మన్ 2’(Mookuthi Amman 2) సినిమా గురించి సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్‌ను ప్రచారం చేసేవారు కాస్త ఆగమని కోరుతున్నా. సినిమా షూటింగ్ సాఫీగా జరుగుతోంది, ప్లాన్ చేసినట్లుగానే చిత్రీకరణ పూర్తవుతోంది. సుందర్ ఇలాంటి రూమర్స్‌ను ఎప్పుడూ పట్టించుకోరని అందరికీ తెలిసిందే. నయనతార అద్భుతమైన నటి, గతంలో ఆమె పోషించిన పాత్రను మళ్లీ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. దయచేసి ఈ సినిమా గురించి ఆధారం లేని రూమర్స్‌ను ఆపండి. అభిమానులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు. మీ మద్దతు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా. సుందర్.సి నుంచి మరో హిట్ కోసం ఎదురుచూడండి’ అని సుందర్ పోస్ట్ చేశారు. ఖుష్భూ ట్వీట్‌తో గత కొద్ది రోజులుగా వస్తున్న రూమర్స్‌కి అడ్డుకట్ట పడింది.'మూకుత్తి అమ్మన్ 2' విషయానికొస్తే.. 2020లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘మూకుత్తి అమ్మన్'(తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాకు సీక్వెల్ ఇది. ‘మూకుత్తి అమ్మన్' చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా.. సీక్వెల్‌ని సుందర్.సి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో నయనతారతో పాటు ఇనియా, రెజీనా కసెండ్రా, మైనా నందిని, దునియా విజయ్, సింగం పులి, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.To all the wellwishers of #SundarC Sir. Too many unwanted rumors are floating about ##MookuthiAmman2 . Please loosen up. Shoot is underway smoothly and going as planned. Everyone knows Sundar is a no nonsense person. #Nayanthara is a very professional actor who has proved her…— KhushbuSundar (@khushsundar) March 25, 2025 -
వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా?
ఒకప్పుడు రెమ్యునరేషన్ల విషయానికి వస్తే.. కేవలం హీరోలకు ఇచ్చే భారీ పారితోషికాలే చర్చకు వచ్చేవి. ఇప్పటికీ రెమ్యునరేషన్స్ తీసుకునే విషయంలో హీరోలదే పై చేయి ఉన్నప్పటికీ... హీరోయిన్లు, దర్శకులు కూడా వారితో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఒకవేళ సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాత, పంపిణీదారులు మాత్రమే నష్టపోతుండగా, భారీ పారితోషికాలు అందుకుంటున్న హీరోలు, దర్శకులు మాత్రం సేఫ్‌గానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో హీరోలు, దర్శకులు కూడా రెమ్యునరేషన్( Remuneration) కు బదులు లాభాల్లో వాటాలు పొందాలనే చర్చ మొదలైంది.తాజాగా గేమ్ ఛేంజర్ ద్వారా భారీ నష్టాల్ని చవిచూసి, సంక్రాంతికి వస్తున్నాం ద్వారా కొంత ఉపశమనం పొందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్లో ఈ ఆసక్తికర చర్చకు తెర లేపారు. మలయాళ చిత్రం ఎల్2: ఎంపురాన్ (L2: Empuraan)ను తెలుగు రాష్ట్రాలకు తీసుకువస్తున్న దిల్ రాజు(Dil Raju) ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... మోహన్‌లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ ల సెన్సేషనల్ చిత్రం ఎల్2: ఎంపురాన్ కోసం తమ రెమ్యునరేషన్‌ను మాఫీ చేశారని, బదులుగా లాభాన్ని పంచుకునే మోడల్‌ను ఎంచుకున్నారని ఆయన వెల్లడించారు.అలాంటి మోడల్ టాలీవుడ్లో కూడా పనిచేయగలదా అని అడిగిన ప్రశ్నకు, దిల్ రాజు స్పందిస్తూ, ‘‘రాజమౌళి తన చిత్రాలకు ముందస్తుగా పారితోషికం వసూలు చేయరనీ, తన సినిమాలకు లాభాలను పంచుకునే పద్ధతిని అనుసరిస్తాడనీ వెల్లడించారు. అదే విధంగా కెజిఎఫ్, సలార్ల చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడు అదే పంధాలో పని చేస్తున్నాడు. ఈ మోడల్ త్వరలో తెలుగు సినిమాలో మరింత పుంజుకుంటుందని, సాధారణమైన విషయంగా మారుతుంది’’ అంటూ ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తాను మొదట గేమ్ ఛేంజర్ సినిమా సందర్భంగా దీన్ని అమలు చేయాలనే ప్రయత్నం చేశానని, అయితే, సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో, శంకర్, రామ్ చరణ్ లు తమ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారనీ వివరించారు.అయితే, ఈ విధానం టాలీవుడ్లో ఓ సంప్రదాయంగా మారడంపై పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘మన పెద్ద స్టార్లు, దర్శకులు భారీ చెల్లింపులు అడ్వాన్స్‌లకు అలవాటు పడ్డారు, లాభాల భాగస్వామ్య వ్యవస్థను అమలు చేయడం సినిమా లావాదేవీలను కష్టతరం చేస్తుంది. సూపర్స్టార్లు సినిమాకు75–125 కోట్లు వసూలు చేయడం దర్శకులు రూ.25–50 కోట్లు వసూలు చేయడం వల్ల లాభాలను పంచుకోవడం పనికిరావచ్చు, అయితే నష్టాలు వచ్చినట్లయితే డబ్బును పూర్తిగా వదులుకోవాలనే ఆలోచనను అంగీకరించడం అసంభవం’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజమౌళి నమూనా ఆయన వరకూ విజయవంతం అయినప్పటికీ, టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకులు, హీరోలు స్థిరమైన చెల్లింపులను కాదనుకుని విజయంలో భాగస్వామ్య వాటాలకు మారడాన్ని స్వీకరిస్తారా? అనేది సందేహాస్పదమే. -
‘బ్యూటీ’ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డు
‘బ్యూటీ’ అనే చిత్రంతో నీలఖి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం, ‘హలో వరల్డ్’ ఫేమ్ వర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య హీరోగా, నీలఖి హీరోయిన్గా నటించారు.నీలఖి తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టకముందే ఒడిశాలో తన ప్రతిభను చాటుకున్నారు. ఒడిశాలోని ప్రముఖ ఛానెల్ తరంగ్ టీవీ నిర్వహించిన ‘తరంగ్ సినీ ఉత్సవ్’ కార్యక్రమంలో ‘యంగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ - డెబ్యూ ఫీమేల్’ విభాగంలో నీలఖి అవార్డును గెలుచుకున్నారు. తెలుగు ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకుంటారని ‘బ్యూటీ’ టీమ్ గట్టి విశ్వాసంతో ఉంది.ఇప్పటికే విడుదలైన ‘బ్యూటీ’ సినిమా పోస్టర్లు, టీజర్లో నీలఖి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె నటనలో భావోద్వేగాలను అద్భుతంగా పండించారని టీమ్ గతంలోనే వెల్లడించింది. ‘బ్యూటీ’ చిత్రంతో నీలఖి తెలుగు సినిమా పరిశ్రమలోకి ఘనంగా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.వానరా సెల్యులాయిడ్ బ్యానర్‌పై మారుతి టీమ్‌తో కలిసి జీ స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
పౌరాణికంలో 11 పాత్రలు .. ఆ రికార్డు నాదే: డా.లయన్ సాయి వెంకట్
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ" (Jayaho Ramanuja ). ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర సాంగ్స్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ -పాన్ ఇండియా భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంటే ఇది చిన్న సినిమా అనకూడదు. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడంలో మా వంతు సపోర్ట్ చేస్తాం. జయహో రామానుజ సాయి వెంకట్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – మన తెలుగు రాష్ట్రాల్లో రామానుజాచార్యుల గురించి పెద్దగా తెలియదు. కానీ తమిళనాట ప్రతి ఒక్కరికీ ఆయన ఎవరో తెలుసు. చినజీయర్ స్వామి సమతామూర్తి విగ్రహాన్ని మన దగ్గర ప్రధాని, రాష్ట్రపతి వంటి పెద్ద వాళ్లు వచ్చి ఆవిష్కరించినప్పుడు తెలుగు రాష్ట్రాల వారికి బాగా ఆయన గురించి తెలిసింది. తెలుగు ప్రజలకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియజేసే ప్రయత్నంలోనే ఈ చిత్రాన్ని రూపొందించాను. వెంకటేశ్వర స్వామికే గురువు లాంటి వారు రామానుజులు. వెంకటేశ్వరుడికి శంఖు చక్రాలు రామానుజాచార్యుల వారే బహూకరించారు. కమల్ హాసన్ గారు సోషల్ మూవీలో 10 పాత్రలు చేశారు. కానీ పౌరాణికంలో ఎవరూ 11 పాత్రల్లో నటించలేదు. నేను "జయహో రామానుజ" చిత్రంలో 11 పాత్రలు చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయండి అని మిత్రులు ఇచ్చిన సలహాతో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంతో పాటు మిగతా ప్రపంచ భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం’ అఅన్నారు.నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ – ముందుగా నాన్నకు బర్త్ డే విషెస్ చెబుతున్నా. "జయహో రామానుజ" వంటి భారీ చిత్రాన్ని నేను నిర్మించగలను అని నమ్మి నన్ను సపోర్ట్ చేస్తున్న నాన్నకు థ్యాంక్స్. ఆయన ప్రోత్సాహం లేకుంటే నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేదాన్ని కాదు. రాజమౌళి గారి సినిమాలు కూడా రిలీజ్ వాయిదా పడుతుంటాయి. క్వాలిటీ కోసం కొంత టైమ్ తీసుకోవడం మంచిదే. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో జయహో రామానుజ చిత్రాన్ని నిర్మించాం. ఈ రోజు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మించాను. త్వరలోనే మా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. మీరంతా మీ ఆదరణ చూపిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు -
‘పొన్ మాన్’ మూవీ రివ్యూ : అప్పు ఎప్పుడైనా నిప్పే!
ఈ రోజుల్లో అప్పు చేయని వాళ్ళు చాలా తక్కువ. మరీ మధ్యతరగతి వాళ్ళు అవసరాల కోసం అప్పులకై తిప్పలు పడతారు. ఒకవేళ అప్పు దొరికినా దానిని తీర్చడం మరో ఎత్తు. ఈ కసరత్తు మీదనే పొన్ మాన్(ponman Movie) సినిమా రూపుదిద్దుకుంది. ఇదో మళయాళ సినిమా. జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతుంది. జ్యోతిష్ శంకర్ దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ మళయాళ నటుడు బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఓ ఫ్యామిలీ డ్రామా. కాని జీవితంలో నగదు లేదా డబ్బు రూపేణా అప్పు చేసిన ప్రతివారు చూడవలసిన సినిమా. అలా అని ఇదేదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు, ఓ ఫ్యామిలీ థ్రిల్లింగ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇక పొన్ మాన్ కథ విషయానికొస్తే కేరళ రాష్ట్రంలోని తీర ప్రాంతమైన కొల్లాంలో బ్రూనో అనే వ్యక్తి తో ఈ కథ మొదలవుతుంది. చెల్లెలు స్టెఫీ, తల్లితో పాటు ఓ చిన్న కుటుంబం బ్రూనోది. సంపాదన లేకున్నా రాజకీయలపై ఇష్టంతో ఓ పార్టీలో చేరతాడు బ్రూనో. తన నోటి దురుసుతనం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ కూడా అవుతాడు. బ్రూనో తల్లి స్టెఫీకి త్వరగా పెళ్ళి చేయాలన్న తాపత్రయంలో పక్క ఊరిలోని మరియానోతో 25 సవర్ల బంగారం కట్నకానుకాలు ఇచ్చే విధంగా సంబంధం కుదురుస్తుంది. దానికి గాను అజేష్ అనే బంగారు బ్రోకర్ ను సంప్రదించి పెళ్ళికి ముందు బంగారం తీసుకుని పెళ్ళిలో వచ్చే చదివింపులతో తిరిగి నగదు రూపేణా అప్పు తీర్చేవిధంగా ఏర్పాటు చేస్తుంది. అజేష్ ఇచ్చిన నగలతో స్టెఫీ, మరియానో పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాని అనుకోకుండా అంత డబ్బులు రావు. దీనితో అజేష్ తానిచ్చిన బంగారం కోసం పెళ్ళి వారితో పాటు స్టెఫీ అత్తగారింటికి వెళతాడు. స్టెఫీ మరియానో కరుడుగట్టిన రౌడీ. స్టెఫీ వేసుకున్న బంగారం అప్పుకు తెచ్చిందన్న విషయం అత్తవారింట్లో ఎవరికీ తెలియదు. ఈ సమయంలో అజేష్ తన బంగారం స్టెఫీ నుండి తీసుకోగలడా లేదా అన్నది మాత్రం పొన్ మాన్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం థ్రిల్లర్ జోనర్ తో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తుంది. అప్పు తీసుకునే ప్రతి వాళ్ళూ తీసుకునేటపుడు బరువుగాను తిరిగి ఇచ్చేటపుడు బాధ్యతగాను ఉంటే ఏ సమస్యా ఉండదు. అలా కాని పక్షంలో ఈ సినిమాలో చూపిన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వర్త్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. -
దర్శకుడితో నయనతార గొడవ.. ఆగిపోయిన సినిమా!
స్టార్ హీరోయిన్ నయనతార ( Nayanthara) ఈ మధ్య ఎక్కువ విమర్శలకు గురవుతుంది. రీసెంట్ గానే ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. మూకుత్తి అమ్మన్ 2 సినిమా పూజా కార్యక్రమాల్లో తోటి నటి మీనాను అవమానపరిచారు అంటూ ఆమెను ట్రోల్ చేశారు. తాజాగా నయనతారపై మరో పుకారు నెట్టింట హల్చల్ చేస్తోంది. మూకుత్తి అమ్మన్ 2 సినిమా సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో నయనతార గొడవపడిందట. ఇదే విషయంపై దర్శకుడు సుందర్.సీ, నయనతారల మధ్య విభేధాలు రావడంతో షూటింగ్ నిలిపివేసిట్లు తెలుస్తోంది.నయనతార హీరోయిన్గా సుందర్ సి దర్శకత్వంలో ‘మూకుతి అమ్మన్ 2’ (Mookuthi Amman 2) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా కాస్ట్యూమ్ విషయంలో నయనతార , ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య చిన్నపాటి వివాదం జరిగినట్లు సమాచారం. ఈ సంఘటన నయనతారకు నచ్చకపోవడంతో ఆమె ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌ను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. ఈ చిన్న విషయం కాస్త పెద్ద వివాదంగా మారడంతో దర్శకుడు సుందర్ సి షూటింగ్‌కు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు వినికిడి. నయనతార ప్రవర్తన సుందర్ సికి సంతృప్తి కలిగించకపోవడంతో, ఆమెను సినిమా నుంచి తొలగించి, మరో సీనియర్ నటిని తీసుకొని చిత్రాన్ని కొనసాగించాలనే ఆలోచన చేశాడట. అయితే నిర్మాత ఇషారి కె. గణేష్ జోక్యం చేసుకుని నయనతారతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారట. ప్రస్తుతం చెన్నైలోని ఓ దేవాలయంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.'మూకుత్తి అమ్మన్ 2' విషయానికొస్తే.. 2020లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘మూకుత్తి అమ్మన్' సినిమాకు సీక్వెల్ ఇది. ‘మూకుత్తి అమ్మన్' చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా.. సీక్వెల్‌ని సుందర్.సి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో నయనతారతో పాటు ఇనియా, రెజీనా కసెండ్రా, మైనా నందిని, దునియా విజయ్, సింగం పులి, యోగిబాబు లాంటి పెద్ద స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాలో అమ్మన్ క్యారెక్టర్లో నటించడానికి నయనతార నెల రోజులకు పైగా ఉపవాసం ఉండి నటిస్తున్నారు. ఈ సినిమాకి హిప్ హాప్ ఆది మ్యూజిక్ డైరెక్టర్. -
దేశానికి సేవ చేస్తున్నావా.. బిగ్ జోక్ : హీరోయిన్‌పై ట్రోలింగ్
బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా (Mannara Chopra) ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక సంఘటన వల్ల సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురైంది. ఆమె హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తూ, జైపూర్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఎక్కకుండా సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించింది. ఈ విషయంపై ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోలు పోస్ట్ చేసి, సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, తన పేరు పిలవకపోవడంతో విమానం ఎక్కలేకపోయానని చెప్పింది. ఎయిర్పోర్ట్ సిబ్బందిపై కేకలు వేస్తూ, అరుస్తూ మన్నారా చోప్రా రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో ప్రయాణికురాలు ఆమెకు మద్దతు పలుకుతూ..‘ఆమె పెద్ద సెలబ్రిటీ, దేశానికి సేవ చేస్తోంది’.. మీరు ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించింది. మన్నారా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపిస్తే.. మరికొంతమంది విమర్శిస్తున్నారు. ‘ఎయిర్‌లైన్ నిబంధనల ప్రకారం బోర్డింగ్ 30 నిమిషాల ముందు మూసివేస్తారు, ఆమె సకాలంలో రాకపోతే సిబ్బందిని నిందించడం సరికాదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు "ఆమె దేశానికి సేవ చేస్తోందని చెప్పడం హాస్యాస్పదం" అని, "ఇంత పెద్ద సెలబ్రిటీ ఎవరు? ఆమె ఏ సినిమాల్లో నటించింది?" అంటూ ఎగతాళి చేశారు. ‘ఇండిగో తరచూ ఇలాంటి పొరపాట్లు చేస్తుంది’ అని కొంతమంది, చాలా మంది ఆమె ప్రవర్తనను ‘అతిగా ఉంది’ అని ట్రోల్ చేస్తున్నారు.మన్నారా చోప్రా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ భాషల సినిమాల్లో నటించింది. తెలుగులో "ప్రేమ గీమ జాంత నై" చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత సునీల్‌తో "జక్కన్న", సాయి ధరమ్ తేజ్‌తో "తిక్క" వంటి సినిమాల్లో నటించింది. అలాగే "రోగ్" మరియు "సీత" చిత్రాల్లో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
యాడ్‌కి, సినిమాకి ఒకే రెమ్యునరేషన్..సుహాస్ ఏమన్నారంటే..?
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న హీరో సుహాస్. ఒకవైపు సహాయక నటుడి పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు హీరోగాను రాణిస్తున్నాడు. జూనియర్ ఆర్టాస్ట్గా కేరీర్ ఆరంభించి..ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్లో ఎదిగినట్లుగానే తన రెమ్యునరేషన్‌ని కూడా పెంచేశాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ ఒక్కో సినిమాకు రూ. 2.5 నుంచి రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే రెమ్యునరేషన్ గురించి మీడియా అడిగిన ప్రతిసారి హాస్యాస్పదంగా స్పందిస్తూ తప్పించుకుంటున్నాడు. అయినా కూడా మీడియా ప్రతినిధులు మాత్రం సుహాస్ రెమ్యునరేషన్ గురించి ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ అడుగుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి సుహాస్‌కు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురవ్వగా.. ‘ఏం టార్చర్ ఇది.. యాక్టింగ్ గురించి మానేసి నా రెమ్యూనరేషన్ గురించి ఎందుకు,’ అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు.సుహాస్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓ భామ అయ్యో రామ'.తాజాగా ఈ మూవీ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘యాడ్‌కి, సినిమాకే ఒకే రకమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట కదా?’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దానికి సుహాస్ సమాధానం చెబుతూ.. ‘ప్రతిసారి నా రెమ్యునరేషన్ గురించే అడుగున్నారు? ఏం టార్చర్ అయిపోయింది ఇది.. జీవితమో..(నవ్వుతూ..). మీరు అనుకున్నంత కాదు కాని మంచిగానే ఇచ్చారు. ఇదేంటో.. యాక్టింగ్ బాగా చేస్తాననేది వదిలేసి..రెమ్యునరేషన్ భారీగా తీసుకుంటున్నారనేదే ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు’అని సుహాస్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తున్న వార్తలో నిజం లేదని, తనకు ఇప్పటివరకు ఆ మూవీ టీమ్ నుంచి కాల్ రాలేదని స్పష్టం చేశాడు.ఇక ‘ఓ భామ అయ్యో రామ’ విషయానికొస్తే.. సుహాస్ నటిస్తున్న తొలి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. -
వికటకవి సిరీస్‌కు ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్.. ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందంటే?
హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 (OTTPlay Awards 2025) మూడవ ఎడిషన్ మార్చి 22న ముంబైలో ఘనంగా జరిగింది. అపరశక్తి ఖురానా, కుబ్రా సైత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కాయి. 'డిస్పాచ్' సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా మనోజ్ బాజ్‌పాయ్, 'భామ కలాపం 2' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ప్రియమణి, 'ది రాణా దగ్గుబాటి షో'తో ఉత్తమ టాక్ షో హోస్ట్‌గా రానా దగ్గుబాటితో సహా పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. ఓటీటీలో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్జీ5లో స్ట్రీమ్ అవుతున్న సూపర్ హిట్ సిరీస్ వికటకవి (Vikkatakavi Web Series)కి గాను ప్రదీప్ మద్దాలి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ ఎట్ నైట్)తో కలిసి ఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్) అవార్డును ప్రదీప్ మద్దాలి పంచుకున్నారు. అనంతరం ప్రదీప్ మద్దాలి.. హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్‌కు, అతని తల్లిదండ్రులకు, సిరీస్ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపుతో తనపై బాధ్యత మరింత పెరిగినట్లు చెప్పారు. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సిరీస్ ఇదే1970ల నాటి కల్పిత గ్రామమైన అమరగిరిలో ప్లేగు వ్యాధి నేపథ్యంలో ఆకట్టుకునే గ్రామీణ థ్రిల్లర్ వికటకవి. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య డిటెక్టివ్ రామ కృష్ణగా నటించారు. మేఘా ఆకాశ్ మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. వర్ధమాన దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. '47 డేస్', 'సర్వం శక్తి మయం'తో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వికటకవితో దర్శకుడిగా మరో స్థాయికి వెళ్ళారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించిన మొదటి తెలుగు వెబ్ సిరీస్ వికటకవి కావడం విశేషం.చదవండి: హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా: హర్షవర్ధన్ -
ఆ రూమర్స్‌తో హర్టయ్యా.. కానీ అది కిక్కిచ్చింది: కన్నప్ప హీరోయిన్
కన్నప్ప సినిమాలోని ‘సగమై – చెరి సగమై’ పాటతో అందరి దృష్టినీ ఆకర్షించింది హీరోయిన్ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). తమిళనాడుకు చెందిన ప్రీతి ముకుందన్ మలబార్ గోల్డ్, శరవణన్ స్టోర్స్, చెన్నై సిల్క్స్ వంటి సంస్థల కమర్షియల్ యాడ్స్‌లో మోడల్‌గా నటించింది. తండ్రి గోపాల్ ముకుందన్ వ్యాపారవేత్త. తల్లి చెన్నైలో డెంటిస్ట్‌గా ప్రాక్టీసు చేస్తోంది. తల్లి ప్రోత్సాహంతోనే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఆసక్తి పెంచుకుంది. తల్లే దగ్గరుండి భరతనాట్యం నేర్పించి, ప్రదర్శనలు ఇప్పించింది.ప్రీతియే కాదు తల్లి కూడా నటించింది!తల్లికి యాక్టింగ్ పట్ల ఎంత ఇష్టమంటే కన్నప్ప సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తే, తల్లి కూడా ఓ క్యారెక్టర్లో నటించింది. నటి లక్ష్మి కుమార్తె, ఒకనాటి హీరోయిన్ ఐశ్వర్య.. ప్రీతి ముకుందన్ తల్లి కాలేజీలో క్లాస్మేట్స్. న్యూజిలాండ్‌లో కలుసుకున్నప్పుడు ఇద్దరు స్నేహితురాళ్ళూ ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. కాలేజీ కబుర్లు నెమరేసుకున్నారు. 2001 జులై 30 సోమవారం నాడు పుట్టింది ప్రీతి ముకుందన్. సోమవారం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు. అయితే, శివ భక్తుడు కన్నప్ప మీద తీస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లే వచ్చి పోయింది.ఆ హీరోయిన్ తప్పుకోవడం వల్ల..కన్నప్పలో హీరోయిన్ క్యారెక్టర్ ఆడిషన్‌కి ప్రీతి ముకుందన్ వచ్చింది. కానీ, నుపూర్ సనన్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. కన్నప్ప సినిమా ఓపెనింగ్‌లో కూడా నుపూర్ సనన్ పాల్గొంది. అప్పుడు ఎంతో బాధ పడినట్లు ప్రీతి ముకుందన్ చెప్పింది. అయితే తర్వాత నుపూర్ సినిమా మానేయడంతో– మళ్ళీ హీరోయిన్ చాన్స్ ప్రీతి ముకుందన్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ శివుడే తనకు ఈ అవకాశం ఇచ్చాడని ప్రీతి నమ్మకం.(చదవండి: మొదటి భార్యకు విడాకులు.. దేవదాసులా తాగుడుకు బానిసయ్యా..: హీరో)ఆ రూమర్స్‌తో హర్టయ్యామ్యూజికల్ వీడియో ఆల్బమ్స్‌తో ప్రీతి చాలా పాపులర్. ముత్తు–2, ఆశాకాండ, మోరిని మొదలైన వీడియోల్లో డ్యాన్స్ చేసింది. కన్నప్ప మొదటి తెలుగు సినిమా కాదు. అంతకు ముందు ‘ఓం భీమ్ బుష్’ అనే సినిమాలో శ్రీ విష్ణు పక్కన హీరోయిన్గా నటించింది. తమిళంలో స్టార్ అనే సినిమాలో మొదటిసారి నటించింది. ఆ సినిమా హీరో కెవిన్‌తో తన పేరు జత చేసి, రూమర్స్ వచ్చినప్పుడు కొంచెం ఫీలయ్యాను అంది. ప్రభాస్‌తో నటించడం..కన్నప్ప సినిమా కోసం హార్స్ రైడింగ్, కత్తిసాములో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది. గ్లామరస్‌గా ఎక్స్పోజ్ చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటో షూట్స్‌తో ప్రపంచానికి చాటి చెబుతూనే ఉంది. మలయాళంలో మైనే ప్యార్ కియా అనే సినిమా కూడా చేసింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ను కలుస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ ఆయనతో కలిసి యాక్ట్ చేయడం కెరీర్లోనే కిక్ ఇచ్చిన హయ్యస్ట్ మూమెంట్ అంది ప్రీతి ముకుందన్.చదవండి: నలుగురు సంతానం, ఇంకా పిల్లలు కావాలన్నా.. కుటుంబ నియంత్రణపై విష్ణు కామెంట్స్ -
'ఖుషి' ఫ్లాప్ అయితే నేను బతికేవాడిని కాదు: ఎస్జే సూర్య
ఎస్జే సూర్య (S. J. Suryah) మంచి నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా! వాలి, ఖుషి(తమిళ, తెలుగు, హిందీ), నాని, అంబే ఆరుయిరే, పులి, ఇసై వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఖుషి (Kushi Movie) తను డైరెక్ట్ చేసిన రెండో మూవీ. అయితే తొలిరోజు సరిగా రెస్పాన్స్ రాకపోవడం చూసి పిచ్చెక్కిందంటున్నాడు సూర్య. వీర ధీర శూరన్ సినిమా ప్రమోషన్స్‌లో ఎస్జే సూర్య మాట్లాడుతూ.. ఒక సినిమా డైరెక్ట్ చేయడమంటే.. ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడంతో సమానం. దర్శకత్వం అనేది చాలా కష్టం.శ్మశానంలో కూర్చున్నట్లు..మనం ఏదైనా మనసుకు నచ్చినట్లు చేసుకుపోతుంటాం. కానీ డైరెక్షన్ చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ఖుషి మూవీ ఇప్పుడు సూపర్ హిట్ అని అంటున్నారు. కానీ ప్రీమియర్ రోజు సినిమావాళ్లంతా ఏదో శ్మశానంలో కూర్చున్నట్లుగా సైలెంట్‌గా సినిమా చూస్తున్నారు. ఎవరి ముఖంలో చిన్న నవ్వు లేదు. నాకు భయమేసింది. అది మాత్రం ఫ్లాప్ అయిందంటే ఈరోజు నేనిక్కడ ఉండేవాడిని కాదు. నాకసలే కొంచెం పిచ్చి. నా సినిమా పోయిందంటే చనిపోయేందుకు కూడా వెనుకాడను. రెండో రోజు సీన్ మారింది.. లేదంటేనా..కానీ తర్వాతి రోజు నుంచి థియేటర్ శ్మశానంలా కాకుండా ఐపీఎల్ స్టేడియంలా మారిపోయింది. చప్పట్లు, విజిల్స్.. సంతోషమేసింది. సినిమా వైఫల్యాన్ని తట్టుకోవడం దర్శకుడికి చాలా కష్టం. సినిమా రిలీజ్‌కు ముందు కూడా ఇది బాగుందా? లేదా? అని డైలమాలో పడిపోతాడు. తనపై తాను నమ్మకాన్ని కోల్పోతాడు. డైరెక్షన్ చాలా టఫ్ అని చెప్పుకొచ్చాడు సూర్య. ఈయన డైరెక్షన్‌ను వదిలేసి పదేళ్లవుతోంది. నటుడిగా ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈయన చేతిలో వీర ధీర శూరన్, ఇండియన్ 3, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సర్దార్ 2 చిత్రాలున్నాయి.చదవండి: నలుగురు సంతానం, ఇంకా పిల్లలు కావాలన్నా.. కుటుంబ నియంత్రణపై విష్ణు కామెంట్స్ -
'న భూతో న భవిష్యత్' అనేలా నాట్స్ 8వ తెలుగు సంబరాలు.. సెలబ్రిటీలకు ఆహ్వానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society - NATS) 8వ వార్షికోత్సవ తెలుగు సంబరాల ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. అమెరికాలోని టంపాలో జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో నాట్స్ 8వ తెలుగు సంబరాల కార్యక్రమ కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంబరాలు కాన్ఫరెన్స్ కన్వీనర్ అండ్ పూర్వపు చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలు అమెరికా నుండి విచ్చేసి మీడియా సమావేశం నిర్వహించారు. నటి జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేష్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ.. నాట్స్ అంటే సేవ, భాష.. ఈ రెండు పదాలు గుర్తుకువస్తాయి. అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలబడేందుకు 2009లో ఈ ఆర్గనైజేషన్ స్థాపించాం. మా సంస్థ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ వేడుకల్లో 10 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నాం అన్నారు.కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ మాట్లాడుతూ.. తెలుగు భాష చాలా గొప్పది, అలాంటి భాషను కాపాడుకుంటూ మన సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలనే ప్రయత్నం నాట్స్ ద్వారా చేస్తున్నాం. మన నాట్స్ సంస్థ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమం నభూతో న భవిష్యతి అనేలా చేయబోతున్నాం అన్నారు. నటి జయసుధ మాట్లాడుతూ.. నాట్స్ గత తెలుగు సంబరాలకు కూడా నన్ను ఆహ్వానించారు. అయితే మా మదర్ చనిపోవడం వల్ల వెళ్లలేకపోయాను. ఈ సారి తప్పకుండా వెళ్తాను. ఇటీవల నేను ఇంగ్లీష్ మూవీలో నటించాను. ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు నాట్స్ తెలుగు సంబరాలు జరిగే ప్లేస్ కు దగ్గరలోనే జరిగింది అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ - నాట్స్ గత తెలుగు సంబరాలు ఈవెంట్ లో నేను పాల్గొన్నాను. ఇప్పుడు సెకండ్ టైమ్ వారికి కన్సర్ట్ చేయబోతున్నా. నాతో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా కన్సర్ట్ లో పాల్గొంటాడు. సంగీత విభావరితో పాటు జూలై 1,2,3 తేదీల్లో క్రికెట్ టోర్నమెంట్ ఆడబోతున్నాం. నాట్స్ 11 టీమ్ మేము మరో టీమ్ పోటీ పడుతున్నాం. అఖిల్, సుధీర్ బాబు.. ఇలా మా టీమ్ అంతా మ్యాచ్ కు రెడీ అవుతున్నాం అన్నారు.చదవండి: నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా -
లూసీఫర్ 2 తెలుగు వెర్షనే చూడండి : పృథీరాజ్ సుకుమార్
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్(Mohanlal), పృథ్వీరాజ్ సుకుమార్(Prithviraj Sukumaran) కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘లూసిఫర్2: ఎంపురాన్’. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం చిత్రబృందం ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పృథ్విరాజ్ సినిమా గురించి మాట్లాడుతూ.. తెలుగులోనే ఈ చిత్రాన్ని చూడాలని కోరాడు. ‘మాములుగా ఏ డెరెక్టర్ అయినా కూడా తన సినిమాను ఒరిజినల్ వెర్షన్ చూడమని చెపుతారు. నేను మాత్రం లూసీఫర్ 2 తెలుగు వెర్షన్ చూడమని సలహా ఇస్తున్నాను. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని తెలుగులోనే చూడండి. ఒరిజినల్ వెర్షన్ చూసిన ఫీలింగే కలుగుతుంది. డబ్బింగ్ విషయంలో టీమ్ బాగా కష్టపడి మంచి ఔట్పుట్ ఇచ్చింది. దిల్ రాజుగారు తెలుగు రాష్ట్రాల్లో మలయాళ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు కానీ.. నేను మాత్రం తెలుగులోనే చూడమని కోరుతున్నాను’ అన్నారు. మోహన్ లాల్ మాట్లాడుతూ.. ‘టాలీవుడ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగులో సినిమా చేయాలని నేను కూడా ఎదురుచూన్నాను. మంచి కథ వస్తే కచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఏ సినిమా ఫైనల్ కాలేదు.అయితే కచ్చితంగా చెబుతాను’ అన్నారు. -
‘కాలమేగా కరిగింది’ మూవీ రివ్యూ
ఇండియన్ సినిమాల్లో లవ్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జోనర్. టాలీవుడ్లో అయితే ప్రేమ కథలకు కొదవే లేదు. స్వచ్ఛమైన ప్రేమ కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అలా స్వచ్ఛమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘కాలమే కరిగింది’ (Kalamega Karigindi Telugu Movie Review). ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మించారు. శింగర మోహన్ దర్శకత్వం వహించిన ఈ పొయెటిక్ లవ్ స్టోరీ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఫణి(వినయ్ కుమార్/ అరవింద్(చిన్నప్పటి పాత్ర) ఉన్నత చదువు చదివి బాగా సెట్ అయినా లైఫ్‌లో ఏదో తెలియని వెలితి ఉంటుంది. తన తొలి ప్రేమ గుర్తుకు వచ్చి.. ప్రియురాలి బిందు((శ్రావణి/నోమిన తార(చిన్నప్పటి పాత్ర)) కోసం సొంత ఊరికి బయలుదేరుతాడు. వీరిద్దరి మధ్య టెన్త్ క్లాస్ టైమ్‌లోనే ప్రేమ చిగురిస్తుంది. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. అయితే ఓ కారణంగా వీరిద్దరు దూరం అవుతారు. లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత ఫణి.. తొలి ప్రేమ జ్ఞాపకాలు వెతుక్కుంటూ ఊరికి వస్తాడు. అసలు బిందు ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఫణికి బిందు కలిసిందా లేదా? అప్పటికే బిందుకి పెళ్లి అయిందా లేదా ఫణి కోసం అలాగే ఉండిపోయిందా? అసలు వీరిద్దరు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు కలిశారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే..ఈ సినిమా కథంతా స్కూల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు శింగర మోహన్ ఎంచుకున్న లవ్‌స్టోరీ పాయింట్ కొత్తదేమి కాదు. కానీ అప్పటి ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని కవితాత్మకంగా మలిచి సరికొత్తగా చూపించారు. స్కూల్ డేస్ లోని బాల్యప్రేమను మధురంగా మలిచారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే.. ఈ సినిమాలో సారీ, థ్యాంక్స్ మినహా ఎక్కడా ఇంగ్లీష్ పదాలనే వాడలేదు. సంభాషణలు అన్ని పొయెటిక్గానే ఉంటాయి. ఈ సినిమాకు నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఆయువుపట్టులా నిలిచాయి. సంగీత దర్శకుడు తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలను ప్రాణం పోశాడు. అయితే, కమర్షియల్ ఫార్మట్‌కి దూరంగా ఉండడం.. సినిమా మొత్తం నెమ్మదిగా సాగడం.. స్కూల్ ఎపిసోడ్లో కొన్ని సీన్లను తిప్పి తిప్పి చూపించడం ఈ సినిమాకు మైనస్. హీరోహీరోయిన్ల సంభాషణలు కూడా కవితాత్మకంగా ఉండడం వాస్తవికంగా అనిపించదు. ఫస్టాఫ్లోబిందు, ఫణిల లవ్‌స్టోరీ చూపించి.. సెకండాఫ్‌లో వాళ్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది చూపించారు. బిందు, ఫణి కలుస్తారా లేదా? బిందుకి పెళ్లి అయిందా లేదా? అనేది చివరి వరకు చూపించకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచారు. స్లోనెరేషన్తో అప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ప్రీక్లైమాక్స్ ఉంటుంది. పొయెటిక్ లవ్‌స్టోరీలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ( Kalamega Karigindi Review )ఎవరెలా చేశారంటే...ఈ సినిమా మొత్తం బిందు, ఫణి పాత్రల చుట్టే తిరుగుతుంది. మధ్యలో ఒకటి రెండు పాత్రలు వచ్చి వెళ్తాయి అంతే. బాల్యంలో ఫణి బిందు క్యారెక్లర్లను అరవింద్, నోమిన తార పోషించారు. పెద్దయ్యాక ఆ పాత్రల్లో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి కనిపిస్తారు. స్కూల్ లవ్స్టోరీకే ఎక్కువ ప్రాధన్యత ఉంటుంది. ఆయా పాత్రల్లో అరవింద్, నోమిన చక్కగా నటించారు. వినయ్ కుమార్ కూడా సెటిల్‌గా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నీకల్ విషయాలకొస్తే.. ముందు చెప్పినట్లు ఈ సినిమాకు ప్రధాన బలం గుడప్పన్ నేపథ్య సంగీతం. చాలా సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. వినీతి పబ్బతి సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. సీన్లను చాలా సహజత్వంగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో చాలా రిపీటెడ్ సీన్లు ఉన్నాయి. వాటిని కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'ద సస్పెక్ట్' రివ్యూ.. ఈ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?
థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూ ఉంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో మిస్టరీ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. టెంపుల్ టౌన్ టాకీస్‌పై కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 21న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథప్రత్యూష(షిరిగిలం రూప) దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును ఇన్స్పెక్టర్ అర్జున్(రుషి కిరణ్) విచారిస్తాడు. అతనికి సహాయకునిగా సదాశివ(శివ యాదవ్) అంట్ టీమ్ సహకరిస్తూ ఉంటుంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అర్జున్‌కు ఎదురయ్యే ప్రతి వ్యక్తి సస్పెక్ట్గానే కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తన ప్రేయసి మీరా (శ్వేత)ను కూడా అనుమానించాల్సి వస్తుంది. అలాగే పోలీసు ఉన్నతాధికారిని, తన స్నేహితులను ఇలా ప్రతి ఒక్కరినీ సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. మరి అసలైన హంతకుడిని అర్జున్ పట్టుకుంటాడా? ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ప్రత్యూషను ఎందుకు చంపారు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!విశ్లేషణఈ మధ్య కాలంలో థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఒక చిన్న లైన్ తీసుకుని దాని చుట్టూ ఆసక్తికరమైన కథనాన్ని అల్లుకుంటున్నారు. ఆ కథనం మెప్పిస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది. లేదంటే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడుతుంది. తాజాగా ‘ది సస్పెక్ట్’పేరుతో తెరకెక్కిన మూవీ ఆద్యంతం ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేసేందుకు ప్రయత్నించింది. చివరి వరకూ హంతకులెవరన్నది ఆడియన్స్ గుర్తు పట్టలేనంత సస్పెన్స్‌తో సినిమాను ముందుకు నడిపించారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులకు ఎదురయ్యే అనేకమంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో సస్పెక్ట్ గానే కనిపిస్తుంటారు. తీరా వారు కాదని తెలుస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో అసలు హంతకులు ఎవరనేది తెలిసినప్పుడు షాకవుతారు. ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఎవరినీ కించపరిచి మాట్లాడకూడదు, ఎగతాళి చేయకూడదన్న మెసేజ్ ఇచ్చారు.ముఖ్యంగా విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే... వారి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపి... ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయనేది చక్కగా చూపించారు. ఓపక్క మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా మరోవైపు హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్.. వారి లవ్ బ్రేకప్, మళ్లీ కలుసుకోవడం చూపిస్తారు. ఇదంతా చూసే జనాలకు కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో సినిమా ఊపందుకుంటుంది. అక్కడక్కడా సన్నివేశాలు బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తాయి. కొత్తవారైన హీరో రుషి కిరణ్... ఇన్స్పెక్టర్ అర్జున్ పాత్రలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కొన్నిచోట్ల మాత్రం అతడి నటన సహజంగా అనిపించదు. కొన్ని యాక్షన్ సీన్స్ బాగా చేశారు. అతనికి జంటగా నటించిన శ్వేత గ్లామరస్‌గా కనిపించింది. ప్రత్యూష పాత్రలో రూప కూడా పర్వాలేదనిపించింది. లావణ్య పాత్రలో రజిత బాగా చేసింది. మిగతా అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.దర్శకుడు రాధా కృష్ణ ఎంచుకున్న ప్లాట్ బాగుంది. దాని చూట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం కాస్త గందరగోళంగా ఉంది. కొన్ని సీన్లు బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ ఊపందుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ రాఘవేంద్ర అందించిన విజువల్స్ పర్వాలేదనిపించాయి. ప్రజ్వల్ క్రిష్ బీజీఎం బాగుంది. పాటలు బాగోలేవు. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా చేయాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.చదవండి: ప్రముఖ నటి రజిత ఇంట విషాదం.. తల్లి కన్నుమూత -
‘అదిదా..’ కాంట్రవర్సీ.. ట్రోల్స్ చూసిన తర్వాతే ఆ విషయం తెలిసింది : నితిన్
నితిన్(Nithiin) హీరోగా నటించిన రాబిన్‌హుడ్ (Robinhood) సినిమాలోని ‘అదిరా సర్ప్రైజ్’ పాట ఎంత వైరల్ అయిందే.. ఆ స్టెప్పులు అంతే కాట్రవర్సీని క్రియేట్ చేశాయి. ఈ పాటలో కేతికా శర్మతో వేయించిన స్టెప్పులపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఒక అమ్మాయితో అలాంటి స్టెప్పులు ఎలా వేయిస్తారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె క్యాస్టూమ్స్పై కూడా విమర్శలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఇలాంటి అసభ్యకరమైన స్టెప్పులను నిలిపివేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే కొంతమంది మాత్రం ఆ స్టెప్పులను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ హుక్ స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి అదిరా సర్ప్రైజ్ అయితే సినిమాకు బజ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ పాట కాంట్రవర్సీ గురించి నితిన్ స్పందించాడు. అసలు ఆ పాట షూటింగ్ సమయంలో తాను లేనని, ట్రోల్స్ చూసిన తర్వాతే తనకు ఆ స్టెప్పుల గురించి అర్థమైందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అదిరా సర్ప్రైజ్ సాంగ్‌లో నేను లేను. షూటింగ్ సమయంలో కూడా నేను చూడలేదు. సాంగ్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. కొంతమంది ఆ స్టెప్పు గురించి నెగెటివ్ కామెంట్ చేశారు. మేం అందరి అభిప్రాయలను గౌరవిస్తున్నాం. సినిమా చూస్తున్నప్పుడు కూడా నేను ఆ స్టెప్పుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. సినిమా బాగొచ్చిందనే ఆనందంలో ఉండిపోయి..పాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ట్రోల్స్ చూసిన తర్వాత నాక్కుడా ఆ పాటకి వేసిన స్టెప్పుల గురించి అర్థమైంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియదు కానీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అన్నారు. కాగా ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.ఇక రాబిన్‌హుడ్ విషయానికొస్తే.. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమిది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 28న రిలీజ్ కానుంది. -
‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ రివ్యూ
కమెడియన్ గా పీక్స్ లో ఉన్న సమయంలోనే సప్తగిరి హీరోగా టర్న్ తీసుకున్నాడు. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ‘పెళ్లికాని ప్రసాద్’అనే సినిమాతో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రంతో సప్తగిరికి హిట్ పడిందా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘పెళ్లికాని ప్రసాద్’ కథేంటంటే..?ప్రసాద్(సప్తగిరి) కి 38 ఏళ్లు. మలేషియాలో మంచి ఉద్యోగం.. భారీ జీతం. అయినా ఆయనకి పెళ్లి కాదు. దానికి ఒక కారణం వాళ్ళ నాన్నే(మురళీధర్). రెండు కోట్ల కట్నం ఇచ్చే అమ్మాయినే చేసుకోవాలని కండిషన్ పెడతాడు. చివరకు ఓ సంబంధం సెట్ అయి ప్రసాద్ ఇండియాకు తిరిగి వస్తాడు. అయితే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. కట్ చేస్తే... ప్రియా(ప్రియాంక శర్మ) ఎప్పటికైనా పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ కావాలనుకుంటుంది. ఆమెతోపాటు అమ్మ నాన్న లను, బామ్మను కూడా విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటుంది. ప్రియ ఫ్యామిలీ మొత్తం ఓ ఎన్నారై సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రసాద్ గురించి తెలిసి.. ఫ్యామిలీ మొత్తం డ్రాప్ చేసి పెళ్లి చేయిస్తారు. పెళ్లి తర్వాత ప్రసాద్ ఇండియాలోనే ఉండాలనుకుంటాడు. ఈ విషయం ప్రియకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు ప్రసాద్ పెళ్లి తరువాత ఇండియాలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు? పెళ్లి తర్వాత ప్రసాద్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రియ ఫ్యామిలీ కోరిక నెరవేరిందా? లేదా? అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఏజ్ బార్ అవుతున్న హీరోకి పెళ్లి కాదు. పెళ్లి కోసం నానా కష్టాలు పడడం.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. పెళ్ళికానీ ప్రసాద్ సినిమా కథ కూడా ఇదే. దర్శకుడు ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ ని కథగా ఎంచుకున్నారు. ఉద్యోగం, ఆస్తి ఉన్నా అబ్బాయిలకు పెళ్లి కావడం కష్టంగా ఉంది. అలాంటి సమయంలో హీరో తండ్రి కట్నం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. ఇదంతా మనకి తెలిసిన..చూసిన కథే. అయితే తెరపై చూస్తే మాత్రం... కొంతమేర ఎంటర్టైన్ అవుతాం. కొన్ని చోట్ల కామెడీ అతిగా అనిపించినా.. మరికొన్ని చోట్ల మాత్రం బాగా పేలింది.హీరోయిన్ ఫ్యామిలీ ఎందుకు విదేశాలల్లో సెటిల్ కావాలనుకుంటుందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో మలెషియా నుంచి పెళ్లి కోసం ఇండియాకు రావడం..పెళ్లి చూపులు..ఇవన్నీ పాత సినిమాలను గుర్తు చేస్తాయి. హీరో హీరోయిన్లు కలిసినప్పటి నుంచి కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. ప్రసాద్‌ని ట్రాప్ చేయడానికి ఖుషీ సీన్ రిపీట్ చేయడం.. అలాగే అర్జున్ రెడ్డి స్టోరీ చెప్పడం.. ఇవన్నీ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథనం సాగదీతగా అనిపిస్తాయి. నవ్వించడానికే పెట్టిన కొన్ని సీన్లు.. అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. సెకండాఫ్ కథను ఇంకాస్త బలంగా రాసుకొని.. క్లైమాక్స్ విషయంలో జాగ్రత్త పడితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఓవరాల్‌గా ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోయినా.. సిచువేషనల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. ఎవరెలా చేశారంటే..సప్తగిరి వన్ మాన్ ఆర్మీగా నవ్వించే బాధ్యతలు తీసుకున్నాడు. వయసు పైపడుతున్న ఇంకా పెళ్లి కాక, తండ్రిని ఎదిరించలేక ఇబ్బంది పడే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ కూడా బాగానే చేశాడు. సప్తగిరి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర మురళీధర్ గౌడ్ ది. పూర్వికుల ఆచారాన్ని పాటిస్తూ కట్నం కోసం కన్నకొడుకు జీవితాన్నే ఇబ్బందులకు గురి చేసే నాన్న పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.హీరోయిన్ ప్రియాంక్ శర్మ పాత్రకి నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు కానీ కథ మొత్తం ఆమె చుట్టునే తిరుగుతుంది. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా ట్రాక్ ఆకట్టునేల ఉంది. మిగతా నటీనట్లు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.టెక్నికల్ టీం విషయానికి వస్తే .. శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా చాలా సీన్స్ లో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా వాడిన మీమ్ కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని సాంగ్స్ చిత్రీకరణ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘పెళ్లికాని ప్రసాద్’ టీమ్ వివరాలుదర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడినిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాలబ్యానర్: థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్ డిఓపి: సుజాత సిద్దార్థ్సంగీతం: శేఖర్ చంద్రఎడిటర్: మధు- రేటింగ్: 2.5/5 -
బెట్టింగ్ యాప్స్ కేసు.. స్పందించిన విజయ్ దేవరకొండ టీమ్!
బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పేరు కూడా నమోదైన సంగతి తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై ఆయనర్ టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్స్ (Betting App Case)కి విజయ్ దేవరకొండ ప్రచారం చేయలేదని.. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రమోషన్స్ చేశారని క్లారిటీ ఇచ్చింది. విజయ్ ప్రచారం చేసిన కంపెనీలు అన్ని చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని , ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పీఆర్ టీమ్ తెలియజేసింది.విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు’అని ఆయన పీఆర్ టీమ్ పేర్కొంది. -
తమన్‌ని అన్‌ఫాలో చేసిన రామ్ చరణ్..నిజమెంత?
సంగీతం దర్శకుడు తమన్ (SS Thaman) పై మెగా అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు. రామ్ చరణ్(Ram Charan ) నటించిన ‘గేమ్ ఛేంజర్’ పాటలపై ఆయన చేసిన కామెంట్సే అందుకు కారణం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్’(Game Changer) పాటలకు యూట్యూబ్‌లో ఎక్కువ అనుకున్నంత వ్యూస్ రాబట్టలేకపోయాయి. ఆ పాటలకు సరైన హుక్ స్టెప్పులు లేకపోవడమే అందుకు కారణం. ‘రా మచ్చా..’, ‘నానా హైరానా’, ‘జరగండి జరగండి..’ ఈ పాటల్లో ఒక్క దాంట్లో కూడా హుక్ స్టెప్ లేదు. ఒక మంచి పాటకి మంచి స్టెప్పులు ఉంటేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’అని చెప్పుకొచ్చాడు.తమన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ అతన్ని బాగా ట్రోల్ చేశారు. అంతేకాదు రామ్ చరణ్ సైతం సోషల్ మీడియాలో తమన్‌ని అన్‌ఫాలో చేశారనే వార్తలు కూడా వచ్చాయి. మెగా అభిమానులే ఈ పుకారుని బాగా వైరల్ చేశారు. అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. రామ్ చరణ్ అసలు తమన్‌ని ఫాలోనే అవ్వడం లేదట. అన్‌ఫాలో చేశారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘రామ్ చరణ్ ఇన్‌స్టాలో కానీ ఎక్స్‌లో కానీ తక్కువ మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. తమన్‌ని చరణ్ అన్ఫాటో చేశారనే వార్తల్లో నిజం లేదు’ అని చరణ్ టీమ్ వెల్లడించింది. -
నిర్మాత ఎస్కేఎన్తో ఇబ్బందేమి లేదు : ‘బేబీ’ హీరోయిన్
కొద్ది రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్లో బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ (SKN) తెలుగమ్మాయిలపై చేసిన కామెంట్స్ వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏం అవుతుందో బాగా తెలిసిందని..ఎస్కేఎన్ అనడం.. ఆ వాఖ్యలు తన చివరి సిసిమా ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించే చేశారంటూ బాగా ట్రోల్ చేశారు. ఆ మరుసటి రోజే ఎస్కేఎన్ దీనిపై వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పటికే తాను ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్గా మార్చానని.. మరో 25 మందిని కూడా పరిచయం చేస్తానని చెప్పారు. దీంతో ఆ వివాదానికి పుల్‌స్టాప్ పడింది. తాజాగా హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఈ వివాదంపై స్పందించారు.ఆమె హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘జాక్’(Jack). సిద్ధు జొన్నలగడ్డ హీరో. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ నుంచి ‘కిస్’ (kiss Song) సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎస్కేఎన్ కామెంట్స్‌పై వైష్ణవికి ప్రశ్న ఎదురైంది. దీనిపై వైష్షవి స్పందిస్తూ.. ‘ఎన్‌కేఎన్ గారితో నాకు ఇబ్బంది ఉందని ఎవరు చెప్పారు. ఆయనతో నాకు ఎలాంటి సమస్యలు లేవు. ఆయన చేసిన కామెంట్స్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వివాదంపై ఆయన ఓ వీడియో కూడా చేసి పెట్టారు. నా పేరు మెన్షన్ చేయనప్పుడు నేనెందుకు స్పందిస్తాను’ అని బదులిచ్చింది. అలాగే ఎస్కేఎన్ బ్యానర్లో చేయాల్సిన సినిమా ఆగిపోవడం గురించి స్పందిస్తూ.. ‘బేబీ టీమ్‌తో చేయాల్సిన మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మరో చాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. ఆ టీమ్‌తో కలిసి పని చేయడం నాకు మంచి అనుభవం’ అని చెప్పుకొచ్చింది. -
బెట్టింగ్ యాప్స్ కేసు: విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిపై కేసు!
సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Case)తో ప్రజలను బెట్టింగ్ ఊబిలో దించుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని అధారంగా ఇప్పటికే కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. (చదవండి: పంజాగుట్ట పీఎస్‌కు విష్ణుప్రియ!)తాజాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి (Lakshmi Manchu), నిధి అగర్వాల్‌పై కూడా కేసు నమోదు చేశారు. అలాగే నటుడు ప్రకాశ్ రాజ్, హీరోయిన్లు ప్రణీత, అనన్య నాగళ్ల, బుల్లితెర నటులు సిరి హనుమంతు ,,శ్రీముఖి,, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి ,నాయిని పావని, నేహా పతాన్ ,పాండు, పద్మావతి ,ఇమ్రాన్ ఖాన్‌తో సహా మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. తన అడ్వకేట్‌తో కలిసి వెళ్లిన విష్ణుప్రియను పోలీసులు తమదైన శైలీలో విచారణ చేస్తున్నారు. -
Betting Apps Case: పంజాగుట్ట పీఎస్‌కు విష్ణుప్రియ!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు విచారణను పంజాగుట్ట పోలీసులు వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లోని పంజాగుట్టా పోలీసులు ఆ యాప్స్‌ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 11 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. వారిలో సినీ నటి, యాంకర్ విష్ణుప్రియు పేరు కూడా ఉంది. పంజాగుట్ట పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. వాట్సప్ ద్వారా నోటీసులు అందుకున్న విష్ణుప్రియ తాజాగా పోలీస్టేషన్‌కు వెళ్లింది. గురువారం ఉదయం తన అడ్వకేట్‌తో కలిసి విష్ణుప్రియ విచారణకు హాజరైంది. అడ్వకేట్ సమక్షంలో పంజాగుట్ట పోలీసులు ఆమెను విచారణ చేస్తున్నారు. విచారణ సందర్భంగా పోలీసులు ఏయే అంశాలపై ఆరా తీయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని విచారించిన పోలీసులు..ఇప్పుడు మిగతా 8 మందిని విచారణకు పిలిచినట్లు తెలిసింది. ప్రమోషన్స్ వెనుక ఎవరు ఉన్నారు? డబ్బులు ఎంత ఇచ్చారు? ఎలా ఇచ్చారు? తదితర విషయాలపై విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
నటించడం ఇష్టంలేక భారీ రెమ్యునరేషన్ అడిగా.. ఇచ్చేశారు: తమ్మారెడ్డి
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం రాబోతోంది. మార్చ్ 21న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోతమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ .. 'భాష్య శ్రీ ఈ కథను నా వద్దకు తీసుకువచ్చారు. ఈ సినిమాను కచ్చితంగా చేయాలని చెప్పారు. వీళ్ళని ఎలాగైనా వదిలించుకోవాలని పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ చెప్పాను. అంత వీళ్ళు ఎలాగో ఇవ్వరు నన్ను వదిలేస్తారని అనుకున్నాను. కానీ నేను అడిగినంత డబ్బు ఇచ్చారు. నేను మళ్ళీ అడగకముందే డబ్బులు ఇచ్చేశారు. నా ఇన్నేళ్ల కెరీర్లో ఇంత మొత్తం చూసింది ఇదే మొదటిసారి. ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా కథ చాలా బాగుంది. నాకు స్క్రిప్ట్ కూడా చాలా నచ్చింది. ఇలాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి. భాష్యశ్రీ కథ, షెరాజ్ టేకింగ్ బావుంది. మార్చ్ 21న రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. 'చిన్న చిత్రాల్లో నటించి మాలాంటి వాళ్లకు సపోర్ట్ ఇచ్చిన తమ్మారెడ్డి గారికి థాంక్స్. సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. నేను ఇప్పటివరకు ఆ క్రమశిక్షణతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ఇకపై కూడా అలానే చేస్తూ ఉంటాను. ఓ అందాల రాక్షసి సినిమా థియేటర్లోకి రానంతవరకే చిన్న సినిమా. ఒకసారి మా సినిమా థియేటర్ లోకి వచ్చాక దాని రేంజ్ ఏంటో ఆడియన్స్ కి తెలుస్తుంది. టీమ్ అంతా కలిసి ఒక ఫ్యామిలీలా ఈ సినిమాను పూర్తి చేశాం. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మా చిత్రం మార్చి 21న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి' అని అన్నారు.భాష్య శ్రీ మాట్లాడుతూ .. 'మాలాంటి చిన్న సినిమాలో మంచి పాత్రను పోషించి, మాకు అండగా నిలిచిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థాంక్స్. కథ చెప్పిన వెంటనే తమ్మారెడ్డి బ్రదర్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకు నిర్మాతకు థాంక్స్. ఇప్పుడు అందరూ ఈ సినిమాను చిన్న సినిమా అనుకుంటారు. కానీ దీని సత్తా ఏంటో రిలీజ్ అయ్యాకే మీ అందరికీ తెలుస్తుంది' అని అన్నారు.నేహా దేశ్ పాండే మాట్లాడుతూ .. 'అమ్మాయిలు తమపై జరిగే మోసాలు దాడులను ఎలా ఎదుర్కోవాలి అనేది ఇందులో చక్కగా చూపించారు. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శక,నిర్మాతలకు థాంక్స్. మా చిత్రం మార్చ్ 21న రాబోతుంది అందరూ చూసి ఆదరించండి' అని అన్నారు. -
రూ.100 కోట్లతో నాగార్జున 100వ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఈ నలుగురిని టాలీవుడ్‌కి నాలుగు స్తంభాలు అంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక సినిమాలలో హీరోలుగా నటించింది వీరే. చిరంజీవి ఇప్పటికే 156 చిత్రాలకు పైగా నటించగా.. బాలకృష్ణ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు నాగార్జున(Nagarjuna) తన 100వ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హీరోగా 99 చిత్రాల్లో నటించిన నాగ్.. తన సెంచరీ మూవీ కోసం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు.నాగ్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం 'నా సామి రంగ'. ఇది గతేడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజైంది. ఆ తర్వాత సోలో సినిమా ఇంత వరకూ ప్రకటించలేదు. ఇప్పుడు తన బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కింగ్ నాగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోందిప్రస్తుతం నాగార్జున ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తర్వాత 100వ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. తాజా వార్తల ప్రకారం, ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కార్తీక్ గతంలో తమిళంలో ‘నితం ఓరువానం" చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆడలేదు కానీ దర్శకుడు కథను తెరపై చూపించిన విధానం నాగ్‌కి బాగా నచ్చిందట. వెంటనే అతన్ని పిలిపించి..వందో చిత్రం బాధ్యతలు అప్పజెప్పాడట.తన 100వ విజువల్ వండర్‌గా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని నాగ్ కోరుకుంటున్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిన్న మొన్నటి వరకు నాగార్జున వందో చిత్రానికి పూరి జగన్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి.. అయితే, తాజా సమాచారం ప్రకారం కార్తీక్‌తోనే ఈ ప్రాజెక్ట్ ఖరారైనట్లు కనిపిస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివరలో లేదా 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. నాగ్ అభిమానులకు ఆకట్టుకునేలా ఓ సూపర్ స్టోరీని రెడీ చేశాడట కార్తీక్. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
వెండితెరపై సునీత విలియమ్స్ బయోపిక్?
సునీతా విలియమ్స్ (Sunita Williams).. ఈ పేరు ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం మారోమోగిపోతోంది. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు 9 నెలల పాటు అంతతరిక్షంలోనే గడిపి మంగళవారం(భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 2.41 గంటలకు) స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమి మీదకు వచ్చింది. సునీత క్షేమంగా రావాలంటూ యావత్ ప్రపంచం కోరుకుంది. ఆమె క్షేమంగా భూమి మీదకు చేరుకుందనే వార్త తెలియగానే సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?)ఆమె చేసిన సేవలను, సాహసాలను కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సునీతా విలియమ్స్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతుందట. ఆమె చేసిన సాహోసోపేతమైన యాత్రలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయట. ఇప్పటికే బాలీవుడ్‌కి చెందిన పలువురు దర్శక నిర్మాతలు సునీత లైఫ్ జర్నీని కథగా మలిచే పనిలో పడ్డారట. బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ సునీతా విలియమ్స్ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయట. సునీత విలియమ్స్ జీవితంలోని స్ఫూర్తిదాయక అంశాలు, ఆమె శిక్షణ, నాసాలో చేరడం, అంతరిక్షంలో 322 రోజులు గడపడం, మరియు భూమికి సురక్షితంగా తిరిగి రావడం.. ఈ అంశాలతో భారీ బడ్జెట్లో ఓ సినిమా చేసేందుకు బాలీవుడ్‌కి చెందిన బడా డెరెక్టర్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్‌తో సునీతకు సంబంధం ఉండడంతో ఆమె బయోపిక్‌ని ఇక్కడ కచ్చితంగా ఆదరిస్తారని సదరు దర్శకుడు బలంగా నమ్ముతున్నాడట. మరి సునీతా బయోపిక్ వచ్చేది హాలీవుడ్ లోనా? లేదా బాలీవుడ్లోనా? చూడాలి. -
రాజకీయ ఒత్తిళ్లకు లొంగారు.. ‘నెట్‌ఫ్లిక్స్ ’పై అనురాగ్ కశ్యప్ ఫైర్!
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై సంచలన వాఖ్యలు చేశాడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా(Netflix India)లో పనిచేసే పై స్థాయి అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యారని, వారు నైతికంగా అవినీతిపరులేనని విమర్శించాడు. నెట్‌ఫ్లిక్స్ యూకేలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్‌ని ప్రశంసిస్తూ.. ఇలాంటి ప్రాజెక్టులను భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సంస్థ తిరస్కరిస్తోందని ఆరోపించాడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా దర్శకుల సృజనాత్మక స్వేచ్ఛను అణచివేస్తోందని, కమర్శియల్ కంటెంట్‌ను మాత్రమే ప్రోత్సహిస్తోందని కశ్యప్ మండిపడ్డాడు.అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘మాక్సిమం సిటీ’ వెబ్ సిరీస్‌ని నెట్‌ఫ్లిక్స్ 2024లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ నిర్ణయాన్ని అనురాగ్ అప్పుడే వ్యతిరేకించాడు. తాజాగా మరోసారి నెట్‌ఫ్లిక్స్‌పై తనకున్న అసంతృప్తిని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘మాక్సిమం సిటీ’ రద్దుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆయన ఆరోపించాడు. సృజనాత్మక స్వేచ్ఛపై నెట్ఫిక్స్ ఆంక్షలు విధిస్తోందని విమర్శించాడు.దీనికి యూకే వెబ్ సిరీస్ అడోలసెన్స్ని ఉదాహరణగా చూపించాడు. ఈ వెబ్ సిరీస్ మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ యూకేలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ యుక్త వయస్సు యొక్క చీకటి అంశాలను, ఆన్లైన్ ద్వేషం, మరియు సామాజిక సమస్యలను చూపిస్తుంది.ఇలాంటి సాహసోపేతమైన కథను నెట్‌ఫ్లిక్స్ ఇండియా అణచివేస్తోందని ఆయన ఆరోపించారు.‘మాక్సిమం సిటీ’ కథేంటి?సుఖ్‌దేవ్ సింగ్ సంధు రాసిన "మాక్సిమం సిటీ: బాంబే లాస్ట్ అండ్ ఫౌండ్" పుస్తకం ఆధారంగా అనురాగ్ కశ్యప్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడు. ఈ సిరీస్‌లో ముంబై నగరం యొక్క చీకటి కోణాలను చూపించాలని భావించారు. అయితే, 2024లో నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను రద్దు చేసింది, దీనిపై కశ్యప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే ‘సేక్రెడ్ గేమ్స్’మూడో సీజన్ కోసం కూడా నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరిగాయి. కానీ కంటెంట్‌తో పాటు బడ్జెట్‌పై వివాదాలు రావడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును కూడా రద్దు చేసుకుంది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) -
ఛీ ఛీ అదేం టైటిల్..?: స్టార్ హీరో సినిమాపై జయా బచ్చన్ విమర్శలు!
అదో బ్లాక్ బస్టర్ మూవీ. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు రాబట్టి రికార్టు సృష్టించిన చిత్రం. కానీ ఆ చిత్రం అంటే తనకు నచ్చదని, అసలు ఆ సినిమానే చూడలేదని చెబుతోంది బాలీవుడ్ నటి, ఎంపీ జయా బచ్చన్(Jaya Bachchan). ఆ సినిమాకి పెట్టిన పేరు నచ్చకపోవడంతోనే తాను ఇప్పటివరకు ఆ మూవీ చూడలేదని, తన దృష్టిలో అదొక ఫ్లాప్ చిత్రమని చెబుతోంది. జయ బచ్చన్‌కి నచ్చని ఆ చిత్రం పేరే ‘టాయిటెట్: ఎక్ ప్రేమ్ కథ’ ( Toilet Ek Prem Katha Movie). అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం 2017లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. శ్రీ నారాయణ్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రంపై జయా బచ్చన్ తీవ్ర విమర్శలు చేసింది. ఓ జాతియ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో జయాబచ్చన్ మాట్లాడుతూ.. ‘సినిమాలు చూసే విషయంలోనూ నేను కొన్ని కండీషన్స్ పెట్టుకున్నా. టైటిల్ నచ్చకపోతే సినిమా చూడను. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ’ పేరు నాకు ఏమాత్రం నచ్చలేదు. ఒక్కసారి ఆ టైటిల్ చూడండి. అలాంటి పేరు ఉన్న సినిమాలు చూడాలని నేను ఎప్పుడూ అనుకోను. ఛీ ఛీ అసలు అదేం పేరు? నిజంగా అది కూడా ఒక పేరేనా?. అది బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. నా దృష్టిలో మాత్రం ఫ్లాప్ చిత్రమే’ అని జయా బచ్చన్ అన్నారు.‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ’ సినిమా కథ విషయానికొస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న టాయిలెట్ల కొరతను ఎత్తి చూపుతూ శ్రీ నారాయణ్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అక్షయ్‌కి జోడీగా భూమి ఫడ్నేకర్ నటించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోరిక మేరకు గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి ఓ భర్త ఏం చేశాడనేది ఆ సినిమా కథాంశం. -
థియేటర్స్‌లో చూడాల్సిన చిత్రం ఇది : సంతోష్ కల్వచెర్ల
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్ ఆర్టిస్ట్’. రతన్ రిషి దర్శకత్వంలో ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ– ‘‘కిల్లర్ ఆర్టిస్ట్’ థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా... ఓటీటీలో చూడాల్సినది కాదు. సురేష్ బొబ్బిలి అన్న తన మ్యూజిక్‌తో ఈ సినిమాకు ప్రాణం పోశాడు. ఈ సినిమా సక్సెస్‌పై నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథ ఇది. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో మొదలై, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా టర్న్ తీసుకుంటుంది. మన సమాజంలో జరుగుతున్న ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాం. ఈ మర్డర్స్ చేస్తున్నది ఒకరా? లేక ఇద్దరా? అనే పాయింట్ ఆసక్తికరంగా ఉంటుంది. సెన్సార్ వారి సూచన మేరకు ‘ఆర్టిస్ట్’ టైటిల్‌ని ‘కిల్లర్ ఆర్టిస్ట్’గా మార్చాం’’ అని చెప్పారు రతన్ రిషి. ‘‘ఆడియన్స్ సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా చూస్తారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమానూ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు జేమ్స్ వాట్. -
నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వార్‌పై నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో హీరో అభిమానుల మధ్య యుద్ధం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. టీజర్, ట్రైలర్ మొదలు సినిమా రిలీజ్ వరకు ప్రతీది పోల్చుతూ హీరో ఫ్యాన్స్ ఏదో రకంగా గొడవ పడుతూనే ఉంటారు. అయితే హీరోలు మాత్రం అవేవి పట్టించుకోకుండా కలిసి మెలిసే ఉంటారు. అయితే ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఇటీవల సోషల్ మీడియాలో బాగా పెరిగిపోయింది.నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య నెట్టింట పెద్ద యుద్ధమే జరుగుతోంది. తాజాగా దీనిపై ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) స్పందించారు.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని(nani), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కలిసి నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మూవీ ఈ నెల 21న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటిస్తూ పదేళ్ల క్రితం తెరకెక్కించిన ఆ సినిమా సంగతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘సోషల్ మీడియాలో నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమా చేయగలరా?’ అని ఓ విలేకరి అడగ్గా నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ‘ఫ్యాన్స్ వార్ గురించి తెలియదు కానీ, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సమయంలో విజయ్‌కు నాని సపోర్ట్‌గా నిలిచేవాడు. ప్రతి సన్నివేశాన్ని ఒకరికొకరు చర్చించుకుని నటించేవారు’ అన్నారు. అలాగే నాని, విజయ్‌తో కలిసి మళ్లీ ఇలాంటి సినిమా చేసే ఆలోచన ఉందా? అని అడగ్గా.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో వారితో సినిమా చేయలేం. నా నాలుగో సినిమాని మళ్లీ ఇలాంటి నేపథ్యంతో తీస్తే.. అది ఇంత బాగా రాకపోవచ్చు. టెక్నికల్‌గా బాగున్నప్పటికీ.. ఇంత నేచురల్‌గా తీయడం సాధ్యంకాకపోవచ్చు’ అన్నారు. ఎవడే సుబ్రమణ్యంలోని నాని పాత్రను ఇప్పుడున్న యంగ్ హీరోలలో నవీన్ పొలిశెట్టి చేయగలడని, విజయ్ పాత్రను పోషించాలంటే కొత్త హీరో కావాల్సిందేనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. నాని - విజయ్ కి మొదట్లో చాలా సపోర్టివ్ ఉండేవాడు..వివాదాలపై స్పందించిన నాగ్ అశ్విన్ : #NagAshwin@NameisNani @TheDeverakonda #Nani #VijayDevaraKonda pic.twitter.com/CqCUlBPh0x— The Cult Cinema (@cultcinemafeed) March 18, 2025 -
చిరు సినిమా: నో లవ్ ట్రాక్.. మెగాస్టార్‌తో అనిల్ మాస్టర్ ప్లాన్!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఇంకా సెట్‌పైకి వెల్లలేదు కానీ.. అనిల్ మాత్రం అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టేశాడు. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్‌లోనే చిరు సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఈ కథ కూడా కామెడీ పంథాలోనే సాగుతుందని హింట్ ఇచ్చేశాడు.అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్‌ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంద్ర తర్వాత చిరంజీవి రాయలసీమ నేపథ్యంలో సినిమా చేయలేదు. ఇంద్రలో కూడా సీమ యాసను పూర్తిగా వాడలేదు. కానీ ఈచిత్రంలో చిరంజీవి పూర్తిగా రాయలసీమ యాసలోనే మాట్లాడతారట. డైలాగుల విషయంలోనూ అనిల్ జాగ్రత్త పడుతున్నారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రలకు భూమిక, మృణాల్ ఠాకుర్లను ఎంపిక చేసినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
ఆ యాడ్‌తో టుక్ టుక్ ఆలోచన వచ్చింది: డైరెక్టర్ సి.సుప్రీత్ కృష్ణ
‘‘ఓ వాహనానికి జీవితం ఉంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో ‘టుక్ టుక్’ సినిమా చేశాను. మ్యాజికల్ పవర్స్ ఉన్న ‘టుక్ టుక్’ అనే వెహికల్ హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధుల దగ్గరకు ఎలా వచ్చింది?. ఆ వాహనం వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అనేది ఈ చిత్ర కథ’’ అని డైరెక్టర్ సి.సుప్రీత్ కృష్ణ చెప్పారు. హర్ష రోషన్ , కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ముఖ్య పాత్రల్లో సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టుక్ టుక్’. ఆర్‌వైజీ సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీ రాములరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుప్రీత్ కృష్ణ మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం చిత్తూరు. పూరి జగన్నాథ్‌గారి దగ్గర రచయితగా చేశాను. ఆ తర్వాత ‘అలనాటి సిత్రాలు’ అనే ఓటీటీ ప్రాజెక్ట్ చేశాను. ‘టుక్ టుక్’ నా తొలి ఫీచర్ ఫిల్మ్. క్రికెట్ యాడ్‌లో ఓ వాహనాన్ని చూసినప్పుడు ఈ సినిమా ఆలోచన వచ్చింది. ‘టుక్ టుక్’ వెనకాల ఉన్నది దెయ్యమా? దేవుడా? అనే పాయింట్ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. వెహికల్ కాకుండా ఈ చిత్రంలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ‘టుక్ టుక్’ ఫ్రాంచైజీ ప్లాన్ ఉంది’’ అన్నారు. టుక్ టుక్‌పై ‘కోర్ట్’ ప్రభావం చూపుతుందిఇక ప్రీరిలీజ్ వేడుకల్లో సుప్రీత్ మాట్లాడుతూ.. 'టీజర్‌కు, ట్రైలర్‌కు, ఏఐ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మార్చి 21న అందరూ ఓ కొత్త తెలుగు సినిమా చూడబోతున్నారు. ఓ కమర్షియల్ ప్యాకేజీలో ఇలాంటి సినిమా చేయడం గొప్పగా అనిపించింది.రోషన్ నటించిన కోర్టు మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా రోషన్ ఓ మంచి పాత్రను చేశాడు. తప్పకుండా కోర్టు సక్సెస్ మా సినిమాపై కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ' అన్నారు.శాన్వీ మేఘన మాట్లాడుతూ '' రీసెంట్గా కుడుంబస్తాన్ అనే తమిళ సినిమా చేశాను. ఆ సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది. అందరూ మంచి ప్రేమ ఇచ్చారు. ఓటీటీలో కూడా తెలుగులో ఆ సినిమా విడుదలైంది. తెలుగు వాళ్లకు కూడా ఆ సినిమా నచ్చింది. కుడుంబస్తాన్ను ఆదరించినట్లే తెలుగు ప్రేక్షకులు మా టుక్‌టుక్‌ను ఆదిరించి, ఈ తెలుగమ్మాయికి ఆశ్వీరదిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాను దర్శకుడు ఎంత అందంగా నేరేట్ చేశాడో, సినిమాను కూడా అంతే అందంగా తెరకెక్కించాడు. ఈ ఫాంటసీ సినిమాను అందరూ ఫ్యామిలీతో థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మా టీమ్ అందరికి మంచి విజయం అందిస్తుందనే హోప్ ఉంది ' అన్నారు.ఈ వేడుకలో వాణిశాలిని, మధు, మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత ఓ చిన్న సినిమా భారీ విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు సైతం రెండు, మూడు రోజులకే ఢీలా పడుతున్నవేళ..ఈ చిన్న చిత్రం మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్‌ని పెంచుకుంటూ రికార్డు దిశగా పరుగులు తీస్తోంది. ఆ చిత్రం పేరే ‘కోర్ట్’ (Court: State Vs Nobody). నాని (Nani) నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలై తొలి రోజే పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ఫలితంగా మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్‌టాక్‌తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మొత్తంగా రిలీజైన నాలుగు రోజులకే రూ. 28.9 కోట్లను రాబట్టి.. నానికి కాసుల వర్షం కురిపించిదీ చిత్రం. ఒక్క నాలుగో రోజునే 4.50 కోట్ల గ్రాస్ సాధించిదంటే.. ఈ చిన్న చిత్రం సత్తా ఎంటో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్లోనూ ఈ సినిమా బాగా వసూళ్లు రాబడుతోంది. ఈ వీకెండ్లో ఓవర్సీస్ కలెక్షన్స్ 1 మిలియన్ డాలర్స్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోర్ట్ విషయానికొస్తే.. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. శివాజీ కీలక పాత్ర పోషించాడు. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టం గురించి ఈ చిత్రంలో చర్చించారు. కోర్ట్‌రూమ్ డ్రామా బాగా పండడం, ఎమోషనల్ సన్నివేశాలు హృదయాలను హత్తుకునేలా ఉండడం సినిమాకు విజయాన్ని అందించాయి. #CourtTelugu continues its dominance at the box office this week ❤🔥Collects a gross of 28.9+ CRORES WORLDWIDE in 4 days 💥💥Book your tickets for #Court now! ▶️ https://t.co/C8ZZHbyhHW#CourtStateVsANobody ⚖️ Presented by Natural Star @NameisNani Starring… pic.twitter.com/AiUSVO3RCD— Wall Poster Cinema (@walpostercinema) March 18, 2025 -
రన్యా రావు కేసులో బిగ్ ట్విస్ట్.. టాలీవుడ్ హీరో అరెస్ట్!
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao Case) కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరుని పోలీసులు అరెస్ట్ చేశారు.‘పరిచయం’(2018)అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తరుణ్ రాజ్.. డెబ్యూ ఫిల్మ్‌తోనే ప్లాప్‌ని మూటగట్టుకున్నాడు. లక్ష్మీకాంత్ చెన్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సిమ్రత్ కౌర్ హీరోయిన్గా నటించింది. 2018 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడంతో తరుణ్‌రాజ్ కొండూరు పేరు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రోజుకో ట్విస్ట్గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావు గురించి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూనే ఉంది. ఆమెకు గత నవంబర్‌లో వివాహం అయిందట. పెళ్లయిన నెల నుంచే తాము విడిగా ఉంటున్నట్లు ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టులో వెల్లడించారు. తాము అధికారికంగా విడిపోలేదని, అయితే కొన్ని కారణాల వల్ల వేరుగా జీవిస్తున్నామని చెప్పారు. ఈ కేసు విషయంలో తాజాగా జతిన్ హుక్కేరీని అధికారులు కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచారు. రన్యారావు చేస్తున్న స్మగ్లింగ్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో జతిన్ ను కస్టడీకి ఇవ్వాలంటూ డీఆర్ఐ కోరింది. ఈ క్రమంలోనే జతిన్ ను మరోసారి ఈరోజు(సోమవారం) కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే రన్యారావు స్మగ్మింగ్ తో తనకు ఏమీ సంబంధం లేదని చెబుతున్న జతిన్.. తాము పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నామని కోర్టుకు తెలిపాడు. ఇదే విషయాన్ని జతిన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణ వరకూ జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు.ఏం జరిగింది?నటి రన్యారావు మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడింది. ఈమెకు సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు తండ్రి పేరును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలున్నాయి. ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
రష్మికను చూసి ఇబ్బంది పడ్డ శ్రీలీల.. ఎందుకో తెలుసా?
శ్రీలీల(Sreeleela).. గత కొంతకాలంగా టాలీవుడ్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు ఇది. ఒకవైపు స్టార్ హీరోలతో మరోవైపు యంగ్ స్టార్స్‌లో సినిమాలు చేస్తూ తెలుగు తెరపై దూసుకెళ్తోంది. అయితే ఈ టాలెంటెడ్ బ్యూటీ ఇటీవల తన దూకుడుని తగ్గించింది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన చిత్రాలేవి రిలీజ్ కాలేదు. కానీ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకవైపు హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూనే.. సడెన్‌గా పుష్ప 2లో స్పెషల్ సాంగ్‌కి అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేసింది. ‘కిస్సిక్’ అంటూ సాగే ఈ పాట ఎంతపెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఈ పాట ఒప్పుకునేందుకు శ్రీలీల కాస్త వెనకడుకు వేసిందట. కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆలోచించిందట. కానీ డైరెక్టర్ సుకుమార్ నచ్చజెప్పి పాటకు ఒప్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ పాట శ్రీలీల కెరీర్‌కి ప్లస్సే అయింది. అయితే ఈ పాట షూటింగ్ కోసం వెళ్లినప్పుడు సెట్లో రష్మిక(rashmika mandanna)ను చూసి శ్రీలీల భయపడిందట. ఆమెతో మాట్లాడేందుకు కాస్త సిగ్గు పడిందట. దానికి గల కారణం ఏంటో కూడా శ్రీలీల వివరించింది.శ్రీలీల హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రంలో మొదట రష్మికను హీరోయిన్గా తీసుకున్నారు. కొంతవరకు షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఆమె ప్లేస్‌లో శ్రీలీలను తీసుకున్నారు. పుష్ప–2 ఐటమ్ సాంగ్ షూటింగ్లో మొదటిసారి రష్మికని కలిసినప్పుడు– రాబిన్‌హుడ్ రీ ప్లేస్మెంట్ గుర్తు వచ్చి, శ్రీ లీల ఇబ్బంది పడింది. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల తనే రాబిన్‌హుడ్ సినిమా వదిలేశానని, రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట శ్రీ లీల. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమే చెప్పింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలకు మైత్రీ మూవీ మేకర్స్ భారీగానే పారితోషికం అందించిందట. ఈ ఒక్క పాటకే దాదాపు రూ. 2 కోట్లు అందించినట్లు సమాచారం. -
పారితోషికం 10 కోట్లు.. బడ్జెట్ 25 కోట్లు.. యంగ్ హీరో కండిషన్!
సినిమా బడ్జెట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. చిన్న సినిమా అయినా సరే ఐదారు కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇక కొంచెం పేరున్న నటీనటులతో సినిమా చేయాలంటే పది కొట్లకు పైనే అవుతుంది. ఒక్క హిట్ పడితే చాలు.. ఆ హీరోలో సినిమా చేయాలంటే తక్కువలో తక్కువ 20 కోట్లు ఉండాల్సిందేనట. టాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. చాలా మంది హీరోలు కథలు వినడం కంటే ముందే.. తన రెమ్యునరేషన్, సినిమా బడ్జెట్ ఎంతో చెప్పమని అడుగుతున్నారట. తక్కువ బడ్జెట్ సినిమాలు చేయమని ముఖంపైనే చెప్పేస్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరో అయితే తనతో సినిమా చేయాలంటే పాతిక కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాల్సిందేనని కండీషన్ పెట్టాడట.తాజాగా ఓ యంగ్ డైరెక్టర్, నిర్మాత మంచి కాన్సెప్ట్‌తో సదరు హీరోని సంప్రదించారట. కథ మొత్తం విన్నాక.. బడ్జెట్ ఎంత అని అడిగాడట. 10-15 కోట్లతో తీయ్యొచ్చని చెబితే..మినిమం 25 కోట్ల బడ్జెట్ పెడితేనే సినిమా చేస్తానని చెప్పాడట. తన రెమ్యునరేషన్‌గా రూ.10 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేశారట. అయితే ఆ హీరోకి ఇటీవల ఒక్క హిట్ కూడా లేకపోవడం గమనార్హం. పైగా ఆయన నటించిన ఓ హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయినా కూడా తన రెమ్యునరేషన్‌ని ఏమాత్రం తగ్గించలేదట. ఆ హీరో మార్కెట్ వ్యాల్యూ కూడా అంతగా లేదు. దీంతో సదరు నిర్మాత అంత బడ్జెట్ పెట్టలేనని చెప్పి బయటకు వచ్చాడట. వరుసగా ఫ్లాపులు వచ్చాయి కదా..తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడని ఆ హీరోని సంప్రదిస్తే.. ఆయన పెట్టిన కండీషన్ చూసి సదరు నిర్మాత షాకయ్యారట. ఇలా చాలా మంది యంగ్ హీరోలు ఒక్క హిట్ పడగానే రెమ్యునరేషన్ పెంచడంతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతున్నారని చిన్న నిర్మాతలు వాపోతున్నారు. -
రామ్ చరణ్ సినిమాలో ధోని.. నిజమెంత?
సినిమా వాళ్లతో క్రికెటర్లకి మంచి స్నేహబంధం ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ తారలతో క్రికెటర్లంతా టచ్‌లో ఉంటారు. యాడ్స్‌లో కలిసి నటిస్తుంటారు. ఈ మధ్యకాలంలో వెండితెరపై కూడా కనిపిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్ ప్లే చేస్తూ అలరిస్తున్నారు. అయితే మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించిన క్రికెటర్లు..ఇప్పుడు తెలుగు తెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో వార్నర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక తాజాగా మరో స్టార్ క్రికెటర్ కూడా తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతంది. ఆయన ఎవరో కాదు..తనదైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni).నిజమెంత?రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 16 (RC 16) అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్‌కు ట్రైనర్‌గా ధోని కనిపించబోతున్నాడనే గాసిప్ బయటకు వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. ధోని ఈ చిత్రంలో నటించడం లేదు. ఇదంతా ఒట్టి పుకారు మాత్రమేనని రామ్ చరణ్ పీఆర్ టీమ్ పేర్కొంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను: నాని
నాని(Nani) తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలిరోజే హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. నేను ఈ రోజుదాక స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను. స్క్రిప్ట్ మా టీంని గెలిచింది. తెలుగు ప్రేక్షకులు సినిమాని గెలిపించారు. కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. ఈ సినిమా విషయంలో, టీం విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీలౌతున్నాను. ఈ వీకెండ్ ఒక పండగలా గడిచింది. రానున్న రోజుల్లో కోర్ట్ పేరు మారుమ్రోగుతుంది. సినిమాని ముందుకు తీసుకెలుతున్న అందరికీ పేరుపేరునా థాంక్ యూ’ అన్నారు.హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. బలగం హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నపుడు రామ్ జగదీశ్ ఈ కథ చెప్పారు. ఈ కథ విని చాలా గొప్పగా ఫీలయ్యాను. మాకు సపోర్ట్ గా దీప్తి అక్క, ప్రశాంతి గారు వచ్చారు. మేమంతా రాకెట్ లో కూర్చుంటే మమ్మల్ని చుక్కల దాక తీసుకెళ్ళారు. ఆయన నమ్మకపోయుంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అన్నారు.యాక్టర్ శివాజీ మాట్లాడుతూ... 25 ఏళ్ళుగా మంగపతి లాంటి క్యారెక్టర్ కోసం ఎదురుచూశాను. ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కల వుంటుంది. ఒక రోజు మొత్తం ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలని. అది ఈ సినిమాతో తీరింది. మంగపతి లాంటి పాత్ర లైఫ్ లో ఒకేసారి వస్తుంది. ఆ కిక్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఇకపై సినిమాలు చేస్తాను'అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ జగదీశ్, నటులు హర్షవర్దన్, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీలీల గురించి ఈ విషయాలు తెలుసా?
👉: చాలా ఏళ్ళ క్రితం ఏ హీరోయిన్ని అడిగినా, ‘డాక్టర్ కాబోయి యాక్టర్‌ని అయ్యాను’ అని చెప్పేవారు. ఇప్పటి పాపులర్ హీరోయిన్లలో చాలామంది డాక్టర్లే! సాయి పల్లవి , మీనాక్షి చౌదరి , శ్రీ లీల.. తన తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్ కావడంతో డాక్టర్ కావాలనుకున్నానని శ్రీ లీల చెప్పింది. విజయవాడ మూలాలు ఉన్నా, పుట్టింది అమెరికాలో, పెరిగింది బెంగళూరులో.👉: కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యశ్– శ్రీలీలకి ఫ్యామిలీ ఫ్రెండ్. యశ్ భార్య రాధికా పండిట్‌కి డెలివరీ చేసిన డాక్టర్ శ్రీ లీల వాళ్ళ తల్లే! అలా రెండు కుటుంబాలకి పరిచయం!👉: యశ్ని సూపర్ స్టార్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ మురళితో కన్నడంలో ఓ సినిమాలో నటించింది. యశ్‌తో నటించే చాన్స్ కోసం శ్రీ లీల ఎదురు చూస్తోంది.👉: దగ్గుబాటి ఫ్యామిలీకి శ్రీ లీల దూరపు బంధువు. రానా దగ్గుబాటి ఆ మధ్య తన రియాలిటీ షోలో– తను ఏ బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్ళినా, శ్రీ లీల కనబడుతుందని కామెంట్ చేశారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా శ్రీ లీలకి బంధుత్వం ఉంది.👉: పుష్ప –2లో కిస్సిక్ సాంగ్‌తో ఆడియన్స్‌ని వెర్రెక్కించిన శ్రీ లీలకి ఐటమ్ సాంగ్స్ కొత్త కాదు. పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసింది.👉: డాన్స్ అంటే విపరీతమైన పిచ్చి. మంచి బీట్ ఉన్న సాంగ్ వినబడితే చాలు– బాడీ ఆటోమేటిక్‌గా డాన్స్ చేస్తుంది. ఆ క్వాలిటీయే– ఆది కేశవ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌కి పెట్టారు.👉: పుష్ప –2లో ఐటమ్ సాంగ్ చేసి, సమంతని రీ ప్లేస్ చేసింది. కిస్సిక్ సాంగ్‌కు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.👉: తను ఇంత వరకూ చేసిన క్యారెక్టర్స్‌లో భగవంత్ కేసరిలోని పాత్ర, సాంగ్స్‌లో కిస్సిక్ సాంగ్ బాగా ఇష్టమని శ్రీ లీల చెప్పింది.👉: నితిన్‌తో రాబిన్‌హుడ్ సినిమాలో నటిస్తోంది. నితిన్‌తో రెండో సినిమా. నిజానికి రాబిన్‌హుడ్‌లో రష్మిక మందన్నా హీరోయిన్గా చేయాలి. మొదట షూటింగ్ మొదలైనప్పుడు– రష్మిక హీరోయిన్. తర్వాత శ్రీ లీల రష్మికని రీ ప్లేస్ చేసింది.👉: పుష్ప–2 ఐటమ్ సాంగ్ షూటింగ్లో మొదటిసారి రష్మికని కలిసినప్పుడు– రాబిన్‌హుడ్ రీ ప్లేస్మెంట్ గుర్తు వచ్చి, శ్రీ లీల ఇబ్బంది పడింది. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల తనే రాబిన్‌హుడ్ సినిమా వదిలేశానని, రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట శ్రీ లీల.👉: బై టూ లవ్ అనే కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు– ఓ అనాథ శరణాలయానికి వెళ్లింది. అక్కడి అనాథలను చూసి చలించి, బుద్ధిమాంద్యం ఉన్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. తన జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే అని చెప్పింది శ్రీ లీల.👉: తను చేసిన గుంటూరుకారం, పుష్ప–2, ధమాకా సాంగ్లా కోట్లాది వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉండటం బాగా కిక్కు ఇచ్చిన మేటర్ అంటుంది శ్రీ లీల. -
‘రాజుగారి దొంగలు’ వచ్చేస్తున్నారు
లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 21న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో మాట్లాడుతూ మంచి వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని, ఈ నెల 21న మీ ముందుకు తీసుకొస్తున్నామని తెలుగు ప్రేక్షకులందరు ఆదరించాలని అన్నారు. -
Kaalamega Karigindhi Trailer : స్కూల్ లవ్‌స్టోరీ .. ఆకట్టుకుంటున్న ట్రైలర్
ప్రేమ కథలకు టాలీవుడ్లో ఎప్పుడు మంచి ఆదరణనే ఉంటుంది. డిఫరెంట్ లవ్‌స్టోరీతో వచ్చిన చిత్రాలను ఆడియన్స్ హిట్ చేస్తుంటారు. అందుకే తెలుగు తెరపై ప్రేమ కథలు వస్తూనే ఉంటాయి. త్వరలోనే మరో స్వచ్ఛమైన ప్రేమ కథ తెలుగు ప్రేక్షకుల ముందకు రానుంది. వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది"(Kaalamega Karigindhi). ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కాలమేగా కరిగింది" సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు."కాలమేగా కరిగింది" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ఫణి, బిందు విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి ప్రేమికులు. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. కలహాలే లేని ఈ ప్రేమ కథను కాలం విడదీస్తే ఆ జ్ఞాపకాలు వెతుక్కుంటూ కథానాయకుడు ఫణి ప్రయాణం సాగిస్తాడు. బిందుతో కలిసి చదువుకున్న స్కూల్, తామిద్దరు మాట్లాడుకున్న ప్లేస్ లు...అన్నింటిలో ప్రేమను గుర్తుల్ని పోగేసుకుంటాడు. ఈ ప్రేమికులు తిరిగి ఎలా కలిశారు అనేది ట్రైలర్ లో ఆసక్తిని కలిగించింది. ఈ ప్లెజంట్ లవ్ స్టోరీని పొయెటిక్ గా అందంగా రూపొందించారు దర్శకుడు శింగర మోహన్. గుడప్పన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ట్రైలర్ లో ఆకట్టుకుంది. -
భారీ రేటుకు రజనీకాంత్ ‘కూలీ’ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రజనీకాంత్(Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కూలీ’ (Coolie). ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ చిత్రం. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈచిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైతే ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేయలేదు. కానీ..అప్పుడే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయట.ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడ్డాయట. చివరకు ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆమిర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది మే లేదా జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్!
సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘దక్ష’(Daksha). శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. 2023లో థియేటర్లలో విడుదలై ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బిసినీట్ (Bcineet OTT)తో పాటు హంగామా(Hungama OTT)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో పాటు యూట్యూబ్‌లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ & యాక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ, ‘మాకు థియేటర్లో మంచి స్పందన లభించినట్లుగానే, ఇప్పుడు విడుదలైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు 'దక్ష' తప్పకుండా నచ్చుతుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండి, అధికారిక వేదికల ద్వారా మా సినిమాను వీక్షించండి. నిర్మాతలకు సహాయపడేలా ప్రతి రూపాయి విలువైనదని భావిస్తున్నాము. పైరసీకి పాల్పడిన కొన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఇప్పటికే కంప్లయింట్ నమోదుచేశారు’ అని తెలిపారు.దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ..‘మంచి కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్, వండర్ఫుల్ విజువల్స్ మా సినిమాకి ప్రధాన బలాలు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుంది’ అని తెలిపారు. -
రూ.200 కోట్లు ఇస్తా.. ఆస్కార్ తెప్పిస్తారా? : మంచు విష్ణు
మంచు విష్ణు(Manchu VIshnu ) ప్రస్తుతం కన్నప్ప(kannappa) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో మంచు విష్ణు దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని యూట్యూబ్ ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తనపై వస్తున్న ట్రోలింగ్ కూడా స్పందించాడు. కన్నప్ప టీజర్‌కు తమిళ, కన్నడ, మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చిందని, తెలుగులో మాత్రం 15-20 శాతం మంది పని గట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారని మండి పడ్డారు.ఈ నెగటివిటీ కావాలని చేస్తున్నదే అని ఆయన ఆరోపించారు. తనపైనే కాదు రాజమౌళి లాంటి వారిపై కూడా వీళ్లు ఇలానే ట్రోలింగ్ చేస్తారని చెప్పారు.‘ఆర్ఆర్ఆర్’(RRR)కి ఆస్కార్ అవార్డు వస్తే తెలుగువారంతా గర్వంగా కాలర్ ఎగరేసి ఎంజాయ్ చేశారు. కానీ కొంతమంది మాత్రం విమర్శించారు. ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు పెడితే వస్తది కదా అన్నారు. నేను 200 కోట్లు ఇస్తా.. ఆ విమర్శలు చేసినవాళ్లు ఆస్కార్ తీసుకొస్తారా? ఆర్ఆర్ఆర్`కి ఆస్కార్ రావడమనేది ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ మూమెంట్.అసలు ఎంత మందికి అక్కడ ఇన్విటేషన్ ఉంటుంది. ఇలాంటి మూమెంట్లని గర్వించాలి. కాలర్ ఎగరేసుకోవాలి. భారతదేశంలో ఎవరూ ఇలాంటి ఘనత సాధించలేదు. ఇండియాలో డైరెక్ట్ గా ఏ సినిమాకి ఆస్కార్ రాలేదు. సత్యజిత్ రేకి గౌరవంగా లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ పురస్కారం అందించారు తప్పితే, సినిమాలకు ఇవ్వలేదు. ఇండియాలో ఇండియా టెక్నీషియన్లు చేసిన ఏ మూవీకి ఆస్కార్ రాలేదు. కేవలం `ఆర్ఆర్ఆర్`కి మాత్రమే సాధ్యమైంది. మన తెలుగు పాటని ఆస్కార్ స్టేజ్ పై వేశారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. దానికన్న గొప్పతనం ఏం కావాలి?అని ట్రోలర్స్‌పై మంచు విష్ణు మండిపడ్డారు.ఇక కన్నప్పలోని ‘లవ్ సాంగ్’ పై వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. ‘నేను సినిమా తీస్తున్నా.. డాక్యుమెంటరీ కాదు. అందుకే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి’అని అన్నారు. -
భక్త కన్నప్ప గుడిని అభివృద్ధి చేస్తా: మంచు విష్ణు
సాక్షి, రాజంపేట: హీరో మంచు విష్ణు (Vishnu Manchu) అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలోని ఊటుకూరు భక్తకన్నప్ప గుడిని శనివారం సందర్శించాడు. కన్నప్ప చిత్రబృందంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తమ గ్రామానికి విచ్చేసిన విష్ణుకు.. స్థానికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.చరిత్ర తెలియజేయాలనే..ఆలయ దర్శనానంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. భక్తకన్నప్ప చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే కన్నప్ప సినిమా (Kannappa Movie) తీశాం. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఊటుకూరు భక్త కన్నప్ప గుడి అభివృద్ధికి కృషి చేస్తాను. ఆలయ పెద్దలతో మాట్లాడి గుడికి కావాల్సిన అవసరాలను తీరుస్తాను అని హామీ ఇచ్చాడు.కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం కన్నప్ప. ప్రీతి ముకుందన్ కథానాయిక. కన్నప్ప పాత్రలో విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్ కీలక పాత్రలు పోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న భారీ స్థాయిలో విడుదల కానుంది.చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల -
అదీ మీ సంస్కారం.. దేవిశ్రీ ప్రసాద్‌పై హరీశ్ శంకర్ ట్వీట్
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌పై హరీశ్ శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. మీ సంగీతమే కాదు మీ సంస్కారం గురించి కూడా అందరూ మాట్లాడుకునే చేశావంటూ పొగడ్తలతో మంచేశాడు. దేవిని హరీశ్ అంతలా ప్రశంసించడానికి గల కారణం ఏంటంటే..దేవి( Devi Sri Prasad) తాజాగా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన రోజే కొన్ని నియమాలు పెట్టుకున్నానని, వాటిని ఇంతవరకు బ్రేక్ చేయలేదని చెప్పాడు. తన కెరీర్లో ఎప్పుడూ ఓ పాటను రీమేక్ చేయడం కానీ, కాపీ కొట్టడం కానీ చేయొద్దని ఫిక్సయ్యాడట. అయితే రీమేక్ సాంగ్ ఉందని చాలా సినిమాలే వదుకున్నాడట డీఎస్పీ. ‘హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ సినిమాకి నేనే సంగీతం అందించాలి. హరీశ్ మొదట ఈ స్క్రిప్ట్ నాకే చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కానీ చివర్లో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ. ఎల్లకిల్లా పడ్డాదమ్మో’ రీమేక్ సాంగ్ ఉంటుందని చెప్పాడు. నేను రీమేక్ చేయనని హరీశ్‌కు తెలుసు. కానీ మా నాన్న సత్యమూర్తి మొదటి సినిమా ‘దేవత’లోని పాట కాబట్టి చేస్తానేమోనని హరీశ్ భావించాడు. కానీ నేను నా రూల్స్‌ని బ్రేక్ చేయలేనని చెప్పాను. చివరకు ఆ పాటను తీసేస్తానని చెప్పాడు. కానీ నా కోసం స్క్రిప్ట్‌లో మార్పులు చేయొద్దని చెప్పి.. ఆ సినిమాకు నో చెప్పాను. అయితే ఓ ప్రెస్మీట్లో ‘గద్దలకొండ గణేశ్’కి మొదట దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకుంటానని చెప్పారు కదా..ఎందుకు మార్చారు?’ అని మీడియా అడిగితే.. జరిగిందంతా చెప్పి..‘ఆయన రీమేక్ సాంగ్స్ చేయడు కాబట్టి మార్చాం’అని చెప్పారు. వాస్తవానికి హరీశ్ అక్కడ సింపుల్‌గా ‘కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు’అని చెప్పొచ్చు. అప్పుడు నాపై ఏవోవో వార్తలు రాసుకునేవాళ్లు. హరీశ్ అలా చెప్పి నా దృష్టిలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఇకపై ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటానని అప్పుడే చెప్పా’ అని దేవి చెప్పుకొచ్చాడు.దీనికి సంబంధించిన వీడియోని హరీశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘గుర్తింపు కోసం ఏదైనా మాట్లాడే ఈ రోజుల్లో …గుర్తు పెట్టుకుని మరీ మీరు ఇలా మాట్లాడ్డం కేవలం మీ గొప్పదనం .మీ సంగీతం గురించే కాకుండా మీ సంస్కారం గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా చేసారు’అని రాసుకొచ్చాడు.ఇక ‘గద్దలకొండ గణేష్’ విషయానికొస్తే..తమిళంలో హిట్టయిన ‘జిగార్తండ’ తెలుగు రీమేక్‌గా హరీశ్ తెరకెక్కించాడు. వరుణ్ తేజ హీరోగా నటించగా, మిక్కీజే మేయర్ సంగీతం అందించాడు. 2019లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. -
తమన్నా బ్రేకప్.. విడి విడిగా వచ్చారు.. విడిపోయినట్లేనా!
ప్రేమలో ఉన్న మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah Bhatia), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma ) విడిపోయినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు తమన్నా, ఇటు విజయ్ స్పందించకపోవడంతో నిజంగానే విడిపోయారని అంతా భావించారు. ఇలాంటి సమయంలో తమన్నా, విజయ్ తీవ్రమైన బాధలో ఉంటారని అభిమానులు ఊహించారు. కానీ ఇద్దరిలోనూ బ్రేకప్ అయిన బాధే కనిపించడంలేదు. నిన్న జరిగిన హోలీ వేడుకల్లో ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాలకు తమన్నా,విజయ్ హాజరయ్యారు. ప్రేమలో ఉన్నప్పుటు కలిసి వచ్చిన ఈ జంట.. నిన్న మాత్రం విడి విడిగా వచ్చి సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అయితే ఇద్దరు ముఖాల్లోనూ బాధలేదు. నవ్వుతూ ఎంట్రీ ఇచ్చారు.ఫోటోగ్రాఫర్లకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ వెళ్లిపోయారు. ఇలా ఇద్దరు వేరు వేరు ఈవెంట్‌కి వచ్చి వెళ్లడంతో మరోసారి తమన్నా, విజయ్‌ల బ్రేకప్ టాపిక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.‘లస్ట్ స్టోరీస్ 2’(2023) వెబ్ సిరీస్‌లో తమన్న, విజయ్ వర్మ కలిసి నటించారు. అదే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమన్నా పలు ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఇంతలోనే వీరిద్దరు విడిపోయారు. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుందామని తమన్నా అడిగితే..విజయ్ మాత్ర అందుకు నో చెప్పాడట. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఇంకొంత కాలం కెరీర్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ అన్నాడట. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి..చివరకు విడిపోయారని బాలీవుడ్ టాక్.అయితే బ్రేకప్‌పై మాత్రం వీరిద్దరూ ఎక్కడా స్పందించలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చందాలు వసూలు చేసి కూతురి పెళ్లి చేశా.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్
'ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు' అన్న సామెత ఊరికే రాలేదు. ఈ రెండింటిలో ఏది చేయాలన్నా ఖర్చుతో కూడుకున్న పనే! ఎంత మామూలుగా పూర్తి చేయాలనుకున్నా జేబు ఖాళీ అవక తప్పదు. అయితే తను కమెడియన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే కూతురి పెళ్లి చేయాల్సి వచ్చిందని, అప్పుడు నానా కష్టాలు పడ్డానంటున్నాడు కమెడియన్ రైజింగ్ రాజు (Raising Raju).చందా వసూలు చేసి..తాజాగా ఓ షోలో రాజు మాట్లాడుతూ.. బుల్లితెర కామెడీ షోలో పాల్గొనడానికంటే ముందు నా కూతురు పెళ్లి చేశాను. చందాలు వసూలు చేసి ఆ పెళ్లి చేయాల్సి వచ్చింది. రాకెట్ రాఘవ, తాగుబోతు రమేశ్, ధనరాజ్ వంటివారు చెరో రూ.5 వేలు ఇచ్చారు. అలాంటి పరిస్థితిలో నా కూతురి పెళ్లి చేశాను అని ఎమోషనలయ్యాడు. రైజింగ్ రాజు అసలు పేరు రాజమహేంద్రవరపు రాజేశ్వరరావు. స్కూల్లో పేరు రాయడానికి ఇబ్బందవుతోని అతడి టీచర్ రాజమహేంద్రవరపు రాజు అని మార్చేసింది. కుటుంబ విషయాలు..తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో జన్మించాడు. తండ్రి పేరయ్య రైతు. అయితే రాజుకు తోడుగా ఇద్దరన్నదమ్ములు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఏడో తరగతికే చదువు ఆపేశాడు. పెయింటింగ్ వంటి పనుల్లో చేరాడు. 1979లో చెన్నైకి వెళ్లి ఆఫీస్ బాయ్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేశాడు. ప్రస్తుతం బుల్లితెర కామెడీ షోలో రాణిస్తున్నాడు.చదవండి: 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. పేరు వచ్చినా అవకాశాలు రావడం లేదు: నటుడు -
‘దిల్ రూబా’ మూవీ రివ్యూ
‘క’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం (kiran Abbavaram) నుంచి వస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. వాస్తవానికి ‘క’ కంటే ముందే ఈ చిత్రం రావాల్సింది. కానీ కొన్ని కారణాలతో ఆసల్యంగా థియేటర్స్‌కి వచ్చింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయనే విషయం కిరణ్‌కి కూడా తెలుసు. అందుకే ‘దిల్ రూబా’ (Dilruba Review) విషయంలో ఇంకాస్త ఫోకస్ పెట్టాడు. కొన్ని సీన్లను రీషూట్ కూడా చేసినట్లు సమచారం. పబ్లిసిటీ విషయంలోనూ కిరణ్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే..చితక్కొట్టండి’ అని నిర్మాత సవాల్ విసరడం, అది నెట్టింట బాగా వైరల్ కావడంతో ‘దిల్ రూబా’పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉందా? కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సిద్ధార్థ్‌రెడ్డి అలియాస్ సిద్దు(కిరణ్ అబ్బవరం) , మ్యాగీ(ఖ్యాతి డేవిసన్) కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అనంతరం మ్యాగీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోతుంది. బ్రేకప్‌తో బాధ పడుతున్న సిద్ధుని చూసి తట్టుకోలేకపోయిన ఆయన తల్లి..ఇక్కడే ఉంటే ఆ బాధ ఎక్కువతుందని, మంగుళూరు వెళ్లి చదుకోమని చెబుతోంది. దీంతో సిద్ధు మంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ తన క్లాస్మేట్ అంజలి(రుక్సార్ థిల్లాన్) (rukshar dhillon)తో ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వీళ్ల మధ్య కూడా గ్యాప్ వస్తుంది. ప్రేమించమని వెంటపడిన అంజలి..ప్రేమలో పడిన తర్వాత సిద్ధుని ఎందుకు దూరం పెట్టింది? వీళ్ల బ్రేకప్‌కి కారణం ఎవరు? అమెరికాలో ఉన్న మ్యాగీ తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చింది? విక్కీతో సిద్ధుకి ఉన్న గొడవేంటి? డ్రగ్స్ మాఫియా డాన్ జోకర్(జాన్ విజయ్) సిద్ధుని ఎందుకు చంపాలనుకున్నాడు? సారీ, థ్యాంక్స్ అనే పదాలను సిద్ధు ఎందుకు దూరంగా ఉంటాడు? చివరకు అంజలి, సిద్ధుల ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. కొత్తదనంతో వస్తున్న కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో హీరో క్యారెక్టర్ని కాస్త డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తున్నారు దర్శకులు. ఓ ఢిఫరెంట్ పాయింట్‌ని పట్టుకొని కథలు అల్లుకుంటున్నారు. అయితే కథ కొత్తగా ఉంటే సరిపోదు..తెరపై చూస్తున్నప్పుడు కూడా ఆ కొత్తదనం కనిపించాలి. దిల్ రూబా విషయంలో అది మిస్ అయింది. వాస్తవానికి ఈ స్టోరీలో రెండు కొత్త పాయింట్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయికి మాజీ ప్రేయసీ అండగా నిలవడం.. హీరో ఎవరీకీ సారీ, థ్యాంక్స్ చెప్పకపోవడం. ఈ రెండు ఎలిమెంట్స్ ఆసక్తికరమైనవే కానీ..తెరపై అంతే ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. కాలేజీ ఎపిసోడ్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. అంజలీ పాత్రను ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అయితే కాలేజీలో వచ్చే యాక్షన్ సీన్లు తెరపై చూడడానికి బాగున్నా..కథకి ఇరికించినట్లుగా అనిపిస్తాయి. విరామానికి ముందు వచ్చే ఫైట్ సీన్ బాగుంటుంది. మాజీ లవర్ రంగంలోకి దిగడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. అంజలి, సిద్ధుల ప్రేమ కథ కొత్త మలుపు తిరుగుతుందనుకుంటున్న సమయంలో జోకర్ పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు. దీంతో అసలు వీళ్ల లవ్‌స్టోరీకి జోకర్ ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుందీ. దానికి దర్శకుడు సరైన జెస్టిఫికేషనే ఇచ్చాడు. కానీ ఆ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సహజత్వం లోపిస్తుంది. కడప నేపథ్యంతో తీర్చిదిద్దిన సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ పర్వాలేదు. అయితే కథను ముగించిన తీరు నిరుత్సాహపరుస్తుంది.ఎవరెలా చేశారంటే.. కిరణ్ అబ్బవరం టాలెంటెడ్ నటుడు. పాత్రకు న్యాయం చేసేందుకు కష్టపడతాడు . డిఫరెంట్ పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తాడు. ‘క’తో పోలిస్తే దిల్ రూబాలో కిరణ్ది డిఫరెంట్ పాత్రే.దానికి న్యాయం చేశాడు. తెరపై అందంగా కనిపించాడు. యాక్షన్స్ సీన్లలో ఇరగదీశాడు. ఎమోషనల్ సీన్ల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. రుక్సార్ థిల్లాన్ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఖ్యాతి డేవిసన్ తన పాత్ర పరిధిమేర నటించింది. జాన్ విజయ్ రెగ్యులర్ విలన్ పాత్రను పోషించాడు. సత్య పండించిన కామెడీ బాగున్నప్పటికీ..అతన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. విక్కీ పాత్రలో కిల్లి క్రాంతి చక్కగా నటించారు. తులసి, 'ఆడుకాలం' నరేన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. యాక్షన్ సీన్లకు ఆయన ఇచ్చిన బీజీఎం అదిరిపోతుంది. కేసీపీడీ థీమ్‌ని ఫైట్ సీన్‌కి వాడడం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. కొన్ని డైగాల్స్ పూరీ జగన్నాథ్ మాటలను గుర్తు చేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. టైటిల్: దిల్ రూబానటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్, నజియా, ఖ్యాతి డేవిసన్, సత్య తదితరులునిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్రచన, దర్శకత్వం: విశ్వ కరుణ్సంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: డానియేల్ విశ్వాస్ఎడిటర్: ప్రవీణ్. కేఎల్విడుదల తేది: మార్చి 14, 2025 -
నాని కాన్ఫిడెన్స్.. పేరు మార్చుకుంటానన్న రాజేంద్రప్రసాద్.. అదే కారణమన్న కిరణ్
సీన్ 1: కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి అన్నాడు నాని (Nani). ఆ నమ్మకంతోనే సినిమా రిలీజ్‌కు రెండురోజుల ముందే మీడియాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ బయటపెట్టుకున్నాడు. నాని నమ్మకమే నిజమవుతూ కోర్ట్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.సీన్ 2: దిల్రూబా సినిమా (Dilruba Movie)లో హీరో కిరణ్ అబ్బవరం ఫైట్స్ నచ్చకపోతే నెక్స్ట్ ప్రెస్మీట్లో నన్ను చితక్కొట్టండి. అతడి ఫైట్స్ మీకు నచ్చలేదంటే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను అన్నాడు చిత్రనిర్మాత రవి. మార్చి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది.సీన్ 3: రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie) చూశాక మన ఇంట్లో కూడా ఓ రాబిన్‌హుడ్ ఉంటే బాగుండనిపిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు మేం నలుగురం మాత్రమే గుర్తుంటాం. సినిమా లేదంటే నేను నా పేరుమార్చేసుకుంటాను అన్నాడు నటుడు రాజేంద్రప్రసాద్. ఈ మూవీ మార్చి 28న విడుదలవుతోంది.కిరణ్ రియాక్షన్ ఇదే!అందరూ ఇలా తెగించి మాట్లాడటానికి ప్రధాన కారణం.. జనాల్ని థియేటర్‌కు రప్పించడమే! ఓటీటీలకే రుచి మరిగిన ఆడియన్స్‌ను థియేటర్‌వైపు చూసేలా చేసేందుకే ఇలాంటి ప్రమోషన్ స్టంట్స్.. దీని గురించి హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాపై ఉన్న నమ్మకాన్ని బలంగా వ్యక్తపరిస్తేనే జనాలు థియేటర్‌కు వస్తారని అలా చేసుండొచ్చు.నా ఫైట్ సీన్లు బాగోకపోతే తనను కొట్టమని నిర్మాత అన్నారు. మీరెవరూ ఆయన్ని కొట్టొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను సరిగా చేయకపోతే దొరికిపోతాను. ఫైట్స్ బాగానే చేశాను.. ఆయన్ను మీరు కొట్టరనే ఫీలింగ్‌లో ఉన్నాను. ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌కే ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: తలకు గాయంతో ఆస్పత్రిపాలైన భాగ్యశ్రీ.. 13 కుట్లు వేసిన డాక్టర్స్ -
హైదరాబాద్‌లో 'రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్'.. ఎప్పుడంటే?
బుక్ మై షో ప్రారంభించిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్ (Red Lorry Film Festival ) సౌత్‌కు వచ్చేస్తోంది. మార్చి 21 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలో సినీప్రముఖులు తమ అనుభవాలను, సినిమా వెనక ఉండే కష్టాలను, సాహసాలను పంచుకోనున్నారు. నిర్మాత రమేశ్ ప్రసాద్, సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్, దర్శకులు రామ్ గోపాల్ వర్మ, శిఖరన్ బీచరాజు, శేఖర్ కమ్ముల, నటులు శివ బాలాజీ, నవదీప్, సినిమాటోగ్రఫీ వెంకట్ సి.దిలీప్, దర్శకరచయితలు వీఎన్ ఆదిత్య, జి. నీలకంఠ రెడ్డి, రచయిత అంజున్ రాజాబలి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సినీ ఇండస్ట్రీలో గమనించిన అంశాలను, వైవిధ్యాన్ని, కావాల్సిన మార్పుల గరించి వీరు మాట్లాడనున్నారు.అంతేకాకుండా ఈ కార్యక్రమంలో టాలీవుడ్లో క్లాసిక్స్‌గా నిలిచిన మాయాబాజర్, పుష్పక విమానం, మిస్సమ్మ, ఆదిత్య 369, హ్యాపీ డేస్, నేనే రాజు నేనేమంత్రి, చందమామ, మన్మథుడు వంటి చిత్రాలను మరోసారి బిగ్స్క్రీన్పై చూసే అవకాశం కల్పించనున్నారు.చదవండి: అంబానీ ఎవరో మాకు తెలీదు.. అయినా పెళ్లికి వచ్చాం: కిమ్ కర్దాషియన్ -
నాని సవాల్.. నా సినిమా సేఫ్ అంటూ డైరెక్టర్ ఆసక్తికర పోస్ట్!
‘కోర్ట్’(Court: Sate Vs A Nobody) సినిమా నచ్చకపోతే తను హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’(Hit 3) చూడొద్దని నాని బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాని వ్యాఖ్యలపై హిట్3 దర్శకుడు శైలేశ్ కొలను స్పందిస్తూ నా సినిమా సేఫ్ అంటూ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్ తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్’. మార్చి 14న విడుదల కానున్న ఈ చిత్రానికి బుధవారం కొన్ని చోట్ల ప్రీమియర్ ప్రదర్శించగా పాజిటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ శైలేశ్ కొలను కూడా ఈ సినిమా వీక్షించాడు. అనంతరం ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. తన హిట్ 3 సినిమా సేఫ్ అంటూ పోస్ట్ చేశాడు.‘నా సినిమా సేఫ్ (హిట్ 3). ‘కోర్ట్’ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది. మూవీ యూనిట్‌కు నా అభినందనలు. ప్రియదర్శి.. నువ్వు మరో విజయం సాధించావు. ఇక నా ‘హిట్ 3’ ఎడిట్ రూమ్‌కు వెళ్లాలి. అందరూ కోర్ట్ సినిమా చూడండి’’ అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు ‘మిర్చి’లో ప్రభాస్ పోస్టర్‌ను జోడించారు. మిర్చిలో ప్రభాస్ ‘నా ఫ్యామిలీ సేఫ్’ అని డైలాగు చెప్పే ఇమేజ్‌లను శైలేశ్ కొలను పంచుకున్నారు. ‘హిట్ 3’ సినిమా విషయానికొస్తే.. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో అర్జున్ సర్కార్‌గా కనిపించనున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. Naaa cinema safe !!!! #CourtStateVsANobody is an emotionally riveting movie that is absolutely necessary for everyone cos there is so much to take back home. So proud to be associated with @walpostercinema @tprashantii and my man @NameisNani. One more feather in… pic.twitter.com/e13JAGLEJa— Sailesh Kolanu (@KolanuSailesh) March 12, 2025 -
సినిమా చూడొద్దన్న నాని.. నేడే రిజల్ట్!
ఈ మధ్య సినిమా వాళ్లు రాజకీయ నాయకుల్లా సవాళ్లు విసురుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తమ కథపై వారికి ఉన్న నమ్మకమే అలా మాట్లాడిస్తుంది. అయితే అన్ని సందర్భాలో వారి నమ్మకం ఫలించదు. కొన్నిసార్లు అంచనాలు తలకిందులు అవుతుంటాయి.మరికొన్ని సార్లు అంచనా వేయలేని విజయాన్ని అందిస్తాయి. కానీ ప్రమోషన్స్‌లో మాత్రం మేకర్స్ అంతా తమది గొప్ప కళాఖండమే అని చెప్పుకోవడంలో తప్పులేదు. చివరికి ఆ సినిమా హిట్టా? ఫట్టా అనేది డిసైడ్ చేసేది ఆడియన్ మాత్రమే. ఈ విషయం మేకర్స్‌కి కూడా తెలుసు కానీ ఆడియన్‌ని థియేటర్‌కి రప్పించేందుకు ఇలాంటి ‘సవాళ్ల’ని ఎదుర్కొవాల్సిందే. తాజాగా హీరో నాని(Nani) ప్రేక్షకులకు విసిరిన సవాల్ నెట్టింట బాగా వైరల్ అయింది. ఆయన నిర్మించిన ‘కోర్ట్’(Court ) సినిమా నచ్చకపోతే ఆయన హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమాని చూడకండి అని ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. ఇక కోర్ట్ సినిమాని రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడయాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ ని బయట పెట్టుకున్నాడు. నాని ఊహించినట్లే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారనేది నేటి సాయంత్రంతో తేలిపోతుంది. ఈ రోజు సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లను వేయబోతున్నారు.(చదవండి: నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ ఎలా ఉందంటే?)ఇక నాని ‘కోర్ట్’కి పోటీగా బరిలోకి దిగాడు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన ‘దిల్రూబా’(Dilruba ) మూవీ కూడా మార్చి 14నే విడుదల కానుంది. ఈ సినిమాపై కిరణ్ కంటే ఎక్కువగా ప్రొడ్యూసర్ రవినే నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే తనని చితక్కొట్టి బయటకు విసిరేయండని సవాల్ విసిరాడు. ఈయన కామెంట్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కోర్ట్‌తో పాటు దిల్రూబాకి కూడా పెయిడ్ ప్రీమియర్లు పడుతున్నాయి. ఈ రోజు సాయంత్రమే ఈ మూవీ రిజల్ట్ వచ్చేస్తుంది. సవాళ్లకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందా? లేదా? చూడాలి. -
వద్దంటున్నా క్రికెటర్ చాహల్‌తో లింక్.. అసలెవరీ ఆర్జే మహ్వశ్?
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal).. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటి, నిర్మాత, ఆర్జే మహ్వశ్ (RJ Mahvash) ప్రేమలో ఉన్నారంటూ కొద్ది నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే డేటింగేనా? ఎందుకిలా తయారయ్యార్రా బాబూ అని మహ్వశ్ తలపట్టుకుంది. కట్ చేస్తే ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు వీరిద్దరూ కలిసి వెళ్లారు.ఓపక్క సంతోషం.. మరోపక్క చికాకుదీంతో లవ్ గాసిప్స్‌కు మరోసారి ఆజ్యం పోసినట్లైంది. తాజాగా మరోసారి ఈ రూమర్స్‌పై మహ్వశ్ ఘాటుగా స్పందించింది. ఈ మధ్యే తనకు ఉత్తమ మెగా ఇన్ఫ్లుయెన్సర్గా అవార్డు వచ్చింది. అందుకు సంతోషపడుతూనే తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్వశ్ ఎంతో గర్విస్తోంది. ఇదే నాకు కావాల్సింది! ఏ తప్పు చేయకుండా, పనికిరాని విషయాలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి అని రాసుకొచ్చింది. డేటింగ్ కథనాలనుద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టిందని తెలుస్తోంది.భార్యకు చాహల్ విడాకులు!కాగా టీమిండియా ఆటగాడు యజువేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్ 20న వీరి వివాహం జరిగింది. కానీ ఐదేళ్లకే వీరు తమ దారులు వేరంటూ విడిపోయారు. వీరు విడిపోయాక చాహల్ ఎక్కువగా మహ్వశ్తో కలిసి కనిపిస్తుండటంతో డేటింగ్ రూమర్స్ పుట్టుకొచ్చాయి.ఎవరీ ఆర్జే మహ్వశ్?మహ్వశ్ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్జే)గా పని చేస్తోంది.సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది.చాహల్‌తో డేటింగ్ కథనాల వల్ల జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల సంఖ్య నేడు 2.3 మిలియన్స్‌కు చేరింది.నవాజుద్దీన్ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.హీరోయిన్గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) చదవండి: కుమారుడితో బ్రహ్మానందం నటించిన సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే? -
Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
టైటిల్:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2025హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్’. ‘‘కోర్ట్’ నచ్చకపోతే నా ‘హిట్ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు? ఇలాంటి పవర్ఫుల్ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఏం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్.దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్ దాము(హర్ష వర్ధన్) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో అవన్నీ అబద్దాలని తేలిపోతాయని తెలిసినా.. తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నాని కాన్ఫిడెన్స్‌కి కారణం ఇదే : ‘కోర్ట్’ డైరెక్టర్
‘కోర్ట్’ కథ నానికి చెప్పడానికి దాదాపు 8 నెలల వెయిట్ చేశాను. ఫైనల్‌గా ఓ రోజు ఆయన నుంచి పిలుపొచ్చింది. దాదాపు రెండున్నర గంటల కథని సింగిల్ సిటింగ్ లో విన్నారు. కథ మొత్తం విని నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి 'వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా' అన్నారు. అది నా జీవితంలో హై మూమెంట్’ అని అన్నారు డైరెక్టర్ రామ్ జగదీష్. ఆయన ఆయన దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఈ కథ ఫోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది. నిజజీవితంలో ఇలాంటి ఒక కేసుని నేను పరిశీలించాను. ఆ కేసు గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఇలా కూడా ఉంటుందా అని సందేహంగా అనిపించింది. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది. ఆ కేసులు అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేశాను. ఏపీ తెలంగాణలో వందల కేసులు ఉన్నాయి. ఇవన్నీ స్క్రీన్ మీద అడ్రస్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈ కథ కోసం చాలా కేసు ఫైల్స్ చదివాను. అన్ని కేస్ ఫైల్స్ లో ఉన్న మెటీరియల్ తో ఒక మంచి కథ చెప్పొచ్చు కదా అనిపించింది. అవన్నీ ఒక కథగా చేసి స్క్రీన్ పై చూపించడం జరిగింది.⇢ ఇది పర్టికులర్ ఒక పర్సన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన కథ కాదు. చాలా సంఘటనల స్ఫూర్తి ఉంది. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ కథ. చదివిన కేసుల ఎసెన్స్ తో ఒక ఫిక్షనల్ స్టోరీ చేయడం జరిగింది.⇢ మనం గతంలో చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు చూసాం. కానీ ఒక లవ్ స్టోరీ ని కోర్ట్ రూమ్ డ్రామాగా ఎప్పుడు చూడలేదని భావిస్తున్నాను. ఇందులో లవ్ స్టోరీ, కోర్ట్ రూమ్ డ్రామా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.⇢ ఫోక్సో చాలా ముఖ్యమైన ఆక్ట్. నిజానికి ఆ చట్టం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తే బాగుంటుందని అనిపించింది. అది ఈ సినిమాలో చూస్తారు.⇢ ఈ సినిమాలో అన్ని పాత్రలని ఆడిషన్స్ చేసి తీసుకున్నాం. చందు పాత్ర ప్లే చేయడానికి రోషన్ చాలా తపనపడ్డాడు. సెలెక్ట్ అయిన తర్వాత తను చేసిన ఫాలోఅప్ అద్భుతం. చాలా ఫ్యాషన్ చూపించాడు. చందు పాత్రని త్వరగానే క్లోజ్ చేసాం కానీ జాబిల్లి పాత్ర కోసం చాలా సెర్చ్ చేసాం. ఒక తెలుగు అమ్మాయి కావాలి, కొత్తగా ఉండాలి, సరైన ఏజ్ కావలి, నటన తెలిసి ఉండాలి ఇలాంటి కాంబినేషన్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నప్పుడు ఒక దశలో దొరకదేమో అనుకున్నాం. అలాంటి సమయంలో నా ఫ్రెండ్ ఒక ఇన్‌స్టా ప్రొఫైల్ పంపించాడు. అందులో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ లో తను జాబిల్లిలా కనిపించింది. అడిషనల్ చేసాం. ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది, ⇢ ఈ సినిమా ఐడియా మొదటగా ప్రియదర్శికే చెప్పాను. ఆయనకి చెప్పిన తర్వాత ఈ సినిమాని నేనే చేస్తాను. ఇంకా ఎవరికీ చెప్పొద్దు అన్నారు. ఆయనకే చెప్పాను. ఆయనతోనే చేశాను. ప్రియదర్శితో నాకు చాలా క్లోజ్ అసోషియేషన్. చాలా ఫ్రెండ్లీ గా ఉంటాం. తనతో అన్నీ షేర్ చేసుకోగలను.⇢ శివాజీ గారు మంగపతి క్యారెక్టర్ లో కనిపిస్తారు. ప్రతి ఫ్యామిలీలో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరు మంగపతి అవుతారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ లా ఉంటుంది.⇢ నాని గారు సినిమా చూశారు. అందుకే ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుందని చెబుతున్నాడు. సినిమాపై ఆయనకి ఉన్న కాన్ఫిడెన్స్ అది. ఆయన కాన్ఫిడెన్స్ అంతా సినిమా ఇచ్చిందే. నాని గారు సినిమా చూసి 'ప్రౌడ్ అఫ్ యూ జగదీశ్' అన్నారు. అది నాకు వచ్చిన బెస్ట్ కాంప్లీమెంట్⇢ ఇది కమర్షియల్ సినిమానే. సినిమా చూసి ఒకతను చుక్క రక్తం లేకుండా కమర్షియల్ సినిమా చూపించావ్ అన్నారు. ఆ మాట నాకు చాలా నచ్చింది.ఈ సినిమా మనందరి జీవితం. మనం తెలుసుకోవాల్సిన నిజం. స్క్రీన్ మీద మన జీవితమే ఉంటుంది. మనల్ని మనం తెరపై చూసుకోవడానికి సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. -
సౌందర్య మరణం.. ఆ రోజు ఏం జరిగింది?
అందం, అభినయం..ఈ రెండు కలిస్తే సౌందర్య. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో సౌందర్య ఒకరు. దశాబ్దానికి పైగా హీరోలతో సమానంగా క్రేజీ సొంతం చేసుకున్న ఈ విలక్షణ నటి.. చిన్న వయసులోనే అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. 2004లో ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై పేలి పోయింది. ఈ ప్రమాదంలో సౌందర్య(32)తో పాటు ఆమె సోదరుడు కూడా మృతి చెందారు. ఈ ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు సౌందర్య మరణంపై పుకార్లు వచ్చాయి. ఆమె మరణం వెనుక సీనియర్ హీరో మోహన్ బాబు ఉన్నారంటూ ఓ వ్యక్తి లేఖ రాయడంతో మరోసారి సౌందర్య పేరు నెట్టింట వైరల్‌గా మారింది. అసలు సౌందర్య ఎలా చనిపోయింది? ఆ రోజు ఏం జరిగింది?→ 2004 ఏప్రిల్ 17 మధ్యాహ్నం గం.1:14 నిమిషాలకు బెంగళూరులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. ఆమెతో పాటు అన్నయ్య అమర్ కూడా నేలరాలి పోయారు. అప్పటికామెకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ రఘుతో పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు. → కరీంనగర్ జిల్లాలో బీజేపీకి సపోర్ట్‌గా ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేకపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ హెలికాఫ్టర్‌ను కొద్దిగా ఎడమ వైపు తిప్పాడు. అంతే..ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే హెలికాఫ్టర్‌లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇదంతా జరిగింది. → ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. ప్రమాదం జరిగిన సమయానికి సౌందర్య గర్భంతో ఉంది. మంటలు భారీగా చెలరేగడంతో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఎవరి శరీర భాగాలు ఎవరివో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందట. → సౌందర్య మరణించి 20 ఏళ్లు దాటినా అభిమానులు ఇప్పటికీ ఆమెను మర్చిపోవడం లేదు. కాగా, ఆమె మరణంపై వస్తున్న పుకార్లపై భర్త రఘు స్పందించారు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి గొడవల్లేవని, ఆస్తు వివాదాలు అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. (చదవండి: మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవల్లేవు: సౌందర్య భర్త) -
ఏప్రిల్‌లో గ్రాండ్‌గా ‘గద్దర్’ అవార్డులు.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ఏప్రిల్‌లో ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(Dil Raju) తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికో సినిమా చొప్పున గద్దర్ అవార్డు( Gaddar Awards)ను ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది . తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత 2014 నుంచి ప్రతి సంవత్సరం బెస్ట్ ఫిల్మ్ అవార్డు 2023 వరకు ఇవ్వనున్నాం.నంది అవార్డ్స్ కు ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అలాగే చిన్న చిన్న మార్పులతో గద్దర్ అవార్డ్స్ కూడా అలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. వారం రోజుల్లో అవార్డులను జ్యూరీ ఫైనల్ చేస్తుంది. గద్దర్ అవార్డు నమునా కూడా సిద్ధం అవుతోంది. ఏప్రిల్‌లో అంగరంగ వైభవంగా సినిమా అవార్డుల వేడుక నిర్వహిస్తాం. సినిమా అవార్డుల అంశాన్ని వివాదం చేయొద్దని కోరుతున్నాను. గతంలో సింహా అవార్డుల కోసం అమౌంట్ పే చేసిన వారికి ఎఫ్డీసీ నుంచి తిరిగి చెల్లింపులు అవుతాయి. పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో కూడా గౌరవ అవార్డులు ఇస్తాం’ అని దిల్ రాజు చెప్పారు. -
మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవల్లేవు: సౌందర్య భర్త
దివంగత నటి సౌందర్య(Soundarya ), మోహన్ బాబు(Mohan Babu) మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయని, సౌందర్య ప్రమాదంలో చనిపోలేదని, ప్లాన్ చేసి చంపేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బహిరంగ లేఖ రాసి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సౌందర్య భర్త రఘు స్పందించాడు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని స్పష్టం చేశాడు. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశాడు.‘గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని సౌందర్య ఆస్తికి సంబందించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్ బాబుతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు.మంచు ఫ్యామిలీతో మాకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది .మోహన్ బాబును నేను గౌరవిస్తాను, మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాం.మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవలు, లావాదేవీలు లేవు. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి’ అని లేఖలో పేర్కొన్నాడు. -
రికార్డు సృష్టించిన డాకు బ్యూటీ.. ఆ కారు కొన్న మొట్టమొదటి నటిగా..
బాసూ.. వేర్ ఈజ్ ద పార్టీ.. అంటూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి రౌతేలా (Urvashi Rautela). ఐటం సాంగ్స్‌కు పెట్టింది పేరైన ఈ బ్యూటీ ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది. ఇటీవలే డాకు మహారాజ్ మూవీలో కీలక పాత్రలో నటించడంతో పాటు దబిడి దిబిడి పాటతో సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఊర్వశి ఖరీదైన కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కారు విలువ అన్ని కోట్లా?భారత్‌లో ఏ నటికి సాధ్యం కాని రీతిలో ఏకంగా రూ.12 కోట్లు పెట్టి రోల్స్ రాయిస్ కులినన్ను కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే ఈ కారు సొంతం చేసుకున్న మొట్టమొదటి నటిగా ఊర్వశి రికార్డుకెక్కనుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లోనూ స్థానం దక్కించుకున్నట్లు భోగట్టా! ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో వెల్కమ్ టు ద జంగిల్, కసూర్ 2 చిత్రాలున్నాయి. ఊర్వశి ఇటు సినిమాల్లో యాక్ట్ చేస్తూ, స్పెషల్ సాంగ్స్ చేయడమే కాకుండా ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటుంది.విమర్శలపాలైన ఊర్వశిడాకు మహారాజ్ సినిమా రూ.100 కోట్లపైనే వసూళ్లు రాబట్టినప్పుడు ఊర్వశి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. తన సినిమా సెంచరీ దాటిందని గర్వపడిపోయింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి గురించి స్పందించమన్నప్పుడు కూడా డాకు మహారాజ్ సినిమా గురించి చెప్తూ సొంత డబ్బా కొట్టుకుంది. ఈ సినిమా విజయం తర్వాత తనకు తల్లి డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చిందని చూపించింది. ఇలాంటివి చేతికి ధరించి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని కామెంట్స్ చేసింది. సైఫ్‌పై సానుభూతి చూపించకుండా తన బహుమతులను చూపిస్తూ షోఆఫ్ చేయడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె తన తప్పిదం తెలుసుకుని సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. సైఫ్‌పై దాడి తీవ్రత తెలియకుండా మాట్లాడినందుకు క్షమించమని కోరింది.చదవండి: చిల్లిగవ్వ లేదు.. ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పని చేశాం: హీరోయిన్ -
ఒకప్పటి మావోయిస్టుల కంచుకోటలో మహేశ్ బాబు సినిమా షూటింగ్!
ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నేడు సినిమా షూటింగ్స్‌తో సందడిగా మారింది. 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేవి. అయితే ప్రస్తుతం అంతా మారిపోయింది. ప్రకృతి అందాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం సినీ తారల ఆటపాటలతో కళకళలాడుతోంది. దీంతో ఒకప్పుడు ఈ ప్రాంతానికి బదిలీపై రావాలంటే భయపడిన అధికారులే నేడు బదిలీకి ముచ్చటపడుతున్నారు. లక్షలాది మంది దేశ, విదేశీయులు విహార యాత్రలకు కోసం తరలివస్తున్నారు. రాజమౌళి షూటింగ్ షురూ పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కొద్దిరోజుల క్రితం సామాన్య వ్యక్తి మాదిరిగా విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో వస్తూ ఈ ప్రాంత అందాలను తిలకించారు. దీనిలో భాగంగా కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్లో స్టే చేశారు. ఇక్కడి అందాలను గమనించి తాను ప్రస్తుతం సూపర్‌స్టార్ మహే‹Ùబాబుతో చేస్తున్న సినిమా షూటింగ్ షురూ చేశారు. దీంతో ఈ ప్రాంతం సందడిగా మారింది. ప్రస్తుతం సిమిలిగుడ ప్రాంతంలోని హోటళ్లలో గదులు దొరకడం లేదు. ఆంధ్ర సరిహద్దు సాలూరుకి కూతవేటు దూరంలో దేవమాలి పర్వతంపై ఈ సినిమా తీస్తున్నారు. అందువలన ప్రతిరోజూ ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి వందలాది మంది అభిమానులు తారలను చూసేందుకు తరలి వస్తున్నారు.తప్పని లీకుల గోల రాజమౌళి బృందం పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ లీకుల బెడద తప్పడం లేదు. మహేష్‌బాబుని విలన్ అనుచరులు నెట్టుకుంటూ వస్తుండగా, విలన్ వీల్ చైర్ మీద ఉండడం, మహేష్ బాబు అక్కడకి చేరడం వంటి వీడియోలు లీకయ్యాయి. ఇవి కొరాపుట్ జిల్లాలో, సోషల్ మీడియాలో ఆదివారం వైరల్ అయ్యాయి. ఒక వ్యక్తి సందర్శకుడి మాదిరిగా వచ్చి కారులో కూర్చుని ఈ వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది. భారీ భద్రత రోజురోజుకీ సందర్శకుల తాకిడి పెరుగుతుండడంతో ప్రభుత్వం ఇక్కడ ప్లాటూన్ పోలీసులను మోహరించింది. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు సుమారు 80 మంది భద్రతా ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. ఇప్పటికే మహేష్‌బాబు, మళయాల విలన్ పృథ్వీవరాజ్ కరుణాకరణ్లు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇంకా హిందీ నటులు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాంలు రావాల్సి ఉంది. ఒడిశా ప్రభుత్వం కూడా సినిమా నిర్మాణానికి పూర్తి సహకారం అందజేస్తోంది. తద్వారా ఈ ప్రాంతం పర్యటక రంగంలో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తోంది. ప్రముఖుల హర్షం ప్రస్తుతం రాజమౌళి సినిమా బృందం సందడి చేస్తుండడంపై రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నాయకుడు రాం చంద్ర ఖడం మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ ప్రాంతంలో షూటింగ్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అవసరమైతే తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. మరిన్ని తెలుగు సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయాలని కోరారు. బీజేడీకి చెందిన కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక మాట్లాడుతూ.. రాజమౌళి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి సినిమాలు ఈ ప్రాంతంలో తీయడం వలన స్థానికులకు ఉపాధితో పాటు ఆదాయం వనరులు పెరుగుతాయన్నారు.ఇప్పటివరకు చిత్రీకరణలు ఈ ప్రాంతంలో ఇదివరకే ప్రముఖ చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. పుష్ప–2 సినిమాను పక్కనే ఉన్న మల్కన్‌గిరి జిల్లాలో అత్యధిక భాగం షూటింగ్ చేవారు. ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కొరాపుట్ జిల్లాలోనే చిత్రీకరణ చేశారు. అప్పట్లో వేంకటేష్ తదితర నటులు ఈ ప్రాంతంలో పర్యటించారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ సినిమా కొరాపుట్ జిల్లాలోనే అత్యధిక భాగం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రజల ముందుకు రానుంది. ఈ సినిమా జయపూర్ మెయిన్ రోడ్డు మీద షూటింగ్ చేయడం గమనార్హం.