
ప్రస్తుతం ప్రేక్షకులు సాధారణ ఫార్మాట్‌లో వచ్చే చిత్రాల కంటే విభిన్న కంటెంట్, కొత్త కాన్సెప్ట్‌లతో రూపొందిన సినిమాలను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే, వినూత్నమైన కథాంశంతో ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘డియర్ ఉమ’ (Dear Uma) చిత్రం తెరకెక్కింది. తెలుగమ్మాయి సుమయ రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడమే కాకుండా, నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బహుముఖ ప్రతిభ కలిగిన సుమయ రెడ్డి, సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు.
నిర్మాణ బాధ్యతలను సుమయ రెడ్డి నిర్వహించగా, నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. సాయి రాజేష్ మహాదేవ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు రాసి, దర్శకత్వం వహించారు. అనేక విజయవంతమైన చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన రదన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
ఇప్పటివరకూ ‘డియర్ ఉమ’ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచాయి. వీటిని బట్టి చూస్తే, ఇది ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది. ఈ ప్రేమకథను ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.
ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ అందమైన సందేశంతో పాటు అధిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందింది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా వంటి అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తయారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.