Sumaya Reddy
-
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్‌డే విషెస్
ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నారు తెలుగమ్మాయి సుమయా రెడ్డి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్నాడు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, నవ్వుతుంటనే లిరికల్ వీడియో సాంగ్ ద్వారా సినిమాలోని ఫీల్ గుడ్ ఎమోషన్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ అందరినీ ఆకట్టుకునేలా ఉందని అంతా ఫిక్స్ అయ్యారు.సుమయా రెడ్డి పుట్టిన రోజు (మే 18) సందర్భంగా చిత్రయూనిట్ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. అన్నీ తానై నడిపిస్తున్న తమ లేడీ బాస్‌కు చిత్రయూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు -
శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్
తెలుగమ్మాయి హీరోయిన్గా, నిర్మాతగా మారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అంటే సాధారణమైన విషయం కాదు. ‘డియర్ ఉమ’ సినిమాతో నిర్మాత, హీరోయిన్గా తెరపైకి రాబోతున్నారు. ఈ చిత్రంలో తెలుగుమ్మాయి సుమయ రెడ్డి, దియా మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీని సుమయ రెడ్డి నిర్మించగా.. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా సుమయా రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేష స్పందన లభించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. -
‘డియర్ ఉమ’ గా రాబోతున్న సుమయ రెడ్డి
తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్గా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘డియర్ ఉమ’. దియ మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కూడా నిర్మించారు. టీజర్ రిలీజ్ చేసిన తరువాత సినిమా స్థాయి ఏంటో అందరికీ తెలుస్తుందని మేకర్లు చెబుతున్నారు. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు త్వరలోనే థియేటర్లోకి రానుందని దర్శక నిర్మాతలు తెలిపారు.