
ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నారు తెలుగమ్మాయి సుమయా రెడ్డి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్నాడు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, నవ్వుతుంటనే లిరికల్ వీడియో సాంగ్ ద్వారా సినిమాలోని ఫీల్ గుడ్ ఎమోషన్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ అందరినీ ఆకట్టుకునేలా ఉందని అంతా ఫిక్స్ అయ్యారు.
సుమయా రెడ్డి పుట్టిన రోజు (మే 18) సందర్భంగా చిత్రయూనిట్ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. అన్నీ తానై నడిపిస్తున్న తమ లేడీ బాస్‌కు చిత్రయూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు
Comments
Please login to add a commentAdd a comment