birthday wishes
-
భార్యకు రోహిత్ శర్మ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్
-
వైఎస్ జగన్‌కి బర్త్ డే విషెస్ చెప్పిన ఆర్జీవీ
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్విటర్ వేదికగా పుట్టినరోజు విషెస్ చెప్పారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ట్వీట్ చేసిన తన శుభాకాంక్షలు తెలియజేశారు.(ఇదీ చదవండి: #HBDYSJAGAN: ట్రెండ్ సెట్ చేసిన అభిమానం)'వెరీ హ్యాపీ బర్త్ డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వైఎస్ జగన్ గారు, రాబోయే ఏడాది మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయాలని ఆశిస్తున్నా' అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. (ఇదీ చదవండి: వైఎస్ జగన్‌కు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు) -
YS జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
-
‘ఒరే తలైవర్’ అంటూ బర్త్‌డే విషెస్.. హీరోయిన్‌పై రజనీ ఫ్యాన్స్ ఫైర్!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 12న తన పుట్టినరోజు జరుపుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే నటి దుషారా విజయన్ ‘ఒరే తలైవర్’ అంటూ సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్‌కి చెప్పిన శుభాకాంక్షలు వివాదాస్పదం అయ్యాయి. రజనీకాంత్ గౌరవం తగ్గించి ఒరే తలైవర్ అంటూ పోస్ట్ చేయడాన్ని తెలుగు నెటిజన్స్ తప్పుబట్టారు. ఒరే అంటే ఒరేయ్ అని తెలుగువాళ్లు అనుకున్నారు. అయితే తమిళంలో ‘ఒరే’ అంటే ఒక్కరే అని అర్థం. అందుకే ‘ఒరే తలైవర్’ (సూపర్‌స్టార్ ఒక్కరే) అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు దుషారా. అంతేకానీ రజనీని అవమానించే విధంగా ఒరే అనే పదాన్ని ఎక్కడా వాడలేదంటూ తమిళ్ తెలిసిన వారు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఫ్యాషన్ డిజైనర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దుషారా ‘బోదై ఏరి బుదద్ధి మారి’ (2019) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తక్కువ సమయంలోనే రజనీకాంత్ (వేట్టయాన్), ధనుశ్ (రాయన్), విక్రమ్ (వీర ధీర శూరన్ 2) వంటి స్టార్ హీరోల సినిమాలల్లో నటించే అవకాశం అందుకున్నారు దుషారా. ఇలా కెరీర్ పరంగా ఈ బ్యూటీ దూసుకెళుతున్నారు. View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ ప్రముఖుల్లో బండ్ల గణేశ్ ఒకరు. వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరుగుతున్న ఘటనలపై తనదైన శైలీలో స్పందిస్తుంటాడు. ముఖ్యంగా రాజకీయాలపై ఆయన చేసే ట్వీట్స్ వైరల్ అవుతుంటాయి. 2018 తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ టికెట్ దక్కలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.(చదవండి: యానిమేటెడ్ సిరీస్ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ)2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ పొలిటికల్ ట్వీట్స్ చేయడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగుడుతూ చాలా ట్వీట్స్ చేశాడు. ఇక నిన్న (నవంబర్ 8) సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే టాలీవుడ్‌కి చెందిన ప్రముఖుల్లో చిరంజీవితో పాటు ఒకరిద్దరు మాత్రమే రేవంత్‌కి విష్ చేస్తూ ట్వీట్స్ పెట్టారు. పలువురు స్టార్ హీరోలతో పాటు బడా నిర్మాతలు సైతం శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈ విషయంపై బండ్ల గణేశ్ స్పందిస్తూ సెటైరికల్ ట్వీట్ చేశాడు.‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బండ్ల గణేశ్ ట్వీట్‌పై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”.🙏 @revanth_anumula anna @TelanganaCMO— BANDLA GANESH. (@ganeshbandla) November 9, 2024 -
సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే.. ప్రధాని మోదీ విషెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులతో పాటు సినీ రంగానికి చెందినవారు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎ క్స్‌లో పేర్కొన్నారు.ప్రధాని పోస్టుకు రేవంత్‌రెడ్డి రిప్లై ఇచ్చారు. మీ విషెస్‌కు ధన్యవాదాలు అని చెప్పారు. మరోవైపు సీఎం శుక్రవారం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడనున్నారు.Best wishes to Telangana CM Shri Revanth Reddy Ji on his birthday. I pray for his long and healthy life. @revanth_anumula— Narendra Modi (@narendramodi) November 8, 2024 -
సీఎం రేవంత్ కు కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
-
హ్యాపీ బర్త్‌డే రేవంత్ : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘నేను హైదరాబాద్‌లో ఉన్నా. మీ ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రావొచ్చు. వారికి నా స్వాగతం. మీ బర్త్‌డే కేక్ వారితో కట్ చేయిస్తా. చాయ్, బిస్కెట్లు కూడా ఇస్తా’ అని పేర్కొన్నారు. Happy Birthday @revanth_anumula I am very much in Hyderabad. Your agencies are welcome anytime Chai, Osmania biscuits and if they want to cut your birthday cake, it’s on me 👍 https://t.co/ccPOezg1WC— KTR (@KTRBRS) November 8, 2024 కాగా, అరెస్ట్ భయంతో కేటీఆర్ మలేషియా వెళ్తున్నారంటూ పలు మీడియా కథనాలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసు. జర్నలిజాన్ని జోక్‌గా మార్చొద్దు. కేటీఆర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో చాయ్ తాగుతూ ఈ వార్తను చదువుతూ ఉంటారని చెప్పారు. ఆ ట్వీట్‌కు ట్యాగ్ చేస్తూ కేటీఆర్ పై విధంగా స్పందించారు. -
వార్నర్ బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
హీరోలు పుట్టినరోజులు వస్తుంటాయి. కానీ ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకున్న సందర్భాలు తక్కువే. అలాంటిది అల్లు అర్జున్ మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుట్టినరోజుని గుర్తుంచుకుని మరీ శుభాకాంక్షలు చెప్పాడు. తన ఇన్ స్టాలో స్టోరీ కూడా పెట్టాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)'అల వైకుంఠపురములో' సినిమా మహా అయితే తెలుగోళ్లకు మాత్రమే తెలుసుంటుంది. కానీ లాక్డౌన్ టైంలో బుట్టబొమ్మ పాటకు డేవిడ్ వార్నర్ రీల్స్ చేశాడు. తెలుగు నాట ఫుల్ ఫేమస్ అయిపోయాడు. 'పుష్ప' రిలీజ్ తర్వాత అయితే గడ్డం కింద చేయి పెట్టే మేనరిజమ్, శ్రీవల్లి పాటలో స్టెప్పులు వార్నర్‌కి తెగ నచ్చేశాయి. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఐపీఎల్‌లోనూ 'తగ్గేదే లే' మేనరిజమ్స్ చేసి చూపించేవాడు. అలా బన్నీ-వార్నర్ మధ్య సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ అవుతూనే ఉంది.ఒకరి పుట్టినరోజున మరొకరు విషెస్ చెబుతూనే వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బన్నీ పుట్టినరోజు వార్నర్ స్టోరీ పెడితే.. ఇప్పుడు వార్నర్ బర్త్ డేకి అల్లు అర్జున్ ఇన్ స్టాలో స్టోరీ పెట్టడం వీళ్ల మధ్య బాండింగ్ ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది. చాన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో అడుగుతున్నట్లు 'పుష్ప 2'లో వార్నర్‌కి చిన్న గెస్ట్ రోల్ ఇచ్చేస్తే అభిమానులు కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారేమో?(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
సోనూ సూద్ పుట్టిన రోజుకు విద్యార్థులు విభిన్న విషెస్
-
కేటీఆర్‌కు సీఎం రేవంత్ బర్త్‌డే విషెస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు కేటీఆర్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారాయన.సిరిసిల్లా శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని… pic.twitter.com/YtJYFVTgvc— Telangana CMO (@TelanganaCMO) July 24, 2024 -
YSRCP ఎంపీ విజయసాయిరెడ్డికి రాజ్యసభ జన్మదిన శుభాకాంక్షలు
-
విజయసాయి రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు: రాజ్యసభ చైర్మన్
న్యూఢిల్లీ, సాక్షి: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు నేడు(జులై 1). ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయసాయిరెడ్డి రెండోసారి ఎన్నికై రాజ్యసభలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా ఉన్నారు. ఆయన అపార జ్ఞానం, అనుభవం సభలో చట్టాల రూపకల్పనకు ఎంతో ఉపయోగపడింది. అంతేకాదు.. స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి విశేష సేవలందించారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్, టీటీడీ మెంబర్ గా, పబ్లిక్ సర్వీస్ బ్యాంకు డైరెక్టర్ గానూ గతంలో ఆయన పని చేశారు. ఆయన సంతోషకరమైన జీవితం గడపాలని కోరుకుంటూ రాజ్యసభ తరఫున జన్మదిన శుభాకాంక్షలు అని చైర్మన్ ధన్‌ఖడ్ తెలిపారు. అలాగే.. రాజ్యసభలో కొందరు సభ్యులు ఆయనకు పుట్టినరోజు విషెస్ తెలియజేశారు. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్‌డే విషెస్
ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నారు తెలుగమ్మాయి సుమయా రెడ్డి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్నాడు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, నవ్వుతుంటనే లిరికల్ వీడియో సాంగ్ ద్వారా సినిమాలోని ఫీల్ గుడ్ ఎమోషన్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ అందరినీ ఆకట్టుకునేలా ఉందని అంతా ఫిక్స్ అయ్యారు.సుమయా రెడ్డి పుట్టిన రోజు (మే 18) సందర్భంగా చిత్రయూనిట్ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. అన్నీ తానై నడిపిస్తున్న తమ లేడీ బాస్‌కు చిత్రయూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు -
స్టాలిన్‌కు చైనా భాషలో శుభాకాంక్షలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు రాష్ట్ర బీజేపీ విభాగం శుక్రవారం చైనా భాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ‘బీజేపీ తమిళనాడు విభాగం గౌరవ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆయనకు ఇష్టమైన భాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది’అని ‘ఎక్స్’లో పేర్కొంది. అందులో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ నడ్డా, తమిళనాడు విభాగం అధ్యక్షుడు అన్నామలై చిత్రాలు, ఆపక్కనే స్టాలిన్ చిత్రం కింద చైనీస్ భాషలో ఒక సందేశం ఉంది. రాష్ట్రంలో ఇస్రో కాంప్లెక్స్ సముదాయం ప్రారంభం సందర్భంగా ఇటీవల డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో చైనా జెండా కనిపించడం వివాదం రేపింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈ మేరకు స్పందించడం విశేషం. అయితే, ఆ ప్రకటనలో పొరపాటున చైనా జెండా అచ్చయిందే తప్ప, ఉద్దేశపూ ర్వకంగా చేసింది కాదని ఆ ప్రకటన ఇచ్చిన మంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. -
భార్య సురేఖ కోసం ‘చిరు’ కవిత.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. తన సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటాడు. తన కుటుంబంలో ఏదైన సంతోషకరమైన వార్త ఉన్నా కూడా దాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటాడు. అప్పుడప్పుడు తనలో దాగి ఉన్న కవిని కూడా సోషల్ వీడియా వేదికగా బయటకు తీస్తుంటాడు. గతంలో ఆకాశం గురించి అద్భతమైన కవితను అందరిని ఆశ్చర్యపరిచాడు చిరంజీవి. ఇక తాజాగా తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఓ ‘చిరు’కవిత రాసి శుభాకాంక్షలు తెలిపాడు. నేడు(ఫిబ్రవరి 18) సురేఖ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ.. ‘నా జీవన రేఖ..నా సౌభాగ్య రేఖ..నా భాగస్వామి సురేఖ !’అంటూ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. మంచి ప్రాసతో కూడిన ఈ కవితకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. చిరంజీవి ప్రస్తుతం యూఎస్ ట్రిప్‌లో ఉన్నాడు. సురేఖ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమే ఈ ట్రిప్ వేసినట్లు తెలుస్తోంది. సురేఖ-చిరుల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
అసెంబ్లీలో కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే విషెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇరిగేషన్ శ్వేత పత్రంపై అధికార-ప్రతిపక్షం నడుమ వాడీవేడిగా వాదనలు జరుగుతున్న టైంలో.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సీటులోంచి లేచారు. మాజీ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన పూర్తి ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే.. ప్రధాన ప్రతిపక్షనేతగా ఆయన ప్రభుత్వానికి సహకరిస్తూ తెలంగాణ పున్నర్మిణంలో.. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటున్నాం అని అన్నారాయన. కేసీఆర్ పూర్తిగా ఆరోగ్యంతో ఉండాలని.. ఆయన మరింత కాలం తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని తమ పార్టీ, ప్రభుత్వం కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. -
నేడు కేసీఆర్ పుట్టినరోజు.. స్పెషల్ వీడియోలు, ఫొటోలతో విషెస్
సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు..‘తెలంగాణ స్పాప్నికుడు, స్వరాష్ట్ర సాధకుడు, సుపరిపాలకుడు, ఉద్యమ నేత కేసీఆర్. కారణజన్ముడుగా.. చిరస్మరణీయుడుగా, ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడుగా ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని ఫొటోలను షేర్ చేశారు. తెలంగాణ స్పాప్నికుడు, స్వరాష్ట్ర సాధకుడు, సుపరిపాలకుడు, ఉద్యమ నేత కేసీఆర్ గారు. కారణజన్ముడుగా... చిరస్మరణీయుడుగా, ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడుగా ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలి.. !! కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐#HappyBirthdayKCR pic.twitter.com/dtmgl6onqB — Harish Rao Thanneeru (@BRSHarish) February 17, 2024 ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో..‘స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ కేసీఆర్ వీడియోను షేర్ చేశారు. స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు#JaiKCR#JaiTelangana pic.twitter.com/GRA8yWQ7nO — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2024 ఇక, బీఆర్ఎస్ నేతలు, మద్దతుదారులు కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. Happy birthday KCR! 🦁 pic.twitter.com/UdeBTKmgth — 7 (@Lillymogudu7) February 17, 2024 Wish you a very Happy Birthday KCR Sir♥️#HappBirthdayKCR pic.twitter.com/LBzZSK45MB — Akshay (@AkshayBRS) February 16, 2024 Happy Birthday KCR sir 💞#HappyBirthdayKCR pic.twitter.com/eGxgE63gI0 — Bathai Baba 🏴☠️ (@Aditya_BRS) February 17, 2024 నాకు రైతు అంటే ఇష్టం వ్యవసాయం అంటే ఇష్టం నీళ్లు అంటే ఇష్టం పాడిపంటల తెలంగాణ అంటే ఇష్టం ఇవన్నీ మాకు అందించిన బాపు #KCR గారు అంటే నాకు ప్రాణం❤️ బాపు కేసీఆర్ నా గుండెల్లోనే కాదు ఇక ఎప్పటికీ నాతోనే🙏#HappyBirthdayBapu pic.twitter.com/jdFdLcIHMX — Pavani Goud BRS (@PAVANIGOUD_BRS) February 16, 2024 -
సీఎం జగన్ కి పోసాని అదిరిపోయే బర్త్ డే విషెస్..
-
సీఎం జగన్ కి సెలెబ్రెటీస్ స్పెషల్ బర్త్ డే విషెస్..
-
నేను ఎవరికీ బర్త్ డే విషెస్ చెప్పను...కానీ జగనన్నకు చెప్తా..
-
సీఎం వైఎస్ జగన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన దేవులపల్లి అమర్
-
2024 జగనన్న వన్స్ మోర్.. అలీ
-
Anushka Shetty Birthday: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి బర్త్‌డే ఫోటోలు