సీఎం రేవంత్‌ రెడ్డి బర్త్‌డే.. బండ్ల గణేశ్‌ ట్వీట్‌ వైరల్‌ | Bandla Ganesh Satirical Tweets On Tollywood | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ రెడ్డి బర్త్‌డే.. టాలీవుడ్‌పై బండ్ల గణేశ్‌ సెటైరికల్‌ ట్వీట్‌!

Nov 9 2024 11:42 AM | Updated on Nov 9 2024 12:02 PM

Bandla Ganesh Satirical Tweets On Tollywood

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్‌ ప్రముఖుల్లో బండ్ల గణేశ్‌ ఒకరు. వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరుగుతున్న ఘటనలపై తనదైన శైలీలో స్పందిస్తుంటాడు. ముఖ్యంగా రాజకీయాలపై ఆయన చేసే ట్వీట్స్‌ వైరల్‌ అవుతుంటాయి. 2018 తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో  కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ టికెట్ దక్కలేదు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో  తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

(చదవండి: యానిమేటెడ్‌ సిరీస్‌ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ)

2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మళ్లీ పొలిటికల్‌ ట్వీట్స్‌ చేయడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని పొగుడుతూ చాలా ట్వీట్స్‌ చేశాడు. ఇక నిన్న (నవంబర్‌ 8) సీఎం రేవంత్‌ రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఎక్స్‌ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే టాలీవుడ్‌కి చెందిన ప్రముఖుల్లో చిరంజీవితో పాటు ఒకరిద్దరు మాత్రమే రేవంత​్‌కి విష్‌ చేస్తూ ట్వీట్స్‌ పెట్టారు. పలువురు స్టార్‌ హీరోలతో పాటు బడా నిర్మాతలు సైతం శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈ విషయంపై బండ్ల గణేశ్‌ స్పందిస్తూ సెటైరికల్‌ ట్వీట్‌ చేశాడు.

‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అని బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం బండ్ల గణేశ్‌ ట్వీట్‌పై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement