సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్‌ | Sri Venkateswara Creations And Mythri Movie Makers Tweet On Meet With CM Revanth Reddy, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

Mythri Movie Makers: సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్‌

Published Thu, Dec 26 2024 4:01 PM | Last Updated on Thu, Dec 26 2024 4:44 PM

Sri Venkateswara Creations Tweet On Meet With CM Revanth Reddy

తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలుస్తుందని దిల్‌ రాజుకు చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్వీట్ చేసింది. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీ పెద్దల మధ్య సమావేశం జరగడం శుభసూచకమని పోస్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని, నాయకత్వాన్ని అభినందిస్తున్నామని తెలిపింది. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది. సినిమా షూటింగ్‌లకు హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కట్టుబడి ఉన్నారని రాసుకొచ్చింది.  డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

కాగా.. ఇవాళ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డితో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా భేటీ అయ్యారు. సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత సీఎంతో భేటీలో పలు అంశాలపై చర్చించారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండదని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ భేటీ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..

సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ తర్వాత పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. గ్లోబల్ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల దిశగా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి దూరదృష్టికి ఇండస్ట్రీ ఎల్లప్పుడు  మద్దతుగా ఉంటుందని పేర్కొంది.

అలాగే సామాజిక సమస్యలపై అవగాహన పెంచడంలో ప్రభుత్వానికి మద్దతుగా ఇండస్ట్రీ పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మద్దుతుగా ఉంటామని మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. మన సమాజ ఉజ్వల భవిష్యత్తు కోసం,  తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చింది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement