cinema industry
-
మోనాలిసా బాలీవుడ్ ఎంట్రీ.. ఇంటికెళ్లి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్
యూపీలో జరుగుతున్న ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళా ఏకంగా ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. సోషల్ మీడియా పుణ్యమాని ఆమె వీడియో పెద్దఎత్తున వైరల్ కావడంతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిపోయింది. ఇంకేముంది ఆమె ఫోటోలు, వీడియోలు చూసిన సినీ ప్రముఖులు సైతం ఆమె అందాన్ని ప్రశంసించారు. అసలు పేరు ఇంకా చెప్పట్లేదని బాధపడుతున్నారా? అదేనండి తన తేనేలాంటి కళ్లతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న మోనాలిసా. ఇప్పుడంతా దేశంలో ఎక్కడా చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. పూసలమ్మే ఆ అమ్మాయి అందం తన తలరాతను మార్చనుంది. ఇప్పటికే సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఓ ఆఫర్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.మహాకుంభ్ మేళాలో పూసలు అమ్ముతున్న మోనాలిసాకు అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మరో అడుగు ముందుకేశారు. మోనాలిసాకు తాను తెరకెక్కించబోతున్న చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్‌లో ఉన్న మోనాలిసా ఇంటికి వెళ్లి మరి ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. తాజాగా మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మిశ్రా కలిసి ఫోటో కూడా బయటకొచ్చింది.అంతేకాదు.. మోనాలిసా సైతం ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కష్టపడతానని సనోజ్ మిశ్రాకు హామీ కూడా ఇచ్చింది మోనాలిసా. ఇంకేముంది తేనేకళ్ల సుందరిని బిగ్ స్క్రీన్‌పై చూసే ఛాన్స్ కూడా త్వరలోనే రానుంది. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే పేరుతో సనోజ్ మిశ్రా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తాజాగా ఇవాళ సినిమాలో నటించేందుకు మోనాలిసా సంతకాలు చేయడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది.ఊహించని విధంగా ఫేమ్..మహాకుంభ్ మేళాకు జీవనోపాధి నిమిత్తం వెళ్లిన మోనాలిసాకు ఊహించని విధంగా ఫేమ్ వచ్చింది. ఓ నెటిజన్ ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్దఎత్తున వైరలైంది. దీంతో అక్కడికెళ్లిన వారంతా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వ్యాపారం కంటే ఆమెను చూసేందుకు ఎక్కువమంది వచ్చారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ వారి తాకిడి పెరగడంతో మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్‌కు పంపించేశారు.దర్శకుడు సనోజ్ మిశ్రా మాటాడుతూ..' తన రాబోయే చిత్రం "ది డైరీ ఆఫ్ మణిపూర్" కోసం మోనాలిసాను ఎంచుకున్నా. ఈ చిత్రం ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ఇద్దరు కథానాయికల్లో మోనాలిసా కూడా ఉంటారు. మోనాలిసా సింప్లిసిటీకి ముగ్ధుడై నా సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. మోనాలిసా కుటుంబాన్ని ఇంటికి వెళ్లి కలిశా. ఆమె నా సినిమాలో నటించేందుకు అంగీకరించారు. తాను జీవితంలో ఎప్పుడూ నటించలేదనే విషయం నాకు తెలుసు. అదే నేను సవాల్‌గా తీసుకున్నా. మోనాలిసాకు నటనలో శిక్షణ ఇస్తా. ఆ తర్వాత ఏప్రిల్‌లో సినిమా ప్రారంభిస్తాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలు పాపులారిటీ కోసం అసభ్యకరమైన రీళ్లు తయారు చేస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన మోనాలిసా వంటి సాధారణ అమ్మాయి కూడా వినోద ప్రపంచంలో పని చేయడం ద్వారా ముందుకు తీసుకెళ్లవచ్చని నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నా' అని అన్నారు.సనోజ్ మిశ్రా ఎవరు?లక్నో నివాసి అయిన సనోజ్ మిశ్రా రచయితగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సనోజ్ ఇప్పటివరకు 15 సినిమాలు తీశారు. 2023లో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే చిత్రాన్ని రూపొందించి ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ సినిమా ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించాడని కొందరు ఆరోపించారు. -
సక్సెస్ కోసమే సినిమా..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సినిమా వాణిజ్యపరమైన అంశమని, ఈ కారణం చేత సక్సెస్ కోసమే కమర్షియల్ హంగులతో నిర్మిస్తున్నారని ప్రముఖ భారతీయ నటులు, దర్శకులు అమోల్ పాలేకర్ అన్నారు. డిజిటల్ టెక్నాలజీ యుగంలో సినిమా దర్శకుడు ఇతర సినిమా బృందం కన్నా సాంకేతికత పైనే ఎక్కువ ఆధారపడుతోందన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్‌లో భాగంగా ప్లీనరీలో అమోల్ పాలేకర్ తన సతీమణి సంధ్య గోఖలేతో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకులు మోహనక్రిష్ణ ఇంద్రగంటితో తాను రాసిన నూతన పుస్తకం ‘వ్యూ ఫైండర్’ పై చర్చించారు.‘నా వరకూ సినిమా అంటే అందరిలా కాకుండా విభిన్నంగా తీయడమే నచ్చుతుందన్నారు. మెయిన్ స్ట్రీంలో సినిమా రంగానికి నియమాలు, నిబంధనలు, పరిమితులు వంటి సంస్కృతిలో ఇమడలేకపోయానన్నారు. ఎంత పెద్ద విజయం సాధించినా, నిర్మించగలిగినా ఆ క్రెడిట్ మొదట రచయితకే చెల్లుతుంది. ప్రస్తుత సినిమా వందల కోట్ల అంశంగా మారింది. ఒక పెద్ద నిర్మాత నాతో ఇలాంటి సినిమాలే తీయాలని సంప్రదించాడు, అలాంటి పది సినిమాల్లో 9 రిజక్ట్ చేసేవాడిని’ అని అన్నారు. ‘ఒక సినిమా షూట్లో భాగంగా తోటి నటి స్మితను నిజంగా కొట్టాల్సి వచ్చింది, దర్శకుడి ప్రోద్భలంతో ఆ సీన్ బాగా పండించడానికి ఇష్టం లేకున్నా కొట్టాల్సి వచ్చింది. ఆ సీన్లో స్మిత మంచి నటన కనబర్చింది. అనంతరం క్షమాపణ కోరినా, నేను కొట్టడం వల్లే మరింత వాస్తవంగా నటించగలిగానని ఆమె చెప్పడంతో ఆశ్చర్యపోయాను’ అన్నారు. ‘70లలో అద్భుతమైన మధ్య తరగతి సినిమాల ప్రస్తావన రావడంతో.. నాటి జీవితాలకు, ప్రస్తుత జీవన శైలికి తేడా ఉందని, ఇప్పుడు అలాంటి కథలను ఊహించలేం. కానీ ఈ మధ్య అలాంటి కథే ‘సత్యం సుందరం’ నన్నెంతో హత్తుకుంది. నా సినీ మిత్రుడు ఉత్పల్ దత్ ఎంత మంచివాడో నాకే తెలుసు, కానీ దేశంలోనే మొట్టమొదటి సెడేటివ్ కేసుతో అరెస్టు అయ్యాడు’ అని గుర్తు చేసుకున్నారు. నాస్తికులుగా బతకడం కష్టం.. ‘నా భార్యను కలవక ముందు జీవితం, ఆ తరువాతి జీవితం అనేంత ప్రభావం చూపించింది. సతీమణి సంధ్యను కలువక ముందు ఐదేళ్లకు ఒక సినిమా తీస్తే, ఆమెను కలిశాక ఏడాదికో సినిమా తీయగలిగాను. తన పుస్తకం వ్యూ ఫైండర్ మా ఇద్దరి ప్రయాణం క్లైమాక్స్ వంటిది’ అని మోహన క్రిష్ణ ఇంద్రగంటితో చమత్కరించారు. ‘నా చివరి ఎనిమిది సినిమాలకూ నా భార్యే రైటర్. మేమిద్దరమూ నాస్తికులమే, సామాజికంగా నాస్తికులుగా సాగడం అంత సులువు కాదు’ అన్నారు.. ‘నేను సినిమా రంగానికి చెందిన వ్యక్తిని కాదు, 2000 సంవత్సరంలో అమోల్ పాలేకర్ సినిమాకు మొదటి సారి పనిచేశాను’ అని సంధ్య తెలిపారు. -
ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు
-
సినీ ప్రముఖులపై 3 రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
'నువ్వు నిజంగానే దేవుడివయ్యా'.. రిలీజ్ రోజే సంచలన నిర్ణయం!
బాలీవుడ్ హీరో సోనూ సూద్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఫతే'. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఫతే మూవీ రిలీజ్ రోజు టికెట్స్ కేవలం రూ.99 కే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోనూ సూద్ ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. ట్విటర్లో వీడియో షేర్ చేసిన సోనూ సూద్ టికెట్స్ @99.. ఇంకేం ఆలోచిస్తున్నారంటూ పోస్ట్ చేశారు. కానీ సినిమా విడుదల రోజు అంతా టికెట్స్ రేట్లు పెంచాలని కోరుకుంటే.. సోనూ ఏంటి ఇలా చేశారని నెట్టింట చర్చించుకుంటున్నారు. దీనిపై ఇన్‌స్టాలోనూ వీడియో రిలీజ్ చేశారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలో సోనూ సూద్ మాట్లాడుతూ..'2020 కోవిడ్ సమయంలో సహాయం కోసం నన్ను చాలామంది సంప్రదించారు. అందులో ఎక్కువగా సైబర్ క్రైమ్ బాధితులే. వారంతా మోసపోయారు. వారి ఖాతాల నుంచి డబ్బు కొట్టేశారు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. ఫతే సినిమాలో నేను సామాన్యుడి కథను చెప్పాలనుకున్నా. ఫతేహ్ అనేది సామాన్యుల కోసమే రూపొందించిన చిత్రం. ఇది భారతదేశం అంతటా అందరూ చూసేలా అందుబాటులో ఉండాలని కోరుకున్నా. అందుకే మేము మొదటి రోజు టిక్కెట్ల ధర కేవలం రూ.99 కే నిర్ణయించాము. ఈ సినిమా నుండి వచ్చిన మొత్తం లాభాలను స్వచ్ఛంద సంస్థగా కు విరాళంఇస్తాను.' అని ప్రకటించారు.టికెట్ ధరలను తగ్గించడంతో పాటు ఈ సినిమా ద్వారా లాభాలను స్వచ్ఛంద సంస్థలు, అనాథ శరణాలయాలకు విరాళంగా ఇస్తానని సోనూ సూద్ ప్రకటించడం ఆయన సేవభావానికి అద్దం పడుతోంది. కేవలం కలెక్షన్ల కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో సోనూ నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు ఆయనలోని గొప్ప మానవతం కనిపిస్తోంది. దీంతో ప్రజల గుండెల్లో సోనూ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారు. సోనూ సూద్ మరికొందరు హీరోలు ఇలా సాయం చేసేందుకు ముందుకు వస్తే కొంతమందికైనా ఊరట లభిస్తుంది.ఫతే గురించి..కాగా.. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైబర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్లో విడుదల కానుంది.గేమ్ ఛేంజర్‌తో పోటీ..అయితే పాన్ ఇండియా రేంజ్లో అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కూడా రిలీజవుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొంగల్ బరిలో నిలిచిన ఫతే హిందీలో గేమ్ ఛేంజర్‌తో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.తెలుగులో ప్రత్యేక గుర్తింపు..కాగా.. అనుష్క లీడ్ రోల్లో నటించిన అరుంధతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్లో జులాయి, అతడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.Tickets at र 99 Aur kya jaan loge? 🍿 Book now : https://t.co/xhsuVPftZf#FatehAt99 pic.twitter.com/pHvf5QknsC— sonu sood (@SonuSood) January 9, 2025 View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
బాబు.. పవన్.. ఊసరవెల్లి.. సిగ్గు సిగ్గు!
అందితే జుట్టకు.. అందకుంటే కాళ్లు అని సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విద్య వెన్నతో పెట్టిందేనని చాలాకాలంగా అందరికీ తెలుసు. అయితే ఈమధ్యకాలంలో ఆయనకు పవన్‌కళ్యాణ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమే కాదు.. రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమెలాగో కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు మరి! అల్లూ అర్జున్ అరెస్ట్ విషయంలో పవన్ వ్యాఖ్యలు, వ్యవహారం మొత్తం ఈ ద్వంద్వ వైఖరినే సూచిస్తోంది. గతంలో సినిమా టిక్కెట్ల నియంత్రణకు జగన్ సీఎం హోదాలో నడుం బిగిస్తే అంతెత్తున ఎగిరిన వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్! జగన్ సినిమా వాళ్లను అగౌరవ పరిచారని, టిక్కెట్ ధరలకూ.. ప్రభుత్వానికి సంబంధం ఏమిటని గగ్గోలుపెట్టారు. అసత్య ప్రచారం కొనసాగించారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల గురించి మాట్లాడితే మాత్రం పవన్ ఆయన చాలా గొప్ప అని పొగిడేస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వారిని పవన్ పంచెలూడదీసి కొడతానని బహిరంగంగా ప్రకటించడం!!! పవన్ ద్వంద్వ వైఖరి మొత్తం తన సినిమా వ్యాపారాన్ని కాపాడుకునేందుకే అన్నది బహిరంగ రహస్యమే. కాకపోతే ఈ విషయం అక్కడితోనే ఆగిపోలేదు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన అల్లూ అర్జున్ అరెస్ట్‌ను కూడా తప్పు పట్టలేకపోయారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సుద్దులు కూడా వల్లెవేశారు. చట్టంపై అంత గౌరవమున్న మనిషే అయితే.. గతంలో చంద్రబాబుపై అవినీతి కేసులు వచ్చినప్పుడు అస్సలు మాట్లాడలేదేం? పైగా ఎందుకు రోడ్లపై పడి దొర్లారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచారం యావకు 29 మంది నిండు ప్రాణాలు బలైతే.. నోరెత్తని పవన్ అల్లూ అర్జున్ విషయంలో మాత్రం ముందు వరుసలోకి వచ్చారే? ఇక్కడ మరణించిన వ్యక్తుల సంఖ్య కాదు ముఖ్యం. మానవత్వం. ఒకసారి ఒకలా.. ఇంకోసారి ఇంకోలా వ్యవహరించడాన్నే ప్రశ్నించాలి. చంద్రబాబు సభలు జరిగినప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటల వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల లేదా పుట్టిన రోజుకో ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్‌కు అభిమానులు మరణించిన ఘటనలున్నాయి. మానవత్వం ఉన్న వారైతే అలా ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రకటన చేసుండేవారు. బిజెపి మిత్రపక్షంగా, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పవన్ పొగడడం తెలంగాణ బీజేపీ నేతలకు కాస్త చికాకు కలిగించినట్లుగానే ఉంది. బీజేపీ నేతలు ఒకపక్క అల్లు అర్జున్ను సమర్థిస్తూంటే పవన్ దీనికి భిన్నమైన వైఖరి తీసుకోవడం వారికి అసంతృప్తి కలిగించింది. అందుకే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంశం గురించి ప్రస్తావించి రేవంత్ ఎందులో గొప్పవాడిగా కనిపించారని అడిగారు. రేవంత్ సినిమా వారి పట్ల కర్కశంగా వ్యవహరించినా, వారికి బెనిఫిట్ షో లు ఇచ్చే ప్రసక్తి లేదని, రేట్లు పెంచబోమని ప్రకటించినా పవన్ నోరు విప్పి స్పందించలేకపోతున్నారు. ఏపీలో గతంలో వేసిన రంకెలు తెలంగాణలో ఏమయ్యాయని పవన్ ప్రత్యర్థులు ఎద్దేవ చేస్తున్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు.. ‘‘నువ్వూ రెడ్డివే..జగన్ రెడ్డే.. మీరు, మీరు మాట్లాడండి’’ అని పెద్ద గొంతుకతో చెప్పారు. కాని ఇప్పుడు అదే దిల్ రాజు ఈయనతో మాట్లాడగానే రేవంత్ ను పొగిడేసి తెల్ల జెండా ఎత్తేశారన్నమాట. అంటే తన అన్న కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమాతో పాటు తన సినిమాలు, బాలకృష్ణ వంటివారు నటించిన సినిమాలు విడుదలకు సిద్దం అవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం పవన్ చేయలేకపోయారు. ఎలాగొలా రేవంత్ ను ప్రసన్నం చేసుకుని మళ్లీ బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల విషయాలలో సానుకూల నిర్ణయం కోసం ఈ పాట్లు పడుతున్నట్లు అనిపిస్తుంది. సినిమా నటుడుగా ఉన్న ఆయన జనసేన పార్టీ పెట్టుకుని రాజకీయాలలోకి వచ్చి బాగానే లబ్ది పొందారని చెప్పాలి. కేంద్రస్థాయిలో బీజేపీతో జత కట్టడం, ఆ తర్వాత విడిపోయి పాచిపోయిన లడ్లు ఇచ్చిందని చెప్పినా, తదుపరి మళ్లీ వారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్‌లను అవినీతిపరులుగా ఆరోపించి, ఆ తర్వాత మళ్లీ వారితోనే స్నేహం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి పాదాభివందనం చేసి, వామపక్షాలతో కలిసి పోటీచేసి పరాజయం తర్వాత వారిని గాలికి వదలివేశారు. ఇలా అవకాశవాద రాజకీయాలు చేయడంలో పవన్ ఘనాపాటినే అనిపించుకున్నారు. చెగువేరా అభిమానిని ప్రచారం చేసుకుని, అనంతర దశలో మోడీ అంటే చాలా అభిమానం అని చెప్పుకున్నారు. వామపక్ష భావజాలం నుంచి సనాతన హిందూవాదినని పోజు పెట్టగలిగారు. ఒకసారి ఓటమి పాలైనా, సినిమాల పాత్రల ద్వారా తన అభిమానులను ఆకట్టుకుని, ఒక సామాజికవర్గాన్ని ఆకర్షించి తద్వారా రాజకీయ అవసరాలను తీర్చుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తన రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని సినిమా వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కాంగ్రెస్ నేత అని తెలిసినా రేవంత్ ను అంతగా పొగిడారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. సినీ ప్రముఖుల మాదిరే ఆయనకు కూడా హైదరాబాద్ లోనే ఆస్తిపాస్తులు ఉండడం వల్లే భయపడ్డారన్న వాదన ఉంది. గతంలో కెసిఆర్ ను రాజకీయంగా ఒక సందర్భంలో విమర్శించినా, ఆయన ముఖ్యమంత్రి కాగానే పవన్ కళ్యాణ్ కలిసి ప్రశంసించి వచ్చారు. ఆ తర్వాత ఆయన సినిమాకు ఇబ్బంది లేకుండా చేసుకున్నారని చెబుతారు. ఇలా రాజకీయాలను ,సినిమాలను కలిపి వాడుకోగలగడంలో పవన్ సఫలం అయ్యారని చెప్పాలి. ఇది రాజకీయ అవకాశవాదం కావచ్చు. విలువలు లేని రాజకీయం కావచ్చు..ఏమైతేనేం .. అంతిమంగా అటు రాజకీయంలో పదవులు పొందాలి. ఇటు సినిమాలలో వ్యాపారం పండాలి..ఈ వైఖరి తోనే పవన్ నడక సాగిస్తున్నట్లు కనిపిస్తుంది.ఇక తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించడాన్ని సమర్దించుకున్న తీరు విడ్డూరమే .గతంలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని,తన ఇంటిలోని వారికెవరికి పదవులు తీసుకోవడం లేదని చెప్పిన ఆయన ఇప్పుడు స్వరం మార్చారు. నాగబాబు జనసేన కోసం కష్టపడ్డారని చెబుతున్నారు.నాగబాబు మాదిరికాని, మంత్రి నాదెండ్ల మనోహర్ లాగా కాని బిసి,ఎస్సి,ఎస్టి నేతలెవరైనా కష్టపడి ఉంటే వారికి పదవులు ఇచ్చేవారట.అంటే వారికి అవకాశాలు ఇవ్వకుండా, వారు శ్రమపడలేదని చెప్పడం పవన్ కే చెల్లింది. అన్నిటికి మించి తన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ , ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏ కులమో తెలియదని చెప్పడం ఈయన అబద్దాలు ఏ లెవెల్లో ఆడగలరో చెప్పకనే చెబుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబు నాయుడే అవకాశవాద రాజకీయాలలో దిట్ట అని, అబద్దాలు ఆడడంలో బహు నేర్పరి అని అంతా అంటుంటారు. ఇప్పుడు పవన్ ఆయనను దాటి పోతున్నట్లుగా ఉంది.ఏది ఏమైనా వ్యక్తిగత జీవితంలోకాని, రాజకీయాలలో కాని, సినిమాలలో కాని విలువల గురించి ఆలోచించకూడదన్న తత్వాన్ని ఈ ఉదంతాలు తెలియచేస్తున్నాయి.ఎవరితో అంటకాగితే ప్రయోజనమో తెలుసుకోవాలి. ఎప్పుడు ఎవరిని పొగిడితే వ్యాపార పరంగా లాభమో ఆలోచించాలి. ఈ విషయాలలో పవన్ కళ్యాణ్ మాస్టర్ డిగ్రీ చేసినట్లే అనుకోవచ్చేమో! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలుస్తుందని దిల్ రాజుకు చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీ పెద్దల మధ్య సమావేశం జరగడం శుభసూచకమని పోస్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని, నాయకత్వాన్ని అభినందిస్తున్నామని తెలిపింది. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది. సినిమా షూటింగ్‌లకు హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కట్టుబడి ఉన్నారని రాసుకొచ్చింది. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.కాగా.. ఇవాళ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా భేటీ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎంతో భేటీలో పలు అంశాలపై చర్చించారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండదని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ భేటీ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.We are delighted with the fruitful meeting held today between the Telangana Government and representatives of the Telugu Film Industry facilitated by the Film Development Corporation of Telangana.We deeply appreciate the visionary leadership of our Honourable Chief Minister Sri…— Sri Venkateswara Creations (@SVC_official) December 26, 2024మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. గ్లోబల్ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల దిశగా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి దూరదృష్టికి ఇండస్ట్రీ ఎల్లప్పుడు మద్దతుగా ఉంటుందని పేర్కొంది.అలాగే సామాజిక సమస్యలపై అవగాహన పెంచడంలో ప్రభుత్వానికి మద్దతుగా ఇండస్ట్రీ పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మద్దుతుగా ఉంటామని మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. మన సమాజ ఉజ్వల భవిష్యత్తు కోసం, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చింది. We sincerely thank the Government of Telangana, Honorable Chief Minister Shri @revanth_anumula Garu, Cinematography Minister @KomatireddyKVR Garu, and Deputy Chief Minister @Bhatti_Mallu Garu for their visionary leadership and steadfast encouragement towards the growth of the…— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2024 -
ఎంతసేపు సినిమా చూస్తే అంతే ధర చెల్లించేలా..
ఎంతో ఆసక్తిగా సినిమా చూసేందుకు వెళ్తారు. తీరా అరగంట చూశాక సినిమా నచ్చకో లేదా ఏదైనా అత్యవసర పనిమీదో బయటకు వెళ్లాల్సి రావొచ్చు. అలాంటి సందర్భంలో టికెట్ డబ్బులు వృథా అయినట్టే కదా. ఇలాంటి ప్రత్యేక సమయాల్లో టికెట్ డబ్బు నష్టపోకుండా మీరు ఎంతసేపు సినిమా చూస్తారో అంతే మొత్తం చెల్లించేలా పీవీఆర్ ఐనాక్స్ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది. అందులో భాగంగా ‘ఫ్లెక్సీ షో’ అనే కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.ఈ ఫ్లెక్సీ షో ద్వారా సినిమా చూసే సమయానికి మాత్రమే డబ్బు చెల్లించవచ్చు. ఈ వినూత్న టికెటింగ్ మోడల్లో సీటు ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, మూవీ మిగిలి ఉన్న సమయం ఆధారంగా రీఫండ్లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.ఎలా పని చేస్తుందంటే..టికెట్ స్కానింగ్: మీరు సినిమా థియేటర్లోకి వెళ్లేప్పుడు టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. మీ ఎంట్రీ, ఎక్జిట్ సమయాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. దానిపరంగా మీకు డబ్బు రీఫండ్ అవుతుంది.రీఫండ్ సిస్టమ్: సినిమా 75% కంటే ఎక్కువ మిగిలి ఉంటే, టికెట్ ధరలో 60% తిరిగి పొందవచ్చు. సినిమా వ్యవధి 50-75%కు మధ్య ఉంటే 50% రీఫండ్ అవుతుంది. ఇంకా 25-50% సినిమా మిగిలి ఉన్నప్పుడు మీరు థియేటర్ నుంచి బయటకు వెళితే 30% రీఫండ్ ఇస్తామని పీవీఆర్ ఐనాక్స్ పేర్కొంది.అదనపు ఛార్జీలుఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునేవారు టికెట్ బుకింగ్ సమయంలోనే ‘ఫ్లెక్సీ షో’ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు సాధారణ ధర కంటే టికెట్ ఫేర్‌లో 10 శాతం అధికంగా చెల్లించాలి.ఎక్కడ అమలు చేస్తున్నారు..ఈ సదుపాయాన్ని ప్రస్తుతం న్యూఢిల్లీ, గుర్గావ్ల్లో అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదికూడా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రేక్షకుల స్పందన ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో జాబ్స్ పెరుగుతాయా? తగ్గుతాయా?కంపెనీపై ప్రభావంప్రేక్షకుల సంతృప్తి: సినిమా చూసే సమయానికి మాత్రమే ధర నిర్ధారించడం వల్ల పీవీఆర్ ఐనాక్స్‌పై ప్రేక్షకులకు విశ్వసనీయత పెరుగుతుందని కంపెనీ అధికారులు తెలిపారు. ప్రేక్షకుల సంతృప్తికి సంస్థ పెద్దపీట వేస్తుందని చెప్పారు.ఆదాయ వృద్ధి: ఫ్లెక్సీ షో టికెట్ల ధర 10% ఎక్కువగా ఉన్నప్పటికీ, సినిమా వీక్షించిన సమయం ఆధారంగా రీఫండ్లను అందిస్తుండడంతో కంపెనీ ఆదాయం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ అందించే సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు అదనపు ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని కంపెనీ భావిస్తుంది.పోటీని తట్టుకునేలా..: ఈ వినూత్న టికెటింగ్ మోడల్ పీవీఆర్ ఐనాక్స్ ఇతర ఎంటర్టైన్మెంట్ రంగంలోని సంస్థలతో పోటీ పడేందుకు ఉపయోగపడుతుంది.డేటా సేకరణ: సీట్ల ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, రీఫండ్లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలు ఉపయోగించనున్నారు. దాంతో ప్రేక్షకుల ప్రవర్తన, వారి ప్రాధాన్యతలకు సంబంధించిన డేటాను సేకరించే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో ప్రేక్షకులకు మరింత మెరుగైన సినిమా అనుభవాన్ని అందించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. -
వెండితెరపై ‘పేట’ యువకులు
నర్సంపేట : ఆ ముగ్గురికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రాణం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఎక్కడ ఆడిషన్స్ జరిగినా వెళ్లే వారు. అలాగే, వివిధ సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరిగే వారు. చిన్న పాత్ర అయినా ఇవ్వమని కోరారు. తెలిసి వారి వద్దకు వెళ్లి తమలోని నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారు. అవకాశం వచ్చినట్లు వచ్చే చేజారేది. అయినా ఏమాత్రం నిరాశపడేవారు కాదు. మళ్లీ ప్రయత్నం చేసేవారు. చివరకు అనుకున్నది సాధించారు. తమ ఆకాంక్షకు అనుగుణంగా అవకాశం రావడంతో ఆ ముగ్గురు యువకులు హీరోలుగా రాణిస్తున్నారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు తమప్రతిభతో ముందుకెళుతున్నారు. వారే నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బూరగాని అనిల్, భూక్య సిద్ధు శ్రీఇంద్ర, బూస కుమార్. ఈ ముగ్గురు హీరోలుగా నటించిన తమ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.అనిల్ నటన అద్భుతం..బూరగాని అనిల్‌ది నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండల కేంద్రం. తల్లిదండ్రులు బూరగాని కొమురయ్య–రమాదేవి. అనిల్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సినిమాపై ఆసక్తి ఉండడంతో ఆ రంగం వైపు వెళ్లాడు. పలువురి వద్దకు వెళ్లి తన ప్రతిభను తెలియజేశాడు. వారికి అనిల్ నటన నచ్చడంతో అవకాశం ఇచ్చారు. దీంతో అనిల్ ‘వజ్రాలు కావాలా నాయనా’ అనే సినిమాలో మొదటిసారిగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2017న విడుదలైంది. ఇందులో అనిల్ అద్భుత నటనకు పలువురు ముగ్థులయ్యారు. రెండో సినిమా ‘ఇరావణ’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ప్రేమతో మీ అభిరామ్, దునియా, ప్రేమకుజై, తదితర చిత్రాల్లో నటిస్తున్నట్లు అనిల్ చెప్పాడు. కాగా, టీవీషోలు అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, రాజేశ్వరివిల్లాస్ కాఫీ క్లబ్, అనుపల్లవి, కలవారి కోడలు కనకమహాలక్ష్మి వంటి సీరియల్లో నటిస్తున్నట్లు అనిల్ తెలిపారు.సిద్ధు..‘అనాథ’భూక్య సిద్ధు గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తనలో ఉన్న నటనా ప్రావీణ్యంతో సినిమా రంగంలో రాణించాలని 13 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. చివరకు అదృష్టం వరించింది. వారం రోజుల క్రితం ‘అనా«థ’ అనే సినిమాను నిర్మించి హీరోగా వెండి తెరకు పరిచమయ్యాడు. మొదటి సినిమాలోనే మంచి నటన ప్రావీణ్యం కనబర్చడంతో ఈ సినిమా పలువురిని ఆకట్టుకుంది. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన సకృ, సరోజన దంపతుల కుమారుడు సిద్ధు. మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోగా రాణిస్తూ గోనేంద్ర ఫిలింస్ సంస్థ ద్వారా అనాథ సినిమాను తెలుగు, కన్నడంలో తీసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం రెండో సినిమా కూడా తీస్తున్నట్లు సిద్ధు తెలిపారు.‘రియల్’ రంగం నుంచి హీరోగా..రియల్ ఎస్టేట్ రంగంలో రాణిసూ్తనే సినిమా హీరోగా గుర్తింపు పొందాలనే తపనతో వెండి తెరకు పరిచయమయ్యాడు నర్సంపేట నియోజకవర్గంలోని గుర్రాలగండి రాజపలి్ల గ్రామానికి చెందిన బూస కుమార్. సినిమా రంగంలోని పలువురు ప్రముఖులను కలిసినా ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. దీంతో తానే స్వయంగా ‘షాన్’ అనే సినిమాను రూపొందించాడు. ఇందులో తనే హీరోగా నటించాడు. అంతేకాకుండా నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించి గత సంవత్సరం తన అదృష్టం పరీక్షించుకున్నాడు. వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా అవగాహన ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చిత్రీకరణ చేసి తన ఆలోచనలకు అనుగుణంగా సినిమా పూర్తి చేశాడు. అనంతరం విడుదల చేసి సఫలీకృతుడయ్యాడు. ప్రస్తుతం మరో సినిమా కూడా చేస్తున్నట్లు ‘సాక్షి’కి వివరించాడు. -
ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పుష్ప-2
-
తెలుగులోనే భారీ బడ్జెట్ బన్నీ, త్రివిక్రమ్ సినిమా
-
హీరోలకు మించిన ప్లానింగ్ లో స్టార్ దర్శకులు
-
సలార్ 2 షూటింగ్ స్టార్ట్ ...వార్ 2 లో వార్స్ మాములుగా ఉండవు..
-
కంప్రమైజ్ అయితేనే అవకాశాలు.. ఈ పరిస్థితి కల్పించిన వారిది తప్పు కదా
-
Ghmc: పోస్టర్లు బ్యాన్..ఆమ్రపాలి కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో వాల్ పోస్టర్లు బ్యాన్ చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం(సెప్టెంబర్27) సర్క్యులర్ జారీ చేశారు. జీహెచ్ఎంసీలో వాల్ పోస్టర్లు,వాల్ పెయింటింగ్స్ పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.సినిమాల పోస్టర్లు కూడా ఎక్కడా అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.ఒకవేళ ఆదేశాలను పట్టించుకోకుండా పోస్టర్లు వేస్తే మాత్రం జరిమానా విధించాలని సర్క్యులర్‌లో తెలిపారు.ఇదీ చదవండి: మూసీకి వరద..జీహెచ్ఎంసీ హై అలర్ట్ -
లడఖ్ బయల్దేరిన పోలీసులు మతమార్పిడిపై కేసు..?
-
Asha Negi: సాహసాలకు ఆమె వెనుకాడని 'ఆశా' జీవి..
ఆశా నేగీ.. హిందీ ‘బిగ్ బాస్’, ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ లాంటి రియాలిటీ షోస్ చూసేవారికి బాగా తెలిసిన పేరు. ఒక షోలో ఆమె పార్టిసిపెంట్, మరొక షోకి ఆమె హోస్ట్. రియాలిటీ షోసే కాదు సీరియల్స్, స్పోర్ట్స్, మూవీస్, సిరీస్.. ఇలా చాలా క్రెడిట్సే ఉన్నాయి ఆమెకు!– ఆశా పుట్టిపెరిగింది ఉత్తరాఖండ్ రాజధాని డెహరాడూన్లో. అక్కడి డీఏవీ కాలేజ్‌లో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ టైమ్‌లోనే అందాల పోటీలో పాల్గొని ‘మిస్ ఉత్తరాఖండ్’ క్రౌన్ గెలుచుకుంది.– గ్రాడ్యుయేషన్ తర్వాత ఆశాకు బెంగళూరులోని ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ కన్సల్టన్సీలో ఉద్యోగం వచ్చింది. అందులో కొన్నాళ్లు వర్క్ చేశాక కాల్ సెంటర్‌కి మారింది.– తను చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగాలేవీ నచ్చకపోవడంతో గ్లామర్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుని ముంబైకి మకాం మార్చింది. ఎక్కడ ఆడిషన్స్ ఉన్నా వెళ్లి అటెండ్ అవసాగింది. ఆ ప్రయత్నాల్లోనే ‘సప్నోం సే భరే నైనా’ అనే టీవీ సీరియల్లో అవకాశం వచ్చింది. కానీ అది ఆమెకు అంతగా గుర్తింపునివ్వలేదు.తర్వాత ‘పవిత్ర్ రిశ్తా’ అనే సీరియల్లో నటించింది. దాంతో ఆశాకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ఆ పాపులారిటీనే ఆమెకు ‘బిగ్ బాస్’ (సీజన్ 6) హౌస్‌కి వెళ్లే చాన్స్‌ను తెచ్చింది. ‘నచ్ బలియే’ సీజన్ 6లో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీనీ ఇచ్చింది.ఆశాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చక్కగా ఆడుతుంది. అందుకు స్పోర్ట్స్ రియాలిటీ ఎంటర్టైన్మెంట్ షో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ రెండు సీజన్లే ఉదాహరణలు. సీజన్ 1 ఢిల్లీ డ్రాగన్స్ తరఫున, సీజన్ 2లో కోల్‌కతా బాబూ మోశాయ్స్ తరఫున ఆడింది.సాహసాలకూ ఆమె వెనుకాడదు. ఆ ముచ్చట తీర్చుకోవడానికి ‘ఖత్రోంకే ఖిలాడీ’ సీజన్ 6లో పాల్గొని సెమీఫైనల్ దాకా వెళ్లింది.ఆశా యాక్టింగ్ టాలెంట్ చూసి అనురాగ్ బసు తన ‘లూడో’ సినిమాలో వేషం ఇచ్చాడు. తన పాత్ర పరిధిలో చక్కగా అభినయించింది. తర్వాత ‘కాలర్ బాంబ్’ అనే సినిమాలోనూ నటించింది.సీరియల్, సినిమా, సిరీస్.. ఏదైనా సరే.. నటనకు అవకాశం ఉంటే చాలు అనుకునే ఆశా అందుకు తగ్గట్టుగానే ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది.. ‘బారిష్’ అనే సిరీస్‌తో. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఇండస్ట్రీ’తో వీక్షకులను అలరిస్తోంది."పేరుకు తగ్గట్టే నేను ఆశా జీవిని. ఆ తత్వమే ఇండస్ట్రీలో నన్ను లైవ్‌గా ఉంచుతోంది." – ఆశా నేగీఇవి చదవండి: Nitasha Gaurav: న్యూ గ్రామర్ అండ్ గ్లామర్! -
సమంత ఇచ్చిన కౌంటర్ నాగ చైతన్య కేనా..?
-
ప్రతిభ వెలికితీసేందుకు..! ఆర్వీ స్క్వేర్ క్రియేటివ్ హబ్ షురూ..
సాక్షి, సిటీబ్యూరో: సినీరంగంలో రాణించాలనుకుని, ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఇండో–ఆస్ట్రేలియన్ ప్రొడక్షన్ హౌజ్ అయిన మెల్బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ సంస్థతో మాదల వేణు, రమాకాంత్ కలిసి ఏర్పాటు చేసిన ఆర్వీ స్క్వేర్ క్రియేటివ్ హబ్‌తో కొలాబ్ అయ్యారు. ఔత్సాహిక నిర్మాతలు, ప్రతిభావంతులైన కళాకారుల కలలకు ప్రాణం పోసేందుకు ఈ రెండు సంస్థలు ఒకటయ్యాయి.సినిమా, వెబ్‌సిరీస్‌లకు సంబంధించి ఔత్సాహిక డైరెక్టర్లు, రచయితలు, నటీనటులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రాజెక్టును ముందుకు నడిపించడమే తమ ఉద్దేశమని ఆర్వీ స్క్వేర్ క్రియేటివ్ హబ్ వ్యవస్థాపకుడు మాదల వేణు పేర్కొన్నారు. ఈ రెండు సంస్థల కలయికకు సంబంధించి కార్యక్రమం హైదరాబాద్‌లోని ఓ హోటల్ వేదికగా జరిగింది. ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో భారతీయం సత్యవాణి, పద్మశ్రీ శోభ రాజు, ఉప్పల శారద, పీవీ నర్సింహారావు మనవరాలు అజిత సురభి, మాలావత్ పూర్ణ, మాదల వేణు, ప్రముఖ సింగర్ ఎంఎం శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.వన్నెతగ్గని హ్యాండ్లూమ్..సాక్షి, సిటీబ్యూరో: చేనేతకారులు నేసిన వస్త్ర సౌందర్యాల మధ్య ప్రముఖ టాలీవుడ్ వర్ధమాన నటి సౌమ్య జాను సందడి చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని కళింగ కల్చరల్ హాలు వేదికగా బుధవారం ఏర్పాటు చేసిన ‘హ్యాండ్ టూ హ్యాండ్’ చేనేత వస్త్ర ప్రదర్శనను సినీ నటి సౌమ్య జాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని, ఈ ఉత్పత్తులపై నేటికీ వన్నె తగ్గలేదని తెలిపారు.నేటితరం యువత కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. వీటిని సినీతారలు ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకుని ధరిస్తున్నారని ఆమె అన్నారు. ప్రదర్శన 24వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 14 రాష్ట్రాలకు చెందిన చేనేతకారులు, చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని నిర్వాహకులు జయేష్ గుప్తా వెల్లడించారు. -
'స్ట్రోమ్' వచ్చాక సంతోషం వచ్చింది.. : విజయ్ దేవరకొండ
స్ట్రోమ్ (విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క పేరు) వచ్చాక మా ఇంట్లో ఎంతో ఆనందం వచ్చిందని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. జూబ్లీహిల్స్‌లో నూతనంగా నెలకొల్పిన సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్‌ను విజయ్ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ప్రారంభించారు. మా ఇంట్లో మొదట్లో పెట్స్ అంటే ఇష్టం ఉండేది కాదని, కానీ మా అమ్మా నాన్నకు నచ్చజెప్పి స్ట్రోమ్ గాడిని తెచ్చుకున్నామని, ఇప్పుడు మాకంటే మా పేరెంట్స్ స్ట్రోమ్ గాడితోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని విజయ్ అన్నారు.షూటింగులలో ఎంతో బిజీగా ఉండి, ఒత్తిడిలో ఇంటికి రాగానే స్ట్రోమ్ గాడి అల్లరితో అంతా మర్చిపోతామన్నారు. పెట్స్‌ను పెంచడమంటే మామూలు విషయం కాదని, ఇంట్లో ఒక చిన్న బేబీని చూసినంత పని ఉంటుందని, అంత కేర్ తీసుకునే ఓపిక ఉన్న వాళ్లు మాత్రమే పెట్స్‌ను పెంచుకోవాలని సూచించారు. సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ నిర్వాహకులు సంధ్య, శ్రీరెడ్డి పాల్గొన్నారు. -
Maya Nelluri: కళల్లో రాణించాలన్నదే నా కల!
మాయా నెల్లూరి ఫిల్మ్ ఆర్టిస్ట్. రణరంగం, తిమ్మరుసు చిత్రాలలోనూ అనగనగా (వెబ్‌సీరీస్), కృష్ణ ఘట్టంలో కథానాయికగానూ నటించింది. చిత్రకారిణి.. పురాణేతిహాసాల మూలాంశాలతో ఆకట్టుకునే పెయింటింగ్స్ వేస్తుంది. రైటర్.. ‘స్టార్ స్టైల్ ’ పేరుతో 80 ఏళ్ల సినిమా తారల ఫ్యాషన్స్‌ని పుస్తకం రూపంలో తీసుకువచ్చింది. సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకున్న మాయా నెల్లూరి హైదరాబాద్ అమ్మాయి. మల్టీటాలెంటెడ్ గర్ల్‌గా పేరుతెచ్చుకున్న ఈ హార్టిస్ట్ను కలిసినప్పుడు గలగలా నవ్వుతూ సినిమాయే తన ప్రపంచమని, సాధించాలనుకుంటున్న కలల గురించి ఎన్నో విశేషాలను ఇలా మన ముందుంచింది...‘మా అమ్మానాన్నలు నేను జాబ్ చేయాలనుకున్నారు. నా ఇష్టం మాత్రం సినిమా రంగం వైపే ఉంది. అమ్మ న్యూజిలాండ్‌లో ఆప్తమాలజిస్ట్. దీంతో చిన్నప్పుడే మా కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడి΄ోయింది. న్యూజిలాండ్‌లోనే సైకాలజీలో డిగ్రీ చేశాను. సినిమా అంటే ఉన్న ఇష్టంతో అమ్మ వాళ్లను ఒప్పించి తిరిగి హైదరాబాద్ వచ్చేశాను. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. సౌత్ స్కోప్ మ్యాగజైన్‌కు ఆర్టికల్స్ రాసేదాన్ని. అక్కణ్ణుంచే నాకు సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా, సినిమాలోనూ నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. స్టార్స్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ‘ఐడియల్ బ్రెయిన్’కి రైటర్‌గానూ ఉన్నాను.80 ఏళ్ల ‘స్టార్ స్టైల్’బామ్మల కాలం నుంచి వింటున్న కథానాయికల ఫ్యాషన్‌ని ఒక చోట కూర్చితే బాగుంటుందనుకున్నాను. తెలుగు సినిమా ఆన్‌స్క్రీన్ ఫ్యాషన్ గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే ‘స్టార్ స్టైల్’ బుక్ బాగా ఉపయోగపడుతుంది. సినీతారల ఫ్యాషన్, వారి స్టైల్స్ గురించి తెలుసుకోవడం, సేకరణకు నాలుగైదేళ్ల సమయం పట్టింది. ఈ రీసెర్చ్కోసం 1930ల కాలం నుంచి వచ్చిన తెలుగు సినిమాలు, హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూశాను, చదివాను. ఫొటోగ్రాఫర్స్, డైరెక్టర్స్‌తో మాట్లాడాను. అలా 2012 వరకు తారల స్టైల్స్ తీసుకున్నాను. నాటి తారల్లో వాణిశ్రీ ఫ్యాషన్ అల్టిమేట్ అనిపించింది. ఆన్‌స్క్రీన్ లుక్ కోసం ఆవిడ చాలా ఎఫర్ట్ పెట్టేది అనిపించింది.‘పురాణేతిహాసాల’ పెయింటింగ్స్నా పెయింటింగ్స్‌లో స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. అమ్మ సబిత ఆధ్యాత్మికత నాలో అలాంటి పెయింటింగ్స్ వేయడానికి ప్రేరణ కలిగిస్తుంది అనుకుంటాను. కాలేజీ రోజుల నుంచి సోలో, గ్రూప్ ఎగ్జిబిషన్స్‌లో నా చిత్రాలు ప్రదర్శిస్తున్నాను. కాస్మిక్ పవర్, శివ– శక్తికి సంబంధించిన పెయింటింగ్స్ ఎక్కువ వేస్తుంటాను. బ్యాక్‌గ్రౌండ్‌లో సంస్కృత మంత్రాలతో నాదైన మార్క్ కనిపిస్తుంటుంది. యాక్టర్ సాయిధరమ్ తేజ్‌కు, డైరెక్టర్ సుధీర్ వర్మ, ఈషారెబ్బా, మేఘా ఆకాష్, హరీష్ శంకర్.. మొదలైన వారికి పెయింటింగ్ వర్క్స్ చేసిచ్చాను. హైదరాబాద్‌లో సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘ఓమ్’, గ్రూప్ ఎగ్జిబిషన్ ‘జస్ట్ ఆర్ట్ షో’, ‘ది ఆర్ట్ ఎడిషన్’, ‘ఒర్కా’ వంటివి పేరు తెస్తే, ఆస్ట్రేలియా, చెన్నై, బెంగళూరులోనూ సోలో, గ్రూప్ ఎగ్జిబిషన్స్‌లో నా పెయింటింగ్స్ చాలా మందిని ఆకట్టుకున్నాయి. మైథా యాప్‌లో రెండు పురాణేతిహాస కథలకు డిజిటల్ డిజైన్ చేశాను.నటిగా నిరూపణకోవిడ్కు ముందు 2019లో ‘రణరంగం’ సినిమాలో నటించాను. ఆ తర్వాత వచ్చిన ‘తిమ్మరుసు’ కూడా మంచి పేరు తెచ్చింది. కోవిడ్ టైమ్‌లో రైటింగ్, పెయింటింగ్ మీద ఎక్కువ వర్క్ చేశాను. ఇప్పుడు ‘బచ్చన్’ సినిమాలో నటిస్తున్నాను. నా ఫోకస్ మొత్తం యాక్టింగ్, రైటింగ్ మీద ఉంది. ఒక మూవీ నుంచి మరో మూవీకి వెళ్లడం అంటే ఒక జాబ్ నుంచి మరో జాబ్‌కు వెళ్లడం లాంటిదే. అలా నన్ను నేను ట్యూన్ చేసుకుంటాను. ఆన్‌స్క్రీన్‌కు నా ఇతర వర్క్స్‌కి చాలా తేడా ఉంటుంది. కానీ, బెస్ట్ యాక్ట్రెస్‌గా నిరూపించుకోవాలన్నదే నా కల. అలాగే మంచి స్క్రిప్ట్ రైటర్ని అవ్వాలి. పెయింటింగ్స్‌లోనూ బెస్ట్ మార్క్ తెచ్చుకోవాలి. నాకు బాగా నచ్చితే మిగతా అందరికీ నచ్చుతుందని నమ్ముతాను. నేను పెట్టే ఎఫర్ట్ పెడుతుంటాను. ఆ రిజల్ట్ ఎలా వచ్చినా అంగీకరిస్తాను’’ అంటూ నవ్వుతూ తన మల్టీ వర్క్స్ గురించి వివరించింది ఈ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
విష్ణు విశాల్‌కు జంటగా.. 'మమిత బైజూ'
ఏ యాక్టర్‌కైనా బ్రేక్ అనేది ఒక చిత్రంతోనే వస్తుంది. ఆ తరువాత వారి లైఫే మారిపోతుంది. ఇలా చాలా మంది హీరోహీరోయిన్ల జీవితంలో జరిగింది. అలా ప్రేమలు అనే మలయాళ చిత్రంతో నటి మమిత బైజూ లైఫే మారిపోయింది. ఆ చిత్రం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు వంటి దక్షిణాది భాషల్లోనూ అనువాదం అయ్యి మంచి వసూళ్లను సాధించింది.ఆ విషయం పక్కన పెడితే అందులో నాయకిగా నటించిన మమిత బైజూకు పిచ్చ క్రేజ్ వచ్చింది. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో ఇప్పటికే జీవీ ప్రకాశ్ కుమార్‌కు జంటగా రెబల్ చిత్రంలో నటించారు. తాజాగా విష్ణు విశాల్‌తో రొమాన్స్ చేస్తున్నట్లు సమాచారం. విష్ణు విశాల్ ప్రస్తుతం రామ్‌కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన రాక్షసన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.దీంతో తాజాగా దర్శకుడు రామ్‌కుమార్, విష్ణు విశాల్ కలిసి మరో చిత్రం చేస్తున్నారు. ఇందులోనే నటి మమిత బైజూ నాయకిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇది నటుడు విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్న 21వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటి మమిత బైజూ దీంతో పాటు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేరళా కుట్టి కోలీవుడ్‌లో బాగానే పాగా వేస్తున్నారన్న మాట. -
బీఆర్ఎస్ మళ్లీ గెలిచుంటే...మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం(జులై 30) అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి ఉంటే తాను హోమ్ మంత్రి అయ్యేవాడినన్నారు. సినిమాలు తీసేవాడినని, టీవి ఛానల్ పెట్టేవాడినని చెప్పారు. బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో తన ప్లేస్ వేరే లెవెల్లో ఉండేదన్నారు. -
జెన్నిఫర్ బర్త్‌డే స్పెషల్.. ఓటీటీలో ఈ యాక్షన్ సినిమాలు చూడొచ్చు!
'జెన్నిఫర్ లోపెజ్' అనగానే.. మనకు ముందుగా గుర్తుకొచ్చేది తెలుగు సినిమా పాట. అయితే, హాలీవుడ్ సినీపరిశ్రమలో జెన్నిఫర్ లోపెజ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న స్టార్ నటి. జులై 24, 1969న న్యూయార్క్‌లో జన్మించిన జెన్నిఫర్ లోపెజ్ మొదట స్కెచ్ కామెడీ TV సిరీస్ 'ఇన్ లివింగ్ కలర్'లో ఫ్లై గర్ల్ జాజ్-ఫంక్ డాన్సర్‌గా గుర్తింపు పొంది, సంగీత పరిశ్రమలో కూడా చెరగని ముద్రగా ఎదిగింది.తాను కేవలం డ్యాన్సింగ్, సింగింగ్లకే పరిమితం కాకుండా నటనలో కూడా ప్రతిభ కనబరిచి తనను తాను పరిచయం చేసుకుంది. తాను నటించిన యాక్షన్ చిత్రాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. నటిగా మారిన తన కెరీర్ అన్ని రకాల జోనర్ల చిత్రాలను నటించి, అడ్వెంచర్ యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. జెన్నిఫర్ తన హాలీవుడ్ మూవీ కెరీర్లో అన్నీ రకాల పాత్రలను పోషించినప్పటికీ, అందులో అద్భుతమైన యాక్షన్ సినిమాలను కొన్నింటిని చూసినట్లయితే..అనకొండ..హారర్ అండ్ యాక్షన్‌గా 1997లో విడుదలైన 'అనకొండ' మూవీ ఇప్పటికీ ప్రజల అభిమాన చిత్రాల్లో ఒకటి. దట్టమైన అడవిలో అనకొండ నుంచి తప్పించుకోవడానికి టెర్రీ (జెన్నిఫర్ లోపెజ్) తన స్నేహితులతో కలిసి ఎలా పోరాడుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. మీరు ఈ మూవీని జియో సినిమాలో చూడవచ్చు.ఎనాఫ్..2002లో విడుదలైన యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ 'ఎనాఫ్'. స్లిమ్ (జెన్నిఫర్ లోపెజ్) తన బెదిరింపు భర్త నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో మనం ఇందులో చూడవచ్చు. ఈ చిత్రం హాట్‌స్టార్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.షాట్‌గన్ వెడ్డింగ్..జెన్నిఫర్ లోపెజ్ నటించినటువంటి చిత్రం 'షాట్‌గన్ వెడ్డింగ్' (2022). యాక్షన్‌తో పాటు కామెడీని ఆస్వాదించాలనుకునేవారికి ఈ మూవీ నచ్చుతుంది. దీనిని మీరు హాట్‌స్టార్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.ది మదర్..2023లో విడుదలైన 'ది మదర్' చిత్రంలో జెన్నిఫర్ లోపెజ్ కథానాయికగా నటించింది. యాక్షన్, థ్రిల్లర్‌గా కొనసాగే ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. -
Anvesha Vij: 'OMG'.. ఫీచర్ ఫిల్మ్‌తో సిల్వర్ స్క్రీన్ మీద మెరిసి..
అన్వేషా విజ్.. ఓటీటీ వీక్షకులను ఆకట్టుకుంటున్న నటి. గ్లామర్ ఫీల్డ్‌లోకి రాకముందే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్. అందుకే ఆమెను డాన్సర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్ట్రెస్ అని పరిచయం చేయాలి!అన్వేషా పుట్టిపెరిగింది ఢిల్లీలో. తండ్రి.. అమిత్ విజ్, ఆర్కిటెక్చరల్ డిజైనర్. తల్లి.. మధు విజ్, గృహిణి. ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన అన్వేషాకు డాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పుడే డాన్స్‌లో ట్రైనింగ్ మొదలుపెట్టింది.2014లోనే సోషల్ మీడియాలోకి ఎంటర్ అయింది తన పేరు మీదే ఓ యూట్యూబ్ చానెల్ పెట్టి. కాని పెద్దగా యాక్టివ్‌గా లేకుండింది. 2020లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసింది. అందులో చాలా యాక్టివ్‌గా ఉంది తన డాన్స్ వీడియోలు, ఫొటోస్‌తో! ఆ పోస్ట్‌లకు అనతికాలంలో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరిగి అన్వేషాను ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి చేర్చారు. స్ట్రాంగ్ ఫ్యాన్బేస్గా ఏర్పడ్డారు.ఆ పాపులారిటినే ఆమెకు లాక్మే, బీ రియల్ లాంటి బ్రాండ్స్‌కి మోడలింగ్ చేసిపెట్టే చాన్స్‌నిచ్చింది. మోడలింగేమో ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద అడుగుపెట్టే అవకాశాన్నిచ్చింది.ఓటీటీలో ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ‘క్రాష్ కోర్స్’. అందులో నిక్కీ కపూర్ పాత్రతో ఓటీటీ వీక్షకులను మెప్పించింది. ఆ మరుసటి ఏడు అంటే 2013లో OMG 2 (ఓహ్ మై గాడ్ 2) ఫీచర్ ఫిల్మ్‌తో సిల్వర్ స్క్రీన్ మీద మెరిసి సినీ అభిమానులను మురిపించింది. పరేశ్ రావల్ నటించిన OMG (ఓహ్ మై గాడ్)కి సీక్వెల్ అయిన ఈ సినిమాలో ఆమె పంకజ్ త్రిపాఠీకి కూతురు ‘దమయంతి’గా నటించింది. అది ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.ప్రముఖ స్టాండప్ కమేడియన్ మునవ్వర్ ఫారూకీతో కలసి ‘కాజల్’ అనే మ్యూజిక్ వీడియోలోనూ నటించింది. తాజాగా అన్వేషా ‘సిస్టర్హుడ్’ అనే సిరీస్‌తో అలరిస్తోంది. ఇది మినీ టీవీలో స్ట్రీమ్ అవుతోంది."ఓటీటీ అండ్ సినిమా రెండూ దేనికవే డిఫరెంట్. ఈ రెండిటితో చాలా నేర్చుకుంటున్నాను. ముఖ్యంగా 'OMG2’ సినిమాలో నా సీనియర్ కోస్టార్స్ పంకజ్ సర్, యామీ గౌతమ్ మామ్ దగ్గర చాలా నేర్చుకున్నాను. వాళ్లు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు". – అన్వేషా విజ్ఇవి చదవండి: రాగాలాపనలో... -
నా ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరంటే..
-
యోగిబాబు హీరోగా.. 'కానిస్టేబుల్ నందన్'
తమిళసినిమా: చిన్న చిన్న పాత్రల నుంచి ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగిన యోగిబాబు ఆ తరువాత కథానాయకుడి అవతారమెత్తి సక్సెస్‌పుల్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అటు హాస్య పాత్రల్లోనూ, ఇటు హీరోగానూ రెండు పడవలపై విజయవంతంగా పయనిస్తున్న యోగిబాబు తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్ నందన్. శంకర్ పిక్చర్స్ పతాకంపై డి.శంకర్ తిరువణ్ణామలై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా భూపాల నటేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు సుందర్.సి, శశికుమార్, ఎం.కళైంజయం వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. కాగా ఈయన దర్శకుడిగా పరి చయం అవుతున్న చిత్రం కానిస్టేబుల్ నందన్ ఆదివారం ఉదయం తిరువణ్ణామలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శంకర్ తిరువణ్ణామలై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ పలువురు నటులకు స్ఫూర్తిగా నిలిస్తున్న నటుడు యోగిబాబు వంటి ఉత్తమ నటుడితో కలిసి చిత్రం చేయడం ఘనతగా భావిస్తున్నానన్నారు.కథ చెబుతున్నప్పుడే ఆయన చూపించిన ఆసక్తి నిజంగానే అభినందనీయమన్నారు. పలు వురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసి చాలా విషయాలు నేర్చుకున్న భూపాల నటేశన్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కానిస్టేబుల్ నందన్ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నానన్నారు.దర్శకుడు భూపాల నటే శన్ పేర్కొంటూ మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న భావన కలిగిన నిర్మాతలను కనుగొనడం ఒక వరప్రసాదం అన్నారు. అలాంటి శంకర్ తన కథను చిత్రంగా నిర్మించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు, బయ్యర్లకు నచ్చిన నటుడు యోగిబాబుతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతూనే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న ఆయన కేరీర్ కానిస్టేబుల్ నందన్ చిత్రం ఒక మైలు రాయిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇందులో యోగిబాబుకు విలన్‌గా ఓ బలమైన పాత్ర ఉంటుందన్నారు. ఆ పాత్ర కోసం ప్రతిభావంతుడైన నటుడిని ఎంపికచేసి త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు భూపాల నటేశన్ పేర్కొన్నారు.ఇవి చదవండి: 'మదర్ ఇండియా'కు సిద్ధం.. -
'మదర్ ఇండియా'కు సిద్ధం..
తమిళసినిమా: నటుడు, దర్శకుడు శశికుమార్‌కు మళ్లీ హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. అయోథి చిత్ర విజయంతో ఈయనకు మంచి టైమ్ వచ్చిందనే చెప్పాలి. సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ఆ చిత్ర విజయంలో శశికుమార్ భాగం అయ్యారు. తాజాగా మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన ఇంతకు ముందు కూక్కూ, జోకర్, జిప్సీ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇటీవల కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన జపాన్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈయనకిప్పుడు నటుడు శశికుమార్ చేయూత నిచ్చారు. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.ఈ సంస్థ ఇంతకు ముందు డాడా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రానికి మందర్ ఇండియా అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలిసింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా కన్నడ నటి చైత్రా జె.అచ్చర్ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.ఈమె ఇటీవల కన్నడంలో నటించిన సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు శరత్‌కుమార్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో కుట్ర పరంపరై అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇవి చదవండి: ఆవిడ బయోపిక్‌లో నటించాలని..! -
దెయ్యం ఇతివృత్తంతో.. పార్క్
తమిళసినిమా: అక్షయ మూవీ మేకర్స్ పతాకంపై నటరాజ్ నిర్మిస్తున్న చిత్రం పార్క్. దర్శకుడు ఏ వెంకటేష్ శిష్యుడు ఈకే మురుగన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో తమన్‌కుమార్ కథా నాయకుడుగా నటిస్తున్నారు. ఈయన ఇంతకుముందు నటించిన ఒరునొడి చిత్రం మంచి విజయా న్ని సాధించింది.కాగా ఈ తాజా చిత్రంలో నటి శ్వేత టోరది నా యకిగా నటిస్తుండగా ప్రధాన ప్ర తినాయకుడిగా యోగిరామ్ నటిస్తున్నారు. కాగా నిర్మాణ కార్యక్ర మం పూర్తి చేసుకున్న పార్క్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ము స్తాబవుతుంది. చిత్రం వివరాలను దర్శకుడు మీడియాకు విడుదల చే సిన ఓ ప్రకటనలో ఇలా పేర్కొన్నా రు. ఇది దెయ్యం ఇతివృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రమని చె ప్పారు. దీన్ని పర్ఫెక్ట్ ప్రణాళికతో 36 రోజుల్లోనే షూటింగు పూర్తి చే సినట్లు చెప్పారు.ఇంతకుముందు అనేక దెయ్యాల కథా చిత్రాలు ప్రే క్షకులు చూసి ఉంటారని, అందు లో దెయ్యాలను వదిలించడానికి వివిధ మతాలకు చెందిన స్వా మీజీలనో, మంత్రగాళ్లనో చూపించి ఉంటారన్నారు. అయితే ఈ చిత్రంలో దెయ్యాన్ని వదిలించడానికి ఏ మతానికి చెందిన స్వామీజీలు గానీ మంత్రగాళ్లుగానీ చూపించలేదని, వేరే విధానంలో దెయ్యా న్ని వదిలించే సన్నివేశాలు చోటు చేసుకుంటా యని చెప్పారు. ఇలాంటి సన్నివేశాలను ఏ చిత్రంలోనూ చూసి ఉండరని చెప్పారు.హారర్ర్ కథా చిత్రాలకు మినిమం గ్యారంటీ ఉంటుందని, పెట్టుబడి పెట్టే నిర్మాతలను అలాంటి చిత్రాలు కాపాడుతాయని, అందుకే ఈ హారర్ర్, థ్రిల్లర్ నేపథ్యంలో పార్క్ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
ఆ లక్కీ ఛాన్స్ ఆమెకేనా?
తమిళసినిమా: నటుడు విజయ్ చివరి చిత్రంలో నటించనున్న కథానాయకి ఎవరన్నది ఇప్పటికీ ఆసక్తిగా మారింది. రాజకీయ పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్ ప్రస్తుతం కోర్ట్ చిత్రాన్ని పూర్తి చేశారు. వెంకట ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.కాగా తదుపరి ఒక్క చిత్రంలో నటించి విజయ్ నటనకు స్వస్తి పలికి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారిస్తారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అదే ఈయన 69వ చిత్రం. దీనికి హెచ్ వినోద్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇది పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగే కళా చిత్రంగా ఉంటుందని, విజయ్ రాజకీయ జీవితానికి హెల్ప్ అయ్యే చిత్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.అయితే ఈ చిత్రంలో విజయ్‌తో జతకట్టే కథానాయకి ఎవరన్న విషయంపై చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇందులో నటి నయనతార మరోసారి విజయ్‌తో జత కట్టనున్నట్లు, కాదు టాలీవుడ్ యువ క్రేజీ నటి శ్రీలీల ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎవరు కాదు ఆ లక్కీ ఛాన్స్ మరోసారి సంచలన నటి సమంత కే దక్కిందన్నది సమాచారం.మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత కృషి చిత్రం తర్వాత ఇప్పటివరకు ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే మళ్లీ తన రీ ఎంట్రీ భారీగా ఉండాలని ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. హలో ఈమె సొంతంగా చిత్రం నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే ఒక మలయాళంలోనూ, ఒక హిందీ చిత్రంలోను నటించే అవకాశాలు వచ్చాయని ప్రచారం కూడా జరిగింది. కాగా విజయ్‌తో సమంత ఇప్పటికే తెరి, మెర్సల్, కత్తి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా ఆయనతో నాలుగో సారి జత కట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం అక్టోబర్ నెలలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. -
Revathi Pillai: తానొక.. డిజిటల్ స్టార్.. అండ్ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్..
రేవతి పిళ్లై.. ‘ద వైరల్ ఫీవర్ (టీవీఎఫ్)’ యూట్యూబ్ చానెల్ వీక్షకులకు సుపరిచితం. నటిని కావాలనుకుని ఈ రంగంలోకి అడుగుపెట్టలేదు రేవతి. ఇష్టంలేకుండానే మొదలుపెట్టింది ఈ ప్రయాణాన్ని. అయినా మనసు పెట్టే కొనసాగిస్తోంది. అందుకే ఇక్కడ రేవతిని పరిచయం చేస్తున్నాం..మహారాష్ట్రలో స్థిరపడిన మలయాళీ కుటుంబం రేవతి వాళ్లది. ఆమె థానేలో పుట్టిపెరిగింది. షీజా పిళ్లై, మనోజ్ పిళ్లై.. రేవతి తల్లిదండ్రులు.ఊహ తెలిసినప్పటి నుంచి ఆటోమొబైల్ ఇంజినీర్ కావాలని కలలు కన్నది. కానీ రేవతిలోని ఇమిటేషన్ స్కిల్స్ చూసిన ఆమె కజిన్ తన చెల్లెలు యాక్టర్ అయితే బాగుంటుంది అనుకున్నాడు అనుకోవడమే కాదు ఆడిషన్స్‌కీ తీసుకెళ్లేవాడు. ప్రతి ఆడిషన్‌కి రేవతి ఏడుస్తూనే వెళ్లేదట.రేవతికి మొదట మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. మోడల్‌గా రాణిస్తున్నప్పుడే టీవీఎఫ్ వాళ్ల ‘యే మేరీ ఫ్యామిలీ’ వెబ్ సిరీస్‌కి సెలెక్ట్ అయింది. అందులో ‘విద్య’గా నటించింది. అయిష్టంగానే నటనారంగంలోకి అడుగుపెట్టినా.. కెమెరా ముందుకు రాగానే తన మైండ్‌ని మేకప్ చేసింది.. అదే తన కెరీర్ అని.. కమిట్ కావాలని!ఆ కమిట్మెంట్ విత్ టాలెంట్‌ని టీవీఎఫ్ వదలుకోదల్చుకోలేదు. అందుకే తర్వాత సిరీస్ ‘కోట ఫ్యాక్టరీ’లోనూ చాన్స్‌నిచ్చింది. అది ఆమెకు మంచి పేరు తెచ్చింది. తర్వాత ‘స్పెషల్ ఆప్స్ 1.5’లోనూ నటించింది.కంఫర్ట్ జోన్లో ఉండటం రేవతి ఇష్టం ఉండదు. కంఫర్ట్ మనలోని క్రియేటివిటీని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని చంపేస్తుందని ఆమె అభిప్రాయం. అందుకే సిరీస్ చేస్తూనే ‘కాపిటల్ ఏ, స్మాల్ ఏ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ‘తారే జమీన్ పర్’ ఫేమ్ దర్శిల్ సఫారీ సరసన.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో రేవతికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఆమె లైఫ్‌స్టయిల్, నేచర్, ట్రావెల్ ఫొటోస్, వీడియోస్‌ని పోస్ట్ చేస్తూంటుంది.రేవతి నటించిన ‘దిల్ దోస్త్ డైలమా’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.‘అన్నిటికన్నా కూల్ రోల్ స్టూడెంట్ రోల్. అయితే ఆ పాత్రకే పరిమితం కాలేం కదా! యాక్టర్స్ అందరిలాగే నాకూ డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. ముఖ్యంగా సైకో కిల్లర్‌గా నటించాలనుంది!’ – రేవతి పిళ్లై -
ఆ పాత్రలో.. మెప్పించడానికి చాలానే కష్టపడింది!
శర్మిన్ సహగల్.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘హీరామండీ’ సిరీస్ చూసినవాళ్లు ఇట్టే గుర్తుపట్టేస్తారు.. ‘ఆలమ్జేబ్’ అని! అవును.. ఆ పాత్రలో మెప్పించడానికి చాలానే కష్టపడింది శర్మిన్. అయినా నెపోటిజమ్ కామెంట్స్, విమర్శలను ఎదుర్కోక తప్పలేదు. నెపోటిజమ్ ఏంటీ? అని కనుబొమలు ముడిపడ్డాయా? అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే!శర్మిన్ పుట్టిపెరిగింది ముంబైలో. అమ్మ .. బేలా సహగల్.. ఫిల్మ్ ఎడిటర్ అండ్ డైరెక్టర్. నాన్న.. దీపక్ సహగల్.. ఫిల్మ్ ప్రొడ్యూసర్. శర్మిన్ సినిమా నేపథ్యం తల్లిదండ్రులతో కాదు తాత మోహన్ సహగల్ (దీపక్ వాళ్ల నాన్న. రేఖను బాలీవుడ్‌కి పరిచయం చేసింది ఈయనే!), మేనమామ.. సంజయ్‌లీలా భన్సాలీతో మొదలైంది. భన్సాలీ చెల్లెలే శర్మిన్ వాళ్లమ్మ బేలా. ఇప్పుడర్థమైంది కదా శర్మిన్ విషయంలో నెపోటిజమ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో!తను ట్వల్త్ క్లాస్ వచ్చేవరకు డాక్టర్ కావాలనే కలలు కన్నది. ట్వల్త్ క్లాస్ సెలవుల్లో తన మేనమామ తీసిన ‘దేవ్‌దాస్’ సినిమాను చూసి షారూఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్‌ల నటనకు, తన మేనమామ స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్‌కి ఫిదా అయిపోయి యాక్టర్ కావాలని నిశ్చయించుకుంది.అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడే శర్మిన్లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్‌ని గుర్తించాడు భన్సాలీ. అందుకే మంగేశ్ హదావ్లే దర్శకత్వంలో జావేద్ జాఫ్రీ కొడుకు మీజాన్ జాఫ్రీ, శర్మిన్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ‘మలాల్’ అనే సినిమాను నిర్మించాడు. అందులో శర్మిన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ‘అతిథి భూతో భవ’లోనూ నటించింది. పలువురి ప్రశంసలు అందుకుంది.న్యూయార్క్ వెళ్లి థియేటర్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో డిగ్రీ చదివింది. తిరిగొచ్చి సంజయ్‌లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరింది. అలా గోలియోంకీ రాస్లీలా రామ్‌లీలా, మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కాఠియావాడీ సినిమాలకు పనిచేసింది.‘హీరామండీ’తో వెబ్ ప్రయాణం మొదలుపెట్టింది. మనీషా కోయిరాలా, సొనాక్షీ సిన్హా, రిచా చడ్డా, అదితీ రావ్ హైదరీ, ఫరీదా జలాల్ వంటి ఉద్దండులతో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అందుకే ‘ఆలమ్జేబ్’గా ఆమె నుంచి మరింత పెర్ఫార్మెన్స్ని ఆశించారు ప్రేక్షకులు. సీనియర్స్ ముందు శర్మిన్ తేలిపోయిందని నిరాశచెందారు. అయితే ఆ విమర్శలను పాజిటివ్‌గానే తీసుకుని తన ప్రతిభను మరింత మెరుగుపరచుకుంటుందని ఆమె అభిమానుల అభిప్రాయం.సంజయ్‌లీలా భన్సాలీని నేను మామయ్య అని పిలవను. సర్ అనే పిలుస్తాను. దేవ్‌దాస్ సినిమా చూస్తే కానీ ఆయన టాలెంట్ ఏంటో తెలీలేదు. ఆ టాలెంటే నేను ఆయన్ని‘ సర్’ అని పిలిచేలా చేస్తోంది. ఆ లెజెండ్ నాకు మామయ్య అవడం నా అదృష్టం! – శర్మిన్ సహగల్ -
లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో కీర్తి సురేష్
-
గ్లామర్ షో, వరుణ్ ధావన్ బేబీ జాన్ తో కీర్తి సురేష్ ఓకే
-
పాయల్ రాజ్‌పుత్ రక్షణ మూవీ టీమ్ నుండి వేధింపులను ఎదుర్కొంటుంది
-
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
పేరు.. సంజనా బత్రా హోమ్ టౌన్ అండ్ వర్క్ ప్లేస్ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్ .. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ. మరి ఫ్యాషన్ రంగంలో.. నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్యాషన్ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్ స్టయిలిస్ట్‌ని చేసింది. పర్సనల్ స్టయిల్.. Classic, Chic.. eclectic! వర్క్ డిస్క్రిప్షన్.. fast-paced, challenging and creatively satisfying.ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ! వాళ్ల నాన్నమ్మ వార్డ్ రోబ్‌లో చున్నీలు, ఆమె డ్రెసింగ్ టేబుల్లో నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్‌ల కలెక్షన్స్ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్ సెన్స్ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్గానే ఉంది తప్ప దాన్నో కెరీర్‌గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్‌లో ఫిల్మ్ స్టడీస్ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది.బ్యూటీ అండ్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్‌గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా (ప్రొడక్షన్లో)కి పనిచేసే ఆఫర్ వచ్చింది. స్టయిలింగ్‌ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ పర్సనల్ ఫొటో షూట్ ఉంది.. ఆమెకు స్టయిలింగ్ చేయగలవా?’ అంటూ ఓ కాల్ వచ్చింది.ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్‌ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్‌కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. తమ స్టయిలిస్ట్‌గా సంజనాను అపాయింట్ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్ అవుతారు. హెడ్ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!"ఫ్యాషన్ అండ్ స్టయిల్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్ స్టార్ అంటే అనుష్క శర్మనే. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా -
సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ పై తొలిసారి స్పందించిన అదితిరావు హైదరీ
-
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
నమితా దుబే.. చాలామంది నటీమణుల్లాగానే ఆమే మోడలింగ్ నుంచి నటనవైపు మళ్లింది. స్మాల్ అండ్ సిల్వర్ స్క్రీన్స్ మీద వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద అవకాశాలను అందుకుంటోంది. తన హావభావాలతో వీక్షకులను అలరిస్తోంది.నమితా పుట్టిపెరిగింది లక్నోలో. వాళ్ల నాన్న వినయ్ప్రియ్ దుబే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమితా.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో బిఏ ఇంగ్లిష్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తర్వాత ముంబై వెళ్లి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సోషల్ వర్క్‌లో పీజీ చేసింది.చదువైపోయాక ‘వరల్డ్ వెల్ఫేర్ చిల్డ్రన్ ట్రస్ట్’లో కొన్నాళ్లు, ‘సలామ్ బాలక్ ట్రస్ట్’లో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఒక యాడ్‌లో అయిదు నిమిషాలు నటించినందుకు 20 వేల పారితోషికం అందుకుంది. అది ఆమెకు తన కెరీర్‌నే యాక్టింగ్ ఫీల్డ్కి షిఫ్ట్ చేసుకునేంత ఉత్సాహాన్నిచ్చింది.నటనారంగంలో కొనసాగేముందు తన అభినయ కళకు మెరుగులు దిద్దుకోవాలనుకుని ‘జెఫ్ గోల్డెన్‌బర్గ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్’లో చేరింది. ట్రైన్డ్ యాక్ట్రెస్‌గా బిందాస్ చానెల్ సీరియల్ ‘యే హై ఆషిరీ’తో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అందులోని ‘రాధిక’రోల్‌తో ఆమె పాపులర్ అయింది. అది ఆమెకు సోనీ, కలర్స్ లాంటి ఇతర టాప్ చానెల్స్‌లో అవకాశాలను తెచ్చిపెట్టింది.టీవీ గుర్తింపు నమితాకు సినిమా చాన్స్‌నూ ఇచ్చింది.. ‘మై తేరా హీరో’లో. అందులో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిలో పడేలా చేసింది. తత్ఫలితం.. అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన లేడీ ఓరియెంటెండ్ మూవీ ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో మంచి పాత్ర దక్కడం. ఇలా టీవీ సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే ‘యాస్పిరెంట్స్’ అనే సిరీస్‌తో ఓటీటీలోనూ నటించే ఆపర్చునిటీ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో.. అందులోని ‘ధైర్య’ భూమికతో ఆమే అంతే ఫేమస్ అయ్యి ఓటీటీ వీక్షకుల అభిమాన నటిగా మారిపోయింది. "ఇంపార్టెంట్ రోల్ దొరికితే చాలు.. అది సీరియలా.. సిరీసా.. సినిమానా అని చూడను. నాకు తెలిసి నిజమైన యాక్టర్స్ ఎవరైనా తమ పాత్ర గురించి ఆలోచిస్తారు తప్ప దాన్ని ప్రదర్శించే వేదిక గురించి కాదు!" – నమితా దుబే -
Nidhi Bhist: మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే..! కానీ ఇప్పుడు నిధి ద బెస్ట్!!
‘జాబ్ కన్నా యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నట్టుంది. షారూఖ్ ఖాన్‌తో కలసి స్క్రీన్ మీద కనిపిస్తావన్నమాట’ అంటూ బాస్ ఎగతాళి చేశాడు. ‘గుండ్రటి మొహం.. అక్క, వదిన, పిన్ని పాత్రలకైతే పనికొస్తావ్. మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే!’ అని బాలీవుడ్ రిజెక్ట్ చేసింది. ఆమె ఇప్పుడు వండర్ఫుల్ యాక్ట్రెస్, రైటర్ అండ్ డైరెక్టర్‌గా సినిమా ప్రేక్షకుల, వెబ్ వీక్షకుల మన్ననలందుకుంటోంది. అన్నట్టు షారూఖ్ ఖాన్‌తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ బహుముఖ ప్రజ్ఞ పేరు.. నిధి బిష్ట్! ► ఢిల్లీలో పుట్టి, పెరిగింది. అమ్మ.. టీచర్. నాన్న.. ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఇద్దరూ తమ కూతురు డాక్టర్ కావాలని కలలు కన్నారు. వాళ్ల కోరిక మేరకు ఇంటర్లో బైపీసీలో జాయిన్ అయింది నిధి. కానీ రెండు రోజులకే అది తన నోట్స్ ఆఫ్ స్టడీ కాదనుకుంది. దాంతో కామర్స్ గ్రూప్‌కి మారింది. అదీ తనకు సరిపడదని గ్రహించి ఆ వెంటనే హ్యుమానిటీస్లోకి వెళ్లి సెట్ అయింది.► ఇంటర్ తర్వాత .. జామియా మిలియా యూనివర్సిటీలో లా చేసింది. అక్కడ థియేటర్ వింగ్ ఇప్టా (ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్) చాలా యాక్టివ్. చిన్నప్పటి నుంచీ నిధికి నటనంటే ప్రాణం. అందుకే ‘లా’ కోసం ఆ యూనివర్సిటీని ఎంచుకుంది. తన అయిదేళ్ల లా కోర్స్‌లో ఇప్టాతోనే ఎక్కువ గడపింది నాటకాలు రాస్తూ.. వేస్తూ! ఆ ఆసక్తి, ఉత్సాహంతోనే లా అయిపోగానే పుణె వెళ్లింది అక్కడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడానికి. కానీ అందులో సీట్ రాలేదు. నిరాశతో మళ్లీ ఢిల్లీకి వచ్చేసి ఒక లా ఫర్మ్‌లో చేరింది.► ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక నాటకంలో నటించే అవకాశం వచ్చింది నిధికి. ఉదయం 9 కల్లా ఆఫీస్‌కి చేరి.. అక్కడి నుంచి కోర్ట్.. మళ్లీ ఆఫీస్ అలా రాత్రి 9 వరకు పని చూసుకుని.. అక్కడి నుంచి నేరుగా థియేటర్ రిహార్సల్స్‌కి వెళ్లేదట. ఉదయం మూడు గంటల వరకు రిహార్సల్స్ చూసుకుని ఇల్లు చేరేది. అలా కొన్ని నెలల శ్రమానంతరం స్టేజ్ మీద నాటకం ప్రదర్శించే రోజు రానేవచ్చింది. నిధి తన బాస్‌నూ ఆహ్వానించింది. అతను ఆ రోజు చప్పట్లతో ఆమె ప్రతిభను ప్రశంసించాడు. కానీ మరుసటి రోజు ఆఫీస్‌లో పది పనులు చెప్పి .. సాయంకాలానికి డెడ్‌లైన్ ఇచ్చాడు. చేయలేకపోయింది నిధి. అప్పుడే ‘షారూఖ్ ఖాన్‌తో కలసి కనిపిస్తావన్నమాట’ అంటూ ఆ బాస్ కామెంట్ చేశాడు. ‘తప్పకుండా కనిపిస్తాను చూడండీ..’ అంటూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చింది నిధి.► యాక్టింగ్ మీదే పూర్తి దృష్టి పెట్టాలని ముంబై చేరింది. కనీస అవసరాల కోసం p్చnజ్ఛ్చ3 అనే లీగల్ ఔట్సోర్సింగ్ సంస్థలో చేరింది. జాబ్.. ఆడిషన్సే లోకమయ్యాయి ఆమెకు. అయితే ఎక్కడికి వెళ్లినా రిజెక్షనే ఎదురైంది. అయినా అధైర్యపడలేదు. తన ఫిక్స్డ్ డిపాజిట్‌ని బ్రేక్ చేసి ‘న్యూ బ్రెయిన్ థియేటర్ వోక్స్’ అనే బ్యానర్‌ని స్థాపించి ‘హూ లెట్ ద డాగ్స్ అవుట్’ అనే నాటకాన్ని డైరెక్ట్ చేసింది. అది చూసి యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్ (ద వైరల్ ఫీవర్ ) వీడియోస్’ ఫౌండర్ అరునాబ్ కుమార్ టీవీఎఫ్‌లో అవకాశం ఇచ్చాడు. అందులో ఆమె స్క్రిప్ట్ రైటర్‌గా, యాక్టర్‌గా, కాస్టింగ్ డైరెక్టర్‌గా మల్టిపుల్ రోల్స్‌ని పోషించింది. ఆ టాలెంట్ ఆమెకు ఇటు ఓటీటీ.. అటు సినిమాల్లో ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది. దేశమంతటా అభిమానాన్ని సంపాదించిపెట్టింది.► క్రియెటివిటీకి బెంచ్ మార్క్ ఉండదనే కాన్ఫిడెన్స్ నాది. కాబట్టే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా లైట్ తీసుకున్నా. వచ్చిన అవకాశంతో నేనేంటో నిరూపించుకున్నా! అందుకే ఆ రోజు రిజెక్ట్ చేసినవాళ్లే ఈ రోజు నాతో పనిచేయడానికి డేట్స్ అడుగుతున్నారు!‘తుప్పాకీ’, ‘చాయ్ సుట్టా క్రానికల్స్’, ‘పర్మినెంట్ రూమ్మేట్స్’, ‘టీవీఎఫ్ పిచర్స్’, ‘ఉమ్రీకా’, ‘టీవీఎఫ్ ట్రిప్లింగ్’, ‘ఫిల్లోరి’, ‘బిష్ట్.. ప్లీజ్’, ‘పిఏ గాళ్స్’, ‘డ్రీమ్ గర్ల్’, ‘క్యూబికల్స్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’, ç‘ßోమ్ శాంతి’, ‘ఫోన్ బూత్’. ‘మామ్లా లీగల్ హై’ వంటి షోస్, సినిమాస్, సిరీస్‌కి కాస్టింగ్ డైరెక్టర్, రైటర్, డెరెక్టర్, యాక్టర్‌గా పనిచేసింది. టీవీఎఫ్లోనే.. షారూఖ్ ఖాన్ పాల్గొన్న ‘బేర్లీ స్పీకింగ్ విత్ అర్నబ్’ అనే షోకి నిధి మోడరేటర్‌గా వ్యవహరించి.. తన బాస్‌కి చెప్పినట్టు షారూఖ్ ఖాన్‌తో స్క్రీన్ కూడా షేర్ చేసుకుంది. – నిధి బిష్ట్.ఇవి చదవండి: Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత? -
Ashish Chanchlani: టాలెంట్‌తో.. బిలియన్ల వ్యూస్.. మిలియన్ల సబ్స్క్రైబర్స్..
'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్‌తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్‌కి వెల్‌నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.' సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్‌ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉండటంతో టీన్స్‌లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్‌తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్‌తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్‌కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో కలసి యాడ్స్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్‌స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్‌కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు. 'బెస్ట్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా! ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే.. -
Hrithik Roshan: ఈ బాలీవుడ్ యాక్టర్ ముద్దు పేరు వింటే షాకే..!
ఒక్కొక్కరికి ఒక్కో ముద్దుపేరు ఉండటం సహజం. వారి ప్రవర్తనతో గానీ, అలవాట్లు.. ఇష్టాలతోగానీ, కనిపించే తీరుతోగానీ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా రకాలుగా మారుపేర్లు, ముద్దుపేర్లు వస్తూంటాయి. కొన్ని ముద్దు పేర్లు మాత్రం స్థిరపడిపోతాయి కూడా. ఇలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి హృతిక్ రోషన్‌కి కూడా ఓ చిన్న కథ ఉంది. అదేంటో చూద్దామా! బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ పెట్ నేమ్ దుగ్గూ. ఈ ముద్దు పేరుకీ.. హృతిక్ వాళ్ల నాన్న.. బాలీవుడ్ ఒకప్పటి అందాల హీరో రాకేశ్ రోషన్ పెట్ నేమ్కీ ఏదో కనెక్షన్ ఉండే ఉంటదని బాలీవుడ్ వర్గాలు.. తన పేరునే కాస్త తిరగేసే కొడుకును పిలుచుకుంటున్నాడా ఏంటీ అని హృతిక్ ఫ్యాన్స్ డౌట్ పడతారట. ఇంతకీ రాకేశ్ రోషన్ ముద్దు పేరేంటంటే.. గుడ్డూ! ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
Darshana Banik: తను ఒక 'దర్శనా'త్మకం..
‘సేవ్ ద టైగర్స్’.. సింప్లీ సూపర్బ్ అనిపించుకుంటున్న వెబ్ సిరీస్! అందులో ‘హారిక’ రోల్లో కనిపించిన నటి.. దర్శనా బనిక్. కూల్ లుక్స్.. గుడ్ యాక్టింగ్ స్కిల్స్‌తో ఆమె కూడా సింప్లీ సూపర్బ్ అని వీక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌తో లైమ్‌లైట్‌లో ఉన్న దర్శనా గురించి క్లుప్తంగా.. పుట్టి, పెరిగింది కోల్‌కత్తాలో. రబీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. డిగ్రీ ఫైనలియర్లో ఉన్నప్పుడే అందాల పోటీల్లో పాల్గొంది. అందాల పోటీల్లో పార్టిసిపేషన్ ఆమెకు మోడలింగ్ అవకాశాలను తెచ్చిపెట్టింది. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే బొరోలిన్, వొడాఫోన్, కలర్స్, పీసీ చంద్ర జ్యూలర్స్ వంటివాటికి మోడల్‌గా పనిచేసింది. మోడలింగ్‌లో ఉన్న చాలామందిని వరించినట్టే.. దర్శనా దరికీ సినిమా చాన్స్‌లు వరుస కట్టాయి. అలా 2018లో ‘అశ్చే అబర్ షబోర్’తో బెంగాలీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. దర్శనా.. బెంగాలీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే టాలీవుడ్ దృష్టిలో పడింది. ‘ఆటగాళ్లు’తో తెలుగు ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంది. ‘బ్లాక్’ అనే మరో సినిమాలోనూ కనిపించింది. బాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ నటనావకాశాలు క్యూకట్టాయి. ‘ఎజ్రా’ అనే హిందీ మూవీలో, ‘యారుక్కుమ్ అంజేల్’ అనే తమిళ చిత్రంలో నటించింది. వెబ్‌స్క్రీన్ కూడా దర్శనాకు వెల్కమ్ చెప్పింది. ఆమె నటించిన ‘సేవ్ ద టైగర్స్’ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధంలేని వాళ్లు ఈ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవడం అంత ఈజీకాదు. అందులోనూ ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లడాలు, పార్టీలకు అటెండ్ అవడాలు వంటి సోషల్ మూవింగ్ లక్షణాలేవీ లేని నాలాంటి వాళ్లకు మరీ కష్టం. అయినా ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చానంటే నేను చేసిన.. చేస్తున్న పనే కారణం. అందుకే మన పనే మనకు అవకాశాలను తెచ్చిపెడుతుందని నమ్ముతాను! – దర్శనా బనిక్ ఇవి చదవండి: ఎందెందు వెదికినా కరివేపాక్ కలదు -
రూ.75కే సినిమాలు.. దేశంలోనే తొలి ఓటీటీ ప్రారంభించిన ప్రభుత్వం
ఓటీటీ మార్కెట్‌కు ఇప్పుడున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, ఓటీటీ నుంచి ఏటా 25% ఆదాయ వృద్ది నమోదవుతోందని నిపుణులు చెబుతున్నారు. వీక్షణ సమయం 30% పెరుగుతుందంటున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ మార్కెట్ విస్తరిస్తోంది. ఇప్పటిదాకా ప్రైవేటు సంస్థలు మాత్రమే ఈ సర్వీస్‌లను అందిస్తున్నాయి. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలు ఓటీటీ సర్వీసులను అందించనున్నాయి. తాజాగా కేరళ ‘సీస్పేస్’ (CSpace) పేరుతో ఓటీటీ సర్వీస్‌లను అందించేందుకు సిద్దమైంది. గురువారం కేరళ సీఎం పినరయి విజయన్ ఈ ప్లాట్‌పామ్‌ను ప్రారంభించారు. దేశంలో తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ వేదిక ఇదేనని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ తెలిపారు. ప్రస్తుతం ఓటీటీల్లో ప్రసారమవుతున్న కంటెంట్ ఎంపికలో చాలా తేడాలున్నాయని కేరళ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ షాజీ ఎన్ కరున్ తెలిపారు. వాటి ప్రసారాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటికి ప్రతిస్పందనగా సీస్పేస్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఐఓఎస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఓటీటీలో రూ.75 ధరకే యూజర్లు సినిమా చూడొచ్చు. తక్కువ నిడివి ఉన్న కంటెంట్‌ను సగం ధరకే వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ‘పే ఫర్ వ్యూ’ ఆధారంగా నిర్మాతలకు చెల్లింపులు చేస్తారు. నూతన దర్శకులు తమ చిత్రాల కోసం సీస్పేస్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. నిర్మాతలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేయడం వల్ల లాభాలు తగ్గుతున్నాయని పలువురు ఎగ్జిబిటర్లు, పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే సీస్పేస్‌లో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదీ చదవండి: ఇకపై ఆండ్రాయిడ్ యాప్స్‌ను వాడలేరు! కంటెంట్‌ను ఎంపిక చేసేందుకు 60 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ నియమించారు. సీస్పేస్ కోసం ఇప్పటి వరకు 42 చిత్రాలను ఎంపిక చేశారు. ప్యానెల్ అనుమతి పొందిన షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, ప్రయోగాత్మక చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తారు. ఈ ఓటీటీ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధిలేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. -
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
మరోసారి తండ్రి అయిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి రెండోసారి తండ్రి అయ్యాడు. విరాట్ భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరుష్క దంపతులు కొద్ది సేపటి క్రితం ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. బిడ్డకు 'అకాయ్' (Akaay) అని నామకరణం చేసినట్లు వారు పేర్కొన్నారు. మా జీవితంలోని ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాము. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించాలని అభ్యర్థిస్తున్నాము. ప్రేమ మరియు కృతజ్ఞతతో విరాట్ మరియు అనుష్క అంటూ విరుష్క దంపతులు ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) కాగా, విరాట్ తండ్రి కాబోతున్నాడని గతకొంతకాలంగా సోషల్‌మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా, కోహ్లి సహచరుడు, దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ సోషల్‌మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2017లో విరాట్ కోహ్లిని పెళ్లాడిన అనుష్క శర్మ.. 2021లో మొదటి సంతానం వామికకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే, విరాట్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లకు విరాట్ దూరంగా ఉన్నాడు. సిరీస్ ప్రారంభానికి ముందే విరాట్ బీసీసీఐ వద్ద పర్మిషన్ తీసుకున్నాడు. -
ఈ మధ్య రీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటి?
-
సూపర్ హీరోస్ మెప్పిస్తున్న కథానాయకులు
-
ఆ విషయంలో వరుణ్ ఇంట్లో ఎలా ఉంటాడంటే..!
-
సినిమా రక్తం
‘టప్’మంటూ లైట్ వెలుగుతుంది. ఆగంతకుడు ఛాతీ మీద రక్తంతో నేలకొరిగి ఉంటాడు. హీరోయినో, హీరో చెల్లెలో ‘కెవ్వు’మని నోటికి చెయ్యడ్డం పెట్టుకుంటూ కేక వేసి ‘రక్తం... రక్తం’ అని పరిగెడుతుంది. లేదా స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ చేరుతారు. పోలీసులు వస్తారు. రక్తం బయటకు వస్తే రక్తం బయటకు రావడానికి కారకులను పట్టుకోవాలి. శిక్షించాలి. అది చట్టం. సమాజానికి వహించవలసిన బాధ్యత. అక్కడి నుంచి సినిమా కథంతా నడుస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో రక్తం నల్లగా ఉంటుంది. పైగా కొంచెమే కనిపిస్తుంది. అయినా సరే డైరెక్టర్‌గాని, సినిమా రచయితగాని, హీరోగాని హంతకుణ్ణి క్లయిమాక్స్‌లో పోలీసులకు అప్పజెప్పకుండా ఊరుకునేవారు కాదు. హిందీలో ‘దుష్మన్’ అనే సినిమా పెద్ద హిట్. రాజేష్‌ఖన్నా హీరో. లారీ డ్రైవర్. నిర్లక్ష్యంగా లారీ నడిపి గొడ్లు కాచే వ్యక్తి చావుకు కారణం అవుతాడు. జడ్జిగారు అతణ్ణి జైల్లో మగ్గమని తీర్పు చెప్పకుండా, ఏ వ్యక్తి చావుకైతే కారణమయ్యాడో ఆ వ్యక్తి ఊరికెళ్లి, అతడి పొలం పండించి, పిల్లల, ముసలి తల్లిదండ్రుల బాగోగులు చూడమని ఆదేశిస్తాడు. రాజేష్ ఖన్నా ముందు నిరాకరించినా కాలక్రమంలో పరివర్తన చెందుతాడు. ఊరికి ఇలవేల్పుగా మారి క్షమార్హుడవుతాడు. టైరుకు అంటిన రక్తం ఒక మనిషిని చేర్చాల్సిన గమ్యం అది. ఈ సినిమాను తెలుగులో ‘ఖైదీ బాబాయ్’గా తీస్తే హిట్ అయ్యింది. ఇదే రాజేష్ ఖన్నా ‘రోటీ’లో ఒక వ్యక్తి అకారణ చావుకు కారణమై పశ్చాత్తాపం చెందడమే కథ. గతంలో అలా ఉండేది. హీరో నేరం చేస్తే పశ్చాత్తాపం చెందేవాడు. ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. తప్పు దారి పట్టి ఏ దొంగో, స్మగ్లరో, హంతకుడో అయితే క్లయిమాక్స్‌లో మరణించేవాడు. జైలుకు వెళ్లేవాడు. అట్టి హీరోకు హీరోయిన్ దక్కే అవకాశం లేదు. పోలీస్జీపులో వెళ్లిపోతున్న హీరోని గుడ్ల నీరు కక్కుకుంటూ చూడాల్సిందే. ‘దీవార్’లో అమితాబ్ చచ్చిపోతాడు. ‘ఖైదీ’లో చిరంజీవి జైలుకెళ్లిపోతాడు. ‘మల్లీశ్వరి’, ‘బంగారు పాప’ వంటి క్లాసిక్స్ తీసిన బి.ఎన్.రెడ్డి కాసింత కత్తి యుద్ధాలు వగైరా ఉండే ‘రాజమకుటం’ తీస్తే ‘ఈయనకేం పోయేకాలం వచ్చింది’ అన్నారట ప్రేక్షకులు హిట్ చేస్తూ కూడా! ‘తమరు కూడా రక్తపాతం తీయాలా మహాశయా’ అన్నారట సినిమా మిత్రులు. ఆయన బాధపడి, ఇదేదో చెడ్డపేరు వచ్చేలా ఉందని తర్వాత అలాంటి సినిమాల జోలికి పోలేదు. సృజించబడే కళ, సృజిస్తున్న కళాకారుడు వేరువేరు కాదు అనుకునేవారు పూర్వం. కళాకారుడి వ్యక్తిత్వమే కళ వ్యక్తిత్వంగా జనం గుర్తించే వారు. దర్శకులుగాని, హీరోలుగాని తమ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వస్తే తలవంపులుగా భావించేవారు. ‘ఏ సర్టిఫికెట్ వచ్చిందట’ అనేది పెద్ద వార్త. ఎన్.టి.రామారావు ‘బొబ్బిలిపులి’లో హింస ఎక్కువైందని సెన్సార్ వారు పేచీ పెట్టారు. కారణం హీరోయే దుర్మార్గులను తుదముట్టిస్తున్నాడు. స్వీయకోర్టు నిర్వహిస్తున్నాడు. రక్తపాతం సృష్టిస్తున్నాడు. దాసరి దర్శకత్వం వహించిన ‘తాండ్ర పాపారాయుడు’ చారిత్రక చిత్రమే అయినా, బొబ్బిలి యుద్ధమే కథాంశమైనా రక్తం ఎక్కువ కనిపిస్తున్నదని కొన్ని కట్స్ చెప్పారు. 1990ల ముందు వరకూ రక్తం ఎక్కువ కనిపించరాదనే సెన్సార్ నియమం ఉండేది. అంతెందుకు? చచ్చీ చెడీ ‘షోలే’ సినిమాను తయారు చేసి సెన్సార్‌కు పంపితే క్లయిమాక్స్‌లో సంజీవ్ కుమార్ గబ్బర్ సింగ్‌ను ఎలా చంపుతాడు... సెన్సార్ ఇవ్వం అని గట్టిగా చెప్పారు అధికారులు. దాంతో క్లయిమాక్స్ రీషూట్ చేసి గబ్బర్ను పోలీసులకు అప్పజెప్పడం చూపారు. చెడ్డపాత్రలు ఎంత మందినైనా చంపొచ్చు. మంచిపాత్రలు చంపుతూ పోతే సమాజం ఏం నేర్చుకోవాలి? సమాజం మీద ఏర్పడే ప్రభావం ఎట్టిది? రామ్‌గోపాల్ వర్మ వచ్చి ‘శివ’ సినిమాతో రక్తపాతాన్ని పెంచాడనే విమర్శలు వచ్చాయి గాని, సినీ హింసలో ‘శివ’ నేడొక చిన్నగీత. కాలం మారింది. ‘మనుషులను చంపుకుంటూ వెళితే ఎవరూ మిగలరు’ అని అంటూనే చాలామందిని చంపుకుంటూ వెళ్లడమే హీరోయిజం అయ్యింది. ‘ఒక్కొక్కరిని కాదు షేర్‌ఖాన్... వందమందిని పంపు’ అని కత్తికొక కండగా నరుకుతుంటే రక్తం ఎగజిమ్మేకొద్దీ కలెక్షన్లు వచ్చిపడ్డాయి. సినిమా ఒప్పుకున్న హీరో కాస్ట్యూమ్స్‌తోపాటు డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లతో కూర్చొని పోస్టర్లో మెరిసే సరికొత్త మారణాయుధాన్ని తయారు చేయించుకుంటున్నాడు. చాలక భారీ మిషన్గన్లను కూడా తయారు చేయించుకుంటున్నాడు. పేలుస్తున్నాడు. హీరో ఇంతమందిని చంపుతున్నా సినిమా పోలీసులు ఏమవుతున్నారో ఎందుకు కానరావడం లేదో వారిపైన ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలో తెలియని అయోమయ స్థితి. రక్తం మనిషికి జీవధార. చాలా ప్రమాదాల్లో, దాడుల్లో మనుషులు చనిపోయేది ప్రమాద తీవ్రత వల్ల కాదు. రక్తం పోయి. రక్తం అందక. ధర్మరాజు రక్తమే కాదు, ఏ అమాయకుడి నెత్తురు నేల మీద పడ్డా... ఆ నేలకు అది శుభసూచకం కాదు. రక్తాన్ని చూసి చలించని, రక్తాన్ని చూడటం అలవాటుగా మారిన సమాజం మానవీయంగా మనజాలదు. ఎన్ని బ్లడ్‌బ్యాంకులు పెట్టినా చాలనంత రక్తాన్ని ఇవాళ హీరోలు తెరల మీద పారిస్తూ ఉంటే... స్వయంగా కత్తి పట్టి క్రూరంగా గొంతులు కోస్తూ ఉంటే, ఈలలు వేస్తూ గోలలు చేస్తున్న మన ఇంటి పిల్లల్ని మనం ఎలా తయారు చేశామో తల్లిదండ్రులు ఆలోచించాలి. సినిమా అయినా, సాహిత్యమైనా జంతువును మనిషిగా చేయాలి. మనిషిని జంతువుగా కాదు! కమర్షియల్ కళకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును సినిమావారు గుర్తెరిగితే మంచిది. లేదంటే ప్రేక్షకులే ఏదో ఒకనాడు గుర్తు చేస్తారు. ఫస్ట్‌హాఫ్‌లో కాకపోతే సెకండ్ హాఫ్‌లో! ఏ సినిమాకైనా ‘ది ఎండ్’ పడవలసిందే కదా!! -
షారుఖ్ ఖాన్ పై ప్రశాంత్ నిల్ కు ఎందుకింత పగ..?
-
ఇండస్ట్రీలో మరో సూపర్ స్టార్
-
అందువల్లే హీరోయిన్ ఛాన్స్ రాలేదు: అనసూయ
యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి.. వెండితెరపై విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తోన్న నటి అనసూయ. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో అనసూయ రేంజ్ పూర్తిగా మారిపోయింది ఇటీవలే ప్రేమ విమానం చిత్రంతో అభిమానులను అలరించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైన అనసూయ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.‘అత్తారింటికి దారేది’ సినిమాలోని పాటలో నటించకపోవడానికి గల కారణాన్ని వివరించారు. (ఇది చదవండి: స్టార్ హీరో కూతురి పెళ్లి.. మొదలైన సందడి..!) అనసూయ మాట్లాడుతూ.. 'అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో అవకాశం వచ్చింది. అయితే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని తెలిసి నేను చేయనని చెప్పా. ఎందుకంటే గుంపులో నటించడం నాకు నచ్చదు. నాకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటా. అందుకే ఆ పాటకు నో చెప్పా. ఆ సమయంలో చాలా మంది నన్ను విమర్శించారు. నేను నో చెప్పడం తప్పు కాదు.. నా పద్ధతి సరైంది కాదేమో అని నాకనిపించింది. మొదటి నుంచి ముక్కుసూటి మనిషిని అందుకే కొంచెం కఠినంగా చెప్పేశా. అప్పుడు దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్ జరిగింది. అందుకే త్రివిక్రమ్‌కు సారీ చెప్పా' అని అన్నారు. హీరోయిన్ ఛాన్స్ రాకపోవడంపై స్పందిస్తూ..'షూటింగ్స్‌లో నా పని అయిపోగానే వెళ్లిపోతా. సినిమా అయ్యాక పార్టీలకు దూరం. అందువల్లే హీరోయిన్ ఛాన్సులు కోల్పోయా. అలా అయితేనే అవకాశాలు వస్తాయంటే వాటిని నేను ప్రోత్సహించను. ఒకప్పుడు ఏదైనా అవకాశం వస్తే.. నాకే ప్రాధాన్యత ఉండాలని కోరుకునేదాన్ని. కానీ ఇప్పుడు కాస్తా మార్పు వచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా నటనతో గుర్తింపు వస్తుందనే నమ్మకం కలిగింది.'అని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాకు పుట్టుకతోనే సమస్య ఉంది.. కానీ తెలియలేదు: రేణు దేశాయ్) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
సినిమా ఇండస్ట్రీ వాళ్ల చుట్టే తిరుగుతోంది: స్టార్ హీరోయిన్ కామెంట్స్
మొదట దక్షిణాది చిత్రాల్లో నటించి స్టార్ ఇమేజ్ను తెచ్చుకున్న నటి తాప్సీ. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించి పాపులరిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో కలిసి నటిస్తోన్న తాప్సీ ఇటీవల నిర్మాతగా కూడా అవతారం ఎత్తి 'వీక్ ధక్' అనే హిందీ చిత్రాన్ని నిర్మించింది. బైక్ రైడ్ ఇతివృత్తంతో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం ఇది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే తాజాగా విజయవాడలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ ప్రస్తుత సినీ పరిశ్రమపై విమర్శలు చేసింది. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) సినిమా అనేది ప్రస్తుతం స్టార్స్ చుట్టూనే తిరుగుతోందని విమర్శించింది. ఇక్కడ ప్రముఖ నటులకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోందని, ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ఇది చాలా విచారించదగ్గ విషయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను ఓ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నప్పుడు సహనటుల అర్హత ఏమిటన్నది చూడనని చెప్పింది. అయితే స్టార్స్‌తో లేని చిత్రాలను ఓటీటీలోకి నెట్టాలని చూస్తున్నారని, అలాంటి భావన సినిమాకు మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెద్ద చిత్రాలు చిన్న చిత్రాలను మరుగున పడేస్తున్నాయని.. ఈ పరిస్థితి మారాలని తాప్సీ పేర్కొంది. (ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!) -
ముంబయిలో ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించా: స్టార్ హీరోయిన్
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. అగ్ర హీరోలతో పాటు చాలా చిత్రాల్లో నటించింది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ సినీరంగంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమా బయట వాళ్లకి అందమైన ప్రపంచం అందులోకి దిగితేనే లోతు ఎంతనేది తెలుస్తుందని అన్నారు. ఈ రంగంలో రాణించడం అంత సులభం కాదు.. ముఖ్యంగా నటీమణులు ఎన్నో అగాధాలను అధిగమించిన తర్వాతే అందమైన సినిమా లోకాన్ని అనుభవించడం సాధ్యమవుతుందన్నారు. తన పరిస్థితి అలాంటిదే అని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. కోలీవుడ్‌లో తడయార చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నమో ఏదో, ధీరన్ అధికారం ఒండ్రు, దేవ్, ఎన్జీకే చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా అయిలాన్, కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్–2 చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో అయిలాన్ చిత్రం సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. (ఇది చదవండి: 'బిగ్‌బాస్ 7' ఫస్ట్ కెప్టెన్‌గా రైతుబిడ్డ.. కానీ అతడిని గాయపరిచాడు!) దక్షిణాదిలో అగ్రకథానాయకగా రాణిస్తున్న రకుల్‌ప్రీత్‌సింగ్ సినిమాలో నటిగా ఎదగడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నట్టు ఇంటర్వ్యూలో పేర్కొంది. అందులో చిన్న తనంలోనే సినీ రంగప్రవేశం చేయాలని కలలు కన్న అమ్మాయినని పేర్కొంది. అయితే సినిమా ఇండస్ట్రీ గురించి ఏమి తెలియని రోజుల్లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించాను. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలు, అలా గట్టిగా రంగప్రవేశం చేసినట్లు చెప్పింది. చాలామంది మాదిరిగానే ఈ రంగంలో ఉన్న ఎత్తుపల్లాలను, నిరాకరింపులను చవి చూశానని చెప్పింది. సినిమాల్లో నటించాలన్న బలమైన కోరిక కారణంగా తల్లిదండ్రులను వదిలి ముంబయికి చేరుకుని ఒంటరి జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. అదే తాను ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అని పేర్కొంది. ఆదిలో అందరి మాదిరిగానే ఆ విషయం కోసం క్యూలో నిలబడి అవకాశాల కోసం కాస్టింగ్ ఏజెంట్లకు, దర్శకులకు ఫోన్ చేసేదానని చెప్పింది. అలా ఎంపికైన చిత్రాల్లో చివరికి వేరే వాళ్లు నటించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. పయనంలో ఎదురైన సమస్యలు తనకు మంచి పాఠాన్ని నేర్పించాలని కుటుంబ ప్రోత్సాహం లేకపోతే తానీ స్థాయికి చేరుకోవడం సాధ్యం కాదని అంటోది రకుల్ ప్రీత్ సింగ్. (ఇది చదవండి: టీడీపీ సత్యనారాయణపై నటి రాధిక సీరియస్.. మంత్రి రోజాకు మద్దతు) -
నేడు సినీ మార్గదర్శకుడు కేవీ రెడ్డి వర్ధంతి
సినిమాకు ఒక విధానం ఉందనీ, ఆ విధానానికి ఒక శాస్త్రం ఉందనీ, దాన్ని అనుసరించే సినిమాలు తీయాలని చెప్పి, చేసి చూపిన దర్శక మేధావి కేవీ రెడ్డి. సరైన స్క్రిప్టు సినిమాకు ముఖ్యమనీ, స్క్రీన్‌ప్లే సిద్ధమైతే సినిమా మూడొంతులు పూర్తయినట్టేనని నిరూపించిన దక్షిణ భారతదేశ దర్శకుల్లో అగ్రగణ్యులు. దర్శకునిగా కేవీ రెడ్డి మూడు దశా బ్దాల కాలంలో తీసిన సినిమాల సంఖ్య కేవలం 14. తమిళ, హిందీ వెర్షన్లతో కలిపితే 18. వీటిలో 5 పౌరాణికాలు, నాలుగు జానపదాలు, 3 సాంఘికాలు, రెండు చారిత్రకాలు ఉన్నాయి. ఆయన పేరు చెప్పగానే ‘మాయాబజార్’, ‘పాతాళభైరవి’, ‘గుణసుందరి కథ’, ‘దొంగ రాముడు’ గుర్తొస్తాయి. కేవీ 1937లో తన మిత్రుడు మూలా నారాయణస్వామి భాగ స్వామిగా ఉన్న ‘రోహిణీ పిక్చర్స్’లో ప్రొడ క్షన్ ఎగ్జిక్యూటివ్ గా చేరడంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. అప్పట్లో రోహిణీ పిక్చర్స్ హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’ (1938) తీసింది. ఇక్కడే ఆయనకి బీఎన్ రెడ్డి, సముద్రాల, నాగిరెడ్డిలతో పరిచయమైంది. తర్వాత వీరంతా బయటికి వచ్చి వాహినీ పిక్చర్స్ స్థాపించారు. వాహినీ పతాకంపై బీఎన్ తీసిన ‘వందేమాతరం’ (1939), ‘సుమంగళి’ (1940), ‘దేవత’ (1941) చిత్రాలకు కేవీ సహాయ దర్శకులుగా చేశారు. దేవత తరువాత కేవీకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అది మూలా నారాయణస్వామి పెట్టుబడితో తీసిన ‘భక్తపోతన’ (1942). అది రజతోత్సవాలు జరుపుకుంది. ‘గుణసుందరి కథ’ (1949) విజయం ఇచ్చిన ప్రేరణతో విజయావారికి మరో అద్భుత జనరంజకం ‘పాతాళభైరవి’ (1951) తీశారు. ‘మాయాబజార్’ (1957) ఒక చరిత్రను సృష్టించింది. కేవీ దర్శకత్వ ప్రతిభకు, పకడ్బందీ స్క్రీన్ ప్లేకు ఈ చిత్రం ఒక తిరుగులేని సిలబస్. తెలుగు చిత్ర రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కేవీ రెడ్డి (కదిరి వెంకటరెడ్డి) 1912 జులై 1న అనంతపురం జిల్లా తాడిపత్రిలో పుట్టారు. 1972 సెప్టెంబర్ 15న కన్నుమూశారు. కేవీ మనమధ్య లేక పోయినా ఆయన కళకు, వ్యాపారానికి సమన్వయం చేస్తూ తీసిన చిత్రాలు చూస్తున్నంత కాలం చిరంజీవిగా నిలిచే ఉంటారు. తెలుగు సినిమా రంగంలో ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. – హెచ్. రమేష్ బాబు, చలనచిత్ర పరిశోధకులు (నేడు కేవీ రెడ్డి వర్ధంతి) -
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’మూవీ పబ్లిక్ టాక్
-
మీ రొమాన్స్ కి దణ్ణం...వాళ్ళను ఫాలో అవ్వండి
-
చిరంజీవికి ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్
సాక్షి, ఢిల్లీ: రాజకీయాలు, సినీ రంగంలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. సినిమా స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ అని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో.. ‘సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది’ అని తెలిపారు. సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల… — Vijayasai Reddy V (@VSReddy_MP) August 10, 2023 అలాంటి వారికి హాట్సాఫ్.. ఇదే సమయంలో.. ‘కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ....లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్’ అంటూ కామెంట్స్ చేశారు. కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ....లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి… — Vijayasai Reddy V (@VSReddy_MP) August 10, 2023 ఇది కూడా చదవండి: చిరు లీక్స్ అందుకే.. ఆ భయంతోనే బీజేపీకి బ్రదర్స్ సరెండర్: కేఏ పాల్ సంచలన ఆరోపణలు -
అమ్మాయిలు ఎక్కువగా ప్రభాస్ ని ఎందుకు ఇష్టపడతారంటే..
-
సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్, పాన్-ఇండియా యాక్టర్ సమంత రూత్ ప్రభు ఇటీవల సినిమాలకు విరామం ప్రకటించింది. మైయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికే సమంత రూత్ ప్రభు సినిమాలకు దాదాపు ఏడాది పాటు విరామానికి సిద్ధమైందని అంచనా. ఈ నేపథ్యంలో ఈ బ్రేక్ వల్ల ఆమె ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడనుందని సమాచారం. సమంత రూత్ ప్రభు సినిమాల నుండి విరామం కారణంగా 12 కోట్ల రూపాయల మేర భారీగా నష్టపోనుందని అంచనా. నిజానికి, సమంత ఈ బ్రేక్‌కి ముందే తన పెండింగ్ వర్క్ షెడ్యూల్‌లన్నింటినీ పూర్తి చేసింది. అలాగే కొత్త ప్రాజెక్ట్‌లను, సినిమాలు దేనికీ ఒకే చెప్పలేదు.అంతేకాడదు నిర్మాతల నుండి ఏదైనా పెండింగ్ అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ ఈ విరామంలో దాదాపు రూ. 12 కోట్లు లేదా అంతకంటే ఎక్కువనని మీడియా రిపోర్ట్‌ల ద్వారా తెలుస్తోంది. సమంత సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 3.5 నుండి రూ. 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. దీనికితోడు ఎండారస్మెంట్ల ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది.ఈ లెక్కన దాదాపు రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. అయితే బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్ కు వెళ్ళిపోయి ధ్యానంలో మునిగిపోయింది. ప్రశాంతత,ధ్యానం కోసం కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్‌లో సేదతీరుతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) -
GST Council : సినిమా హాళ్లలో తినుబండారాలపై జీఎస్టీ మోత!
న్యూఢిల్లీ: ప్రముఖ కేన్సర్ ఔషధం డినుటుక్సిమాబ్ను వ్యక్తులు దిగుమతి చేసుకుంటే దానిపై 12 శాతం ఐజీఎస్టీని మినహాయించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించనుంది. ఈ నెల 11న సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్ దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. అలాగే, మల్టీప్లెక్స్‌లలో ఆహారం, పానీయాల విక్రయాలపై 5 శాతం జీఎస్టీ అంశాన్ని కూడా తేల్చనుంది. 18 శాతం కాకుండా రెస్టారెంట్ సర్వీస్ మాదిరే 5 శాతం పన్నును అమలు చేయాలని ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రేటు అమలు చేస్తుండడం గమనించొచ్చు. యుటిలిటీ వాహనాలపై 22 శాతం కాంపన్సేషన్ సెస్సు వేటికి వర్తించనుందనేది కూడా స్పష్టత రానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్, ప్రైవేటు సంస్థలు ప్రారంభించే శాటిలైట్ సేవలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకోనుంది. అరుదైన వ్యాధుల చికిత్సలో భాగంగా దిగుమతి చేసుకునే ప్రత్యేక ఔషధాలు, ఔషధాల తయారీలో వినియోగించే ఆహారం (ఎఫ్ఎస్ఎంపీ)పై ప్రస్తుతం ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) 5–12 శాతం మధ్య ఉంది. ఇవి ఖరీదైన మందులు కావడంతో రోగులపై ఎంతో భారం పడుతోంది. దీంతో ఐజీఎస్టీని మినహాయించాలనే అభ్యర్థన కౌన్సిల్ ముందుకు రానుంది. కేంద్ర, రాష్ట్రాల పన్నుల అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ ఈ అంశాలపై కౌన్సిల్‌కు మంగళవారం నాటి సమావేశంలో స్పష్టత ఇవ్వనుంది. ఆన్లైన్ గేమింగ్‌పై మంత్రుల గ్రూప్ నివేదిక, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుపైనా కౌన్సిల్ చర్చించనుంది. 11 పర్వత ప్రాంతాల రాష్ట్రాలకు బడ్జెటరీ మద్దతు కింద సీజీఎస్టీని పూర్తి మేర, ఐజీఎస్టీలో 50 శాతం రీయింబర్స్మెంట్ (తిరిగి చెల్లించడం) ఇవ్వాలనే డిమాండ్‌పై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కార్లపై స్పష్టత ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)పై 28 శాతం జీఎస్టీకి అదనంగా 22 శాతం కాంపెన్సేషన్ సెస్సు అమల్లో ఉంది. కానీ, అన్ని రకాల యుటిలిటీ వాహనాలు అంటే..ఎస్‌యూవీలతోపాటు మల్టీ యుటిలిటీ వెహికల్స్ (ఎంయూవీ), క్రాసోవర్ యుటిలిటీ వెహికల్స్ (ఎక్స్‌యూవీ)పైనా 22 శాతం కాంపెన్సేషన్ సెస్సు అమలు చేయాలంటూ ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేసింది. 4 మీటర్ల పొడవు, 1,500సీసీకి మించిన ఇంజన్ సామర్థ్యం, 170ఎంఎం కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వాటికి ఈ సెస్సును అమలు చేయాలని సూచించింది. డినుటుక్సిమ్యాబ్ ఔషధం ఖరీదు రూ.36 లక్షలుగా ఉండడంతో, రోగులు క్రౌడ్‌ఫండింగ్ సాయం ద్వారా దిగుమతి చేసుకోవాల్సి వస్తుందంటూ, ఐజీఎస్టీని మినహాయించాలని ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వరంగ సంస్థలైన ఇస్రో, యాంత్రిక్స్ కార్పొరేషన్ (ఏసీఎల్), న్యూ స్పేస్ ఇండియా (ఎన్ఎస్ఐఎల్)ను జీఎస్టీ నుంచి మినహాయించి, ప్రైవేటు సంస్థలు చేసే శాటిలైట్ ప్రయోగ సేవలపై 18 శాతం జీఎస్టీ విధించాలనే ప్రతిపాదన కూడా ఉంది. చదవండి : విడుదల కాకుండానే..మెటా ‘థ్రెడ్స్’కు ఎదురు దెబ్బ! -
మహేష్ బాబును ఫాలో అవుతున్న చిరంజీవి
-
మహేష్ బాబు ప్రభాస్ స్థానాల్లో రవితేజ విజయ్ దేవరకొండ
-
ఇండియా చెరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమా ఊహించని రిస్క్ చేయబోతున్న రాజమౌళి
-
ఈ సంవత్సరంలో 10 సినిమాలు రాబోతున్నాయి
-
నేను ఫామిలీ కి ఎందుకు వాల్యూ ఇవ్వనంటే
-
ఒక అడవి జంతువి కి గ్యాంగ్ స్టార్ మధ్యలో క్రాస్ బ్రీడ్ మానస్తత్వం నది అందుకే నేను ఇలా
-
కలర్ ఫోటో సుహాసిని విలన్ ని చేసిన కీర్తి సురేష్
-
బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అవుతున్న వెంకటేష్
-
AAA Cinemas Tour Video: AAA సినిమాస్ ధియేటర్ టూర్
-
ప్రాజెక్ట్ K లో కమల్ హాసన్ లెక్కలు ఇవే
-
ప్రభాస్ నో ప్రమోషన్స్... అయినా దేశం అంతా ఆదిపురుష్ మేనియా
-
రవితేజ రెమ్యూనరేషన్ అంతా
-
భగవంత్ కేసరి తరువాత కాజల్ రిటైర్
-
అప్పుడే మహేష్ సినిమా రిలీజ్ డేట్ చెప్పేసిన రాజమౌళి
-
ముల్లోక వీరుడిగా చిరంజీవి?
-
స్పై మొయివే పాన్ ఇండియా కోసం సొంత వంకాయ ల తో గొడవకు దిగిన నిఖిల్
-
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కాజల్.. కారణం ఇదేనా?
టాలీవుడ్ చందమామ కాజల్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన స్నేహితుడు, ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహమాడి.. ఆ తర్వాత ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక యంగ్ మదర్‌గా తను ఆస్వాదిస్తుంది. తన బిడ్డపై శ్రద్ధ చూపడంలో ఎక్కడా రాజీపడకుండా.. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూనే గతంలో తను ఒప్పుకున్న సినిమాలు చేస్తూ వస్తుంది. (ఇదీ చదవండి: నాడు అర్జున్ రెడ్డి, నేడు యానిమల్.. ఇదీ మామూలు అరాచకం కాదు) తాజాగా కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం తన బాబు (నీల్) అని తెలుస్తోంది. సినిమాల్లో ఉంటే నిత్యం బాబుకు దూరంగా ఉండాల్సి వస్తుంది. బాబు ఎదుగుతున్న వేళ.. తల్లి ప్రేమను అందించాలని, అది తన బాధ్యతని కాజల్ తెలుపుతుందట. తన భర్త కిచ్లూ కూడా ఇదే చెబుతున్నారట. ఈ విషయంపై త్వరలో అఫిషయల్‌గా కాజల్ ప్రకటించనున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో కూడా ఇదే టాక్ వినిపిస్తుంది. కానీ నిజం తెలియాలంటే కాజల్ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం కమల్ హాసన్ 'భారతీయుడు-2' , బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమాలలో నటిస్తుంది. ఇదే నిజం అయితే..! కాజల్ బ్యూటీకి చివరి సినిమా బాలయ్యదే. (ఇదీ చదవండి: మొగలి రేకులు నటి లహరి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) -
పాన్ ఇండియా ని షేక్ చేస్తున్నారు
-
టాలీవుడ్ లోకి ఎంట్రీ