మొదట దక్షిణాది చిత్రాల్లో నటించి స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకున్న నటి తాప్సీ. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించి పాపులరిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో కలిసి నటిస్తోన్న తాప్సీ ఇటీవల నిర్మాతగా కూడా అవతారం ఎత్తి 'వీక్ ధక్' అనే హిందీ చిత్రాన్ని నిర్మించింది. బైక్ రైడ్ ఇతివృత్తంతో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం ఇది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే తాజాగా విజయవాడలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ ప్రస్తుత సినీ పరిశ్రమపై విమర్శలు చేసింది.
(ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్)
సినిమా అనేది ప్రస్తుతం స్టార్స్ చుట్టూనే తిరుగుతోందని విమర్శించింది. ఇక్కడ ప్రముఖ నటులకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోందని, ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ఇది చాలా విచారించదగ్గ విషయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను ఓ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నప్పుడు సహనటుల అర్హత ఏమిటన్నది చూడనని చెప్పింది. అయితే స్టార్స్‌తో లేని చిత్రాలను ఓటీటీలోకి నెట్టాలని చూస్తున్నారని, అలాంటి భావన సినిమాకు మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెద్ద చిత్రాలు చిన్న చిత్రాలను మరుగున పడేస్తున్నాయని.. ఈ పరిస్థితి మారాలని తాప్సీ పేర్కొంది.
(ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!)
Comments
Please login to add a commentAdd a comment