అందువల్లే హీరోయిన్ ఛాన్స్ రాలేదు: అనసూయ | Anasuya Bharadwaj Comments On not Getting Heroine Chance | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: అప్పటిలా లేను.. చాలా మారిపోయా: అనసూయ

Published Sat, Nov 4 2023 1:38 PM | Last Updated on Sat, Nov 4 2023 1:59 PM

Anasuya Bharadwaj Comments On not Getting Heroine Chance - Sakshi

యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి.. వెండితెరపై విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తోన్న నటి అనసూయ. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో అనసూయ రేంజ్ పూర్తిగా మారిపోయింది ఇటీవలే ప్రేమ విమానం చిత్రంతో అభిమానులను అలరించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైన అనసూయ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.‘అత్తారింటికి దారేది’ సినిమాలోని పాటలో నటించకపోవడానికి గల కారణాన్ని వివరించారు.

(ఇది చదవండి: స్టార్ హీరో కూతురి పెళ్లి.. మొదలైన సందడి..!)

అనసూయ మాట్లాడుతూ.. 'అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో అవకాశం వచ్చింది. అయితే చాలా మంది హీరోయిన్స్‌ ఉన్నారని తెలిసి నేను చేయనని చెప్పా. ఎందుకంటే గుంపులో నటించడం నాకు నచ్చదు. నాకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటా. అందుకే ఆ పాటకు నో చెప్పా. ఆ సమయంలో చాలా మంది నన్ను విమర్శించారు. నేను నో చెప్పడం తప్పు కాదు.. నా పద్ధతి సరైంది కాదేమో అని నాకనిపించింది. మొదటి నుంచి ముక్కుసూటి మనిషిని అందుకే కొంచెం కఠినంగా చెప్పేశా. అప్పుడు దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్‌ జరిగింది. అందుకే త్రివిక్రమ్‌కు సారీ చెప్పా' అని అన్నారు. 

హీరోయిన్ ఛాన్స్ రాకపోవడంపై స్పందిస్తూ..'షూటింగ్స్‌లో నా పని అయిపోగానే వెళ్లిపోతా. సినిమా అయ్యాక పార్టీలకు దూరం. అందువల్లే హీరోయిన్ ఛాన్సులు కోల్పోయా. అలా అయితేనే అవకాశాలు వస్తాయంటే వాటిని నేను ప్రోత్సహించను.  ఒకప్పుడు ఏదైనా అవకాశం వస్తే.. నాకే ప్రాధాన్యత ఉండాలని కోరుకునేదాన్ని. కానీ ఇప్పుడు కాస్తా మార్పు వచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా నటనతో గుర్తింపు వస్తుందనే నమ్మకం కలిగింది.'అని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: నాకు పుట్టుకతోనే సమస్య ఉంది.. కానీ తెలియలేదు: రేణు దేశాయ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement