Tollywood News
-
నటిపై లైంగిక వేధింపులు.. ప్రసాద్‌కు పెళ్లి కూడా అయిందా?
టాలీవుడ్లో ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ బెహరాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తనతో కలిసి నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు. అయితే ఆ తర్వాత ఆమెతో విడిపోయినట్లు తెలిపారు. మా ఇద్దరి సెట్ కాకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రసాద్ పేర్కొన్నారు.(ఇది చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్)కాగా.. మావిడాకులు వెబ్ సిరీస్‌తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా పెళ్లివారమండి లాంటి సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. -
ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ చిత్రం.. ట్రైలర్ వచ్చేసింది!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఆస్కార్ అవార్డ్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్‌ను సాధించింది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు.తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో జరిగిన సన్నివేశాలతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీని డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.Hear and watch out… From the first clap on the sets to the standing ovation at the Oscars stage, #RRRBehindAndBeyond brings it all to you. 🔥🌊❤️#RRRMovie In select cinemas, 20th Dec. pic.twitter.com/EfJLwFixFx— RRR Movie (@RRRMovie) December 17, 2024 -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ.. వీడియో షేర్ చేసిన చెర్రీ!
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. మేకర్స్ వరుస అప్డేట్స్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందించారు.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ పంచుకున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. చిత్రబృందంతో షూటింగ్లో పాల్గొన్న క్షణాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవలే 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పించగా.. టీజర్‌కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.#Gamechanger #JaanaHairaanSa @shankarshanmugh @advani_kiara @BoscoMartis @DOP_Tirru @MusicThaman @AalimHakim @ManishMalhotra pic.twitter.com/Ei3mMAgPHF— Ram Charan (@AlwaysRamCharan) December 10, 2024 -
'ఆ ప్రేమను మించింది మరొకటి లేదు'.. సమంత మరో పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే హన్నీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జోడీగా కనిపించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సామ్ ఇటీవల మరోసారి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్య- శోభిత పెళ్లి తర్వాత ఆమె చేసిన పోస్ట్‌పై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.కానీ అంతలోనే సమంత చేసిన మరో పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 'షాషా(పెట్ డాగ్) ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అది కాస్తా వైరల్ కావడంతో నెట్టంట చర్చ మొదలైంది. ఏదేమైనప్పటికీ సామ్‌కు మాత్రం తన పెట్ డాగ్ ప్రేమ కంటే ఈ లోకంలో మరేదీ లేదని చెబుతోంది.గతంలోనూ ప్రేమపై పోస్ట్గతంలో ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. "చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలను పరస్పరం కొనసాగిస్తారు. వీటిని నేను కూడా అంగీకరిస్తున్నాను. మీరు ప్రేమను పంచుతారు. నేను కూడా తిరిగి ఇస్తాను. కానీ కొన్నేళ్లుగా నేను నేర్చుకున్నది ఏంటంటే.. మనం ప్రేమను పంచే ఎదుటి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా ప్రేమను అందజేస్తాం. ఎందుకంటే ప్రేమ అనేది ఓ త్యాగం. మనకు అవతలి వైపు నుంచి ప్రేమ, అప్యాయతలు అందకపోయినా.. ఇప్పటికీ తమ ప్రేమను ధారపోస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు." అంటూ పోస్ట్ చేసింది. -
Pushpa 2: పుష్ప-2 ప్రభంజనం.. నైజాంలో తొలిరోజే ఆల్ టైమ్ రికార్డ్!
అల్లు అర్జున్ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను ఊపేస్తోంది. ఈనెల 5న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది. పుష్పరాజ్.. తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా సరే థియేటర్స్ దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనిస్తున్నాయి.మొదటి రోజే కలెక్షన్స్‌లో పుష్పరాజ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ వసూళ్లతో తిరుగులేని రికార్డ్‌ను సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఇప్పటికే కేవలం హిందీలోనే రూ.72 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలీవుడ్లోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.అయితే తాజాగా పుష్ప-2 మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూళ్లు సాధించినట్లు పుష్ప టీమ్ వెల్లడించింది. ఈ మేరకు పుష్ప-2 పోస్టర్‌ను విడుదల చేసింది. నైజాం రీజియన్‌లో ఒపెనింగ్ డే ఆల్‌టైమ్ రికార్డ్‌తో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.భారతీయ సినీ చరిత్రలో పుష్ప రికార్డ్భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద ఓపెనర్‌గా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ దెబ్బకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వరకు ఉన్న టాప్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్ డే నాడు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ ఉండేది.. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బీట్ చేస్తూ పుష్ప2 రూ. 294 కోట్ల కలెక్షన్లతో ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ ( రూ. 223 కోట్లు), మూడో స్థానంలో 'బాహుబలి2' (రూ.214 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కల్కి 2898AD (రూ. 191 కోట్లు),సలార్ (రూ. 178 కోట్లు), దేవర (రూ. 172 కోట్లు), కేజీఎఫ్2 (రూ. 160 కోట్లు),లియో (రూ. 148 కోట్లు), ఆదిపురుష్ (రూ. 140 కోట్లు), సాహో (రూ. 130 కోట్లు), జవాన్ (రూ. 129.5 కోట్లు) ఉన్నాయి.ALL TIME RECORD in Nizam ❤️🔥WILDFIRE BLOCKBUSTER #Pushpa2TheRule collects a share of 30 CRORES on Day 1 making it the biggest opener in the region 💥💥#RecordRapaRapAA 🔥#Pushpa2BiggestIndianOpener RULING IN CINEMAS Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/Xqt3Mmzw5g— Pushpa (@PushpaMovie) December 6, 2024 -
రెడ్ గులాబీలా మెరిసిపోతున్న నభా నటేశ్.. యూత్ ఐకాన్‌గా లైగర్ భామ!
మాల్దీవుస్‌లో చిల్ అవుతోన్న హన్సిక..బ్లూ డ్రెస్‌లో సోనాలి బింద్రే హోయలు..వైట్ డ్రెస్‌లో అనన్య నాగళ్ల బ్యూటీ లుక్స్..యూత్ ఐకాన్‌గా లైగర్ భామ అనన్య పాండే..శారీలో జాన్వీకపూర్ సిస్టర్ ఖుషీకపూర్ హోయలు..రెడ్ గులాబీ మెరిసిపోతున్న నభా నటేశ్.. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
బండ్ల గణేశ్ సినిమాకు ఓకే చెప్పా.. కానీ మోసం చేశాడు: టాలీవుడ్ కమెడియన్
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తిరుపతి ప్రకాశ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్ స్టార్ హీరోలైనా నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్, బాలయ్య, మోహన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్స్ అందరితో కలిసి పనిచేశారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తప్ప దాదాపు అందరితో సినిమాలు చేశానని వెల్లడించారు. ప్రస్తుతం సీరియల్స్‌లో చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ కెరీర్లో తనకెదురైన అనుభవాలను పంచుకున్నారు.తాను సినిమాల్లో నటించే రోజుల్లో బండ్ల గణేశ్, తాను ప్రాణ స్నేహితులమని ప్రకాశ్ తెలిపారు. ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించామని పేర్కొన్నారు. అయితే బండ్ల గణేశ్ నిర్మాత అయ్యాక ఆయన సినిమాల్లో నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓ సినిమాకు డేట్స్ తీసుకుని నాకు అబద్ధం చెప్పారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.తిరుపతి ప్రకాశ్ మాట్లాడుతూ..'బండ్లగణేశ్ చేసిన ఒక్క సినిమాలో కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఒక సినిమాకు డేట్స్ తీసుకున్నాడు. దాదాపు 60 రోజులు షూట్ ఉంటుందని చెప్పాడు. రోజుకు 15 వేల పారితోషికం ఖరారు చేసుకున్నా. దీంతో వేరే సినిమాలకు నో చెప్పా. వినాయకచవితి పండగ మరుసటి రోజే కేరళలోని పొల్లాచ్చికి వెళ్లాలి. కానీ షూట్‌కు బయలుదేరాల్సిన ముందురోజే నాకు ఫోన్ కాల్ వచ్చింది. భారీ వర్షాలతో షూట్ క్యాన్సిల్ చేశామని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు. దీంతో షాక్ తిన్నా. మూడు సినిమాలు వదిలేశా. మూడు నెలలు ఖాళీగా ఎలా ఉండాలని ఆలోచించా. సరిగ్గా పది రోజుల తర్వాత శ్రీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. వెంటనే రాజమండ్రికి వెళ్లా. అక్కడ రోలర్ రవి నన్ను కలిశాడు. ఏం ప్రకాశ్ అన్న మంచి సినిమా వదిలేశావ్ అన్నాడు. ఏ సినిమా అని అడిగా. కల్యాణ్ బాబు మూవీ అన్నాడు. వర్షం వల్ల షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పారని చెప్పా. కానీ నాకంటే తక్కువకే ఎవరో దొరికారని నన్ను తీసేసినట్లు తెలిసింది. అప్పుడు నాకు బండ్ల గణేశ్‌పై కోపం వచ్చింది. ఆ తర్వాత మా నాన్న చనిపోయారని ఫోన్ చేశాడు. అవును అని చెప్పి వెంటనే పెట్టేశా' అని అన్నారు. -
9 నెలల తర్వాత ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇప్పుడు తాజా ట్రెండ్ ప్రకారం థియేటర్లలో సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. పెద్ద సినిమాలైతే కనీసం వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నాయి. కంటెంట్‌తో మరికొన్ని సినిమాలు రెండు, మూడు వారాలపాటు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా తెలుగులోనూ అలా వచ్చి ఇలా వెళ్లిన సినిమాలు చాలానే ఉన్నాయి.అలా ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి'. అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో చాలామందికి తెలియదు. ప్రియదర్శి, శ్రీద, మణికందన్ లాంటి టాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో దర్శనమిచ్చింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 23న తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ టాలీవుడ్లో పెద్దగా ఎక్కడా టాక్ వినిపించలేదు. రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీకి రావడంతో ఇదేప్పుడు తీశారంటూ ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో మూవీ రిలీజైనట్లు ఎవరికీ తెలియలేదు. కాగా.. ఓ బ్యాంకు దోపిడీ చుట్టూ తిరిగే కథాంశంగా నారాయణ చెన్న దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు వివేక్ రామస్వామి సంగీతమందించారు. -
కర్షియల్ క్రైమ్ థ్రిల్లర్‌గా 'వీకెండ్'
వి ఐ పి శ్రీ హీరో గా, ప్రియా దేషపాగ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం, వీకెండ్. ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐ డీ భారతీ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బీ రాము రచయిత మరియు దర్శకులు. ఒక పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న వీకెండ్ సినిమా షూటింగ్ నేడే మొదలైంది.దర్శక నిర్మాతల ఆధ్వర్యంలో చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్ ఆర్ ఐ లేళ జయ గారు మొదట కెమెరా రోల్ చేయగా, సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ గారు మొదట క్లాప్ కొట్టారు. షూట్ మొదలు పెట్టిన అనంతరం ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ అంతా చీరాల లోనే జరగబోతుందని చిత్ర దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. -
అంతర్జాతీయ వేదికపై టాలీవుడ్ మూవీ సత్తా.. అవార్డులు కొల్లగొట్టేసింది!
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ హాయ్ నాన్న. గతేడాది థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. శౌర్యువ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సలార్ పోటీని తట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది.తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. మెక్సికోలో జరిగిన ఐఎఫ్ఏసీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ స్కోర్, బెస్ట్ రైటర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సెట్ డిజైన్, బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ ఫీచర్ సౌండ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సౌండ్ విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. కాగా.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ చిత్రంగా హాయ్ నాన్న తెరకెక్కించారు. గతంలో న్యూయార్క్‌లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్- 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది.కథ విషయానికి వస్తే..ముంబైకి చెందిన విరాజ్ (నాని) ఓ ఫోటోగ్రాఫర్. కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే అతడికి పంచప్రాణాలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుతాడు. ప్రతిరోజు రాత్రి మహికి కథలు చెప్తుంటాడు విరాజ్. ఓరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానంటాడు.అమ్మ కథ వినాలని నెలంతా కష్టపడి క్లాస్‌లో తనే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటుంది. తర్వాత కథ చెప్పమని అడిగితే విరాజ్ చిరాకు పడటంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి మహిని కాపాడుతుంది యష్ణ. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అసలు యష్ణ ఎవరు? విరాజ్ సింగిల్ పేరెంట్‌గా ఎందుకు మారాడు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! Congratulations to the entire team of #HiNanna 🫶 This film truly deserves all the love it's receiving, nd it's heartwarming to see it being celebrated🥺❤️ pic.twitter.com/oAIJDNSMRX— Vyshuuᴴᴵᵀ ³ (@vyshuuVyshnavi) November 26, 2024 -
చంటబ్బాయ్ తాలూకా అంటోన్న వెన్నెల కిశోర్.. ఆసక్తిగా పోస్టర్
టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. చంటబ్బాయ్ తాలూకా అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు రచయిత మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై వెన్నపూస రమణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. వచ్చే నెల క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన పోస్టర్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. పోస్టర్ చూస్తుంటే డిటెక్టివ్ అండ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. Agent with entertainment is coming ❤️🔥#SreekakulamSherlockHolmes In Theatres on December 25th#VennelaKishore pic.twitter.com/EhXaLFX3DK— Adnan369 (@Adnan3693) November 25, 2024 -
అలా చేస్తే కచ్చితంగా లీడర్ అవుతారు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల వరుస మ్యూజింగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితంలో ఎలా నడుచుకోవాలో తన మాటల ద్వారా మోటివేట్ చేస్తున్నారు. తాజాగా ప్లే ఫూలిష్ అనే కాన్సెప్ట్‌తో మరో కొత్త మ్యూజింగ్‌ను విడుదల చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి.పూరి మ్యూజింగ్స్‌లో మాట్లాడుతూ.. 'ది ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ఫూలిష్.. ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి చాలామంది సైకాలజిస్టులు చెప్పే థియరీ ప్లే ఫూలిష్.. అది నీ బిజినెస్, జాబ్‌లో చాలామంది పోటీదారులు, సీనియర్స్, అనుభవజ్ఞులు ఉంటారు. నీకంటే బాగా సక్సెస్ అయినవాళ్లు ఉంటారు. వాళ్లందరినీ స్మూత్‌గా డీల్ చేసే థియరీ ప్లే ఫూలిష్. అంటే నిజంగానే ఫూల్‌లా ఉండటం కాదు. వాళ్ల ముందు తక్కువ నాలెడ్జ్ వాళ్లలా కనిపించడం. ఈ స్ట్రాటజీ మీరింకా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి చెప్పే మాటలు వినటం నేర్చుకుంటే మనం ఎంత మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? అనే విషయాలు అర్థమవుతాయి. నీ పోటీదారులను ఎప్పుడు శత్రువులుగా చూడొద్దు. వారిని మెంటార్స్‌గా భావించండి. అతను, నువ్వు ఓకే బిజినెస్ చేస్తున్నా.. అతనికంటే నీకు తక్కువ తెలుసనే ఫీలింగ్ రావాలి' అని సూచించారు.ఇదేమీ మానిపులేటేడ్ టాక్టిక్ కాదు.. వాదించడం మానేసి.. జీనియస్‌గా వ్యవహరించడం.. నువ్వు తక్కువ నాలెడ్జ్ వాడిలా కనిపించినప్పుడు.. అవతలివాళ్లు నిన్ను ఇబ్బందిగా భావించరు. నీపై ఫోకస్ పెట్టరు. నీకు తెలిసినా సరే బేసిక్స్ చెప్పమని అడగండి. అలా అడిగితేనే అవతలివాళ్లు ఆనందంగా సమాధానం చెబుతారు. వాళ్లు ఏమనుకుంటున్నారో వినాలి.. అప్పుడే ఎక్కువ నేర్చుకుంటాం. నీవల్ల వాళ్లకి ఇబ్బంది లేదని ఫీలవ్వాలి. అప్పుడే వాళ్ల స్ట్రాటజీలు మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో చర్చలు జరపాలంటే నాలెడ్జ్ చాలా అవసరం. అది నీ సీనియర్స్, పోటీదారుల నుంచి నేర్చుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది? వాళ్ల స్కిల్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. అందుకే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా చెబితే నేర్చుకుంటా అనేలా ఉండాలి. నీకే ఎక్కువ తెలిసినట్లు మాట్లాడితే.. అవతలి వ్యక్తి ఏది నీతో షేర్ చేసుకోడు. పైగా నువ్వు వాడి దృష్టిలో అహంకారిగా కనిపిస్తావు. అందరితో శత్రుత్వం మనకెందుకు? మీరు ఏదైనా అనుకుంటే అందులో సూచనలు చేయమని అడుగుతూ ఉంటే మంచిది. వాళ్లు మీ జీవితంలో సపోర్టింగ్ పర్సన్ అవుతాం. సోక్రటీస్ ఒకమాట చెప్పాడు. 'నాకు తెలిసింది ఏంటంటే.. ఏమీ తెలియదని'. మనం కూడా అదే ఫాలో అవ్వాలి. ఎప్పుడూ బిగినర్స్ మైండ్ సెట్‌తోనే ఉండాలి. అబ్రహాం లింకన్ ఇలాగే ఉండేవాడట. ఎదుటి వాడి జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మీకు ఎన్నో స్ట్రాటజీలు అర్థమవుతాయి. ప్లే ఫూలిష్ పవర్ఫుల్. ఈ ఆర్ట్‌లో మాస్టర్ అయితే మీరు లీడర్‌గా మంచి పొజిషన్లో ఉంటారు' అని చెప్పారు.కాగా.. ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని ఛార్మి కౌర్, పూరి జగన్నాధ్ నిర్మించారు. -
అలా చేస్తే సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకులను అలరించాడు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో బిగ్‌బుల్‌గా కనిపించారు.సినిమాల విషయం పక్కనపెడితే.. దర్శకుడు పూరి మ్యూజింగ్స్ పేరుతో మోటివేషనల్ సందేశాలు ఇస్తుంటారు. జీవితంలో తను అనుభవాలతో పాటు గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఇలాంటి వాటిని పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన మరో గొప్ప సందేశాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటారు. అదేంటో మనం కూడా వినేద్దాం.పూరి మ్యూజింగ్‌లో మాట్లాడుతూ..' చైనాలో లావోజు అనే గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన 571 బీసీలో జన్మించారు. ఆయనొక మంచి మాట చెప్పారు. నీ ఆలోచనలను గమనించు. ఎందుకంటే అవే నీ మాటలవుతాయి. నీ మాటలే నీ యాక్షన్స్ అవుతాయి. అవే నీ అలవాట్లు.. ఆ తర్వాత అదే నీ క్యారెక్టర్ అవుతుంది. మరి మనకు థాట్స్ ఎలా వస్తాయి. మనం రోజు దేన్నైతే చూస్తామో అవే గుర్తుకొస్తాయి. చదివే పుస్తకాలు, చూసే వీడియోలు, సంభాషణలన్నీ మన ఆలోచనలు మార్చేస్తాయి. పనికిరానివన్నీ చూస్తూ టైమ్ పాస్ చేస్తే అతి తక్కువ కాలంలో మీరు కూడా సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు. ' అని అన్నారు.ఆ తర్వాత..' మనం మొబైల్లో రోజు ఎన్నో చూస్తుంటాం. రోడ్డెక్కితే ఏదో ఒకటి మనం చూస్తుంటాం. వీటిలో మనం దేనికైనా ఎమోషనల్ అయితే.. అందులోనే మనం కొట్టుకుపోతాం. రోజు నాలెడ్జ్ పెంచుకోకపోయినా ఫర్వాలేదు.. నాన్ సెన్స్ తీసుకోకపోతే చాలు. అందుకే మంచిది, మనకు పనికొచ్చేది మాత్రమే తీసుకుంటే మంచిది. అప్పుడే మన థాట్స్ మారతాయి. మన క్యారెక్టర్‌తో పాటు రాత కూడా మారుద్ది. ' అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మన పూరి జగన్నాధ్ చెప్పినవి జీవితంలో పాటిస్తే సక్సెస్ అవ్వాలంటే తప్పకుండా పాటించాల్సిందే. -
కిల్లర్‌తో వస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్.. ఆసక్తిగా పోస్టర్స్!
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ లాంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ సుక్కు పూర్వాజ్. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో కిల్లర్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ కీలక పాత్రలో కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే కిల్లర్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో రివాల్వర్‌తో కనిపిస్తోన్న ఈ పోస్టర్స్ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమానుఏయు అండ్ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Venkata Suresh Kumar Kuppili (@poorvaaj) -
ఈ సినిమాతో నా డ్రీమ్ నెరవేరింది: మీనాక్షి చౌదరి
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న 'సంక్రాంతి వస్తున్నాం'. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదేంటో మీరు చూసేద్దాం.మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..'ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్. నాకు చిన్నప్పటి నుంచి మూడు డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడోది ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ రెండు కోరికలు నెరవేరాయి. ఈ మూవీతో నా మరో డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయింది. ఈ అవకాశమిచ్చిన అనిల్ రావిపూడి సార్‌కు థ్యాంక్స్.' అని అన్నారు.కాగా.. ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంచకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. నా 3 కోరికలలో ఒకటి ఈ సినిమాలో తీరింది - Actress #MeenakshiChaudhary#Venkatesh #AnilRavipudi @SVC_official #SankranthikiVasthunam #TeluguFilmNagar pic.twitter.com/aL1Bx7JERI— Telugu FilmNagar (@telugufilmnagar) November 20, 2024 -
టాలీవుడ్ స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.2 వేల ఫోన్‌తోనే!
టాలీవుడ్లో విలక్షణ నటుడు ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకొస్తుంది. అతను మరెవరో కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన నటనతో అలరించే పోసాని కృష్ణమురళి. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హావభావాలు, నటన చూస్తే చాలు చిరకాలంగా గుర్తుండిపోతాయి. అయితే సినీ ప్రియుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో చూసేద్దామా?ప్రస్తుతం కాలమంతా డిజిటల్ యుగం. చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమంతా తిరిగేసి రావొచ్చు. ప్రస్తుతం ఆలాంటి యుగమే నడుస్తోంది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండటం అంతా ఈజీ కాదు. కానీ అలా ఉండి చూపించారాయన. ఇప్పటికీ ఉంటున్నారు కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్పనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి. ఇప్పటికీ ఆయన వాడుతున్న నోకియా ఫోన్ విలువ కేవలం రెండువేల రూపాయలే. ఈ కాలంలో ఇంత సింపుల్‌గా జీవించడమంటే మామూలు విషయం కాదు.సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పోసాని కేవలం నోకియా ఫోన్‌కే పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాను టీవీలో వార్తలు, సినిమాలు, సీరియల్స్ చూస్తానని అంటున్నారు. కానీ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి గురించి తనకు తెలియదని పోసాని అన్నారు. ఈ నోకియా ఫోన్ రిలీజైనప్పుడు కొన్నదేనని ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఈ డిజిటల్ యుగంలో నోకియా ఫోన్ వాడటం అంటే గొప్పవిషయం మాత్రమే కాదు.. తప్పకుండా అభినందించాల్సిందే.పోసాని కృష్ణమురళి ఇంటర్నెట్ లేని పాత “నోకియా “ కీప్యాడ్ ఫోన్ వాడతారు.. వాట్సప్ అంటే ఏంటో తెలీదట.. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ గురించి తెలీనే తెలియదట 🙏🙏 pic.twitter.com/JsW6R4g4LW— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 19, 2024 -
అలా అయితేనే సినిమాలు చేసేందుకు ముందుకు రండి: ఆర్పీ పట్నాయక్
కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'కరణం గారి వీధి'. ఈ చిత్రాన్ని సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్స్ బ్యానర్‌పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం హేమంత్, ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ - 'కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పోస్టర్, టైటిల్ డిజైన్ చాలా కొత్తగా అనిపించింది. కొత్త టాలెంట్ ఎంత ఎక్కువగా వస్తే ఇండస్ట్రీకి అంత మంచిది. ఈ టీమ్ కూడా మంచి ప్రయత్నం చేసి ఉంటారని ఆశిస్తున్నా. ఈ సినిమా టీమ్‌కు మంచి పేరు రావాలి. కొత్త ఫిలిం మేకర్స్‌కు నాదొక చిన్న సలహా. సినిమా మీద కనీస అవగాహన, ప్యాషన్ ఉనప్పుడే సినిమాలు చేసేందుకు ముందుకు రండి. అప్పుడే మీరు చేసే సినిమా బాగుంటుంది'అని అన్నారు.నిర్మాత అడవి అశోక్ మాట్లాడుతూ..' మా కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన ఆర్పీ పట్నాయక్‌కు థ్యాంక్స్. ఆయన మ్యూజిక్‌తో పాటు ఆయన తెరకెక్కించిన సినిమాలంటే మాకు ఇష్టం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ - 'పల్లెటూరి నేపథ్యంగా సాగే కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలు ఉంటాయి. కరణం గారి వీధి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసి మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ..' లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా కరణం గారి వీధి సినిమాను రూపొందిస్తున్నాం. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటూ మంచి కామెడీతో మీరంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఆర్పీ సార్ తమ టైమ్ కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం' అని అన్నారు. -
రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్‌బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న టేస్టీ తేజ!
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. మరో నెల రోజుల్లోపే బిగ్ గేమ్ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. గత రెండు నెలలుగా బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సీజన్ 11వ వారానికి చేరుకుంది. గతవారంలో వెల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హరితేజ ఎలిమినేట్ అయింది. ఇక మరోవారం మొదలైందంటే చాలు నామినేషన్ల గొడవే. ఆ రోజంతా ఒకరిపై ఒకరు చిన్నపాటి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అలా ఈ వారంలో గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేషన్స్‌లో నిలిచారు.ఇవాల్టి ఎపిసోడ్లో హౌస్‌ను కాస్తా ఎమోషనల్‌గా మార్చేశాడు బిగ్‌బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రారంభంలోనే టేస్టీ తేజ ఫుల్ ఎమోషనల్‌గా కనిపించాడు. నేను ఏడిస్తే మా అమ్మకు నచ్చదు అంటూ ఆమెను తలచుకుని ఏడుస్తూ.. కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత కంటస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించారు. రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆమె కుమారుడితో పాటు రోహిణి వాళ్ల అమ్మను హౌస్‌లోకి పంపించారు. అక్కడికెళ్లిన రోహిణి కుమారుడితో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అందరూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమోను రిలీజ్ చేశారు. 💖 An Adorable Surprise for Rohini! 💖Bigg Boss house fills with warmth as Rohini receives an unforgettable, adorable surprise! Watch her heart-melting reaction to this sweet moment! ❤️#BiggBossTelugu8 #StarMaa #Nagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/ay1nLZdkdA— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 12, 2024 -
తెలుగు మార్కెట్ ని కబ్జా చేస్తున్న పొరుగు హీరోలు
-
ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది.. తప్పు చేశా: రాకేశ్
ఉయ్యాలా జంపాల, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే హీరోగా నటించారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరో రాకేశ్ వర్రే ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందని మాట్లాడారు. ఆ వివరాలేంటో చూసేద్దాం.రాకేశ్ వర్రే మాట్లాడుతూ.. 'నేను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఇండస్ట్రీలో సెట్ అవ్వడానికి చాలా రోజులు టైమ్ పట్టింది. కానీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేద్దామని పేకమేడలు ప్రాజెక్ట్ చేశా. ఆ తర్వాత నాకు అర్థమైంది. ఆ ప్రాజెక్ట్ చేయకుండా ఉండాల్సిందని. అదే నేను వేసిన రాంగ్ స్టెప్. నాకు ఒక సక్సెస్ వస్తే చాలనుకున్నా. కానీ ఇక్కడ మార్కెట్ అనేది ముఖ్యం. పేకమేడలు మాకు మూడేళ్లు పట్టింది. చేస్తూనే ఉన్నాం. ఎవరైనా మాకు బ్రాండ్ ఉండి ఉంటే ఏడాదిన్నరలోనే పూర్తి చేసేవాళ్లం. ఇక్కడ మనకు బ్రాండ్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. రాకేశ్ వర్రే ఒక బ్రాండ్ అయ్యాకే కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తా. తప్పకుండా చేస్తా. ఇది నేను నేర్చుకున్న గుణపాఠం. పేకమేడలు సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నా' అని అన్నారు. కాగా.. పేకమేడలు చిత్రానికి రాకేశ్ వర్రే నిర్మాతగా వ్యవహరించారు. కాగా.. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. అంతే కాకుండా ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడటం ట్రైలర్లోనూ చూపించారు. కాగా.. ఈ చిత్రంలో వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు. -
చిన్న సినిమాకు అరుదైన గౌరవం..!
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తన కుమారుడిని పాస్ మార్కులు తెచ్చుకునేందుకు ఓ తల్లి పడే తపనను ఈ చిత్రంలో చూపించారు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ మూవీని ఇండియన్ పనోరమ అధికారికంగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. పనాజీలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తారు. ఈ వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. దాదాపు 384 సినిమాల నుంచి ఎంట్రీలు రాగా.. తెలుగులో 35 చిన్న కథ కాదు మూవీని ఎంపిక చేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మొత్తం 25 చిత్రాలను ప్రదర్శించనున్నారు. -
శ్రీవారి సేవలో దిల్‌రాజు దంపతులు.. వీడియో వైరల్!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయాన్నే శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సతీసమేతంగా తిరుమల వెళ్లిన ఆయనకు ఆలయ పూజారులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా వస్తోన్న గేమ్ ఛేంజర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. డిసెంబర్లోనే రావాల్సిన గేమ్ ఛేంజర్.. చిరంజీవి విశ్వంభర పొంగల్ పోటీ నుంచి తప్పుకోవడంతో రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు. కాగా.. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. Ace Producer #DilRaju along with his family visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!!🙏✨#GameChanger #TeluguFilmNagar pic.twitter.com/v11nYzY8Lk— Telugu FilmNagar (@telugufilmnagar) October 24, 2024 -
ఆ విషయంలో వాళ్లిద్దరిని వేడుకున్నా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించిన అమెరికన్ స్పై-యాక్షన్ సిరీస్ సిటాడెల్కు ఇండియన్ వర్షన్‌గా ఈ సిరీస్ రూపొందించారు.అయితే ఈ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో ఈ సిరీస్‌లో నా ప్లేస్‌లో వేరొకరిని తీసుకోవాలని దర్శకులైన రాజ్, డీకేలకు చెప్పానని సామ్ తెలిపింది. అంతేకాకుండా తన స్థానాన్ని భర్తీ చేయగల నటిని కూడా సిఫార్సు చేశానని వెల్లడించింది. కానీ తన విజ్ఞప్తిని వాళ్లిద్దరు తిరస్కరించారని సమంత పేర్కొంది. (ఇది చదవండి: నాకు వారి సపోర్ట్ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత)సమంత మాట్లాడుతూ.. 'ఈ సిరీస్ నేను చేస్తానని నిజంగా అనుకోలేదు. అందుకే నా ప్లేస్‌లో మరొకరిని తీసుకోమని వారిని వేడుకున్నా. నేను చేయలేనని నేను కచ్చితంగా చెప్పా. ఆ పాత్రకు తగిన వారి పేర్లను కూడా పంపా. కానీ వాళ్లు నా స్థానంలో వేరొకరిని తీసుకునేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో తాను నటించినందుకు సంతోషంగా ఉంది. దర్శకులు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు' తెలిపింది.కాగా.. సమంత గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లి చికిత్స తీసుకుని కోలుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. -
ప్రభాస్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
టాలీవుడ్లో ఇటీవల ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరో బర్త్ డే రోజు వస్తే చాలు హిట్ సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. గతంలో మహేశ్‌బాబుతో పాటు పలువురు హీరోల సినిమాలు బిగ్ స్క్రీన్‌పై సందడి చేశాయి. ఇకపోతే ఈనెల రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే రానుంది. ఈనెల 23న ఆయన పుట్టిన రోజు జరుపుకోనున్నారు.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం మిస్టర్ ఫర్ఫెక్ట్ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 22న థియేటర్లలో డార్లింగ్ ప్రభాస్ సినిమా సందడి చేయనుంది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 2011లో వచ్చిన మిస్టర్ ఫర్ఫెక్ట్ మరోసారి బిగ్ స్క్రీన్‌పై అలరించనుంది.కాగా.. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. కె దశరధ్ దర్శకత్వం వహించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ మోహన్, నాసర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.The Darling we all adore is making a grand return! 😍Join us on October 22nd to celebrate our Rebel Star #Prabhas with #MrPerfect ❤️Theatres lo Dhol Dhol Dhol Bhale 😎🥁@directordasarad @ThisIsDSP @MsKajalAggarwal @taapsee @SVC_official @adityamusic pic.twitter.com/uGk4AY2nh7— Sri Venkateswara Creations (@SVC_official) October 15, 2024 -
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఫీల్ గుడ్ మూవీ
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సరికొత్త ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ రానుంది. ఈ సినిమాకు డైరెక్టర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్, దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్లపై ఆకుల విజయ లక్ష్మి, సరస్వతి మౌనిక ప్రోడక్షన్ నంబర్ -1 గా నిర్మిస్తున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విజయదశమి పర్వదిన సందర్బంగా మా సినిమాను స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అభిమానులతో పాటు, ఆ ఆధిపరాశక్తి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్‌కి దక్కుతాయని భావిస్తున్నాం అని తెలిపారు.కాగా.. ఈ సినిమాను తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో నటీనటులు వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు వెంకట్ గౌడ్ కథ అందించగా.. కర్రా నరేంద్ర రెడ్డి డైలాగ్స్ సమకూరుస్తున్నారు.