'మా నాన్న సూపర్ హీరో'.. ఎమోషనల్ టీజర్ వచ్చేసింది! | Tollywood Hero Sudheer Babu Latest Emotional Thriller Teaser Out Now | Sakshi
Sakshi News home page

Sudheer Babu: 'నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్లు కాదు'.. ఎమోషనల్ టీజర్ రిలీజ్!

Published Thu, Sep 12 2024 6:40 PM | Last Updated on Thu, Sep 12 2024 7:15 PM

Tollywood Hero Sudheer Babu Latest Emotional Thriller Teaser Out Now

హరోం హర తర్వాత సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. లూజర్‌ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ అభిలాష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్‌, క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధం కథాంశంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చాలా రోజుల తర్వాత పోకిరి నటుడు షాయాజీ షిండే టాలీవుడ్‌ అభిమానులను అలరించనున్నారు. 'నేను కష్టపడుతున్నాను కదా నాన్న.. ఇక నువ్వేందుకు పనిచేయడం' అన్న డైలాగ్ చూస్తుంటే ఈ మూవీ ఫుల్ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

టీజర్ చూస్తే 'అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడుక్కున్నట్లు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు!! లాంటి ఎమోషనల్ డైలాగ్స్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తండ్రీ, కుమారుల అనుబంధం, ఎమోషన్స్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది దసరా పండుగకు అక్టోబర్ 11న థియేటర్లలో మా నాన్న సూపర్ హీరో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సాయిచంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, చంద్ర, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement