Sudheer Babu
-
మంచు ఫ్యామిలీ మెంబర్స్ పై 3 కేసులు : సీపీ సుధీర్ బాబు
-
మహేష్ బాబు మేనల్లుడి పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
కుమారుడి బర్త్ డే.. వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇటీవలే మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తండ్రి, కుమారుల కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ణ జోడీగా హీరోయిన్గా నటించింది. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా సుధీర్ బాబు తన కుమారుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఆయన కుమారుడు చరిత్ మానస్ కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఈ రోజు నాకు ప్రత్యేకమంటూ కుమారుడిపై ప్రేమను చాటుకున్నారు. చరిత్ మానస్ పుట్టినరోజు వేడుకలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా, సోదరి మంజుల కూడా సందడి చేశారు.కాగా.. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి కుమార్తె ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని బర్త్ డే వేడుకల్లో సుధీర్ బాబు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసింది. On your special day, I want you to know how much I love and cherish you. You're growing up to be an incredible individual! Happy birthday, cherry ❤️ @Just_Charith pic.twitter.com/7HGrRdno55— Sudheer Babu (@isudheerbabu) November 22, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. నాన్న సెంటిమెంట్ స్టోరీతో తీసిన ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ దానికి రెండు రోజుల ముందే మరో ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. ఇంతకీ ఇదే మూవీ? ఎందులో అందుబాటులో ఉందనేది చూద్దాం.సుధీర్ బాబు నటించిన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. దసరాకు థియేటర్లలో రిలీజైంది. కాకపోతే అదే టైంలో నాలుగైదు సినిమాలు రిలీజ్ కావడం, ఇది స్లోగా సాగే ఎమోషనల్ కావడంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు నెలరోజులు పూర్తయ్యాయో లేదో ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తొలుత జీ5 ఓటీటీలో నవంబర్ 15న స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి సైలెంట్‌గా వచ్చేసింది. సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' స్టోరీ గురించి మాట్లాడుకుంటే.. రోజుల వయసులోనే తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), అనుకోని కారణాల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతాడు. ఓరోజు ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ జాని వల్ల దురదృష్టమే అని ఎప్పుడూ ఈసడించుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఇతడు జైలుకి వెళ్తాడు. సవతి తండ్రిని విడిచిపించాలంటే జానికి కోటి రూపాయలు అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే మిగతా కథ.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు మిథున్ చక్రవర్తి పర్స్ కొట్టేసిన దొంగలు) -
ఓటీటీలో నాన్న సినిమా.. అధికారిక ప్రకటన
యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. గత నెలలో దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎందుకనో ప్రేక్షకులు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తండ్రీకొడుకుల అనుబంధం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాని నవంబర్ 15 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే ఈ వీకెండ్లో వచ్చేస్తుంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' విషయానికొస్తే.. చిన్నతనంలో తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), కొన్ని పరిస్థితుల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి చిన్నప్పుడే దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతున్న ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ మంచిగా చూసుకోడు. ఓ రోజు పెంచిన తండ్రిని జైలు నుంచి విడిచిపించాలంటే కోటి రూపాయలు జానికి అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే కథ.(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్) -
'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ
ఈసారి దసరాకి అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్. వీటిలో వైవిధ్యభరిత చిత్రాలున్నాయి. ఇందులో ఓ మూవీనే 'మా నాన్న సూపర్ హీరో'. సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. నాన్న సెంటిమెంట్‌తో తీసిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ నాన్న.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హీరో అనిపించుకున్నాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ప్రకాశ్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోతుంది. రోజుల పిల్లాడిని అనాథశ్రమంలో ఉంచి, పనికోసం బయటకెళ్తాడు. ఊహించని విధంగా అరెస్ట్ అవుతాడు. 20 ఏళ్లు జైల్లోనే ఉండిపోతాడు. అంతలో పిల్లాడు జాని (సుధీర్ బాబు) పెరిగి పెద్ద వాడవుతాడు. ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) అనే స్టాక్ బ్రోకర్ దత్తత తీసుకుంటాడు. అయితే జాని రాకతో తన కుటుంబానికి అరిష్టం పట్టుకుందని శ్రీనివాస్‌కి కోపం. కానీ జానికి మాత్రం నాన్నే సూపర్ హీరో. తండ్రిపై విపరీతమైన ప్రేమ. ఊరంతా అప్పులు చేసే శ్రీనివాస్.. ఓ రాజకీయ నాయకుడికి కోటి రూపాయలు బాకీ పడతాడు. ఇంతకీ ఈ డబ్బు సంగతేంటి? చివరకు సొంత తండ్రి కొడుకులైన జాని-ప్రకాశ్ కలిశారా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు.. అరె మన దగ్గర ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ రావట్లేదా అని చాలామంది బాధపడుతుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోరిక తీర్చడానికి అన్నట్లు వచ్చిన మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా స్ట్రెయిట్‌గా కథ చెప్పి మెప్పించారు.చేయన నేరానికి పోలీసులకు దొరికిపోయి, కొడుక్కి ప్రకాశ్ దూరమవడంతో సినిమా ప్రారంభమవుతుంది. కట్ చేస్తే జాని, శ్రీనివాస్ పాత్రల పరిచయం. పెంపుడు తండ్రి అంటే కొడుకు జానికి ఎంత ఇష్టమో చూపించే సీన్స్. శ్రీనివాస్‌కి దత్త పుత్రుడు అంటే ఉండే కోపం, అయిష్టత. ఇలా నెమ్మదిగా ఈ రెండు పాత్రలకు అలవాటు పడతాం. ఇంతలో ప్రకాశ్ పాత్ర వస్తుంది. ఇక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. చిన్నప్పుడు విడిపోయిన తండ్రి-కొడుకు ఎలా కలుసుకుంటారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో కోటిన్నర లాటరీ టికెట్ అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ప్రకాశ్ దగ్గరున్న లాటరీ టికెట్‌ని కొట్టేయడానికి కొన్ని పాత్రలు ప్రయత్నిస్తూ ఉంటాయి. మరోవైపు తండ్రిని కాపాడుకునేందుకు పెంచిన కొడుకు పడే తాపత్రయం ఇలాంటి అంశాలతో సెకండాఫ్ నడిపించారు.రెండు గంటల సినిమా చూస్తున్నంతసేపు ఓ నవల చదువుతున్నట్లు ఉంటుంది. కానీ హీరోయిన్ సీన్స్, సెకండాఫ్ ప్రారంభంలో రాజు సుందరం ట్రాక్ నిడివి పొగిడించడం కోసం పెట్టారా అనే సందేహం కలుగుతుంది. ఇవి లేకపోయినా సరే సినిమా ఫ్లో దెబ్బతినదు. స్లో నెరేషన్ కూడా కొందరు ప్రేక్షకులకు ల్యాగ్ అనిపించొచ్చు. క్లైమాక్స్‌లోనూ అసలైన తండ్రి-కొడుకు కలుసుకున్నట్లు డ్రామా-ఎమోషన్స్ వర్కౌట్ చేయొచ్చు. కానీ సింపుల్‌గా తేల్చేశారా అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?సుధీర్ బాబు వరకు ఇది డిఫరెంట్ పాత్ర. ఇదివరకు బాడీ చూపిస్తూ ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇందులో మాత్రం సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే క్యారెక్టర్ బాగుంది కానీ ఈ పాత్రకు ఇంకాస్త డెప్త్, ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది అనిపించింది. సెకండాఫ్‌లో తండ్రిగా సాయిచంద్ తనదైన యాక్టింగ్‌తో జీవించేశాడు. మేజర్ సీన్స్ అన్నీ ఈ పాత్రల చుట్టే తిరుగుతాయి. దీంతో హీరోయిన్‌తో పాటు మిగిలిన పాత్రలకు పెద్ద స్కోప్ దొరకలేదు.దర్శకుడు మంచి ఎమోషనల్ కథ అనుకున్నాడు. అందుకు తగ్గ పాత్రధారుల్ని తీసుకున్నాడు. కానీ సినిమా తీసే క్రమంలో కాస్త తడబడ్డాడు. కానీ ఇలాంటి స్టోరీ కూడా తీయొచ్చనే అతడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎలాంటి కమర్షియల్ వాసనల జోలికి పోకుండా తీసిన డ్రామా సినిమా ఏదైనా చూద్దామనుకుంటే 'మా నాన్న సూపర్ హీరో'పై ఓ లుక్కేయండి. మరీ కాకపోయినా.. నచ్చేస్తుంది!-చందు డొంకాన -
తండ్రీ కొడుకుల ముక్కోణపు ప్రేమకథ: సుధీర్ బాబు
‘‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా యూనివర్సల్ పాయింట్‌తో రూపొందింది. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు మధ్య నడిచే ముక్కోణపు ప్రేమకథ అని చెప్పాచ్చు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను’’ అని సుధీర్ బాబు అన్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆర్ణ జోడీగా నటించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. వి సెల్యులాయిడ్స్, కామ్ ఎంటర్టైన్ మెంట్‌పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు పంచుకున్న విశేషాలు...⇒ అభిలాష్ చేసిన ‘లూజర్’ సిరీస్ చూశా.. బాగా నచ్చింది. తను ‘మా నాన్న సూపర్ హీరో’ కథ చెప్పినప్పుడు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. పూర్తిస్థాయిలో ఫాదర్ ఎమోషన్ ఉన్న సినిమాలు అరుదు. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు కథ ఇంతకుముందెన్నడూ రాలేదు. ‘మా నాన్న సూపర్ హీరో’ మొదటి చిత్రం. నా కెరీర్లో చాలా సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. మానవ సంబంధాలపై ఉన్న ఈ పాయింట్ కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. మొదటి ఆట నుంచే ఆడియన్ ్స, క్రిటిక్స్ నుంచి ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వస్తుందనే నమ్మకం ఉంది. ⇒ ‘హరోం హర’ సినిమాకి ముందే ‘మా నాన్న సూపర్ హీరో’ కి ఒప్పుకున్నా. అయితే ఫలానా జోనర్లో సినిమా చేయాలని నేనెప్పుడూ ప్రణాళిక వేసుకోను. ఒక నటుడిగా అన్ని జోనర్ సినిమాలు చేయాలి. నాకు వచ్చిన కథల్లో ఏది బాగుంటే అది చేస్తాను. అలా వచ్చిన కథే ‘మా నాన్న సూపర్ హీరో’. నాన్నపై కొడుకు ప్రేమని ‘యానిమల్’ సినిమాలో అగ్రెసివ్ అండ్ బోల్డ్‌గా చూపించినా జనాలకి నచ్చింది. కానీ, ‘మా నాన్న సూపర్ హీరో’ లో నాన్నమీద కొడుకుకి ఉన్న లవ్‌ని ప్రేమతో ప్రాజెక్ట్ చేస్తున్నాం. సన్నివేశాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. రియల్ లైఫ్‌లో మా నాన్నగారు చాలా క్రమశిక్షణ గల మనిషి. ఆయన క్రమశిక్షణ మా అక్కకి, నాకు స్ఫూర్తినిచ్చింది. ⇒ మహేశ్ బాబుగారు మా చిత్రం ట్రైలర్ చూసి మనసుని తాకింది అన్నారు. ట్రైలర్ చివర్లో వచ్చే మహేశ్ బాబు పేరు ఉన్న డైలాగ్ గురించి ప్రస్తావిస్తూ చాలా వినోదాత్మకంగా ఉందని చెప్పారు. నా సినిమాల గురించి ఇంత చెప్పడం ఇదే తొలిసారి. యువీ క్రియేషన్ ్స విక్కీ, వంశీ, సునీల్, నేను కలిసి 2002లో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లం. ఇప్పుడు వాళ్ల బ్యానర్లో నేను హీరోగా చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఎలాగైనా హిట్ కొట్టాలనే బాధ్యత ఉంది. వందశాతం హిట్ కొడతామనే నమ్మకం వచ్చింది. సాయిచంద్, సాయాజీ షిండేగార్లతో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ చూశాక నా నమ్మకాన్ని అభిలాష్ నిలబెట్టుకున్నాడనిపించింది. తను భవిష్యత్‌లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.. మంచి సినిమాలు తీస్తాడు. జై క్రిష్ సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. నా కెరీర్‌కి ఉపయోగపడే, వైవిధ్యమైన పాత్ర ఉంటే విలన్‌గా చేస్తాను. నా తర్వాతి సినిమా ‘జటాధరా’ నవంబరులో ్రపారంభం అవుతుంది. ఈ సినిమా తర్వాత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 70ఎంఎం బ్యానర్లో మరో చిత్రం చేస్తాను. -
మహేశ్ రిలీజ్ చేసిన 'మా నాన్న సూపర్ హీరో' ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. పేరుకి తగ్గట్లే నాన్న అనే సెంటిమెంట్‌తో ఈ సినిమా తీశారు. హీరోకి ఇద్దరు నాన్నలు ఉండటం అనే కాన్సెప్ట్‌తో టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: మెగా హీరో 'మట్కా' టీజర్ ఎలా ఉందంటే?)డబ్బు కోసం కొడుకుని మరొకరి అమ్మేస్తాడు ఓ తండ్రి. పెరిగి పెద్దయిన తర్వాత ఈ విషయం కొడుక్కి తెలుస్తుంది. ఆ తర్వాత కన్న తండ్రి, పెంచిన తండ్రితో ఎలాంటి జర్నీ సాగింది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఫుల్ ఆన్ ఎమోషనల్ రైడ్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కనెక్ట్ అయ్యేలా ఉంది.సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయాజీ షిండే, సాయిచంద్ తండ్రి పాత్రల్లో కనిపించారు. అభిలాష్ కంకర దర్శకుడు. అక్టోబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే దసరా రేసులో వేట్టయిన్, విశ్వం, జనక అయితే గనక సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు సూపర్ హీరో నాన్న పోటీలో ఉన్నాడు. మరి హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి) -
పెళ్లినాటి రేర్ ఫోటోలు పంచుకున్న సుధీర్ బాబు.. సందడిగా స్టార్ హీరోలు
-
సుధీర్ బాబు పెళ్లి వీడియో వైరల్.. మహేశ్ బాబే హైలెట్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పెళ్లి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో తన పెళ్లి వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను అభిమానులతో సుధీర్ పంచుకున్నారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: హీరోయిన్‌తో పెళ్లికి రెడీ అవుతున్న శింబుహీరో సుధీర్ బాబు.. సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె ప్రియదర్శినితో 2006లో వివాహం అయింది. అయితే, నాటి ఫోటోలకు తన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో' నుంచి ఒక పాటను తీసుకుని వీడియో రూపంలో క్రియేట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. అందులో సుధీర్ బాబు,ప్రియదర్శిని దంపతులను ఆశీర్వదిస్తున్న మహేశ్ బాబు ఫోటో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.నాడు పెళ్లిచూపుల ఫోటో షేర్ చేసిన సుధీర్సుధీర్ బాబు గతంలో కూడా వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ప్రియదర్శిని ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తుందెరో కాదు అంటూనే.. ప్రియదర్శినికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పిక్ కూడా పెళ్లిచూపుల ఫోటో అని, తన దగ్గర ఉన్న ఆమె మొదటి ఫోటో ఇదేనని ఆయన పేర్కొన్నారు.2010లో ఏ మాయ చేసావే చిత్రంతో ఒక సపోర్టింగ్ రోల్‌తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'మా నాన్న సూపర్ హీరో' అనే చిత్రంతో అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు సుధీర్ బాబు రానున్నారు. అభిలాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ఈ చిత్రం ఉండనుంది. ఈ మూవీలో సుధీర్ బాబు తండ్రిగా సాయిచంద్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) -
లగ్గం రెడీ
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, రోహిణి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 25న ఏషియన్ సురేష్ సంస్థ ద్వారా రిలీజ్ అవుతోంది. ఈ రిలీజ్ పోస్టర్‌ను ఆవిష్కరించి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు హీరో సుధీర్‌బాబు. ‘‘తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడతారు’’ అన్నారు రమేష్ చెప్పాల. ‘‘ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు వేణుగోపాల్ రెడ్డి. -
'మా నాన్న సూపర్ హీరో' నుంచి మరో సాంగ్ విడుదల
'హరోం హర' సినిమా తర్వాత సుధీర్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్గా నటిస్తున్నారు. లూజర్ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అక్టోబర్ 11న ఈ చిత్రం విడుదల కానుంది.తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ‘మా నాన్న సూపర్ హీరో’ ఉంటుంది. 'వేడుకలో..' అంటూ సాగే ఒక సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో రాజు సుందరం ఓ కీలక పాత్రలో నటిస్తూనే, కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయిచంద్, సాయాజీ షిండే, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకు సంగీతం: జై క్రిష్, కెమెరా: సమీర్ కల్యాణి. -
థ్రిల్లింగ్ జటాధర
సుధీర్‌బాబు హీరోగా రూ΄పొందనున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకుడు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మించనున్న ‘జటాధర’ సెకండ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘జటాధర’ కథ శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయికలో ఉంటుంది. ఈ రెండు ప్రపంచాలను ప్రేక్షకులు వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త అనుభూతిని ΄అందుతారు. ప్రేరణ అరోరాగారితో కలిసి ఈ సినిమా కోసం ప్రయాణం చేయటం గొప్ప అనుభూతి. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘జటాధర’ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తాం. ఈ సినిమాలో హీరోయిన్గా ఓ బాలీవుడ్ స్టార్ నటించనున్నారు. అలాగే ప్రతినాయకిపాత్రలో మరో బాలీవుడ్ నటి నటిస్తారు. 2025 శివరాత్రికిపాన్ ఇండియా ప్రేక్షకులను ఈ మూవీ అలరించనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సుధీర్ బాబు 'జటాధర'.. మరో ఇంట్రెస్టింగ్ లుక్
సుధీర్ బాబు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా 'జటాధర'. గతంలో ఈ సినిమాకు సంబంధించిన లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో పోస్ట్ రిలీజ్ చేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: అభయ్ ఎలిమినేట్ అయ్యాడుగా.. కొత్త చీఫ్ ఎవరంటే?)వచ్చే ఏడాది శివరాత్రికి థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కాంబోలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. కొత్త లుక్‌లో సుధీర్ బాబు సరికొత్తగా, శక్తివంతంగా కనిపిస్తున్నాడు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన 'మా నాన్న సూపర్ హీరో'.. అక్టోబరు 11న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక!) -
నాన్నను ఇంతవరకు హగ్ చేసుకోలేదు.. సుధీర్ బాబు ఎమోషనల్
-
సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
ఆ విషయం చెప్పినప్పుడు నాన్న హృదయం ముక్కలైంది: హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మా నాన్న సూపర్ హీరో. గురువారం (సెప్టెంబర్ 12న) ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి పోసాని నాగేశ్వరరావు గురించి చెప్తూ సుధీర్ స్టేజీపై ఎమోషనల్ అయ్యాడు.ఎంత ప్రేమ ఉన్నా..అతడు మాట్లాడుతూ.. 'మా నాన్నపై నాకెంత ప్రేమ ఉన్నా సరే ఇంతవరకు ఐ లవ్యూ చెప్పలేదు. హగ్ కూడా చేసుకోలేదు. లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు చూపించుకోలేను. ఇప్పటికీ ఎన్నోసార్లు వెళ్లి ఆయన్ను హత్తుకోవాలనిపిస్తుంటుంది కానీ ఆగిపోతుంటాను. అందుకే నా పిల్లల్ని హగ్ చేసుకుంటాను. ఎక్కువగా గొడవలుమా నాన్న ఎప్పుడూ, ఎవరిపైనా కోప్పడరు. నాకేమో చిన్నదానికే కోపం వచ్చేస్తుంటుంది. బాల్యంలో ఎక్కువగా గొడవలు పెట్టుకునేవాడిని. దాంతో అమ్మానాన్న.. నువ్వు మాకు పుట్టలేదు, అడవిలో దొరికావు అని చెప్పేవారు. 12వ తరగతికి వచ్చేదాకా అదే నిజమని నమ్మాను. మా ఫ్రెండ్స్‌తో కూడా నేను మా పేరెంట్స్‌కు పుట్టలేదంట, దొరికాను అని చెప్పేవాడిని.(చదవండి: 'మా నాన్న సూపర్ హీరో'.. ఎమోషనల్ టీజర్ వచ్చేసింది!) ఏడేళ్లపాటు కష్టపడ్డారునాకు ఏడేళ్ల వయసున్నప్పుడు నాన్న అప్పు చేసి మరీ పెస్టిసైడ్ షాప్ పెట్టారు. ఉదయం తొమ్మిదింటికి వెళ్లి రాత్రి 12 గంటలకు వచ్చేవారు. అలా ఏడేళ్లపాటు కష్టపడ్డారు. ఈరోజు ఇండియాలోనే పెద్ద డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగారు. ఆయన ఏం చేసినా మా సంతోషం కోసమే చేసేవారు. తను కష్టజీవి.సుధీర్ ఎమోషనల్నేను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు తన గుండె పగిలినంత పనైంది. అదృష్టవశాత్తూ ఇండస్ట్రీలో నాకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాను' అని సుధీర్‌బాబు భావోద్వేగానికి లోనయ్యాడు. మా నాన్న సూపర్ హీరో మూవీ అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.చదవండి: ఓడిన సోనియా.. గెలిచి చూపించిన నిఖిల్ -
'మా నాన్న సూపర్ హీరో'.. ఎమోషనల్ టీజర్ వచ్చేసింది!
హరోం హర తర్వాత సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్గా నటిస్తున్నారు. లూజర్ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధం కథాంశంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చాలా రోజుల తర్వాత పోకిరి నటుడు షాయాజీ షిండే టాలీవుడ్ అభిమానులను అలరించనున్నారు. 'నేను కష్టపడుతున్నాను కదా నాన్న.. ఇక నువ్వేందుకు పనిచేయడం' అన్న డైలాగ్ చూస్తుంటే ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే 'అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడుక్కున్నట్లు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు!! లాంటి ఎమోషనల్ డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తండ్రీ, కుమారుల అనుబంధం, ఎమోషన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది దసరా పండుగకు అక్టోబర్ 11న థియేటర్లలో మా నాన్న సూపర్ హీరో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సాయిచంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, చంద్ర, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడ్డుకునట్టు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయాయినట్టు కాదు!!A heartwarming tale coming this Dusshera#MNSHTeaser - https://t.co/ke3FnMyr9w#MaaNannaSuperHero grand release on Oct 11th@abhilashkankara @sayajishinde #SaiChand @jaymkrish… pic.twitter.com/asU6FJtUwe— Sudheer Babu (@isudheerbabu) September 12, 2024 -
దసరా బరిలో సుధీర్ బాబు.. ఈ సారైనా హిట్ కొడతాడా?
ఇటీవలే హరోం హర మూవీతో మెప్పించిన టాలీవుడ్ స్టార్ సుధీర్‌బాబు. తాజాగా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఇందులో ఆర్ణ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీసెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.తండ్రీ, తనయులు అనుబంధం నేపథ్యంలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీని రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు. అయితే రిలీజ్ డేట్‌ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం మానాన్న హీరో అని చిత్రయూనిట్ తెలిపింది. కాగా.. చిత్రంలో సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు.#MaaNannaSuperhero post production works underway.The emotional saga will hit the big screens during Dussehra. Release date announcement soon ❤🔥Stay tuned for more exciting updates 💥@isudheerbabu #SaiChand @sayajishinde @abhilashkankara @mahesh_films @vcelluloidsoffl… pic.twitter.com/AZQjpGRPF0— UV Creations (@UV_Creations) August 27, 2024 -
ప్రభాస్ స్థాయి వేరు.. నీలాంటి వారిని పట్టించుకోరు: సుధీర్ బాబు
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి చిత్రంపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ సినిమా తనకు నచ్చలేదని అన్నారు. అంతేకాదు కల్కిలో ప్రభాస్ లుక్ జోకర్లా అనిపించిందని కించపరిచేలా మాట్లాడారు. దీంతో అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ప్రభాస్‌ను ఉద్దేశించిన అతను చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు తారలు అర్షద్ వార్సీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.తాజాగా టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సైతం అర్షద్ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాస్ విషయంలో మీరు నిర్మాణాత్మకంగా విమర్శించినా ఫర్వాలేదు.. కానీ అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. ప్రొఫెషనలిజం లేని ఇలాంటి కామెంట్స్ నీలాంటి వారి నుంచి వస్తాయని ఊహించలేదని అన్నారు. ఇలా సంకుచిత మైండ్‌సెట్‌తో ఆలోచించే నీలాంటి వారిని ఆయన పట్టించుకోరని తెలిపారు. ఎందుకంటే ప్రభాస్ స్థాయి చాలా పెద్దదని సుధీర్ బాబు తన ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా..అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని రెబల్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.It's okay to criticize constructively but it's never okay to bad-mouth. Never expected the absence of professionalism from Arshad Warsi. Prabhas's stature is too big for comments coming from small minds..— Sudheer Babu (@isudheerbabu) August 20, 2024 -
మహాశివరాత్రికి జటాధర
సుధీర్‌బాబు హీరోగా నటించనున్న ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘జటాధర’. సూపర్ నేచురల్ ఫ్యాంటసీ అంశాలతో వెంకట్ కల్యాణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హిందీలో ‘రుస్తుమ్, టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ, ప్యాడ్‌మ్యాన్, పరి’లాంటి చిత్రాలను నిర్మించిన ప్రేరణ అరోరాతో కలిసి శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్‌లు ఈ సినిమాను నిర్మించనున్నారు.‘జటాధర’ను శనివారం ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంతో పాటు ఈ సినిమాను వచ్చే ఏడాది మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. ‘‘ఈ చిత్రంలో సుధీర్‌బాబు ఓ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. త్వరలోనే షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ట్రెండింగ్‌లో సుధీర్ బాబు ‘హరోంహర’
సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 14న థియేటర్స్‌లో విడుదలై మిక్స్డ్ టాక్ని తెచ్చుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రం దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫాంల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విశేష ఆదరణ సొంతం చేసుకొని టాప్ 1లో నిలిచింది. దేశవ్యాప్తంగా టాప్1లో ఉన్నట్లు తెలుపుతూ అమెజాన్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.హరోంహర కథేంటంటే..ఈ సినిమా కథంతా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని అంతా తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటారు. తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రమణ్యం(సుధీర్ బాబు). అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు.ఆ విషయం శరత్ తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్‌కి వార్నింగ్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మాఫియా లీడర్‌కు ఓ ఊరు మొత్తం ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'హరోం హర'. జూన్ 14న రిలీజైన ఈ సినిమాకు టాక్ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో సరిగ్గా నెల రోజులకు డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు.తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. అలాగే జియో సినిమాలో హిందీ వర్షన్ విడుదలైంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్గా మెప్పించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా సుమంత్ జి నాయుడు నిర్మించాడు.కథ విషయానికి వస్తే..1989లో కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కుమారుడు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. పొలాల్ని కబ్జా చేస్తూ అడ్డొచ్చినవారిని అంతం చేస్తుంటారు. ఆ ప్రాంతంలోని పాలిటెక్నిక్ కాలేజీలోకి సుబ్రమణ్యం(సుధీర్ బాబు) ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు. అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)ను ప్రేమిస్తాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. దీని ఎఫెక్ట్ సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు మూడునెలల్లో తన తండ్రి చేసిన అప్పులు తీర్చాల్సి ఉంటుంది. మరి ఆ సమయంలో హీరో ఏం చేశాడు? అప్పులు తీర్చాడా? తనపై కక్ష సాధించిన విలన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! -
ఓటీటీలో 'సుధీర్ బాబు' సినిమా.. నేడు సాయంత్రం నుంచే స్ట్రీమింగ్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం 'హరోం హర'. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా గతనెల 14న విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఆగష్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ఆహా ప్రకటించి మళ్లీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా తమ ఎక్స్ పేజీ వేదికగా కొత్త తేదీని ప్రకటించింది.'హరోం హర' మూవీని నేడు (జులై 15) సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆహా తెలుగు వెల్లడించింది. యాక్షన్ ప్యాక్డ్ మండే మూవీ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ తమ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయం తెలిపింది. నేడు సాయంత్రం 5 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న హరోం హర సినిమాను మిస్ కావద్దంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.డార్క్ కామెడీ పేరుతో పలు వీడియోల వల్ల వివాదంలో చిక్కుకున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కూడా 'హరోం హర' సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించాడు. తన యూట్యూబ్ ఛానల్లో ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ వల్ల అరెస్ట్ అయ్యాడు. దీంతో ఆహా ఓటీటీ సంస్థ సినిమా విడుదలను ఆపేసింది. అతడు నటించిన సీన్లను తొలగించి ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీని జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ జి.నాయుడు నిర్మించారు. -
ఓటీటీలో కనిపించని 'హరోం హర'.. అదే కారణమా?
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ హరోం హర. గతనెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీని జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ జి.నాయుడు నిర్మించారు.అయితే హరోం హర ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ముందుగా ప్రకటించినట్లుగా ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ హరోం హర ఓటీటీకి రాలేదు. అయితే సాంకేతికపరమైన సమస్యతోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. మరి ఈ రోజు ఆలస్యమైనా స్ట్రీమింగ్కు వస్తుందా? లేదా కొత్త తేదీని ప్రకటిస్తారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.