సుధీర్ బాబు పెళ్లి వీడియో వైరల్‌.. మహేశ్‌ బాబే హైలెట్‌ | Sudheer Babu Shared His Wedding Video As Part Of Ma Nanna Superhero Movie Vedukalo Song Challenge, Goes Viral | Sakshi
Sakshi News home page

Sudheer Babu Marriage Video: సుధీర్ బాబు పెళ్లి వీడియో వైరల్‌.. మహేశ్‌ బాబే హైలెట్‌

Published Sun, Sep 29 2024 8:32 AM | Last Updated on Sun, Sep 29 2024 1:29 PM

Sudheer Babu Sher His Wedding Photos

టాలీవుడ్‌ హీరో సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పెళ్లి సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ క్రమంలో తన పెళ్లి వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను అభిమానులతో సుధీర్‌ పంచుకున్నారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇదీ చదవండి: హీరోయిన్‌తో పెళ్లికి రెడీ అవుతున్న శింబు

హీరో సుధీర్ బాబు.. సూపర్‌స్టార్‌ కృష్ణ కుమార్తె ప్రియదర్శినితో 2006లో వివాహం అయింది. అయితే, నాటి ఫోటోలకు తన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో' నుంచి ఒక పాటను తీసుకుని వీడియో రూపంలో క్రియేట్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు. అందులో సుధీర్ బాబు,ప్రియదర్శిని దంపతులను ఆశీర్వదిస్తున్న మహేశ్‌ బాబు ఫోటో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

నాడు పెళ్లిచూపుల ఫోటో షేర్‌ చేసిన సుధీర్‌
సుధీర్‌ బాబు గతంలో కూడా వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన  సతీమణి ప్రియదర్శిని ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తుందెరో కాదు అంటూనే.. ప్రియదర్శినికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పిక్‌ కూడా పెళ్లిచూపుల ఫోటో అని, తన దగ్గర ఉన్న ఆమె మొదటి ఫోటో ఇదేనని ఆయన పేర్కొన్నారు.

2010లో ఏ మాయ చేసావే చిత్రంతో ఒక సపోర్టింగ్‌ రోల్‌తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'మా నాన్న సూపర్ హీరో'  అనే చిత్రంతో అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు సుధీర్‌ బాబు రానున్నారు. అభిలాష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ఈ చిత్రం ఉండనుంది. ఈ మూవీలో సుధీర్‌ బాబు తండ్రిగా సాయిచంద్ నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement