
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు భారీగా తరలివచ్చారు. దాదాపు 5వేల మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అభిమానులకు కోసం పాసులు పంపిణీ చేయడంతో పాటు 32 రకాల వంటకాలతో విందు ఏర్పాట్లు చేశారు.
అదే విధంగా ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని కూడా ప్రదర్శించనున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు జేఆర్సీ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు కృష్ణ కుటుంబసభ్యులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ సుధీర్ బాబు స్టేజ్ పేనే బోరున ఏడ్చేశారు.
ఎన్ని జన్మలు ఎత్తినా కృష్ణ అల్లుడుగానే పుట్టాలని కోరుకుంటున్నానంటూ ఎమోషనల్ అయ్యారు. ఈనెల 15న అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూపర్ స్టార్‌కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కుటుంబసభ్యులకే కాదు, అభిమానులకు సైతం తీరని శోకాన్ని మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment