super star krishna
-
మహేష్, రాజమౌళి మూవీ అప్డేట్ అప్పుడేనా ?
-
"మిస్ యూ నాన్న.."
-
కృష్ణ జయంతి.. మిస్ అవుతున్నా నాన్నా అంటూ మహేశ్ పోస్ట్
సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. తన నట ప్రస్థానంతో, సాధించిన అవార్డులతో అభిమానుల మనసు ఉప్పొంగేలా చేశారు. నేడు (మే 31) కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుని మహేశ్‌బాబు భావోద్వేగానికి లోనయ్యాడు.మిస్ అవుతున్నా..హ్యపీ బర్త్‌డే నాన్నా.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. కానీ నువ్వు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటావు అంటూ కృష్ణ ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.అవి గుర్తు చేసుకుంటేమరోవైపు డైరెక్టర్ వివి వినాయక్.. కృష్ణతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అసిస్టెంట్‌గా, సహ దర్శకుడిగా కృష్ణగారి నాలుగు సినిమాలకు పని చేశాను. ఆయనతో పనిచేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) Forever in our hearts, forever a legend 💫 Today, we honour the eternal legacy of Superstar Krishna Garu 🎬 May his invaluable contributions to Indian cinema continue to inspire generations.#SSKLivesOn pic.twitter.com/kRewKGtp18— AMB Cinemas (@amb_cinemas) May 31, 2024 -
Superstar Krishna: లెజెండరీ యాక్టర్ కృష్ణ జయంతి.. ఈ రేర్ ఫొటోస్ చూశారా?
-
నన్ను హీరోయిన్గా పరిచయం చేసింది ఆమెనే: విజయశాంతి
తెలుగు చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న నటి విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్‌లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. 1946, 20 ఫిబ్రవరిలో తమిళనాడులో జన్మించిన విజయ నిర్మల సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్రవేశారు. అయితే ఇవాళ ఆమె జయంతి సందర్భంగా సినీయర్ హీరోయిన్ విజయశాంతి ట్వీట్ చేశారు. తనను ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేసిన విజయ నిర్మలను గుర్తు చేసుకుంది. నన్ను కళాకారిణిగా విశ్వసించి.. సూపర్ స్టార్ కృష్ణతో హీరోయిన్గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి.. నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మలపై అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనని ట్విటర్ రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆ సినిమా సెట్లో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న రాములమ్మ చివరిసారిగా మహేశ్ బాబు నటింతిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కనిపించింది. నన్ను కళాకారిణిగా విశ్వసించి సూపర్ స్టార్ కృష్ణ గారితో హీరోయిన్ గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి, నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మల గారు... మీ పై ఆ అభిమానం ఆ గౌరవం, ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుగా ఉంచుకునే జ్ఞాపకం తో... జన్మదిన శుభాకాంక్షలతో...💐 మీ… pic.twitter.com/Cicx5jWKUI — VIJAYASHANTHI (@vijayashanthi_m) February 20, 2024 -
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ గర్వపడేలా ‘కృష్ణ విజయం’
సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం "కృష్ణ విజయం". అంబుజా మూవీస్ పతాకంపై మధుసూదన్ హవల్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోంది. నాగబాబు, సుహాసిని, యశ్వంత్, అలి, సూర్య, గీతా సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని, ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ దర్శకులు ముప్పలనేని శివ, సంజీవ్ కుమార్ మేగోటి, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ నిర్మాతలు ఎస్.వి.శోభారాణి, జె.వి.మోహన్ గౌడ్, గిడుగు క్రాంతి కృష్ణ, బిజినెస్ కో ఆర్డినేటర్ నారాయణ, ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి, పద్మాలయ శర్మ పాల్గొని, చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. దీనికి ముందు "కృష్ణ విజయం" చిత్రాన్ని కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ కు ప్రదర్శించారు. ఈ సందర్భంగా "గుంటూరు కారం" సాధిస్తున్న సంచలన విజయాన్ని పురస్కరించుకుని సక్సెస్ కేక్ కట్ చేశారు. కన్నడలో ప్రముఖ దర్శకుడిగా మన్ననలు అందుకుంటున్న మధుసూదన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం చాలా బాగుందని, ఈ చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ - మహేష్ ఫ్యాన్స్ అంతా గర్వపడేలా "కృష్ణ విజయం" చిత్రాన్ని తీర్చి దిద్దిన మధుసూదన్ అభినందనీయులని పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణను దర్శకత్వం వహించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా చిత్ర దర్శకుడు మధుసూదన్ పేర్కొన్నారు. శ్రీలేఖ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి అన్ని పాటలు భాస్కరభట్ల రాశారని, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేది ప్రకటిస్తామని మధుసూదన్ తెలిపారు. -
Krishna 1st Death Anniversary: నేడు కృష్ణ తొలి వర్ధంతి (ఫోటోలు)
-
విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన విలక్షణ నటుడు కమల్ హాసన్
-
'ఆయన లేకుండా తొలిసారి ఇలా'.. మంజుల ఎమోషనల్ పోస్ట్!
ఇటీవలే మంత్ ఆఫ్ మధు చిత్రంతో ప్రేక్షకులను అలరించారు మంజుల ఘట్టమనేని. నటిగా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవాళ బర్త్ డే జరుకుంటున్న మంజుల తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. గతేడాది తండ్రితో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ..' ప్రతి పుట్టిన రోజుకు మా నాన్న ఎప్పుడు నా పక్కనే ఉండేవారు. తొలిసారి ఆయన లేకుండా నా బర్త్ డే జరుగుతోంది. ఈ ఫోటోల్లోని క్షణాలు నా జీవితంలో మధుర జ్ఞాపకాలు. నాన్నతో ఉన్న ఈ క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి.' అంటూ ఎమోషనలైంది. ఈ ఫోటోల్లో కృష్ణతో పాటు మహేశ్ బాబు, నమ్రత, ఆమె భర్త సంజయ్ స్వరూప్ కూడా ఉన్నారు. కాగా.. గతేడాది సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఘట్టమనేని ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. మహేశ్ బ్రదర్ రమేష్ బాబు, ఇందిరమ్మ కూడా గతేడాదిలోనే కన్నుమూశారు. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) -
నాకు చాలా ఆనందంగా ఉంది..నా జీవితానికి ఇది చాలు..!
-
హాస్పిటల్ కు వెళ్లి చివరిసారిగా మేకప్ వేసి పడుకోబెట్టాను..!
-
అది నా డీఎన్ఏలోనే ఉంది.. ఎమోషనల్ అయిన సితార
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని.. తాత, తండ్రి పేరు నిలబెడుతూ.. ఘట్టమనేని వారసురాలిగా దూసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ఆమె పేరొక ప్రభంజనం కాబోతోంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురి ప్రముఖల పిల్లలకు భిన్నంగా తన మార్క్‌ను చూపిస్తుంది. అలా తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను కూడా సొంతం చేసుకుంది. సామాజిక సేవలో నాన్న బాటలోనే నడుస్తానని చెప్పినట్లుగానే తన అడుగులు పడుతున్నాయి. (ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్) శుక్రవారం నేషనల్ సినిమా డే సందర్భంగా సితార ఒక ఫోటోతో పాటు కొన్ని విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన దృష్టిలో సినిమా అంటే కేవలం ఒక పరిశ్రమ కాదంటూ సితార పేర్కొంది. సినిమా అనేది తన డీఎన్ఏలోనే ఉందని ఆమె తెలిపింది. 'లెజండరీ, ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మా తాతగారు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నాన్న ఎలాగైతే తాతయ్యను స్ఫూర్తిగా తీసుకున్నారో.. నేను కూడా అంతే. నాన్నే నా స్ఫూర్తి.' అంటూ సితార ఎమోషనల్ పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్ అయిన తమన్నా..) ప్రస్తుతం ఇదీ నెట్టింట వైరల్‌గా మారింది. వయసులో సితార చిన్నపిల్ల అయినా ఆలోచనలు మాత్రం ఎంతో ఉన్నతంగా ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చలనచిత్ర రంగంలోకి తప్పకుండా అడుగుపెడతానని సితార గతంలో తెలిపిన విషయం తెలిసిందే.. భవిష్యత్‌లో తాను సినిమాల్లో నటిస్తానని, సినిమా రంగంలో తనకూ ఆసక్తి ఉందని ఆమె తెలిపింది. View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
కృష్ణ తనయుడు రమేశ్ బాబు సినిమాల్లో ఎంట్రీ.. హీరోగా ఆ సినిమాతోనే!
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. సినీరంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆయనకు తగ్గట్టుగానే కుమారులు సైతం ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మహేశ్ బాబు, రమేశ్ టాలీవుడ్లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే గతేడాది అనారోగ్యంతో పెద్దకుమారుడు రమేశ్ బాబు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే రమేశ్ బాబు సినిమాల్లోకి రావడంపై సూపర్ స్టార్ కృషి ఎంతో ఉంది. రమేశ్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ఏది? ఆ తర్వాత ఏయే సినిమాలు చేశారో తెలుసుకుందాం. (ఇది చదవండి: అక్కినేని నాగచైతన్య సింప్లిసిటీ.. సిబ్బంది బైక్‌పై రైడ్!) రమేశ్ బాబు మొదట పరిచయమైంది అల్లూరి సీతారామరాజుతోనే. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. 1974లో వచ్చిన ఈ చిత్రంలో యంగ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. ఆ తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ చిత్రాల్లోనూ బాలనటుడిగా మెప్పించారు. అయితే కృష్ణ కెరీర్ అద్భుతంగా సాగుతున్న రోజుల్లోనే తన కుమారుడు రమేశ్ బాబును హీరోగా పరిచయం చేశారాయన. అయితే హీరోగా రమేశ్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది మాత్రం 1987లో వచ్చిన సామ్రాట్ చిత్రం ద్వారానే. ఈ సినిమాకు వి.మధుసూదన రావు దర్శకత్వం వహించగా.. హనుమంతరావు , ఆదిశేషగిరి రావు నిర్మాతలుగా వ్యవహరించారు. తన కుమారుడిని సామ్రాట్ ద్వారానే వెండితెరకు సూపర్ స్టార్ పరిచయం చేశారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్‌పైనే నిర్మించారు. అయితే ఈ మూవీ 1983లో రిలీజైన హిందీ సినిమా బేతాబ్ రీమేక్‌గా తెరకెక్కించారు. సరిగ్గా ఈ రోజు సామ్రాట్ మూవీ విడుదల కాగా.. నేటికి 36 ఏళ్లు పూర్తయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సోనమ్ హీరోయిన్గా నటించింది. నటి శారద కీలక పాత్ర పోషించిగా.. ఈ మూవీకి అప్పట్లోనే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. (ఇది చదవండి: లెస్బియన్స్‌గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!) అయితే ఈ సినిమా తర్వాత రమేశ్ బాబు దాదాపుగా 15 చిత్రాల్లో నటించారు. ఓకే ఏడాదిలో చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు చిత్రాలతో పాటు శాంతి ఎనతు శాంతి అనే తమిళ మూవీలో నటించారు. అయితే హీరోగా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోయారు. నిర్మాతగా మారి హిందీలో సూర్యవంశం, తెలుగులో అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు సినిమాలు నిర్మించారు. మరోవైపు తన తమ్ముడు మహేశ్ బాబు టాలీవుడ్లో సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. -
కృష్ణ నటించిన ఆఖరి చిత్రం.. 16 సంవత్సరాల తర్వాత రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఆఖరి చిత్రం `ప్రేమ చరిత్ర కృష్ణ విజయం`. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేశారు. కన్నడలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న హెచ్ మధుసూదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీపాద్ హంచాటే నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జూన్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు మాట్లాడుతూ.. 'గత నాలుగు రోజులుగా కృష్ణగారి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కృష్ణ గారు చాలా గ్లామర్‌గా ఉన్నారు, ఎనర్జిటిక్‌గా నటించారు. కచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... 'దర్శకుడు మధుసూదన్ నాకు మంచి మిత్రుడు. కన్నడలో ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. `ప్రేమ చరిత్ర కృష్ణ విజయం` ట్రైలర్ చాలా ఫ్రెష్‌గా, కలర్ ఫుల్ గా ఉంది. ఇటీవల `మోసగాళ్లకు మోసగాళ్లు ` చిత్రం రీ-రిలీజ్ అవగా హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ చిత్రం కూడా అదే విధంగా ఆడాలని కోరుకుంటున్నా`` అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ వినాయక రావు మాట్లాడుతూ... 'మే 31 అంటే కృష్ణ గారి అభిమానులకు పెద్ద పండగే. అంతటా ఆయన బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వారు లేకుండా జరుగుతోన్న మొదటి పుట్టిన రోజు ఇది. ఆయన గురించి నేను `దేవుడులాంటి మనిషి` పుస్తకం రాశాను. దానికి మంచి పేరొచ్చింది. ఒక రోజు పిలిచి రీ ప్రింట్ చేయమన్నారు. వేసే లోపే దురదృష్టవ శాత్తూ ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం కొన్ని మార్పులు చేర్పులతో ఆ పుస్తకాన్ని త్వరలో తీసుకొస్తున్నా' అన్నారు దర్శకుడు హెచ్ మధుసూదన్ మాట్లాడుతూ... 'డైరెక్టర్ గా నా తొలి సినిమా వంశం. ఆ చిత్రానికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఈ క్రమంలో శ్రీపాద్ హంచాటే గారు పిలిచి కృష్ణ గారితో సినిమా చేద్దామన్నారు. సంతోషంతో ఓకే చేశాను. 2007లో సినిమా పూర్తయింది. విడుదల కోసం ఎంతో వెయిట్ చేశాను. అయినా రిలీజ్ కాలేదు. ఈ లోపు నేను కన్నడలో చాలా పిక్చర్స్ డైరెక్ట్ చేశాను. కానీ కృష్ణ గారి సినిమా ఎలాగైనా రిలీజ్ చేయాలనుకున్నా. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా మార్చి నేనే విడుదల చేస్తున్నా. ఈ నెలలోనే విడుదల చేస్తా. కృష్ణ గారి అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణని తలుచుకొని ఏడ్చేసిన శేషగిరి రావు
-
సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్
వెండితెరపై సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేసిన కృష్ణ నటించిన తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. 52 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్' పోస్టర్ ఇప్పుడీ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా 4k టెక్నాలజీతో సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆది శేషగిరిరావు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..''పద్మాలయ సంస్థకు ఫౌండేషన్ మోసగాళ్లకు మోసగాడు. మా బ్యానర్లో ఎన్ని సినిమాలు వవచ్చినా ఈ సినిమా చాలా ప్రత్యేకం. కృష్ణ గారి బర్త్‌డేకి నివాళిగా, అభిమానుల కోరిక మేరకు సినిమాను రీరిలీజ్ చేస్తున్నాం. బర్త్‌డే రోజున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు(సోమవారం)అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయ్యి 48 సంవత్సరాలు కావడంతో ఈరోజున ప్రెస్‌మీట్ పెట్టాము. కృష్ణ గారి మెమోరియల్‌గా మ్యూజియం కట్టడానికి ఇక్కడ ప్రభుత్వం స్థలం కేటాయిస్తామన్నారు. అయితే ఇక్కడే ఉన్న మా సొంత స్థలంలో పనులు చేయిస్తున్నాము'' అని ఆది శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, బి గోపాల్, అశ్వినిదత్, నిర్మాత రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్ ఖుష్ అయిన డైరెక్టర్ -
కృష్ణగారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను.. సుధీర్ బాబు ఎమోషనల్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హంట్. సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు.మహేశ్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. పోలీస్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ ఏ.ఎమ్.బి. మాల్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 'గత ఏడాదిగా మా కుటుంబంలో మూడు మరణాలు చోటు చేసుకున్నాయి. కృష్ణ గారి మరణం మాకు పెద్ద లాస్. మావయ్య చనిపోయాక ఇది నా ఫస్ట్ మూవీ. ఆయన లేని వెలితి కనిపిస్తుంది. నా ప్రతి సినిమా ఫస్ట్ షో చూసిన నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు నేను అది మిస్ అవుతా. మావయ్య చనిపోవడానికి 20 రోజుల ముందు సినిమా ఏదైనా చూస్తారా? అని ఆయన్ను అడిగితే... 'నేను ఎవరి సినిమాలు చూడను. మహేష్ సినిమాలు, సుధీర్ సినిమాలు మాత్రమే చూద్దామని అనుకుంటున్నా' అని చెప్పారట. ఇది నాకు గర్వకారణం. కెరీర్లో ఎంత దూరం వెళతానో తెలియదు. ఈ ప్రయాణం మావయ్య గారికి అంకితం. జన్మజన్మలు ఆయనకు రుణపడి ఉంటాను' అంటూ సుధీర్ బాబు పేర్కొన్నారు. -
ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహేష్ బాబు
-
ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు ఎన్నిరకాల ఫుడ్ వండించాడో చూడండి
-
'లవ్ యూ మామయ్య గారు'.. నమ్రత ఎమోషనల్ పోస్ట్
సూపర్‌స్టార్ కృష్ణ మరణం అటు ఘట్టమనేని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఒకే ఏడాది మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, ఆ తర్వాత కృష్ణ కన్నుమూయడంతో ఆ విషాదం నుంచి కుటుంబసభ్యులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా మహేశ్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఎవర్ గ్రీన్ స్టార్, ఎన్నింటికో పునాది వేసి.. నిజమైన ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఆయనకు సినిమాలపై ఉన్న ప్రేమే ఆయన్ను సూపర్ స్టార్‌ను చేసింది. ఇయన ఎప్పటికీ సూపర్ స్టారే. ఆయన్ను మామయ్య గారు అని పిలవడం నా అదృష్టం. జీవితంలోని ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకున్నాను. ఆయన వారసత్వాన్ని, ఖ్యాతిని ఎప్పటికీ మేం పండగలా జరుపుకూనే ఉంటాం. లవ్ యూ మామయ్య గారు అంటూ కృష్ణ సుధీర్ఘ జర్నీకి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
నాన్న నాకు ఎన్నో ఇచ్చారు వాటిలో గొప్పది.. మీ అభిమానం : మహేష్ బాబు
-
నాన్న ఎన్నో ఇచ్చారు.. వాటిలో నాకు అదే గొప్పది : మహేశ్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబసభ్యులతో పాటు వేలాది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ.. నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో గొప్పది.. మీ అభిమానం. దానికి ఆయనకు నేను రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లో ఉంటారు. ఆయన ఎప్పుడూ మనమధ్యే ఉంటారు.మీ అభిమానం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మహేశ్ ఎమోషనల్ అయ్యారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. -
ఎన్ని జన్మలు ఎత్తినా కృష్ణ అల్లుడుగానే పుట్టాలి : సుధీర్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు భారీగా తరలివచ్చారు. దాదాపు 5వేల మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అభిమానులకు కోసం పాసులు పంపిణీ చేయడంతో పాటు 32 రకాల వంటకాలతో విందు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని కూడా ప్రదర్శించనున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు జేఆర్సీ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు కృష్ణ కుటుంబసభ్యులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ సుధీర్ బాబు స్టేజ్ పేనే బోరున ఏడ్చేశారు. ఎన్ని జన్మలు ఎత్తినా కృష్ణ అల్లుడుగానే పుట్టాలని కోరుకుంటున్నానంటూ ఎమోషనల్ అయ్యారు. ఈనెల 15న అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూపర్ స్టార్‌కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కుటుంబసభ్యులకే కాదు, అభిమానులకు సైతం తీరని శోకాన్ని మిగిల్చింది. -
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కోసం భారీగా ఏర్పాట్లు
-
తండ్రి సూపర్‌స్టార్ కృష్ణపై మహేష్‌బాబు ఎమోషనల్ ట్వీట్
-
తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతిపై మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్
తండ్రి మృతిపై సూపర్ స్టార్ మహేశ్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా తండ్రి మరణాన్ని తలుకుంటూ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహాంగా గడిపారు. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ వ్యక్తిత్వం. మీలో నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి. నాకిప్పుడు ఎలాంటి భయం లేదు. ఇంతకుముందెన్నడూ లేని బలం నాలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మీ కాంతి నాలో ఎప్పటికి ప్రకాశిస్తూనే ఉంటుంది. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్న.. మై సూపర్‌స్టార్’ అంటూ మహేశ్ బాబు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని పక్కన పెడుతున్నారు: ‘యశోద’ నటి -
సూపర్ స్టార్ కృష్ణ పేరుతో అవార్డు
‘‘సినీ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది ‘సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు’ ప్రదానం చేస్తాం’’ అని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ (మా ఏపీ)’ అధ్యక్షుడు, డైరెక్టర్ దిలీప్ రాజా అన్నారు. తెనాలిలోని ‘మా ఏపీ’ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమకు ఇష్టమైన ముగ్గురు నటుల పేర్లను ‘మా – ఏపీ’ కార్యాలయానికి పంపాలి. పంపిన వారి వివరాలు, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ప్రజా బ్యాలెట్లో ఎక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని ‘సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు’కు జ్యూరీ ఎంపిక చేస్తుంది. తెనాలిలో జరిగే ఈ అవార్డు వేడుక తేదీని మహేశ్‌బాబుతో చర్చించిన అనంతరం తెలియజేస్తాం’’ అన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలకు దూరంగా ఉన్న నాగార్జున.. కారణమిదేనా?
సూపర్ స్టార్ కృష్ణ నవంబర్15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం యావత్తు సినీలోకాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. కృష్ణ ఇక లేరనే వార్త తెలియగానే పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థివదేహాన్ని చివరిసారి చూసి ఆయనకు నివాళులు అర్పించారు. వెంకటేష్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల దగ్గర్నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అయితే నాగార్జున మాత్రం చివరి చూపుకు హాజరుకాకపోవడంపై పెద్ద చర్చే నడిచింది. కృష్ణ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న నాగార్జున.. అంత్యక్రియలకు వెళ్లవడపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణముందా అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ సందేహాలను ఓ సీనియర్ జర్నలిస్ట్ తెరదించారు. ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాగార్జున హాజరు కాకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గతంలో ఈవీవీ, దాసరి వంటి ప్రముఖులు కన్నుమూసినప్పుడు కూడా నాగార్జున అక్కడికి వెళ్లలేదు.సాధారణంగా మనకు దగ్గరివారిని కోల్పోయినప్పుడు కొంతమంది ఆ బాధను తట్టుకోలేరు. ఎంతో సాన్నిహిత్యం ఉన్నవారిని అలా నిర్జీవంగా చూడలేరు. అందుకే నాగార్జున కూడా పలు సందర్భాల్లో అంత్యక్రియలకు హాజరు కాకపోయినా ఆ తర్వాత వెంటనే వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ కారణంగానే కృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు నాగార్జున వెళ్లి ఉండకపోవచ్చు' అంటూ పేర్కొన్నారు. -
కృష్ణానదిలో కృష్ణ అస్థికల నిమజ్జనం, ఉండవల్లి కరకట్టకు మహేశ్
దివంగత నటులు సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నది సహా దేశంలోని పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయనున్నారు. ఇందులో భాగంగా మహేశ్ బాబు ముందుగా కృష్ణ అస్థికలను నేడు నదిలో నిమజ్జనం చేశారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేసేందుకు సోమవారం మహేశ్ బాబు కుటుంబంతో కలిసి విజయవాడకు చేరుకున్నారు. చదవండి: నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతానంటూ నటి మేఘన! వీడియో వైరల్ తాజాగా ఆయన కృష్ణానది ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మనిలయం వద్ద అస్థికలను నిమజ్జనం చేశారు. కృష్ణానదిలో కృష్ట అస్తికలు కలిపి, శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించారు మహేశ్ బాబు. ఈ కార్యక్రమంలో మహేశ్‌తో పాటు ఆయన బావ ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ సోదరుడు శేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. Mahesh Babu Reached Gannavaram Airport. pic.twitter.com/XsUzSew2Cx — Naveen MB Vizag (@NaveenMBVizag) November 21, 2022 -
విజయవాడలో హీరో మహేష్ బాబు
-
సాహసం సూపర్ స్టార్ పథం
-
ఒకే ఫ్రేమ్‌లో సూపర్ స్టార్ కష్ణ, మహేశ్ బాబు.. మీ రెండు కళ్లు చాలవు..!
సీనియర్ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల టాలీవుడ్ మొత్తం ఘననివాళి అర్పించింది. 350కి పైగా చిత్రాల్లో నటించిన నటశేఖరుడికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం నివాళులర్పించారు. నిర్మాతల నటుడిగా ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన సూపర్ స్టార్ కృష్ణ సినీప్రస్థానం ఓ చరిత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. కృష్ణను కడసారి చూసేందుకు వచ్చిన వేల మంది అభిమానులను చూసి యావత్ సినీ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సీనియర్ నటుడు మోహన్ బాబు కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉంది. అయితే తాజాగా మహేశ్ అభిమానులు ఎడిట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దివంగత సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు నటించిన సినిమాల్లోని సన్నివేశాలతో ఓ ఆసక్తికర వీడియో రూపొందించారు. ఆనాటి చిత్రాల్లోని సన్నివేశాలతో మహేశ్ బాబు నటించిన వాటిని కలిపి చేసిన ఎడిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో మహేశ్ తన తండ్రి గురించి చెప్పిన మాటలు ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తండ్రీ, కొడుకులను ఒకేసారి చూడటానికి మీ రెండు కళ్లు చాలవంటే నమ్మండి. అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి. The resemblance♥️@urstrulymahesh #KrishnaGarupic.twitter.com/05sAr9atVX — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) November 18, 2022 -
కృష్ణ అంత్యక్రియల విషయంలో మహేష్ తప్పు చేశాడా ..?
-
మహేష్ అన్నా నువ్వు ఒంటరి కాదు.. మేమంతా తోడుగా ఉన్నాం
పాపం మహేష్‌బాబు.. విధి ఆయన జీవితంలో తీరని విషాదం నింపింది. ఒక్క ఏడాదిలోనే కుటుంబంలోని పెద్ద దిక్కులను దూరం చేసి ఆయనకు పీడకలను మిగిల్చింది. ఒకరి మరణం నుంచి కోలుకునేలోపే మరొకరు.. మొదట అన్న.. తర్వాత తల్లి.. ఇప్పుడు నాన్న ఇలా వరుస విషాదాలు మహేష్‌బాబును ఒంటరిగా మిగిల్చాయి. అయితే బాధాతప్త హృదయంతో దిగాలుపడ్డ మహేష్‌కి మేమున్నామంటూ ఆయన అభిమానులు ముందుకొస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. నువ్వు ఒంటరి కాదు.. మేమంతా నీకు తోడుగా ఉన్నామని ధైర్యాన్నిస్తున్నారు. సాధారణంగా కుటుంబంలోని ఒక వ్యక్తి మరణిస్తేనే ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతారు. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి కనీసం ఏడాదైనా పడుతుంది. అలాంటిది మహేష్‌బాబు ఒక్క ఏడాదిలోనే ముగ్గురు సొంతవాళ్లను కోల్పోయారు. అన్న నిష్క్రమణ నుంచి కాస్త కోలుకుంటున్నసమయంలోనే తల్లి ఈలోకాన్ని విడిచి పెట్టడంతో మహేష్ శోకసంద్రంలో మునిగిపోయారు. దుఃఖాన్ని దిగమింగుకొని చూస్తూ ఉండిపోయారు. యావత్ ప్రపంచం ఆయనను ఓదారుస్తున్నా గుండెల్లోని బాధ కళ్లలో కనిపిస్తోంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేని తన తండ్రి కృష్ణ అకాల మరణం మహేష్‌ను మరింత కృంగదీసింది. మునుపెన్నడూ లేనంత నైరాశ్యంలో ఆయన కూరుకుపోయారు. చదవండి: (సీఎంకు కాల్చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. ఎవరా సీఎం?) కడసారి చూపునకు నోచుకోలేదు.. ఈ ఏడాది ప్రారంభంలోనే సోదరుడైన రమేష్‌బాబును కోల్పోయాడు. అప్పుడు మహేష్‌బాబు బాగా ఢీలా పడిపోయాడు. తండ్రి తర్వాత తండ్రిగా భావించిన అన్నను కడసారి కూడా చూడలేకపోయాడు మహేష్‌బాబు (క్వారంటైన్ కారణంగా). అప్పుడు మహేష్‌బాబుకు ఎంత కష్టం వచ్చిందంటూ అభిమానులు బాధపడ్డారు. ఈ బాధ నుంచి పూర్తిగా బయటకు రాకముందే మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. ఆ సమయంలో యావత్ సినీ ప్రపంచం వచ్చి మహేష్‌ను ఓదార్చారు. తల్లి అస్తికలను ఇటీవలే వారణాసిలో గంగానదిలో నిమజ్జనం చేసి వచ్చారు. ఆ బాధ నుంచి తేరుకుంటున్న సమయంలోనే కొండంత అండగా ఉన్న తండ్రి కృష్ణను కూడా కోల్పోయారు. కెరీర్ పరంగానే కాక అన్ని విషయాల్లోనూ మద్దతుగా నిలిచిన అన్న, అమ్మ, నాన్న దూరం కావడం మహేష్‌బాబుకు తీరనిలోటుగా మిగిలింది. కుటుంబంలో ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోవడం సాధారణ విషయం కాదు. కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు మహేష్‌బాబు కష్టాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. అయినా మహేష్‌బాబు బాధ తీర్చలేనిది. ఇప్పటి వరకూ తనకు స్తంభాలుగా ఉన్న ముగ్గురిని కోల్పోవడం తీరనిలోటే. ఈ కష్టకాలంలో అందరూ మహేష్‌కు సంతాపం తెలుపుతున్నారు. సోషల్‌మీడియాలోనూ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. #StayStrongMaheshAnna అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ బాధ నుంచి మహేష్‌బాబు త్వరగా బయటపడాలని అభిమానలోకం కోరుకుంటోంది. -
కృష్ణ మరణంతో ఒంటరివాడైన మహేష్ బాబు..
-
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేయడానికి కారణమిదే!
సూపర్ స్టార్ కృష్ణ మరణం టాలీవుడ్‌ను శోకసంద్రంలోకి నెట్టివేసింది. వెండితెరపై 350కు పైగా సినిమాల్లో వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్నారు. గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన ఆ నటశేఖరుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు నిన్న(బుధవారం) జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. కృష్ణ కుమారుడు మహేశ్ బాబు ఆయనకు తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అయితే దిగ్గజ నటుడికి సొంతంగా వారి ప్రైవేట్ స్థలంలో కాకుండా మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడంపై అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందించారు. ఇలా చేయడానికి ఓ కారణం ఉందని.. కృష్ణ సతీమణి ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు నిర్వహించామని, రమేష్ బాబు అంత్యక్రియలు కూడా అక్కడే చేసినట్లు తెలిపారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. -
సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం!
సూపర్‌స్టార్ కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. ఈ మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు ఇందుకోసం కృష్ణ ఘాట్ ఏర్పాటు చేసే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. మెమోరియల్‌ను సందర్శించే ప్రజలు కాసేపు అక్కడే గడిపి.. సూపర్ స్టార్ కృష్ణ గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా ఉండనుందని అంటున్నారు. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్‌ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: కీలక ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ -
అది మాటల్లో చెప్పలేను: తాత మృతిపై గౌతమ్ ఎమోషనల్ పోస్ట్
తాత సూపర్ కృష్ణ మృతిపై మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని భావోద్వేగాని గురయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తూ తాతతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. తాతయ్య, సోదరి సీతారతో ఉన్న ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “మీరు ఎక్కడ ఉన్నా నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. అలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తుంటావని తెలుసు. మిస్ యూ తాతగారు. మాటల్లో చెప్పలేనంతగా మిమ్మల్ని మిస్ అవుతున్నా” అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండని గౌతమ్ తాత ప్రతి పుట్టిన రోజుకు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ప్రేమను వ్యక్తం చేశాడు. చదవండి: ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్ యూ తాతయ్య: సితార ఎమోషనల్ తాత కృష్ణ అంటే గౌతమ్‌కు ఎంత ఇష్టమో అతడి పాత పోస్టులను చూస్తే అర్థమవుతోంది. అలాగే కృష్ణకు కూడా గౌతమ్ అంటే ఇష్టమని, మనవడితో కలిసి నటించాలని ఉందని ఆయన పలు ఇంటర్య్వూలో మనసులో మాట చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ చికిత్స పొందతూ మంగళవారం(నవంబర్ 15) తెల్లవారుజాము తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిన్న బుధవారం జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంచనాల మధ్య కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. View this post on Instagram A post shared by Gautam Ghattamaneni (@gautamghattamaneni) View this post on Instagram A post shared by Gautam Ghattamaneni (@gautamghattamaneni) -
ఏడాది క్రితం సూపర్‌స్టార్ కృష్ణ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ
-
జోహార్ నటశేఖరా! హీరో కృష్ణకు కన్నీటి వీడ్కోలు
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): లక్షలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం రాయదుర్గంలోని వైకుంఠ మహా ప్రస్థానం మోక్షఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య తెలుగు తెరపై ‘ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్’ భువి నుంచి దివికేగారు. అంతకుముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సీనియర్ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ క్రతువును నిర్వహించారు. కృష్ణ చితికి ఆయన కుమారుడు మహేశ్‌బాబు నిప్పంటించారు. కుటుంబసభ్యులు, సినీ, రాజకీయరంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిమంది ప్రజలు అశ్రునయనాలతో తమ అభిమాన నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖులు బారులు తీరిన కార్లలో ఊరేగింపును అనుసరించారు. పెద్దసంఖ్యలో ప్రజలు జేజేలు పలుకుతూ మహాప్రస్థానానికి చేరుకున్నారు. పరిమిత సంఖ్యలో లోపలికి అనుమతి వైకుంఠ మహాప్రస్థానంలోకి వెళ్లేందుకు పోలీసులు తొలుత పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మహేష్‌బాబు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, కుమార్తెలు మంజుల, ప్రియదర్శిని, పద్యావతితో పాటు నటుడు నరేష్, సుధీర్‌బాబు, సంజయ్, గల్లా జయదేవ్ తదితర సమీప బంధువులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణలతో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నందిగామ ఎమ్మెల్సీ అరుణ్, కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు, సినీ ప్రముఖులు మురళీమోహన్, దిల్‌రాజు, శివపార్వతి తదితరులు కూడా లోనికి వెళ్లారు. అభిమానులు, సామాన్య ప్రజలను మాత్రం క్రతువు ముగిసే వరకు అనుమతించలేదు. దీంతో మహాప్రస్థానం పరిసరాలన్నీ జనçసంద్రంగా మారి పోయాయి. నినాదాలతో మారుమ్రోగిన పరిసరాలు భారీగా గుమిగూడిన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘కృష్ణ అమర్ రహే, సూపర్‌స్టార్ కృష్ణ అమర్ రహే, జోహర్ కృష్ణ, జై కృష్ణ..జైజై కృష్ణ ’ అంటూ హోరెత్తించారు. ఒక దశలో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కుటుంబసభ్యులు, ప్రముఖులు వెళ్లిపోయిన తర్వాత అభిమానులను అనుమతించారు. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి తలసాని కృష్ణ అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆయన ముందుగానే మహాప్రస్థానానికి చేరుకుని పోలీసులు, అధికారులకు పలు సూచనలు చేశారు. గవర్నర్ సహా ప్రముఖుల నివాళులు కృష్ణ పార్థివ దేహానికి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, కుమార్తె బ్రాహ్మణి నివాళులర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిర్మాత అల్లు అరవింద్, నటుడు కోట శ్రీనివాసరావు, సినీ నటి జయప్రద, ఏపీ మంత్రి రోజా, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు కృష్ణ భౌతికకాయయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంతిమయాత్ర మొదలైంది. సాయంత్రం 4 గంటల సమయంలో అంత్యక్రియలు ముగిసాయి. ఇదీ చదవండి: సీఎంకు కాల్చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. అసలు విషయం ఏంటంటే.. -
సీఎంకు కాల్చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. ఎవరా సీఎం?
50 ఏళ్లపాటు నిరంతరాయంగా 'సాహసమే ఊపిరి'గా ఎన్నో రికార్డులను నెలకొల్పిన నటశేఖరుడు.. ఇక లేడనే విషయం తెలుసుకొని యావత్ సినీలోకం కంటతడిపెడుతోంది. అయితే సూపర్‌స్టార్ కృష్ణ మనల్ని విడిచి వెళ్లిపోయిన ఆయన జ్ఞాపకాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో సూపర్‌స్టార్ కృష్ణ జీవితంలో జరిగిన ఒక సంఘటన మాత్రం ఔరా అనిపించకమానదు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే కుమార్తె వివాహానికి రావొద్దని చెప్పారంటే మనం నమ్మగలమా?. కానీ ఇదే నిజం.. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఒకసారి పరిశీలిస్తే.. కృష్ణ తన పెద్దకుమార్తె పద్మావతి వివాహ వేడుకను గల్లా జయదేవ్‌తో చెన్నైలో నిశ్చయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను సూపర్‌స్టార్ కృష్ణ స్వయంగా వెళ్లి వివాహానికి ఆహ్వానించారు. చెన్నైలోనే వివాహం జరుగుతుండటంతో అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేస్తూ తప్పకుండా వస్తానని మాటిచ్చింది. అయితే వివాహానికి మూడు రోజుల ముందు జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి కృష్ణను కలిశారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో మొదటి మూడు వరుసలు భద్రతా కారణాల రీత్యా జయలలితకు కేటాయించాల్సిందిగా సెక్యూరిటీ ఆఫీసర్ కోరారు. దీంతో షాక్ తిన్న కృష్ణ.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖలు వివాహానికి వస్తున్న సంగతి చెప్పి మొదటి మూడు వరుసలు పూర్తిగా కేటాయించడం కదురదని చెప్పారు. కృష్ణ వెంటనే జయలలితకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలోనే జయలలితను సున్నితంగా వివాహానికి రావొద్దని.. మీ ఆశీర్వచనాలు ఉంటే చాలని చెప్పారు. విషయాన్ని అర్థం చేసుకున్న జయలలిత వివాహానికి హాజరు కాకుండా పెళ్లిరోజున వధూవరులకు ఒక బొకేను పంపారు. కాగా, జయలలిత సూపర్‌స్టార్ కృష్ణతో గూఢాచారి 116, నిలువు దోపిడి వంటి సినిమాల్లో కలిసి నటించారు. చదవండి: (మహేశ్ బాబు గొప్ప మనసు.. తీవ్ర విషాదంలోనూ వారికోసం..!) -
కృష్ణ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న ఆ హీరోని ఆదుకున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ కృష్ణ సాహసాల హీరో మాత్రమే కాదు.. మంచి మనుసున్న వ్యక్తి కూడా. కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడంలోనూ ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. అలా ఆయన నుంచి సహాయాన్ని పొందినవారిలో సీనియర్ హీరో హరనాథ్ కూడా ఉన్నారు. కృష్ణకంటే ముందుగానే హరనాథ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అందగాడుగా మంచి మార్కులు కొట్టేసిన హరనాథ్, రొమాంటిక్ హీరోగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఒకానోక సమయంలో హరనాథ్ మద్యానికి బానిస అయ్యాడట. ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో అవకాశాలు తగ్గాయట. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ దీంతో హరనాథ్‌ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఇక దిక్కతోచని స్థితిలో హరనాథ్ కృష్ణను కలుసుకోవడానికి పద్మాలయ స్టుడియోస్కి వెళ్లారట. ఆయన వచ్చిన విషయాన్ని సిబ్బంది కృష్ణ దగ్గరికి వెళ్లి చెప్పగానే ఆయనే స్వయంగా కిందికి వెళ్లి హారనాథ్ను లోపలికి తీసుకువెళ్లి మాట్లాడారట. ఆయన పరిస్థితి అర్థం చేసుకున్న కృష్ణ ఇంటికి తీసుకుని వెళ్లి అతిథి మర్యాదలు చేశారట. అంతేకాదు కొన్ని రోజులు ఆయనను ఇంట్లోనే ఉంచుకున్నారట. ఈ క్రమంలో ఆయనకు ధైర్యం చెప్పి.. పెద్ద మొత్తంలో డబ్బును ఆయన చేతిలో పెట్టారట కృష్ణ. అలా తన కోస్టార్‌ను కష్టాల్లో ఆదుకుని ఆయన మంచి మనసు చాటుకున్నారు. అయితే ఈ విషయాన్ని కృష్ణ ఎప్పుడూ ఎక్కడా చెప్పకపోవడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. -
మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు
-
అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణ అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో కృష్ణకు ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. గౌరవ వందనం అనంతరం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక ఆయన అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చివరి సారిగా తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. బుధవారం పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి కృష్ణ అంతిమయాత్ర జరిగింది. కాగా ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్ ఆస్ప్రతిలో చేరిన కృష్ణ చికిత్స పొందుతూ మంగళవారం(నవంబర్ 15న) తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణాన్ని ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సూపర్ స్టార్ కృష్ణ మేకప్ లేకుండా నటించిన చిత్రం ఏమిటో తెలుసా?
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం)/అమలాపురం టౌన్/ఆత్రేయపురం/అన్నవరం/కొత్తపేట/కరప: సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా ‘సాహసమే ఊపిరి’గా వెండి తెరపై ఎన్నో రికార్డులను నెలకొల్పిన తమ నటశేఖరుడు.. మా ‘మాయదారి మల్లిగాడు’ ఇక లేడనే విషయం తెలుసుకుని కంటతడిపెట్టారు. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, అద్భుత విజయాలు ఆవిష్కరించి.. సినీ ‘సింహాసనం’పై మహానటుడిగా వెలుగొందిన కృష్ణతో తమ ప్రాంతానికి.. తమకు ఉన్న అనుబంధాన్ని స్మరణకు తెచ్చుకున్నారు. నటశేఖరుడు తన సినీ ప్రస్థానం ఆరంభంలోనే జిల్లాతో అనుబంధం ఏర్పరుచుకున్నారు. గోదావరిని వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రాజమహేంద్రవరం ముుద్దుబిడ్డ. ఈయన 1965లో నిర్మించిన ‘తేనె మనసులు’ చిత్రం ద్వారా కృష్ణ సినీతెరకు హీరోగా పరిచయమై.. అందరి మనస్సుల్లో చోటు సంపాదించారు. ఆ చిత్రంలో ఆయన సరసన నటించిన సుకన్య కూడా మన రాజమహేంద్రవరానికి చెందిన ఆరి్టస్టే. ఈ రకంగా ఆయన తొలి హిట్ వెనుక గోదావరి ప్రభావముంది. ‘సాక్షి’ ఓ టర్నింగ్ పాయింట్.. గోదావరి ప్రాంతానికి చెందిన బాపు తీసిన ‘సాక్షి’ చిత్రం కృష్ణ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఈ సినిమాలో కృష్ణ సినిమా పూర్తయ్యే వరకూ మేకప్ లేకుండానే నటించారు. మానవత్వం మీద నమ్మకం గల పల్లెటూరి అమాయకుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. విజయనిర్మలతో నటించిన తొలి చిత్రం కూడా ఇదే. ఈ చిత్ర నిర్మాణం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 20 రోజులకు పైగా సాగింది. తర్వాత వరుస విజయాలతో చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ దూసుకుపోయారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన ‘ఊరికి మొనగాడు’ చిత్రం షూటింగ్ రామచంద్రపురం పరిసరాల్లో ఎక్కువ కాలమే సాగిందని ఇక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు, భోగిమంటలు, దొరగారికి స్వాగతం, నేనంటే నేనే వంటి తదితర చిత్రాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే షూటింగ్ జరిగాయి. స్వాతంత్ర వీరుడా...స్వరాజ్య బాలుడా..! అల్లూరి సీతారామరాజు సినిమా చిత్రీకరణ ఈ ప్రాంతంపై చెరగని ముద్ర వేసుకుంది. 1974లో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీతో పాటు అన్నవరం పరిసరాలను తొలిసారిగా తెరకెక్కించారు కృష్ణ. తెలుగు వీర లేవరా ’ పాటలోని ‘స్వాతంత్ర వీరుడా స్వరాజ్య బాలుడా! అనే చరణాన్ని సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో చిత్రీకరించారు. ఆ పాట కోసం రాజమహేంద్రవరం, కడియం నుంచి రెండు లారీల పూలు రత్నగిరికి తీసుకువచ్చి అల్లూరి సీతారామరాజు పాత్రధారి కృష్ణ మీద చల్లారు. 1980 నాయుడు గారి అబ్బాయి షూటింగ్ కూడా అన్నవరంలోనే జరిగింది. కృష్ణ, అంబిక మధ్య ఒక పాట సత్యదేవుని ఆలయ ప్రాంగణం, పంపా నది, మిస్సెమ్మ కొండ పరిసరాల్లో చిత్రీకరించారు. నాయుడు గారి అబ్బాయి సినిమా షూటింగ్ సమయంలో పలువురు దేవస్థానం ఉద్యోగులు కృష్ణతో ఫొటో దిగారు. కృష్ణ అంటే అభిమానమే వేరు అభిమానులను నటశేఖరుడు గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు. రామచంద్రాపురంలోని రాజు గారి కోటలో ఊరికి మొనగాడు సినిమా షూటింగ్ సమయంలో ఎక్కడెక్కడి నుంచో అభిమానులు వచ్చి పడిగాపులు కాసేవారు. మనసున్న కృష్ణ వారందరికి భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేవారు. భోజనం చేశాక వెళ్లాలని చెప్పేవారని నాటి తరం అభిమానులు చెబుతారు. ఈ సినిమా విజయవంతమైనప్పుడు తమకు వాచీలు బహూకరించారని అభిమాన సంఘం నాయకులు మననం చేసుకుంటున్నారు. గలగల పారుతున్న గోదారిలా 1974లో కోనసీమలో ‘గౌరి’ చిత్రం షూటింగ్ 30 శాతం పచ్చని సీమలోనే సాగింది. కృష్ణ, జమున ఈ చిత్రానికి హీరో హీరోయిన్లు. పి.గన్నవరం వద్ద వైనతీయ నదీ పాయపై హీరోయిన్ జమునకు కృష్ణ సైకిల్ నేర్పిస్తుండగా ఓ పాట చిత్రీకరించారు. ‘గల గల పారుతున్న గోదారిలా’ పాటను కూడా ఇక్కడి పరిసరాల్లోనే చిత్రీకరించారు. అప్పట్లో కృష్ణ కోనసీమలో దాదాపు 10 రోజుల బస చేశారు. డిగ్రీ విద్యారి్థగా 30 ఏళ్ల క్రితమే కృష్ణ చేతుల నుంచి వర్ధమాన కవిగా అవార్డు అందుకున్నానని అమలాపురానికి చెందిన కవి, రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య పురస్కార గ్రహీత ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఆయనతో తనకున్న కొద్దిపాటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పులిదిండిలోనే దండిగా షూటింగ్ 1967లో కృష్ణ హీరోగా తీసిన ‘సాక్షి’ సినిమాను ఆత్రేయపురం మండలంలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. అవుట్ డోర్ షూటింగ్ పులిదిండిలో జరిగింది. ఈ సినిమా చిత్రీకరణకు ముందు కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ, దర్శకుడు బాపు సినిమాకు తమ ఊహలకు తగ్గ గ్రామం ఎంపిక చేయాలని తమ బాల్యమిత్రుడు బీవీఎస్ రామారావును కోరారు. ఆయన రాజమండ్రి వచ్చి ఇరిగేషన్ కాంట్రాక్టర్ కలిదిండి రామచంద్రరాజుకు సూచించారు. దీంతో బాపు, రమణల ఊహకు తగ్గట్టుగా పులిదిండిని ఎంపిక చేశారు. ఇక్కడే చాలా వరకు షూటింగ్ చేశారు. గ్రామంలోని మీసాల కృష్ణుడి ఆలయంలో కూడా చిత్రీకరించారు. ఎనలేని అభిమానం నాకు కృష్ణ అంటే ప్రాణం. జిల్లాలో ఎక్కడ షూటింగ్ జరుగుతోందని తెలిసినా వెళ్లిపోయేవాడిని. ఏటా మా గ్రామంలో ఆయన పుట్టిన రోజు వేడుక నిర్వహిస్తాను. మమ్మల్ని ఆప్యాయంగా పలకరించేవారు. పద్మాలయ స్టూడియోలో ఆయనను కలిసిన రోజు ఎప్పటికీ మరిచిపోను. కలిసిన ప్రతిసారీ అన్నవరం ప్రసాదం అందజేసేవాడిని. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. – సలాది కృష్ణ, అభిమాన సంఘ అధ్యక్షుడు, ప్రత్తిపాడు, కాకినాడ జిల్లా -
ఆయన చనిపోయారన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాం
-
దాడి జరిగినా లెక్కచేయని సూపర్ స్టార్ కృష్ణ.. కంటికి కట్టుతో.. 1985లో ఏం జరిగిందంటే?
కర్నూలు కల్చరల్: సినీ హీరో సూపర్‌స్టార్ కృష్ణకు జిల్లాతో ఆత్మీయ అనుబంధం ఉంది. నంద్యాల సమీపంలోని ఫారెస్ట్‌లో రైల్వే వంతెనపై నిర్వహించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం షూటింగ్లో పాల్గొన్నాడు. 1985లో కృష్ణ కాంగ్రెస్ తరపున జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చదవండి: హార్సిలీ హిల్స్‌తో సూపర్‌స్టార్ కృష్ణకు విడదీయరాని అనుబంధం నంద్యాలలో ఎన్నికల ప్రచారం ముగించుకొని రాత్రి 11 గంటల సమయంలో కర్నూలు చేరుకుంటుండగా నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. దాడిలో కృష్ణ కంటికి గాయమైంది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స చేయించుకొని(కంటికి కట్టుతో) ఎస్టీబీసీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అర్ధరాత్రి అయినా అభిమానులు ఆయనను చూసేందుకు అలాగే వేచి ఉండటం ఆయన మంచి తనానికి నిదర్శనం. అలాగే బంగారుపేటలో నివాసం ఉండే బాబ్జి.. కృష్ణకు వీరాభిమాని, మంచి మిత్రుడు. ఆయన నివాసానికి విజయ నిర్మలతో కృష్ణ తరచూ వచ్చి పోయేవారు. ప్రస్తుతం ఆనంద్ థియేటర్ ఉన్న ప్రాంతంలో బాబ్జి ఏర్పాటు చేసిన రైస్‌మిల్‌ను కృష్ణ దంపతులు ప్రారంభించారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సాయిబాబా థియేటర్లో, పండంటి కాపురం నేతాజీ థియేటర్లో, పాడిపంటలు విక్టరీ థియేటర్లో, ఊరికి మొనగాడు శ్రీరామ థియేటర్లో వంద రోజులు ఆడాయి. అభిమానులు విజయోత్సవ సభలు ఘనంగా నిర్వహించారు. కృష్ణ అభిమానుల సంఘానికి చెందిన నాయకులు బుధవార పేటకు చెందిన కుమార్, శేఖర్లు కృష్ణ సినిమా విడుదలైన ప్రతిసారి చెన్నై, హైదరాబాద్ వెళ్లి ఆయనకు కలిసి వచ్చేవారు. కృష్ణ మృతి పట్ల టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మి య్యా, ఉపాధ్యక్షులు ఇనాయతుల్లా, ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కార్యాధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కర్నూలు రంగ స్థల కళాకారుల సంక్షేమ సంఘం నాయకులు బైలుప్పల షఫీ తదితరులు సంతాపం ప్రకటించారు. సినిమా రంగంలో సరికొత్త పోకడలకు నాంది పలికిన మహా నటుడు కృష్ణ అని అభిప్రాయపడ్డారు. -
కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం
-
కృష్ణ లేని లోటు ఎవరు పూడ్చలేనిది, ఆయన మళ్లీ పుట్టాలి: ఫ్యాన్స్ ఆవేదన
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకి తరలించారు. నానక్‌రామ్ గూడలోని ఆయన నివాసం నుంచి పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచి ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. తమ అభిమాన నటుడి కడచూపు కోసం పద్మాలయ స్టూడియోకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు రావడంతో పద్మాలయ స్టూడియో ముందు అభిమానుల తాకిడి ఎక్కువైంది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా అభిమానులు అయనను కడసారి చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఆయన మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినిమాలు, పవర్ఫుల్ డైలాగ్స్ గుర్తు చేస్తూ సూపర్‌స్టార్ ఘననివాళులు అర్పిస్తున్నారు. ‘‘ఆయన ఓ హీరో మాత్రమే కాదు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన చనిపోయారన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాం. మా ఇంట్లో మనిషి మరణించిన దానికంటే ఎక్కువగ బాధగా ఉంది. ఆయన కడచూపు కోసం వచ్చిన ఈ అభిమానుల సంద్రోహమే ఆయన మంచితనానికి నిదర్శనం. ఆయన ఓ లెజెండరి నటులు. సినిమాల్లో తన పాత్రలతో ఎన్నో వేరియేషన్స్ చూపించారు. ఆయన లేని లోటు ఇండస్ట్రీలో ఎవరు పూడ్చలేరు. ఆయన మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నాం’ అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చబొట్టుతో అభిమానం ఇక సిద్దిపేటకు చెందిన ఓ అభిమాని ఏకంగా కృష్ణపేరును చేతిపై పచ్చబొట్టు వేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అంటూ చేతిపై పచ్చబొట్టు వేసుకుని అభిమానాన్ని చాటుకున్నాడు. కృష్ణగారు చనిపోయారని తెలిసి అన్నం కూడా తినలేదు అంటూ సదరు అభిమాని కన్నీరు పెట్టుకున్నాడు. అనంతరం అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ఓ పవర్ఫుల్ డైలాగ్‌ను ఆపకుండ చెబుతూ తన అభిమాన నటుడికి నివాళి అర్పించాడు. అచ్చం కృష్ణలా మారి.. ఇక ఓ అభిమాని అచ్చం కృష్ణలా తయరై వచ్చాడు. ఊహా తెలిసినప్పటి నుంచి కృష్ణగారు అంటే అభిమానం, ఆ అభిమానంతోనే ఇక్కడి వచ్చాను. యమదొంగ, నెంబర్ వన్, అల్లూరి సీతారామరాజు. ఆయన సినిమాలన్నా, ఆయన డైలాగ్స్ అంటే గూస్బంప్స్ రావాల్సిందే. ఈ సందర్భంగా అల్లూరి సీతారామారాజు మూవీలోని డైలాగ్స్ చెప్పి అదరగొట్టాడు. -
హార్సిలీ హిల్స్‌తో సూపర్‌స్టార్ కృష్ణకు విడదీయరాని అనుబంధం
తెలుగు సినీ జగత్తులో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సూపర్‌స్టార్ కృష్ణకు అన్నమయ్య జిల్లాలోని హార్సిలీ హిల్స్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. తాను నటించిన ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. వేసవిలో హార్సిలీహిల్స్‌పై విడిది చేసేవారు. ఇలా హార్సిలీహిల్స్‌తో కృష్ణకు పెనవేసుకున్న కొండంత అనుబంధం సాక్షి పాఠకుల కోసం.. బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌తో సినీనటుడు ఘట్టమనేని కృష్ణకు విడదీయరాని అనుబంధం ఉంది. పర్యాటక, వేసవి విడిది కేంద్రమైన బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పై సినిమా షూటింగులకు ఆద్యుడు ఆయనే. చిత్రపరిశ్రమకు హార్సిలీహిల్స్‌ను పరిచయం చేసింది కృష్ణనే. ఆయన రెండో చిత్రం కన్నెమనుసులు 1966లో విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఎక్కువ భాగాలు కొండపైనే చిత్రీకరించారు. ఈ ఏడాదిలో మొదలు పెట్టిన సినిమాల చిత్రీకరణ 1997 వరకు కొనసాగింది. కొండపై తీసిన కృష్ణ మొదటి సినిమా కన్నెమనుసులు కాగా చివరి సినిమా పాతికేళ్ల క్రితం 1997లో ఎన్కౌంటర్ తీశారు. ఆ తర్వాత సినిమాలు చిత్రీకరించనప్పటికి 2007లో ఒకసారి విజయనిర్మల, నరేష్‌తో కలిసి కొండపై ఒక రోజు విడిది చేసి వెళ్లారు. ఆ తర్వాత కృష్ణ ఇక్కడికి రాలేదు. తొలి సెట్టింగ్ గాలిబండపై సముద్రమట్టానికి 4,141 అడగుల ఎత్తులో ప్రకృతి అందాలకు నిలయమైన కొండపై గాలిబండ, పాత వ్యూపాయింట్, ఘాట్‌రోడ్డు ప్రాంతాల్లో కృష్ణ సినిమాల చిత్రీకరణలు జరిగాయి. కృష నటించిన కన్నెమనసులు చిత్రం కోసం గాలిబండపై తొలి సెట్టింగ్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది. వెదురుకట్టెలు, పైకప్పు గడ్డితో గాజులమ్మ గుడిని నిర్మించగా అందులో ఓ పాట, గుడి మంటల్లో కాలిపోయే దృశ్యాలను చిత్రీకరించారు. గవర్నర్ బంగ్లా, దాని ఆవరణలో కృష్ణ, ఇతర నటులతో చివరి భాగం నిర్మించారు. ఈ చిత్రంతో కృష్ణకు కొండతో అనుబంధం ఏర్పడింది. దీని తర్వాత అసాధ్యుడు, అఖండుడు, నేనంటేనేనే, దొంగలదోపిడి, సింహగర్జన, పులిజూదం, ఏకలవ్య, గూడుపుఠాణి, పట్నవాసం తదితర 25కుపైగా సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. 1997 అగస్టు 14న విడుదలైన ఎన్.శంకర్ దర్శకత్వంలో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా అత్యధికభాగంగా, పాటలను నెలరోజులు హార్సిలీహిల్స్ అడవిలో చిత్రీకరించారు. కొండపై కృష్ణ చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మే 31న కొండపై జన్మదినవేడుకలు జరుపుకోగా సతీమణీ విజయనిర్మల, ప్రముఖ నటులు వేడుకలకు హజరయ్యారు. చిత్రీకరణ పూర్తయ్యేవరకు అటవీశాఖ అతిథి గృహాలైన హార్సిలీ సూట్, మిల్క్హౌస్లో విడిది చేశారు. కాగా హార్సిలీహిల్స్‌పై షూటింగ్‌లను ప్రారంభించింది తానేనని, ఆ తర్వాత మిగతా నటులు ఇక్కడికి వచ్చారని ఎన్కౌంటర్ షూటింగ్ సందర్బంగా కృష్ణ చెప్పారు. తాను నటించిన అత్యధిక చిత్రాల షూటింగ్ హార్సిలీహిల్స్లోనే జరిపినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మారనని ప్రకటన 1997 మేనెలలో ఎన్కౌంటర్ సినిమా షూటింగ్ హార్సిలీహిల్స్‌పై జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ మారనని, ఏ పార్టీలో చేరనని, కొత్త పార్టీ పెట్టనని ప్రకటించారు. నెలరోజులు షూటింగ్ కోసం కొండపై ఉన్నారు. ఈ సమయంలో ఆయన తాను రాజీవ్‌గాంధీ పిలుపుతో కాంగ్రెస్‌లో చేరానని, ఆయ న మరణించాక పార్టీలో క్రీయాశీల రాజకీయాల్లో ఉండలేనని చెప్పారు. ఓసేయ్ రామ్ములమ్మ సినిమాలో కొన్ని వ్యవస్థల తీరుపై కృష్ణ వ్యాఖ్యలపై ఆయన విజయశాంతితో కలిసి పార్టీ పెట్టబోతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయన అప్పట్లో అన్న మాటకు చివరిదాకా కట్టుబడ్డారు. సతీమణీ విజయనిర్మల టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసినా అండగా నిలవలేదు. అతిథిగృహం కోసం ప్రయత్నం నటుడు కృష్ణ ప్రతివేసవి ఊటీలో గడుపుతారు. అయితే హార్సిలీహిల్స్‌పైనా అతిథిగృహం ఉండాలని కృష్ణ ఆశించారు. దీనికోసం 2007లో విజయనిర్మల, నరేష్‌తో కలిసి హార్సిలీహిల్స్ వచ్చారు. ఇక్కడి సొసైటీ స్థలాలను పరిశీలించారు. శరత్‌బాబుకు చెందిన అసంపూర్తి అతిథిగృహం చూశారు. అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదు. అతిథిగృహం నిర్మించుకోలేకపోయారు. మదనపల్లె అంటే భలే అభిమానం మదనపల్లె సిటీ: సూపర్‌స్టార్ కృష్ణకు మదనపల్లె అంటే ఎంతో అభిమానం. 1962లో కృష్ణ, విజయనిర్మల నటించిన రక్తసంబంధం సినిమా విజయోత్సవ సభకు మదనపల్లెకు వచ్చారు. స్థానిక పంచరత్న టాకీసులో సినిమా ఉత్సవాల్లో పాల్గొన్నారు. అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పంచరత్న టాకీసు అధినేత బాబా వరప్రసాద్ ఇంటికి వెళ్లి అతిథ్యం స్వీకరించారు. 1976లో పాడిపంటలు సినిమా విజయోత్సవాలకు కూడా హాజరయ్యారు. కృష్ణ మృతితో పట్టణంలోని అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఎన్నికల ప్రచారంలో... 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండులో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. -
40 ఏళ్ల క్రితం పాన్ ఇండియా సినిమా తీసిన హీరో కృష్ణ
-
ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్ యూ తాతయ్య: సితార ఎమోషనల్
తాత సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని భావోద్వేగానికి లోనయ్యింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తాత కృష్ణతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఇకపై ఇంతకు ముందలా ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇకపై వీకెండ్ లంచ్ ఇంతకు ముందులా ఉండదు. మీరు నాకు ఎన్నో విలువైన విషయాలు నెర్పించారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా? ఎప్పుడూ నన్ను నవ్వించేవారు. ఇప్పుటి నుంచి అవన్ని మీ జ్ఞాపకాలుగా నా మెమరిలో ఉండిపోతాయి. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి చేరుకుంటాను. మిస్ యూ సో మచ్ తాతగారు(తాతయ్య)’ అంటూ సితార రాసుకొచ్చింది. కాగా ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ చికిత్స పొందతూ నిన్న మంగళవారం తెల్లవారుజాము తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
ఆయన నా దేవుడు: కృష్ణ గురించి మహేష్ మాటలు విన్నారా?
-
సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ.. వెండితెరపై ఆయన పేరు చేరగని ముద్ర. సాహసాలకు, సంచనాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిలోనే పాత్రలతో ప్రయోగాలు చేశారు. అప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేసి జేమ్స్‌బాండ్ తరహాలో గుఢాచారి 116 సినిమాతో అద్భుతం చేశాడు. ఇక తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాలో రికార్డులు క్రియేట్ చేశారు. హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఆయన కథ తెలుగు వెండితెరపై ఓ చరిత్రగా నిలిచింది. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ ఓ హీరోగానే కాదు వ్యక్తిగతంగా మంచి మనుసున్న చాటుకున్న నటుడు. కష్టకాలంలో నిర్మాతలను ఆదుకున్న గొప్ప హీరో. అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు. స్టార్ హీరోగా, మంచి మనసు చాటుకున్న వ్యక్తిగా సూపర్ స్టార్ సువర్ణాక్షరాలతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి ఆయన గురించి ప్రముఖ రచయిత, మహాకవి శ్రీశ్రీ గతంలో ఏమన్నారో తెలుసా. అప్పట్లోనే తనదైన రాతలతో కృష్ణ గొప్పతనాన్ని శ్రీశ్రీ చాటిచెప్పారు. ఓ సందర్భంలో కృష్ణ గురించి ప్రస్తావించిన ఓ పాత న్యూస్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు ‘‘నేను ఒక అక్షరం రాసినా దానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ’’ అని శ్రీశ్రీ అన్నారు. 1994లో ఓ ప్రముఖ పత్రికలో ఈ వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు కృష్ణ గొప్పతనానికి, వ్యక్తిత్వానికి జోహార్లు చేస్తున్నారు. కాగా గుండెపోటు కారణంగా కృష్ణ మంగళవారం(నవంబర్ 15) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆయన అంతిమ యాత్ర మహప్రస్థానం వరకు సాగనుంది. -
‘అది నా అదృష్టం’.. మంత్రి రోజా ఎమోషనల్ కామెంట్స్
సూపర్ స్టార్ కృష్ణ(79) మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. వారి కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైరాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక, సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులు అర్పించారు. అనంతరం, మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన వ్యక్తి. సాహసాలు, సంచనాలకు కేరాఫ్ అడ్రస్. అందరూ ఇష్టపడే ఒకే ఒక్క హీరో కృష్ణ. ఆయన లేరు అంటే ఎవరూ కూడా జీర్ణించుకోని పరిస్థితి. సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ లేకపోవడం తీరని పెద్దలోటు. నా చిన్నతనం నుంచి నేను కృష్ణకు అభిమానిని. ఆయన సొంత బ్యానర్లో నేను సినిమా చేయడం నా అదృష్టం. కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతీ ఒక్కరి లైఫ్‌లో సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఇది కృష్ణను చూసి నేర్చుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
Super Star Krishna: వైజాగ్ అందుకే ఆయనకు ప్రత్యేకం..
సాహసానికి ఊపిరి ఆగిపోయింది. తూటాల్లా డైలాగ్స్ పేల్చిన కంఠం మూగబోయింది. నింగిలోకి మరో ధ్రువతార చేరింది. సినీ ప్రయోగశాల.. తెలుగు సినీ పరిశ్రమస్థాయిని ఆకాశం అంత ఎత్తున నిలబెట్టిన మహర్షి సూపర్‌స్టార్ కృష్ణ.. ఉమ్మడి విశాఖ జిల్లాతో ఎన్నో జ్ఞాపకాలను పెనవేసుకున్నారు. ఆయన సినీ జీవితంలో 350కు పైగా సినిమాలు చేసినా.. అందులో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు చింతపల్లి ప్రాంతంలో చిత్రీకరించారు. విశాఖ– భీమిలి బీచ్‌రోడ్డు, యారాడ బీచ్‌లో చాలా సినిమాలు షూటింగ్‌లు జరుపుకున్నాయి. మనిషిగా బతకడం అంటే.. మన చుట్టూ ఉన్న నలుగురిని బతికించడం అని నమ్మిన సూపర్‌స్టార్‌కు ఉమ్మడి జిల్లాలో చాలా అభిమాన సంఘాలున్నాయి. సాహసమే ఊపిరిగా.. సాయమే శ్వాసగా సాగిన ఆయన జీవన ప్రయాణం.. ఎందరికో ఆదర్శప్రాయం.. జోహర్ ఘట్టమనేని శివరామకృష్ణ. విశాఖపట్నం: సూపర్‌స్టార్ కృష్ణకు విశాఖ సాగరతీరంతో ఎక్కువ అనుబంధం ఉంది. వాస్తవానికి ఆయన సినిమాలు ఎక్కువ శాతం చెన్నై, బెంగుళూర్ తదితర ప్రాంతాల్లోనే చిత్రీకరించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా తీయాలి అంటే విశాఖ వైపే మక్కువ చూపేవారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సూపర్‌స్టార్ కృష్ణ జ్ఞాపకాలు తీరంలో పదిలంగా ఉన్నాయి. 1961–62 ప్రాంతంలో భీమిలిలో కులగోత్రాలు సినిమాలో షూటింగ్ జరిగింది. కృష్ణకు నటుడిగా ఇది రెండవ సినిమా. ఇందులో ఆయన చిన్న పాత్రలో నటించారు. 1975లో ప్రకారావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన చీకటి వెలుగులులో ఓ సన్నివేశాన్ని ఇప్పటి పార్క్ హోటల్ సమీపంలో చిత్రీకరించారు. 1983లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో అడివి సింహాలు సినిమా షూటింగ్ రుషికొండ, రామకృష్ణ బీచ్‌లో జరిగింది. 1984లో విజయనిర్మల దర్శకత్వంలో రక్త సంబంధం సినిమాలో ఓ సన్నివేశాన్ని యారాడ కొండపై చిత్రీకరించారు. 1993లో పచ్చని సంసారం చిత్రం అర్ధశత దినోత్సవం విశాఖలో జరిగింది. 100వ సినిమా అల్లూరి సీతారామరాజు మన్యంలో నిర్మించగా, 1995లో కృష్ణ నటించిన 300వ సినిమా తెలుగువీర లేవరా సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ ఎర్రమట్టి దిబ్బల్లో చిత్రీకరించారు. బీచ్‌రోడ్‌లో ఎన్కౌంటర్, యారాడ కొండపై కృష్ణ, మహేష్ నటించిన వంశీ సినిమాలో కొన్ని ఫైట్ సీన్లను షూట్ చేశారు. ఎస్ నేనంటే నేను సినిమా రుషికొండ, ఆర్.కె.బీచ్ తదితర ప్రాంతాలు, జగదాంబ సెంటర్లో చిత్రీకరణ జరుపుకుంది. విశాఖలో రాజేశ్వరి థియేటర్లో కంచుకాగడా సినిమా విడుదల సమయంలో మూడు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేశారు. విశా ఖతో ఉన్న అనుబంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలనే ఆకాంక్షతో.. పద్మాలయ ఫిల్మ్ స్టూడియో ను విశాఖలో నిర్మించాలని ఉందని పలుమార్లు కృష్ణ మీడియాకు చెప్పారు. నటశేఖరుడికి కళాప్రపూర్ణ ప్రదానం ఏయూక్యాంపస్: సినీ నటుడు కృష్ణకు 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణను ప్రదానం చేసింది. ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి ఏయూ ఉపకులపతిగా పనిచేసిన కాలంలో కళారంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ 75వ స్నాతకోత్సవంలో ఆయనను కళాప్రపూర్ణతో సత్కరించింది. ఏయూలోని సీఆర్‌రెడ్డి కాన్వొకేషన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి విజయనిర్మలతో కలసి కృష్ణ పాల్గొన్నారు. కాగా.. కృష్ణ మృతి పట్ల ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి సంతాపం తెలిపారు. మన్యం గుండెల్లో సూపర్‌స్టార్ సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు పేరు చెబితే అందరికీ సూపర్‌స్టార్ కృష్ణ గుర్తుకువస్తారు. ఈ సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాలను చింతపల్లి ప్రాంతంలోనే చిత్రీకరించారు. 1973–74లో దాదాపు ఏడు నెలలపాటు చిత్ర యూనిట్ చింతపల్లిలో ఉంది. తెలుగు వీరలేవరా, జయం మనదే వంటి సినిమాలను అరకులోయలో, పాడిపంటల సినిమాలో ఒక పాటను సీలేరు, గుంటవాడ డ్యామ్, సప్పర్ల రెయిన్‌గేజ్ అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు. 18న ఏయూలో సంతాప సభ మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ఏయూ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం సెమినార్ హాల్లో ఈ నెల 18న సూపర్‌స్టార్ కృష్ణ సంతాపసభ నిర్వహిస్తున్నట్లు వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని.. ఆయన నటించిన ఈనాడు చిత్రాన్ని ప్రదర్శిస్తామని చెప్పారు. పార్క్ హోటల్లోనే బస బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): సూపర్‌స్టార్ కృష్ణ విశాఖపట్నంనకు వచ్చిన ప్రతీసారి బీచ్‌రోడ్డులోని పార్క్ హోటల్లో బస చేసేవారట. కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించిన అడవి సింహాలు చిత్రం షూటింగ్ సాగరతీరంలో జరిగింది. ఆ చిత్రంలోని ఓ పాటను గ్యాస్ బెలూన్లతో చిత్రీకరిస్తున్నప్పుడు.. అవి పేలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కారి్మకుడు మృతి చెందగా.. కృష్ణకు ప్రమాదం తప్పింది. ఓ సందర్భంలో గురజాడ కళాక్షేత్రంలో కృష్ణను టి.సుబ్బరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. సూపర్ మెమొరీ స్టార్ సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న మెమొరీ పవర్ మరే నటుడికీ లేదు. రెండు పేజీల డైలాగ్ అయినా సునాయాసంగా సింగిల్ టేక్‌లో చెప్పగలిగే నటుడు ఆయన మాత్రమే. చిన్నా పెద్ద అనే వ్యత్యాసం లేకుండా అందరి నటులను సమానంగా చూడగలిగే మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో చంద్రవంశం, గూఢాచారి 117, ఆయుధం వంటి సినిమాల్లో నటించాను. మంచి నటుడిని కోల్పోయాం. – ప్రసన్న కుమార్, సీనియర్ నటుడు, వైజాగ్ ప్రొడ్యూసర్ల హీరో తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్లకు నష్టం, కష్టం లేకుండా చూసుకునే ఏకైక నటుడు సూపర్‌స్టార్ కృష్ణ. సినిమా నిర్మించేప్పుడు నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహాయం చేసే మహా మనిíÙ. ఆయనతో చల్ మోహన్‌రంగ సినిమాకు నేను సహ నిర్మాతగా వ్యవహరించాను. అప్పటి జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనివి. –పురిపండ వెంకట రమణ శర్మ, నిర్మాత చిన్న నటులకు ప్రోత్సాహం సూపర్‌స్టార్ కృష్ణతో పని చేసిన జూనియర్ ఆరి్టస్ట్ను నేను. అల్లూరి సీతారామరాజు సినిమాలో గిరిజనుడి వేషధారణలో ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కింది. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. – బొబ్బాది అప్పారావు, జూనియర్ ఆర్టిస్ట్, వైజాగ్ -
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి రోజా
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన అల్లు అరవింద్
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్
-
అభిమాన హీరోని కడసారి చూసేందుకు పోటెత్తిన ఫ్యాన్స్
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
ఆయన మళ్లీ పుట్టాలి: ఫ్యాన్స్ ఆవేదన
-
గ్రేటర్ సూపర్ స్టార్.. నగరంపై నటశేఖరుడి ముద్ర
సాక్షి, హైదరాబాద్: కొండలు..గుట్టలు..అడవి..జనసంచారం లేని నిర్మానుష్యమైన ప్రాంతం. ఆ ప్రాంతానికి నడవడం, సైకిల్‌పై వెళ్లడం తప్పితే కార్లు, ద్విచక్రవాహనాలు వెళ్లలేని పరిస్థితి. అలాంటి ప్రదేశాన్ని తన అభిరుచికి అనుగుణంగా కష్టపడి అద్భుతమైన స్టూడియోగా నిర్మించారు సూపర్ స్టార్ కృష్ణ. సినీ పరిశ్రమ నగరంలో స్థిరపడడంలో సూపర్‌స్టార్ కీలక పాత్ర పోషించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పద్మాలయా స్టూడియో నిర్మాణం. ముఖ్యంగా ఫిలింనగర్ అభివృద్ధికి మూలం సూపర్‌స్టారే.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు 1981లో తరలిరాగా సినిమా షూటింగ్‌లకు అప్పట్లో అన్నపూర్ణ స్టూడియో మాత్రమే అందుబాటులో ఉండేది. పెద్ద ఎత్తున సినిమా షూటింగ్‌లు జరుగుతున్న హైదరాబాద్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పూర్తిగా ఇక్కడే స్థిరపడాలంటే మరో స్టూడియో అవసరాన్ని 50 సంవత్సరాల క్రితమే కృష్ణ గుర్తించారు. తెలుగు సినిమాల షూటింగ్‌లు మళ్లీ మద్రాసుకు వెళ్లకుండా హైదరాబాద్‌లోనే స్థిరపడాలన్న దృఢసంకల్పంతో ఇక్కడ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పడు ఉన్న జూబ్లీహిల్స్, ఫిలింనగర్ లాంటి కాలనీలు లేని ఆ కాలంలో హైదరాబాద్‌కు దూరంగా..విసిరేసినట్టుగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పద్మాలయ స్టూడియో నిర్మాణం కోసం 1983లో తొమ్మిదిన్నర ఎకరాలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన కృష్ణ.. వెనక్కి తిరిగి చూసుకోకుండా రెండేళ్ల వ్యవధిలోనే నాలుగు ఫ్లోర్లు నిర్మించి ఇక్కడే కోర్టు హాల్, పోలీసు స్టేషన్, దేవాలయం, మసీదు, చర్చి తదితర సెట్టింగ్‌లను నిర్మించారు. ఆ తర్వాత మొత్తం చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడగా పద్మాలయ స్టూడియోలో రేయింబవళ్లు ప్రతి రో జూ నాలుగైదు షూటింగ్‌లు జరుగుతూ కళకళలాడింది. కలల స్టూడియోగా... ఈ పద్మాలయ స్టూడియోను కృష్ణ తన కలల సౌధంగా తీర్చిదిద్దుకుని అపురూపంగా చూసుకునే వారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, రాజేష్ ఖన్నా వంటి నాటి బాలీవుడ్ హీరోల సినిమాలు కూడా ఈ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకొన్నాయి. రజనీకాంత్, కమలహాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి దక్షిణాది అగ్రహీరోల సినిమా షూటింగ్‌లు కూడా ఇదే స్టూడియోలో జరిగాయి. ముంబయి, మద్రాసు, కేరళ, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి షూటింగ్‌ల కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు పద్మాలయా స్టూడియోకు క్యూ కట్టడంతో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి నోచుకుంది. నాటి రాళ్లు, రప్పులు, రత్నాలుగా మారి ఈ ప్రాంతానికి ఎనలేని శోభను చేకూరింది. కృష్ణ తన షూటింగుల్ని ఫిలింనగర్‌లోని తన ఇంట్లో కూడా తీసేవారు. చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు పూర్తిగా తరలిరావడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్లతో పాటు కృష్ణ చేసిన కృషిని తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నటికీ మరిచిపోలేదు. కేవలం కృష్ణ కృషి వల్లే ఇప్పడు ఉన్న ఫిలింనగర్ ప్రాంతమంతా కళకళలాడుతోందని చెప్పొచ్చు. సొంత డబ్బుతో రోడ్లు ఇప్పుడు ఉన్న ఫిలింనగర్ రోడ్ నెం.1 ప్రధాన రహదారి నుంచి పద్మాలయ స్టూడియో వరకు తన సొంత డబ్బులతో కృష్ణ ఆ కాలంలో కంకర రోడ్డు వేయించి రాకపోకలను సులువు చేశారు. అదే సమయంలో ఫిలింనగర్‌లోనే సొసైటీ నుంచి ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారు. పూర్తిగా తన మకాంను హైదరాబాద్‌కు మార్చడంతో ఆయన సినిమా షూటింగ్‌లన్నీ పద్మాలయ స్టూడియోలో జరుగుతూ తెలుగు చిత్రపరిశ్రమ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లింది. అప్పట్లో పద్మాలయ స్టూడియో నిర్మించకపోతే మళ్లీ షూటింగ్‌లకు తెలుగు పరిశ్రమ మద్రాసుకు వెళ్లేదని పలువురు సినీ పెద్దలు కృష్ణ నిర్ణయాన్ని స్వాగతించారు. పద్మాలయా స్టూడియో నిర్మాణం తర్వాతనే పక్కనే రామానాయుడు స్టూడియో కూడా నిర్మాణం జరుపుకుంది. అనంతరం ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో నిర్మాణాలు జరిగి అనేక సౌకర్యాలు సమకూరాయి. అనతికాలంలో వృద్ధి చెందింది. అచ్చొచ్చిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్.. విజయదుందుభి మోగించిన సినిమాలెన్నో... ముషీరాబాద్: సినీ వినోద కేంద్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సినిమా థియేటర్లలో సూపర్ స్టార్ కృష్ణ సినిమా విడుదలైందంటే చాలు అభిమానులకు పండగే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దాని చుట్టు పక్కల గల సుమారు 15 థియేటర్లలో ఎప్పుడు ఏదో ఒక థియేటర్లో కృష్ణ సినిమా ఆడాల్సిందే. ఎక్కువగా సుదర్శన్ 35 ఎంఎం, 70 ఎంఎం, సంగం థియేటర్లలో కృష్ణ సినిమాలు విడుదలయ్యేవి. మొదటి రోజు సినిమా, ప్రివ్యూలు వీక్షించేందుకు కృష్ణ అనేక సార్లు క్రాస్‌రోడ్స్‌కు వచ్చి సినిమా వీక్షించే వారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ప్రజారాజ్యం, ఈనాడు సినిమాలు సంధ్యా థియేటర్లో వంద రోజులు ఆడి రికార్డులు సృష్టించాయి. పాడి పంటలు బసంత్ టాకీస్‌లో వంద రోజులు నడిచింది. ఇక సుదర్శన్ 70ఎంఎంలో అగ్నిపర్వతం 175 రోజులు ఆడగా..అల్లూరి సీతారామరాజు సంగం థియేటర్లో విడుదలై సంచలనం సృష్టించింది. మొట్టమొదటిసారిగా కోటి రూపాయల బడ్జెట్‌తో సినిమా స్కోప్‌లో డాల్బీ సౌండ్ సిస్టమ్‌లో విడుదలైన సింహాసనం దేవి థియేటర్లో విడుదలై శత దినోత్సవం జరుపుకొంది. దేవిలో ఆ సినిమా టికెట్లు నెల రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయంటే కృష్ణకు ఉన్న క్రేజ్ ఏ పాటితో ఇట్టే అర్థం అవుతుంది. ఇక కృష్ణ ఫ్యాన్స్ మిగిలిన వారికి భిన్నంగా ఎంతో ప్రత్యేకంగా ఉండేవారని పలువురు థియేటర్ల యజమానులు కొనియాడుతున్నారు. మహేష్‌బాబు సినిమాల్లోనే కాదు యాడ్స్‌లోనూ సూపర్ హీరోనే. కానీ కృష్ణ విషయానికి వస్తే... యాడ్ వరల్డ్‌తో ఆయనకు పరిచయమే లేదనుకుంటాం. అలాంటి కృష్ణ కూడా నగరానికి చెందిన రెండు సంస్థల యాడ్స్‌లో నటించారు. ‘మొదట ఆయన కూడా నాతో యాడ్ ఏమిటి? అన్నారు. అయితే నా కాన్సెప్ట్ విన్నాక కన్విన్స్ అయ్యారు. యాడ్ చిత్రీకరణ సందర్భంగా కొన్ని రోజులు ఆయనతో గడపడం నా జీవితంలో మరచిపోలేను. ఆయన సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయా’ అని చెప్పారు యాడ్ ఫిల్మ్ రూపకర్త యమునా కిషోర్. తొలి యాడ్‌ని పూర్తిగా ఇంట్లోనే తీస్తామని చెప్పి ఆయన్ని ఒప్పించామన్నారు. షూటింగ్ సమయంలో ఇంట్లో స్వంత మనుషుల్లా తమ టీమ్‌ను ఆదరించారంటూ గుర్తు చేసుకున్నారు. అలా తనపై ఏర్పడిన మంచి అభిప్రాయంతో ఆ తర్వాత మరో యాడ్‌కు కూడా ఆయన్ను సులభంగా ఒప్పించగలిగానని చెప్పారు. లలితకళాతోరణంలో సన్మానం... ‘1993లో ఒకసారి కృష్ణ, విజయనిర్మల దంపతులిద్దర్నీ కలిపి లలితకళాతోరణంలో సన్మానించే అవకాశం లభించింది. వీలున్నంత వరకూ సన్మానాలు, సభలు అంటే ఆయన దూరంగా ఉండేవారు పలు కార్యక్రమాలకు ఆహ్వానించినా సున్నితంగా కాదని చెప్పేవారు’ అంటూ గుర్తు చేసుకున్నారు నగరానికి చెందిన కిన్నెర ఆర్ట్స్ సంస్థకు చెందిన రఘురామ్. అయితే స్నేహానికి మాత్రం ఆయన దూరంగా ఎప్పుడూ లేరని, తనను ఒకసారి కలిస్తే మళ్లీ ఎక్కడ కలిసినా గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించేవారని చెప్పారు. చిన్ననాటి మిత్రులు.. సూపర్ స్టార్ డమ్ వచ్చినా చిన్ననాటి ఫ్రెండ్స్‌ని మాత్రం కృష్ణ ఎప్పుడూ మరచిపోలేదని ఆయన స్నేహితులు అంటున్నారు. ‘‘కృష్ణ నేను కలిసి చదువుకున్నాం. తర్వాత కూడా ఆయనతో కలిసి పలు సినిమాల్లో నటించాను. సినిమాకు సంబంధించి అన్ని శాఖల మీదా కృష్ణకు ఉన్నంత పట్టు నేను మరెవ్వరిలో చూడలేదు’’ అంటూ చెప్పారు నాగోలు నివాసి, ప్రముఖ సినీ విశ్లేషకులు ఎస్వీ రామారావు. కృష్ణ జ్ఞాపకాల్లో... నటశేఖరుడితో ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం.. సూపర్‌స్టార్‌ని తలచుకుంటున్న నగరం ఒకసారి కలిస్తే మరచిపోలేం అంటున్న సిటీజనులు ఆయన గురించి పుస్తకం రాశా... ‘సినిమా ప్రముఖుల గురించి పుస్తకాలు రాస్తున్న క్రమంలో కృష్ణగారిని కూడా కలిశాను. ఆయన గురించి రాస్తున్నాను అనగానే శుభాకాంక్షలు చెప్పారు’ అంటూ గుర్తు చేసుకున్నారు గురుప్రసాద్. తాను రాసిన సూపర్ స్టార్ పుస్తకాన్ని నగరానికి చెందిన కిన్నెర పబ్లికేషన్స్ ప్రచురించిందని, ఆ పుస్తకాన్ని కృష్ణగారి ఇంట్లోనే ఆవిష్కరించామని’ చెప్పారాయన. డేరింగ్ డాషింగ్ అనే పదాలకు సిసలైన అర్ధంగా నిలుస్తారంటూ కొనియాడారు. ఇల్లు, పద్మాలయా ఆఫీసు, మరీ ముఖ్యమైన వేడుకల్లో తప్ప నగరంలో మరెక్కడా ఎవరినీ కలవడానికి కృష్ణ ఆసక్తి చూపేవారు కాదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సమకాలీకులతో పోటీగా ఏ రంగంలోనూ అయినా సై అనే కృష్ణ ఎన్టీయార్‌లాగే నగరంలో థియేటర్స్ ఏర్పాటు ఆలోచన కూడా చేశారని కొందరు అంటున్నారు. అయితే ఆ తర్వాత అది ఆచరణలో విజయవాడకు మారింది. సాయం చేసే గుణం... సూపర్ స్టార్ దాతృత్వం గురించి నిర్మాతల శ్రేయస్సు విషయంలో చూపే శ్రద్ధ గురించి సినీ పరిశ్రమలో కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే జూనియర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న వేషాలు వేసుకునేవారి పట్ల కూడా అంతే ఉదారంగా ఆయన ప్రవర్తించేవారని కృష్ణానగర్ వాసులు అంటున్నారు. తన దగ్గర డూప్‌గా 20 ఏళ్ల పాటు పనిచేసిన నెల్లూరు వాసి ఆ తర్వాత అనారోగ్యం కారణంగా మంచం పడితే..అతను బతికున్నంత వరకూ పనిచేసినప్పుడు ఇచ్చినట్టే అంతే మొత్తం నెలనెలా జీతంలా పంపేవారని గుర్తు చేసుకున్నారు. ఆప్యాయత చూపేవారు నానక్‌రాంగూడ వాసులంటే కృష్ణ, విజయనిర్మలకు చాలా ఇష్టం, ఎంతో ఆప్యాయంగా ఇంట్లోకి పిలిచి మాతో మాట్లాడేవారు. స్థానిక ఆలయాల అభివృద్దికి చేయూత అందించారు. ఎలాంటి పూజలు, శుభ కార్యాలున్నా సమయాన్ని బట్టి వచ్చేవారు. ఆ యనతో ఉన్న అనుబంధం మాటాల్లో చెప్పలేనిది. :::కైలాస్సింగ్– నానక్‌రాంగూడ పాన్ ఇండియా సినిమా ఆనాడే తీశారు. మొదటి పాన్ ఇండియా సినిమాను ఆనాడే సూపర్‌స్టార్ కృష్ణ తీశారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ అన్ని భాషల్లో తీసి సత్తా చాటారు. ఇది రష్యా దేశంలోనూ బాగా ఆడింది. మల్టీస్టారర్ సినిమాలను కూడా చాలా తీశారు. ‘హీరోలందంరం ఒక్కటిగా ఉంటాం. మీరెందుకు పోట్లాడుతారు. అందరినీ గౌరవించాలి’ అని అభిమాన సంఘాలను ఆదేశించేవారు. తుపాను వచ్చినప్పుడు ఆయన ఆదేశాలతో దివిసీమలో సేవా కార్యక్రమాలు చేపట్టాం. రక్తదాన, అన్నదాన, వైద్య శిబిరాలు నిర్వహించి ఆపన్నులను ఆదుకున్నాం. ఆయనపై ఉన్న అభిమానంతో నా కుమారుడి పేరు కూడా కృష్ణగా పెట్టుకున్నా :::దిడ్డి రాంబాబు, కృష్ణ, మహేష్ సేన నాయకులు తట్టుకోలేక పోతున్నా... కృష్ణ మరణం తట్టుకోలేక పోతున్నా. వెంటనే ఆస్పత్రికి వచ్చాను. ఆయనపై ఉన్న అభిమానంతో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాను. అభిమాన సంఘాలతో కలిసి సేవాకార్యక్రమాలు చేపట్టాం. కృష్ణ లేడనే మాట వింటేనే ఎంతో బాధగా ఉంది. ::: బి.కృష్ణ, బీడీఎల్ ఉద్యోగి ఏటా మా క్యాసెట్‌ను ఆవిష్కరించేవారు ప్రతి యేటా మా కంపెనీ దివ్యజ్యోతి ఆడియోస్ క్యాసెట్‌ను మొదట కృష్ణ ఆవిష్కరించేవారు. ప్రతియేటా డిసెంబర్ 12న జరిగే అయ్యప్ప పూజల్లో పాల్గొనేవారు. స్థానిక ఆలయానికి ఎంతో సహకారం అందించారు. ఆయనతో నానక్‌రాంగూడకు 20 ఏళ్ళుగా ఎంతో అనుబంధం ఉంది. ::: జి.ముత్యంరెడ్డి– నానక్‌రాంగూడ మా అమ్మాయి వివాహానికి హాజరయ్యారు కృష్ణ కుటుంబంతో నానక్‌రాంగూడకు 20 ఏళ్ళుగా అనుబంధం ఉంది. ఇద్దరూ మాకు పెద్ద దిక్కుగా ఉండేవారు. మా అమ్మాయి వివాహానికి కూడా ఆయన హజరయ్యారు. ఆయన మృతిని తట్టుకోలేకపోతున్నాం. :::రమేష్‌గౌడ్–నానక్‌రాంగూడ తరలివచ్చిన అభిమానగణం అభిమానులతో నానక్‌రాంగూడ నిండిపోయింది. సూపర్‌స్టార్ కృష్ణ మృతి వార్త విన్న వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు ఆయన నివాసానికి తరలివచ్చారు. దీంతో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు పర్యవేక్షణలో అభిమానులను కట్టడి చేయాల్సి వచ్చింది. ఊహించని రీతిలో నానక్‌రాంగూడకు అభిమానులు చేరుకోవడంతో విప్రో సర్కిల్ నుంచి నానక్‌రాంగూడలోని సూపర్‌స్టార్ కృష్ణ ఇంటి వరకున్న రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. అనంతరం సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కృష్ణ నివాసానికి రావడానికి మార్గం సుగమం చేశారు. ‘సూపర్ స్టార్ అ మర్ రహే’ నినాదాలతో ఆప్రాంతం హోరెత్తింది. నానక్‌రాంగూడలోని ఆయన నివాసంలో ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాం«దీ, గచ్చి»ౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి కృష్ణకు నివాళులు అర్పించారు. విజయకృష్ణ నిలయం.. ఎంతో ప్రత్యేకం నటశేఖర కృష్ణకు గచ్చిబౌలి డివిజన్లోని నానక్‌రాంగూడతో విడదీయలేని బంధం ఉండేది. ముఖ్యంగా నానక్‌రాంగూడలో నిర్మించిన తన స్వగృహం ‘విజయకృష్ణ నిలయం’ అంటే ఆయనకు అమితమైన ఇష్టం. నానక్‌రాంగూడలో 1996లో స్థలాన్ని కొనుగోలు చేశారు. అనంతరం అక్కడే ఇంటి నిర్మాణం చేసుకోవాలని నిర్ణయించి 2005లో నిర్మాణం పూర్తి చేసి దానికి ‘విజయకృష్ణ నిలయం’ అని నామకరణం చేశారు. విజయకృష్ణ నిలయం ప్రాంగణంలోనే కృష్ణ, విజయనిర్మల దంపతులు కూరగాయలు, పండ్ల మొక్కలు నాటి పెంచారు. ఈ నిలయంలో ప్రతిఏటా వారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. అభిమానులు పెద్ద సంఖ్యలో దూరం నుంచి వచ్చి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయించేవారు. 9 ఏళ్లుగా కాంటినెంటల్ ఆస్పత్రికే... నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డ్రిస్టిక్ట్ ప్రాంతంలోని కాంటినెంటల్ ఆస్పత్రితో తొమ్మిదేళ్ల క్రితం అనుబంధం ఏర్పడింది. ఇంటికి చేరువలోనే ఉండడంతో ఈ ఆస్పత్రిలో రెగ్యులర్ చెకప్ కోసం, చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెళ్లేవారు. చివరకు చికిత్స పొందుతూ కాంటినెంటల్ ఆస్పత్రిలోనే మృతి చెందారు. అక్క డి వైద్యులు ముఖ్యంగా కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డితో ఆయనకు మంచి స్నేహబంధం ఉంది. ప్రతియేటా సందడి.. నానక్‌రాంగూడకు చెందిన జి.ముత్యంరెడ్డి, డి.మాణిక్‌రెడ్డి నిర్మాతలుగా ఏర్పాటు చేసిన ‘దివ్యజ్యోతి ఆడియోస్’ అనే అయ్యప్ప స్వామి భక్తిగీతాల క్యాసెట్‌ను నటశేఖర కృష్ణ, విజయనిర్మల ప్రతి యేటా ఇక్కడే విడుదల చేసేవారు. నానక్‌రాంగూడలో జరిగే పలు శుభకార్యాలు, పూజాకార్యక్రమాలకు తప్పకుండా హాజరయ్యేవారు. నానక్‌రాంగూడలోని అమ్మవారి ఆలయం అంటే కూడా కృష్ణ, విజయనిర్మలకు చాలా భక్తి ఉండేది. ప్రతి నెలా ఆలయానికి కొంత మొత్తం విరాళంగా ఇస్తూ వస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నానక్‌రాంగూడలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విధిగా కృష్ణ, విజయనిర్మల, నరేష్‌తో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేవారు. -
మల్టీస్టారర్స్ తో ట్రెండ్ సెట్ చేసిన సూపర్ స్టార్
-
సూపర్‌స్టార్ కృష్ణకు మంగళగిరితో అనుబంధం మరువరానిది
మంగళగిరి: సినీనటుడు సూపర్‌స్టార్ కృష్ణకు మంగళగిరితో అనుబంధం మరుపురానిది. కృష్ణ చిన్నతనం నుంచే మంగళగిరిలో వేంచేసిఉన్న లక్ష్మీనృసింహస్వామి తిరునాళ్లకు ప్రతి ఏడాది తన స్నేహితులతో కలసి వచ్చి సరదాగా గడిపేవారు. ఈ నేపథ్యంలో నృసింహుని ఆలయం పక్కనేగల రమణమూర్తి నివాసం వద్ద ఇంటి ముందు అరుగులపై నిద్రించేవాడని రమణమూర్తి గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో నటించడం ప్రారంభమైన తరువాత కూడా మంగళగిరిని మర్చిపోని కృష్ణ తన నాలుగు చిత్రాలకు సంబంధించి షూటింగ్ మంగళగిరిలో నిర్వహించారు. సావాసగాళ్లు, పట్నవాసం, పల్నాటి సింహం, రక్త తర్పణం సినిమాల షూటింగ్ మంగళగిరి కేంద్రంగా ఎన్నో రోజులు జరిగింది. ఆలయ ఆవరణలో సావాసగాళ్లు, పల్నాటి సింహం సినిమాలకు సంబంధించిన పాటల చిత్రీకరణ జరిగింది. కృష్ణకు మంగళగిరికి చెందిన వీరాభిమానులు ఎంతో మంది ఉన్నారు. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరికి చెందిన ఫేవరెట్ టైలర్ మహ్మద్‌అలీ కృష్ణకు బట్టలు కుట్టి అందించేవారు. కృష్ణ మృతి వార్తతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పలువురు నివాళులరి్పంచేందుకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. -
ఒకే సంవత్సరంలో ఎక్కువ సినిమాలలో నటించిన కృష్ణ
-
రాజీవ్‌గాంధీతో సాన్నిహిత్యం... వైఎస్ఆర్తో అనుబంధం
-
కనుమరుగైన నటశేఖరుడు
తెలుగు చలనచిత్ర సీమలో సాహసిగా, సూపర్ స్టార్‌గా, నటశేఖరుడిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రేక్షక నీరాజనాలందుకున్న సీనియర్ నటుడు కృష్ణ కన్నుమూశారు. ఆయనకు ముందూ తర్వాతా వెండితెరనేలిన నటీనటులు ఎందరో ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు గడించినవారూ ఉన్నారు. కానీ సినీ పరిశ్రమలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ మనసున్న మనిషిగా, మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న విశిష్ట వ్యక్తి హీరో కృష్ణ. చిన్నతనంలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు పోస్టర్లు చూసి, ఆ తర్వాత వారి సినిమాలు చూసి వ్యామోహంలో పడిపోయిన కుర్రాడొకడు పెరిగి పెద్దయి డిగ్రీ చదువులకెదిగినప్పుడు ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు సన్మానసభను కళ్లారా చూశాక ఇక సినిమా రంగమే తన సర్వస్వంగా భావించు కోవటం తెలుగు ప్రేక్షకుల అదృష్టం. ఆ నిర్ణయం వారికొక ‘డేరింగ్ అండ్ డాషింగ్ హీరో’ను అందించింది. ఆ తర్వాత దశాబ్దాలపాటు తనదైన నటనతో, తనకే సొంతమైన సాహసాలతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆయన అబ్బురపరిచారు. దేనిపైనైనా ఇష్టం కలగడం వేరు...ఆ ఇష్టాన్ని సాకారం చేసుకోవడానికి అవసరమైన కృషి, పట్టుదల కలిగి ఉండటం, లక్ష్య సాధన కోసం ఎన్ని కష్టాలకైనా సిద్ధపడటం వేరు. కృష్ణలో అవి పుష్కలంగా ఉండబట్టే అచిరకాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకోగలిగారు. రెండు నట దిగ్గజాలు– ఎన్టీఆర్, ఏఎన్నార్ తమ నటనావైభవంతో వెండితెరను జిగేల్మనిపిస్తున్న కాలంలో ఇదేమంత సులభం కాదు. కానీ కృష్ణ దాన్ని సాధించారు. తనకు స్ఫూర్తినిచ్చిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకే అనంతరకాలంలో ఆయన పోటీనిచ్చారు. నటుడిగా ఉంటూనే సినిమా రంగంలోని సమస్త విభాగాలపైనా పట్టు సాధించారు. నిర్మాతగా మారారు. దర్శకుడిగా పనిచేశారు. స్టూడియో అధినేత అయ్యారు. ప్రేక్షకుల అభిరుచేమిటో, వారిని మెప్పించేదేమిటో తెలుసుకోవటం, మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం నటుడిగా దూసుకెళ్లటానికి దోహదపడతాయి. కృష్ణ సినీ జీవితంలో అపజయాలు లేవని కాదు. నటుడిగా ఆయన నిమ్నోన్నతాలు రెండూ చూశారు. కానీ విజయాలు సాధించినప్పుడు పొంగిపోవటం, వైఫల్యాలెదురైనప్పుడు కుంగిపోవటం కృష్ణకు అసలే పొసగనిది. అందుకే నిబ్బరంగా అడుగులేస్తూ అసాధ్యుడనిపించుకున్నారు. ప్రేక్షకులకు కావా ల్సిందేమిటో గ్రహించటమే కాదు... వారికి ఎలాంటి అభిరుచులుండాలో కూడా నేర్పారు. కథల ఎంపికలో, సాంకేతికతలను కొత్త పుంతలు తొక్కించటంలో కృష్ణది ఒక విలక్షణమైన దారి. ఆ దారిలో నడవాలంటే అన్యులు భయపడేంతగా ఆ ప్రయోగాలుండేవి. యాదృచ్ఛికమే కావొచ్చు గానీ... ఆయన తొలి చిత్రం ‘తేనెమనసులు’ సాంఘిక చిత్రాల్లో తొలి కలర్ చిత్రం కాగా, అనంతర కాలంలో వచ్చిన ‘గూఢచారి 116’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘అల్లూరి సీతారామరాజు’ వంటివి దేనికవే కొత్త ప్రయోగాలు. సినీ జగత్తులో ఏ కొత్త సాంకేతికత ప్రవేశించినా దాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనిదే నిద్రపోని వ్యక్తిత్వం ఆయనది. ఆ సాంకేతికతకయ్యే వ్యయం తెలుగులో గిట్టుబాటు కాదని అందరూ అనుకునే రోజుల్లో ఆయన వెనకా ముందూ ఆలోచించ కుండా వాటిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సినిమా వీక్షణను ఒక అపురూపమైన అనుభవంగా మిగిల్చారు. తొలి పూర్తి సినిమా స్కోప్, తొలి 70 ఎంఎం వంటివన్నీ కృష్ణ చేతుల మీదుగానే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాయి. వారిని చకితుల్ని చేశాయి. సమ్మోహన పరిచాయి. అప్పట్లో హాలీవుడ్ సినిమాలను ఏలుతున్న కౌబాయ్నీ, జేమ్స్‌బాండ్‌నీ మన వెండితెరకు పరిచయం చేసింది కూడా ఈ సూపర్ స్టారే. ‘గూఢచారి 116’లో జేమ్స్‌బాండ్‌గా, ‘మోసగాళ్లకు మోసగాడు’లో కౌబాయ్‌గా ఆయన చేసిన ఫైట్లూ, ఛేజింగ్‌లూ సాధారణ ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. మనవాళ్లను మాత్రమే కాదు... తమిళ, మలయాళ, బెంగాలీ ప్రేక్షకులనూ కట్టిపడేశాయి. ఇంగ్లిష్, రష్యన్, స్పానిష్ భాషల్లో సైతం కొన్ని చిత్రాలు విడుదలయ్యాయి. ఎన్టీఆర్ ఎంతో మనసుపడిన ‘అల్లూరి సీతారామరాజు’ను తానే చేయాలని నిర్ణయించుకుని, దిగ్గజాలు అనుకున్నవారంతా వెనక్కిలాగుతున్నా దాన్ని తన వందవ చిత్రంగా ఎంపిక చేసుకుని కృష్ణ ఒక పెద్ద సాహసమే చేశారు. తెలుగువారి ‘విప్లవజ్యోతి’ని కళ్లకు కట్టారు. దాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దారు. ఆ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించటం కష్టమని జోస్యం చెప్పినవారంతా అది ఏకంగా 175 రోజులు ఆడటం చూసి ‘ఔరా’ అనక తప్పలేదు. తన సొంత చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’ హిందీ అనువాదానికి సెన్సార్ అడ్డంకులెదురైనప్పుడు న్యాయస్థానాల్లో అవిశ్రాం తంగా పోరాడి వాటిని అధిగమించారు. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ రాజకీయాల్లో సైతం తనదైన ముద్రవేశారు. లెక్కకు మిక్కిలి సాహసాలు చేసిన నటుడిగా, నిర్మాతల హీరోగా, సాధారణ సినీ కార్మిక కుటుంబాల బాగోగుల కోసం తపించిన వ్యక్తిగా కృష్ణ చిరకాలం గుర్తుండి పోతారు. ఉన్నత శిఖరాలకెదగటం, ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోవటం, సంపద గడించటం సినీ రంగంలో చాలామందికి సాధ్యపడి ఉండొచ్చు. కానీ సమాజానికి ఎంతోకొంత తిరిగి అందించటం తోటి మనిషిగా తన కర్తవ్యమని ఎంచి, తన ఆలంబన అందరికీ చల్లని నీడనివ్వాలని, తన చుట్టూ ఉన్నవారంతా సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న కృష్ణవంటివారు చాలా అరుదు. ఆ ‘మనసున్న మనీషి’కి ‘సాక్షి’ నివాళులు. -
కలిసే చనిపోవాలనుకున్నారేమో!: కృష్ణం రాజు భార్య కంటతడి
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకప్పటి తరం హీరోలందరూ కన్నుమూశారంటూ తెలుగు ప్రజలు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు.. ఇలా సీనియర్ హీరోలందరూ మన మధ్య లేకపోవడంతో ఒక తరం శకం ముగిసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా నేడు ఉదయం తెల్లవారుజామున కృష్ణ మరణించారు. ఇండస్ట్రీకి చెందిన పలువురూ ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణం రాజు భార్య శ్యామ దేవి కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం కన్నీటి పర్యంతమయ్యారు. 'కృష్టం రాజుకి కృష్ణ అంటే ఎంతో అనుబంధం. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు. వెళ్లిపోయేటప్పుడు కూడా కలిసే వెళ్లిపోదాం అనుకున్నారేమో! అందుకే మనందరికీ ఇంత బాధను మిగిల్చి ఇద్దరూ ఒకేసారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మహేశ్‌బాబు వరుసగా అన్న, తల్లి, తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం. సుల్తాన్ సినిమా దగ్గరి నుంచి కృష్ణగారి కుటుంబంతో నాకూ మంచి అనుబంధమేర్పడింది. షూటింగ్లో భాగంగా అండమాన్‌లో నెల రోజులపాటు ఉన్నప్పుడు విజయ నిర్మల గారు వంట చేసి పెట్టేవారు. మొన్న కృష్ణ బర్త్‌డేకి కూడా కృష్ణం రాజు గారు ఫోన్ చేసి ఇంటికి రా, చేపల పులుసు చేసి పెడతానన్నారు. అలాంటిది.. ఈరోజు వాళ్లిద్దరూ లేరంటే తట్టుకోలేకపోతున్నాం. భూమి, ఆకాశం ఉన్నంతవరకు వారు చిరస్మరణీయులుగా మిగిలిపోతారు' అని చెప్తూ ఏడ్చేసింది శ్యామలా దేవి. కాగా రెబల్ స్టార్ కృష్ణం రాజు సెప్టెంబర్ 11న తనువు చాలించారు. చదవండి: కృష్ణ పార్థివదేహం వద్ద బోరున ఏడ్చేసిన మోహన్‌బాబు అదే సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి చిత్రం.. -
సూపర్‌స్టార్ కోసం ఒక సీట్ రిజర్వ్.. నవరంగ్ థియేటర్ ఘననివాళి
సాక్షి, విజయవాడ: సూపర్‌స్టార్ కృష్ణకు నవరంగ్ థియేటర్ యాజమాన్యం ఘననివాళులు అర్పించింది. విజయవాడలో గల ఈ థియేటర్‌కు కృష్ణ గతంలో అనేకమార్లు వచ్చారు. ఈనేపథ్యంలో సూపర్‌స్టార్ కృష్ణ కోసం థియేటర్ యాజమాన్యం రోజు మొత్తం ఒక సీటు రిజర్వ్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంది. సూపర్ కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్లో ఉదయం ఆటలను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తెలిపారు. ఇదిలాఉంటే, కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈమేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. చదవండి: (CM Jagan: రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్) -
ఇల్లు కట్టుకోవడానికి సాయం చేశారు: పరుచూరి ఎమోషనల్
సూపర్ స్టార్ కృష్ణ మరణంపై ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పరుచూరి గోపాలకృష్ణ ఎమోషనలయ్యాడు. కృష్ణ తనకు చేసిన సాయాన్ని ఎన్నటికీ మరువలేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కృష్ణ గురించి ఆయన మాట్లాడుతూ.. 'బంగారు భూమి సినిమాలో నాలుగైదు సీన్లకు డైలాగ్ రైటర్స్‌గా పని చేశాం. పీసీ రెడ్డి గారు సినిమా ఆరంభంలో పేరు వేయించుకోమన్నారు. కానీ ఆ సినిమాకు పెద్ద రచయితలు పని చేశారు, వారి పక్కన మా పేరెందుకని వద్దన్నాను. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. 'పద్మ.. మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు. మట్టిని నమ్మితే మన నోటికింత ముద్ద పెడుతుంది. ఆ మట్టికి నమస్కారం చేయి..' ఈ డైలాగ్ కృష్ణగారికి బాగా నచ్చింది, వెంటనే ఎవరు రాశారని అడగడంతో అది నేనే అని పీసీరెడ్డి చెప్పారు. నేను ఇండస్ట్రీలో పెద్దవాడిని అవుతానని ఆయన జోస్యం పలికారు. ఇండస్ట్రీలో ఆయన ఎంతోమందికి సాయం చేశారు. నాకు సినిమాలు లేని సమయంలో ఇల్లు కట్టుకోవడానికి ఆయన డబ్బులు పంపించారు. అది తీసుకున్న మరుసటి రోజే కొబ్బరికాయ కొట్టి ఇల్లు కట్టాను. అందరికంటే ఎక్కువగా కృష్ణగారి 54 సినిమాలకు మా కలం ఉపయోగపడింది. ఆయన బంగారు మనసు మహేశ్‌బాబుకు వచ్చింది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: కృష్ణ సినిమాల్లోకి రావడానికి కారణమెవరో తెలుసా? -
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రభాస్
-
సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగుజాతికి తీరని లోటు: నాట్స్
ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలిపింది. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో కృష్ణ సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని నాట్క్ పేర్కొంది. నటుడిగానే కాకుండా అందరికి ఆత్మీయుడిగా, నిర్మాతల నటుడిగా ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన కృష్ణ ఇక లేరనే విషయం జీర్ణించుకోలేనిదని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ట మరణ వార్త అమెరికాలో తెలుగువారందరిని కలవరపరిచిందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి పేర్కొన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఇటీవల వరుసగా కృష్ణ కుటుంబంలో నలుగురు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం దురదృష్ణకరమన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
మిస్ యూ.. సూపర్‌స్టార్
-
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐకి నో చెప్పిన హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ సింగిల్ జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి అధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్ టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు నానక్‌రామ్‌గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న కేసీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Viral Video: ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు ఖెర్సన్ నుంచి రష్యా బలగాలు వైదొలగడంతో ఉక్రెయిన్‌లో పండగ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నగరమంతా రష్యా బలగాలను తరిమికొట్టేశాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఆనందంగా ప్రకటించారు. ఈ మేరకు వెనక్కు మళ్లుతున్న రష్యా సేనాలు ఎలాగో పోరాడలేకపోయం కదా పోతూపోతూ... ఖెర్సన్ ప్రాంతంలో జూలోని జంతువులను పట్టుకుపోతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ హీరోగా వందల సినిమాలు చేసిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. హీరో, నిర్మాత, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్ అందించి చరిత్ర సృష్టించారాయన. అయితే తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ చివరికి ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం! ధోనికి కీలక బాధ్యతలు.. త్వరలోనే బీసీసీఐ ప్రకటన ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియాది నెం1 స్థానం. ద్వైపాక్షిక సిరీస్‌లలో దుమ్మురేపుతున్న భారత జట్టు.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. చివరిసారిగా 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుచుకుంది. అప్పటి నుంచి భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 150 అడుగుల లోయలో చావు బతుకుల్లో బాలుడు..‘యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది సార్’ ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ట్రెక్కింగ్ సమయంలో జోరున వర్షం. వర్షం ధాటికి వెనక్కి రాలేం. ముందుకు రాలేం. అలా అని అక్కడే ఉండిపోలేం. అచ్చం ఆ కుర్రాడు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి పై నుంచి 130 నుంచి 150 అడుగుల లోయలో పడ్డాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పిక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బి నీలం, ఎరుపు రంగులో కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే కాళ్ల దగ్గర ఉండే ఈ సిరలు దెబ్బతినడం, లేదా పై వైపునకు వెళ్లాల్సిన రక్తం సాఫీగా ప్రవహించకపోవడంతో కాళ్ల కింది భాగంలో, ప్రధానంగా పిక్కల వంటి చోట్ల రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఇలా కనిపించడాన్ని ‘వేరికోస్ వెయిన్స్’ అంటారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ప్రేయసి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సూపర్ స్టార్ కృష్ణ మరణం.. రాజమౌళి ఎమోషనల్ ట్వీట్
సూపర్ స్టార్ కృష్ణ గారి ఆకస్మిక మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని దర్శకధీరుడు రాజమౌళి విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. 300కు పైగా సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చలనచిత్ర రంగానికి సూపర్ స్టార్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సినీ పరిశ్రమలో కొత్త టెక్నాలజీ పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, అభిరుచి ప్రత్యేకంగా నిలుస్తాయని రాజమౌళి కొనియాడారు. కృష్ణ మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన ట్వీట్ చేశారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించడానికి ఆయన చేసిన ధైర్యం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. టాలీవుడ్లో మొదటి 70 ఎమ్ఎమ్ చిత్రం, తొలి కలర్ సినిమాతో పాటు ఇతర చిత్రాలతో తెలుగు సినిమాని విప్లవాత్మకంగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. మనం ఎంచుకున్న మార్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయొద్దనే విషయాన్ని ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయన్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో మహేష్ బాబు, అతని కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు. Extremely saddened to hear about the sudden demise of Superstar Krishna Garu. Krishna garu's contribution to the telugu film field as an actor in 300+ films, director, and producer are well known. What sets him apart from the rest is his love and passion for newer technologies. — rajamouli ss (@ssrajamouli) November 15, 2022 -
సూపర్ స్టార్ కృష్ణ మృతి: రేపు షూటింగ్స్ బంద్!
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ తెలుగు చిత్రపరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమాలకు సంబంధించి అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి పేర్కొంది. కాగా ఘట్టమనేని కృష్ణ 1943లో మే 31 జన్మించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం ఆయన స్వస్థలం. 1965వ సంవత్సరంలో “తేనె మనసులు” చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించారు కృష్ణ. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. దాదాపు 350 సినిమాలలో హీరోగా నటించారు. ఈస్ట్‌మన్‌కలర్, 70MM, DTS సౌండ్, సినిమా స్కోప్లను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పద్మాలయా స్టూడియోస్, పద్మాలయా ప్రొడక్షన్ హౌస్‌లను స్థాపించి అన్ని భారతీయ భాషలలో అనేక చిత్రాలను నిర్మించారు. 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2009లో “పద్మభూషణ్”, 1974లో ఉత్తమ నటుడిగా “అల్లూరి సీతారామరాజు” సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. అలాగే 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ - సౌత్‌తో పాటు 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 1989లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా కూడా ప్రాతినిధ్యం వహించారు. చదవండి: కృష్ణ నటించిన ఆఖరి చిత్రం ఏంటో తెలుసా? -
సూపర్ స్టార్ మనసులో మాట..
-
రేపు హైదరాబాద్ కు సీఎం వైఎస్ జగన్
-
కృష్ణ సినిమాల్లోకి రావడానికి ఆ హీరోనే కారణం!
మంచితనానికి నిలువెత్తు నిదర్శనం సూపర్ స్టార్ కృష్ణ. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా రాణించారాయన. గతంలో ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయటపెట్టారు. మరి ఆయన ఏమని మాట్లాడారో ఓసారి చూద్దాం.. 'పౌరాణికం, జానపదం, సాంఘికం, హారర్, విప్లవం.. ఇలా అన్నిరకాల సినిమాలు చేశాను. అందుకు సంతృప్తిగా ఉంది. అల్లూరి సీతారామరాజు, ఈనాడు వంటి సినిమాల్లో పోషించిన పాత్రలు నాకెంతో ఇష్టం. నేను సినిమాల్లోకి రావడానికి అక్కినేని నాగేశ్వరరావు స్ఫూర్తి. నిజానికి నేను నందమూరి తారకరామారావు అభిమానిని. కానీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఆయనను ఎప్పుడూ నేరుగా చూడలేదు. అయితే నాగేశ్వరరావును మాత్రం నాలుగుసార్లు చూశాను. అప్పుడు సినిమా ఆర్టిస్టులకున్న క్రేజ్ చూసి నేనూ ఆర్టిస్ట్ అవుదామనుకున్నా! అలా మొదటిసారి తేనె మనసులు చిత్రంలో నటించా. ఏడు సంవత్సరాలలోనే వంద సినిమాలు చేశాను' అని చెప్పుకొచ్చారు కృష్ణ. చదవండి: కృష్ణ చివరి చిత్రం ఏంటో తెలుసా? ఆయన లేరన్న వార్త విని గుండె పగలింది: రామ్‌చరణ్ -
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన కేటీఆర్
-
CM Jagan: హైదరాబాద్‌కు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే, కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చదవండి: (కృష్ణ గొప్ప నటుడే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మనిషి: డిప్యూటీ సీఎం) -
మహేష్ బాబును పరామర్శించిన శరత్ కుమార్
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన రామ్ చరణ్
-
ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన అకాల మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. వెండితెరపై 350 వందలకు పైగా చిత్రాలు చేసి వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. హీరోగా వందల సినిమాలు చేసిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. హీరో, నిర్మాత, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్ అందించి చరిత్ర సృష్టించారాయన. అయితే తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ చివరికి ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూశారు. అవేంటంటే.. మనవడితో కలిసి తెరపై సందడి చేయాలనుకున్నారు… ‘వన్ నేనొక్కడినే’ మూవీతో ఆయన మనవడు, మహేశ్ కుమారుడు గౌతమ్ కృష్ణ వెండితెరకు పరిచయం అయ్యాడు. దాంతో మనవడితో నటించాలని ఉందని ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో, మూవీ విడుదల తర్వాత కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. కానీ అది కుదరలేదు. మంచి కథ వస్తే మహేశ్‌తో కలిసి మరో సినిమాలో నటించాలనుకున్నారు. కానీ ఆ కోరిక కూడా తీరలేదు. అయితే కృష్ణ తన కుమారులు మహేశ్, రమేశ్ బాబులతో కలిసి చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. తండ్రి నటించిన పలు చిత్రాల్లో మహేశ్ బాలనటుడిగా కనిపించారు. ఆయనను జేమ్స్ బాండ్‌గా చూడాలనుకున్నారు.. తెలుగు తెరకు జెమ్స్‌బాండ్ తరహా పాత్రని పరిచయం చేసింది కృష్ణే. గూఢఛారి 116, రహస్య గూఢచారి వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా గుర్తింపు పొందారు. తనలానే కుమారుడు మహేశ్‌ను కూడా జేమ్స్ బాండ్ పాత్రలో చూడాలనుకున్నారాయన. ఇదే విషయాన్ని పలు ఇంటర్య్వూలో ఆయన పేర్కొన్నారు. మహేశ్‌ను ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారంటూ జెమ్స్‌బాండ్‌గా అని ఆయన సమాధానం ఇచ్చారు. దాంతో మహేశ్‌ను జేమ్స్‌బాండ్‌గా చూడాలనే కృష్ణ కోరిక తీరకుండానే మిగిలిపోయింది. కాగా మహేశ్-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో మహేశ్ జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే నిజమైతే కృష్ణ కోరిక తీరినట్టే.. కానీ తెరపై మహేశ్‌ను జెమ్స్‌బాండ్‌గా చూసి మురిసిపోవాలనుకున్న ఆయన ఆశ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఆయన మనసు పడ్డ పాత్రలో నటించకుండానే.. తెరపై విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేసిన కృష్ణకు చత్రపది శివాజీగా చేయాలనేది ఆయన కోరిక. అల్లూరి సీతారామరాజుగా వెండితెరపై చెరగని ముద్ర వేసుకున్న ఆయన ఆ తర్వాత మనసు పడ్డ మరో పాత్ర.. ఛత్రపతి వీర శివాజీ. చంద్రహాస సినిమాలో కృష్ణ శివాజీ పాత్రలో నటించారు. అయితే.. అది పూర్తిస్థాయి పాత్ర కాదు. కాసేపు మాత్రమే. దానికి తృప్తి చెందని కృష్ణ పూర్తి స్థాయిలో చత్రపతి శివాజీ సినిమా చేయాలనుకున్నారట. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత మహారథితో శివాజీ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట కృష్ణ. ఆ ప్రాజెక్ట్ మీద కొంత వర్క్ కూడా చేశారు. అయితే.. ఆ సినిమా వలన మత ఘర్షణలు చెలరెగే అవకాశం ఉందనే సందేహం వచ్చింది. దీంతో ఈ సినిమా చేయాలనే ఆలోచనను ఆయన వెనక్కి తీసుకున్నారట. దాంతో తనకు ఇష్టమైన శివాజీ పాత్రలో కనిపించాలనే కోరిక తీరకుండానే పోయింది. ఆ తర్వాత ఆ అవకాశం కూడా ఆయనకు రాలేదు. ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేయాలని.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహస్తున్న రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’. దేశవ్యాప్తంగా ఈ షో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. తెలుగులోనూ ఈ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే అప్పట్లోనే ఇలాంటి ఓ రియాలిటీ షో చేయాలన్నది కృష్ణ కోరిక అట. కౌన్ బనేగా కరోడ్ పతి చూసి ఇక్కడ కూడా అలాంటి ఓ షో చేయాలని ఆయన కోరుకున్నారట. అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కేబీసీ షో చూసిన కృష్ణ.. తనకు కూడా అటువంటి షో చేయాలని ఉందని ఓ సందర్భంలో తన మనసులో మాట బయటపెట్టారు. అటువంటి కొత్త కాన్సెప్ట్‌తో ఎవరైనా టీవీ షో ఆఫర్‌తో తన దగ్గరకు వస్తే చేస్తానన్నారు. బుల్లితెరపై షోలు చేయడానికి తనకు అభ్యంతరం లేదని కృష్ణ గతంలో తెలిపారు. చదవండి రికార్డుల గని... అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్ -
కృష్ణ గొప్ప నటుడే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి: డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి: ఘట్టమనేని కృష్ణ గొప్ప నటుడే కాక ఉన్నత వ్యక్తిత్వం, విలువలు ఉన్న మనిషి అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. సంపాదనతో నిమిత్తం లేకుండా సమాజ హితం కోసం ఆయన అనేక సందేశాత్మక చిత్రాలు తీశారన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆయనకున్న గుర్తింపు సినిమాలకే పరిమితం కాదు. నిజ జీవితంలో కూడా ఆయన అలాగే ఉండేవారని తెలిపారు. ఈ మేరకు మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి గొప్పవారినైనా ఎదిరించి నిలబడే మనస్తత్వం గల నిజాయితీపరుడు. పశ్చిమగోదావరి జిల్లాకు ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఆయన బిఎస్సీ చదువుకున్నారు. 1989 ప్రాంతంలో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆయన పని చేసిన రెండేళ్లలోపు కాలంలోనే ముంపు బాధిత రైతులకు ఎంతో సహాయం చేశారు. చెరకు రైతులకు సకాలంలో పర్మిట్లు ఇప్పించేందుకు కృషి చేశారు. అలాగే పశ్చిమ, కృష్ణా డెల్టాల మధ్య ఉన్న కొల్లేరు సరస్సు ప్రత్యేకత, అక్కడి ప్రజల జీవన విధానం, కష్టసుఖాలు తెలియజేబుతూ "కొల్లేటి కాపురం" అనే సినిమా తీశారు. అలాగే మన జిల్లావాసి అయిన స్వతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు "అల్లూరి సీతారామరాజు" సినిమా తీయడం ద్వారా ఆయన గొప్పదనాన్ని ఆంధ్రదేశానికి చాటి చెప్పడమే కాకుండా కృష్ణ తన దేశభక్తిని చాటుకున్నారు. ఆయన రాజకీయలలో క్రియాశీలక పాత్ర పోషించకపోయినా అమరులైన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, రాజీవ్ గాంధీకి ఈయన ఎంతో సన్నిహితులుగా ఉండేవారు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృష్ణ గారి కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంతో చరిత్ర కలిగిన కృష్ణ గారు మన మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన తనయులు మహేష్ బాబుకి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (కృష్ణ పార్థివదేహం వద్ద బోరున విలపించిన మోహన్ బాబు) -
అదే సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి సినిమా!
ఆకాశంలో ఒక తార అంటూ సినీ ప్రియులను ఓ ఊపు ఊపిన నటుడు కృష్ణ అందరినీ విషాదంలో ముంచుతూ నేడు నింగికేగాడు. ఆయన మరణాన్ని జీర్ణించుకోవడం ఘట్టమనేని కుటుంబానికే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులకు భారంగా మారింది. దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి ఔరా అనిపించారాయన. ఒక్క హీరోగానే 350 సినిమాలు చేశారు. ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన రికార్డు కూడా కృష్ణ పేరు మీదే ఉంది. కెరీర్ మొత్తంలో 50 మల్టీస్టారర్ మూవీస్ చేశారు. మరి ఆయన నటించిన చివరి చిత్రం ఏంటో తెలుసా? శ్రీశ్రీ.. ముప్పలనేని దర్శకత్వంలో వచ్చిన శ్రీశ్రీ సినిమా 2016లో విడుదలైంది. ఇందులో విజయ నిర్మల, నరేశ్, సాయికుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణ నటించారు. ఆ తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు కృష్ణ. శ్రీశ్రీ చిత్రానికి ముందు సుకుమారుడు సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. అదే ఏడాది శ్రీకాంత్, ఛార్మి కాంబినేషన్లో వచ్చిన సేవకుడు సినిమాలోనూ అతిథి పాత్రలో కనిపించారు. చదవండి: తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతమైన మహేశ్‌బాబు బాగా కావాల్సినవాళ్లంతా దూరమైపోతున్నారు: మహేశ్‌బాబు -
మహేశ్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు దురదృష్టకరం : మంత్రి రోజా
-
కృష్ణ పార్థివదేహాం వద్ద మోహన్ బాబు ఎమోషనల్
-
కృష్ణ పార్థివదేహం వద్ద బోరున ఏడ్చేసిన మోహన్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి సీనియర్ నటుడు మోహన్ బాబు నివాళులర్పించారు. కృష్ణ పార్థివదేహన్ని చూసిన ఆయన అక్కడే బోరున విలపించారు. కృష్ణను చూసిన వెంటనే బాధను దిగమింగుకోలేక పోయారు. ఆయనతో ఉన్న క్షణాలను మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. (చదవండి: ఆయన లేరన్న వార్త విని నా గుండె పగిలింది.. రామ్ చరణ్ ట్వీట్) అక్కడే మహేశ్ బాబును హత్తుకుని ఓదార్చారు. వారి కుటుంబసభ్యులను మోహన్ బాబు పరామర్శించారు. ఇలాంటి బాధాకర సమయంలో దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ఆకాంక్షించారు. కృష్ణ మన మధ్య నుంచి వెళ్లిపోవడం తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆయన లేరన్న వార్త విని నా గుండె పగిలింది.. రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మెగాస్టార్ తనయుడు, యంగ్ హీరో రామ్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ ఇక లేరన్న వార్త విని నా గుండె పగిలిందని విచారం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనొక లెజెండ్ అని కొనియాడారు. ఆయన సినీ ప్రస్థానం చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు రామ్ చరణ్. సూపర్ స్టార్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో మహేశ్ బాబుకు ధైర్యాన్ని ఇవ్వాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. Heartbroken to hear that Superstar Krishna Garu is no more. He was a legend whose journey will be remembered forever . My heartfelt condolences to my brother @urstrulyMahesh , his family and millions of fans🙏🏼🙏🏼 — Ram Charan (@AlwaysRamCharan) November 15, 2022 -
ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు నానక్‌రామ్‌గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న కేసీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేష్ బాబును పరామర్శించారు. కుటుంబసభ్యులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని, పార్లమెంట్ సభ్యుడిగా కూడా చేశారని ప్రస్తావించారు. మంచి మిత్రుడుని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా చాలా సార్లు చూశానని గుర్తు చేసుకున్నారు. కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం వెంట మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Mahesh Babu-Krishna Death: తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్ -
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన మెగాస్టార్ చిరంజీవి
-
వెండితెరపై ఒకే ఒక్కడు..
-
అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు
సూపర్ స్టార్ కృష్ణ... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ చరిత్రగా నిలిచిన పేరు ఇది. హీరోగా వెండితెరపై కొత్త పాత్రలను పరిచయం చేసిన ఘనత ఆయనది. అందుకే కృష్ణ అంటే నేటి తరానికి కూడా పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. పాత్రలతో ప్రయోగాలు చేస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడికి పుంతలు వేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి లెజెండరి నటులు పోటీగా ఉన్నప్పటికీ పాత్రలతో ప్రమోగాలు చేసేందుకు ఏమాత్రం వెనకాడని సాహిసి ఆయన. అలా మోసగాళ్లకు మోసగాడు అనే యాక్షన్ మూవీ చేసి రికార్డు సృష్టించారు. అప్పటి వరకు హాలీవుడ్లో మాత్రమే కనిపించే ఈ పాత్రలు ఈ మూవీతో తొలిసారి ఇండియన్ సినిమాలో అది తెలుగు తెరపై పరిచయం కావడం విశేషం. 1971లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఒక్క తెలుగులోనే కాదు హిందీ. తమిళం, మలయాళం, బెంగాలీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇక ఈసినిమాతో కౌబాయ్‌గా టాలీవుడ్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన. కృష్ణ అంటే ఓ స్టార్ హీరో మాత్రమే కాదు గొప్ప వ్యక్తిగతం ఉన్న హీరో కూడా. ఇక కృష్ణను నిర్మాతల హీరో అని కూడా పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. నిర్మాతల హీరోగా మంచి మనసున్న వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణకు పేరు ఉంది. తాను నటించిన సినిమా ప్లాప్ అయితే వెంటనే ఆ నిర్మాతతను పిలిచి.. మళ్ళీ మంచి కథ సిద్ధం చేసుకోండి… ఫ్రీగా సినిమా చేస్తాను చెప్పడమే కాదు.. వారికిచ్చిన మాటను నిలబెట్టుకున్న హీరో ఆయన. అలా పలు నిర్మాతలకు ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండ నటించి వారికి హిట్లు ఇచ్చారు కృష్ణ. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో అప్పటి నిర్మాతలే స్వయంగా చెప్పారు. కృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరో మాత్రమే కాదని, ఆయన నిర్మాతల హీరో అంటూ ఆయనపై తరచూ ప్రశంసలు కురిపించేవారు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే. అంతేకాదు కృష్ణ ఒకానొక సమయంలో రోజుకి మూడు షిప్ట్ ల చొప్పున పని చేస్తూ.. ఏడాదికి 10 సినిమాలను పూర్తి చేశారు. అంటే 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. కృష్ణ ఒకే ఏడాది 17 సినిమాలను విడుదల చేసి రికార్డు సృష్టించాడు. 1972లో కృష్ణ హీరోగా నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి. ప్రపంచంలో మరే సినీ నటుడికీ ఇలాంటి రికార్డు లేదు. చదవండి: తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్ నటులకు ఆ భయం పట్టుకుంది: ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ -
తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్
తండ్రి మరణాన్ని తట్టుకోలేక సూపర్ స్టార్ మహేశ్ బాబు కన్నీటి పర్యంతం అయ్యారు. కాసేపటి క్రితమే హాస్పిటల్ నుంచి కృష్ణ పార్థివదేహం నానక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహానికి చేరుకుంది. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమాలను భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక సినీ ప్రముఖులు సైతం ఆయన నివాసానికి చేరుకుని కృష్ణ భౌతికఖాయానికి నివాళులు అర్పిస్తున్నారు. అనంతరం ఆయన తనయుడు మహేశ్ బాబును ఇతర కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ మృతి.. స్పందించిన ఘట్టమనేని కుటుంబం ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర రావు పరామర్శిస్తున్న క్రమంలో మహేశ్ ద:ఖం ఆపుకోలేకపోయారు. తండ్రిని తలుచుకుని ఆయన కన్నీరు పెట్టుకున్న దృశ్యం అక్కడి వారితో పాటు అభిమానులను హత్తుకుంటోంది. మహేశ్ ఏడుస్తుంటే రాఘవేంద్రరావు ఆయనకు ధైర్యం చెబుతూ ఓదార్చారు. కాగా ఏడాది వ్యవధిలోనే తండ్రి, తల్లి, సోదరుడిని కొల్పోయిన మహేశ్ తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. ఇక ఈ వీడియోపై మహేశ్‌కు అభిమానులు స్పందిస్తూ ఆయనకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కన్నీటి పర్యంతమైన మహేశ్ బాబు
-
కృష్ణగారు.. ఒక లెజెండరీ సూపర్‌స్టార్ : ప్రధాని మోదీ
తెలుగు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూయడంతో టాలీవుడ్లో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కృష్ణ మృతి వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో రి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని తెలుగులో ట్వీట్ చేశారు. కాగా, జీ20 సదస్సులో భాగంగా ఇండోనేషియా బాలి పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లిన సంగతి తెలిసిందే. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో @urstrulyMahesh, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. — Narendra Modi (@narendramodi) November 15, 2022 ఇక్కడ కూడా క్లిక్ చేయండి: సాహసాల గని సూపర్‌స్టార్ కృష్ణ హలో.. నా సినిమా ఎలా ఉందండి?.. కృష్ణ జ్ఞాపకాలతో బుర్రిపాలెంలో విషాద ఛాయలు విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత సినీ, రాజకీయ ప్రముఖులతో కృష్ణ (ఫోటోలు) -
బుర్రిపాలెం: హలో.. నా సినిమా ఎలా ఉందండి?
సాక్షి, గుంటూరు: నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెనాలి పరిధిలోని ఆయన స్వగ్రామం బుర్రిపాలెంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంత ఎత్తు ఎదిగినా.. ఆయన సొంతూరిపట్ల ఎంతో మమకారం ప్రదర్శించేవారని, వయసు తారతమ్యాలను ప్రదర్శించకుండా పేరుపేరునా అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అంతకుముందు.. సోమవారం ఆయన ఆరోగ్యం విషమించిందన్న సమాచారం తెలుసుకున్న బుర్రిపాలెం వాసులు.. ఎప్పటికప్పుడు క్షేమసమాచారాల గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరాభిమానులు. కానీ, ఆ పూజలు ఫలించలేదు. మంగళవారం వేకువ ఝామున 4 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ వార్త తెలియగానే.. గ్రామస్థులు కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఈ ఉదయం కృష్ణ చిత్రపటానికి పూలమాలమేసి నివాళులర్పించారు. బుర్రిపాలెం బుల్లోడు (1979) పేరుతో ఓ చిత్రంలో ఆయన నటించారు. ఇక చెన్నై, హైదరాబాద్‌లు కేంద్రంగా ఆయన నట శిఖరాలను అధిరోహించిన విషయం విదితమే. అయినా.. తాను పుట్టిన గడ్డకు సేవ చేయడం మాత్రం ఆయన మరువలేదు. ఆయన బుర్రిపాలెం వెళ్లినప్పుడల్లా పండుగ వాతావరణం నెలకొనేది. గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ నిర్మాణంతో పాటు కళ్యాణ మండపం, గీతా మందిరం కట్టించారు కృష్ణ. ఇక డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చారని కొందరు గ్రామస్తులు అంటున్నారు. ఊళ్లో వ్యవసాయం గురించి కూడా ఆయన ఆరాలు తీసేవారని మరికొందరు అంటున్నారు. మరోవైపు కరోనా సమయంలో ఆయన తనయుడు మహేష్ బాబు చొరవతో గ్రామంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగిన సంగతి తెలిసిందే. హలో.. నా సినిమా ఎలా ఉంది? బుర్రిపాలెం బుల్లోడిగా సూపర్ స్టార్ కృష్ణకు మరో ట్యాగ్ లైన్ కూడా ఉంది. మోసగాళ్లకు మోసగాడు సమయంలో.. ఆయన స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక సినిమాల పరంగానూ బుర్రిపాలెం సెంటిమెంట్‌ను ఆయన ఫాలో అయ్యేవారు. ఏ చిత్రం రిలీజ్ అయినా సరే.. ముందుగా అక్కడికి ఫోన్ చేసేవారట. గ్రామస్తుల్లో బాగా దగ్గరి వాళ్ల అభిప్రాయాలను ఫోన్ చేసి అడిగి తెలుసుకునేవారు. ఆ అభిప్రాయం ఎలా ఉన్నా సరే.. ఆయన స్వీకరించేవారట. ఇక విజయవాడ, తెనాలి ప్రాంతాల్లో ఆడియొన్స్ సినిమాకు బ్రహ్మరథం పడితే.. అది కచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతుందని నమ్మే వారు ఆయన. అంతేకాదు.. బుర్రిపాలెం వాసులు ఎక్కడ కలిసినా ఆప్యాయంగా పలకరించేవారాయన. ఇదీ చదవండి: కృష్ణ మరణానికి కారణం ఇదే! -
మహేశ్ బాబు ఒంటరివాడైపోయాడు.. ఆ కుటుంబానికి నా ప్రగాడ సానుభుతి: లక్ష్మీ పార్వతి
-
ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం: ఘట్టమనేని కుటుంబం
సూపర్ స్టార్ కృష్ణ(79) మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. వారి కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైరాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై ఘట్టమనేని కుటుంబం స్పందించింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు మీడియా ప్రకటన విడుదల చేశారు. ‘కృష్ణ నిజజీవితంలోనూ సూపర్ స్టారే. ఆయన ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కృష్ణగారి మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఆయన ఎంతోమందికి ఆదర్శం’ అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: మాటలకు అందని విషాదం ఇది: కృష్ణ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి ఏడాది వ్యవధిలోనే ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేకోవడం విచారకరం. జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్ను మూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన పరిస్థితి విషమించి జనవరి 8న తుది శ్వాస విడిచారు. అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే మహేశ్ తల్లి, కృష్ణ సతీమణి.. ఇందిరాదేవి సెప్టెంబర్ 28న దూరం కావడం.. తల్లి మరణించిన రెండు నెలలలోపే తండ్రి కృష్ణ కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణారవార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. చదవండి: అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ -
డేర్ అండ్ డాషింగ్ ఆయన పేరులోనే ఉంది: అలీ
-
సూపర్ స్టార్ మృతి.. ఆ జిల్లా వ్యాప్తంగా మార్నింగ్ షోలు రద్దు
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. సూపర్ కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్లో ఉదయం ఆటలను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తెలిపారు. -
కాసేపట్లో నానక్ రామ్ గూడలోని కృష్ణ స్వగృహానికి పార్థీవదేహం
-
కృష్ణ చనిపోయారని బాధపడకండి, ఇప్పటికే ఆయన స్వర్గంలో..: వర్మ ట్వీట్
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: మాటలకు అందని విషాదం ఇది: కృష్ణ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి మాటలకు అందని విషాదం అంటూ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కృష్ణ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేస్తూ.. ‘కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వారిద్దరు కలిసి ఆనందంగా అక్కడ మంచి సమయాన్ని గుడుపుతుంటారని అనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు మోసగాళ్లకు మోసగాడు చిత్రంలోని వారిద్దరి పాటను ఆర్జీవీ ఈ ట్వీట్‌కు జత చేశాడు. No need to feel sad because I am sure that Krishna garu and Vijayanirmalagaru are having a great time in heaven singing and dancing 💐💐💐 https://t.co/md0sOArEeG via @YouTube — Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2022 -
మాటలకు అందని విషాదం ఇది: కృష్ణ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి
సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఆయన మరణారవార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, డైరెక్టర్ గొపిచంద్ మలినేని, హీరో నాని, నటుడు పవన్ కల్యాణ్ ఇతర నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. (చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!) ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీపరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.. అంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. pic.twitter.com/B0FI5lAEYf — Chiranjeevi Konidela (@KChiruTweets) November 15, 2022 ఆయన కోలుకుని వస్తారనుకున్నా: పవన్ కల్యాణ్ కృష్ణ మృతిపై నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ‘చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన నటులు కృష్ణ గారు. ఆయన మరణించారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: బాలకృష్ణ అలాగే నందమూరి హీరో బాలకృష్ణ కూడా కృష్ణ మృతిపై స్పందించారు. ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో ఉన్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ ప్రకటన విడుదల చేశారు. A Fearless man who attempted every genre!! The original cowboy of Telugu films!! I could sit with him for hours which were filled with his positivity😊 the man the legend the superstar!!#RIPSuperStarKrishnaGaru we will miss you🙏🙏🙏 pic.twitter.com/ccJlBP1CZd — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 15, 2022 సూపర్ స్టార్ కృష్ణ మృతి సీనియర్ హీరో, నటుడు సాయి కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ విడుదల చేస్తూ కృష్ణ మృతికి సంతాపం ప్రకటించారు. ‘ఆయన ఒక పరంపర, ఒక సంచలనం, రికార్డుల గని, నిర్మాతల హీరో, చక్కని రూపశీలి, ఎన్నో ప్రయోగాలు చేసిన సాహసి, జనం మనిషి, అందరు నచ్చే మేచ్చే మహా మనిషి, ఆయనే మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ శ్రీ ఘట్టమనేని కృష్ణగారు. కృష్ణగారి కథ ఒక చరిత్ర.. ఆ కథ ఈ రోజుతో ఆగింది. కానీ.. చరిత్ర మాత్రం ఎప్పటికీ సువర్ణాక్షరాలతో ఎప్పుడు వెండితెరపై నిలిచే ఉంటుంది. మన గుండెలో ఉంటుంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానూభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన కుటుంబానికి, అభిమానులకు భగవంతుడు ఆత్మస్థైరాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జై సూపర్ స్టార్’ అని సాయి కుమార్ నివాళులు అర్పించారు. Heart broken by the demise of Krishna garu. His contribution to the Telugu cinema industry cannot be described in words . A true Superstar by all means . My deepest condolences to his family , well wishers & fans. May his beautiful soul rest in peace. #SuperStarKrishna garu pic.twitter.com/eFhvkTa6Rm — Allu Arjun (@alluarjun) November 15, 2022 Deeply pained to hear about Krishna garu's passing. A Superstar in every right, he stood tall and commanded attention on screen like no other. We will sorely miss him. Rest in peace, Sir. Sending love, light and strength to Mahesh and the family in this time of grief. pic.twitter.com/o3492JJEQX — Venkatesh Daggubati (@VenkyMama) November 15, 2022 Our prayers and respects to Krishna garu, sending lots of love and strength to @urstrulymahesh and family. It’s been a tough year for you brother.. We are with you! — Suriya Sivakumar (@Suriya_offl) November 15, 2022 SUPER STAR KRISHNA ⭐️ End of an era. My deepest condolences to @urstrulyMahesh sir,family and Krishna Gaaru’s extended family which includes you,me and every telugu cinema fan. 💔 — Nani (@NameisNani) November 15, 2022 Devastated on hearing the news of our Super Star Krishna Garu's Demise.. May his soul rest in peace. 🙏 Telugu Cinema lost a LEGEND 💔 My Deepest condolences to @urstrulyMahesh garu, family, fans and loved ones. pic.twitter.com/W6KKdtoQfH — Gopichandh Malineni (@megopichand) November 15, 2022 కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం. My thoughts are with Mahesh Anna and the family. Om Shanthi. Superstar forever. — Jr NTR (@tarak9999) November 15, 2022 Extremely saddened at the loss of #Superstarkrishna garu. can't imagine how tough this could be. Wishing all the strength to @urstrulymahesh anna and the family. May your soul RIP & you'll always be alive in our hearts sir. om shanti 🙏 pic.twitter.com/QoaBdFrSSI — Sai Dharam Tej (@IamSaiDharamTej) November 15, 2022 Deeply saddened on the passing of #KrishnaGaru a man who made a great mark as a #SuperStarKrishna . May his soul #RIPKrishnaGaru . My condolences to @urstrulyMahesh and family in these trying times🙏🙏🙏 pic.twitter.com/SZKWLoaHYF — Radikaa Sarathkumar (@realradikaa) November 15, 2022 This is Heart Breaking. Our SUPERSTAR KRISHNA Garu is no more. Legend 🙏🏽 Icon and Inspiration for Generations …. We will all Miss You sir . Praying for strength to the family @ManjulaOfficial , @urstrulyMahesh sir. May god be with you in this Testing time. pic.twitter.com/gm9OlQQYsL — Nikhil Siddhartha (@actor_Nikhil) November 15, 2022 సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. Super Star Forever. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 15, 2022 Such a devastating loss to the entire film industry, What a Legend he was. I had the pleasure of working with him and a total privilege to know him personally. Rest in peace #SuperStarKrishna garu! Heartfelt condolences to Mahesh & family in this hour of grief. OM SHANTI 🙏 — Ravi Teja (@RaviTeja_offl) November 15, 2022 తెలుగు సినిమా చరిత్రలో మరో గొప్ప అధ్యాయం ముగిసింది... సూపర్ స్టార్ శ్రీ కృష్ణ గారి ఆత్మకు సద్గతి కలగాలని ప్రార్ధిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను 🙏 — RamajogaiahSastry (@ramjowrites) November 15, 2022 Rest of peace dear ‘THE SUPERSTAR’ Krishna garu. Deep condolences to the entire family, All the Fans. It’s a huge loss. Love you Krishna garu. You will be greatly missed. pic.twitter.com/wp3RkPJNsu — Sunil (@Mee_Sunil) November 15, 2022 Shocking & Heartbreaking to hear abt d news of Super Star Sri.Krishna Garu🙏🏻 1 of d Biggest LEGENDS & PILLARS of our Cinema🙏🏻 The Most Humble Human Being.. May his soul rest in peace.. May God give Strength to dear @urstrulyMahesh sir & his Family🙏 pic.twitter.com/WVwvuUWKpS — DEVI SRI PRASAD (@ThisIsDSP) November 15, 2022 The demise of Krishna garu is a great loss to the Telugu film industry … working with him in 3 films are memories i will always cherish. My heartfelt condolences to his family …may his soul rest in peace @urstrulyMahesh — Rajinikanth (@rajinikanth) November 15, 2022 Deeply in grief on hearing that our only super star #Krishna garu is no more... yet he is with us. — Jaggu Bhai (@IamJagguBhai) November 15, 2022 కల చెదిరింది.. కధ మారింది.. కన్నీరే ఇక మిగిలింది... నా అభిమాన హీరో ఇక లేరు .. Rest in peace Super Star 🙏 pic.twitter.com/qWprJp3Pfi — KONA VENKAT (@konavenkat99) November 15, 2022 Saddened and shocked to know about the sudden demise of Daring and Dashing hero Legendry actor #SuperStarKrishna garu May his soul rest in peace. my deepest condolences and strength to @urstrulyMahesh garu & the entire family pic.twitter.com/uWLZUku8vf — Director Maruthi (@DirectorMaruthi) November 15, 2022 My heartfelt condolences to @urstrulyMahesh garu and the whole family. #RIPSuperStarKrishnaGaru 🙏 You will live forever in our memories pic.twitter.com/GG71Da2bae — Samantha (@Samanthaprabhu2) November 15, 2022 It's shocking to hear about the demise of #SuperStarKrishna garu 😞 God is being too ruthless with #MaheshBabu garu this year. Brother, mother & now the legend 🙏🏼 Deepest condolences to entire family. #RestInPeaceKrishnaGaru pic.twitter.com/jbBKfM52bH — Jani Master (@AlwaysJani) November 15, 2022 Deeply saddened to hear legendary actor Superstar #Krishna Garu is no more 💔 Prayers & strengths to @urstrulymahesh garu and family.#RIPKrishnaGaru #RIPSuperstarKrishna pic.twitter.com/ngJ3tDSw2B — Simran (@SimranbaggaOffc) November 15, 2022 Deepest condolences @urstrulyMahesh family, friends and fans #RIPKrishnaGaru https://t.co/5n8C0kDgJE — venkat prabhu (@vp_offl) November 15, 2022 What a tragic year it’s been. My deepest condolences to @urstrulyMahesh garu & family. TFI wouldn’t have been what it is today if not for your contribution SUPERSTAR.Thank you! Om Shanthi 🙏#RAPO pic.twitter.com/C2bjrQoceD — RAm POthineni (@ramsayz) November 15, 2022 #SuperStarKrishna garu one of the legendary actors of the telugu film industry is no more. Deeply saddened to hear about the demise. My heartfelt condolences to @urstrulyMahesh and the entire family. Superstar Krishna lives on. OM Shanthi🙏 pic.twitter.com/kcV9wwqubM — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) November 15, 2022 Dear @urstrulyMahesh, Krishna Garu entertained audiences worldwide for so many years & he will stay in our hearts forever. He was a super star who lived a complete life. Pls stay strong brother. It has been a very difficult year. My prayers and thoughts with you.#RIPKrishnaGaru — Karthi (@Karthi_Offl) November 15, 2022 An icon of Telugu cinema Krishna gaaru is no more, an era ends with his demise. I wish to share the grief of brother @urstrulyMahesh who has to bear this third emotional trauma of losing a mother, brother and now his father. My deepest condolence dear Mahesh gaaru. — Kamal Haasan (@ikamalhaasan) November 15, 2022 Deeply saddened to hear the demise of Legendary Superstar Krishna garu 💔 His contribution to Indian cinema will be remembered forever 🙏 My deepest condolences to @urstrulyMahesh garu , family and fans 🙏 Om Shanti 😢💐 pic.twitter.com/HmpPmV3dmc — Anushka Shetty (@MsAnushkaShetty) November 15, 2022 -
అవయవాలు పని చేయడం మానేశాయి: వైద్యులు
-
ఆయనే మన జేమ్స్‌బాండ్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి/హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూతతో సినీ జగత్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నటశేఖరుడి అస్తమయంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. ‘‘కృష్ణగారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఘట్టమనేని కుటుంబంతో వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. (2/2) — YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2022 ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం కృష్ణ కన్నుమూతపై సంతాపం ప్రకటించారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు సంతాపం ప్రకటించిన వాళ్లలో ఉన్నారు. ఇదీ చదవండి: నటశేఖరుడికి సాక్షి ప్రత్యేక నివాళి -
అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ
సూపర్‌స్టార్ కృష్ణ అంటే తెలుగు సినీ ప్రపంచంలో తెలియని వారుండరు. అంతలా ఆ పేరు ప్రేక్షకుల గుండెల్లో అంతలా పాతుకుపోయింది. ఆయన నటనకు ప్రతిరూపం. అలనాటి తెలుగు సినిమాల్లో ఆయన ముద్ర చెరిగిపోని స్వప్నం. ఎన్నో అరుదైన రికార్డులు ఆయన సొంతం. టాలీవుడ్ నటుల్లో ఆయనది ప్రత్యేక శైలి. ఏ హీరో సాధించని అరుదైన రికార్డును సాధించిన ఏకైక స్టార్ కృష్ణ మాత్రమే. అందుకే ఆయన పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. (చదవండి: కృష్ణ మరణానికి కారణం ఇదే.. వైద్యులు) తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించిన ఘట్టమనేని కృష్ణ.. నటనతోనే ఆగిపోకుండా దర్శకుడు, నిర్మాతగా, ఎడిటర్‌గానూ పని చేశారు. సినీ పరిశ్రమలో కృష్ణ కెరీర్ దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగిందంటే ఆయన నటనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో తెలుస్తోంది. దాదాపు 350 సినిమాల దాకా నటించారాయన. హ్యాట్రిక్ రోల్స్‌తో అబ్బురపరిచిన స్టార్ సాధారణంగా సినిమాల్లో ద్విపాత్రాభినయం పోషించే నటులను చూస్తాం. కానీ ఒకే సినిమాలో ఒకే నటుడు బహుళ పాత్రల్లో నటించడం అనేది చాలా అరుదుగా కనిపించే దృశ్యం. అలాంటి పాత్రల్లో అవలీలగా నటించడం ఒక్క సూపర్ స్టార్కే సాధ్యమైంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ త్రిపాత్రాభినయం చేశారు. ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించడం ఆయనకే సాధ్యమైంది. ఇలా మూడు పాత్రల్లో కనిపించడం ఒక్క సినిమాతోనే ఆగిపోలేదు. కుమారరాజా, డాక్టర్-సినీ యాక్టర్, రక్త సంబంధం, పగపట్టిన సింహం.. ఇలా మూడు కంటే ఎక్కువ సినిమాల్లో ఆయన త్రిపాత్రాభియనంతో అలరించారు. ఆ చిత్రాలు ఇవే.. ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించిన ఏకైక నటుడిగా టాలీవుడ్లో అరుదైన రికార్డు సృష్టించారు. ఆపై త్రిపాత్రాభినయ చిత్రాల్లో.. మొదటి సినిమా కుమారరాజాలో తొలిసారిగా మూడు పాత్రల్లో నటించారాయన. ఇది కన్నడ చిత్రం శంకర్ గురుకి రీమేక్. పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్లో కృష్ణ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రలు ఆయనే పోషించారు. ఈ చిత్రం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కృష్ణ తన ప్రతిభతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన రెండో చిత్రం విజయనిర్మల దర్శకత్వం వహించిన డాక్టర్ సినీ యాక్టర్. సినిమాలో తండ్రి పాత్రతో పాటు కొడుకుగా, మేనల్లుడి పాత్రల్లో ఆయనే నటించారు. ఆ తర్వాత 'పగపట్టిన సింహం' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మళ్లీ అదే ట్రెండ్ రిపీట్ చేశాడు. ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విలన్‌గా, పోలీసాఫీసర్‌గా, లాయర్‌గా మూడు పాత్రల్లో మెప్పించారు. సిరిపురం మొనగాడు, బంగారు కాపురం, బొబ్బిలి దొర వంటి ఇతర చిత్రాలలో కూడా బహుళ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు సూపర్ స్టార్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నటశేఖరుడికి సాక్షి ప్రత్యేక నివాళి
గూఢచారి, కౌబాయ్.. ఇలా వైవిధ్యభరితమైన పాత్రలతో పాటు సామాజిక-పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు రంజింప చేశారు పద్మభూషణ, నటశేఖర కృష్ణ. సినీ సాహసాలకు ఆయన కేరాఫ్. నటనలో మాత్రమే కాదు ఫిల్మ్ మేకింగ్‌లోనూ ఆయనొక ప్రయోగశాల. నిర్మాతగా, దర్శకుడిగా తనకుంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును దక్కించుకున్న వ్యక్తి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో కొత్త తరహా సాంకేతికతల హంగులను అందించిన వ్యక్తి. తక్కువ టైంలోనే ఆనాటి అగ్రహీరోల సరసన నిలిచారాయన. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ నటశేఖరుడికి సాక్షి అందిస్తున్న నివాళి.. పాత తరంలో మాస్ హీరో ట్యాగ్‌ను, అత్యంత వేగంగా అందుకున్న నటశేఖరుడు.. ఆపై వరుస హిట్లతో సూపర్ స్టార్‌గానూ ఎదిగారు. ఒకానొక టైంలో ఏడాది కాలంలో 17 సినిమాలు తీసుకుంటూ.. దర్శకనిర్మాతల పాలిట కల్పతరువుగా మారారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. 1943 మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. తల్లిదండ్రులు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ. వాళ్ల అగ్రసంతానం కృష్ణ. చదువుకొనే రోజుల్లోనే నటన పట్ల ఆసక్తితో అటువైపు మళ్లారు. ఏలూరులో ఇంటర్మీడియట్ చదువుతూ కూడా నాటకాలు వేస్తూ సందడి చేశారు. డిగ్రీలో చేరాక.. పూర్తిగా సినిమాలవైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆరంభంలో.. ‘‘పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు- ప్రతిష్ఠ’’ వంటి చిత్రాలలో చిన్న రోల్స్‌లో కనిపించారు. ఆపై ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్లో కొత్తవాళ్లతో తెరకెక్కించిన తేనెమనసులులో ఇద్దరు హీరోల్లో ఒకరిగా నటించారు. ఆ సమయంలోనే హ్యాండ్సమ్ హీరోగా ఆయనకు ఒక మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆపై ‘కన్నెమనసులు, గూఢచారి 116’ వంటి సినిమాల్లో నటించి మరింత పేరు సంపాదించారు. ‘గూఢచారి 116’ విజయంతో కృష్ణకు హీరోయిజం బేస్డ్ అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అయినా ఫ్యామిలీ&లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఉండమ్మ బొట్టు పెడతా, మంచి కుటుంబం, విచిత్ర కుటుంబం, అక్కాచెల్లెళ్లు, పండంటి కాపురం లాంటివెన్నో. తెలుగు సినిమాకు కొత్త నీరు ► కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్.ఓ. సాంకేతికత పరిచయం అయ్యింది. ► గూడుపుఠాణి.. మొదటి ఓఆర్‌డబ్ల్యు కలర్ సాంకేతికతతో తీసిన సినిమా. ► తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం.. భలే దొంగలు. ► తెలుగులో 70 ఎంఎం సాంకేతికత ఉపయోగించిన తొలి సినిమా.. సింహాసనం. ► సింహాసనం.. స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా. ► అల్లూరి సీతారామరాజు తెలుగులో ఫుల్‌స్కోప్ సినిమాల్లో మొదటిది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఫ్రెండ్లీ స్టార్‌గా ఉంటూనే.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో.. ముక్కుసూటితనం ఉన్న వ్యక్తిగా పేరొందారు కృష్ణ. అదే సమయంలో స్టార్ హీరో ట్యాగ్‌కు చేరువవుతున్న సమయంలోనూ ఆయన ఇతర స్టార్ల చిత్రాల్లో నటించుకుంటూ పోయారు. తన తోటి హీరోలు ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు తదితరుల సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ► అగ్రహీరోలతో పోటీ పడుతూనే ఆయన కొన్ని సాహసోపేతమైన చిత్రాలు తీశారు. కురుక్షేత్రం, దేవదాసు.. అందుకు ఉదాహరణలు. ► స్టార్ ద్వయం ఎన్టీఆర్-ఏన్నార్ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు ఏమాత్రం తీసిపోని స్టార్డమ్ తొలినాళ్లలోనే సొంతం. లేడీఫాలోయింగ్ మాత్రమే కాదు.. మేల్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఆయనకు. ఆయన్ని చూసేందుకు చెన్నైకి రైళ్లలో, బస్సుల్లో అభిమానులు వెళ్లే వారంటే అతిశయోక్తి కాదు. ఏకంగా రికార్డు స్థాయిలో 2,500 అభిమాన సంఘాలు కృష్ణ పేరిట ఉండేవి. ► సంక్రాంతికి సినిమాలు విడుదల చేసే సంక్రాంతి పోటీ విషయంలోనూ కృష్ణ రికార్డు సృష్టించారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ఆయన నటించిన 30 చిత్రాలు సంక్రాంతి పండుగకు విడుదల అయ్యాయి. 1976 నుంచి 1996 వరకు 21 సంవత్సరాల పాటు ప్రతీ ఏటా వరుసగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేశాడు. సంక్రాంతి విడుదలల విషయంలో అక్కినేని నాగేశ్వరరావు (33 సంక్రాంతులు), ఎన్.టి.రామారావు (31 సంక్రాంతులు) తర్వాత మూడవ స్థానంలో నిలిచినా.. వరుసగా ప్రతీ ఏటా సంక్రాంతులకు సినిమాలు విడుదల కావడం (21 సంవత్సరాలు) విషయంలో కృష్ణదే రికార్డు. ► ఆ తర్వాతి తరంలోనూ ఆయన కీలక పాత్రలు పోషించిన చిత్రాలు వచ్చాయి. నాగార్జున, బాలకృష్ణ, రవితేజ, కోలీవుడ్ నటుడు విక్రమ్‌లతో పాటు తన తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు చిత్రాల్లోనూ ఆయన నటించి, మెప్పించారు. ► కొమియో పాత్రల్లో పలు చిత్రాల పాటల్లోనూ ఆయన కనిపించారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాల్లో ఆయన గెస్ట్ సాంగ్‌లో కనిపించారు. యమలీలలోని జుంబారే సాంగ్.. ఓ ఊపు ఊపింది కూడా. ► ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దారిలోనే తనకూ ఓ సొంత నిర్మాణ సంస్థ అవసరమని ‘పద్మాలయా’ స్టూడియోను నెలకొల్పారు. ఈ బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం ‘అగ్నిపరీక్ష’. ఆ తరువాత తెలుగులో తొలి కౌబోయ్ మూవీగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిర్మించారు. కేఆర్ దాస్ డైరెక్షన్లో వచ్చిన ఆ చిత్రం ఓ కల్ట్క్లాసిక్గా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. ► పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు లాంటి సొంత చిత్రాలతో విజయాలు సాధించారు. ► 1964-95 మధ్య ఏడాదికి పదేసి చిత్రాల్లో కనిపించారు ఆయన. ఒకానొక టైంలో రోజుల్లో గంటల తరబడి విరామం లేకుండా షూటింగ్లలో పాల్గొన్నారు. ► అల్లూరి సీతారామరాజు.. తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా స్కోప్గా తెరకెక్కింది. అయితే ఆ చిత్ర భారీ విజయం తర్వాత వరుసగా ఆయనకు 14 ఫ్లాపులు వచ్చిపడ్డాయి. ఆపై పాడి పంటలు చిత్రంలో ఆయన మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ► ముందగుడు, కిరాయి కోటిగాడు, అగ్నిపర్వతం, అడవి సింహాలు, ప్రజారాజ్యం, ఖైదీ రుద్రయ్య ఆయన్ని టాప్ పొటిషన్ను తీసుకెళ్లాయి. సింహాసనం ఆయన్ని మరో మెట్టు ఎక్కించింది. మాయదారి మల్లిగాడు, ఇంద్రధనుస్సు, అన్నదమ్ముల సవాల్, ఊరికి మొనగాడు లాంటి మ్యూజికల్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ► 1989 నాటికే 274 సినిమాలు పూర్తిచేసుకున్న కృష్ణ 90వ దశకంలో తన శైలికి భిన్నంగా కేవలం 44 సినిమాలే చేయగలిగారు. ► 1990 నుంచి మూడేళ్లపాటు ఆయనకు సరైన సక్సెస్ దక్కలేదు. 1994లో వచ్చిన పచ్చని సంసారం, వారసుడు చిత్రాలు ఆయన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించాయి. ఆపై నెంబర్ వన్, అమ్మ దొంగా చిత్రాలు ఆయనకు సూపర్‌సక్సెస్ అందించాయి. ► ఆయన 100వ చిత్రంగా రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు’, 200వ చిత్రంగా తెరకెక్కిన ‘ఈనాడు’ మంచి విజయాలు సాధించాయి. 300వ సినిమాగా ‘తెలుగువీర లేవరా’ తీశారు. ► మద్రాస్ నగరంలో వందరోజులు పూర్తిచేసుకున్న తొలి తెలుగు చిత్రంగా చీకటి వెలుగులు, హైదరాబాద్ నగరంలో ఏడాది పాటు ఆడిన తొలి తెలుగు సినిమాగా అల్లూరి సీతారామరాజు నిలిచిపోయాయి. ► కృష్ణ సతీమణి విజయనిర్మల ఆయన సరసన అత్యధిక చిత్రాలలో నటించిన నాయికగా నిలిచారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన ‘మీనా’ చిత్రంలోనూ కృష్ణనే నాయకుడు. ఆపై ఆమె డైరెక్షన్‌లోనూ 40 దాకా సినిమాల్లో కృష్ణ హీరోగా నటించి మెప్పించారు. ► కృష్ణ తొలిసారి దర్శకత్వం వహిస్తూ ‘సింహాసనం’ చిత్రాన్ని తొలి 70 ఎంఎం సినిమాగా అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. “నాగాస్త్రం, ముగ్గురుకొడుకులు, కొడుకు దిద్దిన కాపురం” వంటి హిట్స్ నూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. బాలీవుడ్లో డినో మోరియా, బిపాసా బసు లీడ్రోల్లో ఇష్క్ హై తుమ్సే(2004) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. తెలుగు సంపంగి చిత్రానికి రీమేక్ ఇది. రాజకీయాల్లోనూ.. ► రాజకీయాల్లో సూపర్ స్టార్ కృష్ణ ప్రస్థానం.. ఒక హాట్ టాపిక్‌గా మారింది. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా.. తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది. ఆ ఎన్నికల్లో ఓటమి చెందడంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం విరమించుకున్నారు. ► ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న కృష్ణ.. చిత్రపరిశ్రమలో చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం నుంచి 2009లో పద్మభూషణ్ గౌరవాన్ని సైతం అందుకున్నారు. అల్లూరి సీతారామ రాజు చిత్రానికి గానూ నంది అవార్డు(1974), ఎన్టీఆర్ నేషనల్ అవార్డు(2003), ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైం అఛీవ్మెంట్ అవార్డు(1997) సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్స్‌ను అంతే ఓపెన్‌గా అంగీకరించేవారు ఆయన. సాహసోపేతమైన వైఖరితో సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్లేవారు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి, నిర్మాతలకు నష్టం కలగకుండా చిత్రాలు చేయాలని తపించేవారు. అందుకే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సూపర్ స్టార్‌గా వెలుగొందారు. -
ఒకే ఏడాదిలో మూడు విషాదాలు.. తీవ్ర దుఃఖంలో మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. కాగా, ఈ ఏడాదిలో మహేశ్ ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. జనవరిలో మహేశ్‌బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్ను మూశాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి జనవరి 8న తుది శ్వాస విడిచారు. (చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!) అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే, తల్లి ఇందిరాదేవి దూరం అయింది. సెప్టెంబర్ 28న కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి మరణించింది. కన్న తల్లి దూరమైన బాధని ఇప్పుడిప్పుడే మరచిపోతున్న తరుణంలో కన్న తండ్రి కన్నుమూయడం.. మహేశ్‌ని మరింత విషాదంలోకి నెట్టింది. -
సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూత
-
విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, స్టార్ హీరో మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఇటీవల లెజెండరి నటులు కృష్ణం రాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణాన్ని మరవకముందే కృష్ణ మృతి చెందడంతో ఇటూ సినీ పరిశ్రమ, అటూ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. 1942 మే 31న గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో జన్మించాడు. 1965లో ఆయన ఇందిరను పెళ్లిచేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు. రమేశ్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల ఉన్నారు. వీరిలో రమేశ్ బాబు, భార్య ఇందిర ఇటీవల మరణించారు. మొదటి పెళ్లి తర్వాత సినీనటి విజయనిర్మలను కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకూడా ఈ మధ్యనే మృతి చెందారు. తేనె మనసులతో మొదలుపెట్టి.. డిగ్రీ తర్వాత కూడా ఇంజినీరింగ్ సీటు కోసం ప్రయత్నించినా రాకపోవడంతో కృష్ణ ఇక సినిమాలనే తన భవిష్యత్తుగా ఎంచుకున్నారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిశారు కృష్ణ. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో పలు నాటకాల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలైంది. ఈ సినిమాలో కృష్ణ నటన బాగోలేదని, ఆయనను తొలగించాలని దర్శకుడిపై ఒత్తిడి వచ్చింది. అయినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965లో విడుదలైన ఆయన సినిమా ఘన విజయం సాధించింది. గూఢచారి 116 సక్సెస్‌తో.. 20 సినిమాల్లో ఛాన్స్ రెండో సినిమా ‘కన్నె మనసుల్లో’ నటిస్తుండగానే ‘గూఢచారి 116’లో కృష్ణకు అవకాశం వచ్చింది. ఈ సినిమా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. అంతేనా.. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ఆయనను ఆంద్రా జేమ్స్‌బాండ్‌గా పిలుచుకునేవారు. ఈ విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాలకు హీరోగా ఎంపికయ్యారు. గూఢచారి 116తో ఆయన ఇమేజ్ అమాంతం పెరగడమే గాక.. ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో ఆయన మరో 6 జేమ్స్‌బాండ్ తరహా చిత్రాలు చేశారు. అవన్నీ ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టాయి. బాపు తీసిన పూర్తి అవుట్ డోర్ చిత్రం ‘సాక్షి’ కృష్ణ ఇమేజిని పెంచింది. మానవత్వం మీద నమ్మకంగల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయనిర్మలతో నటించిన మొదటిచిత్రం కూడా ఇదే. ఏడాదిలో 18 సినిమాలు.. 70-71వ దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులకు మరుపురానిది. ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. ఒక దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు. కొత్త సాంకేతికతను పరిచయం చేసి.. నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్లో కృష్ణ 340కు పైగా సినిమాల్లో నటించారు. సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ ‘డేరిండ్ అండ్ డాషింగ్’ హీరోగా పేరుతెచ్చుకున్నారు. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్లను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. ►1965లో కృష్ణ తొలిచిత్రం తేనె మనసులు విడుదల ►తెలుగులో తొలి జేమ్స్ బాండ్, కౌబాయ్ హీరో కృష్ణ ►హీరోగా 350 పైగా సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ ►సింహాసనం సినిమాతో మెగాఫోన్ ►తెలుగు సినిమాలకు సాంకేతిక హంగులద్దిన కృష్ణ ►అల్లూరి సీతారామరాజుతో నటుడిగా ఎనలేని ఖ్యాతి ►హీరోగా,నిర్మాతగా,దర్శకుడిగా,ఎడిటర్‌గా టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు ►పద్మాలయ స్టూడియో పతాకంపై ఉత్తమ చిత్రాల నిర్మాణం ►విజయనిర్మలతో దాదాపు 48 వరకు చిత్రాల్లో స్క్రీన్ షేర్ -
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై వైద్యుల తాజా అప్డేట్..
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ గురునాథ్ రెడ్డి వెల్లడించారు. ఆయన పరిస్థితిపై ఇప్పుడేం ఏం మాట్లాడాలేమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ బాగా ఎఫెక్ట్ అయినట్లు డాక్టర్ గురునాథ్ రెడ్డి తెలిపారు. అన్ని విభాగాలకు చెందిన 8 మంది వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. ఉదయం నుంచి ఇప్పటివరకు ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దయచేసి వారి కుటుంబ సభ్యులను డిస్టర్బ్ చేయవద్దని కోరారు. (చదవండి: అత్యంత విషమంగా కృష్ణ ఆరోగ్యం, ఇప్పుడే ఏం చెప్పలేం: వైద్యులు) ఆయనకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్లో చాలా వరకు ఎఫెక్ట్ అయినట్లు వెల్లడించారు. మా దగ్గర అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు ఉన్నాయని.. ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్లిన ఇంతకు మించి ఏమి చేయలేమని స్పష్టం చేశారు. ఆయన మా ఆస్పత్రిలోనే చాలా ఏళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని గురునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన పరిస్థితిపై బులెటిన్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా.. ఆయనకు తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. -
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి తాజా అప్డేట్
-
కృష్ణ హెల్త్ కండీషన్ పై వైద్యుల ప్రెస్ మీట్
-
శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న కృష్ణ
-
సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత
-
సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
సీనియర్ నటులు, సూపర్ స్టార్ కృష్ణ ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా కొంతకాలంగా కృష్ణ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మమ్మీ మా గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారు.. నమ్రత ఎమోషనల్ పోస్ట్
హీరో మహేశ్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా మహేశ్ భార్య, నటి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. అత్త ఇందిరా దేవిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నమ్రత శిరోద్కర్ రాస్తూ.. 'జీవితం అనేది ఒక సర్కిల్ లాంటిది. ఇప్పుడు నా జీవితం ఇదే. మామయ్య గారు మా జీవితంలో ఉన్నందుకు మాకు సంతోషం. అమ్మ ఇందిరాదేవి ఇప్పుడు మా మధ్య లేకపోయినా ఆమె మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటుంది. మేం జీవించి ఉన్నంత వరకు ప్రతి రోజూ ఆమెను గుర్తు చేసుకుంటాం. ఆమె మా కుటుంబాన్ని కాపాడుతుందని మాకు తెలుసు.. లవ్ యూ మమ్మీ' అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవలే ఇందిరా దేవి పెద్దకర్మ కూడా నిర్వహించారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
Mahesh Babu: మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి స్వస్థలమేదో తెలుసా?
బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం): ప్రముఖ సినీ నటుడు సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ సతీమణి, హీరో మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి (70) మృతితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విషాదఛాయలు అలుము కున్నాయి. మండలంలోని ముసలిమడుగు ఆమె స్వగ్రామం. కృష్ణను వివాహమాడాక పిల్లలు రమేష్‌బాబు, మహేష్‌బాబులతో తరచుగా ముసలిమడుగు వచ్చివెళ్లేవారు. ఆమె ఎప్పుడు వచ్చినా అందరినీ అప్యాయంగా పలకరించేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికీ ముసలిమడుగులో ఇందిరాదేవి పేరిట ఇల్లు ఉంది. పక్కనే ఉన్న లక్ష్మీపురంలో ఇందిరాదేవితోపాటు ఆమె కుమారులు, కుమార్తెల పేరిట వ్యవసాయ భూములున్నాయి. ఇందిరాదేవి పేరిట ఉన్న ఇంటి స్థానంలో భద్రాచలం వచ్చే భక్తుల కోసం వసతిగృహం నిర్మించాలని కుటుంబసభ్యులు యోచిస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందిరాదేవి అంత్యక్రియలు జూబ్లిహిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరిగాయి. ఈ క్రతువును మహేష్‌బాబు నిర్వహించారు. (చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్) -
మహేశ్ బాబు, కృష్ణలను పరామర్శించిన చిరంజీవి
సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబులను తాజాగా మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. గురువారం వారి ఇంటికి వెళ్లి మహేశ్, కృష్ణలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణ సతీమణి, మహేశ్ తల్లి ఇందిరా దేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు చిరు సంతాపం తెలిపారు. కాగా బుధవారం(సెప్టెంబర్ 28న) మహేశ్ తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్ సినీ, రాజకీయ ప్రముఖులు నిన్న మహేశ్ ఇంటికి వెళ్లి ఇందిరా దేవి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఇక ఆమె అంత్యక్రియల్లో విక్టర్ వెంకటేశ్, నాగార్జున అక్కినేని, మోహన్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు పలువురు హీరోలు, దర్శకులు పాల్గొన్నారు. అయితే చిరు తాజా చిత్రం గాడ్ ఫాదర్ ట్రైలర్ ఈవెంట్ నిన్న అనంతపురంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేపథ్యంలో బుధవారం ఇందిరా దేవి అంత్యక్రియల్లో ఆయన పాల్గొన లేకపోయారు. -
అమ్మ చేతి కాఫీ.. దేవుడి ప్రసాదంతో సమానం: మహేశ్ ఎమోషనల్
‘ఎంతమందికి తెలుసో..తెలియదు కాని ఏప్రిల్ 20న మా అమ్మ ఇందిరమ్మగారి పుట్టిన రోజు. అమ్మ ఆశిస్సులు, దీవెనలకు మించిదేది ఉండదు. ఆ రోజున నా సినిమా విడుదల కావడం నిజంగా సంతోషంగా ఉంది. అమ్మగారి ఆశిస్సులు నాకు చాలా ముఖ్యమైనవి’.. ఇవి ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ ఈవెంట్లో తన తల్లి గురించి మాట్లాడిన మాటలు. మహేశ్ బాబుకు తన మాతృమూర్తి తో ఎంతో అనుబంధం ఉంది. అమ్మ పట్ల తనకున్న ఇష్టాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా అభిమానులతో పంచుకునేవాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) "Naaku Amma Ante Devudutho Samanam" ❤️🙏 This is a very huge loss to Superstar #MaheshBabu!! 💔💔#RIPIndiraDeviGaru #IndiraDevi #Indiramma #TeluguFilmNagar pic.twitter.com/krtRqemJZw — Telugu FilmNagar (@telugufilmnagar) September 28, 2022 మహర్షి సినిమా సక్సెస్ మీట్లో కూడా తల్లి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ‘నాకు అమ్మంటే నాకు దేవుడితో సమానం. సినిమా విడుదలకు ముందు అమ్మదగ్గరకు వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగినే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. ఆమె ఆశీస్సులు నాకెప్పటికీ ముఖ్యం’అని మహేశ్ అన్నారు. బుధవారం(సెప్టెంబర్ 28)తెల్లవారు జామున ఇందిరాదేవి మరణంతో గతంలో తల్లి గురించి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాతృమూర్తి పట్లకు మహేశ్‌కు ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటూ సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఆ వీడియోలను షేర్ చేస్తూ..‘ధైర్యంగా ఉండండి అన్నా’అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేశ్ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలోని తల్లి సెంటిమెంట్ సీన్‌ను కూడా షేర్ చేస్తున్నారు. RIP Amma 🙏 Stay Strong @urstrulyMahesh Anna 💔#MaheshBabu 😓 pic.twitter.com/e6wTJxG4Au — Sardaar S (@SardaarSainik) September 28, 2022 చదవండి: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం ఒకే ఏడాది రెండు విషాదాలు..తీవ్ర దుఃఖంలో మహేశ్ తల్లి మృతితో శోకసంద్రంలో మహేశ్‌బాబు -
హరనాథ్ మంచి మనసున్న వ్యక్తి
‘‘నేను, హరనాథ్ కలిసి చాలా సినిమాల్లో నటించాం. అతను నిజమైన అందాల నటుడు.. అలాగే మంచి మనసున్న వ్యక్తి. నేను హీరోగా నటించిన ‘మా ఇంటి దేవత’ చిత్రాన్ని కూడా నిర్మించారు హరనాథ్’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు. 1936లో సెప్టెంబర్ 2న జన్మించిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో 167 సినిమాల్లో నటించారు. 1989, నవంబర్ 1న మరణించారాయన. కాగా హరనాథ్ జీవిత చరిత్రను ‘అందాల నటుడు’ పేరుతో డా.కంపల్లి రవిచంద్రన్ రచించారు. శుక్రవారం హరనాథ్ జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేశారు. ఈ పుస్తకావిష్కరణలో హరనాథ్ కుమార్తె జి. పద్మజ, అల్లుడు జీవీజీ రాజు (‘తొలి ప్రేమ, గోదావరి’ చిత్రాల నిర్మాత), మనవళ్లు శ్రీనాథ్ రాజు, శ్రీరామ్ రాజు, పుస్తక రచయిత కంపల్లి రవిచంద్రన్ పాల్గొన్నారు. -
ప్రకృతి వనాన్ని తలపిస్తోన్న సూపర్ స్టార్ ఇల్లు చూశారా?
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ కృష్ణ బయటకు మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. అందుకే ఆయనను నటుడిగానే కాదు పర్సనల్‌గా కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆ సింప్లిసిటీ ఆయనలో మాత్రమే కాదు, ఇంటిని కూడా అన్ని సౌకర్యాలతో చాలా సింపుల్‌గా నిర్మించుకున్నారు కృష్ణ. ఇటీవల కృష్ణ హోంటూర్ వీడియో ప్రోమోను ఆయన కూతురు మంజుల ఘట్టమనేని తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఫుల్ వీడియోను వదిలారు ఆమె. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే హైదరాబాద్ నగరంలో ఎవరూ ఊహించని రీతిలో కృష్ణ ఇల్లు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చూట్టూ ఆకుపచ్చని చెట్లు, పక్షుల కిలకిల రాగాలు, రకరకాల పూలు, పండ్ల తోటలతో పూర్తి ప్రకృతమయంగా ఇంటిని నిర్మించుకున్నారు కృష్ణ. ఇంట్లో అడుగడుగునా ఆయన అభిరుచి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే పచ్చని వనం, మధ్యలో కృష్ణుడి విగ్రహం.. వాటర్ ఫౌంటెన్ దాని చుట్టూ గులాబీ చెట్లు.. కొబ్బరి చెట్లు, పెరటిలో తులసి, ఆ పక్కనే విజయ నిర్మల గారి విగ్రహం ఇలా ఆహ్లాద వాతావరణాన్ని తలపిస్తోంది. భాగ్య నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కలిగించేలా కట్టుకున్న ఇల్లును చూసి ఫిదా అవుతున్నారంతా. మరో విశేషం ఏంటంటే ఇంటి వెనకాలే మామిడి తోట.. ఆకుకూరలు, కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి. ఇక కుటుంబమంతా కలిసి సరదాగా గడిపేందుకు గార్డెన్లో, ఇంట్లో స్పెషల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఇంటి లోపల హోం థియేటర్, స్మిమ్మింగ్ ఫూల్, ఇంట్లోనే పార్టీ చేసుకునేందుకు అన్ని హంగులతో నిర్మించుకున్న హాల్, పిల్లల కోసం ప్లేయింగ్ రూమ్స్ అన్నీ చక్కగా అమర్చి ఉండటంతో ఇది ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. లివింగ్ రూంలో ఎక్కడ చూసినా విజయ నిర్మల ఫొటోలు, విగ్రహాలు.. బంగారంతో చేయించిన ఆమె కాళ్లు.. కృష్ణ గెలుచుకున్న పతకాలు ఇలా ఎన్నింటినో చూపిస్తూ ఆసక్తికర అంశాలను షేర్ చేశారు మంజుల. లివింగ్ రూం వరకే చూపించి మొదటి అంతస్తులో నాన్న ఉంటారని, ప్రస్తుతం అక్కడికి నో ఎంట్రీ అని చెప్పారామె. కుదిరితే భవిష్యత్తులో చూపిస్తానన్నారు. మొత్తానికి ఆయన ఇంటిని చూస్తుంటే ఓ సుందరవనాన్ని తలపిస్తోంది. ప్రకృతిమయమైన రిసార్టును చూస్తున్న భావన కలుగుతోంది. ఇలా ఎన్నో విశేషాలతో ఆయన ఇల్లు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. -
సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు చూశారా? వీడియో వైరల్
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ హోంటూర్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పటికే మంచు లక్ష్మీ, కమెడియన్ అలీ,కృష్ణం రాజు వంటి ప్రముఖుల హోంటూర్స్ నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో సెలబ్రిటీ హోంటూర్ కూడా వచ్చేసింది. ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ హోంటూర్ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది. ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేని స్వయంగా తన యూట్యూబ్ చానెల్లో హోంటూర్కు సంబంధించిన ప్రోమో వీడియోను రిలీజ్ చేసింది. సకల సైకర్యాలతో అందమైన హంగులతో ఇంద్రభవనాన్ని తలపిస్తున్నట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. విజయ నిర్మల విగ్రహం ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. త్వరలోనే ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో రానుంది. -
బర్త్‌డే రోజునే సూపర్ స్టార్ కృష్ణకు అరుదైన గౌరవం
తొలి తెలుగు జేమ్స్‌బాండ్, కౌబాయ్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే నేడు. మంగళవారంతో(మే 31న) ఆయన 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు తనయుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు, కోడలు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. అలాగే సీని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నేడు ఆయన బర్త్‌డే నేపథ్యంలో కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ వరించింది. చదవండి: తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్ ఈ విషయాన్ని నరేశ్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే సూపర్ స్టార్ కృష్ణ. 80 ఏళ్ల పాటు సినిమాకు, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజునే ‘సెలబ్రెటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి: ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ Happy birthday SUPER STAR . Glorious 80 years of service to cinema and people . Received CELEBRITY BOOK OF WORld RECORDS on this occasion. Long live the superstar💕🌹 pic.twitter.com/WBuZko8EH3 — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) May 31, 2022 -
తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu And Namrata Special Birthday Wishes To Super Star Krishna: తొలి తెలుగు జేమ్స్‌బాండ్, కౌబాయ్ హీరో అని ఎవరంటే.. టక్కున గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన 1965లో వచ్చిన 'తేనె మనసులు' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. తర్వాత వచ్చిన మూడో సినిమా 'గూఢచారి 116' సినిమాతోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం అనేక బ్లాక్‌బ్లస్టర్ హిట్లు ఇచ్చిన ఆయన డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాలకు మారుపేరుగా నటనలో ఎప్పటికీ సూపర్ స్టార్‌గా అభిమానులకు ఎవర్గ్రీన్ హీరోగా ఖ్యాతి సాధించిన కృష్ణ పుట్టినరోజు నేడు. సూపర్ స్టార్ కృష్ణ 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ వసంతంలోకి అడుగుపెడుగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మహేశ్ బాబు, కోడలు నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదిక ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. 'హ్యపీ బర్త్‌డే నాన్న. మీలాంటి వారు నిజంగా ఎవరు లేరు. మీరు రాబోయే రోజుల్లో మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ' అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. చదవండి: అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ Happy birthday Nanna! There is truly no one like you. Wishing for your happiness & good health for many more years to come. Stay blessed always. Love you ♥️🤗🤗 pic.twitter.com/rJKvVQoHQq — Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2022 'చాలా సంవత్సరాలుగా మీతో నాకు ఎంతో ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలోకి ఎంతో ప్రేమ, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞతరాలును. మీరు నా భర్తకు, నాకు, మా అందరికీ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే మామయ్య. వి లవ్ యూ.' అని నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాలో ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. ఈ పోస్టులో గౌతమ్, సితారతో కృష్ణ కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు నమ్రతా. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ
Special Interview With My Super Star Nanna Promo: సూపర్ స్టార్ కృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చేప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలకు నిర్వచనం సూపర్ స్టార్ కృష్ణ అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ తరహా పాత్రలను టాలీవుడ్‌కు పరిచయం చేసి హిట్ కొట్టిన తొలి హీరో. విభిన్న పాత్రలు, కథలతో ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించిన నిర్మాతగా, దర్శకుడిగా సైతం రాణించి ఎందరో ఆర్టిస్ట్‌లకు దేవుడిగా మారారు. ప్రస్తుతం ఆయన వయసురీత్యా సినిమాలకు దూరమయ్యారు. కనీసం బయట కాలు కూడా పెట్టకుండ ఇంటికే పరిమితం అయ్యారు. చదవండి: చరణ్ కోసం 264 కిమీ నడిచిన ఫ్యాన్, అతడిని కలిసి మురిసిపోయిన మెగా హీరో ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే తప్పా ఆయన మీడియా ముందుకు రారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో కృష్ణ బర్త్‌డే రానుంది. మే 31న ఆయన పుట్టిన రోజు సందర్భంగా కృష్ణ పెద్ద కూతురు మంజుల ఘట్టమనేని సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. కాగా మంజులకు సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణ సినీ కెరీర్, వ్యక్తిగత విషయాలపై స్పెషల్ ఇంటర్య్వూ విత్ మై సూపర్‌స్టార్ నాన్న పేరుతో తండ్రిని ఇంటర్య్వూ చేసింది. తాజాగా ఈ స్పెషల్ ఇంటర్య్వూకు సంబంధించిన ప్రోమోను ఆమె రిలీజ్ చేసింది. ఇందులో మంజుల.. కృష్ణ హీరో ఎలా అయ్యారు, ఆయన సినీరంగం ప్రవేశం ఎలా జరిగింది, మహేశ్‌ను సినిమాల్లోకి ఎలా తీసుకువచ్చారు వంటి ఆసక్తికర విషయాలపై తండ్రితో చర్చించింది. చదవండి: ఓటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్? ఈ క్రమంలో మహేశ్‌ను చిన్నప్పడే సూపర్ స్టార్ చేశారు.. ఇది ప్లాన్డ్గా జరిగిందా? అనుకోకుండా జరిగిపోయిందా? అని అడగ్గా.. ఇది అనుకొకుండ జరిగిందని ఆయన సమాధానం ఇచ్చారు. ‘ఓ రోజు షూటింగ్ చూస్తానని స్టూడియోకు వచ్చాడు. షూటింగ్ జరుగుతుంటే దూరం నుంచి చూస్తు అలా నిలబడ్డాడు. దగ్గరి పిలిచి ఒకసారి యాక్ట్ చేయమని అడిగితే లేదు నేను చేయను చేయను అంటూ స్టూడియో అంతా పరిగెత్తించాడు’ అంటూ కృష్ణ చెబుతూ మురిసిపోయారు. అనంతరం మహేశ్‌తో కలిసి పోకిరి,దూకుడు చూశానని, అవి రెండు సినిమాలు లాండ్ మార్క్ అయ్యాయని’ కృష్ణ అన్నారు. ఇలా తనయుడు మహేశ్ బాబు గురించి, తన గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలపై చర్చించిన కృష్ణ పూర్తి ఇంటర్య్వూ చూడాలంటే మే 31 వరకు ఆగాల్సిందే. -
Horsley Hills: షూటింగ్‌లకు ఆద్యుడు కృష్ణ
బి.కొత్తకోట(వైఎస్సార్ కడప): పర్యాటక, వేసవి విడిది కేంద్రంగా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ అందరికీ సుపరిచితమే. అయితే ఇక్కడ సినిమా షూటింగులకు ఆద్యుడు, చిత్రపరిశ్రమకు ఈ అందమైన ప్రాంతాన్ని పరిచయం చేసింది మాత్రం సూపర్ కృష్ణనే. మొట్టమొదటగా ఆయన సినిమాలు ఇక్కడ చిత్రీకరించడం మొదలయ్యాకే.. మిగిలిన నటులు హార్సిలీహిల్స్ దారిపట్టారు. కృష్ణ షూటింగుల వల్లే హార్సిలీహిల్స్‌కు ప్రాచు ర్యం వచ్చింది. అప్పటి వరకు సినిమా స్టూడియోలకే పరిమితమైన షూటింగులను ఔట్‌డోర్ చిత్రీకరణ మొదలైందని చెప్పవచ్చు. 1966లో కృష్ణ నటించిన కన్నెమనసు సినిమా చాలా భాగం హార్సిలీహిల్స్‌లో చిత్రీకరణ జరిగింది. కొండపై కృష్ణ తొలి సినిమా షూటింగ్ ఇదేనని చెప్పవచ్చు. చల్లటి వాతావరణం, సముద్రమట్టానికి 4,141 అడగుల ఎత్తులో ప్రకృతి అందాలకు నిలయమైన కొండపై గాలిబండ, పాత వ్యూపాయింట్, ఘాట్‌రోడ్డు ప్రాంతాల్లోనే సిని మా చిత్రీకరణలు జరిగాయి. కృష్ణ నట జీవితంలో హార్సిలీహిల్స్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నటుడిగా అప్పుడప్పుడే గుర్తింపు లభిస్తున్న రోజుల నుంచే తాను నటించే చిత్రాలను హార్సిలీకొండపై చిత్రీకరించే వారు. కన్నెమనసులు చిత్రం ఎక్కువ భాగం కొండపైనే చిత్రీకరించారు. కొండపై తొలి సినిమా సెట్టింగ్ వేసింది ఈ సినిమాకే. గాలిబండపై వెదురుకట్టెలు, పైకప్పు గడ్డితో గాజులమ్మ గుడిని నిర్మించి ఓ పాట, గుడి మంటల్లో కాలిపోయే దృశ్యాలను చిత్రీకరించారు. గవర్నర్‌బంగ్లా, ఆవరణలో కృష్ణ, ఇతరా నటులతో చివరి భాగం నిర్మించారు. అప్పటి నుంచే కృష్ణకు కొండపై అనుబంధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత నటించిన అసాధ్యుడు, అఖండుడు, నేనంటేనేనే, దొంగలదోపిడి, సింహగర్జన, పులిజూదం, ఏకలవ్య, గూడుపుఠాణి, పట్నవాసం ఇలా సుమారు 25కు పైగా సినిమాల నిర్మాణం జరుపుకొంది. ఎన్.శంకర్ దర్శకత్వంలో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా అత్యధిక భాగంగా, పాటలను కొండపైన, అడవిలో చిత్రీకరించారు. కొండపై కృష్ణ చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కొండపై జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. కృష్ణ తర్వాత ఎన్టీఆర్, శోభన్‌బాబు, నాగార్జున, రాజేంద్రప్రసాద్, కాంతారావు ఇలా ఎందరో నటుల సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన సినిమాలు అత్యధికంగా ఇక్కడ నిర్మాణం జరుపుకొన్నాయి. కాగా హార్సిలీహిల్స్‌తో తనకు ప్రత్యేక అనుబంధముందని 1997లో ఎన్కౌంటర్ సినిమా షూటింగ్ సమయంలో చెప్పుకొన్నారు. చివరగా కృష్ణ 2007లో విజయనిర్మల, నరేష్‌తో కలిసి హార్సిలీహిల్స్ వచ్చివెళ్లారు. కొండపై నటుడు శరత్‌బాబు ఇంటి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇక్కడ నిర్మించుకొన్న ఇంటిని ప్రముఖ నటి జమున విక్రయించుకొన్నారు. అయినప్పటికీ ఇప్పటికి జమునా బిల్టింగ్ అనే పిలుస్తారు. -
తల్లి బర్త్‌డే సెలబ్రేషన్స్.. మిస్ అయిన మహేశ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ఇందిరా దేవీ పుట్టినరోజు సందర్భంగా ఓ అపురూపమైన ఫోటోను షేర్ చేసిన మహేశ్ తల్లికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. కుటుంబసభ్యుల మధ్య ఆమె పుట్టినరోజును జరుపుకున్నారు.సూపర్ స్టార్ కృష్ణ భార్యకు కేక్ తినిపించి విషెస్ తెలిపారు. చదవండి: ఆ హీరోయిన్ గురించి మనసులో మాటను బయటపెట్టిన యశ్ ఈ వేడకల్లో సూపర్ స్టార్ కృష్ణ, నమ్రత, సితార, గౌతమ్, ప్రియదర్శిని, మంజులా, గల్లా జయదేవ్ దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మిగతా కుటుంబసభ్యులు పాల్గొనగా మహేశ్ బాబు మాత్రం మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్లో బిజీగా ఉండటంతోనే మహేశ్ రాలేకపోయారని తెలుస్తుంది. చదవండి: సర్కారు వారి పాట: ఫైనల్ షూటింగ్ -
ఆ సీన్ చూసి కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారు: మురళీ మోహన్
Murali Mohan Interesting Comments On Krishna: సూపర్ స్టార్ కృష్ణపై సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణలాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదంటూ ప్రశంసలు కురిపించారు. కాగా నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిచన ఆయన అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఇద్దరం ఇంటర్లో క్లాస్‌మెట్స్, ఒకే బెంచ్‌లో కూర్చునే వాళ్లమంటూ ఆసక్తికర విషయం చెప్పారు. చదవండి: బిడ్డను వదిలేసి వచ్చిందని ట్రోల్స్, స్పందించిన కమెడియన్ అలాగే ‘ఇంటర్ ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. ఇద్దరం ఇంటర్ ఫెయిల్ అయ్యాం. అయితే కాలేజీ మొత్తంలో కృష్ణ చాలా అందగాడు. అందరు ఆయన వెంట పడేవారు. ఇంటర్ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన తేనె మనసులు మూవీతో హీరోగా మారారు. ఆ తర్వాత అనతి కాలంలోనే ఆయన సూపర్ స్టార్‌గా ఎదిగిన విషయం మీ అందరికి తెలిసిందే’ అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం తాను కూడా కొద్ది రోజుల్లోనే సినిమాల్లోకి వచ్చానని, హీరోగా కొన్ని సినిమాలు చేశానన్నారు. ఆ తర్వాత నటుడి నుంచి నిర్మాతగా మారానంటూ వారసుడి మూవీ సమయంలో చోటు చేసుకున్న ఓ చేదు సంఘటన గురించి చెప్పారు. చదవండి: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్ ‘కృష్ణ-నాగార్జున కాంబినేషన్లో వారసుడు చిత్రాన్ని నిర్మించాను. ఆ సినిమాలో నాగార్జున ఓ సీన్లో తండ్రి కృష్ణను నిలదీస్తాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్ణణ తారాస్థాయికి చేరుతుంది. ఇందులో కృష్ణను నాగార్జున ఎదురించడం, నువ్వెంత అంటూ ఆయనతో అమర్యాదగా వ్యవహరిస్తాడు. అది చూసిన కృష్ణ ఫ్యాన్స్ మా ఇంటి మీదకు గొడవకు వచ్చారు. కొంతమంది అయితే ఏకంగా నన్ను కొట్టడానికి వచ్చారు’ అని అన్నారు. అంతేకాదు కృష్ణ గారిని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడతాడని, ఇది ఆయనను అగౌరవ పరచడమే అంటూ తనతో ఘర్షణ పడ్డారన్నారు. ఆ సీన్‌ని సినిమా నుంచి తొలగించాలని, లేదంటే సీన్ మార్చమంటూ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారని ఆయన అన్నారు. చదవండి: ‘కేజీఎఫ్’ హీరో యశ్‌పై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు అయితే ‘‘అది సినిమా.. కథను, పాత్రను బట్టి చూడండి. పర్సనల్‌గా తీసుకోవద్దు’ అని నేను నచ్చచెప్పినా వినలేదు. దీన్ని బట్టి అప్పడు నాకు అర్థమైంది ఆయనకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని. ఇక కృష్ణ గారు బయట కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన నిర్మాతల హీరో అని అనొచ్చు. ఒక నిర్మాత సినిమా ప్లాప్‌తో డబ్బులు పోగొట్టుకుంటే.. ఇంటికి పిలిచి ఆయనతో మాట్లాడి .. తనతో సినిమా చేస్తానని చెప్పేవారు. నిర్మాతలు డబ్బులు లేవని చెప్పినా అవన్నీ తరువాత మీరు సినిమా మొదలు పెట్టండి అని భరోసా ఇచ్చేవారు. అలాంటి గొప్ప మనిషిని నేను ఇంతవరకు చూడాలేదు” అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. కాగా తెలుగులో మురళీమోహన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కృష్ణ, శోభన్ బాబు వంటివారు అగ్ర హీరోలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన మురళీమోహన్. తక్కువ కాలంలోనే హీరోగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. -
నటుడు నరేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో..
‘‘విజయ నిర్మల జయంతి సందర్భంగా ‘మిస్టర్ కింగ్’ పోస్టర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. హీరో శరణ్, దర్శక– నిర్మాతలకు, చిత్ర యూనిట్‌కు మంచి పేరు రావాలి’’ అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. విజయ నిర్మల అన్నయ్య మనవడు, సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వం వహించారు. ]హన్విక క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.రావు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా ‘మిస్టర్ కింగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విజయ నిర్మల జయంతి సందర్భంగా(ఆదివారం) కృష్ణ విడుదల చేశారు. ‘‘మా ఫ్యామిలీ నుంచి వస్తున్న 8వ హీరో శరణ్’’ అన్నారు నరేశ్. ‘‘మా అమ్మగారు కూడా విజయ నిర్మలగారి అభిమాని’’ అన్నారు బి.ఎన్.రావు. ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు శశిధర్ చావలి. ‘‘మా సినిమా యువతకు బాగా నచ్చుతుంది’’ అన్నారు శరణ్. నిష్కల, ఊర్వీ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సమర్పణ: బేబీ హన్విక, సంగీతం: మణిశర్మ, కెమెరా: తన్వీర్ అంజుమ్, సహ నిర్మాత: రవికిరణ్ చావలి. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ నిర్మల
-
ఎన్టీఆర్-కృష్ణల మధ్య విభేదాలపై మహేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Mahesh Babu Comments Over Sr NTR And Krishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హీరోగానే కాకుండా, అన్‌స్టాపబుల్ షోతో వ్యాఖ్యాతగానూ అదరగొకొడుతున్నారు. ఇప్పటికే ఈ షో ఎంతలా సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఫినాలే ఎపిసోడ్‌కు సూపర్‌స్టార్ మహేశ్ బాబు గెస్ట్‌గా రావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ సమాధానమిచ్చారు. కాగా నందమూరి తారకరామారావు- సూపర్‌స్టార్ కృష్ణ మధ్య దశాబ్దాలుగా వైరం ఉందని, ముఖ్యంగా కృష్ణ నటించిన అల్లూరి సీతారామమాజు సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్. తాజాగా ఈ విషయంపై ఓపెన్ అప్ అయిన మహేశ్ ఎన్టీఆర్- కృష్ణల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలో నాన్న(కృష్ణ)గారికి ఎన్టీఆర్ గారితో గొడవలు ఉన్నాయనే మాట అబద్దమని ఆ సినిమా చూసిన తర్వాత.. ఆయన చాలా అభినందించారని నాన్న తరుచూ గుర్తుచేసుకునేవారని మహేశ్ వివరించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
సినిమా బాగుందని కృష్ణగారు అన్నారు: 'హీరో' మూవీ డైరెక్టర్
గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘హీరో’. నిధీ అగర్వాల్ హీరోయిన్గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పద్మావతి గల్లా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘సినిమాల్లో హీరో కావాలనుకునే ఓ యువకుడి కథే ఈ చిత్రం. స్క్రీన్ ప్లే రేసీగా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అశోక్ యాక్టింగ్ కోర్సులు చేసినప్పటికీ నాకు అవంటే పెద్దగా నమ్మకం లేదు. అందుకే అశోక్‌కు చిరంజీవి, మహేశ్బాబుగార్ల సినిమాలను రిఫరెన్సులుగా ఇచ్చాను. ఆ సినిమాల్లో వారి బాడీలాంగ్వేజ్‌ను గమనించి, నేర్చుకోమని చెప్పాను. అశోక్ బాగా నటించాడు. కృష్ణగారు మా సినిమాను చూసి ‘బాగుంది’ అని మెచ్చుకున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా షూటింగ్లో కోవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడమే పెద్ద సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం ఓటీటీలపై ఆసక్తి లేదు. ప్రొడక్షన్ పరంగా ఏమైనా చేయాలనుకుంటున్నాను’’ అని అన్నారు. -
రమేశ్‌బాబు భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు ఫొటోలు
-
కన్నకొడుకు భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కృష్ణ
Super Star Krishna Cried After Seeing Ramesh Babu For Last Time, Video Viral: సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. అయితే అంతకుముందు పద్మాలయ స్టూడియోస్‌లో రమేశ్ బాబు భౌతికకాయాన్ని కాసేపు ఉంచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. అయితే కొడుకును కడసారి చూసేందుకు అక్కడికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ కుమారుడి భౌతికకాయన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. 56 ఏళ్ల వయసులోనే కొడుకు చనిపోవడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. -
అత్యంత ఆప్తుడిని కోల్పోయా: సూపర్ స్టార్ కృష్ణ
Supers Star Krishna Condolence To Director Death: ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి (పి. చంద్రశేఖరరెడ్డి) సోమవారం చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సూపర్ స్టార్ కృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాదు పీసీ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు పీసీ రెడ్డి. అటువంటి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది’ అని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘‘దర్శకులు పి. చంద్రశేఖర్ రెడ్డిగారు నాకు వ్యక్తిగతంగా మరియు మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు, ఆయన దర్శత్వంలో వచ్చిన తొలిచిత్రం అత్తలు-కోడళ్లు’లో హీరోగా నేను నటించాను. రెండవ చిత్రం ‘అనురాధ’లో కూడా నేనే హీరో. మా ఇద్దరి కాంబినేషన్లో 23 చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు, నా పిలుపే ప్రభంజనం’ మంచి హిట్స్. మా పద్మాలయ అనుబంధ సంస్థలో ఆయన డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. మేము చాలా ఆప్తులైన వ్యక్తిని కోల్పోయాం, వారి కుటుంబానికి మా సానుభూతి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము’’ అని పేర్కొన్నారు. అలాగే నిర్మాత శాఖమూరి మల్లికార్జునరావు కూడా పీసీ రెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. ‘నా బాల్యం నుంచి చూసిన దర్శకుడు పిసీ రెడ్డిగారు. పద్మాలయ సంస్థలో ఆయనతో కలిసి పని చేసిన అనుభవం మరవలేదనిది. సాక్షి దినపత్రిక అంటే పీసీ రెడ్డికి ఎంతో ఇష్టం’ అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సుమారు 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన పి. చంద్రశేఖర్ రెడ్డి(86) సోమవారం చెన్నైలో ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయనతో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు పీసీ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులు అర్పించారు. -
గిరిజనుల పాలిట దేవుడు అల్లూరి సీతారామరాజు
బంజారాహిల్స్(హైదరాబాద్): తన వీరోచిత పోరా టాలతో తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించి గిరిజనుల పాలిట దేవుడిగా, ప్రజల్లో దేశ భక్తిని నింపిన స్వాతంత్య్ర సమరయోధుడిగా అల్లూరి సీతారామరాజు చరిత్ర చిరస్థాయిలో నిలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రముఖుల జీవి తాలను ఈ తరానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా తెలుగు ప్రజల ఆరాధ్యదైవం అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని జాతీయ సంబురాలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఆదివారం ఫిలింనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లా డుతూ.. ఈ ఏడాది జూలై 4 నుంచి వచ్చే ఏడాది జూలై 4 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలను నిర్వహించాలన్నారు. ఏపీలోని లంబసింగిలో అల్లూరి మ్యూజియానికి రూ.35 కోట్లు కేటాయిం చామని, అందులో ఇప్పటికే రూ. 6.93 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాల్లోనే మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అల్లూరిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, దానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నామని చెప్పారు. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారానే ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలిసిందని, తాను ఆ సినిమాను 20 సార్లు చూశానని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలి: ఏపీ మంత్రి అవంతి ఏపీ పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసే విధంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషి చేయాలని కోరారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఒక జిల్లాకు అల్లూరి పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అల్లూరి పేరుతో విశ్వవిద్యాలయాల్లో గోల్డ్ మెడల్స్‌ను ప్రవేశ పెట్టాలన్నారు. హీరో కృష్ణ మాట్లాడుతూ.. తన పన్నెండో ఏట నుంచే అల్లూరి అంటే ఇష్టమని.. తన వందో చిత్రం అల్లూరి సీతారామరాజు.. అని గుర్తు చేసుకున్నారు. తాను 365 సినిమాలలో నటించినా ఇప్పటికీ తనకు నంబర్ వన్ చిత్రం అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, హీరో మోహన్‌బాబు మాట్లాడుతూ.. రాజులు చాలా గొప్పవారని, వాళ్లల్లో రాజకీయం నరనరాల్లో ప్రవహిస్తూ ఉంటుందని అన్నారు. రాజులంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు ఎన్.నాగరాజు, ప్రధాన కార్యదర్శి పి.నానిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో కృష్ణను సత్కరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. -
సూపర్‌స్టార్ కృష్ణకు ఘన సన్మానం.. 350కిపైగా చిత్రాల్లో నటించినా
Tribute To superstar Krishna Under Alluri Sitaramaraju 125th Birth Anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలకు నిర్వచనం సూపర్ స్టార్ కృష్ణ. జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ తరహా పాత్రలను టాలీవుడ్‌కు పరిచయం చేసి హిట్ కొట్టారు. విభిన్న పాత్రలు, కథలతో ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించారు. 350పైగా చిత్రాల్లో నటించి సూపర్ స్టార్‌గా ఎదిగారు. నిర్మాతగా, దర్శకుడిగా సైతం రాణించి ఎందరో ఆర్టిస్ట్‌లకు దేవుడిగా మారారు. ఎన్నో మైలు రాళ్లు చేరుకున్న ఘట్టమనేని కృష్ణకు హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా సన్మానం జరిగింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీనివాస్ గౌడ్, అవంతి శ్రీనివాస్‌తోపాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నిర్మాతలు అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల గుండెల్లో అల్లూరిసీతరామరాజుగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కృష్ణకు సన్మానం చేశారు. అలాగే తన 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు విశేషాల్ని పంచుకున్నారు కృష్ణ. 350 చిత్రాల్లో నటించినా అల్లూరి సీతారామరాజు సినిమానే తనకిష్టమని తెలిపారు. -
తెలుగులో వచ్చిన జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు ఇవే..
బాండ్.. జేమ్స్ బాండ్.. అనే ఈ ఒక్క డైలాగ్ చాలు బాండ్ అభిమానులను విజిల్స్ వేయించడానికి. ఆ డైలాగ్‌లో ఏదో మత్తు ఉందని తెగ సంబరపడిపోతారు. జేమ్స్ బాండ్ మూవీ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా కోట్లలో అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. అంతలా ఈ మూవీ సిరీస్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ మూవీస్‌లో ఏజెంట్ 007 చేసే సాహసకృత్యాలు ప్రతి ఒక్కరినీ ఔరా అనిపిస్తాయి. ఇక హీరోయిన్స్‌తో బాండ్ చేసే రొమాన్స్ గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్గా డానియల్ క్రేగ్ నటించిన నో టైమ్ టు డై మూవీతో ఇప్పటివరకు 25 బాండ్ చిత్రాలు వచ్చాయి. హాలీవుడ్లో వచ్చిన ఈ సినిమాల్లో మొత్తం ఏడుగురు యాక్టర్స్ బాండ్ క్యారెక్టర్‌ను పోషించారు. అయితే మన తెలుగు వాళ్లకు జేమ్స్ బాండ్ అంటే మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకువస్తారు. ఏజెంట్ 116 పాత్రలో ఆయన అద్భుతంగా ఒదిగిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116తో పాటు తెలుగులో వచ్చిన బాండ్ చిత్రాలపై ఓ స్టోరీ చూసేద్దామా..! 1. గూఢచారి 116 తెలుగులో వచ్చిన మొదటి జేమ్స్ బాండ్ చిత్రం. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, జయలలిత హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేయగా మల్లికార్జున రావు దర్శకత్వం వహించారు. పలు నేరాలకు సాక్ష్యాలైన ఫొటో ఎవిడెన్స్ కోసం సీక్రెట్ ఏజెంట్ 303ను ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హత్య చేస్తుంది. ఈ కేసును చేధించడానికి ఏజెంట్ 116కు సీఐడీ అప్పగిస్తుంది. దానిని ఏజెంట్ 116 ఎలా చేధించారు, ఆ ఫొటోలో ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయనేది సినిమా కథ. 2. గూఢచారి నెం. 1 కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన గూఢచారి నెం.1లో మెగస్టార్ చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1983లో విడుదలై మంచి హిట్ టాక్ అందుకుంది. నెంబర్ 1 అనబడే ఒక ప్రభుత్వ ఏజెంట్ దేశద్రోహుల్ని ఎలా పట్టుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో మెగస్టార్ చిరంజీవి తొలిసారిగా గూఢచారి పాత్ర పోషించారు. 3. విశ్వరూపం ‘విశ్వరూపం’ సినిమాలో కమల్... భారత్ జేమ్స్‌బాండ్‌గా ఏ రకంగా నట విశ్వరూపం చూపించాడో తెలిసిందే. 60 ఏళ్ల వయసులో కమల్ ఈ మూవీ కోసం చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా విడుదలైన ‘విశ్వరూపం2’ మాత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోలేకపోయింది. గతంలో కమల్ హాసన్ కొన్ని సినిమాల్లో జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో నటించారు. 4. గూఢచారి అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రం 2020లో విడుదలైంది. ఇది పూర్తిగా జెమ్స్ బాండ్ తరహాలో వచ్చిన ఈ చిత్రంలో తన నటనతో అడవి శేష్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితం దక్కించుకుంది ఈ చిత్రం. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నారు. 5. చాణక్య గోపిచంద్ హీరోగా నటించిన చిత్రం చాణక్య. ఇందులో గోపిచంద్ రా ఏజెంట్‌గా మెప్పించారు. ఈ సినిమాకు అబ్బూరి రవి కథ రాయగా డైరెక్టర్ తిరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. చదవండి: జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం ఇవే కాకుండా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో డార్లింగ్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని జేమ్స్ బాండ్ తరహాలో రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక డార్లింగ్‌ను సీక్రెట్ ఏజెంట్ పాత్రలో చూస్తే ప్రభాస్ అభిమానులకు పండగే. మరోవైపు ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న రాజా విక్రమార్క చిత్రం కూడా సీక్రెట్ ఏజెంట్ కథాంశంతోనే నవంబర్ 12న రిలీజ్ కానుంది. -
‘మా’ ఎన్నికలు: కృష్ణను కలిసిన మోహన్‌బాబు, విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ సారి ‘మా’ అధ్యక్ష పీఠం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీ పడుతున్నారు. చదవండి: ‘మా’ ఎన్నికలు: పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్ సెప్టంబర్ 27న నామినేషన్లు కూడా ముగియడంతో అభ్యర్థులంతా సభ్యులతో కలిసి ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో బరికిలో దిగుతున్న అభ్యర్థులు పరిశ్రమ పెద్దల మద్దతు కోరుతున్నారు. తాజాగా మంచు విష్ణు తన ప్యానల్‌తో కలిసి సూపర్ స్టార్ కృష్ణను కలిశారు. కుమారుడు మంచు విష్ణు వెంట తండ్రి మోహన్‌బాబు కూడా ఉన్నారు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కృష్ణను మోహన్‌బాబు, మంచు విష్ణులు కోరారు. దీనికి కృష్ణ స్పందిస్తూ.. మంచు విష్ణుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. -
సూపర్ స్టార్ కృష్ణతో చిన్ననాటి ఫోటో షేర్ చేసిన మహేశ్
Mahesh Babu Childhood Image With Krishna: సెప్టెంబర్5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు తమ జీవితంలో కీలక పాత్ర పోషించిన గురువులను గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన మొదటి గురువు, తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ.. 'ప్రేమ, ఆప్యాయతలు దయాగుణం, క్రమశిక్షణ, వినయం, పరిస్థితుల్లో బలంగా ఉండటం వంటి ఎన్నో మంచి విషయాలు నేర్పించిన నాన్నకి ధన్యవాదాలు. ఆయనతో పాటు ఈ ప్రయాణంలో నా అభివృద్ధికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. హ్యాపీ టీచర్స్ డే' అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. Here's to the love of learning and growing each day! Thanking my father who taught me to love, to be strong, to have discipline, compassion and humility. Will always be indebted to him and to everyone who's helped me learn and evolve in my journey. #TeachersDay pic.twitter.com/xZTSiGpsYk — Mahesh Babu (@urstrulyMahesh) September 5, 2021 ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలిసారి కీర్తి సురేశ్ మహేశ్‌తో జత కట్టనుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాల రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. చదవండి : 'గీతాంజలి' హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్ -
సూపర్ స్టార్ కృష్ణ స్పెషల్ ఇంటర్వ్యూ
-
సూపర్ స్టార్ కృష్ణ తో సాక్షి ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ
-
కౌబాయ్ గెటప్.. బఠాణీలతో మేకప్
యాభై ఏళ్ళ క్రితం సినిమా.. కౌబాయ్ కథలకు క్రేజు తెచ్చిన హిట్ సినిమా. హాలీవుడ్ కథాంశానికి తెలుగుదనం అద్ది, మళ్ళీ హాలీవుడ్‌కే వెళ్ళిన సినిమా. అప్పటికి ఏడేళ్ళుగా సినీరంగంలో ఉన్న కృష్ణను స్టార్‌ని చేసిన సినిమా. నిర్మాతగా నిలబెట్టిన సినిమా. దాస్ దర్శకత్వంలో కృష్ణ సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు పక్కా ప్రణాళికతో వచ్చిన ‘మోసగాళ్ళకు మోసగాడు’కు నేటితో 50 ఏళ్ళు. ఒకే రకమైన జానపదాలు, పౌరాణిక చిత్రాలతో జనానికి విసుగెత్తుతున్న కాలం అది. ఎన్టీఆర్, ఏయన్నార్‌లు తారలుగా స్థిరపడిపోయి చాలా కాలం అవడంతో, యువ నవ తారలకు అవకాశాలు తెరుచుకున్న సమయం. కృష్ణ, శోభన్‌బాబు లాంటి నటులు ఆ అవకాశాలను అందుకోవాలని తపిస్తున్న తరుణం. ఆ పరిస్థితుల్లో ఇంగ్లీషు, హిందీ చిత్రాల స్ఫూర్తితో తెలుగు సినిమా సైతం క్రైమ్, యాక్షన్ తరహా చిత్రాలవైపు మొగ్గింది. అలాంటి కథల అన్వేషణలో తెలుగు మసాలాతో వండిన పాశ్చాత్య కౌబాయ్ వంట ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఇంగ్లీష్ నుంచి హిట్ కథ! 1970 నాటికి కృష్ణ 40కి పైగా సినిమాలు చేశారు. కానీ, యాక్టర్ నుంచి స్టార్ హోదా కల్పించే చిత్రాలు చేయలేకపోతున్నాననే అసంతృప్తి కలిగింది. పెద్దమ్మాయి పేరు మీద ‘శ్రీపద్మాలయా మూవీస్’ నెలకొల్పారు. తొలి చిత్రం ‘అగ్ని పరీక్ష’ (1970) ఆడలేదు. పట్టుదల పెరిగింది. అదే సమయంలో ‘మెకన్నాస్గోల్డ్’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లాంటి హాలీవుడ్ చిత్రాలు మద్రాసులో సంచలనం రేపుతున్నాయి. వాటిని కలగలిపి, కొత్త వంట చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తెలుగు వాతావరణానికి తగ్గట్లు వండే బాధ్యతను రచయిత ఆరుద్రకు అప్పగించారు. అలా ఆరుద్ర రాసిన కథ ‘అదృష్టరేఖ’. అదే మాస్ కోసం ‘మోసగాళ్ళకు మోసగాడు’గా టైటిల్ మార్చుకొని, కృష్ణ అదృష్టాన్ని మార్చేసిన కథ. కె.ఎస్.ఆర్. దాస్ ‘రౌడీ రాణి’ (1970) చిత్ర విజయంతో మంచి జోరు మీదున్నారు. దాంతో, ఆయనను డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. రాజస్థాన్ ఎడారుల్లో... సాహసోపేతంగా... ప్రేమికులైన హీరో హీరోయిన్లు తమ తండ్రులను చంపినవారిపై ఎలా పగ సాధించుకున్నారనేది ఈ చిత్ర కథ. హంతకులెవరో కనిపెట్టి, వారిని వెంటాడి, వేటాడే ఈ క్రైమ్ ఫార్ములాకు అమూల్యమైన నిధి కోసం అన్వేషణ, దాన్ని శోధించి సాధించడం, ప్రజల పరం చేయడం ఆసక్తికరమైన పైపూత! ఎడారుల్లో ఒంటెల మీద ప్రయాణం, గుర్రాల మీద ఛేజింగులు, పేలే తుపాకులు, కాలే ఇళ్ళు, దుర్గమ ప్రాంతాల్లో ప్రయాణాలు, సరసాలు, సరదాలు, వినోదాలతో ఊపిరి సలపనివ్వని ఉత్కంఠతో, చకచకా సాగిపోయే కథాకథనం ఈ చిత్రాన్ని స్పెషల్‌గా నిలిపాయి. 1971 జనవరి 9న వాహినీ స్టూడియోలో ఈ సాహస గాథ చిత్రీకరణ మొదలైంది. ఈ కథను చిత్రీకరించిన తీరు కూడా సాహస గాథే. అప్పట్లో కృష్ణ సినిమాలను మూడు, నాలుగు లక్షల బడ్జెట్లో తీసేవారు. కానీ ఈ చిత్రానికి అంతకు రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేశారు. ‘‘సిమ్లా, రాజస్థాన్‌లోని బికనీర్, మద్రాసు, పాండిచ్చేరీల్లో తీశాం. ఎడారి దృశ్యాలను రాజస్థాన్‌లోని కోటా అనే చోట శ్రమపడి చిత్రీకరించాం’’ అని కృష్ణ చెప్పుకొచ్చారు. కథానాయిక రాధ పాత్ర పోషించిన విజయనిర్మల సైతం కెరీర్లో ఎంతో కష్టపడి నటించిన సినిమా ఇదనేవారు. ‘‘ఎన్నడూ అలవాటు లేని ఫైట్లు, గుర్రపుస్వారీ చేయాల్సి వచ్చింది. నేను, కృష్ణ గారు, నాగభూషణం గారు రోజూ మద్రాసు మెరీనా సముద్రతీరంలో స్వారీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం’’ అని స్వర్గీయ విజయనిర్మల గతంలో ఈ వ్యాసకర్తకు చెప్పారు. ‘‘ఈ చిత్ర నిర్మాణం కోసం కృష్ణ ఎంతో శ్రమపడ్డారు. యూనిట్ సభ్యులందరినీ రైళ్ళలో ఢిల్లీకి తీసుకువెళ్ళి, అక్కడ గదులు బుక్‌చేసి, అక్కడ నుంచి సిమ్లాకు తీసుకువెళ్ళారు’’ అని కృష్ణ కెరీర్ తొలి రోజుల నుంచి ఆయనకు సన్నిహితులైన జర్నలిస్టు స్వర్గీయ మోహన్‌కుమార్ చెప్పారు. థార్ ఎడారిలో మనుషులు తిరగని, మంచినీళ్ళు కూడా దొరకని చోట షూటింగ్ చేశారు. బికనీర్ కోటలో, సట్లెజ్ నదీ తీరంలోని తట్టాపానీలో తీశారు. ముఖంపై పొక్కులకు... మేకప్ మహిమ విలన్లు ఎడారిలో వదిలేసి వెళ్ళినప్పుడు, తాగడానికి నీళ్ళయినా లేక ఎండలో మాడిపోయి హీరోకు ముఖమంతా పొక్కులు వచ్చినట్లు చూపించే సన్నివేశం కోసం కృష్ణ వ్యక్తిగత మేకప్‌మ్యాన్ సి. మాధవరావుకు చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. దగ్గరలోనే బఠాణీలు దొరికితే తెప్పించారు. ఆ బఠాణీల పైన పొరలా ఉండే, తొక్కు తీయించారు. ఆ తొక్కులను హీరో కృష్ణ ముఖంపై అంటించారు. ముఖంపై పొక్కుల ఎఫెక్ట్ వచ్చింది. సాంకేతిక నిపుణులు చూపిన అలాంటి సమయస్ఫూర్తి, ‘గుడ్, బ్యాడ్, అగ్లీ’లోని ‘అగ్లీ’ పాత్ర స్ఫూర్తితో మలచిన నక్కజిత్తుల నాగన్న (నటుడు నాగభూషణం) పాత్రచిత్రణ లాంటి మేకింగ్ విశేషాలు నేటికీ ఓ పెద్ద కథ. చక్రపాణి జోస్యం తప్పింది! ఎన్టీఆర్ అన్నట్టే అయింది!! ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు నిరుత్సాహపరిచినవారూ లేకపోలేదు. ప్రముఖ నిర్మాత చక్రపాణి ఒకసారి షూటింగ్‌కి వచ్చారు. సెట్లోని కౌబాయ్ వాతావరణం, గెటప్‌లు చూసి, ఆయన పెదవి విరిచారు. జనం మెచ్చరని తన అంచనా అడక్కుండానే చెప్పేశారు. అప్పటికే సగానికి పైగా సినిమా అయిపోయింది. దాంతో, కృష్ణ బృందం ముందుకే సాగారు. తొలి కాపీ వచ్చాకా ప్రివ్యూలు చూసినవారెవరూ, సరైన అంచనా చెప్పలేకపోయారు. హీరో ఎన్టీఆర్ మాత్రం ‘బావుంది బ్రదర్. విభిన్న మాస్ఫిల్మ్ తీశారు. స్త్రీలు చూడరు. ఫస్ట్రిలీజ్ కన్నా, రీ–రిలీజుల్లో ఎక్కువ డబ్బు వస్తుంది’ అన్నారు. సరిగ్గా ఆయన అన్నట్లే అయింది. 1971 ఆగస్టు 27 బెంగళూరు సహా తెలుగునాట 27 కేంద్రాల్లో, 35 ప్రింట్లతో’’ రిలీజై, హిట్టయింది. ఇంగ్లీష్ డబ్బింగ్‌తో విదేశాలకు... పూర్తిగా ‘‘ఈస్ట్‌మన్‌కలర్‌లో నిర్మించిన ఈ చిత్రం పూర్తిగా డైరెక్టర్, కెమేరామ్యాన్ల ఫిల్మ్. కెమేరాకోణాల్ని స్వామి ఎంత వేగంగా మారుస్తూ వెళ్ళారో, సన్నివేశాల్ని దాస్ అంతే వేగంగా నడిపించారు. ఫలితంగా చిత్రంలోని లోటుపాట్లు చటుక్కున ఎవరికీ తట్టలేదు. ఆదినారాయణరావు నేపథ్య సంగీతం, ‘కోరినది దరి చేరినది..’ డ్యూయట్ పాపులర్. అప్పటికి ప్రధాన పాత్రలకే పరిమితమైన శాస్త్రీయ నర్తకి, నటి రాజసులోచనతో ‘సిగ్గేలా మగాడికీ’ అంటూ శృంగారనృత్యం చేయించడం విశేషం! తమిళంలో ‘మోసక్కారనుక్కు మోసక్కారన్’గా, హిందీలో ‘గన్‌ఫైటర్ జానీ’ పేరుతో, ఇంగ్లీషులో ‘ది ట్రెజర్‌హంట్’గా ఈ చిత్రం అనువాదమైంది. ‘‘ఇంగ్లీషు డబ్బింగ్ రూపం గల్ఫ్దేశాలు, సింగపూర్, కౌలాలంపూర్, టర్కీ, ఆఫ్రికన్ దేశాలన్నిటిలో కలిపి దాదాపు 80 దేశాల్లో విడుదలైంది’’ అని కృష్ణ తెలిపారు. ఈ హిట్ ప్రేరణతో దాదాపు 15 కౌబాయ్ చిత్రాల్లో కృష్ణ నటించారు. కృష్ణ కుమారుడైన మహేశ్‌బాబుతో ఇదే జానర్లో ‘టక్కరి దొంగ’ (2002) వచ్చింది. ఆధునిక టెక్నాలజీతో, హాలీవుడ్ కౌబాయ్‌ల లొకేషన్లలో తీశారు. కానీ, ఇవేవీ తొలి విజయాన్ని మరిపించలేకపోయాయి. ఇవాళ్టికీ తెలుగులో కౌబాయ్ హీరో అంటే కృష్ణే! కౌబాయ్ఫిల్మ్ అంటే ‘మోసగాళ్ళకు మోసగాడే’! – రెంటాల జయదేవ ⇔హీరో కృష్ణతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4.30కు, తిరిగి రాత్రి 11.30 గం.కు. -
శరణ్ కుమార్ హీరో లుక్ పోస్టర్ విడుదల చేసిన సూపర్ స్టార్
సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీ నుంచి శరణ్ కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శరణ్ హీరోగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సూపర్‌స్టార్ కృష్ణ విడుదల చేశారు. శివ కేశన కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా ఎం.సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేశ్ పుట్టినరోజు(ఆగస్ట్9) సందర్భంగా ఈ సినిమాలో హీరో లుక్‌ను సూపర్‌స్టార్ కృష్ణ రిలీజ్ చేశారు. హీరో తలకి చిన్నగాయమైనట్లు బ్యాండేజ్ వేసుకుని నిలడి ఉంటే పోస్టర్లో జనాలు, రెండు వాహనాలు వెళ్లడం .. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ‘శరణ్ హీరోగా చేస్తోన్న సినిమా హీరో లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది తనకు హీరోగా పర్ఫెక్ట్ ల్యాండింగ్ అవుతుంది. శరణ్ యాక్టర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’ అన్నారు. నిర్మాత ఎం.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘శరణ్‌కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమా హీరో లుక్ పోస్టర్‌ను మహేశ్ పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణగారు విడుదల చేయడం ఆనందంగా ఉంది. సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శరణ్‌కు ఈ సినిమా కచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుంది. అలాగే నరేశ్, జయసుధగారు, సుధీర్‌బాబు మా టీంను ప్రత్యేకంగా అభినందించడం హ్యపీగా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను తెలియజేస్తాం’ అని ఆయన అన్నారు. -
హ్యాపీ బర్త్‌డే నాన్నా: మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ నేడు(సోమవారం)78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్ బాబు ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్న' అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. Happy birthday Nanna.. Thank you for always showing me the best way forward.. Love you more than you'll ever know ♥️♥️♥️ pic.twitter.com/Mm3J0OA8by — Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2021 కృష్ణ బర్త్‌డే సందర్భంగా కూతురు మంజుల ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ 'హ్యాపీ బర్త్‌డే నాన్న. నా హృదయంలో మీకు చాలా గొప్ప స్థానం ఉంది. నా జీవితంపై మీ ప్రభావం చాలా ఉంది. మీరే నా హీరో, నా రోల్ మోడల్. లవ్ యూ సో మచ్' అంటూ ట్వీట్ చేశారు. Happy birthday day nanna. You have the biggest heart! You are my hero and the greatest influence in my life. You are my role model. I love you soooooo much. pic.twitter.com/WuGTmDVM4B — Manjula Ghattamaneni (@ManjulaOfficial) May 31, 2021 ఇక కృష్ణ అల్లుడు, హీరో సుధీర్‌బాబు కూడా కృష్ణపై తన అభిమానాన్ని చాటుకున్నారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య. సూపర్ హ్యూమన్, సూపర్ స్టార్‌గా రెండు వెర్షన్లలో నేను మీకు పెద్ద అభిమానిని' అంటూ సుధీర్‌బాబు ఎంతో ప్రేమతో విషెస్ తెలిపారు. Happy Birthday Mavayya ❤️ Biggest fan of your both versions, the super human being and the Superstar 😊 #HBDLegendarySSKgaru pic.twitter.com/Q205qy61lp — Sudheer Babu (@isudheerbabu) May 30, 2021 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)