
సూపర్ స్టార్ కృష్ణ నవంబర్15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం యావత్తు సినీలోకాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. కృష్ణ ఇక లేరనే వార్త తెలియగానే పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థివదేహాన్ని చివరిసారి చూసి ఆయనకు నివాళులు అర్పించారు. వెంకటేష్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల దగ్గర్నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అయితే నాగార్జున మాత్రం చివరి చూపుకు హాజరుకాకపోవడంపై పెద్ద చర్చే నడిచింది.
కృష్ణ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న నాగార్జున.. అంత్యక్రియలకు వెళ్లవడపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణముందా అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ సందేహాలను ఓ సీనియర్ జర్నలిస్ట్ తెరదించారు. ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాగార్జున హాజరు కాకపోవడంపై వివరణ ఇచ్చారు.
'గతంలో ఈవీవీ, దాసరి వంటి ప్రముఖులు కన్నుమూసినప్పుడు కూడా నాగార్జున అక్కడికి వెళ్లలేదు.సాధారణంగా మనకు దగ్గరివారిని కోల్పోయినప్పుడు కొంతమంది ఆ బాధను తట్టుకోలేరు. ఎంతో సాన్నిహిత్యం ఉన్నవారిని అలా నిర్జీవంగా చూడలేరు. అందుకే నాగార్జున కూడా పలు సందర్భాల్లో అంత్యక్రియలకు హాజరు కాకపోయినా ఆ తర్వాత వెంటనే వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ కారణంగానే కృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు నాగార్జున వెళ్లి ఉండకపోవచ్చు' అంటూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment